Jump to content

వృక్షశాస్త్రము/పనస కుటుంబము

వికీసోర్స్ నుండి

388

కొఱమాను చెట్టుకూడ కొండలమీద పెద్దగాపెరుగును. దీని పువ్వులందును బెంటింగి పువ్వులందువలె పచ్చని రేకులు గ్లవు. దీని కలప గట్టిగనే యుండును. ఆకులు పశువులు తినును.

డొంకిబూర కాలువల గట్లు మీద డొంకల మీద ప్రాకుచుండును.

నేపాళము పెక్కు చోట్ల చిన్నమొక్కగ పెరుగు చున్నది. దీని గింజల నుండి తీయు చమురు విరేచనములగుటకును డోకులు వచ్చుటకును, చర్మవ్యాధులకును పనికి వచ్చును. కాని గింజలనే తినినచో ప్రాణహానియు వాటిల్లును. కొన్ని చోట్ల దీని ఆకులను పట్టు పురుగులకు ఆహారముగ పెట్టుచున్నారు.


పనస కుటుంబము.


పనస చెట్లును చాలచోట్లనే పైరుచేయు చున్నారు.

ఆకులు ఒంటరిచేరిక, తొడిమ గలదు కణుపు పుచ్చములున్నవి. లఘు పత్రములు, అధశ్శిర అండాకారము. సమాచలము, విషమఖ పత్రము, పత్రము బిరుసుగా నుండును. శిరోదంతి ఆకులను త్రుంచిన పాలు గారును. 389

పుష్పమంజరి.
- మాను మొదటిభాగము మీద మిక్కిలి చిన్న కొమ్మల నంటి కంకులు పుట్టుచున్నవి. ఏక లింగ పుష్పములు. మగ పువ్వుల కంకి మిక్కిలిచిన్నది.
మగ కంకి.
పుష్పనిచోళము
రెండు రేకులు మాత్రమె యున్నవి. మంచి రంగు గాని వాసన గాని లేదు.
కింజల్కములు
-. ఒకటియే కాడస్ లావుగ నున్నది. పుప్పొడి తిత్తి రెండు గదులు గలది.
ఆడుకంకి
- మగ కంకి కంటె గుండ్రముగా నున్నది.
పుష్ప నిచోళస్ము
సంహ్యుక్తము. గొట్టమువలె నున్నది. గొట్టము మూతి సన్నముగా నున్నది.
అండకోశము
- అండాశయము ఒక గది. ఒక అండము గలదు. కీలము ప్రక్కగాను కొంచెము పొడుగుగాను నున్నది. కీలాగ్రము లావు.

పండు ఒక పుష్పము వల్లనే ఏర్పడుట లేదు. కంకి మీద నున్న పుష్పములన్నియు గలిసి ఒక పండు అగుచున్నవి. ఒక్కొక్క పుష్పము తొనల ప్రక్కనుండెడు పీచును పుష్పములే గాని అవి గొడ్డులై యున్నవి. లేత కాయలను గోసిన పాలు వచ్చును.

మఱ్ఱి చెట్టు

మఱ్ఱిచెట్టు మనదేశములో పలుతావులందు పెరుగుచున్నది. దీనికి ఊడలు గిలది విశాలముగ వ్యాపించును. దీనికొమ్మలలోను పాలుగలవు. 390

ఆకులు
- ఒంటరి చేరిక, లఘు పత్రములు, తొడిమ పెద్దది. కణుపు పుచ్ఛములు గలవు. అండాకారము, సమాంచలము, దట్టముగాను బిరుసుగాను నుండును.
పుష్ప్ మంజరి
- మఱ్ఱి చెట్టునకు బువ్వులు లేవను కొను చున్నారు గాని, ఆకుల వద్ద కాయల వలె అగుపించునవి పుష్పములే. ఒక కాయ వలెనగు పించునది ఒక పుష్పము గాని, ఒక కాయ గాదు. పనసకంకి మీద మిమ్మట్లే దానిలోను చాల పుష్పములున్నవి. ఈ సంగతి లేత వానిని తుంపి పి చూచిన తెలియగలదు. వృంతము కాడ వలె నుండ్క, గుండ్రమై బంతివలెనై పుష్పస్ముల నాన్నిటిని నావరించు చున్నది. ఒక్కచోట మాత్రమఒక రంద్రము గలదు. ఈ రంధ్రము యొద్ద కాడస్ల నంటికొన్ని గలవు. అవి గొడ్డులైన పుష్పములు. పురుష పుష్పములును స్త్రీ పుష్పములును అడుగుగా నున్నవి. ఇవి మిక్కిలిచిన్నవి.
పురుష పుష్పము
పుష్పనిచోళము. కింజల్కములు వీని రేకుల కెదురుగా నున్నవి. గాన నిది పుష్ప కోశము. రక్షక పత్రములు నాలుగు.
కింఝల్కములు ఒకటో రెండో యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.

