వృక్షశాస్త్రము/నారింజ కుటుంబము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బిలిబిలి:- చెట్టును దోటలందుబెంచు చున్నారు. దీని పండ్లు మందులలో నుపయోగపడుచున్నవి. పండ్ల రసము దీసి పంచ దారయు నీళ్ళునుగలిపి సన్నని మంట మీద జిక్క బడువరకు గాచి,ఇత్తురు. మూల శంకకును, రక్త విరేచనములకూ గుణమిచ్చును.

తామర్త:- చెట్టును దోటలందు బెంచు చున్నారు. వీని కింజల్కము లడుగున కలిసి యున్నవి. దీని కాయలు గూడ మూల శంఖకు గుణమిచ్చును.

పులిచింతాకు:- మొక్క నీటి వార నేల మీద బ్రాకుచుండును. ఆకులలో మూడేసి చిట్టి యాకులున్నవి. దీని యాకులు నీళ్ళతో గిలిపి కాచి, వాచి పొక్కు లెక్కిన చోట్లను బట్టు వేసిన యెడల దగ్గును. ఆకులతో గూర వండి తినిన అన్నహితవును గలుగును.

నీరుగన్నేరు:- మంచినీళ్ళ తీరమున బెరుగును. ఆకులకు దొడిమ లేదు; లఘుపత్రములు. పువ్వుల సరాళముగ నుండును; కాని చాల అందముగ నుండును.


నారింజ కుటుంబము.


నారింజ చెట్టు మన దేశములో పలు చోట్లనే పెరుగుచున్నవి. ఇది చిన్న చెట్టు. కొమ్మల మీదముండ్లున్నవి.

ఆకులు:- ఒంటరి చేరిక. లఘుపత్రమునలెనున్న మిశ్రమపత్రములు; పత్రము మొదట నొక అతుకు కలదు. అయతుకు వద్దకు దానిని సరిగా నిరువ వచ్చును. లఘు పత్రమైనచో నిట్లతుకుండదు. ఇది మిశ్రమ పత్రముగా బుట్టవలసినది. చిక్కుడాకులో మూడి చిట్టి యాకులున్నవి గదా. వీనిలో మధ్యగా నున్న చిట్టి యాకు నుంచి ప్రక్కనున్న రెండింటిని త్రుంపి వేయ నెట్లుండునో, అట్లే నారింజ ఆకున్నది. తొడిమ కిరుప్రక్కల వెడలుపైయున్నది. ఆవెడలుపై తొడిమరెక్కల వలెనున్న భాగము కూడ ఆకుల వలె బని చేయును. పత్రము సమగోళాకారము. సమాంచలము; దట్టముగా నున్నది. దానిలో గ్రంధి కణము లుండుటచే వాసన గలదు.

పుష్పమంజరి:- కణుపు సందులందుండి మధ్యారంభ మజరులు పుష్పములు సరాళము. సంపూర్ణము.

పుష్పకోశము:- సయుక్తము. గిన్నెవలెనున్నది. నీచము

దళవలయము:- అసంయుక్తము. 5 ఆకర్షణ పత్రములు. తెల్లగా నుండును. మంచి వాసన గలదు.

కింజల్కములు:- అసంఖ్యములు. కాడలు పొడుగు. పుప్పొడి తిత్తులు రెండు గదులు. కింజల్కముల మధ్య పల్లెరము గలదు.

అండకోశము:- అండాశయము ఉచ్చము. పలు గదులు గలవు కీలము ఒకటి లావుగ నున్నది. కీలాగ్రము గుండ్రము. పలము కండ కాయ.


ఈ కుటుంబములోని చెట్లమీద ముండ్లు గలవు. ఆకులు ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు కొన్నిటిలోఒక్కటియే చిట్టియాకుగలదు. ఆకులకు సువాసన గలదు. పుష్పములునరాళములు సంపూర్ణము. పుష్ప కోశము సంయుక్తము. ఆకర్షణ పత్రములైదు. కింజల్కములు పదియో అంత కంటే నెక్కువగానో యున్నవి. అండాశయమునందు గదులు చాలగలవు. ఫలము కండ కాయ.

నారింజచెట్లు:- ఉష్ణ ప్రదేశములలో బెరుగును. ఇవి మనదేశములో చాల చోట్లనే పెరుగు చున్నవి గాని వీనికంటె గమలాఫలపుచెట్లు నెక్కువ శ్రద్ధతో పైరు చేయుదురు. ఇవియు, బత్తాయి నారింజయు వేరు వేరు తెగలు. వీనిలో మనము తిను ముత్యములు కాయు ముదరనప్పుడు, అండాశయములో రోమములవలె గనుపట్టును.

కమలాఫలపు గింజలను మళ్ళలో నాటి మొక్కలు ఒకటి రెండడుగులు లెదుగ గానె తీసి దూరముగ పాతుదురు. ఏడెనిమిది సంవత్సరములు వచ్చిన తరువాత కాయలు కాయ నారంబించును. ఇవి నాగపూరు ప్రాంతముల సంవత్సరమునకు రెండు కాపులు గాయుచున్నవి.

బత్తాయి నారింజ:- చెట్లను నిట్లె పెంతురు. వీని పండ్లు మిగిలిన వాని కంటె చాల నారోగ్యము. నారింజలలో పండ్లచర్మములను ఔషదములలో వాడుదురు. ఈ గింజల పొడిని మూత్ర వ్యాధులు