Jump to content

వృక్షశాస్త్రము/తొగరు కుటుంబము

వికీసోర్స్ నుండి

తొగరు కుటుంబము

వర్ణము : సంయుక్త దళవంతము.

తొగరుచెట్లు చాలచోట్లనే పెరుగుచున్నవి.

ఆకులు - అభిముఖచేరిక, లఘుపత్రములు. బల్లెపాకారము. తొడిమ కురుచగా నుండును. కణుపు పుచ్ఛములు గలవు. ఇవి రెండు పత్రములకుమధ్యనున్నవి. విషమరేఖ పత్రము, అంచు సరళితము. కొన సన్నము.

పుష్పమంజరి - కణుపు సందులందుండి గుత్తులుగా వచ్చును. పువ్వులు తెలుపు. సరాళము. మంచివాసన వేయును. 254

1.దళవలయము, కింజల్కములు, 2. ఫలము, 3 కీలము.

పుష్పకోశము
- సంయుక్తము. గొట్టము వలెను, పొట్టిగాను వుండును. ఉచ్చము. అండాశయముతో కలిసి పోయి వున్నది.
దళ వలయము
- సంయుక్తము. తమ్మెలు గలవు. మొగ్గలో ఒకదానినొకతటి తాకుచు వుండును. త్వరగా రాలి పోవును.
కింజల్కములు 5. దళవలయము నంటి యున్నది. కాడలు పొట్టివి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము
- అండాశయము నీచము. రెండు గదులు. కాని, ఒక పొర అడ్డముగా ఏర్పడుట చేత నాలుగు గదుల వలె నగు పించును. కీలము సన్నము. కాయ ఒక పువ్వు సందు నుండి ఏర్పడినది గాదు. అన్ని పువ్వుల పుష్ప కోశములు అండాశయములు కలిసి ఏర్పడుచున్నవి. 257

చిరివేరు మొక్క. చిన్న గుల్మము అది గడ్డిలో కలిసి మొలచు చుండును.

ప్రకాండము. నాలుగు పలకల గా నుండును.
ఆకులు
- అభిముఖ చేరిక, స్న్నము, లఘుపత్రములు, సమాంచలము, కొన సన్నము. రెండు వైపుల నున్నగా నుండును. కణుపు పుచ్చములు రెండాకులకు మధ్యన గిన్ని వలె నున్నవి. ఒక్కొక్కప్పుడు కణుపు వద్ద రెండేగాక చాల ఆకులు గలుగు చుండును. కణుపు వద్ద నుండ వలసిన రెండాకులు గాక మిగిలినవి కణుపు సందులో పెరుగ వలసిన కొమ్మ మీదవి, కొమ్మ పెరుగ లేదు గాని ఆకులు మాత్రము పెరిగినవి,.
పుష్ప మంజరి
- కణుపు సందుల నుండి మధ్యారంభ మంజరులగు గుత్తులు.
పుష్ప కోశము
- సంయుక్తము. గిన్నె వలె నుండును. 4 దంతములు గలవు. ఉచ్చము.

దళ వలయము:- సంయుక్తము. గొట్టము పొట్టి తమ్మె. ఒక దాని నొకటి తాకు చుండును.

కింజల్కములు
- 4. దళ వలయము నంటి యున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము
- అండాశయము, నీచము, రెండు గదులు కీలము ఒకటి కీలాగ్రములు రెండు. అండములు చాల గలవు.