స్త్రీ పుష్పములలో రెండు రకములున్నవి. కొన్నిటి కాడ (ఉప వృంతము) పొడుగుగను కీలము పొట్టిగను నున్నది. కొన్నిటికాడ పొట్టిగను కీలము పొడుగుగను నున్నది.

అండకోశము
ఒకగది అండముఒకటి. కీలాగ్రములావు. 391

ఈపువ్వులలో గర్భాధానము చిత్రముగ జరుగుచున్నది. కాయ వంటి దాని మీద నొక రంద్రముండుట్ జూచితిమి కదా... ఆరంధ్రము ద్వారా చిన్న చిన్న పురుగులు గుడ్లు పెట్టుకొనుటకు వచ్చును. అవి పొట్టి కీలమున్న అండాశయములోనే గ్రుడ్లు పెట్టును. అ గ్రుడ్లు పెరిగి పెద్దవి పురుగులై పైకెగిరి పోవు నపుడు వాని దేహములకు కింజల్కములు తగులు చున్నవి. పుప్పొడి వాని శరీరము మీద రాలు చున్నది. ఈ పురుగులు మరియొక దానిలో ప్రవేశించి నపుడు వీని పైనున్న పుప్పొడి కీలాగ్రముల పైబడు చున్నది. ఈ రీతిని చిన్న చిన్న పురుగుల సహాయమున గర్భ ధారణా పొందు చున్నవి.

ఇది యొక పెద్దకుటుంబము. దీనిలో పెద్ద వృక్షములు, గుబురు మొక్కలు, గుల్మములు కూడ గలవు. ఆకులు ఒంటరి చేరిక, వానికి కణుపు పుచ్చములున్నవి. కొన్ని చెట్లలో, కొమ్మలందును, ఆకులందును పాలు గలవు. పువ్వులు చిన్నవి. ఏక లింగములు; ఏక లింగ వృక్షములు కూడ గలవు. పుష్పనిచోళము మాత్రమున్నది. కింజల్కములు సాధారణముగ పుష్పని చోళపు తమ్మెలన్నియుండి వాని కెదురుగా నుండును. అండాశయములో నొక గది గలదు. చెట్లయందు పాలు గలవో, లేవో, ఏక లింగ పుష్పములు వేరువేరు చెట్ల మీద నున్నవో, కింఝల్కములు మొగ్గలో వంగి యున్నవో, తిన్నగనే యున్నవో మొదలగు అంశములను బట్టి ఈ కుటుంబమును జాతులుగను తెగలుగను విభజించి యున్నారు. కొందరు శాస్త్రజ్ఞలు ఈకుటుంబము మూడు నాలుగు వేరు వేరు కుటుంబములుగా విడగొట్టియున్నారు. 392

పనస పండ్లు రుచిగానుండును. కావున మన దేశములో చాల చోట్లనే చెట్లను పెంచుచున్నారు. పనస తోటల కంతే విశేషముగ పాతు బడ నవసరము లేదు. ఈ చెట్ల ఉండి జిగురు కూడ వచ్చును. దీని పాలు జిగురుగా నుండుట చే వానిని దీసి పిట్టలను బట్టుకొనుటకు ఉపయోగింతురు. దీని కలపయు బాగుగనే యుండును. చిన్న పడవలు, తలుపులు, ద్వారబంధములు మొదలగునవి చేయుటకు బనికి వచ్చును. దీని రంపపు పొట్టును నీళ్ళతో కాచి పచ్చని రంగు చేయుదురు. ఆకులు వేళ్ళు కూడ ఔషధములలో ఉపయోగించును.

గంజాయి చెట్టు చిన్న మొక్క. దాని నుండి నారయు గింజలనుండి నూనెయు, గంజాయి, భంగు వచ్చుచున్నవి గాన నీ మొక్కలను పైరు చేయు చున్నారు. ఇవి మూడు వేల అడుగుల ఎత్తులోపున గాని, ఏడు వేల అడుగుల యెత్తు పైన గాని వర్థిల్లలేవు. ఈ మొక్కలు హిందూస్థానము నందే పైరగు చున్నవి. వీనికి సార వంతమగు నేలలును విస్థారము ఎరువును గావలయును. విత్తులు జల్లినాయిదారు నెలలకు పది పడ్రెండు అడుగులు ఎత్తు పెరుగును. గంజాయి కావల్లెనన్న లేత కాయలను ఆకులను చేతులతో రాచిన వచ్చెడు జిగిరు పదార్థమును బాగు చేతురు. నారకై ఎదిగిన మొక్కలను గోసి కట్టలు కట్టి ఒక దినము ఎండలో పెట్టుదురు. వీనిని కోయుటలో మగ మొక్కలను, ఇరువది ముప్పది 393

గంజాయి చెట్టు, అడుకొమ్మ, పోతు కొమ్మ, వీని పుష్పములు.

