వృక్షశాస్త్రము/ఆముదపు కుటుంబము

వికీసోర్స్ నుండి

376

గంధము రాయుచుందురు. వివాహాది శుభ కార్యములలోనీ చెక్కను వాడుదురు.


ఆముదపు కుటుంబము.


ఆముదపు చెట్టు 2 - 5 అడుగుల ఎత్తువరకు పెరుగును.

ప్రకాండము
- గుల్మము. కొయ్య వంటి దారు లేదు. లేత కొమ్మల మీదను, దొడిమల మీదను తెల్లని మెత్తని పదార్థము గలదు. అది లేగొమ్మలను ఎండకు ఎండి పోకుండ కాపాడును.
ఆకులు.- ఒంటరి చేరిక. లఘు పత్రము. మొగ్గగా నున్నప్పుడు దానిని గప్పుచు 2 కణుపు పుచ్ఛములు గలవు. పత్రముతో దొడిమ చేరు చోట దీనికిరు పక్కల బత్రము మీద గ్రంధి గోళములు గలవు. తొడిమ పాత్రము యొక్క అంచుతో చేరక కొంచెము మధ్యగా కలియు చున్నది. తాళపత్ర వైఖరి 7, 8 తమ్మెలున్నవి. తమ్మెల అంచున రంపపు పండ్లు గలవు. కొన సన్నము. బహుకాష్టకము. రెండు వైపుల నున్నగా నుండును.
పుష్పమంజరి
- రెమ్మ గెల. ఏకలింగ పుష్స్పములు. ఒక కొమ్మమీదనే స్త్రే, పురుష పుష్పములు గలవు. వృంతమలడుగు భాగమున స్త్రీ పుష్పములు, పైభాగమున పురుష పుష్పములు.
పురుష పుష్పము

పుష్ప కోశము. ( పుష్పనిచోళము) 3--5 రక్షక పత్రము ఒకదానినొకటి తాకుచుండును.

దళవలయము. లేదు. 377

కింజల్కములు, అసంఖ్యములు, కాడలు శాఖోపశాకలు నున్నవి. పుప్పొడి తిత్తులు గుండ్రము.
అండకోశము
లేదు;
స్త్రీ పుష్పము

పుష్పకోశము త్వరగా రాలి పోవును. నీచము. సంయుక్తము.

దళ వలయము
- లేదు.
కింజల్కములు :- లేవు.
అండ కోశము
- అండకోశము ఉచ్చము. 3 దగులు. కీలములు 3 ఒక్కొక చీలిక కొన భాగమందు రెండుగా చీలి యున్నది. ఒక్కొక గదిలో నొక్కక గింజ. అది గది కప్పు ఒక్క లోపల మూలను అలరించి యున్నది. కాయ బహు విదారులు ఫలము. గింజ పొర మిక్కిలి గట్టిగా నుండును. విత్తనములకు బీజ పుచ్చము. గలదు. విత్తనములో అంకురచ్చదనము గలదు.
నేల యుసిరి
- నేలయుసిరి తోటలలో బెరుగు చిన్నమొక్క. గుల్మము. 1 - 2 అడుగుల యెట్టు పెరుగును. ప్రకాండము గుండ్రము గాను నున్నగాను నుండును.
ఆకులు.- ఒంటరి చేరిక, లఘు పత్రము. చిన్నది. తొడిమ లేదు. సమ గోళాకారము. సమాంచలము. విషమరేఖ పత్రము. నున్నగానుండును. కొన గుండ్రము.
పుష్ప మంజరి
- కణుపు సందులందు ఒకటో, రెండో పురుష పుష్పములు, ఒకస్త్రీ పుషము కలదు.
పురుష పుష్పములు. 378
పుష్పకోశము
- రక్షకపత్రములు 6. నీచము
దళవలయము
- లేదు
కింజల్కములు. 3 కాడలు కలసి ఒకటిగా నేర్పడియున్నవి.
స్త్రీ పుష్పము.
పుష్పకోశము
- రక్షకపత్రములు. 6 నీచము
దళవలయము
- లేదు
అడకోశము
- అండాసయము ఉచ్చము. 3 గదులు రెండేసి గింజలు ఫలము బహు విదారణ ఫలము. కీలము 3 చీలికలు.
కొండాముదము

కొండాముదము 3- 6 అడుగుల వకరు పెరుగును. కొమ్మలు గుండ్రము. లేగొమ్మలమీద మెత్తని యొకవిధమగు పొడి గలదు.

