Jump to content

వృక్షశాస్త్రము/చామంతి కుటుంబము

వికీసోర్స్ నుండి

271

ఎఱ్ఱబిక్కి చెట్టుమీద ముండ్లుగలవు. పువ్వులొక్కొకచో నొక్కొక్కటియే యుండును. అవి తెల్లగాను సువాసనగా నుండును.

మంగ చెట్టు
- గుబురుమొక్క. ఇది చాలతోటుల బెరుగు చున్నది.


చామంతి కుటుంబము.


ప్రొద్దుతిరుగుడు చెట్టు
- సాధరణముగా మన తోటలో పెంచుదుము.
ఆకులు
- అడుగున కొన్ని యాకులు మాత్రమే అభిముఖ చేరిక, పైకి పోను ఒంటరి చేరిక. కొంచెమించుమించు హృదయాకారముగా నుండును. కొన సన్నము. రెండు వైపులను మెత్తని రోమములు గలవు. సమాంచలము. విషమ రేఖ పత్రము.


పుష్ప మంజరి
- బంతి, మనము చూచి పుష్పమని భ్రమించునది యొక పుష్పము గాదు. అనేక పుష్పముల సముదాయము. పుష్పసముదాయమున కడుగున ఆకు పచ్చగ నుండు ఆకుల చేటికలు గాని రక్షక పత్రములుగావు. లోపలనున్న యొక్కొక్క టేకొక్కక పుష్పము. మధ్యాభీసరణము. కొన్ని మిధున పుష్పములు, కొన్ని నపుంసక పుష్పములు కొన్ని ఏక లింగ పుష్పములుగా నుండును. 272
పుష్ప కోశము
- రక్షక పత్రములు టేకులవలె నుండక రోమములవలె మారి యున్నవి. ఉచ్చము.
దళ వలయము
- సంయుక్తము. చుట్టు నున్న పుష్పము యొక్క దళ వలయము నాలుక వలె వెడల్పుగ నుండును. మధ్య పుష్ప దళవలయము సన్నని గొట్టము వలె నుండును.
కింజల్కములు
- అయిదు. కాడలు దళ వలయమున కంటె చిన్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు. అన్ని పుప్పొడి తిత్తులును ఆనుకొని యుండును.

అండ కోశము:- అండాశయము నీచము. ఒక గది. ఒక అండ కీలము మొదట కింజల్కముల కన్న పొట్టిగ నుండి, క్రమము వాని కంటే పెద్దదై పుప్పొడి తిత్తుల మధ్య నుండి చీల్ల్చుకొని పైకి పోయి రెండు కీలాగ్రములగా చీలును.

చామంతి పుష్పములో గొట్టము వలెనున్న పుష్పములు లేవు.

ఇది యొక పెద్ద కుటుంబము. ప్రపంచములో నన్ని భాగముల యందును దీనిని కనుగొననగును. ఈ కుటుంబములోని అన్ని మొక్కలన్నియు గుల్మములు, ఆకులు చాల భాగము పర ఒంటరిచేరిక కాని కొన్నిటికి మాత్రమభి ముఖచేరిక. వృంతాగ్రముపై సాధరణముగా పొలసులుండవు. పుష్పకోశము కొన్ని పుష్పములలో పొలుసులు వలెను కొన్నిటిలో 273

రోమమము వలె నుండును. ఇట్లుండుట వలన ఎండు కాయలు గాలి కెగరి దూరముగా బడుటకు వీలగు చున్నది. పుష్పములలో కొన్ని మిధున పుష్పములు గను కొన్ని ఏకలింగ పుష్పములగను నున్నవి. మిధున పుష్పములు. పుష్పమంజరికి మధ్యను ఏక లింగ పుష్పములు చుట్టు నుండును. పుప్పొడి తిత్తులన్నియు గలసి యుండును. అండాశయము ఒక ఫలము ఎండు కాయ బ్రద్దలవదు. కీలము చివర రెండుగా చీలి యుండును.