దినములు ముందుగా గోయుదురు. ఆడమొక్కలను వాని కాయలలోని గింజలు పూర్తిగ నెదుగకపూర్వమే కోయుదురు. గింజలు పూర్తిగ నెదిగిన యెడల మంచి నార రాదు. 394

మొగమొక్కలు త్వరగ పెద్దవగునుగావున ఆడమొక్కలెదుగు వరకు నుండనిచ్చిన వాని నార పాడగును.

గంజాయిగింజలను కొందరుతిందురు. వీని యందును మత్తు గలుగజేయు గుణము గలదు. ఈ గింజలను నూనె తీసిన తరువాత తెలక పిండిగ పశువులకు బెట్టుట మంచిదందురు.

అంగళ్ళ యందు భంగు అని అమ్మునది ఎండిన గంజాయి ఆకుల పొడి. గంజాయి కొరకే ఈ మొక్కలను సేద్యము చేసినప్పుడు విత్తనములను మొదట మళ్ళలో జల్లి కొంచమెత్తు ఎదిగిన తరువాత, పెంట వేసి దున్నిన పొలములో మొక్కలను నాటి వేయుదురు. అవి పుష్పింప బోవు చుండగనే మగ మొక్కలను బెరికి వేయుదురు. వీనిని బెరికి వేయుటచే పుప్పొడి లేక, ఆడ మొక్కలు కాయలు గాయవు. లేత కొమ్మల మీద నున్న రోమముల ద్వారా నొక రసము స్రవించి చిన్నబడును. ఈ మొక్కల మీదనున్న ముదురాకులను కూడ త్రుంపి వైచి మొక్కలు కోసి కట్టలు గట్టి కాలి క్రింద పెట్టి త్రొక్కుదురు. దానిచే లేతాకులు, పువ్వులు మొగ్గలు కలిసి ముద్దవలె నగును.

గంజాయి ఆకును చిలుములలో పెట్టి హుక్కా పొగాకు మొదలగువాని త్రాగునట్లే త్రాగెదరు. భంగును వేడినీ 395

ళ్ళలో గలపి వడకట్టి అందులో, పాలు, పంచదార, ఏలక పొడి మొదలగునవి వేసి పుచ్చు కొందురు. దీనిని మితముగ బుచ్చుకొనిన యెడల అంత హాని వాటిల్లదు.

గంజాయి నందరును సేద్యము సేయకూడదు. చేయుటకు గవర్నమెంటు వారి అనుమతి పొందవలయును. దీని అమ్మకమువల్ల చాల రాబడి గలదు.

మఱ్ఱి చెట్ల నుండి రెండవరకము రబ్బరు వచ్చును. గాని మంచి రకము రాదు. మఱ్ఱిపాలను నొప్పులకు కీళ్ళ నొప్పులకు నుపయోగింతురు. ఆకులను గూడ కాచి పట్టు వేయుదురు. బెరడు కషాయము అతి మూత్ర జబ్బునకు మంచినదనుచున్నారు. దీని కలప పొయిలోనికి తప్ప మరెందుకు పనికి రాదు. జాగ్రత్తగ కోసి తగు కాలము నీళ్ళలో నాననిచ్చి ఎండనిచ్చిన యెడల దీని తోడను పెట్టెలు, తలుపులు చేయ వచ్చును. దీని ఊడలను పెద్ద వనిని చెక్కిన డేరామేకులుగ బనికి వచ్చును. లక్క పురుగు దీని ఆకులను దిని బ్రతుగ గలదు. పశువులను ఏనుగులును లేత కొమ్మలను ఆకులను దినును.