ఆకులు.- ఒంటరి చేరిక. కణుపు పుచ్చములు లేవు. అండాకారము. లఘు పత్రము. కొన్నిటికి తమ్మెలుండును. 3 పెద్ద ఈనెలు గలవు. కొద్దిగరోమములున్నవి. అంచున నిడుపాటి రంపపు పండ్లు గలవు.
పుష్పమంజరి. కణుపు సందులందుండి యొక గెల.
పురుష పుష్పము.
పుష్ప కోశము.- రక్షక్ పత్రములు. 5. నీచము.
దళవలయము
- లేదు.
కింజల్కములు.- అసంఖ్యములు. విడివిడిగా నుండును. వీని చుట్టును


మధుకోశము గలదు. పుప్పొడి తిత్తులు గదులు పైన విడిగానుండును.

అండకోఅము
- లేదు.

స్త్రీ పుష్పము.

పుష్పకోశము సంయుక్తము. 5 దంతములు. నీచము. దీని యందును మధు కోశము గలదు.
దళవలము
- లేదు.

కింజల్కములు:- లేవు

ఆముదపు చెట్టు.
380
అండకోశము. అండాశయముఉచ్చము. 3 గదులు. ఒక్కొక్క గింజ. బీజపుచ్చము గలదు. కాయ బహు విదారుణఫలము.

ఈ కుటుంబపు మొక్కల లో ఆకులు ఒంటరి చేరిక. లఘు పత్రములు. పువ్వులు చిన్నవి. ఏకలింగ పుష్పములు. అండకోశము నందు సాధరణముగ 3 గదులు. వ్రేలాడువిత్తులు. ఈ కుటుంబమును, అండాశయము యొక్క గదులయందు నొక్కొక గింజ కలదో, రెండేసి యో, పుష్పము లందాకర్షణ పత్రములు గలవో లేవో, కింజల్కములెన్ని గలవో, కాయ ఎండు కాయయో, కింజల్కములెన్ని గలవో కాయ ఎందు కాయయో లోపెంకు కండకాయమో, ఈ యంశములను బట్టి జాతులుగను తెగలుగను విభజించి యున్నారు.

ఆముదపు మొక్కలలోనే రెండు మూడు రకములు గలవు. కొన్ని మూడడుగులే బెరుగును కాని మరికొన్ని 6 -7 అడుగుల వరకు కూడ పెరుగును. అవి నల్ల గారిడి నేలలో గాని, ఇసుక నేలలో గాని బాగుగ పెరుగ నేరవు. నివి వరి మొదలగు వాని చేల గట్ల మీద గాని, ప్రత్యేకముగా వానినే పొలములలో గాని వేయుదురు. విత్తనములు చల్లిన పిదప రెండు మూడు వర్షములు కురిసిన చో మొక్కలు ఏపుగా బెరుగును 7 = 8 నెలలలోనే పంటకు వచ్చును. సాధారణ 381

ముగ కాయలు పగులబోవు నప్పుడు కోసెదరు. ఒకవేళఅవి పగుల కున్న యెడల వానిని గోసి, ఎండ బెట్టి రోకళ్ళతో గొట్టుదురు. లేదా రెండు ముడు దినములలో గోతిలో బాతి పెట్టిన పిదప వానిని నలుగ గొట్టుదురు.

