వరాహపురాణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

వరాహపురాణము

ప్రథమాశ్వాసము

అవతారిక

ఇష్టదేవతాస్తుతి

శా.

శ్రీకాంతాకుచహారకౌస్తుభ[1] మణిశ్రీ లాత్మవక్షః[2]స్థల
వ్యాకీర్ణత్వము [3]నొంది [4]చూపఱుకు నుద్యద్గంధకాశ్మీరచ
ర్చాకారంబు భజింప మించిన సరోజాక్షుండు, [5]రక్షించు, ధై
ర్యాకల్పుం గొలిపాక సర్వవిభు నెఱ్ఱామాత్యచూడామణిన్.

1


ఉ.

 శైత్యవిశేషశైలమున సంభవమందిన పాలు, జన్మసాం
గత్యము లేని పాలు, గల కాయమునన్ జగదేకచిత్రదాం
పత్యముఁ దాల్చు శంభుఁడు, కృపాయుతుఁడై కొలిపాక యెఱ్ఱయా
మాత్యున కిచ్చు [6]వాంఛితసమంచితసౌఖ్యచిరాయురున్నతుల్.

2


ఉ.

అంబుజనాభునాభిసముదంచితతామరసాలవాలమ
ధ్యంబున నంకురించి, నిగమాయతశాఖము, శారదాలతా
లంబనమున్, జగత్త్రయఫలంబునునైన విరించి కల్పభూ
జం, బొసఁగుం గృతీశుఁ డగు - సర్వయ యెఱ్ఱయ కీప్సితార్థముల్.

3


శా.

మాణిక్యాంగుళిముద్రికా[7]నఖరుచుల్ మార్మాటికిం బర్వఁగా,
వీణాదండము చిత్రవర్ణముగ, నావిర్భూతనాదామృత
శ్రేణీపూరితరాగసాగరమునం గ్రీడించు వాగ్దేవి, క
ల్యాణశ్రీయుతుఁ జేయు సర్వవిభు నెఱ్ఱామాత్యదేవేంద్రునిన్.

4


సీ.

గండ [8]మండలగళద్ఘన దానధారల । నిందిందిరములకు విందుచేసి,
శేఖరీకృతమౌళిశీతాంశుచంద్రికా । రసమున మదచకోరములఁ [9]దనిపి,
శ్రవణచామరసమీరమునఁ గండలిరాజ । యజ్ఞసూత్రమున కాహార మొసఁగి,
కరపుష్కరాగ్రనిర్గతవారికణములఁ । జాతకశ్రేణి కుత్సవ మొనర్చి,


తే.

భూరివిఘ్నాద్రి[10]కూట దంభోళి యనఁగ । హితజనస్వాంతపంకజహేళి యనఁగ
నలరు గణపతి, యిష్టార్థముల నొసుగు । నెలమిఁ గొలిపాక యెఱ్ఱమంత్రీశ్వరునకు.

5

పూర్వకవీంద్ర పురస్కృతి

సీ.

[11]భారత విరచనోపాయు సౌత్యవతేయు, | లోకసన్నుతుని వల్మీకసుతుని,
శుభకరవాగ్విలాసునిఁ గాళిదాసుని, | సత్కావ్యతోషితస్థాణు బాణుఁ,
గమలాప్తవరశుభాకారు మయూరునిఁ, | గవితాకళాచమ - త్కారుఁ [12]జోరు,
భూరి[13]విద్వన్మౌళి హీరు [14]శ్రీ హీరుని, | సత్కవీశ్వరకృతశ్లాఘు మాఘు,


తే.

నర[15]నుతాంధ్రవచోధుర్యు [16]నన్నపార్యు, | సూక్తిమణిరాజిఁ దిక్కన సోమయాజి,
నుతి సురాచార్యు నెఱ్ఱనామాత్యవర్యుఁ | బ్రౌఢిఁ దలఁచెద సాహిత్యరూఢి మెఱయ.

6


కుకవి తిరస్కృతి

మ.

కవి[17]రాజార్జిత[18]కావ్యకోశగృహరంగద్వాక్యమాణిక్యముల్
సవడిన్ మ్రుచ్చిలి పోఁకవక్కకయినం జట్టీయఁగా, [19]హీన మా
నవగేహంబుల [20]సందిగ్రంతలనె [21]మందవ్యాప్తి వర్తించు దు
ష్కవిచోరావళి నిల్వనేర్చునె సుధీచంద్రాతపస్ఫూర్తికిన్?

7


వ.

అని యివ్విధంబున నిష్టదేవతాస్మరణంబును, బురాతనకవీశ్వరానుసరణంబును,
గుకవి నిరాకరణంబునుం జేసి, శబ్దార్థభావ[22]రసాలంకారబంధంబుగా నొక్క ప్రబంధం
బంధ్రభాషాభవ్యంబగు [23]వచనకావ్యంబుగా రచియింపం బూనిన సమయంబున.

8


కంబముమెట్టు నగరీప్రశంస[24]

సీ.

వరుణదిగ్వీథి నే పురమునఁ బ్రవహించెఁ | [25]బావనసలిలసంపన్న[26]మున్న,
దీపించె నే పురి గోపికామానసా | స్పదవర్తి చెన్నగోపాలమూర్తి,
భాసిల్లె నే వీటఁ బ్రహ్లాద భక్తి వి | శ్రాణి కొండ నృసింహ శార్ఙ్గపాణి,
యే పట్టణంబునఁ జూపట్టె హితపద్మ | హేళి [27]వీరేశ బాలేందుమౌళి,


తే.

చతుర చతురంగబల రత్నసౌధ యూథ | సాల గోపుర తోరణ సకలవర్ణ
పౌరవారాంగనాజనప్రముఖ[28]వస్తు | మేదురం బట్టి కంబము మెట్టు పురము.

9

తే.

ఆంధ్రమండల గిరిదుర్గహారలతకు, విమలనాయకరత్నభావము భజించి
యున్నతోన్నతశైలసంపన్న మగుచు, సకలపుటభేదనముల నెన్నికకు [29]నెక్కె.

10


కొలిపాక యెఱ్ఱయ ప్రాభవము

వ.

ఇవ్విధంబునం జూపట్టుచు, విద్వేషిహృదయఘట్టనంబగు నమ్మహాపట్టనంబున
స్థలకరణికాగ్రగణ్యుండై.

11


సీ.

హరినీలనిభదేహనిరుపమచ్ఛాయల యమునాసహస్రంబు లవతరింప
వివిధరాగాస్పద[30]వేణునాదంబున ఘనసుధాజలధి లక్షలు జనింప
లావణ్యపూర్ణలీలాకటాక్షంబుల నంగసంభవకోటు లంకురింప
మోహనకల్యాణముఖవిలాసంబునఁ జంద్రార్బుదంబులు సంభవింపఁ


తే.

గల్పతరుమూలమున గోపికాయుతముగ, మించి క్రీడించు కంబముమెట్టువిభుఁడు
మదనగోపాలుఁ డిలువేల్పు మహిమఁ బ్రోవ, నెలమి విలసిల్లెఁ గొలిపాక యెఱ్ఱశౌరి.

12


క.

సుతనిధి పరిణయదేవా, యతనతటాకోపవనము లనఁదగు షట్సం
తతులు సమకూరె [31]నా కొక, కృతి యందుట యొప్పు ననుచుఁ గృతనిశ్చయుఁడై.

13


చ.

సుతులు హితుల్ పురోహితులు శూరులు ధీరు లుదారులుం గళా
చతురులు మంత్రిశేఖరులు జాణలు గాణలు వారభామినీ
తీవ్రతతులు చేరి కొల్వఁగ సభాభవనాంతరరత్నపీఠికా
స్థితుఁడయి, విష్ణుకీర్తన విశిష్టపురాణము లాలకింపుచున్.

14


క.

శ్రేష్ఠ శ్రీవిష్ణుకథా, [32]గోష్ఠిన్ మధురామృతంబు గ్రోలుచుఁ గవితా
నిష్ఠాద్వితీయదివిజ, [33]జ్యేష్ఠుఁడనగు నన్నుఁ బిలిచి యిట్లని పలికెన్.

15


ఎల్లయ, హరిభట్టు శేముషీవైభవము నభినందించుట

మ.

అమృతప్రాయ[34]వచోవిశేషరచనాహంభావపుంభావవా
గ్రమణీమూర్తివి, వేదశాస్త్రవివిధగ్రంథార్థనిర్ణీతి, వే
కముఖబ్రహ్మవు యాజుషప్రకటశాఖాధర్మధుర్యుండ, వ
ర్యమతేజుండవు, [35]రాఘవార్యహరిభట్టా! సత్కవిగ్రామణీ!

16

తే.

అష్టఘంటావధాన విశిష్టబిరుద! | నీవు రచియింపఁ దలఁచిన నిరుపమార్థ
రమ్యమగు నీ వరాహపురాణకావ్య | మంకితము సేయు నాపేర [36]నభిమతముగ.

17


వ.

అని సవినయంబుగాఁ గర్పూరతాంబూల[37]లాలితాంబరాభరణాదు లొసంగిన
నంగీకరించి, యేతత్కావ్యకామినీకర్ణపూరం బగు నయ్యమాత్యశిరోమణి వంశావతారం
బభివర్ణించెద. అది యెట్టిదనిన.

18


కృతిపతి యెఱ్ఱామాత్యుని వంశప్రశస్తి

శా.

వేధః పుత్ర మరీచిసంయమికి నావిర్భూతుఁడై, దైత్యభి
ద్బోధానందసమేతుఁడై, సకలజంతువ్రాతకూటస్థుఁడై,
మేధానిశ్చలుఁడై, జగత్త్రయమునన్ మించెం, దపోయజ్ఞదీ
క్షాధన్యుండగు కశ్యపాఖ్యముని, సాక్షాత్పద్మజుండో! యనన్.

19


ఉ.

ఆమునినాథు గోత్రకలశాంబుధిలోపల నెఱ్ఱమంత్రి పూ
ర్ణామృతధాముఁ డుద్భవము [38]నందె; [39]వినిర్మలకీర్తిచంద్రికా
స్తోమము ధాత్రిఁ బర్వఁగ, బుధుల్ గొనియాడఁగ, శత్రుపద్మముల్
మోములు వంప, బాంధవసముద్రము నిచ్చలు నుబ్బుచుండఁగన్.

20


క.

ఆ సచివశేఖరుఁడు గుణ | భాసురయగు మల్లమాంబఁ బరిణయమై, యు
ల్లాసమునఁ గాంచె బుద్ధి | న్వాసవగురుఁ బోల్పఁదగిన నల్వురు సుతులన్.

21


వ.

వారెవ్వరనిన,

22


సీ.

పన్నగేంద్రశయాన[40]పన్నీరజధ్యాన | సన్నద్ధనిజబుద్ధి చెన్నవిభుఁడు,
కాంతాజనస్వాంతసంతతవిశ్రాంత | కంతుసౌందర్యుఁ డనంతమంత్రి,
పార్వతీశాఖర్వ సర్వజ్ఞతాగర్వ | సర్వస్వనిర్వాహి సర్వఘనుఁడు,
హేమాచలోత్సంగ - ధామావళీరంగ | సీమా[41]నటత్కీర్తి రామశౌరి


తే.

యనఁగ, విఖ్యాతులై మించి రవధికుధర | చరమపరమాంధకారసంహరణకరణ
తరణి బింబాయమానప్రతాపయుతులు , | [42]మఘవపురకామినీగీయమానయశులు.

23


క.

వారల లోపల నగ్రజుఁ | డై రాజిలు చెన్న సైనికాగ్రణి, యక్కాం
బారమణియందుఁ గనియె మ | హారసికుల, బసవవిభు ననంతామాత్యున్.

24

చ.

సురుచిరలీలఁ జెన్నవిభు సోదరుఁడైన యనంతమంత్రిశే
ఖరుఁడు, దిశాంగనాకబరికాతతులన్ నిజకీర్తిమంజరీ
పరిమళభాసురంబులుగ భక్తి నొనర్చుచు, [43]గంగమాంబికం
బరిణయమయ్యె, శంకరుఁడు పార్వతిఁ బోలెఁ బ్రమోదమానుఁడై.

25


వ.

తదనుసంభవుండు.

26


శా.

నించెం గీర్తులు పద్మజాండమున, మన్నించెం గవిశ్రేణి, నా
లించెన్ విష్ణుపురాణసంహితలఁ, బాలించెం ధరాకాంత, నీ
క్షించెన్ లోపల నంబుజోదరుని, రక్షించెన్ సుధీబంధులన్,
మించెన్ మంత్రుల సర్వయప్రభుఁడు, నిర్మించెం బ్రతాపార్కునిన్.

27


శా.

రంగచ్చక్రపయోధరన్, గమలవక్త్రన్, బంధుజీవాధరన్,
శృంగారోరురసాన్వితన్, గువలయాక్షిన్, జంచరీకాలకన్,
గంగాంబన్ వరియించె నా సచివ లోకస్వామి, వారాశి ఠే
వం, గల్యాణగుణావళీమణిగణవ్యాసంగగంభీరుఁడై.

28


క.

ఆ రమణీ రమణులకుఁ గు | మారులు జనియించి రనుపమానులు [44]ఘనులై
ధారుణిఁ బొడమిన సౌక్షా | [45]త్సారసభవ శివ ఫణీంద్రశయను లనంగన్.

29


సీ.

విదితప్రసన్నతాసదనంబు వదనంబు, | కమలబుద్ధివిధాయి కన్నుదోయి,
విమలసూనృతభూషణములు భాషణములు, | రామచంద్రపదాను[46]రక్తి భక్తి,
[47]సంతతదానప్ర - శస్తముల్ హస్తముల్, | [48]చింతితసకలార్థసిద్ధి బుద్ధి,
యమితవేదార్థపూర్ణములు కర్ణమ్ములు, | హరికథా[49]వర్ణనాభ్యసన రసన


తే.

గాఁగ, విలసిల్లె బలి శిబి కర్ణ ఖచర | [50]కామధుగ్ధేనుసురరత్నకల్పభూజ
దానవిఖ్యాతి విజయా[51]పదానజనిత | చిరయశో[52]హారి, సర్వయ చెన్నశౌరి.

30

సీ.

చుట్టంబు పూర్ణిమశోభితయామినీ | [53]ధవచంద్రికాధాళధళ్యమునకుఁ,
జెలికత్తె శీతాంశుశేఖర ప్రథమాంగ | జాహ్నవీజలచాకచక్యమునకు,
సైదోడు నీహారశైలగండోపలా | నీకనిర్మలనైగనిగ్యమునకు,
జనని దుగ్ధాంబోధిఘనవీచికాఫేన | తరళతా[54]భరధాగధగ్యమునకు,
తే. హారహీరపటీరనీహారతార | తారకాకాశవాహినీపూరరుచిర
రుచి రమాకర్షణ[55]క్రియాప్రచుర మగుచు | [56]వెలయుఁ గొలిపాక చెన్నని విమలకీర్తి.

31


శా.

శ్రీనిత్యుండగు చెన్నమంత్రి సరిగాఁ జింతింతుఁ, దేజోనయ
జ్ఞానైశ్వర్యరుచిస్వరూపజనరక్షాపాత్రదానంబులన్;
భానున్, భార్గవు, భారతీరమణునిన్, భర్మాద్రిబాణాసనున్,
భానీకప్రభు, భావజున్, భరతునిన్, భాస్వత్తనూజాతునిన్.

32


ఉ.

చిత్రచరిత్రుఁ డాసచివశేఖరుసోదరుఁ డెఱ్ఱమంత్రి సౌ
భ్రాత్రధురంధరుండు, హరిభక్తిసమేతుఁడు, మాదమాంబ, లో
కత్రయవర్ణనీయగుణ, కాంతఁ, బతివ్రత, నన్నమంత్రిరా
ట్పుత్రికఁ, బెండ్లియాడె, సిరిఁ బొల్పుగఁ గైకొను శౌరికైవడిన్.