రావి చెట్టు కూడ చాల పెద్ద చెట్టు. పక్షులు దీని కాయలను దిని ఇతర చెట్ల మీద దీని గింజలను బడవైచుటచే వాని మీద మొకలెత్తు చుండును. ఈ చెట్లు మనకును బౌద్దుల 396

కును పవిత్రమనదే. ఇదియువేపచెట్టును దగ్గర దగ్గరగా మొలచుచో వీని రెండింటికిని వివాహము చేయుచున్నారు. రావి చెట్టు నుండి పాలు వచ్చి చిక్కబడి ఒక గట్టి పదార్థమగును. ఈ చెట్టు నుండి జిగురు కూడ వచ్చు చున్నది. ఈ జిగురును గుల్ల నగల లోపల బెట్టు చుందురు. దీని బెరడు నుండి తీసిన నారతో కొన్ని చోట్ల కాగితములను చేయు చున్నారు. ఇది తోళ్ళు బాగు చేయుటలో కూడ పనికి వచ్చును. నీళ్ళలో వేసి మరుగ నిచ్చిన యెడల నీటికి కొంచె మెరుపు రంగు వచ్చును. వేరును పటిక నీళ్ళలో కాచిన యెడల ఒకవిధమగు ఊదారంగు వచ్చును. కలప పొయ్యి లోనికి మాత్రము పనికి వచ్చు చున్నది. దీని ఆకులు, కాయలు, బెరడు కూడ ఔషధములో వాడు చున్నారు.

అత్తి చెట్టు ఎత్తుగానె పెరుగును గాని మాను వంకర టింకరగా నుండును. వర్షాకాలములో దీని ఆకులు రాలి పోవును. దీని పచ్చికాయలను పండ్లను కూడ తిందురు. దీని నుండి వచ్చు జిగురును పిట్టలను పట్టుకొనుటకు ఉపయోగించెదరు. కలప పొయిలోనికిని నూతి చట్రములకును బనికి వచ్చును.

రబ్బరు చెట్లనుండియే వచ్చును. చెట్లలోనున్నపాలు చిక్కబడి, పరిశుద్ధము చేయబడిన అదిరబ్బరగును. పాలనుం 397

డి రబ్బరు వంటివే మరి రెండు పదార్థములు కూడ వచ్చును. ఈ పాలు ఒక జాతి చెట్లలోనే కాక చాల వానిలో గలవు. ఆముదము, గన్నేరు, జిల్లేదు పనస కుటుంబములలో పాలున్న మొక్కలనుండి రబ్బరు తియ వచ్చును.

పనస కుటుంబములో విస్తారము రబ్బరు నిచ్చెడు ఒక చెట్టుగలదు. దీనికి తెలుగు పేరేమియు దొరకలేదు గావున దీనినే రబ్బరు చెట్టు అందము.

రబ్బరు చెట్టును మఱ్ఱి చెట్టువలె పెద్ద వృక్షము. దీనికిని ఊడలు దిగును. ఆకులు అండాకారముగానైనను, నిడివి చౌక పాకారముగానైనను నుండును. దీని పండ్లను పక్షులు తిని చెట్లమీదనే రెట్ట వేయుటచే గింజలు చెట్ల మీదనే మొలచు చున్నవి. అవి పెద్దవై ఊడలు భూమిలో నాటుకొనిన తరువాత అది దేని పై పెరుగెనో ఆ చెట్టు చచ్చి పోవుచున్నది..

ఈ చెట్లను పైరు చేయుటకు వేసవి కాలమందు కాసిన కాయల గింజలు మంచివి. విత్తనములకై కాయలను బాగుచేసి, అవి పాడు కాకుండ బొగ్గు పొడితో కలిపి ఎండ పెట్టుదురు. వర్షాకాలములో కాయలను జిదిపి ఆముక్కలను మళ్ళలో జల్లుదురు. సుమారు మూడు నెలలలో మొలకెత్తును. 398

లేత మొల్కలు రెండుమూడుఅంగుళముల ఎత్తు పెరుగగనే వానిని దీసి మరి యొక మడిలో పాతుదురు. అచ్చట రెండు మూడు అడుగుల ఎత్తు పెరుగగనే దీసి చెట్లను పాతవలసిన చోట దూర దూరముగ పాతుదురు. లేత మొలకలకు ఎండ దగులనీయ కుండ కాపాడుచుండవలెను. మరియు మళ్ళు మిక్కిలి తేమగా గాని ఎండి పోయి గాని యుండ కూడదు. ఈ చెట్లను కొమ్మలు నాటి కూడ పెంచ వచ్చును. చెట్లకు పదునాలుగు సంవత్సరములు వచ్చి నప్పటికి నుండి రబ్బరుకై వానిని గీయ వచ్చును. చెట్ల మీద ఎనిమిది చోట్ల నేల వాలుగ నాట్లు పెట్టుదురు. ఈ నాట్లు మిక్కిలి లోతుగ నుండ కూడదు. పాలు బెరడునకు దగ్గరగానే యుండును. నాట్లు పెట్టుటకూ మంచి సాధనములు గలవు. ప్రతి నాటు క్రిందను ఒక కుండను కట్టుదురు. పాలు ఈ కుండ లోనికి దిగును. ఒక దినమాకుండ చెట్టు మీదస్నున్న పిదప దానిని దీసి, అందులోని పాలను శుభ్రపరచి కొంచెము పటిక నీళ్ళను చల్లుదురు. పాలు చిక్కబడి రబ్బరగును.