దీని గింజలనుండి ఆముదమును నాల్గు విధముల దీయు చున్నారు. కొందరీ గింజల నొక సంచిలో బోసి రోకండ్ల వంటి వాని మధ్యన బెట్టి వానిని (మరల సహాయమున) దగ్గరగా నొక్కు చున్నారు. కొందరట్లు నొక్కుటకు బూర్వమొక రాత్రి గింజలను నీళ్ళలో నాన బెట్టెదరు. మరి కొందరు గింజలను వేయించి పొడుము గొట్టి ఈ పొడుమును నాలిగింతల నీళ్ళలో పోసు మరుగ బెట్టుదురు. ఆముదము నీళ్ళకంటె తేలిగగుట చే నీళ్ళమీద తేలుచుండును. అట్లు తేలు దానిని మరియొక పాత్రలోని కోడ్చుచుందురు. వేయించుటకు బదులు నీళ్ళతో గాచి ఎండబెట్టుట మరియొక పద్ధతి. ఈ పద్ధతులన్నియు మరలు లేని చోట్ల గలవు కాని యంత్ర సాహాయ్యమున ఆముదము చేయుటయే ముఖ్య పద్ధతి.

దాదాపు ఇరువది సంవత్సరముల వెనుక వరకు ఆముదమునమ్మకము ఎక్కువగానుండెడిది. అందరునుదీపము 382

లకు దీనినే ఉపయోగించెడి వారు. దీని దీపము ప్రకాశముగానే యుండును. కాని కిరసనాయలు దీని కంటె చౌక యగుట చేతను, ఆముదము చిక్కగా నుండి గాజు దీపముల కనుకూలింపక యుండుట చేతను దీనిని మానినాము. ఇప్పుడును గొందరు కొందరు కిరసనాయులు పొగ అనారోగ్యమని ఎంచి పడక గదులందు ఆముదపు దీపములనే పెట్టుకొను చున్నారు. చంటి పిల్లలకు పెట్టెడు ఆముదము వేయించిన గింజలనుండి గాని, ఉడకబెట్టిన గింజలనుండి గాని తీసిన చమురు. పచ్చి ఆముదము కంటె నిది ఎక్కువ ఆఅరోగ్యము. ఆముదము మంచి విరోచన కారి. మరలు త్రుప్పుపట్టకుండ దీనిని రాయు చుందురు.

ఆముదపు తెలకపిండిని పశువులకు నేయుదురు కాని అది అంత మంచిది కాదందురు. అది బాగుగ మండును గాన వంట చెరుగుకా నుపయోగించు చున్నారు. ఇది చెరుకు తోటలక్కు మిక్కిలి బలము చేయును.

ఆముదపు ఆకులు పశువులు తినిన పాలెక్కువనిచ్చును.

ఆముదము విత్తులు కూడ మన దేశమునుండి ఇతర దేశములకు చాల ఎగుమతి అగు చున్నవి. 383

కొండాముదము
-. కొండలమీద విరివిగా పెరుగును.

కాయలు ఆముదపు కాయలవలెనే యుండును. దీని గింజల చమురు విరేచనకారి.

ఉచ్చి ఉసిరిక
- సాగు చేయు మెట్టనేలలందు బెరుగును. పురుష పుష్పములకు తొడిమ లేదు. కాని స్త్రీ పుష్పములకు గలదు. ఆకులు, పువ్వులు కాయలు కూడ మూత్ర వ్యాధులందౌషధములుగా నుపయోగించును. ఆకులను మజ్జిగలో నాన వేసి దీనితో శరీరము రుద్దులినిన యెడల చిడుముపోవును.

నేలసిరియు సాగుచేయుచోట్లనే బెరుగును. ఔషధ ములందు దీని వేళ్ళు ఉపయోగపడును. తెల్లఉసిరక నేల యుసిరిక వలె నుండును. దీని ఆడు పువ్వులలో కొన్ని గొడ్డు పువ్వులే గాని కాయలుగాయవు.

ఎర్ర ఉసిరక కొమ్మలు ఎర్రగా నుండును. దీనిని పశువులుతినును.

