వృక్షశాస్త్రము/లోధ్ర కుటుంబము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

284

గు చేయుదురు. దీనిని వలలకు రాచిన అవి చాల గట్టిగానుండును.

తొండ్ర చెట్టుకు ముండ్లు గలవు. ఆకులు కొంచెము సన్నముగా నుండును.

నల్ల ఊలిమేర చెట్టు మగపువ్వులు తుగ్గులుగా నుండును దానికి ముండ్లు కలవు చిన్న చిన్న కొమ్మలే వాడియై ముండ్లగు చున్నవి. ఈ చెట్టు వేసవి కాలములో పుష్పించును,

ముళ్ళతుమ్మిక చెట్టునకు వాడిగ నుండు ముండ్లు లేవు. చిన్న చిన్న రెమ్మల చివరలు కొంచెము సన్నముగా నుండి ముళ్ళ వలె వున్నవి. స్త్రీపుష్పము నందు నాలుగు గొడ్డు కింజల్కములున్నవి.


లోధ్ర కుటుంబము.


ఈచిన్నకుటుంబము నందు చెట్లును, గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరిక, కణుపు పుచ్ఛములు వుండవు. కణుపు సందుల నుండి యైనను కొమ్మల చివర నుండి యైనను రెమ్మ గెలలు గాని కంకులు గాని వచ్చును. కొన్నిటిలో మాత్ర మొక్కక్కచో నొక్కొక్క పుష్పము మాత్రము గదు. పువ్వులు తెల్లగానుండును. చిన్నతమ్మెలు గలవు. పుష్పకోశము సంయుక్తము. నాలు గైదు దంతము లుండును. 285

కొన్నిటిలో ఉచ్చముగను, కొన్నిటిలో నీచముగ నున్నది. ఆకర్షణ పత్రములు నాలుగో అయిదో యుండును. ఇవి విడివిడిగానె యున్నవి. మొగ్గలో నల్లుకొని యున్నవి. కింజల్కములు ఆకర్షణ పత్రముల నంటి యున్నవి. వీనికి రెట్టింపైనను, అసంఖ్యములుగా నైన నుండును. కొన్నిటిలో కింజల్కములు కల్సి యున్నవి. అండాశయములో తరుచుగా 2..5

VrukshaSastramu.djvu
లోధ్ర: 286

గదులుండును. కొన్నిటిలో మాత్రము ఒక గదియే కలదు. అండములు ఒకటియో రెండో వ్రేలాడు చుండును. ఫలములో పెంకు కాయ.

లోధ్ర చెట్టు హిందూస్తానములో ఉన్నతప్రదేశముల మీదను హిమాలయా పర్వతేముల మీదను పెరుగు చున్నది. పువ్వులలో కింజల్కములు చాల గలవు. దీనిబెరడును, ఆకులును ఎర్రని రంగు చేయుటలో ఉపయోగించెదరు. చినాలి రంగువంటి రంగు వచ్చును. కాని తరుచుగ రంగు వచ్చెడు తొగరు చెట్టు వంటి ఇతర పదార్థములతో గలిపి వాడుదురు. దీని బెరడును ఔషధములలో గూడ వాడుదురు.


మల్లి కుటుంబము.


మల్లితీగె పందిళ్ళ మీదను చెట్ల మీదను ప్రాకును గాని దానికి నులి తీగెలుండవు. కొమ్మలను చిక్కుడు తీగ వలె చుట్టుకొనును.

ఆకులు
- అభిముఖచేరిక. లఘు పత్రములు. కురుచ తొడిమ. అండాకారము. సమాంచలము. విషమరేఖపత్రము. కొనగుండ్రము. రెండు వైపుల నున్నగా నుండును.
పుష్పమంజరి.
- కొమ్మల చివరల నుండి గుత్తులు పువ్వులు తెలుపు.అంతరాళము. మంచివాసనవేయును.