ఈరబ్బరుచెట్లు విస్తారముగ హిమాలయ పర్వతముల ప్రాంతములను అస్సాము దేశములోనుగలవు. రబ్బరు తో బళ్ళచక్రములు, బంతులు మొదలగు నెన్నియో సాధనము 399

లు చేయుచున్నారు. రబ్బరు మనదేఅములో కూడ కొంచెమో గొప్పయో దొరుకు చిండినను దానితో మనకేమిచేయుటకు చేతకాకున్నది.

జువ్విచెట్టు కూడ చాల పెద్ద చెట్టు. దీని ఆకుల తొడిమలు పొడుగుగానుండును. దీని లోను పాలుగలవు.

ఎర్రజువ్వి ఆకులతొడిమలు పొట్టివి. లేతకొమ్మలు మిక్కిలి నున్నగా నుండును.

పిట్టమర్రి చెట్టును కొండలమీద పెరుగు పెద్దచెట్టు దీనికిని ఊడలు గలవు. కాని అవిపెద్దవికావు.

పుత్రజీవియు కొండలమీద పెరుగును. దీనిఆకులకొన వంకరగను సన్నముగను నున్నది.

తెల్లభరిణిక చెట్టుకూడ కొండప్రదేశములందే పెరుగును. మాను పొట్టి ఆకులు శీతా ఫలపుఆకులవలె కొమ్మకు రెండువైపులనే యుండును.

గజనిమ్మచెట్టు. మిక్కిలి పెద్దదిగాదు. దీనిపండ్లను తిందురు. మొగకంకులను కూరవండుకొందురు. ఈ చెట్టులోను పాలుగలవు. 400

అరటి కుటుంబము.


అరటిచెట్టు ప్రకాండము భూమిలోపలనే కాని పైన లేదు. మనకు మాను అని అనుకొనునది మిక్కిలి దీర్గముగాను దట్టంగాను నున్న ఆకుల తొడిమ లోక దానినొకటి చుట్టు కొనుటచే ఏర్పడు చున్నది. భూమిలోపల నున్న ప్రకాండము మూలవహము గుల్మము.

ఆకులు
- మిగులపెద్దవి. కణుపు పుచ్చములుండవు. నిడివి చౌకపాకారము. లఘు పత్రము. సమాంచలము సమ రేఖ పత్రము. మర్రి ఆకు మొదలగు వాని యందున్నట్లు వీని యందు అంచు చుట్టు ఈ నేలు లేవు. అందు చేతనే గాలికి చిరిగి పోవును. ఆకులు రెండు వైపుల నున్నగా నుండును.
పుష్పమంజరి. ఒక చెట్టు ఒక మారే పుష్పించును.

పుష్పించుటకే వృంతము పైకి వచ్చును. అదియేజంట. రెమ్మకంకి.

పువులు మిగుల పెద్దవగు చేటికల సందుల రెండు రెండు వరుసలుగా నున్నవి. పుష్పములకు నుప వృంతములు లేవు. క్రింది చేటికల సందు నున్నవి. స్త్రీపుష్పములు. మధ్య చేటికల సందుల నున్నవి. మిధున పుష్పములు పైనున్నవి. పురుష పుష్పములు.

పుష్పనిచోళము. 5 దంతములు గల నొక గొట్టమున్నది. దీని కొక వైపున నిలువున జీలిక గలదు. రక్షకపత్రములు 3 ఆకర్షణ ప్త్రములు 2 గలసి ఈ గొట్టమైనదని యూహింప వచ్చును. ఈగొట్టమునకు లోపలి వైపున విడిగా నొక ఆకర్షణపత్రముగలదు. వానికి రంగంతగాలేదు ఉచ్చము.

కింజల్కములు
- 5 విడిగానున్న ఆకర్షణ పత్రముచే నావరింపబడి యున్నవి. దీని కెదిరుగ నొకకింజల్కమునులేదు. పుప్పొడితిత్తులు వెడల్పుగా నున్నవి.