33


శా.

ఆసాధ్వీమణియందు నెఱ్ఱవిభుఁ డార్యానందసంధాయక
శ్రీసంపన్నుల, భూసురోత్తమకృతాశీర్వాదసంవర్ధితో
ల్లాసోత్సాహచిరాయురు న్నతులఁగల్యాణాత్ములం గాంచె, వి
ద్యాసంపూర్ణుల, వేదమంత్రిపు ననంతామాత్యకందర్పునిన్.

34


వ.

తదనుజుండు,

35


ఉ.

ఒప్పులకుప్ప, దానఖచరోత్తముఁ, డాహవసవ్యసాచి, దు
గ్ధాప్పతికన్యకాధవపదాంబురుహభ్రమరుండు, బుద్ధిచే
నప్పరమేష్టిఁ బోలిన మహాత్ముఁడు, సర్వయమంత్రి పుత్రుఁ డా
తిప్పన, ధీరతం బసిడి [57]తిప్పన మించె ధరాతలంబునన్.

36


ఉ.

వీరలపిన్నతండ్రి ధర విశ్రుతిఁ గాంచిన రామమంత్రి మం
దారుఁడు, చంద్రచందనసుధాకరకుందమరాళమల్లికా
హారపటీరహీరసముదంచితకీర్తియుతుండు, వీరమాం
బారమణీమణిం బరమభాగ్యవతిన్ వరియించెఁ గూరిమిన్.

37

ఆ.

ఆ వధూటియందు నా మంత్రివరునకు | నుదయమంది రర్థి సదయమతులు
హేమశైలధీరుఁ డెల్లమంత్రీంద్రుఁడు | పంచబాణనిభుఁడు పంచవిభుఁడు.

38


వ.

ఇవ్విధంబున లోకోత్తరగుణరత్నోదారంబగు కాశ్యపగోత్రపారావారంబునం
గొలిపాక సర్వయప్రభు గంగాంబికాగర్భశుక్తిమౌక్తికంబు లగు తనూభవులు మువ్వుర
లోనం, గృతినాయకుండును [58]రేఖావిజితపంచసాయకుండును నగు నెఱ్ఱయ మంత్రిసార్వ
భౌముని త్రిభువనపవిత్రంబగు చరిత్రం బెట్టిదనిన.

39


సీ.

తన కీర్తికామినిం గని మునుల్ వాగ్భవ | మంత్రంబు చెప్పి నమస్కరింపఁ,
దన మనోహరరూపదర్పక[59]కళఁ జూచి | యువతులు మోహాబ్ధి నోలలాడఁ,
దన నీతిసౌష్ఠవంబునకు శాత్రవలక్ష్మి | యభిసారికాలీల నభిగమింపఁ,
దన యీగి కులికి యాచనకదారిద్ర్యంబు | లరిరాజమంత్రుల నాశ్రయింప


తే.

వెలసె, హరిదంతవేదండవితతగండ | మండలస్రావిమదపానమత్తమధుప
మధురసంగీతజేగీయమానయశుఁడుఁ, | హేమగిరిధీరుఁ, డెఱ్ఱమంత్రీశ్వరుండు.

40


మ.

నవతెంతుం గొలిపాక యెఱ్ఱనికిఁ దేజశ్శౌర్యగాంభీర్యస
త్త్వవిభుత్వోక్తి ధనుర్జయోన్నతి [60]శమత్యాగక్రియాకాంతులన్;
సవితన్, సాత్యకి, సింధు, సీరి, సురశాస్తన్, [61]సూతు, సేనాని, సైం
ధవనిర్భేదను, సోము, సౌమ్యఘను, సంతానంబు, సస్యాధిపున్ఇ.[62]

41


సీ.

[63]భుజశౌర్యవైభవసుజనరక్షణముల | నరహరి విఖ్యాతిఁ బరిణమించి,
చతురభాషాస్వామిహిత[64]భూతి గరిమల | ఫణినాయకాంగదప్రౌఢిఁ దాల్చి,
సమధికసత్త్వతేజశ్శుద్ధిమహిమలఁ | బవనమిత్రస్ఫూర్తిఁ బరిఢవించి,
హరికీర్తనజ్ఞానవర[65]కాంతిగుణముల | సురమునిజనకవిశ్రుతి వహించి


తే.

వర్ణనకు నెక్కె, భారతీకర్ణపూర | సారకహ్లారకర్ణికాస్రావిమధుర
మధురసామృతమాధురీమందిరాయ | మాణవాగ్జృంభణుం డెఱ్ఱమంత్రి[66]3వరుఁడు.

42

మ.

దరహాసంబులు దిగ్వధూతతికి, ముక్తాహారముల్ వాణికిన్,
శరదంబోధరముల్ నభంబునకు, రాజత్కౌముదీజాలముల్
పరిపూర్ణేందున, కూర్మిపంక్తులు పయఃపాథోధికిన్ వైభవా
మరనాథుండగు నెఱ్ఱమంత్రి[67]వరశుంభత్కీర్తిధావళ్యముల్.

43


షష్ఠ్యంతములు

క.

ఈదృశసుగుణాకల్పున, | కాది[68]మభాగవతహితసమంచిత[69]చర్యా
హ్లాదితఫణితల్పునకును, | సాదరజల్పునకు, సత్యసంకల్పునకున్.

44


క.

తిరుమల నారాయణగురు | చరణాబ్జధ్యానమధుర[70]సస్థిరమతిష
ట్చరణునకు, ఫలితకృష్ణ | స్మరణునకు, నరాతిమంత్రిమదహరణునకున్.

45


క.

శ్రీ[71]మహితస్తంభాచల | నామసముద్దామపట్టణస్థితగణక
గ్రామణి , బంధుహితర | క్షామణికిఁ, గవీంద్రపంకజనభోమణికిన్.

46


క.

రాధాధవమురళీరవ | వేధస్తరుణీకరాబ్జవీణావిలస
[72]ద్గాథామృతసదృశవచో | మాధుర్యున, [73]కమితజయరమాధుర్యునకున్.

47


క.

కుటిలరిపుసచివ[74]కోటీ | నిటలస్థలఘుసృణతిలకనిరుపమరేఖా
పటలయుతచరణ[75]నఖునకుఁ, | జటులవచోరచనసుకవిజనసుముఖునకున్.

48


క.

[76]ఉద్యతతాపనిర్జిత | మధ్యందినచండభానుమండలశిఖికిన్,
సాధ్యేతరభయదాహవ | మధ్యభుజాశౌర్యశాతమఖికిన్, సుఖికిన్.

49


క.

తరుణీజనహృదయాంబుజ | పరిచిత[77]శైత్యునకు, దానపాండిత్యునకున్,
బరమోత్సవసంపాదిత | హరిహితకృత్యునకు, నెఱ్ఱ నామాత్యునకున్.

50


తే.

అచలితాభ్యుదయపరంపరాభివృద్ధి, | గా సుధారసమధురోక్తి గౌరవమునఁ
గణఁగి, యేఁజేయు నిమ్మహాగ్రంథము నకు,| [78]నేధమానకథాసూత్ర మెట్టి దనిన:

51

కథాప్రారంభము:

రోమశమున్యాశ్రమమునకు మార్కండేయముని సమాగమము

సీ.

[79]హరిపదాంబుజభక్తిపరుఁడు మార్కండేయ | మునినాయకుం డొక్కదినమునందు,
శాండిల్య పులహ విశ్వామిత్ర గౌతమ | దేవల కౌండిన్య దేవరాత
కశ్యపాత్రి వశిష్ఠ కణ్వాది మునులతో | గౌరీశ్వరుని పదాంభోరుహములు
సేవింపఁదలఁచి, నిజావాసనిర్గతుం | డై, పుణ్యదేశంబు లాశ్రమములు


తే.

నదులుఁ గాసారములుఁ గాననములు గిరులుఁ | గడచి, యెడనెడ సన్మునిగణ మొనర్చు
నాతిథేయాది విహితకృత్యములచేత | హర్ష మందుచు నల్లన యరిగి యరిగి.

1


మ.

విలసత్పంకజకైరవోత్పలవనీవిశ్రాంతభృంగాంగనా
కలసంగీతవిలాసమోహినిఁ, దరంగవ్యూహినిన్, హంస మం
డలకారండవచక్రముఖ్యఖగ[80]రాణ్ణాదామృతోత్సాహినిన్,
జలరాశిప్రియగేహినిన్, గనుగొనెన్ జర్మణ్వతీవాహినిన్.

2


వ.

ఇట్లు గనుంగొని, తత్తీరంబున నవపల్లవకోరకపుష్పఫలసంపత్సమేతచూతపోత
నారికేళపనసవకుళచంపకబిల్వఖర్జూరవటాశోకపున్నాగకురవకతాలహింతాల
సంతానకర్పూరభూరుహకుందమల్లికాదినానావిధతరులతావితానశోభమానంబును,
విమలకమలకుముదసముదయఫుల్లహల్లకబృందనిష్యందమానమకరంద[81]ధారాసార
మిళితకలితజలపూరపూరితకాసారమాలికాసారమృణాలజాల[82]చర్వణగర్వహంసకల
హంసకారండవసారసచక్రవాకబకక్రౌంచముఖకోలాహలముఖరితమధ్యస్థానంబును,
మలయానిలవిహార కమనీయంబును, [83]వకుళమధురసాస్వాదప్రాదుర్భూతమదముదిత
పుష్పంధయబంధురఝంకారరమణీయంబును, జాతివైరదూరజంతుసంతానసమాకీర్ణం
బును బర్ణశాలాంగణవిహరమాణమునికుమారక్రీడాకలాపఘోషపరిపూర్ణంబును, విశాల
తరుమూలపవిత్రాసనసమాసీన[84]పరమయోగీశ్వరతత్త్వవివేచనపరస్పరాలాపసమయ
సముదితవివాదసందిగ్దార్థవిశదీకరణపరిణతరాజకీరశారికాకోకిలకాకలీరవాకలితంబును,
తరుమూలసేచనలీలాలాలసమునిబాలికా[85]లలితంబు నగుచుఁ, బుణ్యవనితావదనంబు
చందంబునం దిలకోజ్జ్వలంబును, బాండవసైన్యంబుతెఱంగున శ్రీకృష్ణార్జునసమేతంబును,

నయోధ్యానగరంబు మాడ్కి రామ[86]లక్ష్మణాధిష్ఠితంబును, సురలోకంబు కరణి సుమన
స్సంవృతంబును, వారాంగనాసదనంబు క్రియఁ బల్లవాస్పదంబును నై, సజ్జనసమాకీర్ణం బయ్యుఁ
బుణ్యజనదూరంబును, వివిధశాలాన్వితం బయ్యు విశాలంబు నగు రోమశాశ్రమంబుఁ గనుం
గొని [87]ప్రవేశించి యందు.

3


మ.

కనియెన్ సంయమిసార్వభౌముఁడు త్రిలోకఖ్యాతభాస్వద్యశున్,
దిననాథప్రతిమానమూర్తి సుషమా[88]దీప్తాఖిలక్ష్మాదిశున్,
ఘనపంచేంద్రియమత్తవారణఘటాగర్వాపహారాంకుశున్,
వినుతామ్నాయపురాణతత్త్వకలనావిద్యావశున్, రోమశున్.

4


మ.

కని చేర న్మునియుక్తుఁడై యరిగి మార్కండేయమౌనీంద్రుఁ డా
[89]ఘను, నిందూపలవేదికాస్థితు, నమస్కారప్రియాలాపసం
జనితానందునిఁ జేసి, [90]సత్కృతసమర్చాపూర్వకాతిథ్యముల్
గొని, తత్ప్రాంతసమర్పితాసనమునన్ [91]గూర్చుండె మోదంబునన్.

5


వ.

ఇట్లు భాగవతకులాగ్రగణ్యుండును, బరమపుణ్యుండును, మహానుభావుండును నగు
మార్కండేయమహామునిదేవుం డుపవిష్టుండగుటయుఁ దత్ప్రభావంబున.

6


ప్రశాంతపావనవనశోభ

సీ.

ఋతుధర్మములు మాని లతలు భూజంబులు | పూచి కాచి ఫలించి పొలుపు మిగిలె,
నంబుధరాలోకనంబు లేక మయూర | విహగసంఘము పురి విచ్చి యాడెఁ,
బుంస్కోకిలంబు లపూర్వకుహూకార | పంచమ[92]స్వరముల పసలు చూపె,
శ్రుతిసుఖస్వరముల శుకశారికాతతి | హరికథామృతముల నానుచుండెఁ,


తే.

దేనియలు గ్రోలి [93]మదమునఁ దేఁటిగములు | సారఝంకారరవముల సంభ్రమించె,
మఱియుఁ దక్కిన జంతుసమాజమెల్ల | నురుతరానందజలరాశి నోలలాడె.

7


మ.

వనలక్ష్మీధవళాతపత్రములఠేవం బుండరీకావళుల్
గనుపట్టెన్ వికసించి కాంతిగరిమం గాసారమధ్యంబునన్,
ఘనపుష్పోత్థితరేణుపింజరితరంగత్తారకా[94]వీథి త
ద్వనజాతాక్షికి మేలుకట్టుగతి హృద్యంబయ్యె నీక్షింపఁగన్.

8

సీ.

కలువలు నిడువాలుఁగన్నులు గా, [95]సరో | జంబు భాసురవదనంబు గాఁగ,
నెఱి మించుతేఁటులు నీలాలకములు గా, | బింబికాఫల [96]మధరంబు గాఁగ,
మాలూరఫలములు పాలిండ్ల తెఱఁగు గా, | సంపెంగవిరి నానసొంపు గాఁగ,
హరిమధ్యమస్ఫూర్తి నిఱుపేదనడుము గాఁ, | దామరతూండ్లు హస్తములు గాఁగఁ,


తే.

గనకరంభలు తొడలపొం కంబు గాఁగఁ, | జిగురు లడుగులుగా, ఘనశ్రీసమేత
యగుచు, వనలక్ష్మి రోమశు నాశ్రమమున | నుచితవైఖరిఁ గనుపట్టుచుండు నంత.

8


సీ.

గంధసారమహీజబంధురోరగరాజ | భుక్తముక్తంబులై పొదలి పొదలి,
భూసారజలపూరకాసారకుముదార | విందబృందంబుపై విడిసి విడిసి,
కోమలమాకందకుసుమగుచ్ఛమరంద | కణగణంబులసొంపు గమిచి గమిచి,
భామినీసురతాంతభవఘర్మజల[97]తాంత | గండమండలములఁ గదిసి కదిసి,


తే.

చిన్నివెన్నెలలేఁగొనల్ చిదిమి చిదిమి, | పరువుమరువంపుఁదావుల బలసి బలసి,
మునులతనువుల కింపుగా మొనసి మొనసి, | మందమందానిలము వీచె మలసి మలసి.

9


తే.

మలయగిరివాతపోతసమాగమమున | మౌనివరుఁ డిట్లు మార్గశ్రమంబు వాసి
సంతసింపుచు రోమశసంయమీంద్రుఁ | బ్రేమ నీక్షించి పలికె గంభీరఫణితి.

11


మునీంద్రద్వయకృతపరస్పరసంభావనము

సీ.

సంకర్ష[98]ణాస్యసంజాతానలంబులు | భుగభుగధ్వనులతో నెగయునాఁడు,
శైలంబు లల్లాడ సప్తమారుతములు | బెట్టుగా [99]బిస్సట్లు వెట్టునాఁడు,
తొమ్మిదివిధములతోయదంబులు రేఁగి | ఘోషించి పెనువాన గురియునాఁడు,
రెండారుతెఱఁగులై చండాంశుబింబముల్ | వేఁడియెండలు చల్లి వేఁచునాఁడు,


తే.

