Jump to content

వృక్షశాస్త్రము/నక్కెరి కుటుంబము

వికీసోర్స్ నుండి

305

రంగు వేయ వచ్చును. ఈ గింజలనుండి తీసినచమురును ఈ గింజల పొడుమును ఔషధములలో వాడుదురు. ముషిణి కలప గట్టిగానె వుండును.

ఇండుగ చెట్టు ముసిడి చెట్టుకంటె పెద్దది. ఈ చెట్లు కొండ్ల మీద మాత్రము పెరుగు చున్నవి. పండను తిందురు. గింజల నరగ దీసి మడ్డి నీళ్ళలో కలిపిన యెడల మడ్డి అడుగునకు పోవును.

నాగ ముసిడి
- కొండల మీద పెరుగును. ఆకులు సమ గోళాకారము, కణుపు పుచ్చములు లేవు. పువ్వులు కొంచమాకు పచ్చగను, పచ్చగను వుండును. దీని వేరు తాచుపాము కాటులకును విష జ్వరములకును మంచి పని చేయునందురు.
ఎర్ర ముష్టి
- టేకు చెట్ల మీద పెరుగును. పువ్వులు తెల్లగా నుండును.


నక్కెరి కుటుంబము.


ఇది కొంచెము పెద్దకుటుంబమే కాని ఉపయోగించు మొక్కలంతగాలేవు. ఈ కుటుంబములో గుల్మములు గుబురు మొక్కలు, పెద్ద చెట్లను గలవు. వాని కొమ్మల మీదను, ఆకుల మీదను రోమము లుండుట చే గరుకుగా నుండును. పు 306

ష్పములు వృశ్చికమధ్యారంభ మంజరులుగా నున్నవి. పుష్ప కోశము, దళ వలయముల త్మ్మెలు, కింజల్కములు సాధారణముగ నైదేసి యుండును. అండాశయము ఉచ్చము. నాలుగు అండము లుండును. అండాశయమునకు నాలుగు తమ్మెలున్నవి. వీని మధ్య నుండి కీలము వచ్చు చున్నది. కీలాగ్రములు రెండు. కాయ విచ్చెడు కాయ.

నక్కెరి చెట్టు పండ్రెండడుగులు పెరుగును. ఆకులు అండాకారము. పువ్వులు తెల్లగాను చిన్నవిగాను వుండును. దీని కాయలను మందులలో ఉపయోగించురు. కలప పొయ్యిలోనికి బంకను తుమ్మ జిగురు వలెను ఉపయోగింతురు.

పెనుజెఱ్ఱి చెట్టు చిన్న చెట్టు. ఇది తెల్లని పువ్వులను పూయును. వీనిలో చాల భాగము మగ పువ్వులే.

పెద్ద బట్టవ చెట్టు. చిన్నది. ఆకులు హృద్యాకారముగ గరుకుగను వుండును. దీని కలప బాగుగనే వుండును.

బాపన బూరి గుబురు చెట్టు. ఆకులు చాల బిరుసుగా నుండును. వర్ష కాలమందు తెల్లని పువ్వులు పూయును. 307

గుబురుమొక్క. చాల తోట్ల పెరుగుచున్నది. సాధరణముగ ఒకటి రెండడుగులెత్తు వుండును. ఆకులు హృదయాకారము. అంచులు మణగి యుండును.

హస్థిని
శ్రీ హస్తిని ఏక వార్షిక మగు గుల్మము. ఆకులపైనను ప్రకాండము పైనను బిరుసగు రోమములున్నవి. వృంతము పై పుష్పములు రెండు వరుసలుగా వున్నవి. పుష్పమంజరి వృశ్చిక మధ్యారంభమంజరి.