ఈ కుటుంబము పెద్దదియె. దీనిలో పెద్ద వృక్షములు, గుబురు మొక్కలు, గుల్మములు కూడ కలవు. వీని 258 యన్నిటి ఆకులు అభి ముఖ చేరికగ నుండును. కణుపు పుచ్చములు రెండాకులకు మధ్యగా నుండును. పువ్వులన్నియు సరాళములు. దళవలయమున కైదు తమ్మెలు గలవు. కింజల్కములు దీని కంటి యుండును. అండాశయము నీచము. రెండు గదులు గలవు. ఈ కుటుంబమును, అండాశయము యొక్క గదులలో ఒక్కొక్క గింజయో, ఎక్కువయో దళ వలయపు తమ్మెలు తాకు చున్నవో, అల్లుకొని యున్నవో, కాయ పగులునో, కండ కాయయో, ఇట్టి వానిని బట్టి జాతులుగను, తెగలుగను విభజించి యున్నారు.

తొగరు చెట్టు
- వెనుక తొగరి వేళ్ళనుండి పచ్చని రంగు చేసెడి వారు గనుక వానిని విస్తారముగ బెంచెడి వారు గాని ఇప్పుడు పై దేశముల నుండి చౌక రంగులు వచ్చు చుండుట చేత పూర్తిగ మానినారు. అప్పుడంత విస్తారముగ బైరు చేయుట వలన ఏబది అడుగులెత్తు పెరుగు చెట్లు మూడు నాలు గడుగులు ఎదిగి పెరుగునవిగా కూడ మారినవి. వానిని ఇసుక నేలలలో పొలము బాగుగ దున్ని విత్తులు నాటి మొలిపించెడి వారు. కాయల నుండి విత్తులు తీయుటయే కొంత కాలము పట్టును. కొన్ని చోట్ల విత్తనములకై క్రిందటి సంవత్సరపు పైరు నుండి తీసిన కాయలను, మరి కొన్ని తోట్ల దగ్గరి నున్న చెట్ల కాయలను ఉపయోగించెడి వారు. కాయలను దెచ్చి 259

వాని కండ మెత్త బడుటకై మూడునాలుగు దినములొక కుప్పగా వేయుదురు. అవి నల్లబడి మెత్త బడగనే గింజలను దీసి పదునైదు దినములు కుప్పగా వేసి, ఇంకను నున్న కండను దీసి వేయుటకు , తట్టలలో వేసి కొంత సేపు కాలువలలో వేసి తరువాత ఆర బెట్టి జల్లుదురు.

తొగరు రంగు నూలు బట్టలకే పనికి వచ్చును. పట్టు బట్టలకును మిక్కిలి సన్న బట్టలకును దాని ఉపయోగింపరు. కోరా బట్టలనే దెచ్చి ఆముదము, లేని యడల ఆముదపు గింజల పొడి, చౌడు, కారము నీళ్ళలో గలిపి బట్టల నందులో కొన్ని దినములు నాన వేసెదరు. తరువాత వానిని దీసి కరక్కాయ చెక్క కషాయములోను, పిదప పటిక నీళ్ళలోను నాన బెట్టుదురు. అటు పిమ్మట నీళ్ళను కాక బెట్టుచు మరిగిన పిమ్మట తొగరు వేరు, ముక్కలుగా గోసి ఆనీళ్ళలో వేసి బట్టలను కూడ వేయుదురు. వేళ్ళ బెరుడునే వేసిన యెడల పూర్తిగ నెర్ర రంగు వచ్చును. బెరడుతో మిగిలిన భాగమును గూడ వేసిన యెడల కొంచెము పశుపు దాళువు గూడ వచ్చును. రంగునకు సన్నముగా నున్న వేళ్ళు మంచివి. చెట్టు కొట్టి వేళ్ళు తీయగనే వాని లావు సన్నముల ప్రకారము ఏర్పరచి యుంతురు. రంగ వేసెడు పలు తావులందు పలు భేదములు గలవు. కాని యిప్పుడీ రంగు వేయుటయే మానిరి. 260