దీర్ఘతరముగ నజుఁడు నిద్రించునాఁడు, | వనధి బ్రహ్మాండభాండంబు మునుఁగునాఁడు
నే భయంబును లేక యథేచ్ఛనుండు | నెలమి నీయాశ్రమమ్ము, మునీంద్రతిలక!

12


క.

భూరివటపత్రతలమున | నీరజనాభుండు యోగనిద్రాపరుఁడై
[100]కూరికినప్పు డుపద్రవ | దూరంబని మునులు చేరుదురు నీనెలవున్.

13


చ.

ఫణికులసార్వభౌముఁడును బ్రస్తుతి సేయఁగలేఁడు నీతపో
గుణగరిమంబు, మాదృశులకున్ వశమే? యన; రోమశుండు త
త్ఫణుతికి లేఁతనవ్వు ముఖపద్మము[101]న న్ననలొ త్త, మౌనిరా
డ్గణపరివారితుండగు మృకండుతనూజునితోడ నిట్లనున్.

14

చ.

పరమపవిత్రము న్వినుతిపాత్రమునైన భవత్పదాంబుజ
స్ఫురితపరాగమాత్ర మిటు సోఁకుటఁజేసి మదీయదేహమున్,
బరిచిత గేహమున్, [102]సుకృతపావనతాపరిణాహ మంది సు
స్థిరత వహించె, నిష్టఫలసిద్ధిఁ దనర్చెఁ దపోవిశేషమున్.

15


క.

భవదంఘ్రికమలదర్శన | భవ[103]సుకృతమహత్త్వ మెన్నఁ బంకేరుహసం
భవునకుఁ, గమలోదరునకు, | భవునకు శక్యంబుగాదు - పరమమునీంద్రా!

16


వ.

అని పలికి వెండియు నిట్లనియె.

17


చ.

సతతము నగ్నిహెూత్రములు సాఁగునె? భూరుహముల్ ఫలించునే?
సితుకునె ధేనువుల్ ? జలగభీరములై చెలువొందునే [104]సర
స్తతులు? సమృద్ధమే విపినధాన్యము? పోషితజంతుజాల మ
ప్రతిహతమే? మృగాద్యసురబాధలు లేవుగదా వనంబునన్?

18


వ.

అని కుశలం బడిగి మఱియు నిట్లనియె.

19


సీ.

శతకోటిశతకోటిసమసమారవములు | దళముగాఁ బర్విన నులికిపడక,
లోకభీకరసముల్లోలకల్లోలసం | ఘము లొత్తి వచ్చిన [105]గండ్లుపడక,
తిమిర[106]సమాభీలతిమితిమింగల[107]వక్త్ర | కుహరమార్గంబులఁ [108]గుంటుపడక ,
భంజనాటోపప్రభంజనాక్షేపంబు | మెండు గాఁ దొణఁగిన బెండుపడక,


తే.

యబ్ధు లేకార్ణవత్వంబు నంది[109]యుండ | భయ మెఱుంగక వటపత్రశయనుఁడైన
విష్ణుఁ బ్రభవిష్ణుఁ జేరి సేవింపుచుందు | వలఘుతరశక్తిఁ బద్మజప్రళయవేళ.

20


క.

[110]బాలకుఁడై మఱ్ఱాకునఁ | దేలెడు హరి నిట్లు గొలువ దివిజావళి ని
న్నాలోకించి నుతించును, | శ్రీలలనారమణ[111]భక్తిశీలుఁడ వనుచున్.

21


క.

కావున, నధ్యాత్మకళా | కోవిదుఁడవు, సకలమౌనికులపతి వరయన్
నీ [112]వచ్చినకతమున, నా | భావము సంతోషవికచభావము నొందెన్.

22


క.

అనవుడు, రోమశమునిపతి | కిని మార్కండేయమౌని [113]కేవలవినయా
వనతుఁడయి దంతకాంతులు | కనుపట్టుచు మెఱయఁ బలికె గంభీరోక్తిన్.

23

తే.

పూని [114]మాకుశలప్రశ్నపూర్వకముగ,| ననఘమానస! యేమేమి యడిగి తీవు
తలఁప నవియెల్ల కుశలాన్వితములు సూవె | భవదనుగ్రహవశమునఁ బరమపురుష!

24


క.

[115]హరచరణకమలయుగళీ | పరి[116]చరణార్థంబు రజతపర్వతమున కే
నరుగుచు భాగ్యవశంబున | నిరుపమహరిమూర్తివైన నినుఁ గనుఁగొంటిన్.

25


క.

ఫలితములయ్యెఁ దపంబులు, | గళితము లయ్యె న్మదీయ[117]కల్మషములు, ని
ర్మలితములయ్యె యశంబులు, | కలితములయ్యెం బ్రబోధల్యాణంబుల్.

26


క.

మనమునఁ గల యనుమానము | తనకన్నను ఘనుని నడిగి తద్విమలోక్తుల్
వినినపుడుగాని పాయదు, | మునివర! యొక టడుగవలయు [118]*మును ముఖ్యముగాన్.

27


మార్కండేయమౌని తాత్త్వికసంప్రశ్నము

సీ.

వివిధంబులై మించు వేదార్థములు చూచి | భ్రాంతులై , సహజసిద్ధాంతమార్గ
మిది యని పలుకలే, - రదియును బౌద్ధాది | ఘనవాద[119]పిహితమై కానఁబడదు,
విద్యామదాంధులై వేదాంతవిహితార్థ | మిదమిత్థమని నిర్ణయింపలేక,
యర్థాంతరముఁ జెప్పి - యజ్ఞానపథవర్తు | లై విద్వదభిమాన మతిశయింపఁ,


తే.

దనర బుధులయ్యు నిత్యతత్త్వంబు మఱచి | యాతనాదేహములఁ బొంది యమకఠోర
దండతాడితులై శోకదగ్ధు లగుచు | నుగ్రనర[120]కాలయంబుల నుందు రనఘ!

28


తే.

అట్లు గావున, నిగమంబు లరసి చూచి | యర్థవాదంబు మాని సారాంశ మేర్చి
[121]హృద్వికారహరంబగు హితపథంబు | నాకుఁ దెలుపుము సంయమిలోకవంద్య!

29


సీ.

వేదాంతసిద్ధాంత[122]విమలమార్గంబున | నేకమై విహరించు నెద్దియేని?
స్థావరజంగమాత్మకజగద్ద్వితయంబు | నెందేని [123]వర్తించు నిరవుగాఁగ?
దేని తనుచ్చాయ భానుమండలశత | కోటిప్రభాతతిఁ గుందు వఱచు?
సత్త్వరజస్తమస్సంజాతవికృతులఁ | గడచి వెలుంగు నొక్కటియు నెద్ది ?


తే.

తరువులందును సురలందు నరులయందుఁ | గీటములయందు [124]మునులందు గిరులయందు
సాక్షియై నిల్చు నెయ్యది సంక్రమించి? | యట్టితత్త్వంబుఁ దెలుపుము యతివరేణ్య!

30

క.

[125]ఏ కథ విని మర్త్యుఁడు పు | ణ్యాకరుఁడై పంకజాసనాధికదివిష
ల్లోకముల మెలఁగు నభయత | నా కథ వినిపింపు నాకు హర్షం బొదవన్.

31


మత్త.

ఆ మహామహుఁ డివ్విధంబున [126]నంబుజోదరతత్త్వలీ
లామహత్త్వము నాలకింపఁ దలంచి పల్కినయంత, నా
రోమశుండు ప్రమోదహర్షితరోమకంచుకితాంగుఁడై
శ్రీమనోహరుసద్గుణ[127]స్తుతి [128]సేయు [129]పూనిక నిట్లనెన్.

32


రోమశముని విష్ణుమహిమ నభివర్ణించుట

ఉ.

శ్రీరమణీమనోహరుఁడు, శేషఫణీశ్వరభోగతల్పుఁ, డం
భోరుహమిత్రకోటిరుచిపూరితమూర్తి, కృపాకరుండు, దు
ర్వారసురారిఖండనుఁడు, వర్ణితనిర్మలకీ ర్తి, నేఁడు సం
స్మారితుఁ డయ్యెఁ, గాన దివసంబు కృతార్థత నొందె నెంతయున్.

33


క.

నారాయణనామము జి | హ్వారుచిరము, విష్ణురూప మక్షిసఫలతా
కారణము, శౌరిచరితసుధారస మది కర్ణసౌఖ్యదంబు ధరిత్రిన్.

34


క.

అక్షయుఁ డచలుఁడు పూర్ణుఁడు | సాక్షియు వేదాంతవేద్యచరితుఁడు నగు ప
ద్మాక్షుం [130]డె పరమతత్త్వము, | వీక్షింపఁ దదన్య [131]మొకటి వినఁబడ దెందున్.

35


క.

దశశతవదనునకైనను | దశశతకిరణాదిదేవతా[132]తతికైనం
దశశతనయనునకైనను | వశమే! హరిగుణము లెఱిఁగి వర్ణనసేయన్.

36


తే.

ఎంతమాత్రంబు మద్వచోహృదయములకు | గోచరించును గోవిందగుణమహత్త్వ
మంతమాత్రంబు వినిపింతు నవధరింపు | వినుతపుణ్య! మృకండుజమునివరేణ్య.

37


క. శ్రోతకు వక్తకు భువన | ఖ్యాతసరోజాక్షసత్కథామృతవృష్టిన్
జేతస్తాపము లణఁగును | భూతభవద్భావిదురితపుంజము [133]దొలఁగున్.

38


చ.

హరిచరితంబులేని యితిహాసము చంద్రుఁడులేని రాత్రి, యం
బురుహములేని దీర్ఘిక, ప్రభుత్వములేని సురూపమున్, రస

స్ఫురణములేని కావ్యమును, బూర్ణతలేని తపోనిరూఢి, దు
ష్పురుషుని[134]తోడి బాంధవము పోలిక [135]నిష్ఫలముల్ దలంపఁగన్.

39


క.

హరినామకీర్తనామృత | హరిపదతీర్థంబులాని యతివిమలుండై
హరిభక్తిపరవశుండగు | పురుషుఁడు కైవల్యపదముఁ బొందుట యరుదే?

40


సీ.

తోయజాక్షునిఁబూజ సేయని కరములు | భీకరాఖిలపాతకాకరములు,
హరిమందిరముఁ [136]జేర నరుగని పదములు | యమలోకదుఃఖయాత్రాస్పదములు,
విష్ణురూపంబు భావింపని మనములు | తామసవిక్రియా[137]వామనములు,
దైత్యారిహితముగా దానం బొనర్పని | బహు[138]ధనంబులు దేహబంధనములు,


తే.

అంబుజోదరుసంకీర్తనంబులేని | ముఖము లత్యుగ్రనరకాభిముఖము లింది
రామనోహరచరితదూరంబులైన | దినము [139]లిల దుర్దినంబులు మునివరేణ్య!

41


చ.

నరసురసిద్ధసాధ్యదితినందనముఖ్యులయందు, భారతీ
శ్వరమునిభక్తచిత్తజలజంబులయందును, భూతవాహినీ
తరులతికాదు[140]లం దచలితస్థితి నిల్చి, జగంబుఁ బ్రోచు నా
పురుషుఁ, డతండు లేక తృణముం జరియింపదు, వేయు నేటికిన్!

42


వ.

అట్టి పురాణపురుషుండైన విష్ణుండు ముఖంబువలన బ్రాహ్మణులను, బాహువుల
వలన రాజన్యులను, నూరువులవలన వైశ్యులను, బాదంబులవలన శూద్రులను, జిత్తంబు
వలన శశాంకమండలంబును, నయనంబులవలన భానుమండలంబును, ముఖంబువలన
నింద్రాగ్నులను, బ్రాణంబువలన వాయువులను, నాభివలన నంతరిక్షంబును, శిరంబువలన
నాకాశంబును, బాదంబులవలన భూలోకంబును, శ్రోత్రయుగళంబువలన దిశామండలం
బును, [141]1మేహనంబువలన సముద్రంబులను, గేశచయంబువలనఁ బుణ్యనదీవిశేషంబులను,
నాభికమలంబువలనఁ బితామహుని, ముఖానిలంబువలన దర్వీకరపతంగ[142]2సంఘంబులను,
హర్షంబువలన గంధర్వకింపురుషమన్మథామరకామినీజనంబులను బుట్టించి, రజస్సత్త్వ
తమోగుణసహితుండై, బ్రహ్మ విష్ణు శంకర నామంబులం గలిగి, జగదుత్పత్తి స్థితి లయ
కారణంబై, యపరిభేద్యస్వరూపంబునఁ ద్రిజగద్వ్యాపకుండై వర్తించు. మఱియును.

43


క.

మోహితులై, యజ్ఞానతి | రోహితులై , కమలజాతరుద్రాదులు ల
క్ష్మీహితునిమాయ నత్యుప | గూహితులైనారు, సర్వగోచరచరితా!

44

క.

పురుహూతాది దిగీశులు, | నరకిన్నరయక్షదనుజనాగాదులు, నం
బురుహాసనరుద్రాదులు | హరిరూపముఁ దెలియఁ జాల రమలచరిత్రా!

45


మ.

గిరులన్ వృక్షములన్ సరీసృపములన్ - గీర్వాణులన్ వహ్నులన్
ధరణీ దేవతలన్ సముద్రముల మార్తాండావలిన్ యక్షులన్
[143]వరలోకంబుల నాశ్రమంబుల నదీ[144]వ్రాతంబులన్ గోవులన్
హరిరూపంబులుగా నెఱుంగు, [145]మమరాహారోల్లసద్భాషణా!

46


ఉ.

భూరితపోమహత్త్వమునఁ బుణ్యమతుల్ సనకాదులు సం
సారమునన్ దగుల్వడక, సంతతమున్ హృదయాబ్జకర్ణికా
[146]ధారమునన్ సమీరము ను[147]దాత్తత నిల్పి, సనాతనుం జగ
త్కారణు విష్ణు, నాత్మఁ బొడఁగాంతురు నిశ్చలభక్తియుక్తులై.

47


సీ.

ధర్మంబు గళితమై ధరణి నధర్మంబు | పూర్ణమై యభివృద్ధిఁ బొందినపుడు,
గీర్వాణపక్షంబు గీటణంచుటకునై | [148]మించి రాక్షసులు జన్మించినపుడు,
వేదశాస్త్రపురాణవిద్యలు [149]పాషండ | కుల[150]దూషితంబులై పొలియునపుడు,
[151]సభ్యు లెంతయు నొచ్చి సంచరించిననాఁడు, | పుడమిపై బాధలు పొడమినపుడు,


తే.

మహిమ చూపట్ట దుష్టనిగ్రహము చేసి | జగము రక్షించుతలఁపునఁ జక్రపాణి
మత్స్యకూర్మాది బహుమూర్తిమంతుఁ డగుచుఁ | బ్రతియుగంబున [152]జనియించు భవ్యచరిత!

48


సీ.

భువనపావననదీనివహనాయకుఁడగు | నమృతపయోరాశి యాఁడుబిడ్డ,
శృంగారరస[153]1సారజీవకళాలీల | మోహనాంగము గల [154]2ముద్దరాలు,
తెలిదమ్మిరేకులకిలకిలనగుకన్నుఁ | [155]3గోనలఁ గలుముల నీను మగువ,
పద్మసంభవభావభవముఖ్యదివిజసం | ఘాతంబుఁ గడుపారఁ గన్నతల్లి,

తే.

లక్ష్మియై మించి, వైష్ణవోల్లసితశక్తి | [156]నంది, చిదచిత్స్వరూపుని యనుపమాన
బాహుమధ్యస్థలంబునఁ బాయకుండు | సంతతంబుమ సంయమిసార్వభౌమ!

