వృక్షశాస్త్రము/తుమ్మిక కుటుంబము
280
పెద్ద ఇప్పచెట్టును మన్యములందు ఎక్కువగా బెరుగు చున్నది. ఆకులు బల్లెపాకారము. పువ్వుల కాడలు పొడుగుగ నుండును. ఈ చెట్టును చాల లాభ కారియగు చున్నది. దీని పువ్వులను పేద వారలు పోగు చేసికొని, ఎండబెట్టి ఆహార పదార్థముగ నుపయోగించు చున్నారు. గింజల నుండి తీసిన చమురును వారు నేతికిని కొబ్బరి నూనెకూ బదులుగ కూడ వాడు కొందురు. దీనితో దీపములు గూడ పెట్టు కొందురు. అది సబ్బు చేయుటకును పనికి వచ్చును. ఈ నూనెయు, బెరడును ఉడక బెట్టిన ఆకులను గజ్జి మొదలగు వ్యాధులను బోకొట్టుటకు ఉపయోగించురు. దీని కలపయు చాల గట్టిగా నుండును.
తుమ్మిక కుటుంబము.
- తుమ్మిక చెట్టు
- కొండ ప్రదేశములందు పెరుగును.
- ప్రకాండము
- - ఇరువ్ది, ఇరువది అయిదు అడుగు లెత్తున పెరుగును. బెరడు గొగ్గి గిగ్గిలుగా నుండును. కొమ్మలు చాలగలవు. లేతకొమ్మల మీద మెత్తని రోమములు గలవు.
- ఆకులు
- - ఇంచు మించు అభిముఖ చేరిక, కణుపు పుచ్చములు లేవు. కురుచ తొడిమ, లఘు పత్రములు. నిడివి చౌక సాకారము. సమాంచలము. లేత వానిపై రోమములు గలవు.
- పుష్పమంజరి
- - పురుష పుష్పములు కణుపుసందులనున్న వృంతము మీద మూడో,. నాలుగో యుండును. ఉపవృతములును, వాని వద్ద రే 281
చేటికలను, పుష్ప కోశము వద్ద చేటికలు గలవు. కణుపు సందుల నొక్కొక్కటియే యుండును.
- మిధున పుష్పములు
- - వీనికి వృంతము లేదు. పురుష పుష్పముల కంటె పెద్దవి.
మిధున పుష్పములు బూయని కొన్ని మగ చెట్లుకూడ కలవు.
- పురుష పుష్పము.
- పుష్ప కోశము
- - సంయుక్తము. 4 తమ్మెలు నీచము.
- దళ వలయము
- - సంయుక్తము. తమ్మెలు తెలుపు రంగు.
- కింజల్కములు
- - 12 కాడలు వృంతాశ్రితములు. పుప్పొడి తిత్తులు సన్నముగా నున్నవి.
- అండకోశము లేదు.
- మిధున పుష్పము
- - పుష్ప కోశము వద్ద నొకచేటిక గలదు.
- పుష్ప కోశము
- - సంయుక్తము. 5 తమ్మెలు. నీచము.
- దళ వలయము
- సంయుక్తము. 5 తమ్మెలు.
- కింజలకములు
- - 10 పుప్పొడి తిత్తులు చిన్నవి. పైకి గొడ్డు దాని వలె నగు పడును.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము. పలు గదులు గలవు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గింజ కలదు. కీలములు మూడు కీలాగ్రము చీలి యున్నది.
ఈ కుటుంబములో పెద్ద చెట్లును గుబురు మొక్కలే గానిగుల్మములు లేవు. ఆకులు సాధారణముగ ఒంటరి చేరిక. 282
వీనికి కణుపుపుచ్చములు లేవు. కొన్ని పోతు చెట్లు కూడ గలవు. పుష్పములు సరాళములే. వీనికి చేటికలున్నవి. పుష్ప కోశము దళ వలయము సంయుక్తము. కింజల్కములు దళ వలయపు తమ్మెలన్నియో వానికి రెండు మూడు రెట్లో యుండును. వృంతాశ్రితములు. కీలములు 2 మొదలు 8 వరకు వుండును.