కాపీ మొక్క మన దేశము లోనిది గాదు. ఒక మహమ్మదీయుడు మెక్కానుండి తిరిగి వచ్చునపుడు ఏడు గింజలను దెచ్చి మైసూరులో మొట్ట మొదట పాతెనని ప్రతీతి గలదు. ఇంచు మించుగ ఆ కాలమందే ఈస్టు ఇండియా కంపెనీ వారు కూడ హిందూస్థానము నందు కాఫీ మొక్కలను పెంప దొడగిరి. కాఫీని మొదట త్రాగ నేర్చిన వారరేబియా దేశస్తులు. వారు కాపీ రుచుల తోడనే కషాయము చేసే వారు. పారసీకులే గింజల పొడుముతో చేయ నారంబించిరి. కాఫీ పంట క్రింద నున్న మొత్తము 196318 ఎకరములలోను విస్తారము చెన్న రాజ్యము, మైసూరు, తిరువాన్కూరు లలోనే గలదు.

ఈ మొక్కలకు రాతి నేల గాని విస్తారము బిరుసుగానున్న నేల గాని మంచిది కాదు. వేళ్ళు సులభముగ పారుటకు భూమి వీలుగ నుండ వలెను. మరియు దీనికి 1500 వందలు మొదలు 5500 అడుగుల వరకు ఎత్తుగా నున్న ప్రదేశములు మంచివి. విస్తారము ఉష్ణము కూడదు. ఎక్కువగా వర్షములు అక్కర లేదు. పెద్ద పెద్ద సుడి గాలులు వచ్చు చుండిన మొక్కలు బాగుండవు.

మొక్కలు పెంచుటకు విత్తునెన్నుటలో చాల శ్రద్ధ కావలయును. కాపీవిత్తులలో ఎన్నియో రకములు గలవు. వా 261

లో మంచి వానిని నేలకుదగు వాని నేరుకొన వలయును. లేత కాయలలోని గింజలు మంచివి కావు. కాయలు పూర్తిగ పండిన తరువాత వాని గింజలను తీసి కడిగి నీడ నారబోయ వలెను. కొందరు పండ్ల నుండి తీయగనే పాతినచో మొక్క బాగుండునని తలచు చున్నారు. ఈ గింజలను మొదట మళ్ళలో పాత వలెను. ఈ మళ్ళ కొరకు నేర్పరిచిన నేలలో వెనుక కాపీ మొక్కలు మొలచెనా యవి మంచివి కావు. అక్కడ విస్తారము చెట్లున్నచో, నీడకు గావలసిన వాని నుంచి మిగిలినవి కొట్టి వేయ వలయును. మరియు నీ మళ్ళకు ఏర్పరచు వానికి నీటి సదుపాయము బాగుండ వలెను. మళ్ళలో ఏడాది ఎదిగిన పిమ్మట వానిని దీసి చేలలో పాదుదురు. కొందరు రెండేండ్ల వరకు మళ్ళలోనే యుంచెదరు. వీనిని చేలలో పాతునపుడు చేలను శుభ్రముగా ద్రవ్వ వలెను. డబ్బునకు వెనుదీయనిచో మొక్కలను పాతు చోట పెద్ద పెద్ద గోతులు త్రవ్వి కొన్ని దినముల వరకు ఎండ కెండుచు, వానకు దడియుచు నట్లుండనిచ్చెదరు. తరువాత వానిని, ఎరువు, గడ్డి మొక్కలు, మన్నులతో (ఇదివరకు త్రవ్వి తీసిన మన్ను గాదు) పూడ్చెదరు. అవి కొంత కాలమైన తరువాత లోపలకు క్రుంగును. పిమ్మట నచ్చోట, పేడను ఇతర ఎరువులను వేయుదురు. మొక్కలు మబ్బుగానున్నప్పుడు పెద్ద వర్షములు కురియ కుండా నున్నప్పుడు పాతుట 262

మంచిది. పాతిన వెంటనే యెక్కువగా ఎండలు కాసిన యెడల రెండు మూడు మార్లు తడి పెట్ట వలయును. మొక్కలను దూర దూరముగ పాతుట మంచిది. ఎంత దూరముననో, అది, భూమిని బట్టియు, కాపీ రకమును బట్టియు నుండును.