బంతిలోని పుష్పములు కొన్ని గొట్టముల వలెను కొన్ని నాలుకవలె వెడల్పుగ నున్నవో అన్ని పుష్పములను గొట్టముల వలె నున్నచో చేటిక లాకుపచ్చగ నున్నవో మరియొక రంగుగ నున్నచో వృంతాగ్రము పై పొలుసున్నవో లేవో మొదలగు అంశములను బట్టి ఈ కుటుంబమును జాతులుగను తెగలుగను విభజించి యున్నారు.

కుసంబ మొక్కలను బొంబాయి, బంగాళా దేశములందు కొన్ని చోట్ల పైరు చేయు చున్నారు. దీని యాకులు వెడల్పుగను బల్లెపాకరముగను నుండును. తొడిమ లేదు. ఈ మొక్కలో ముఖ్యమైనవి రెండు రకములున్నవి. ఒకదాని ఆకులు బిరుసుగను ముళ్ళుగలవిగను వున్నవి. రెండవదానికి ముళ్ళు 274

లేవు. కొన్ని చోట్ల వానిపుష్పములనుండి రంగు చేయుటకును, కొన్ని చోట్ల గింజలనుండి చమురు తీయుటకూ పైరు చేయుచున్నారు.

ఈ మొక్కలకు కొంచ మిసుకనేల మంచిది. దీనిని విత్తనములు ఇతర మెట్ట పైరులతో జల్ల వచ్చును. నాలుగైదు నెలలకు పుష్పింప నారంభించును.

మొట్టమొదటక నొక పూవు పూయుటకారంభింప బో చుండగనే చిగురును త్రుంచి వైతురు. అందుచే కొమలు వేసి అవన్నియు పుష్పిచును. పుష్పములను కోసి యింటికి కొని పోయి నీడ నార బెట్టుదురు. ఆరిన పిదప చేతులతో నలుపుచు జల్లెడ వలె గంతలు కంతలుగల బుట్టలో నీళ్ళతో పసుపు రంగు లేకుండ నీరు శుబ్రముగ పోవునంత వరకు కడుగుదురు. తరువాత వాని నార అబెట్టి ముద్ద వలె జేసి అమ్ము చున్నారు. ఈ రంగు వేయు వారలు వీనినే కొనుక్కొనెదరు. ఈ రంగు వాడుకయు ఇప్పుడు తగ్గిపోయెను.

1875 సంవత్సరముల ప్రాంతముల మన దేశము నుండి 650827 రూపాయల సరకు ఎగుమతి యగు చుండెను. తత్పూర్వమింకను నెక్కువ గలదు. 275

కుసుంబనూనెను రెండువిధములుగ దీయు చున్నారు. కాయలను వెచ్చ బెట్టకయె దీయుట యొకటి. వెచ్చ బెట్టి దీయుట ఒకటి. వెచ్చ బెట్టిన యెడల నెక్కువ వచ్చుట సత్యమే గాని అది మంచి రకముగాదు. పచ్చి నూనెను వంటకములందును, సబ్బులు చేయుటకును, తక్కువ రకము దీపములు పెట్టుటకును బనికి వచ్చును. వంట చమురు వీనికి బనికి రాదు గాని పచ్చి చమురునకు లేని మరియొక లక్షణము దానికి గలదు. దానిని చర్మములకు రాచిన యెడల వానిని నీటిలో ముంచినను నవి పాడు కావు. నీళ్ళు తోడుకొని పోవు తోలు తిత్తులులకు నీనిని రాయు చుందురు.

కొందరు దీని చిగుళ్ళను వండు కొనియు గింజలను వేయించుకొనియు తిందురు.