49


తే.

తిలలఁ దైలంబు పూర్ణమై నిలిచినట్లు, | నిఖిలవిశ్వంబులోపల నిండియుండి,
సర్వమయుఁడైన హరిదేవచక్రవర్తి | జగముఁ బుట్టించు రక్షించు సంహరించు.

50


క.

[157]ఏనెలవున నేరూపము | లో నేనామమునఁ దలఁచు లోలతను జనుం,
డానెలవున నారూపము | లో నానామమునఁ దోఁచు లోలత హరియున్.

51


క.

అణువులలోపల మిక్కిలి | యణువై యాద్యంతరహితుఁ డనఁదగు నారా
యణునిమహత్త్వము, దివిష | గణవల్లభముఖులకైనఁ దరమే తెలియన్?

52


క.

జల[158]*పరిపూరితబహువిధ | కలశంబుల నేకశీతకరుఁడే బహుభం
గులఁ గానవచ్చు కైవడిఁ | బలుతెఱఁగులఁ దోఁచు నాత్మభావరతుండై.

53


వ.

[159]1ఇట్టి పురాణపురుషుండు సర్వపరిపూర్ణుండై జగద్రక్షణంబుకొఱకు మత్స్యకూర్మ
వరాహనృసింహవామనరూపంబుల నవతరించి భూభారంబు మాంచె. ఇంక రామత్రయ
బుద్ధకల్కి[160]వేషంబుల నుదయించి, పాషండరాక్షసాదిదుష్టనిగ్రహం బొనరింపంగలండని
చెప్పిన విని, మార్కండేయుం డిట్లనియె.

54


వరాహావతారకథాశ్రవణకౌతూహలము

క.

ఏదినిమిత్తము విష్ణుం | డాదివరాహస్వరూప మగుటకు? హృదయా
హ్లాదిని [161]యగు నాకథ నా | కాదరమునఁ దెలియ నొడువు [162]మమలచరిత్రా!

55


చ.

అనవుడు రోమశుండు [163]హృదయంబున నుత్సుకుఁడై, మృకండునం
దనునకు నిట్లనున్, మును వినంబడు [164]నట్టిదయైన పద్మలో
చనచరితాంకితంబులగు సత్కథ, లంచితభక్తి నిత్యమున్
వినఁగఁదలంచువారికి నవీనములై యొనరించు సౌఖ్యముల్.

56


క.

కావున, విష్ణుకథారస | కోవిద! [165]సద్వచనహృదయగోచరహరిలీ
లావిర్భావచరిత్రము | వేవిధముల విస్తరింతు విను మెట్లన్నన్.

57

రాక్షసజననప్రకారము

క.

పదునాల్గుదివ్యయుగములు | మొదలం జనఁ, బద్మకల్పమున దితిసతికిన్
మదయుతులు సుతులు రాక్షసు | లుదయించిరి, సత్త్వసాహ[166]సోద్ధతు లగుచున్.

58


వ.

అంత.

59


సీ.

ధర్మంబు వదలిరి ధారుణీనాథులు, | సత్యంబు ధాత్రి నుత్సన్నమయ్యె,
బహువిఘ్నములఁ గుంటువడియె యాగంబులు, | నిగమముల్ [167]పాషండనిహతి నొందె,
ప్రజ లనాచారతత్పరత [168]వర్తించిరి, | మాసెఁ బాతివ్రత్యమహిమ లెల్ల,
సంతతదానప్రచారంబు లుడివోయెఁ, | గడుమించె వర్ణసాంకర్యగరిమ,


తే.

మొదవు లేమియుఁ బిదుకక ముణుఁగఁదొడఁగెఁ, | [169]గోరినప్పుడు వానలు గురియటుడిగె,
భూతదయ లేశమాత్రంబు పొడమదయ్యె, | సమదరాక్షసజన్మదోషంబుకతన.

60


దైత్యుల స్వైరవిహారము

ఉ.

ఉగ్రమదాంధబుద్ధులు బలోద్ధతు లిట్టినిశాచరుల్ వివృ
ద్ధాగ్రహులై మహీపతుల నందఱ [170]నోర్చి, సురేంద్రువీటికిన్
నిగ్రహ మాచరించి, వెస నిర్జరపుణ్యసతీజనంబు బం
దీగ్రహణం బొనర్చి, మహనీయధృతిన్ భువనంబు లేలుచున్.

61


ఉ.

నాయ మొకింతలేక యొకనాఁడు సురాద్రికి డాయఁబోయి, య
త్యాయత బాహుదర్పమునఁ - దద్దరిమధ్య నివాసులైన వి
శ్వాయువు [171]పుణ్యకేతనుఁడు వజ్రుఁడు సాల్వుఁడు నాదిగాఁ జమూ
నాయకులం గుఱించి కదనం బొనరింపుచునున్న యత్తఱిన్.

62


హరుఁడు దైత్యులను భస్మము చేయుట

ఉ.

విస్మయ మేమి చెప్ప! గణవీరచమూసహితంబు గాఁగ ద
గ్ధస్మరుఁ డీశ్వరుం డపుడు తద్గిరికిం జని, రాక్షసేంద్రులన్
భస్మము సేయఁ, దద్భసితపంక్తిని [172]షష్టిసహస్రదైత్యు లు
గ్రస్మయు లుద్భవించి రవిఖండితమండితశస్త్రపాణులై.

63

భసితసంజాతదనుజులతపము శివసాక్షాత్కారము

చ.

అఱువదివేలు ని ట్లుదయమంది గదాశరభిండివాలతో
మరముఖరాయుధాగ్రముల మస్తకముల్ గదియించి, మీఁదికిం
జరణము లూఁతగాఁ దపము సల్పిరి శంభునిఁ గూర్చి, రౌప్యభా
స్వరగిరి వాయుకోణగతి చంద్రమతీతటినీతటంబునన్.

64


సీ.

సతతమార్దవధర్మశార్దూలమృగచర్మ | శాటితో, ఫణి[173]తులాకోటితోడ,
ఘనసారనక్షత్రకాంతిభాసురగాత్రపుష్టితో, నిటలాగ్రదృష్టితోడ,
గంగా పయఃపూరకలితజటాభారసీమతో, వామాంగభామతోడ,
సేవార్థనిస్తంద్రదేవపారిషదేంద్ర | చయముతో, గోరాజహయముతోడ,


తే.

జింకతో, మౌళిఁగ్రొన్నెలవంకతోడ, | నొప్పు[174]తో, గళమూలంపుఁగప్పుతోడ,
హరుఁడు ప్రత్యక్షమయ్యె భక్తార్తిహరుఁడు ! దైత్యులకు, నుగ్రతరతపోనిత్యులకును.

65


క.

అప్పుడు దానవవీరులు | ముప్పిరిగొను భయముఁ బ్రణయమును విస్మయముం
జిప్పిల, నతులై యిట్లని | యప్పరమేశ్వరునిఁ బొగడి - రతులితభక్తిన్.

66


పరమశివస్తుతి

సీ.

పురహర! శశిజూట! భూతేశ! శాశ్వత! | నిర్మల! నిరవద్య! నిర్వికల్ప!
ఈశాన! శంకర! హిమశైలజానాథ! | హర! మహేశ్వర! శూలధర! గిరీశ!
నిత్య! మృత్యుంజయ! నిర్వాణ[175]నాయక! | వేదాంతవేద్య! బ్రహ్మాదివంద్య!
అంధకాసురదర్పహరణ! చర్మాంబర! | వృషభేంద్రవాహన! విషమనేత్ర!


తే.

ఫాలలోచనకోణాగ్రభాగనిర్య | దనలకణమాత్రనిష్పీతమనసిజాంగ!
భసితచందనచర్చావిభాసమాన! | పన్నగాధీశభూషణ! భక్తవరద!

67


చ.

అమలయతీంద్ర[176]చిత్తమణిహర్మ్యములం దొకవేళ సూక్ష్మరూ
పమున వసింతు, వొక్కపరి పద్మభవాండము పాదుకాతప
త్రముల విధంబుగా గరిమఁ దాల్తువు, పర్వతకన్యకాసమా
గమసుఖ[177]సక్తి నొక్కపుడు - గాంతువు యోగ్యగృహస్థధర్మమున్.

68


క.

ఒకమఱి సర్వము నీవై | యకలంకత నిల్తు వణుమహద్భావమునన్
సకలేశ్వర! నీతత్త్వము | ప్రకటంబుగఁ దెలియవశమే బ్రహ్మాదులకున్?

69

క.

చిరకాలమత్పురాకృత | పరమతపోమహిమ నేఁడు - ఫలితం బయ్యెన్,
దొరకె మనోవాంఛితములు | [178]గరళాశన! నిన్నుఁ జూడఁగలిగినకతనన్.

70


మ.

పరభామారతుఁడైన, నిత్యమదిరాపానోన్నతుండైన, భూ
సురహత్యాకరుఁడైన, హేమముఖవస్తువ్రాతచౌర్యక్రియా
పరుఁడైనన్, “శివ! చంద్రజూట! గిరిజాప్రాణేశ!” యంచున్ నినుం
బురదైత్యాంతక! పేరుకొన్న, నఘనిర్ముక్తుండగున్ గొబ్బునన్.

71


మ.

నినుఁ బూజించి, నినుం దలంచి, రసన న్నీనామముల్ గూర్చి, నీ
కని దానంబొనరించినట్టి నరుఁ డాహా! వామభాగంబునన్
వనజాక్షిన్, గళమందుఁ [179]గందుఁ, దలపై వాఃపూరముం, బాదమం
దనిలాహారవిభూషణంబు గలవాఁడై యుండు నీసన్నిధిన్.

72


ఆ.

భూపరాగముల శమీపలాశములఁ దా | రల నుదగ్రవృష్టి జలకణముల
నెన్నవచ్చుఁ గాని యీశ! మీగుణములు | నలువకైన నెన్ననలవిగాదు.

73


మ.

హర! మృత్యుంజయ! పంచబాణహర! జంభారాతిముఖ్యాఖిలా
మరకోటీరమణిప్రభా[180]స్ఫురణశుంభత్పాద! సర్వేశ! యం
బరకేశా! కమలాసనాదులు భవత్పంచాక్షరీమంత్రత
త్పరులై కాదె! సృజింపఁ బెంప నణఁగింపన్ శక్తులౌ టారయన్.

74


క.

రవి శశి [181]ధరణి జలానల | పవన నభో యజ్వ లనఁగఁ బరగిన యుష్మ
త్ప్రవిమలమూర్త్యష్టకమును | భువనంబులఁ బ్రోచుఁ బరమపురుషవరేణ్యా!

75


ఉ.

నీకలితోత్తమాంగమున నీళ్లును దోసెఁడు చల్లువాఁడు మం
దాకిని [182]మోచుఁ, బువ్వొకటిఁ దా నిడువాఁడు ప్రసన్నచంద్రరే
ఖా[183]కుసుమంబుఁ దాల్చు, [184]సిరిగంద మలందినవాఁడు మన్మథ
ప్రాకటభూతిఁ గైకొనుఁ, బురాకృత పుణ్యఫలంబు [185]తప్పునే?

76


వ.

అని యివ్విధంబున భసితసంభపులైన కపిలోచన ధూమలోచన వక్త్రదంత సూచీ
ముఖ సునాసీర కంకాస్య గృధ్రరోమ చంచరీక సుశేష జ్వాలాకేశ ఖడ్గపాదాది నిశాచరచమూ
నాయకులు పార్వతీరమణునిం బ్రస్తుతింపుచు, నల్లనల్లన నికటతటంబునకుం జేరంజని, కర
పుటంబులు నిటలాగ్రభాగంబులం గదియించి, దేవా! మదీయతపంబులు ఫలితంబులయ్యె.

మాకు నకుంఠితపరాక్రమంబు ననివారితశౌర్యంబు నచలితజయంబును ద్రైలోక్యాధిపత్యంబును
స్థావరజంగమాదులవలన భయంబు లేకుండుటయునుం గృపసేయవలె నని విన్నవించి,
సాష్టాంగదండప్రణామం బాచరించిన, వారలకుఁ గరుణావశంకరుండగు శంకరుం డిట్లనియె.

77


అసురులయెడ నంబికాధవుని యనుగ్రహము

ఉ.

రాక్షసపుంగవుల్! వినుఁడు! రాఁగల కార్యముఁ [186]దెల్పెదన్, హిర
ణ్యాక్షుఁడు [187]నాఁగ నొక్కఁ డసురాన్వయమందు దితిప్రియాత్మజుం
డై క్షితి నుద్భవించు, ఘనుఁ డాతఁడు దోడుగ, నాజి దేవతా
పక్షము గీఁటణంచి, [188]నిరుపద్రవులై జగ మేలుఁ డింతయున్.

78


చ.

అని వివరించి [189]చెప్పి, దితిజాన్వయవర్యుల నాదరించి వీ
డ్కొని శివుఁ డాత్మలోకమునకుం బ్రమదంబున నేఁగె, నంత నా
దనుజులు నుత్సహించి బలదర్పితులై బహుసైన్యయుక్తులై
వనధిపరీతధాత్రి ననివారణ నేలిరి నిర్భయాత్ములై.

79


వ.

తత్కాలంబున.

80


ఉ.

[190]ధారుణి [191]యుక్కణంగె, కులధర్మము సత్యము దూరమయ్యె, నా
చారము [192]చెంగె, దానములు సాగకపోయెఁ, బరోపకారముల్
జాఱె, దయావిశేష మతిచంచలమయ్యెఁ, బతివ్రతాగుణం
బారయ గొడ్డువోయెఁ, [193]బరమార్థము [194]5గెంటె విచిత్రవైఖరిన్.

81


సీ.

అనిమిషేంద్రున [195]కార్తిఁ గనుమూఁత లేదయ్యె | ననలునితేజంబు పొనుగుపడియె
దండహస్తుని హస్తదండంబు బెండయ్యె | యాతుధానుఁడు మూల నణఁగియుండెఁ
బాథోధిరాజు ప్రాభవమెల్ల నీరయ్యె | గాలి[196]2జవప్రౌఢి తూలిపోయె
ధనదుని విక్రమోత్సవము వెచ్చంబయ్యె | శూలిదేహంబు సాఁబాలు చిక్కె


తే.

గ్రహగణంబులు దినములు గడువఁజొచ్చె | నురగలోకంబు [197]నిశ్శ్వాసభరితమయ్యె
నమరులకు యజ్ఞభాగంబు లమరవయ్యెఁ | గ్రూరదైత్యులు ధరణి చేకొనినకతన.

82

సురపతి సురగురువుతో మంత్రాలోచనము

చ.

గరిమ దలిర్ప నిట్లు బహుకాలము దైత్యులు ధాత్రి యేలఁగా
సురపతి యొక్కనాఁడు మణిశోభితసౌధమునందు, దేవకి
న్నరమునియక్షకింపురుషనాగనవగ్రహసిద్ధతారకా
పరివృతుఁడై వసించి, నయభాషల గీష్పతితోడ నిట్లనున్.

83


మ.

హరదత్తోగ్రవరప్రభావమున గర్వాక్రాంతులై రాక్షసుల్
ధరణీనాథుల నొంచి దేవతల నుద్ఘాటించి యాశాధిరా
ట్పురముల్ చేకొనఁజొచ్చి; రా దనుజులం బోనీక దండింపఁగా
[198]గురువైనట్టి యుపాయముం దలఁచి నా కుం దెల్పు మార్యోత్తమా!

84


ఆ.

త్రిదశకార్యనాశ మొదవిన నన్యులు | నిర్వహింపఁగలరె నీవు దక్క?
క్రూరదితికుమారకుల మంతకంతకుఁ | బ్రబలదొణఁగె దివిజభయద మగుచు.