తుమ్మిక చెట్టు ఒరిస్సా, మలబారు., ఆంధ్ర దేశమున సింహళములో ఎక్కువగా పెరుగు చున్నది. దీని నుండి మిక్కిలి విలువగు కలప వచ్చును. మాను మధ్య నుండు నల్లని భాగమే మంచిది. చుట్టు తెల్లగ నున్నది అంత గట్టిగా నుండదు. ఈ కలప చెక్కడపు పనులులకు చాల యనుకూలముగ నుండును. దీని పండ్లను తిందురు. బెరడు నూరి మెరియపు పొడితో కలిపి యిచ్చిన జిగట విరేచనములు కట్టు నందురు.
తుమ్మిక యను పేరతోడనే మరియొక చెట్టు గలదు. ఇదియు కొంచెము పై దాని వలెనే యుండును. దీనిఆకులు కొంచము పొడుగాను, బెరడు నున్నగాను నుండును. మగ పుష్పములందు కింజల్కములు నలుబది గలవు. మిధున పుష్పము నందు మూడో నాల్గో యున్నవి. దీని పండ్లను కూడ తిందురు గాని అంత బాగుగనుండవు. పచ్చికాయలరసము వలలకు చీకి పోకుండుటకై పూసెదరు. 283
నీటితుమ్మ నీటివార నీడగనున్నచోట్ల బెరుగును. దీని కాయల నుండి జిగురు వంటి పదార్థమువచ్చును. కాయలను నలుగ గొట్టి ఆరసము దీసి కాచి బొగ్గు పొడితో గలపి పడవల కడుగున రాతురు. వానిని నలుగగొట్టిన తరువాత నీళ్ళలో వారము దినములు నాననిచ్చిన జిగురు వలె వచ్చును. అడుగున మిగిలిన తుక్కు పారవేసి కరక్కాయలతో కలిపి కాచి నల్లరంగు
- నల్ల ఉలి మేర
- 284
గు చేయుదురు. దీనిని వలలకు రాచిన అవి చాల గట్టిగానుండును.
తొండ్ర చెట్టుకు ముండ్లు గలవు. ఆకులు కొంచెము సన్నముగా నుండును.
నల్ల ఊలిమేర చెట్టు మగపువ్వులు తుగ్గులుగా నుండును దానికి ముండ్లు కలవు చిన్న చిన్న కొమ్మలే వాడియై ముండ్లగు చున్నవి. ఈ చెట్టు వేసవి కాలములో పుష్పించును,
ముళ్ళతుమ్మిక చెట్టునకు వాడిగ నుండు ముండ్లు లేవు. చిన్న చిన్న రెమ్మల చివరలు కొంచెము సన్నముగా నుండి ముళ్ళ వలె వున్నవి. స్త్రీపుష్పము నందు నాలుగు గొడ్డు కింజల్కములున్నవి.
లోధ్ర కుటుంబము.
ఈచిన్నకుటుంబము నందు చెట్లును, గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరిక, కణుపు పుచ్ఛములు వుండవు. కణుపు సందుల నుండి యైనను కొమ్మల చివర నుండి యైనను రెమ్మ గెలలు గాని కంకులు గాని వచ్చును. కొన్నిటిలో మాత్ర మొక్కక్కచో నొక్కొక్క పుష్పము మాత్రము గదు. పువ్వులు తెల్లగానుండును. చిన్నతమ్మెలు గలవు. పుష్పకోశము సంయుక్తము. నాలు గైదు దంతము లుండును.
285
కొన్నిటిలో ఉచ్చముగను, కొన్నిటిలో నీచముగ నున్నది. ఆకర్షణ పత్రములు నాలుగో అయిదో యుండును. ఇవి విడివిడిగానె యున్నవి. మొగ్గలో నల్లుకొని యున్నవి. కింజల్కములు ఆకర్షణ పత్రముల నంటి యున్నవి. వీనికి రెట్టింపైనను, అసంఖ్యములుగా నైన నుండును. కొన్నిటిలో కింజల్కములు కల్సి యున్నవి. అండాశయములో తరుచుగా 2..5
- లోధ్ర: