వృక్షశాస్త్రము/నాచు కుటుంబము
321
రసస్గడ్డిమాను కొండల మీద పెరుగు చున్న చెట్టు. తొడిమ చిన్నది. ఆకులు పెద్దవి. తెల్లని పువ్వులు పూయును.
నేలములగ నేల మీద ప్రాకును. కాయగుండ్రముగను నున్నగను నుండును. దీనిని వండికొని తిందురు. ఉస్తి మొక్క నేలమీద ప్రాకు చుండును. ఆకుల మీదను హాయల మీదను ముండ్లు కలవు.
నాచు కుటుంబము.
నాచు అను పేరును నీళ్ళమీద తేలు చుండు ప్రతి మొక్కకును, ఒక్కొక్కప్పుడు పాకుడునకు కూడ వాడుచున్నాము. గాని ఆ మొక్కలన్నియు వేరు వేరు కుటుంబములలోనివే. కొన్ని నాచు లకు పువ్వులుండ నేయుండవు. ఇచ్చట వర్ణించిన నాచు పువ్వులు పూచునదియె.
నిలకడగా నున్న నీళ్ళలో కొన్ని మొక్కలు తేలుచుండుట జూతుము. మొక్కల ఆకులు నీళ్ళస్లోనె యున్నవి. ఈ మొక్కలకు వేళ్ళు లేవు. ఆకులు మిక్కిలి సన్న సన్నముగ చీలి యున్నవి. వాని వద్ద మిరియపు గింజలంతంత సంచుల వంటివి చూడ నగును. వీని మూలముననే మొక్క తేలు చున్నది. దాని పువ్వుల కాడ నీటిపైకి వచ్చుటకై యది తేలుచున్నది. పువ్వులు కూడ నీళ్ళలోనె యున్న ఎడల నొక పువ్వు వద్దనుండి మరియొక పువ్వులోనికి, పుప్పొడి వచ్చి చేరుటకు వీలుండదు గావున పువ్వులు పైకి రావలసి యున్నది. ఈ మె క్కలును చిన్న చిన్న పురుగులగును బట్టితినగలవు. వరి చేలలో గూడ నిట్టి మొక్కలు మొలచు చున్నవి. దీని ఆకులు మిక్కిలి చిన్నవి. పువ్వులు నీలముగాను అందముగాను నుండును. కొన్ని మొక్కలు కొంచెము పెద్దవిగా నెదిగి నపుడు తీగెలవలె చుట్టుకొనును. ఈ మొక్కలను దీసి, మన్ను కడిగివేసి చూచిన యెడల చిన్న చిన్న బంతుల వంటివి కనబడును. వాని మీద నొక చోట ఒక రంధ్రమును దాని వద్ద నొక తలుపును గలవు. ఆ అతలుపు లోపలి వైపునకు బోవును గాని పైవైపునకు రాదు. ఈ రంధ్రము చుట్టు కొన్ని రోమములు గలవు. ఏవైన చిన్న పురుగులు తలుపు తోసికొని అతిత్తులలో ప్రవేసించును గాని పైకి రాలేవు. కొన్ని దినములకవి యచ్చట చచ్చి పోవును. వాని రసమును మొక్క పీల్ల్చుకొనుచున్నది. దీని పువ్వులు ఓష్టాకారముగ నున్నవి. కింజల్కములు రెండు అండాశయము ఒక గది.
మరికొన్ని కుటుంబములలోను, కీటకములను దినెడు మొక్కలు గలవు. అవి సాధారణముగ నీటి యొడ్డున బురద నేలలో మొలచు చుండును. ఒక మొక్క ఆకులు సన్నముగా నుండు ను. దాని మీద ఎన్నో రోమములు గలవు. ఆ రోమములలో నుండి ద్రావకము గలిగిన యొక జిగురు రసము వచ్చును. ఏదైన ఒక పురుగు ఆయాకు మీదకు వచ్చిన ఆరోమముల న్నియు దానిపై వంగి అచ్చట దానిని బంధించును. వాని నుండి మరి కొంత ద్రవము స్రవించును. అదితగిలి పురు చచ్చిపోవును.
- చెరువులలో నుండెడు కీటక బక్షణము చేయ గలిగిన ఒక నాచు మొక్క పైన పురుగుల నాకర్షించెడు తిత్తులు పెద్దవిగా చూప బడినవి. 324
ఈమొక్క అపువ్వులు సరాళములు 5 రక్షక పత్రములు, 5 ఆకర్షణ పత్రములు, 5 కింజల్కములు, 5 కీలములును గలవు.
మరికొన్ని కీటక భుక్కులగు మొక్కలలో ఆకులు గిన్నె వలె మారి యున్నవి. ఆ గిన్నెకు ఒక మూత గలదు. ఈ మూతను త్రోసికొని లోపలకు బోవచ్చును గాని ఏపురుగును పైకి రాలేదు. మరియు పురుగొక్కటి లోపలకు ప్రవేశింపగానె ఒక ద్రవము స్రవించి ఆ కీటకమును చంపి వేయును.
ఈ కీటక భుక్కులగు మొక్కలు బురదనేలలోను, నీళ్ళలోను బెరుగు చున్నవి. అవి పెరుగు చోట ఉప్పువాయువు నత్రజని మిక్కిలి తక్కువగా దొరుకును. కాని ఆది జంతువులకు వలెనే మొక్కలకు కూడ ముఖ్యముగా కావలయును. కాన ఆ మొక్కలిట్లు పురుగులను జంపి వాని నుండి ఆ పదార్థము పొందు చున్నవి.
తగడ కుటుంబము.
తగడ చెట్టు కొండ ప్రదేశములలో ఎత్తుగా పెరుగును.
ప్రకాండము:- లావుగను పొడుగుగను వంకరలు లేక తిన్నగను, నుండుడును. బెరడు, దట్టము, దోదుమ వర్ణము