85


చ.

గురువవు, మంత్రి, వాప్తుఁడ, వకుంఠితబుద్ధివి గాన, నిన్ను నా
దరమున వేఁడఁగావలసె, దైత్యుల గెల్చుట యెట్లు? దేవతల్
నిరుపమసాధ్వసంబునఁ జలింపఁ దొణంగిరి, సర్వమంగళా
కరమగు మత్పురంబు గతకౌతుకమై కడుఁ [199]బాడువారెడున్.

86


క.

ఏ కార్యంబున దైత్యులు | శోకంబునఁ బుత్రమిత్రశూన్యాలయులై
యాకలములు దిని కుందుదు, | రా కార్యముఁ దెలిసి నాకు నానతి యీవే!

87


క.

అని యిట్లు దైత్యనాయక | [200]హననోపాయంబు నింద్రుఁ డడిగినఁ, బ్రజ్ఞా
వనరాశియైన సురగురుఁ | డనుకంపాపూరితాత్ముఁడై యిట్లనియెన్.

88


బృహస్పతి దానవవినాశమునకుఁ దెలిపిన యుపాయము

క.

కరుణించి యొసఁగె శంభుఁడు | వర [201]మసురల కది మరల్ప వశమే వాణీ
వరునకు నైనను? గార్యము | వెరవిది యని పలుకరాదు విబుధవరేణ్యా!

89


వ.

మఱియు నీతిమార్గంబు నిజమంత్రులతో మంత్రాలోచనంబు చేసి, కార్యాకార్య మెఱుం
గఁజేసి, స్వామ్యమాత్యసుహృత్కోశరాష్ట్రదుర్గబలంబులను సప్తాంగంబులం గలిగి, సామ
దానభేదదండంబు లనం గల [202]చతురుపాయంబులచేత శాత్రవనాశం బొనర్పవలయు. అందుఁ
గర్తృకారయితృత్వసామర్థ్యసమేతుండై బలవంతునియందు సామదానంబులును, సమబలుని

యందు భేదంబును, హీనబలునియందు దండోపాయంబును బ్రయోగింపవలయు. దండో
పాయంబునకు రథగజతురగపదాతినివహంబును, దనుత్రాణదివ్యాయుధముఖపరికరం
బులును సంపాదించి, గూఢచారముఖంబునఁ బరనృపబలసంపత్తియును, దత్ప్రభుమంత్రో
త్సాహశక్తిప్రకారంబులును, దద్విచారంబు నెఱింగి, గుప్తమంత్రంబునఁ బ్రవర్తింపవలయు.
వెండియు.

90


సీ.

తన మూలబలము నెంతయుఁ బెంచి, యటమీఁద | [203]వలసిన మూఁకలవారిఁగూర్చి,
గుప్తమంత్రవిచారకుశలత, గార్యంబు | ప్రాప్తులతో విచారం బొనర్చి,
తద్విచారంబు నత్యంతగూఢము చేసి, | ప్రకటించి బయట వేఱొకటి చెప్పి,
పరశక్తియును నాత్మబలశక్తియును గాంచి, | కలఁగక తదుపాయగతు లెఱింగి,


తే.

మించివచ్చిన పనులెల్ల [204]మేలుగీళ్లు | దెలిసి, కోపంబువర్జించి, [205]తీవ్రకార్య
సరణి నడువక, పరబుద్ధిఁ గుఱుచపడక | సేయవలయును గురుబుద్ధి నాయకులకు.

91


మ.

గగనం [206]బంటగఁ గోట చేర్చి, పరిఖల్ గంభీరముల్ చేసి, పొం
దుగ నట్టళ్ళును [207]దంచనంబులును దో డ్తో నిల్పి, ధాన్యాదివ
స్తుగణంబుల్ సవరించి, యాప్తసుభటస్తోమంబుఁ గావన్ దృఢం
బగు దుర్గంబున నుండి, భూవిభుఁడు రాజ్యంబేలు టొప్పుం భువిన్.

92


ఉ.

మిక్కిలి శీతలాంబువులు మేనికిఁ గీడు, మహోష్ణవారిచేఁ
బొక్కు శరీర, మీ యుభయముం దొరలించిన నింపొనర్చు న
టోక్కనయంబు నొండె, భయమొండె నొనర్పక, తద్ద్వయంబుఁ
నిక్కువెఱింగి చూపు మనుజేంద్రునకు న్వశు లౌదు రందఱున్.

93


క.

బలవంతుఁడైన విమతుఁడు | కలయక విరసించెనేని ఘనుఁడగు పృథివీ
వలయేశుఁ గూడి తన పగఁ | జలమున సాధింపవలయుఁ జతురుం డగుచున్.

94


క.

అదిగాన ఘోరదైత్యులు | మదవద్రిపుభయదశౌర్య[208]మత్తులు వారిం
గదనమున నోర్వ సురలకు | నిది సమయము గాదు నిర్జరేశ్వర! [209]తలఁపన్.

95


ఉ.

శంభువర[210]ప్రవృద్ధభుజశౌర్యు ల[211]వార్యులు సంగరక్రియా
రంభవిజృంభమాణు లపరాజితకార్ముకబాణు లుగ్రవా
గ్దంభులు దైత్యడింభు లిఁకఁ గాలవశంబునఁగాని నేఁడు వి
శ్వంభరమూ ర్తిచేనయిన సాధ్యులుగారు నిలింపనాయకా!

96

చ.

ఇట విను మింక నొక్కటి సురేశ్వర! నిక్క ముపన్యసింతు, ధూ
ర్జటివరమత్తులైన దితిసంభవు లేమియుఁ గన్నుగాన, రీ
[212]కుటిలుల సంహరింప మనకుం గల దిక్కు సరోజనాభుఁ, డా
పటుమతి నాశ్రయించు, మన జయశుభోన్నతు లబ్బు గొబ్బునన్.

97


క.

పూజింపుము హరిచరణాం | భోజంబుల, నతని[213]రూపమును జిత్తములో
యోజింపుము, తద్గుణగణ | తేజోగరిమములు సన్నుతింపుము భక్తిన్.

98


క.

 ఆపన్నరక్షకుండగు | నాపన్నగశాయి దుష్టహరణోచితకా
ర్యోపాయకుశలుఁ డవ్యయుఁ | డాపదలన్నియును మాన్చు నాత్మఁ దలంపన్.

99


ఉ.

కీర్తనమాత్రసాధుజనభేదము మాన్ప ఝషాదివిస్ఫుర
న్మూర్తులు దాల్చి, దైత్యకలము న్నిజహస్తనిశాతచక్రవి
స్ఫూర్తికి విందుచేసి, పరిపూర్ణయశోనిధియైన భక్తలో
కార్తివిదారి, శౌరి, దిగనాడుె దేవమునీంద్రసంఘమున్?

100


క.

వనితారూపముఁ గైకొని | దనుజుల నణఁగించి, యమృతదానంబున నీ
యనిమిషులనెల్లఁ బ్రోచిన | యనుపమచారిత్రుఁ [214]డాప్తుఁ డతఁడే కాఁడే?

101


వ.

అని యివ్విధంబునం బరమార్థంబు తేటపడంబలికిన వాచస్పతికి వాస్తోష్పతి యిట్లనియె.

102


మ.

అమృతాంభోనిధిలోన శేషఫణిశయ్యామధ్యమం దిందిరా
రమణీరత్నముతోడఁగూడి సుఖనిద్రం బొందియున్నట్టి శౌ
రి మురారి న్నిగమాంతవర్తి మరుకీర్తిం గొల్చుటె ట్లాప్రదే
శము చేరంజనలేరు బ్రహ్మ[215]ముఖులున్, శక్తాత్ములే మాదృశుల్?

103


క.

అని హరిపూజాలాభ | మ్మునకు నుపాయంబు వేఁడు పురుహూతుని వా
గ్వినయముల కలరి సురగురుఁ | డనుకంపితహృదయుఁ డగుచు నపు డి ట్లనియెన్.

104


పుండరీకాక్షుని పూజావిధానము

క.

నీ నొడివినట్ల యమృతాం | భోనిధిమధ్యమున శేషభోగీంద్రునిపై
శ్రీ[216]నారీయుతుఁడై హరి | తా నెంతయుఁ గూర్మినుండుఁ దథ్యం బరయన్.

105

మ.

హరి యచ్చోటన కాదు, సర్వమునఁ దానై, వాయువార్యద్రిభూ
[217]తరుతేజోవియదంబురాశివిపినస్థానాపగాలోహస
త్పురుషాంతఃపరమాణుముఖ్యములయందుం బూర్ణుఁడై, వీనికిం
బరమాధారమునై వెలుంగుఁ ద్రిజగద్బాహ్యాంతరాళంబులన్.

106


క.

నీయందును నాయందును | బాయక వర్తించునట్టి పరమాత్ముని నీ
వాయత[218]భక్తి భజింపు మ | పాయంబులు గలుగ వెచట బలదనుజారీ!

107


వ.

మఱియు, నా పుండరీకాక్షుని పూజాప్రకారం బాకర్ణింపుము. శిలామయంబును, దారు
మయంబును, లోహమయంబును, [219]లేఖ్యయు, నాలేఖ్యయు, మనోమయంబును, మణిమయం
బును, సికతామయంబు నను నెనిమిదితెఱంగుల ప్రతిమారూపంబులు గలవు. అందులో
నిష్టంబైన విగ్రహంబునందు నావారిజాక్షు [220]నం దావాహించి, యాసనార్ఘ్యపాద్యాచమనీయ
మధుపర్కస్నానవస్త్రయజ్ఞోపవీతదివ్యాభరణగంధపుష్పధూపదీపనైవేద్యతాంబూల
వ్యజనాచ్యుపచారంబులు మంత్రయుక్తంబుగాఁ జేసి, ప్రదక్షిణనమస్కారంబు లాచరింప
వలయు. అట్టి ప్రతిమావిశేషంబులును గ్రామార్చనగృహార్చనభేదంబుల ద్వివిధంబులగు.
అందు గ్రామార్చనరూపంబు చలంబు నచలంబు నన రెండుతెఱంగులు మహోత్సవకాలం
బునఁ బుష్ప[221]3కారోపణయోగ్యంబు చలంబు, స్థావరరూపం బచలంబు ననం బరగు. అట్టి
చలప్రతిమావిగ్రహంబులయందును గృహార్చనారూపంబులయందును దారుమయ సికతా
మయ లేప్యామయ లేఖ్యాలేఖ్యాది రూపంబులయందును బ్రత్యహంబు నావాహనోద్వాస
నంబులు సేయవలయు. అచలప్రతిమలయందును, ధ్యానప్రత్యక్షవిగ్రహంబులయందును,
సాలగ్రామశిలాస్వరూపంబులయందును, మణిమయంబులయందును బరమపురుషుండు
నిత్యసన్నిహితుండు, గావున నావాహనోద్వాసనంబులు సేయంజనదు. ఇట్టి ప్రతిమా
భేదంబులలోన సాలగ్రామశిలామహత్త్వంబు చెప్పెద నాకర్ణింపుము.

108


సాలగ్రామమాహాత్మ్యము

క.

శ్రీమత్సాలగ్రామ | శ్రీమూర్తిని వేదశాస్త్రశిష్టద్విజచూ
డామణికి దానమిచ్చిన | యా మనుజుని సొమ్ము లైహికాముష్మికముల్.

109


క.

సాలగ్రామశిలాప్ర | క్షాళితతీర్థంబుఁ గ్రోలి కమలోదరుది
వ్యాలయముఁ జేరి యెన్నఁడుఁ | గ్రోలఁడువో! నరుఁడు మాతృకుచదుగ్ధములన్.

110


సీ.

బ్రహ్మహత్యాసురాపానగుర్వంగనా | గమనకాంచనచౌర్యకల్మషముల,
సోదరీసంభోగసూనృతరాహిత్య | పరకామినీసంగపాతకముల,

మాతాపితృత్యాగమాతంగభామినీ | ఖేలనకాపట్యకిల్బిషముల,
భూతహింసాపుణ్యపురుషపుణ్యాంగనా | [222]దూషణాత్మస్తుతిదుష్కృతములఁ


తే.

బాసి, సురవంద్యుఁడై విష్ణుపదమునందు | మానినులు గొల్వఁ గ్రీడించుమానవుండు,
హరిదినంబున శ్రీమూర్తి నచలభక్తి | యెసఁగ సద్విప్రునకు దాన మొసఁగెనేని.

111


క.

విలసితసాలగ్రామో | పలమూర్తివిశిష్టుఁడైన పద్మారమణున్
[223]దులసీదళములఁ బూన్చిన | ఫలకాముఁడు వాంఛితార్థపటలముఁ జెందున్.

112


ఏకాదశీమాహాత్మ్యము

క.

ఏకాదశి నుపవాసము | గైకొని తులసీదళమునఁ గమలోదరుపూ
జాకృత్యము దీర్చిన నరుఁ | డాకల్పము విష్ణులోకమందు వసించున్.

113


క.

హరిపుణ్యవాసరంబున | నరుఁ డన్నముఁ గుడిచెనేని నలినాప్తసుధా
కరులు గలయంతకాలము | నరకంబులఁ గూలు హితజనంబులతోడన్.

114


చ.

నిరుపమతీర్థసేవయు వినిర్మలధర్మసమార్జనంబు న
ధ్వరకరణంబు నన్నజలదానములుం జరమాశ్రమక్రియా
స్ఫురణము నర్థికామపరిపూర్తియు నాదిగఁగల్గు పుణ్యముల్
హరిదివసోపవాసఫల మందుల వేయవపాలుఁ బోలునే?

115


వ.

అని యివ్విధంబున సురగురుం డుపన్యసించిన సమయంబున.

116


వసుంధర సురేంద్రునిసభ కరుదెంచుట

సీ.

కబరికాభారంబు గమనవేగంబునఁ | గుప్పించి మూఁపునఁ గునిసియాడఁ,
బవననర్తనశిక్ష ఫాలరంగంబునఁ | గుటిలాలకంబులు [224]గొండ్లిసలుప,
గండస్థలంబున ఘర్మాంబుశీకర | జాలంబు మెల్లన జాలుకొనఁగ
సతతనిఃశ్వాసమారుతమున నాసికా | పుటములు పలుమారు పుటములెగయఁ,


తే.

గుచము లల్లాడఁ, బయ్యెదకొంగు జాఱఁ, | గౌను జవ్వాడ, మోవిపైఁ గాంతి వాడ,
లోని తహతహచేష్టలు కానఁబడఁగ | నరుగుదెంచెను భూదేవి యమరసభకు.

117


వ.

ఇ ట్లరుదెంచిన భూకాంత నాలోకించి, దేవతాసమేతుండగు వురుహూతుం డవ్విష్ణు
భామిని నెదుర్కొని ప్రణతుండై, యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, యొక్కహిరణ్మయ
సింహాసనంబు సమర్పించిన, నద్దేవియు నందు నాసీనయై యాసునాసీరున కిట్లనియె.

118

శా.

కంఠేకాలవరప్రభావవిలసద్గర్వాంధులై, సంగరో
త్కంఠాపూరితులై, సమస్తదివిషత్పక్షావనీనాథులం
గుంఠీభావము నొందఁజేసి, యసురల్ గోర్కెన్ సురప్రేయసీ
కంఠాలింగనకాంక్షు లైరి, దితిదుర్గర్భంబునం బుట్టుటన్.

119


క.

బలవంతు లాసురాహితు | లిలఁ బాలింపంగఁ గచ్ఛపేశ్వరఫణిరా
ట్కులనగవరాహదిగ్గజ | ములకున్ మద్భార మతిసమున్నత మయ్యెన్.

120


క.

