వృక్షశాస్త్రము/పొగడ కుటుంబము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

277

కొండనువ్వులు మొక్క హిందూస్థానౌనందు కొన్ని చోట్ల మెలచు చున్నది. ఆకులు అండాకారము సదా వుష్పించును. దీని యాకులను కొందరు తిందురు.


పొగడ కుటుంబము.


పొగడ చెట్టును తోటలలో పెంచు చున్నారు. దీని బెరడు గరుకు గరుకు గా నుండును. లేత కొమ్మలపై మెత్తని పొడి గలదు.

ఆకులు
- ఒంటరి చేరిక, కురచ తొడిమ. లఘు పత్రములు, సమ గోళాకారము, సమాంచలము, విషమ రేఖ పత్రము, కొన, నాలము గలదు. పత్రములు బిరుసుగా నుండును. రోమములు లేవు.
పుష్పమంజరి
- కణుపు సందుల నుండి, సాధారణముగ నొకటి కంటె ఎక్కువయే పుట్టు చున్నవి. పువ్వులు చిన్నవి. సరాళములు.
పుష్పకోశము
- అసంయుక్తము. రక్షక పత్రములు రెండు. వరుసలుగా నున్నవి. ఒక్కొక్క వరుసలో నాలుగేసి కలవు. పై వరుస లోనివి పెద్దవి. అవి మొగ్గలో నొక దాని నొకటి తాకు చుండును. రెండవ వలయము లోనివి అల్లుకొనియుండును. నీచము.
దళవలయము
- సంయుక్తము. గొట్టము మిక్కిలి పొట్టిది తమ్మెలు మూడు వలయములుగ నున్నవి. ఒక్కొక్క దాని యందు ఎనిమిదేసి గలవు. మూడ వలయమునందలి తమ్మెలు కింజల్కములపై కిరిటము వలె ఏర్పడుచున్నవి. ఇవియె నిజమైన దళవలయపు తమ్మెలు. పైనున్న రెండు వరుస 278
VrukshaSastramu.djvu


బొమ్మ
పొగడ

లను వీని నుండి పుట్టిన పొలుసులు. తెలుపురంగు. ఎండిన తరువాత గోదుమ వర్ణమువచ్చును. మంచి వాసన గలదు.

కింజల్కములు
- ఎనిమిది. వీని మధ్య గొడ్డు కింజల్కములు గూడ గలవు. పుప్పొడి తిత్తులు సన్నము. సంయోజకములు వీని పైకి వచ్చుచున్నవి. గొడ్డువి పై వలయము, కావున కింజల్కములు దళ వలయమున కెదురెదురుగానున్నవి.
అండ కోశము
- అండాశయము ఉచ్చము. దీనిపై రోమములున్నవి. 8 గదులు. కీలము ఒకటి. లావుగను పొట్టిగను నున్నది. కాయ కండ కాయ ఒకగది, ఒక గింజ మాత్ర మున్నది. 279

ఈకుటుంబము ఉష్ణదేశములందు మాత్రము గలదు. దీనిలో చెట్లు, గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరిక. సమాంచలములు. వీని పువ్వులలో పుష్ప కోశము రెండు వలయములుగ నున్నచి. కొన్నింటిలో దళ వలయపు తమ్మెలు లోపలి వైపునను, గొన్నింటిలో పై వైపున పొలుసులు గలవు.

పొగడ పువ్వులు చాలమంచి వాసన వేయును. ఇవెండి పోయినను వాసన పోకుండును. వీనియందొక విశేషము.

సపోటాచెట్టును గొంచము దీనిని పోలికాగానే యుండును. పువ్వుల కంటె చిన్నవి. ఆరు గొడ్డు కింజల్కములున్నవి. ఇవియు అకర్షణ పత్రముల వలెనే కనుపట్టును. దీని పండ్లు తిందురు. ఇవి రుచిగా నుండును. బలమును గలించును.

ఇప్పచెట్టు కొండ ప్రదేశములలో పెరుగును. ఆకులు కొమ్మలచివర గుబురులు గుబురులుగా నుండును. దీని పువ్వులని కొందరు తిందురు. కలపయు గట్టిగా బాగుగనే యుండును. కొన్ని చోట్ల నీ పువ్వుల నుండియే, మత్తుకలుగ జేయు ద్రవము తీయుచున్నారు. దీనిగింజలనుండి వచ్చు చమురు ఆముదము కంటె చిక్కగ నుండును. 280

పెద్ద ఇప్పచెట్టును మన్యములందు ఎక్కువగా బెరుగు చున్నది. ఆకులు బల్లెపాకారము. పువ్వుల కాడలు పొడుగుగ నుండును. ఈ చెట్టును చాల లాభ కారియగు చున్నది. దీని పువ్వులను పేద వారలు పోగు చేసికొని, ఎండబెట్టి ఆహార పదార్థముగ నుపయోగించు చున్నారు. గింజల నుండి తీసిన చమురును వారు నేతికిని కొబ్బరి నూనెకూ బదులుగ కూడ వాడు కొందురు. దీనితో దీపములు గూడ పెట్టు కొందురు. అది సబ్బు చేయుటకును పనికి వచ్చును. ఈ నూనెయు, బెరడును ఉడక బెట్టిన ఆకులను గజ్జి మొదలగు వ్యాధులను బోకొట్టుటకు ఉపయోగించురు. దీని కలపయు చాల గట్టిగా నుండును.


తుమ్మిక కుటుంబము.


తుమ్మిక చెట్టు
కొండ ప్రదేశములందు పెరుగును.
ప్రకాండము
- ఇరువ్ది, ఇరువది అయిదు అడుగు లెత్తున పెరుగును. బెరడు గొగ్గి గిగ్గిలుగా నుండును. కొమ్మలు చాలగలవు. లేతకొమ్మల మీద మెత్తని రోమములు గలవు.
ఆకులు
- ఇంచు మించు అభిముఖ చేరిక, కణుపు పుచ్చములు లేవు. కురుచ తొడిమ, లఘు పత్రములు. నిడివి చౌక సాకారము. సమాంచలము. లేత వానిపై రోమములు గలవు.
పుష్పమంజరి
- పురుష పుష్పములు కణుపుసందులనున్న వృంతము మీద మూడో,. నాలుగో యుండును. ఉపవృతములును, వాని వద్ద రే