Jump to content

వృక్షశాస్త్రము/చిలగడదుంప కుటుంబము

వికీసోర్స్ నుండి

307

గుబురుమొక్క. చాల తోట్ల పెరుగుచున్నది. సాధరణముగ ఒకటి రెండడుగులెత్తు వుండును. ఆకులు హృదయాకారము. అంచులు మణగి యుండును.

హస్థిని
శ్రీ హస్తిని ఏక వార్షిక మగు గుల్మము. ఆకులపైనను ప్రకాండము పైనను బిరుసగు రోమములున్నవి. వృంతము పై పుష్పములు రెండు వరుసలుగా వున్నవి. పుష్పమంజరి వృశ్చిక మధ్యారంభమంజరి. 308

చిలగడదుంప కుటుంబము.


చిలగడ దుంప తీగె నేల మీదనే ప్రాకుచుండును. వేళ్ళు ఊరి పెద్దావగును.

ఆకులు
- ఒంటరి చేరిక హృదయాకారము. లఘు పత్రములు సమాంచలము కొన సన్నము. విష రేఖ పత్రములు. తొడిమలు పొడుగుగా వుండును.
పుష్ప మంజరి
- కణుపు సందులందుండి మధ్యారంభ మంజరులుగను వున్నవి. పువ్వులు పెద్దవి. సరాళను.
పుష్ప కోశము
- అసంయుక్తము. గరుకు పత్రములు ఐదు. సమగోపనారము. నీచము.
దళ వలయము
- సంయుక్తము. గరాట వలె నుండును. 5 ఆకర్షణ పత్రము కలిసి యున్నవి. మొగ్గలో మెలివెట్టి నట్లుండును.
కింజల్కములు
- అయిదు దళ వలయము నంటి వుండును. అన్నియు సమముగా లేవు. కొన్ని పొట్టి కొన్ని పొడుగు. కాడ అడుగున వెడల్పుగా నున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము
- అండాశయము ఉచ్చము. 4 గదులు ఒక్కొక్క కాయయందొక్కొక్క యండము గలదు. కీల పొడుగు.
మట్టిపాల తీగ
పెద్ద తీగె.
ఆకులు
- ఒంటరి చేరిక, లఘు పత్రములు, అడుగు వరకు చీలి యున్నవి. ఒక్కొక్క తమ్మె సమ గోళాకారము.
పుష్ప మంజరి
- కణుపు సందుల నుండి మధ్యారంబమంజరులు గలవు. పువ్వులు ఊదారంగు పుష్పములయొద్ద చేటికలు గలవు. 309
పుష్పకోశము
- అసంయుక్తము 5 రక్షక పత్రములు సన్నముగా నుండును నీచము.
దళవలయము
- సంయుక్తము 5 తమ్మెలు గలవు. సరాళము.
కింజల్కములు
- 5 దళ వలయమునంటి యుండును. పుప్పొది తిత్తులు రెండు గదులు.
అండకోశము
- అండాశయము ఉచ్చము 4 గలులు ఒక్కకదానియందొక్కయండమున్నది. కాని ఒకటియే సాధారణముగ ఎదుగును. గింజపై రోమములు గలవు. కీలము ఒకటి గుండ్రము.

ఈకుటుంబపు మొక్కలలో పెద్ద వృక్షములు లేవు. తీగలె విస్తారముగ కలవు. ఆకులు ఒంటరి చేరిక. లఘు పత్రములు. కణుపు పుచ్చములుండవు. పుష్పములు సరాళములు. దళవలయము మెలి వెట్టి నట్లుండును. కింజల్కములైదు. అండాశయములో సాధరణముగ రెండు గదులును ఒక్కొక్క దాని యందు రెండేసి గింజలుండును.

చిలగడ- దుంపలు మన దేశములో నంతట సేద్యము చేయుచున్నారు. ఇది యిసుక నేలలో బాగుగవూరును. వర్షముల ముందు దున్ని ఎకరమునకు ఏబది బండ్ల పెంట చొప్పున పెంటపోసి నాగటిసాలుగట్ల మీద ముదురు తీగె ముక్కలను పాతెదరు. పాతిన పదిపండ్రెండు దినముల 310

వరకు నీరుపోయుచుండవలెను. ఐదారు నెలలకు దుంపలు బాగుగ వూరును. సాగు చేయుటకు ఎకరమునకు నూట ముప్పది రూపాయలగును గాని ధర బాగుగ వున్న ఎడల మూడు వందల రూపాయల వరకు వచ్చును. కొన్ని చోట్ల వీని నుండి సారాయిని గూడ తీయు చున్నారు. మనము మాత్రము పులుసు, కూరలలోనె ఉపయోగిచు చున్నాము. దుంప తీసిన తరువాత తీగెను పశువులకు వేయుదురు.

మట్టపాలు తీగె వేరును ఔషధములలో వాడుదురు. దీని పువ్వులందముగా కూడ వుండును. ఈ తేగను గూడ పశువులు తినును.

తెల్ల తెగడ తీగె చాల కాలము బ్రతుకును,. తీగ (ప్రకాండము) నాలుగు పలకలుగ నున్నది., ఆకులన్నియు నొక రీతినే యుండవు. తెల్ల పెద్ద పువ్వులను పూయును. దీని వేరు బెరడు పాలతో అరగ దీసి యిచ్చిన విరోచనము లగునట.

తెల్ల అంటు తీగె. డొంకల మీద బెరుగును. తీగె కొంచె మెర్రగా నుండును. పువ్వులు పచ్చగాను చిన్నవిగాను వున్నవి.

తూటికూర మంచి నీళ్ళ చెరువులలో పెరుగును. తీగనీటిమీద తేలును. పువ్వులు గులాబి రంగు. లేతచిగుళ్ళను కూర వండుకొని తిందురు. 311

ఎఱ్ఱకత శీతాకాలములో పుష్పించును. లేత తీగల ల్మీద తెల్లని నూగు గలదు. కొమ్మలను విరచిన పాలు వచ్చును. పువ్వులు నీలపు రంగు.

కోకతీగ అడవులలో చెట్ల మీద ప్రాకెడు పెద్దతీగె. దీని ఆకులు పొడగుగా నుండును. పువ్వులు పెద్దవియె కాయ ఎండి ముక్కముక్కలుగ బ్రద్దలగును.

బురిడి తీగె అడవులలోనె యుండును. ఒక్కొక ఆకు వద్ద ఒక్కొక తెల్లని పుష్పముగలదు.

విష్ణు క్రాంతము:- ఆకుల తొడిమ చాల పొట్టిది. ఆకుల వద్ద మూడేసి పువ్వులున్నవి.


వంగ కుటుంబము.


వంగ మొక్క బహు వార్షికమగు నొక గుల్మము.

ఆకులు
- కొంచమించు అభిముఖ చేరికగా వుండును. అండాకారము, లఘు పత్రములు, తమ్మెలు గలవు. అడుగు వైపున రోమములు గలవు. కొన్ని రకములలో ఆకుల మీదను కొమ్మమీదను ముళ్ళు గలవు.
పుష్పమంజరి
- మధ్యరంభమంజరులు సరిగాగణుపు సందుల నుండవు. సాధారణముగ నొక్కొక్కచో రెండు మంజరులుండును. ఒక దాని పై నొ