కావున మనము ప్రియమ్మునఁ | బోవలయను సకలలోకపూజ్యుండగు శ్రీ
దేవుని సన్నిధి కతఁ డసు | రావలిఁ బరిమార్చి భార మంతయుఁ దీర్చున్.

121


క.

పూర్వమున దుష్టదైత్యుల | గర్వాంధులఁ జక్రధార ఖండించి జగ
[225]న్నిర్వాహపరుఁడు గాఁడె? సు | పర్వులు కొనియాడఁ జనఁడె బహుదారంబుల్?

122


చ.

అమరులు నొచ్చినం, దితిసురావలి హెచ్చిన, నగ్నిహోత్రముల్
సమసిన. ధర్మముల్ చెడిన, సత్యము [226]క్రుంగిన, నీతిమార్గముల్
శమితములైన, వేదవిధి జాఱిన, దుర్జను లెచ్చరించినన్
గమలదళాక్షుఁ డీజగముఁ గాచును దా నుచితావతారుఁడై.

123


వ.

అని పలికిన ధరణీతరుణీమణిఫణితిసరణికి నానందించి, పురందరుండు బృందారక
సందోహంబును, సనకసనందనసనత్కుమారపరమయోగివ్యూహంబును, నారదాదిదివ్య
మునులును, రంభాదిసురకామినులును, గంధర్వకిన్నరకింపురుషగరుడోరగనికాయంబును,
సూర్యాదిగ్రహతారకాసముదయంబును గొలిచి చనుదేర, నా[227]భూమిభామినీలలామం
బురస్కరించుకొని, స్వర్గంబు నిర్గమించి చనిచని ముందఱ.

124


దేవబృందముతో నింద్రుని హరిపురప్రయాణము

సీ.

సిరిఁ గన్నతండ్రి, రాజీవనాభుని మామ, | తామరచూలి మాతామహుండు,
శూలి బోనముకుండ, సురల యాఁకటిపంట, | వాహినీతరుణుల మోహభర్త
యమరధాత్రీజంబు లంకురించినపాదు, | చలివెలుంగులవేల్పు జన్మభూమి,
జలధరంబుల పానశాల, రత్నంబుల | గని, శైలముల డాఁగు మనికిపట్టు,


తే.

చేరవచ్చినతఱి నెంతవారినైనఁ | బూని లోఁగొననేర్చిన భువనగురుఁడు
ననఁగఁ, జూపట్టుచున్న దుగ్ధాంబురాశి | గాంచి, దేవేంద్రుఁ డిట్లనుఁ గౌతుకమున.

125

చ.

ఎడమకుడింత లేక తను నింపునఁ జేరినవారి భంగముల్
కడలకు [228]నొత్తి, జీవననికాయము [229]పాత్తొనరించి, పాటులం
బడి, యనుకూలుఁడై సరసభావమున న్విహరింప నేర్చు నీ
కడలివిభుండు, సర్వబుధకాంక్షితదానకళా[230]ప్రగల్బుఁడై.

126


వ.

అని పయోనిధానంబుఁ గొనియాడి, తత్సమీపంబునం గనుపట్టు వైకుంఠపట్టణంబు
గనుంగొని దివిజులతో నిట్లనియె.

127


సీ.

గగనమండలనవగ్రహము లీపురికోట | నవరత్నబీజ[231]సంభవములొక్కొ?
గంభీరసప్తసాగరము లీపురిదీర్ఘ | పరిఖలప్రతిబింబసరణులొక్కొ?
మేరురోహణముఖ్యభూరిశైలంబు లీ | పురిగోపురములసోదరములొక్కొ?
రంభాదిసురలోకరాజాస్య లీపురి | భద్రేభయానలప్రతిమలొక్కొ?


తే.

దివిజభూజంబు లీపురిఁ దేజరిల్లు | నిరుపమోద్యానతరువులనీడలొక్కొ?
యనఁగఁ గన్నుల కానందజనక మగుచు | సిరులఁ జెన్నొందుఁ గంటిరే హరిపురంబు?

128


చ.

ఉరమునఁ గౌస్తుభంబు సిరియుం, గటిమండలమందుఁ గాంచనాం
బరమును, వామభాగమున మచ్చయు, నాలుగుచేతులం గదా
సరసిజశంఖచక్రములు సమ్మతిఁ దాల్పనివానిఁ గాన మీ
పురవరమందుఁ జిన్నిమొలపూసల[232]పాపనిఁ బట్టి చూచినన్.

129


మ.

దివిజుల్! పంజరరాజకీరముల నర్థిం జూడుఁ, డిచ్చోట భా
గవతస్కంధకథాసుధామధురవాక్యంబుల్ ప్రసంగింపుచు
న్నవి కర్ణంబుల కింపుగాఁగ, నిచట న్రామాయణగ్రంథమున్
సవిశేషోక్తుల విస్తరించు వినుఁ డాశ్చర్యంబుగా శారికల్.

130


సీ.

జాళువా బంగారుజలపోసనము మంచి | వలువలు గట్టిన వన్నెకాఁడు ,
మిసిమిగాలికి నుబ్బు మెత్తని[233]పరుపుపైఁ | బొసఁగ నిద్రింపని పుట్టుభోగి,
ప్రొద్దుపోకలకైనఁ [234]బులుఁగుతేజీ నెక్కి | వీథులఁ బఱవని వేడ్కకాఁడు,
పొక్కిలివెలిదమ్మిపువ్వునఁ బుట్టిన | తనయుని నెత్తి పెంచని గృహస్థు


తే.

యువతిచెక్కులఁ జన్నుల నొక్క మరియు | మకరికలు వ్రాయ హస్తపద్మములు నాల్గు
గరిమఁ దాల్పక యుండని కాముకుండు | లేఁడు హరిపురిలోనఁ బోలించి చూడ.

131

వ.

ఇ ట్లనన్యసామాన్యసంపద్విశేషవిరచితసురచయోత్కంఠంబగు వైకుంఠంబు
గనుంగొని, పురందరాదిబృందారకబృందంబు వందనం బొనర్చె. భూదేవియుం బ్రాగ్ద్వార
ముఖంబున [235]నన్నగరు ప్రవేశించి, హరిమందిరంబు చేరంజని.

132


ధరాదేవీకృతవిష్ణుస్తుతి

సీ.

బహుమణిస్థాపితపాదాంగదమువాని, | జాళువాపసిఁడిపచ్చడమువాని,
[236]నబ్ధిజాకుచచందనాంకవక్షమువాని, | శ్రీవత్ససౌభాగ్యచిహ్నవాని,
హారలతావేల్లితోరుకంఠమువాని, | నవరత్నమయభూషణములవాని,
గండస్థలీచలత్కుండలంబులవాని, | నవ్వులు దొలఁకు నాననమువాని,


తే.

నంబురుహబంధునిభకిరీటంబువాని, | జలధరశ్యామవిగ్రహచ్చాయవానిఁ,
బాంచజన్యసుదర్శనప్రముఖదివ్య | సాధనోజ్జ్వలకరచతుష్టయమువాని.

133


ఉ.

వారిజపత్రనేత్రములవాని, నుదంచితనాభిపంకజో
ద్గారితశారదాధవశతంబులవాని, రమామనోహరా
కారమువాని, సంయమినికాయవశంవదచర్యవాని, ల
క్ష్మీరమణున్, హరిన్, భువనసేవ్యుని, దైవతసార్వభౌమునిన్.

134


క.

వాసవరత్నోత్పన్నవి | భాసముదయభాసమాను, భద్రాసన మ
ధ్యాసీనుఁ జక్రిఁ గాంచె మ | హీసతి యానందభరితహృదయముతోడన్.

135


క.

ధరణీపతి యివ్విధమునఁ | [237]దరణి శతప్రతిము శౌరిఁ దాఁ గని యంతః
కరణమున నలరి యవ్విభు | చరణములకు [238]నెఱఁగి లేచి సంభ్రమ మొదవన్.

136


క.

కరకమలంబులు నిటలాం | తరమునఁ గదియించి, దేవతాగురు లక్ష్మీ
శ్వరు నిఖిలలోకకుక్షిం | భరు హరి, నిట్లనుచుఁ జేరి ప్రస్తుతి చేసెన్.

137


సీ.

దేవ! దేవేశ్వర! దేవారిఖండన! | నిత్య! నిత్యోదయ! నిత్యచరిత!
పద్మజపద్మారిపద్మాప్తసేవిత! | భవహర! భవమిత్ర! భవ్యభవన!
శతపత్రహితశతశతకోటిసంకాశ! | సర్వజ్ఞ! సర్వేశ! సర్వవినుత!
నాగేంద్రనాగారినాగేశవందిత! | కమలాక్ష! కమలేశ! కమలనిలయ!


తే.

చక్రఖండిత[239] సకలారిచక్ర! చక్రి! పరమపదధామ! పరమేశ! పరమపురుష!
నిన్ను సేవింతు సతతంబు నిగమజనక ! | [240]* * * * *

138

ఉ.

ధీరత నెవ్వఁడేని భవదీయలసద్గుణవర్ణనాసుధా
పూరము జిహ్వికాంజలులఁ బూని, భవాతపజాతదాహమున్
దీరగఁ గ్రోలు, నట్టి మహనీయుఁడు దుర్గతి[241]మార్గదూరుఁడై
చేరును ముక్తిధామ మతిశీఘ్రమున న్విగతప్రయాసుఁడై.

139


సీ.

అమరేంద్రశరణంబు లగు నీదుచరణంబు | లంచితభక్తిఁ బూజించువారు,
నిగమసంస్తుతిపాత్ర మగు నీచరిత్రంబు | వీనులఁ దనియంగ వినెడువారు,
నఖిలలోకాధార మగు నీశరీరంబుఁ | దలఁపున నేప్రొద్దు నిలుపువారు,
నమృతపూర్ణద్రోణి యగు నీగుణశ్రేణి | [242]నిరుపమమతిని వర్ణించువారు,


తే.

దండధరఘోరదండప్రచండపాత | నిర్యదుజ్జ్వలహుతభుగున్నిదవివిధ
లోలకీలాపహతులకు లోను గాక | ఘన[243]త నుందురు నీపురిఁ గమలనాభ!

140


ఉ.

దారుణపూర్వకర్మపటుతస్కరవర్గము లీడ్వ గర్భకాం
తారముఁ దూఱి, సంసరణతాపభయంకరబాధ నొందు సం
సారికి, నీగుణప్రకరసంస్తుతి తద్భయమోచనక్రియా
కారణ మంబుజేక్షణ! జగత్పరిరక్షణ! [244]చక్రలక్షణా!

141


చ.

అలయక సంతతంబు రసనాగ్రమునం భవదీయసద్గుణం
బులు గొనియాడియు న్వినియు మోదమునొందు నరుండు, కర్మశృం
ఖలికలు గోసివైచి యవికారత నీతనువందు డిందుఁ బో!
జలము జలంబులం గదియు చందమునన్ సురబృందవందితా!

142


ఆ.

ఘటపటాదులందుఁ గలుగు జాతి వ్యక్తు | లేర్పరింప వశమె యేరికైన?
నట్ల విశ్వమునకు నఖిలాత్మ [245]యగు నీకు | భేదశంక లేదు వేదవినుత!

143


క.

శంకరుఁడని, త్రైలోక్యవ | శంకరుఁడని, దుష్టరాక్షసప్రవరవినా
శంకరుఁడని, కొల్తురు ని | శ్శంక రహస్యాగమార్థచతురులు నిన్నున్.144
క. అంబుజభవుఁ డాదిగఁ గీ | టం బంతము గాఁగఁ బ్రాకటంబైన ప్రపం
[246]చంబునఁ బరిపూర్ణుఁడవగు| చుం బొల్తువు, నీవు లేని చోటును గలదే?

145


క.

ఈ యఖిలచరాచరమున | నీ యెఱుఁగనియట్టి కార్యనికరం బేదీ?
తోయరుహపత్రలోచన! | యే యెడలం గలవె దైవ మెఱుఁగని పొందుల్?

146

శా.

స్పర్ధాకాముకుఁడైన సోమకుఁడు శబ్దబ్రహ్మముం జోరతా
వర్ధిష్ణుండగుచున్ [247]హరించి యరుగన్ వాచాలవీచీలస
ద్వార్ధిన్ దుర్ధరమీనవేషమున నావైరి న్విదారించి, యం
తర్ధైర్యచ్యుతుఁడైన వాక్పతికి నామ్నాయంబు లీవే దయన్?

147


ఉ.

దానవవీరులున్ సురలు దర్పితులై యమృతోదయార్థ మం
భోనిధిఁ దర్చునప్పుడు సముద్రజలాంతరమగ్నమైన మం
థానధరాధరంబుఁ బ్రమదంబునఁ దాల్పవె కూర్మమూర్తివై?
భూనుతభక్తరంజన! ప్రభూతకృపాంజన! దైత్యభంజనా!

148


వ.

అని యివ్విధంబున వసుధావనిత వినుతించిన, [248]నకించిత్పులకకంచుకితగాత్రుం
డగుచుఁ, బుండరీకనేత్రుం డాధరణీతరుణీమణి దిట్టతనంబునం దేనియలుట్టిపడ నొడివిన సుధా
కల్పంబులగు మధురజల్పంబులు చెవులకుం జవులొనర్ప దర్పకలీలాసదనుండును దరహసిత
వదనుండు నగుచు నమ్మగువం జేరందివిచి, జగదీశ్వరుండు సంభ్రమంబున.

149


శ్రీహరి వనుంధరను సాంత్వనపఱచుట

మ.

కరమూలంబుల బాహువుల్ చొనిపి, శృంగారంబు సంపూర్ణకుం
భరుచిం బొల్చు పయోధరద్వయ మురోభాగంబునం దార్కొనం
బరిరంభించి, యుదంచితాధరసుధాపానంబునం దేలి, రా
గరసోద్రేకమునం దదీయసకలాంగస్పర్శనోత్సాహియై.

150


తే.

అంకపీఠస్థలంబున నాలతాంగిఁ | జేర్చి, చిబుకంబు పుణుకుచు సేదదీర్చి,
తత్సమాగమసుఖపరతంత్రుఁ డగుచు | నంబుజాక్షుండు వసుధ కి ట్లనుచుఁ బలికె.

151


సీ.

సుదతులు విరులకై చోఁపిన గమి విచ్చి | పఱచు తేఁటులరీతిఁ గురులు చెదరి,
యస్తమింపగ నేఁగు నమృతాంశుబింబంబు | కైవడి నెమ్మోముకాంతి వెడలి,
రసమింకి కడు [249]వాడి పసచెడు బింబికా | ఫలము చొప్పున మోవిచెలువ ముడిగి,
మొదలి [250]వేరుకుఁ ద్రెవ్వి మురువు దప్పిన పుష్ప | లతలీల మేనివిలాస మెడలి,


తే.

చిన్నఁబా టేర్పడంగ, నాయున్నకడకు | నీవు వచ్చినభావంబు నిర్ణయింపఁ
గార్యమొక్కటి యే దేని కలుగఁబోలుఁ, | దడవు సేయక వినిపింపు తరళనయన!

152


మ.

పరిణామంబె ధరిత్రి నీకు? మఘముల్ పాటింతురే భూసురుల్?
ధరణీనాథులు పాడిమై నడతురే? ధర్మంబు [251]సామాజికుల్

పొరపొచ్చెం బొనరింప కేర్పఱతురే? భూరిప్రతాపోగ్రులై
సురవిద్వేషులు సంభవించరు గదా? సూచింపు మబ్జాననా!

153


వ.

అని సాంత్వనపూర్వకంబుగా నిర్వాణపాలనలీలాప్రవర్తిష్ణుండగు విష్ణుం డానతిచ్చిన
దేవకార్యధురంధరయగు వసుంధర యా సింధుర[252]పదున కిట్లనియె.

