వృక్షశాస్త్రము/బిలిబిలికాయ కుటుంబము
సరివేతుము. ఇవియే దానికిగావలసినది. కాయ అచ్చటబడి మొలచును. ఈ రీతినే అవి వ్యాపించును. ఉత్తిరేణి కాయలు మన బట్టలకును, గొర్రెలు, మొదలగు వాని శరీరమునకు నంటు కొని వ్యాపించు నట్లు నివియు వ్యాపించుచున్నవి.
ఎండుకాయలకషాయమును, పచ్చియాకుల రసమను మూత్రవిసర్జనమప్పుడు కలుగు మంట శుక్ల నష్ణము మొదలగు బాధల నివారించుటకు వాడుదురు.
బిలిబిలికాయ కుటుంబము.
ఈ కుటుంబములో జాల భాగమన్నియు గుల్మములే. ఆకులకు కణువు వుచ్చములుండును. ఒంటరిచేరిక, లఘుపత్రములును, మిశ్రమపత్రములును గూడ గలవు. వాని పై రోమ ముండును. పుష్పములు సాధరణముగ సరాళముగానే యుండును. పుష్పమునందు బ్రతి వలయము నందును నైదేసి కలవు. అయిదు రక్షకపత్రములు అయిదు ఆకర్షణపత్రములు, వలయమున కైదు కింజల్కముల చొప్పున రెండు వరుసలూ అండాశయము నందు నైదు గదులు అయిదు కీలాములును గలవు. కాయ ఎండుటయు పెక్కువానియండ విచ్చెడుకాయ. బిలిబిలి:- చెట్టును దోటలందుబెంచు చున్నారు. దీని పండ్లు మందులలో నుపయోగపడుచున్నవి. పండ్ల రసము దీసి పంచ దారయు నీళ్ళునుగలిపి సన్నని మంట మీద జిక్క బడువరకు గాచి,ఇత్తురు. మూల శంకకును, రక్త విరేచనములకూ గుణమిచ్చును.
తామర్త:- చెట్టును దోటలందు బెంచు చున్నారు. వీని కింజల్కము లడుగున కలిసి యున్నవి. దీని కాయలు గూడ మూల శంఖకు గుణమిచ్చును.
పులిచింతాకు:- మొక్క నీటి వార నేల మీద బ్రాకుచుండును. ఆకులలో మూడేసి చిట్టి యాకులున్నవి. దీని యాకులు నీళ్ళతో గిలిపి కాచి, వాచి పొక్కు లెక్కిన చోట్లను బట్టు వేసిన యెడల దగ్గును. ఆకులతో గూర వండి తినిన అన్నహితవును గలుగును.
నీరుగన్నేరు:- మంచినీళ్ళ తీరమున బెరుగును. ఆకులకు దొడిమ లేదు; లఘుపత్రములు. పువ్వుల సరాళముగ నుండును; కాని చాల అందముగ నుండును.
నారింజ కుటుంబము.
నారింజ చెట్టు మన దేశములో పలు చోట్లనే పెరుగుచున్నవి. ఇది చిన్న చెట్టు. కొమ్మల మీదముండ్లున్నవి.
ఆకులు:- ఒంటరి చేరిక. లఘుపత్రమునలెనున్న మిశ్రమపత్రములు;