రవసల బర్రకాడ
- సముద్ర తీరములనుండును. సంవత్సరము పొడవున పుష్పించును. కొమ్మల పై భాగమున 384
స్త్రీ పుష్పములు
-. అడుగుభాగమున పురుష పుష్పములు గలవు.
నేలపురుగుడు
- ఒక తీగ. కాలువల వారలను దొంకల మీదను నుండును. దీని పువ్వులు తెల్లగానుండును.
ఎర్రపురుగుడు
- పెక్కుచోట్ల గలదు. ఇది పెద్దమొక్క. దీని పండ్లెర్రగా నుండును.
పెద్ద ఉసిరి
-. రాచఉసిరియు, ఆడవులంనును తోటలందును పెరుగుచున్నవి. పెద్దయుసిరియన్నను మనకు గౌరవము గలదు. తోటలలో నొక మొక్క యుండినా, తోట పావనమైనట్లు భావింతుము. క్షీరాబ్ధి ద్వాదశినాడు దీని కొమ్మ నొక దానిని తెచ్చి పూజ చేతుము. పెద్ద ఉసిరి కాయలతో పచ్చడి పెట్టి నిలువ యుంచుదుము. రాచ యుసిరి కాయల తోడను పచ్చడి పులూ చేసి కొందుము. రాచ ఉసిరి ఆకులందొక విశేషము గలదు. సాధారణముగ అన్ని ఆకులు మొదలు నుండి పెరుగుచు త్వరలోనే పెద్దదై యిక పెరుగుట మానును. కాని రాచ యుసిరి ఆకులు (మిశ్రమ పత్రములు) చిట్టి ఆకు వేయుచునే యుండును. పెద్ద యుసిరి కాయలు, చెట్టు బెరడుల ఆకులును చర్మములు బాగు చేయుట యందు పనికి వచ్చును. 385

మూర్కొండ అన్ని చోట్ల పెరుగును. దాని పువ్వులగుత్తులందము గానుండుటచే తోటలందు పెంతురు.

జయపాల మొక్క ఆకునకు చెడు వాసన గలదు.

తెల్ల చెట్తు అడవులలోను తేమ చోట్ల నుండును. కొమ్మలు నరుగకానె తెల్లని పాలు గారును. ఈ పాలతో రబ్బరు చేయవచ్చును. కలప పెట్టెలు చేయుటకు పనికి వచ్చును. గాని పెట్టెలంత గట్టిగా నుండవు. దీని యందు త్వరగా నంటుకొని మండెడు గుణము గలదు కాన అగ్గిపుల్లలు చేయుటకు వీలుగా నుండును.

జముడు చెట్టు చెట్టంతయు ఆకుపచ్చగానే యుండును. ఆకులున్నట్లే గనుపింపవు గాని, దూర దూరముగ సన్నని ఆకులు గలవు. ఇవియు త్వరగా రాలిపోవును. ఆకులుండినయెడల ఆకుల ద్వార నీరు పోవుఛుండును గనుక నీరు సమృద్ధిగ దొరకని చోట్ల పెరుగు చెట్లకు ఆకులు చిన్నవిగా నుండుటయే.. లేకుండుటయో తటస్థించును. ఆకులు లేనప్పుడు, వాని పనియు కొమ్మలే చేయవలసి యుండును గనుక, చెట్ల కావశ్యకమై సాధరణముగా ఆకులందుండు ఆకుపచ్చని పదార్థము దీనికొమ్మల యందేగలగు చున్నది. దీని పాలనుండియు రబ్బరు చేయవచ్చును. కొన్ని చోట్ల కాకులను చంపుటకు దీ 386

నిపాలతోనన్నము కలిపి పెట్టుదురు. పుండ్లకు గాని కంటికి గాని ఈ పాలు దగిలినా బాధ పెట్టును.

