వృక్షశాస్త్రము/మద్దిపాలు కుటుంబము
నాగగొలుగు:- చిన్నచెట్టు, పువ్వులు తెల్ల--- వాసనగాను నుండును.
మద్దిపాలు కుటుంబము.
ఈ కుటుంబములో గుల్మములు లేవు. గుబురు మొక్కలును జెట్లును మాత్రమె గలవు. వీని బెరడు చేదుగా నుండును. ఆకులు పెద్దవి. ఒంటరి చేరుక, కొన్నింటిలో లఘు పత్రములును గొన్నింటిలో బక్షపైఖరినున్న మిశ్రమ పత్రములును. 151
గలుగు చున్నవి. పువ్వులు సరాళము. పుష్పకోశమునకు 3...5 తమ్మెలు గలవు. అవి అల్లు కొనియైనను, తాకుచు నైననుండును. ఆకర్షణ పత్రములు 3...5 ఇవి యు మొగ్గలో బుష్పకోశపు తమ్మెలుండినట్లే యుండును. కింజల్కములు, ఆకర్షణ పత్రములన్ని గాని, అంతకు రెట్టింపుగాని యుండును. కొన్నిటిలో మాత్రము అసంఖ్యములుగా నున్నవి. కాడల కడుగున నొక పొలుసుండిన నుండును. పుప్పొడి తిత్తులు నిడివి చౌకపు నాకారము. అండాశయములో నండము ఒకటియే యుండును.
మద్ది పాలు చెట్టు బెరడును ఔషధములలో వాడుదురు. ఈ చెట్లనుండి గుగ్గిలము వంటి పదార్థమొకటి వచ్చును. బెరడున కంటె నిదియే మంచి పని చేయును. ఇది నీళ్ళలో గరుగదు. కొన్ని ద్రావకములలో గలిపి మూత్ర వ్యాధులు, శెగ దగ్గు,. జిగట విరేచనములు మొదలగు జబ్బులకిత్తురు.
- గార చెట్టు
- - రాతి నేలలందు బెరుగును. దీని పండు గుంజు కాకిమర్రిపండు వలెనే చర్మ వ్యాధులకు బని చేయును.
మైసాక్షి కుటుంబము.
ఈ కుటుంబమునందు జెట్లును, గుబురు మొక్కలును గలవు. ఆకులు, ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు 152
చిట్టి యాకులు గలసి యైనను, విషమభిన్నముగ బక్షపైఖరినైన నుండును. పువ్వులు చిన్నవి. సరాళము మిధున పుష్పములు ఏక లింగ పుష్పములు కూడ గలవు. పుష్ప కోశమునకు 3...6 తమ్మెలుండును. ఇవి మొగ్గలో నల్లుకొని యైనను ఒక దానికొకటి తాకుచునైన నుండును. ఆకర్షణపత్రములు 3...6 గలవు. కొన్నిటిలో మాత్రమడుగునందు కలసి యున్నవి. కింజల్కములు ఆకర్షణ పత్రములన్నియో అంతకు రెండు రెట్లో యుండును. కొన్నింటిలో నవియన్నియు సమముగా లేవు. అండాశయములో 2..5 గదులున్నవి. సాధారణముగ రెండేసి అండములుండును. స్థంభ సంయోగము. ఫలము ఎండు కాయ, పగులదు.
మైసాక్షి చెట్లు హిందూ స్థానమునందెక్కువ బెరుగు చున్నవి. శీతాకాలమందు వానిమీద నాట్లు పెట్టిన యెడల జిగురు వంటి పదార్థము వచ్చును. అది పరి సుభ్రముగా నున్న యెడల గొంచము పచ్చగా నుండును. దీని నౌషధములలో వాడుదురు. ఇది మిక్కిలి చేదుగానుండును గాన లోపలకు పుచ్చుకొనలేరు. కడుపు ఉబ్బుట ఎక్కిళ్ళు మొదలగు వానికి దేహముపైన రాతురు. అది శరీరమునుగట్టిగా నంటు కొనును. 153
- బాలింత బొలము
- - చెట్లు మన దేశములో నంతగా లేవు. ఈచెట్లనుండియు జిగురువంటిపదార్థము వచ్చును. దీనిని ఔషధములలో వాడుదురు.
- నల్ల రోజను
- - చెట్లు పడమటికనుమలదగ్గర నెక్కువగా బెరుగు చున్నవి. వీని నుండి వచ్చు జిగురు వంటి పదార్థముతో దగ్గు మొదలగు వానికి, గుండెల మీద పట్టు వేయుదురు.
- ఫరంగి సాంబ్రాణి
- - చెట్లు కొందల మీద బెరుగును. దీని నుండియు జిగురు వచ్చును. దీనిని పొడుము గొట్టి పంచదార కలపి నీళ్ళలో వేసి పుచ్చుకొన వచ్చును. ఆజీర్ణ విరేచనము మొదలగు నవి కట్టును. ఈ పొడిని మంచి నూనెలో నైనను, గసగసాల నూనెలో నైనను, గలిపి కాచి, వడగట్టి, తలకు రాచు కొనుచున్న యెడల దలవెండ్రుకలు పెరుగును.
- అండుగపిసను
- - చెట్టును పై దానివలెనే యుండును. ఈ పదార్థమున కొక విధమగు సువాసనగలదు. దీనిని గుగ్గిలము సాంబ్రాణి పొగ వేసినట్లు పొగ వేయుదురు. ఈ చెట్టు కలుప గట్టిగానె యుండును. దీనితో తరుచుగా తేయాకు పెట్టుటకు పెట్టెలు చేయుదురు. వంట చెరుగుగ కూడ బాగుండును.
వేప కుటుంబము.
వేప చెట్టు మనదేశమందంతటను బెరుగుచున్నది.
ఆకులు:- ఒంటరి చేరిక, కణుపు పుచ్ఛములు లేవు. మిశ్రమ పత్రములు, విషమ భిన్నము, చిట్టి యాకులు బల్లెపు నాకారము, మొదలు వంకరగా నుండును. కొన వాలము గలదు. అందున రంపపు పండ్లున్నవి. రెండు వైపుల సన్నగ నుండును.
పుష్పమంజరి:- కణుపు సందుల నుండి రెమ గెలలు పువ్వులు చిన్నవి.
పుష్పకోశము:- సంయుక్తము 5 తమ్మెలు గలవు. తమ్మెకొన గుండ్రముగా నుండును. నీచము.
దళవలయము:- ఆకర్షణ పత్రములు 5., నిడివి చౌకపు నాకారము.
కింజల్కములు: కాడలన్నియు గలిసి యొక గొట్టము వలె నేర్పడి యున్నవి. ఈ గొట్టము లోపలి వైపున పుప్పొడి తిత్తులున్నవి.
అండకోశము: అండాశయము, ఉచ్చము. 3 గదులు. అండాశయము చుట్టు బళ్ళెరము గలదు. కీలము ఒకటి, సన్నముగానుండును. ఫలము లో పెంకు కాయ.
ఈకుటుంబములో విస్తారము వృక్షములే గలవు. ఆకులకు గణుపు పుచ్ఛము లుండును. ఒంటరి చేరిక, సాధారణముగ పక్ష వైఖరిగ నుండును. చిట్టి యాకుల మొదలు