కాపీ తోటలలో నీటి పారుదల బాగుగ నుండ వలెను. కాలువలు లోతుగా నుండుట మంచిది.

కాపీ మొక్కలను పాటుటకు పూర్వమాచోటును దున్నుట గూర్చియు, త్రవ్వుట గూర్చియు, ఆకులు గప్పుట కూర్చియు పలువిధములగ చెప్పుచున్నారు. త్రవ్వకుండనున్న యెడల మొదటి ఒకటి రెండు సంవత్సరములలో పంట తక్కువగా నుండును. మరియు వెనుకటి మోడులేమైన నుండును గాన అగ్ని బయమును గలుగ జేయ వచ్చును. ఆకులను గప్పెనేని, అవి కుళ్ళును గాన, నెరువు వేసినంత పని చేయును. మొక్కలు ఏపుగా బయలు దేరును. మరియు ద్రవ్వక పోవుట వలన గలుగు నష్టమును బాపును.

ఈ మొక్కలకు చేప పెంట, తెలక పిండి, ఎముకలు, పేడ మొదలగు వానిని ఆయా నేలలకు కావలసిన వానిని ఎరువుగా వేయుదురు. ఎరువువేసెడు కాలమును అన్ని చోట్ల నొకటి కాదు. మొక్కలు పాతగనే ఎరువు వేసిన అవి ఏపుగా బయలు దేరును. పుష్పించు నపుడు ఎరువు వేసిన విరివిగా గాచును. 263

కాపీ మొక్కలు కొంచె మెత్తు ఎదిగిన తరువాత వానిని గత్తరించుదురు. మొక్కలు మూడేండ్లు ఎదిగిన తరువాత ఐదు అడుగులెత్తు యుంచి పైన నరికి వేయుదురు. చివర నొక కొమ్మ బయలు దేరును. కాని దీని క్రింద నున్న కొమ్మలకే సూర్య రస్మియు గాలియు బాగుగ నుండుట చే అవియే బాగుగ ఫలించును. కాయల భారమునకు రెండు కొమ్మలను రెండు వైపుల వంగి యుండును.

అందుమూలమున చెట్టు కొంచెము మధ్యగా చీలి అందు పురుగులు ప్రవేసించును గాన అట్లు కత్తరించుట వలన కొమ్మలు వంగి కోయుటకు వీలుగ నున్నను అది మంచి పద్దతి కారు. కొమ్మలను నిలువుగా నెదుగ నిచ్చుటయే మంచి పద్దతి. కొన్ని చోట్ల రెండేండ్లప్పుడే మొక్కలను కత్తరించుచున్నారు. చాల చోట్ల పంట పండగనే కాయలు కాచిన వానిని గత్తరించి వైచి యిక ముందు కాయలు గాయ వలసిన వానిని కాపాడుదురు. ఎండి పోయిన కొమ్మలను కుళ్ళు చున్న వానినెప్పుడైనను లాగి వేయ వలసినదే. ఒక్కక్కప్పుడు బెరడు నంటుకొని యుండు ప్రాకుడు, నాచు వంటి వానిని గీసి వేయ వలయును.

ఈ మొక్కలకుండవలసిన నీడనుగూర్చికూడ నభిప్రాయ భేదము గలుగు చున్నది. కాని కొన్నిచోట్ల కంది మొక్కల లను, కొన్నిచోట్ల బాడిదమొక్కలను, మరికొన్నిచోట్ల రికొన్నిటిటిని బాతుచున్నారు. ఏవైనను, చిక్కుడుకుటుంబము లోనివైనచో, మంచివి. వానికి భూమిలో నత్రజనమును జేర్చుగుణము గలదు.

