లోకోక్తి ముక్తావళి/సామెతలు-పు

వికీసోర్స్ నుండి

2242 పిల్లికి రొయ్యల మొలత్రాడు గట్టితే అసుంటాబోయి నోట్లో వేసుకున్నదట

2243 పిల్లికి యెలుక సాక్షి

2244 పిత్రార్జితం అంతా కరారావుడి చుట్టటం అయింది

2245 పిల్లిని చంక బెట్టుకొని పెండ్లికి వెళ్ళినట్లు

2246 పిల్లిని చంపిన పాపం నీది బెల్లం తిన్న పాపం నాది

2247 పిల్లి బ్రహ్మహత్య

2248 పిల్లి బ్రాహ్మణుడు, పీట ముత్తైదు

2249 పిల్లి శాపాలకు ఉట్లు తెగునా

2250 పీటకు పిఱ్ఱకూ వైరం

2251 పిరికిఅంటూ రానేగూడదుగాని వచ్చిందంటే పిచ్చికుక్క కరచినట్లే

2252 పిల్చేవారుంటే బిగిసేవారు శానామంది

పీ

2253 పీతాంబరం ఎరువిచ్చినమ్మ పీటవెంబడి పెట్టుకు తిరుగ వలసినది

2254 పీనుగకు చేసిన జాతర

2255 పీనుగుకు ఎక్కదో గద్దలక్కడ

పు

2256 పుంగనూరు సంస్థానం

2257 పుంజం పెట్టినది బట్ట లంచం పెట్టినది మాట

2258 పుంటిశూరలో పుడక రుచి మాంసములో బొక్కరుచి 2859 పుంటికూరతిన్న పుట్టినిల్లు పాశముతిన్న పరాయియిల్లు

2260 పుచ్చకాయల దొంగ అంటే బుజముతడవి చూచుకున్నట్లు

2261`పుచ్చిన మిర్యాలైనా జొన్నలకు సరితూగక పోవు

2262 పుచ్చిన విత్తనాలు చచ్చినా మొలవవు

2263 పుట్టడం చావడం కొరకే

2264 పుట్టనిబిడ్డకు పూసలు కట్తినట్లు

2265 పుట్టనిబిడ్డకు పేరు పెట్టినట్లు

2266 పుట్టమన్ను వేసిన పుడమి పండుతుంది

2267 పుట్టమీద తేలుకుట్టినా నాగుమయ్య మెహిమేనా

2268 పుట్టకు ధ్వనియెత్తితే పట్టేడు మొగుడికి ద్వానెత్తితే పుట్టేడు

2269 పుట్టించినవాడు పూరిమేవుతాడా

2270 పుట్టిన్నాటినుంచీ వుల్లిగాడే మొగుడా

2271 పుట్టిన్నాటిబుద్ధి పుడకలతోగాని పోదు

2272 పుట్టినపిల్లలు బువ్వకే'డిస్తే అవ్వ మొగుడు కేడ్చినట్లు

2273 పుట్టినన్నాళ్ళకు పురుషుడు యజ్ఞముచేసెను

2274 పుట్టినవానికి తమ్ముడు పుట్టేవానికన్న

2275 పుట్టుచాయెగాని పెట్టుచాయ్వచ్చునా

2276 పుట్టువాసనా పుట్టుశాస్త్రుల్లా పెట్టుశాస్త్రుల్లా

2277 పుట్టెడాముదాము పట్టించుకొని దొర్లినా అంటదుశిరి

2278 పుణ్యం పుట్టేడు పురుగులు తట్టేడు

2279 పుణ్యానికి పుట్టేడిస్తే పిచ్చకుంచమన్నట్లు

2280 పుణ్యానికి పెట్టేఅమ్మా నీమొగుడితో సమానంగాపెట్టు 2281 పుణ్యానికి పోతే పాపమెదురైనది

2282 పుత్రుడై వేధింతునా శత్రుడై వేధింతునా పేరులెని దయ్యమునై వేధింతునా పెనిమిటినై వేధింతునా

2283 పుచ్చిన వంకాయలు బాపనయ్యకు

2284 పెక్కురేగుల్లో ఒకజిల్లేడు బ్రతుకునా

2285 పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడుపిట్ట అడుగైనాతడియదు.

2286 పురుగు చట్టం పిండినట్లు

2287పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బచ్చి చెట్తుక్రింది నానదు

2288 పుబ్బకెరలితే భూతం కెరలినట్లు

2289 పుబ్బ రేగిగినా బూతురేగినా నిలువదు

2390 పుబ్బలో చల్లేదానికంటె దిబ్బలో చల్లేది మేలు

2291 పుబ్బలో పుట్టెడు చల్లేకంటే దిబ్బలో మఖలో మానెడు చల్లితే మేలు

2292 పుబ్బలోపుట్టెడు చల్లేకంటే ఆశ్లేషలో అడ్డెడుచల్లేది మేలు

2293 పుబ్బలొ పుట్టి మఖలో మాడిపోయింది

2294 పురిట్లోనే నందు కొట్ఘ్టింది

2295 పుర్రు కారుతూవుంటే పోతరాజు శివమాడినట్లు

2296 పురుగు గిరుగుంతిని పుట్టలో నుండక యూరివార్తలన్ని యుడుము కేల

2297 పురుష సింహుడైతే పురుషుణ్ణే పెండ్లాడవలెగాని స్త్రీని పెండాడడమెందుకు

2298 పులగంమీదికి తేడ్డెడుపప్పు 2299 పులికడుపున చలిచీమలు పుట్టునా

2300 పులికాకలైతే గడ్దితింటుందా

2301 పులినాకి విడిచినట్లు

2302 పులిని చూచి నక్క వాతపెట్టుకున్నట్లు

2303 పులిపక్కను జోరీగవున్నట్లు

2304 పులిపిల్ల పులిపిల్లే మేకపిల్ల మేకపిల్లే

2305 పులిగాడికి గిలిగాడు

2806 పులిమీసాలుపట్టుకు వుయ్యాలలూగినట్లు

2307 పువ్వు విప్పగానే పరిమళం

2308 పుష్యమాసమునందు పువ్వులుగుచ్చ పొద్దుండదు

2309 పుష్యమాసానికి పూసంతవేసంగి

పూ

2310 పూజకొద్దీ పురుషుడు పుణ్యంకొద్దీ పుత్రుడు

2311 పూటకూళ్ళకు వచ్చినవాడికి పుట్లధర యెందుకు

2312 పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు

2313 పూచినతంగేడు వేసినా కాసినవెంపలి వేసినా నేను వండుదును

2314 పూచిన పూవెల్లా కాయాఐతే భూమిపట్ట చోటుండదు

2315 పూతకుముందే పురుగుపట్టినది

2316 పూరా మణిగిన వానికి చలేమి, గాలేమి 2317 పూల చేరెత్తినట్లు

2318 పూలమ్మిన చోట పుడక లమ్మినట్లు