154


క.

ఆర్య[253]నుతచరిత! సర్వాం | తర్యామికి [254]నీకు నవిదితము లే దైనన్,
ధైర్యం బారయ వచ్చిన | కార్యము వినిపింతు వినుము కరుణాపరతన్.

155


ఉ.

దారుణదైత్యదానవు లుదగ్రబలాఢ్యులు పుట్టి, యిందుకో
టీరవరప్రభావమున డెందమున న్మదియించి, లోకసం
హార మొనర్ప, నిన్గనుటకై సురలందఱు నేఁగుదెంచి, దౌ
వారికు లడ్డపెట్ట నిలువంబడినారు గృహాంగణంబునన్.

156


వాసవాదుల హరినగరప్రవేశము

క.

అని విన్నవించునాలో | సనకాదులు [255]వాసవాదిసకలామరులున్
మునికిన్నరయక్షాదులుఁ | గనుకని హరినగరు చొచ్చి ఘంటావీథిన్.

157


చ.

మణిమయదివ్యగోపురసమాజములున్ భువనేశ్వరంబులున్
బణములుఁ జప్పరంబులు సభాభవనంబులు దివ్యరత్నతో
రణములుఁ బువ్వుఁదోఁటలును రాజముఖుల్ మొదలైన తత్పుర
ప్రణుతవిశేషముల్ నయనపర్వముగాఁ గనుగొంచు నందఱున్.

158


ఇంద్రాదులను జయవిజయులు నిరోధించి బాధించుట

ఉ.

వారిజనాభు శ్రీ[256]నగరు వాసవముఖ్యులు గాంచి, హస్త
కేరుహముల్ లలాటమునఁ గీల్కొనఁజేసి, నిజప్రయోజన
ప్రేరణ నొండొరుం గడచి భీతి విచారము లేక పూర్వది
గ్ద్వారము చొచ్చిపోవుటయు, వారల కడ్డము [257]నిల్చి గొబ్బునన్.

159


చ.

జయవిజయాహ్వయుల్, కనకశైలనిభాంగులు, వేత్రహస్తు, ల
క్షయశుభశంఖచక్రముఖసాధనవంతులు, పుణ్యలక్షణా
దయులు, నిలింపకోటికి ముదంబున నిట్లని పల్కి రెంతయున్
బ్రియము నయంబుఁ బొంకమును బింకము నేర్పడ నుక్తిచాతురిన్.

160

శా.

శ్రీకాంతాధరణీసతీయుతముగా శృంగారసౌధాంతర
వ్యాకోచప్రసవావళీరచితశయ్యామధ్య నాసీనుఁడై
యేకాంతంబున నున్నవాఁడు హరి, మీ కీవేళఁ దద్దర్శనం
బాకాంక్షించిన నేల కల్గు? సురలారా! తత్తరం బేటికిన్?

161


క.

ఎఱుఁగరు మీరలు కార్య | త్వరితంబున నేఁగుదెంచి తలక్రిందైనన్,
హరియాజ్ఞ లేక యూరక | చొరవచ్చునె మీకు నతని శుద్ధాంతంబున్?

162


క.

ఉండుఁడు మీరిచ్చోట వి | తండావాదములు మాని తాలిమితో, ని
ట్లుం[258]డంగ నోపరేనియుఁ | బొండిప్పుడు [259]మీనివాసభువనంబులకున్.

163


వ.

అని పలికిన జయవిజయుల నయభయగర్భంబులగు వాక్యసందర్భంబులు లెక్క
గొనక, నిర్భరకార్యాపన్నతాకృత[260]వివేకచ్ఛేదులగు వాసవాదులు నీరజోదరు[261]భవనద్వారంబుఁ
దూఱి చనునంత.

164


క.

జయవిజయులు రోషారుణ | నయనంబుల నిప్పులొలుక నాళీకవన
ప్రియ[262]తనయచండదండ | ద్వయసమముల హస్తవేత్రదండముల వడిన్.

165


సీ.

మోదిరి జంభారి[263]ముకుటాగ్రమాణిక్య | పటలంబు నలుగడఁ జిటిలిపడఁగఁ,
జదిపిరి దక్షిణాశావల్లభుని సము | ద్దండదండము సూక్ష్మఖండములుగఁ,
అహరించి రంబుధిప్రభుని పాణిగృహీత | దృఢపాశలతికలు ద్రె[264]వ్వి తొరుగ,
సరిచిరి యక్షనాయకుని కేయూరకం | కణముఖ్యరత్నభూషణము లురుల,


తే.

ననిలుకరములు విఱిచిరి మునులఁ బఱచి | రచలతం దిట్టి రఖిలసంయములఁ గొట్టి
రాగ్రహంబెల్లఁ దమమూర్తు లయ్యె ననఁగ | హరిగృహద్వారరక్షణాయత్తు లగుచు.

166


క.

ఈవిధమున మురభంజన | దౌవారికచండవేత్రదండాహతులై
దేవతలు మునులు గంధ | ర్వావలియును యక్షకిన్నరాదులు యతులున్.

167


జయవిజయులకు ఘోరశాపము

చ.

హరిహయుఁ డాదిగాఁగల మహామహులందఱు దండఘాతజ
ర్జరితశరీరవేదనల రాఁజిన రోషము మిన్నుముట్ట, నా
హరిపదసేవకోత్తముల నల్కఁ గనుంగొని, “మీరు రాక్షస
స్ఫురితకులంబునన్ ధరణిఁ బుట్టుఁడు శ్రీహరికి న్విరోధులై.

168

క.

జననములు మూఁడు మనుజా | శనులై వర్తింపుఁ” డనుచు - శాపము దివిష
న్మునిముఖ్యు లొసఁగి, రత్తఱి | మొనసిన కలకలము వినియె మురభంజనుఁడున్.

169


శౌరి సాక్షాత్కారము

చ.

విని దనుజోగ్ర[265]ఘోషమని వేగమె చక్రము పూని, దైత్యభం
జన మొనరింపఁగా నుదితసంభ్రముఁడై చనుదెంచి, సజ్జనా
వన[266]ధనుఁడైన శౌరి [267]తలవాకిట నిల్చిన, నా రమావిభుం
గనుగొని రింద్రముఖ్యులు, వికాససమంచితనేత్రపద్ములై.

170


చ.

వికసితనేత్రబృంద మరవిందవనంబుగ, హర్షబాష్ప[268]నీ
రకణము లుప్పతిల్లు మకరందముగా, [269]దమమీఁద సారెసా
రెకు హరిమేనిచాయ ప్రసరించుట తేఁటులరాకగా, సుర
ప్రకరము లత్తఱిం గొలనిభావము దాల్చె[270]ను ఘర్మతోయతన్.

171


చ.

పరమయతీంద్రహృద్గుహలఁ బాయక క్రీడ యొనర్చుచుండు నీ
హరి చనుదెంచె, నిప్పుడ రయంబున వీక్షణనీలరశ్మి వా
గురికలచేఁ దగుల్పఱచుకొంద మటంచుఁ దలంచియో సుమీ!
సురపతిముఖ్యు లొక్కమొగిఁ జూచిరి తత్సకలాంగకంబులన్.

172


క.

దివిజేశ్వరాదు లీక్రియ | భువనేశ్వరుఁ గాంచి, హర్షపూరితులై యు
త్సవలీల మ్రొక్కి, వేద | స్తవములఁ గొనియాడి రుదితతాత్పర్యమునన్.

173


తే.

అపుడు జయవిజయు [271]లిరువు రంబుజాక్షు | పదములకు వాలి శాపసంప్రాప్తి శోక
బాష్పధారాసమర్పితపాద్యు లగుచు | హస్తయుగములు మోడ్చి యి ట్లనిరి హరికి.

174


ఉ.

సారసనాభ! మీపనుపు సంతతముం దలమోచి మందిర
ద్వారముఁ గాచియున్న మము వాసవముఖ్యులు ద్రోచి చొచ్చినన్
వారల నడ్డగించితిమి వాక్పరుషత్వముఁ జూపి, మాకు దౌ
వారికధర్మముల్ విడువవచ్చునె స్వామిహితంబు వీడ్వడన్?

175


క.

ఇది తప్పుచేసి త్రిదశులు | సదయత్వము వదలి మూఁడుజన్మంబులు మీ
పదములకుఁ బాసి దైత్యత | నుదయించఁగ శాపమిచ్చి రూరక మాకున్.

176

క.

మురహర! యీ[272]శాపానల | పరితాపము మాన్ప నొం డుపాయము మాకున్
దొరకునె? నిర్హేతు భవ | త్కరుణామృతసేచనంబు గలుగక యున్నన్.

177


వ.

అని శాపాగమనవృత్తాంతం బెఱింగించి, కించిదాకుంచితముఖులై పదనఖ
ముఖంబుల నేల వ్రాయుచుఁ, గన్నీరు మున్నీరుగా జాఱ నూరకున్న, దౌవారికులకు దానవారి
కరుణాతరంగితంబులగు నపాంగంబుల నవలోకించి యిట్లనియె.

178


జయవిజయులకు నభయప్రదానము

సీ.

ఏమి సేయఁగ వచ్చు, నింద్రాదిదివ్యులు | కోపించి మీ కిట్లు శాప మిచ్చి,
రది బ్రహ్మరుద్రాదులైన మాన్పఁగలేరు, | దైవికదుఃఖంబు దగులకున్నె?
కార్యంబు లుదయించుఁ గర్మానుగుణములై, | [273]కాఁగల పను లేల కాక మాను?
జన్మాంతరంబుల సంచితంబగు కర్మ | మనుభవించినఁగాని యణఁగిపోదు,


తే.

దీనికై యుమ్మలింపక, దితికి మీరు | తనయులై పుట్టి, రాక్షసత్వము భజించి
యవని యేలుఁడు, తోడన యవతరించి | మిమ్ము వధియింతు [274]నే నిదె నమ్మి చనుఁడు.

181


క.

నను నిందించిన దోషం | బును జెందదు మిమ్ము, జన్మములు మూఁడును గై
కొని మత్సాయకహతులై, | కనియెద రటమీఁదఁ బూర్వగతి [275]మత్పదమున్.

180


క.

గర్హితదితిసుతభావ మ | నర్హంబని యంటి రేని, యమలిన ధరణీ
బర్హిర్ముఖవంశజులై, | గార్హస్థ్యముఁ దాల్చి యజ్ఞకర్మ[276]స్థిరులై.

181


క.

వేదాంతశాస్త్రపారగు | లై, దానతపోనిరూఢు లై, రక్షితమ
ర్యాదులయి, యేడు[277]జన్మము | లాదరమునఁ గడపి కాంచుఁ డస్మత్పదమున్.

182


వ.

అనిన, జయవిజయులు, లోకవిష్ణుండును బరమయోగి[278]మనఃకమల[279]వర్తిష్ణుండును
గరుణామృతవర్దిష్ణుండు నగు విష్ణునకుం బునఃప్రణతులై, యిట్లనిరి.

183


క.

ఫణిశయన! మిమ్ముఁ బాసిన | క్షణ మొక్కటి మాకు బ్రహ్మకల్పంబగు, బ్రా
హ్మణుల మయి సప్తభవములు | గణనాతీతాబ్దతతులు గడవఁగఁ గలమే?

184


క.

[280]జననత్రయమున రాక్షస | తనువులు గైకొని జనించి, తావకవైరం
బను నావచేత, నాప | ద్వననిధి వేగంబ దాఁటువారము కణఁకన్.

185

ఉ.

తామసజన్మభూమి యగు దానవవంశమునం జనించి యే
మేమియు బుద్ధిలేక, జగదీశ్వర! నీ కొనరించునట్టి నిం
దాముఖదుష్కృతంబులు మనంబునఁ బెట్టక కావుమీ సుర
గ్రామణి! యంచుఁ బల్కి, దితిగర్భముఁ దూఱఁగ నేఁగి రిద్దఱున్.

186


వ.

అని పలికి.

187


ఆశ్వాసాంతపద్యగద్యములు

చ.

[281]పరమకృపావతార! కుల[282]పాలన! సద్ద్విజలోకమానితా!
శరధిగభీర! [283]సాలబలజాల! గుణ[284]ధ్రవభోగవాసవా!
సరసకళావిచారి! వరసారసమిత్రరమాకృపాణ! ని
ర్భరనగరాజధీర! నవభావజ! నిత్యవిరాగకామితా!

188


క.

దిఙ్మానినీకచాగ్ర | స్రఙ్మంజులకీర్తిధన్య! సకలక్షోణీ
భుఙ్మాన్య! సుజనసమ్మత | వాఙ్మాధుర్యాభిరామ! వైభవరామా!

189


మాలిని.

విమలగుణవిశాలా! విస్ఫురత్కీర్తిలోలా!
సమయవిహితదానా! సర్వవిద్యానిధానా!
కమలరుచిరనేత్రా! గంగమాంబాసుపుత్రా!
హిమగిరిసమధైర్యా! యెఱ్ఱనామాత్యవర్యా!

190


గద్యము

ఇది శ్రీ హనుమత్కరుణావరప్రసాదాసాదితసారస్వతనిరాతంక, చంద్రనామాంక
రామవిద్వన్మణితనూజాత, అష్టఘంటావధానపరమేశ్వరబిరుదవిఖ్యాత, హరిభట్టప్రణీ
తంబైన వరాహపురాణంబునఁ, గైవల్యఖండంబను పూర్వభాగంబునందుఁ బ్రథమాశ్వాసము.