బొమ్మజెముడు
-. సాధారణముగ కంచెలుగ పెరుగు నాగజెముడు కాదు. ఆకులు లేక, దళసరిగను వెడల్పుగను, ఆకు పచ్చగ నుండును కొమ్మలుండుటచే నాగ జెముడు వలెనే యుండును. కాని ఇవి రెండును వేరు వేరు కుటుంబముల లోనివి.
శిఖండి మొక్క కూడ, బొమ్మ జెముడువలెనే యుండును. పైరెండింటి పుష్పములందును దీని పుష్పముల యందొక్క విశేషము గలదు. మనకు చూడగనే పువ్వు వలె నగుపడు నది యొక పువ్వుగాదు. అది పువ్వుల గి8త్తి. దానిలోపల ఎన్నో పువ్వులు గలవు. ఈ పువ్వు నందలి రేకులు తామర గన్నేరు పువ్వులందలి రేకుల వంటివి కావు (ఇవి చేటికలు) ఇవియు రేకులు గానిచో నిక రేకులు లేవే. ఇది యెట్లు పూల గుత్తియనునని సందేహము కలుగ వచ్చును. వీనిలోపల ల్పెద్దు కింజల్కములును కొన్నిటి మధ్యనొక యండకోశమును గలదు. ఒక్కొక్క కింజల్కము, ఒక్కొక అండ కోశమే,. యెక్కొక పువ్వు. పుష్పమునకు ప్రధానాంగములు కింజల్కము అండ కోశములే గాని పత్రములు గావు. ఆముదపు వుప్పునందు (పుష్పకోశము) ఈ ముఖ్యాగములను గాపాడుటకు పత్రములు 387

ను కింజల్కములో, అండకోశమో మాత్రముగలదు. దీని యందీపత్రములు కూడ లేకుండ పోయెను. ఇట్టిది నిర్ధారణ చేయు టెట్లనిన కింజల్కములను చూచినను బోధకము కాగలదు. వీని కాడలు సరాసరిగ లేవు. మధ్యనొక కణపు గలదు. కణుపు దగ్గిరకు వానిని సులభముగ విరువ వచ్చును. కణుపు వరకును పుష్పమునకు ఉండెడు కాడ, పైది కింజల్కము యొక్క కాడ. ఈ కణపు వద్దనే పత్రములు పెరుగ వలసినది గాని పెరుగ లేదు ఈవిధముననే స్త్రీపుష్పము కూడ గలదు.

సిందూరము చెట్లు మనదేశములో పలుతావుల బెరుగు చున్నవి. వానికాయల నుండి రంగు తీయుదురు. కాయల మీద రోమముల వంటివి యున్నవి. వీని యందే రంగు పదార్థము గలదు. కాననివి రాలిపోవువరకు కాయలను చేతులతోడరాచెదరు. లేదా, ఒక సంచిలో బోసికొట్టెదరు. ఈ పొడుమును కాయ ముక్కలు లేకుండ బాగు చేసి రంగుగ నుపయోగింతురు. ఈ రంగు తరుచుగా బట్టుబట్టలకే వేయుచుందురు.

పెంటంగచెట్టు కొండలమీద పెద్దదిగా పెరుగును. దీని పువ్వులు ఆకు పచ్చగా నుండును. (అండాశయము) కాయలో రెండు గదులేగలవు. ఒక్కొక్క గదిలో రెండేసి గింజలుండును. 388

కొఱమాను చెట్టుకూడ కొండలమీద పెద్దగాపెరుగును. దీని పువ్వులందును బెంటింగి పువ్వులందువలె పచ్చని రేకులు గ్లవు. దీని కలప గట్టిగనే యుండును. ఆకులు పశువులు తినును.

డొంకిబూర కాలువల గట్లు మీద డొంకల మీద ప్రాకుచుండును.

నేపాళము పెక్కు చోట్ల చిన్నమొక్కగ పెరుగు చున్నది. దీని గింజల నుండి తీయు చమురు విరేచనములగుటకును డోకులు వచ్చుటకును, చర్మవ్యాధులకును పనికి వచ్చును. కాని గింజలనే తినినచో ప్రాణహానియు వాటిల్లును. కొన్ని చోట్ల దీని ఆకులను పట్టు పురుగులకు ఆహారముగ పెట్టుచున్నారు.


పనస కుటుంబము.


పనస చెట్లును చాలచోట్లనే పైరుచేయు చున్నారు.

ఆకులు ఒంటరిచేరిక, తొడిమ గలదు కణుపు పుచ్చములున్నవి. లఘు పత్రములు, అధశ్శిర అండాకారము. సమాచలము, విషమఖ పత్రము, పత్రము బిరుసుగా నుండును. శిరోదంతి ఆకులను త్రుంచిన పాలు గారును.