కాపీమొక్కలకు తెగుళ్ళు చాల కలుగుచుండును. బట్టుపురుగులు తేయాకు మొక్కలకు బట్టువానన్ని లేవు ని, అంతకంటె నెక్కువ ధ్వంసము చేయుచున్నవి. ఇవి వలన కంటె బురుగుల వలన నెక్కువ పాడగు చున్నవి.

కాయలను బూర్తిగ ముదిరినగాని కోయగూడదు. కొన్నిచోట్ల చెట్టుక్రింద గుడ్డనుబరచి, చెట్టునాడింతురు. కా మన దేశములో జాలచోట్ల మామూలుగనే కోయుచున్నారు. కొన్ని కాయలలో నొక్కొకగింజయే యుండును. ఒక్కొ గింజయున్నవి మంచివాసన వేయునందురు. కాయలు గోసి పిదప వానినుండి గింజలుదీయుట కష్టము, వీనిని దీయుట యంత్రములు గలవు.

కాపీకి ఎక్కువ ధరయుండుటచేత కల్తీలు విస్తారము గ గల్పుచున్నారు. కొన్ని మొక్కల వేళ్లును, ఖజూరపు గింజలు, పంచదార, బఠాణీలు మొదలగు వానిని కాల్చియు కాపీ పొడిలో గలుపు చున్నారు. కొందరు ఆతుక్కు ఈతు తుక్కువేసియే కాపి పొడియని అమ్ముచున్నారు. అన్యదేశము నుండి వచ్చిన కాపిపొడి కంటె మన ఇండ్లలో గింజలు వేయించి చేసికొనిన పొడి బాగుండుట కిదియే కారణము. కొన్ని కొన్ని చోట్ల కాఫీ గింజలకు బదులుగా తగరిన కసింత జాతి మొక్కల గింజలనుపయోగించు చున్నారు.

క్వైనా
పుష్పము. కాయలు.


కాపీత్రాగుట మన దేశములో నిప్పుడెక్కువైనది. కాపిత్రాగుట కలవాటు పడని వారదిఏమి పాపమో అనాగరికులుగ నెంచ బడుచున్నారు. పల్లెటూరులందు సైతము కాపి విస్తారముగ వ్యాపించినది. మొగపెళ్ళివారి నిబంధనలలో నిది యొకట 266

య్యెను. చదువుకొనుటకు బాలురన్య పట్టణములకు బోయి యిచ్చట దీనికి చిక్కువడుత యొక ముఖ్యకారణము.

క్వినైను చెట్లను దెచ్చి మనదేశములో మొలిపించి వానిలో జాల రకములు గలవు. కాని యేవియు విస్తార ఉష్ణమును భరింప లేవు. కావున మన దేశమునందు కొండల మీదనే వానిని పెంచు చున్నారు. ఈ చెట్లు పచ్చిక బయళ్ళలో కంటె అడవులు నరికి, అచ్చట పాతినచో బాగుగమొలచును. అవి పెరుగు నేలలందు నీరు నిలిచి యుండ రాదు.

ఈ చెట్లను కొమ్మలు పాతి యైనను గింజలను నాటియైనను బెంప వచ్చును. మళ్ళు చేసి,ఎండ తగులకుండ పందిరియో, పాకో వేసి విత్తనములను ఒత్తుగ జల్లుదురు. వానికి తరుచుగా నీరును బెట్టు చుండ వలెను. అవి ఆరు వారముల నాటికి మొలకెత్తును. ఈ లేత మొక్కలు రెండు మూడాకులు వేసిన తరువాత వానిని దీసి రెండేసి అంగుళముల దూరములో పాతి పెట్టవలెను. ఇవి నాలుగు అంగుళములెత్తు ఎదిగిన పిమ్మట నైదేసి అంగుళముల దూరమున బాత వలెను. తొమ్మిది... పదంగుళములు ఎదిగిన పిమ్మట వానిని మరల దీసి రకమును బట్టి నాలుగు మొదలు ఆరడుగుల దూరములో పాత వలెను.

