వర్ణాశ్రమ ధర్మములు/భూమిక
స్వరూపం
వర్ణాశ్రమ ధర్మములు
1. భూమిక
1. లోకధర్మ వ్యవస్థాపకుండును, జన్మరహితుండును నగు నారాయణునకు బ్రణమిల్లి, ఆత్మాంశమున దక్షుని కొమార్తెయగు మూర్తియందు ధర్మునకు నరుతో గూడ నవతరించి లోకక్షేమార్ధ మిప్పటికిని బదరికాశ్రమమున దపము సేయుచున్న నారాయణుని వలన వినిన సనాతనధర్మమును నారదుడు ధర్మరాజునకు జెప్పెను.