నల్లతపత మొక్క అక్కడక్కడ మెలచు చున్నది. ఆకులు కొమ్మనంటి పెట్టుకొని యుండును. అడుగున నున్నవి బల్లెపాకారము. పైనున్నవి బాణపాగ్రాకారము. పువ్వులు పెద్దవి. పచ్చగా నుండును. ఈ మొక్కలో పాలు గలవు.

ఎత్రింట
మొక్కలో అడుగున వున్న ఆకులకు పక్ష వైఖరిని దీర్ఘములగు తమ్మెలున్నవి. పై ఆకులు బాణాగ్రాకారము. వీనిలోను పాలు గలవు. 276

చందుగల్ల కూర సాధారణముగ మెరక్ నేలలందు మొలచు చుండును. ఆకులు బల్లెపాకారము. బంతులు కొమ్మల చివరన నుండును. అన్నియు మిదున పుష్పములే.

మరాట తీగె
- ముదురు మొక్కలలో ప్రకాండము నేల మీద బడి వేరులు వేయు చుండును. ఆకులు అభిముఖ చేరిక. అండాకారము పువ్వులు కోలగ నుండును.
చామంతి
- చిన్న మొక్క, దీని పువ్వులు మిగుల అందముగా నుండును. దీనిలో తెల్ల రకము కూడ గలదు.
ప్రొద్దు తిరుగుడు మొక్కను దోటలందు పెంచు చుందురు. ఆకులు హృదయాకారము. పువ్వులు పెద్దవి. కాడలు పొడుగుగ నుండుట చే వంగి యుండును.

బంతి మొక్క ఇతర దేశములనుండి మన దేశమునకు తేబడినది. దీనిలో రేక బంతి, ముద్ద బంతి యను రెండు రకములున్నవి. కొన్నిటి పువ్వులు పచ్చగ నుండును. కొన్నిటివి నారింజ రంగుగ నుండును.

టెంకీసు మొక్కలు చిన్నవి. వీని పువ్వులు పలు రంగులుగ చామంతి పువ్వుల కంటె పెద్దవిగా నుండును. ఇవియు మన దేశము లోనివి కావు. 277

కొండనువ్వులు మొక్క హిందూస్థానౌనందు కొన్ని చోట్ల మెలచు చున్నది. ఆకులు అండాకారము సదా వుష్పించును. దీని యాకులను కొందరు తిందురు.


పొగడ కుటుంబము.


పొగడ చెట్టును తోటలలో పెంచు చున్నారు. దీని బెరడు గరుకు గరుకు గా నుండును. లేత కొమ్మలపై మెత్తని పొడి గలదు.

ఆకులు
- ఒంటరి చేరిక, కురచ తొడిమ. లఘు పత్రములు, సమ గోళాకారము, సమాంచలము, విషమ రేఖ పత్రము, కొన, నాలము గలదు. పత్రములు బిరుసుగా నుండును. రోమములు లేవు.
పుష్పమంజరి
- కణుపు సందుల నుండి, సాధారణముగ నొకటి కంటె ఎక్కువయే పుట్టు చున్నవి. పువ్వులు చిన్నవి. సరాళములు.
పుష్పకోశము
- అసంయుక్తము. రక్షక పత్రములు రెండు. వరుసలుగా నున్నవి. ఒక్కొక్క వరుసలో నాలుగేసి కలవు. పై వరుస లోనివి పెద్దవి. అవి మొగ్గలో నొక దాని నొకటి తాకు చుండును. రెండవ వలయము లోనివి అల్లుకొనియుండును. నీచము.
దళవలయము
- సంయుక్తము. గొట్టము మిక్కిలి పొట్టిది తమ్మెలు మూడు వలయములుగ నున్నవి. ఒక్కొక్క దాని యందు ఎనిమిదేసి గలవు. మూడ వలయమునందలి తమ్మెలు కింజల్కములపై కిరిటము వలె ఏర్పడుచున్నవి. ఇవియె నిజమైన దళవలయపు తమ్మెలు. పైనున్న రెండు వరుస