  1. మణీశ్రీ - మ, మా, హ
  2. స్థలా - అన్ని ప్ర.
  3. సెంది - త, తా
  4. భూవరకు - క
  5. శ్రీ లిచ్చు - హ
  6. ఁగావుత - మ, తి, తి, హ, ర, క
  7. నఘ - మ, తి. హ, ర, క; ఘన - త
  8. ద్వయీ - తా
  9. దగిలి - మ, తా, ర, క
  10. కోటి - తా
  11. భారతీ - మ, మా, త, తి, హ, ర
  12. శూరు - మా
  13. విద్వన్మణి - తీ; విద్వన్మనోహర - క; విద్వన్మనోంబుజరవి భారవి - తా
  14. శ్రీహారు - మ, తి, తీ, హ, ర, క
  15. మతాంధ్ర - మ
  16. నన్నయార్యు - క
  17. రాజార్చిత - మ, మా, త, తా, ర
  18. వాక్య - క
  19. జూచు హీనమానవగేహంబుల - మ; హీనమానవ గేహంబుల మా, త; జూచు మావనగేహంబుల - తా; జూచు హీనవదేహంబుల - తి, హ, క; జూచి హీన వధేహంబుల - తీ
  20. సందికంతల - త; సందిగంతుల - తా; సందు గొందులనె - తీ
  21. మంది (యతి?) - తి, ర, క
  22. రసాలంకారానుబంధంబుగా - త, తీ, ర, క
  23. వచనరచనా - తా; పద్యకావ్యంబుగా - తీ; భవ్యంబుగా రచియింపంబూనిన సమయంబున - క, ప
  24. 9 - 18 వఱకు క ప్ర. లో లుప్తము
  25. భావన స్మృతుల - తీ
  26. పెన్న- మ, తా
  27. బిలేశ - తీ; విలేశ - మ, తి; వివేశ - హ, ర
  28. వసతి - తీ
  29. నెక్క - తీ
  30. వేణునినాదంబు ఘన - త
  31. నా కిఁక - తా
  32. గోష్ఠీమధురా - త, హ
  33. జ్యేష్ఠుడగు - మా
  34. విశేషకావ్యరచనాహంభావవాగ్రామణీమూర్తివి - మ; యశోవిశేషరచనాహంభావసంభావవాగ్రామణీ - తా; విశేషకావ్యరచనాహంభావవాగ్రామణీ రమణి - తి; విశేషకావ్యరచనాహంభావపుంభావనారమణి - తీ; విశేషకావ్యరచనాహంభావవాగ్రామణీదమసమ్మూర్తివి - హ; విశేషకార్యరచనాహంభావవాగ్రామమూ ర్తివి - ర
  35. రాఘవార్య - తి,హ,ర
  36. నభినుతముగ - మా, హ
  37. పీతాంబరా-హ
  38. నంద మా; డిందె -త
  39. వినిర్మిత - తా
  40. పదనీరజ - త
  41. నఖత్కీర్తి - మా
  42. మధుర - మా, తి, తీ, హ, ర
  43. వంగ - తి, హ
  44. సచివాకారముల ధాత్రిఁబొడమిన సారస - మ, మా, త, తి,తీ, హ, ర
  45. సారససంభవఫణీంద్ర - తి
  46. రక్త శక్తి - తా
  47. సతతదానప్రశస్తములు హస్తమ్ములు - మ, మా, తా, తి, హ, ర; సతతదానప్రశస్తములు హస్తములు వాంఛితజనసతలార్థ - తీ
  48. శ్రీల సత్సకలార్థ - తా
  49. వర్ణనా - త
  50. కామధేనునిర్జరరత్న - తీ
  51. పధానివనిత - మ; వధానజనిత - మా; వధానవినుత - తా; వధానవితతి - తీ; పధానవనిత - హ; విధానివనిత - ర
  52. ధార - మ, మా, త, తి, హ, ర
  53. ధవళచంద్రిక - హ
  54. భవ - మ, త, తా, తి, తీ, హ, ర
  55. ప్రియా - మ, తా, తా, తీ, హ, ర
  56. వెలయ - మ, మా, త, తీ, హ
  57. తిప్పను - తి, హ, ర
  58. లేఖా - మ, త, తి, తీ, హ, ర
  59. కథ - త, తి, తీ, హ, ర, మ, మా
  60. యశః - తీ
  61. సౌరి - తీ
  62. ది అక్షరగుణితవృత్తము
  63. గూఢ తృతీయము
  64. భూరి - త, తా
  65. కాంత - హ
  66. విభుఁడు - తి, తీ, హ
  67. వరు - తి
  68. మహాభాగవతసమంచిత - త
  69. వర్యా
  70. సుస్థిర (యతి?) - మ, త, తా, ర; సంస్థిర - మా
  71. మహితదుఃఖచటనాసముద్ధామ - మ; మహితాదంభాచలనామసము - త; మహిదుగ్ధంబాచలనామ - తి, హ
  72. ద్గానామృత (ప్రాస?) - మ, మా
  73. కెఱ్ఱనాఖ్యమంత్రీంద్రునకున్ - తీ; కెఱ్ఱనామమంత్రీంద్రునకున్ - తి, హ, ర; కును రోషమదహరణునకున్ - మ
  74. కోటి - ర
  75. సఖునకు - మా
  76. ఈ పద్యము తీ - ప్ర.లో లుప్తము
  77. చైత్యునకు - మ, ఆ, తి, హ, ర; చైత్రునకు(?)
  78. సిధ్ధమాన - మ, మా, తా, త, తీ, హ, ర, క
  79. హర - త
  80. రాడ్వాహామృతో - తీ; రాడ్డాహామృతో - హ, ర
  81. ధారాగమకితచలితజలహరిత - తా
  82. రక్షణ - ఘ, తా, హ, ర
  83. మధురమధు - మా, త, తా, తి, తీ, హ, ర
  84. పరమేశ్వరతత్త్వ - తీ
  85. లాలితంబు - తీ
  86. లక్ష్మణాధిదైవతంబును - తా
  87. ప్రశంసించి - తీ
  88. ధిక్షాఖిలక్ష్మాధిశుం - మ; దీప్తాఖిలక్ష్మాధిశుం - మా; దీప్తాఖిలక్ష్మాధిపున్ - త; దిశ్శాఖిలక్షాధిశున్ - తీ; దిక్ష్మాఖిలక్షాధిశున్ - ర; దిక్ష్మాఖీలాధీశున్ - క
  89. ఘనసింధూఫల - మ, తా, హ, ర, క
  90. తత్కృత- మా
  91. గూర్చుండి - త, తి
  92. స్వనముల - త, తా,హ,ర, క
  93. మదనుని - తి, తీ
  94. రీతి - మ
  95. నురోజంబు భాసురవనజంబు - తీ
  96. మధురంబు - మ, మ, త, హ, ర
  97. కాంత - మా, త
  98. ణాఖ్య - తీ, హ, ర
  99. విస్సట్లు - మ, తీ, హ, ర, క
  100. కోరి యటఁ బవ్వళించగ - మ; కూరిమియప్పు డుపద్రవ - హ, క
  101. లోఁ జిగురొత్త - తా
  102. బరమ - తీ
  103. సద్గుణసుకృత మెన్న - తా
  104. నదస్తతులు - తి, తీ
  105. గళ్ళు - తీ భిన్నప్రతులు
  106. నామాభీల - తీ
  107. వక్ర - మ, హ, త, తా, తి; సక్ర - తీ
  108. గుండు - తీ
  109. యుండు - అన్నిప్ర
  110. బాలుఁడవై - తా; జాలకుఁడై - మ, మా, తి, హ, ర
  111. భక్త - త, తా, తి, తీ, హ, ర
  112. విచ్చేసిన - హ
  113. కినతి వినయా - మా; కేసరి - త; వినయాన్వితుఁడై తనివొంది దంత - తా
  114. కుశలప్రశ్నపూర్వకముగ - మ, మా,హ; పూనిననుఁగుశల - త; పూని కుశలములను - తా
  115. హరి - హ
  116. చర్యార్థంబు - త
  117. కలుషములు - మ
  118. ముదమున మాకున్ - త; మునుకొని నాకున్ - తా; మునివర మాకున్ - హ, ర, క , తి
  119. విహిత - మ, ర
  120. కార్తి నొందుచు - క
  121. దుర్వికారహరంబులఁ దొడరు పదము - క; దుర్వికారహరంబగు హితపథంబు(యతి?) - మ, మా; దుర్వికారంబునందు హితపదంబు - తా; దుర్వికారహరంబగు సద్యోఫలంబు - తీ
  122. విదుల - త
  123. విహరించు - తీ
  124. గిరులందు మునులయందు (యతి?) - మ, త, తి, హ, ర, క
  125. ఈ ప. తీ ప్ర. లో లుప్తము
  126. నంబుజోదరు దివ్య - తీ
  127. స్థితి - తా
  128. సేయఁబూనె నదెట్లనన్ - తీ
  129. పూనికె - మ, తా, క; పూనికి - మా
  130. డే పరతత్త్వము - తా
  131. మొండు - తీ
  132. పతి - హ
  133. లణఁగున్ - క
  134. తోటి - అన్నితాళ. ప్ర
  135. నిష్ఫలమౌ- తీ
  136. బాఱ - హ, ర
  137. దామనములు - మా, త
  138. దేహసంబంధబంధనములు - క
  139. లిట - మ, తా,తి,హ, ర, లవి - క
  140. లందు నుచిత స్థితి - తి, హ, ర, క
  141. మోహంబు - మ, తా, తి, తీ, హ, ర
  142. శంఖంబులను - తీ
  143. పర - తా
  144. ప్రాంతంబులన్ - హ
  145. మధురా - త
  146. ధారమునం దగుల్పడువిధంబు సమీరము - మా
  147. దద్జ్ఞత - మ, తి, తీ
  148. మేటి - తా; మేధ - త; మేద - మ, మా, ర, హ
  149. ధీషండ - మా
  150. భూషితం - అన్ని ప్ర.
  151. ఇది మ. ప్ర. పాఠము; నిజమైనహరిభక్తి త్యజియించి జనులెల్ల వేషధారణులయి వెలయునపుడు - తి, తీ; దుష్టసంకీర్ణమై శిష్టజనోపద్రవము
    సేయు నిమ్మహి వనరునపుడు హ; మా, త, తా, ర, క ప్ర. లో పాదము లుప్తము
  152. జన్మించు-తా
  153. పూర-మా
  154. ముద్దురాలు - మా
  155. గొనలచేఁ గలుముల నొనరుచు సతి - తీ
  156. యట్టి - మ,మా,త,తా; యద్ది - హ,ర,క
  157. ఏనెలవున నేరూపున నామమున దలంచితేనియును జనుం డానెలవున నారూపున నానామమునఁ దోఁచు లొలత హరియున్ - మ
  158. పూరితబహుతరమగు - తా
  159. ఇట్లు - తా
  160. దేహంబుల- తి,తీ,హ,ర
  161. యయ్యెం గద - మ,తి,తీ,హ,క,ర; యైతగు కథ- తా
  162. విమల (యతి?)-మ,హ,క
  163. మది నుత్సుకుఁడైన (యతి ) - తీ
  164. నట్టిది-త; నట్టియ దైన - మ,తా,తి,తీ,హ,ర,క
  165. మద్వచన - మా
  166. సోదరు-హ
  167. పాదంట - తీ
  168. వహించిరి - తీ
  169. ‘ర’ ప్రతిలో పాదము లుప్తము.
  170. నొంచి-మా; మించి - త
  171. పుష్ప - మా,త
  172. షష్ఠ - మ,మా,హ,ర
  173. కులకోటి - తా,తి,తీ,హ,గ,క
  174. తోడుత గళమున - తి,తీ,హ; తోగర - త,మా; గరమూలకప్పు - మా
  175. దాయక - తీ
  176. చిత్ర - మ,త,తీ,హ,ర,క
  177. పంక్తి - తి,తీ
  178. గరళగళా - తి,తీ
  179. గండములపై - తీ
  180. సరణ - మ,మా,తి,తీ,హ,ర,క
  181. ధర సలిలానల - మా; సలిలశిఖి - తా
  182. మౌళి- తీ
  183. కుముదంబు - మా
  184. తల - తీ
  185. వచ్చునే - క
  186. దెల్పుదున్ - మ,మా,త,తి,తీ,హ,ర,క
  187. డనంగ - మ,మా
  188. నిరుపద్రవమై - మ,హ,ర,క
  189. శూలి - మ,తి,తీ,హ,ర,క
  190. ఈ ప. తీ. ప్ర. లో లుప్తము
  191. స్రుక్క - మ,తా,హ,ర,క
  192. చింగె - మ,హ,ర,క
  193. పరధర్మము (యతి?) - తా
  194. గిట్టె - త, తా
  195. కాంతి - తా; కార్తిఁ గనుమూయ - అన్ని ప్ర.
  196. చిత్ర - తా, తి, తీ; జిత - మ,హ,ర
  197. విశ్వాస - తీ
  198. గుఱుతై - మ,తి,తీ,హ,క,ర; గురుఁడై - మా
  199. బాటు వాటిలెన్ - క
  200. హరణో (ప్రాస?) - మ
  201. మసురుల- తి,తీ,హ
  202. చతురోపాయ - అన్ని తాళప్ర.
  203. వలనొప్ప వలసిన - త
  204. మేలుగీడు - తీ
  205. విప్రకార్య (యతి?) - మా
  206. బందఁగ - తి,తీ
  207. దెంచనం - తి,తీ,హ; డించనము - త, తా
  208. మంతులు - తా
  209. వినవే - తీ
  210. ప్రసాద - తి,తీ
  211. దైత్యుల - తా; వారిత - క
  212. కుటిలుర - మ;మా;తి,తీ,హ,ర
  213. రూపుమొగి - మ,మా,హ,క,ర; రూపమొగి - తి,తీ
  214. డాత్ముఁ డాతఁడె - మ,తా; డా మహాత్ముఁడు - త, మా
  215. ముఖరుల్ - తా
  216. నాయకుఁడై శ్రీ - తి,తీ,హ,ర,క
  217. ధర - తా
  218. మతిభజియింపుము - మ,తి,తీ,హ,ర,క
  219. సేవ్యయు - హ,క,ర; నవ్యయు - మా
  220. నందావహించి - అన్ని ప్ర.
  221. కారోహణ - తా,క
  222. దూషణోన్నతఘోర - తా; దూషణస్తుతి మహా - మ,మా,తి,తీ,హ,ర,క
  223. దులసిం బూజించినఁ దగ - మ; దుళసీరమణుని బూన్చిన - త,మా
  224. గోష్ఠి
  225. న్నిర్వహణపరుఁడు - మా,త,తి,తీ,ర
  226. కుందిన - త
  227. భూమీలలామం - మ,తి,తీ,హ,ర,క
  228. నెత్తి - తి,తీ
  229. లో సవరించి - మా
  230. ప్రగల్బ్యుఁడై - మ,మా,త,తా,క
  231. సంగమము (యతి?) - ర
  232. పట్టిని వేడ్కఁ జూచినన్ - హ
  233. కడుపుపై - మ,మా,త,తా,హ,ర,క
  234. బులుగులజీ నెక్కి - మ
  235. నగరంబు - అన్నిప్ర
  236. ఈ పా.ర. ప్ర. లో లుప్తము
  237. ధరణీశ వ్రతము - హ,ర,క
  238. నొరగి- అన్ని ప్ర.
  239. కమలారి - త
  240. అన్ని ప్ర.లో పా. లుప్తము
  241. దూరమార్గుఁడై - తి,తీ,ర
  242. నీరూపు మదిని - మ,తా,తి,తీ,హ,ర,క; నిరుపమ మదిని - త
  243. తనుం డగు - త
  244. దుష్టశిక్షణా - త; చక్రరక్షణా - మ
  245. వగునీకు - తా
  246. చంబంతన - త
  247. విరించి - తి,తీ,హ,ర,క
  248. నగ్గించిత - క
  249. వాడువారిన (యతి?) - మ,మా,త,తి,తీ,హ,ర,క
  250. వేరును ద్రెవ్వ - త
  251. సామాధికుల్ - అన్ని ప్ర.
  252. వరదున - తా,ర
  253. సుర - మ,త
  254. నీకభావిత నా కేదైనన్ - తా; 2 నీకు నేదితములే - తి,తీ,హ,ర
  255. నారదాది - తా
  256. నగరి - త
  257. వచ్చి - క
  258. డఁదగ - తి,తీ,క
  259. నిజ - క
  260. వివేకభేదు - మా,త,తి; వివేకవేదు - తా
  261. భువన - మ,తి,తీ,హ,ర,క
  262. తాయతచండ - మ,త; తయనుచందా - తి,తీ,క; తయచండా - హ,ర
  263. మకుటా (యతి?) - త
  264. ద్రెళ్ళి - మ,తా
  265. ఘోషమున - హ,ర,క
  266. తను - తి,తీ
  267. తన - మ,తి,హ,ర
  268. ముల్ నికరణ ముప్ప - మ; నేత్రకణములుప్ప - క ; నీరకణములుప్ప - మా,త; తోయకణములుప్ప - తి,తీ,హ,ర
  269. రమ - తీ
  270. నఘర్మ - అన్ని ప్ర; సమర్మ - మా
  271. లిద్దరునంబు (గణము?) - అన్ని ప్ర.
  272. శాపోక్తుల - మా
  273. రాఁగల పనులేల రాకమాను - త
  274. నేనిది - మ,త,తి,తీ,హ,ర,క
  275. మత్పురమున్ - మ,మా,త
  276. స్థితులై - త
  277. భవముల నాదర - త
  278. మర్మ - తి,తీ
  279. వర్ధిష్ణు - అన్ని ప్ర.
  280. అనుభవముననీ - మ,తి,తీ,హ,ర,క; ఘనశత్రులమై - మా; ఘనవైరంబున - త
  281. నాగబంధము
  282. పావన - అన్ని ప్ర.
  283. సార - త,తా
  284. ధ్రువ - మా; వ్రత - తా