మొక్క లెదిగి ఒక దానికొకటి మిక్కిలి దగ్గరగా నున్నను నష్టము లేదు. అంత దగ్గరగా నుండుట వలన వానిక్రిం 267

గడ్డి మొక్కలు పెరుగలేవు. మరియు మధ్యమధ్య నున్న మొక్కలను నాలుగైదేండ్లు వచ్చిన తరువాత పెరికివైచి వానినుండి బెరడు తీయ వచ్చును. పండ్రెండు పదు నాలుగు ఏండ్లయిన పిదప మొక్కలను పూర్తిగ లాగి మాను నుండియు వేరు నుండియు బెరడు దీయుదురు. బెరుడుతో లోపలి దారువు కూడ వచ్చిన లాభము లేదు గావున పదునెనిమిదేసి అంగుళముల దూర దూరమున చెట్టు చుట్టు నరుకుబెట్టి రెండు నరుకుల మధ్య నిలువుగా కోయుదురు.


అట్లు మొక్కలను బెరికి వేయక నెదుగనిచ్చునపుడు చెట్ల యొక్క కొమ్మలనే కొట్టుదురు. లేదాచెట్టునే మొదలు వరకు నరుకుదురు. ఈ మొండెము నుండి కొమ్మలు బయలు దేరు పెద్దవగును.కొన్నిచోట్ల మానునకు రెండు వైపుల మాత్రమె ఒక యంత్రము మూలమున బెరడును కొంచెము లోతుగనే చెక్కుదురు. తరువాత నచ్చట బెరడు కూడ వచ్చును.

తీసిన బెరడు నంతయు నెండ బెట్టి యంత్ర శాలకు పంపుదురు. యంత్రశాలలో నేమిజరుగునో, బెరడులో నేయే 268

మార్పులుగలుగునో తెలిసికొనుట రసాయన శాస్త్ర సహాయము లేనిదే కష్టము.

ఇప్పటికి మొత్తము మీద 4350 ఎకరముల క్వినైను చెట్లక్రిందనున్నవి. అన్య దేశముల నుండి క్వినైను దిగుమతి చేసి కొనుటమానినాము. మరియు సంవత్సరమునకు మన (మన గవర్నమెంటు వారికి) 138660 రూపాయలు లాభము కూడ వచ్చు చున్నది.

చిరి వేరు:- చిరి వేళ్ళ బెరడులో గూడ నెఱ్ఱని రంగు కలదు. బట్టల రంగునకు వీనిని కూడ ఉపయోగించురు. ఈ మొక్కలు ఎసుక నేలలో బాగుగ మొలచును. విత్తులు చల్లబోవుటకు ముందు పొలములో మంద గట్టుదురు. విత్తనములు చల్లిన తరువాత మొక్కలు మొలచు వరకును దినమునకు మూడు మారులు చొప్పున నీరు పోయు చుండ వలెను. మొదటి పదునైదు దినములు నీళ్ళలో పేడ కూడ కలుపుదురు.

దీని వేళ్ళను నీళ్ళతోనూరియో, దంపియో రసము దీసి ఆరసములో బట్టను నాన బెట్టి రెండు గంటలు మరుగ బెట్టిన తరువాత ఉతికి ఆర వేయుదురు. బట్టకు మంచి ఎఱ్ఱరంగు వచ్చును. 169

మంజిష్టలత
- చాల పెద్దది. అదిచెట్లమీద బ్రాకుచుండును. మాను లావుగనే యుండును. ఒకజత ఆకులు పెద్దవి. ఒక జత ఆకులు చిన్నవి. దీని వేరునుండి కూడ ఎర్రని రంగు వచ్చును. దీనిని తొగరు వేరు వలెనే వాడుదురు కాని బెరడును వేరు చేయ నక్కరలేదు. దీనితో రంగు వేయుటయు నిప్పుడు తగ్గిపోయెను.
నూకు కాడ
- వరి చేల గట్ల వద్ద ఒక అడుగెత్తు మొలచును. ఆకులకు తొడిమ లేదు. చిన్నచిన్న తెల్లని పువ్వులను పూయును.


మదన బుంత కాడ
- సముద్రతీరములందు మొలచును. కొమ్మలు నాలుగు పలకలుగా నున్నవి. పువ్వులు కణుపు సందులలో మూడేసియో నాల్గేసియో యుండును.
బంధూకము
- అందముగానుండు గుబురు మొక్క. కొమ్మలు భూమి వద్దనుండి పుట్టు చున్నవి. ఆకులు కొమ్మనంటిపెట్టుకొని యుండును. పువ్వులు ఎరుపు.
తడ్డపళ్ళు చెట్టు
- పర్వతములమీద పెద్దదిగానే పెరుగును. ఆకులతొడిమ చాల పొట్టిది. దీని పువ్వులు తెల్లగాను వాసన గాను నుండును. 270
నూనిపాపడ
- డొంకలవద్దను మార్గములప్రక్కన దరుచుగాబెరుగు చిన్న మొక్క. తెల్లని పువ్వులు గుత్తులు. మంచి వాసన వేయును.

పాపటయు పై దాని వలెనే యుండును గాని, దీని ఆకులు సన్నగా నుండవు. రెండు వైపుల రోమములు గలవు.

వెర్రి నల్లవేము
- మార్గములప్రక్కను మొలచు చిన్న మొక్క ఆకులు బల్లెపాకారము. వానికితొడిమ లేదు. కణుపు సందుల రెండు పువ్వులుండును.
కొమ్మి చెట్టు
- చిన్నది బెరడు నల్లగాను, నున్నగానుండును. ఆకుల దట్టముగా ఉన్నవి దీని తెల్లని పువ్వులు మంచి వాసన వేయును.

కరింగవచెట్టు చిన్న చెట్టు. పువ్వులు పెద్దవి. ప్రొద్దుటే వికసించి నపుడు తెల్లగా నుండును. కాని క్రమక్రమముగా బచ్చపడును.

గార్గ చెట్టు
కొండల మీద బెరుగును. శీతాకాలములో ఆకులు రాలి వసంత ఋతువులో చిగురింప నారంబించును. పువ్వులు మంచి వాసన వేయును. 271

ఎఱ్ఱబిక్కి చెట్టుమీద ముండ్లుగలవు. పువ్వులొక్కొకచో నొక్కొక్కటియే యుండును. అవి తెల్లగాను సువాసనగా నుండును.

మంగ చెట్టు
- గుబురుమొక్క. ఇది చాలతోటుల బెరుగు చున్నది.


చామంతి కుటుంబము.


ప్రొద్దుతిరుగుడు చెట్టు
- సాధరణముగా మన తోటలో పెంచుదుము.
ఆకులు
- అడుగున కొన్ని యాకులు మాత్రమే అభిముఖ చేరిక, పైకి పోను ఒంటరి చేరిక. కొంచెమించుమించు హృదయాకారముగా నుండును. కొన సన్నము. రెండు వైపులను మెత్తని రోమములు గలవు. సమాంచలము. విషమ రేఖ పత్రము.


పుష్ప మంజరి
- బంతి, మనము చూచి పుష్పమని భ్రమించునది యొక పుష్పము గాదు. అనేక పుష్పముల సముదాయము. పుష్పసముదాయమున కడుగున ఆకు పచ్చగ నుండు ఆకుల చేటికలు గాని రక్షక పత్రములుగావు. లోపలనున్న యొక్కొక్క టేకొక్కక పుష్పము. మధ్యాభీసరణము. కొన్ని మిధున పుష్పములు, కొన్ని నపుంసక పుష్పములు కొన్ని ఏక లింగ పుష్పములుగా నుండును.