లోకోక్తి ముక్తావళి/సామెతలు-పీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2242 పిల్లికి రొయ్యల మొలత్రాడు గట్టితే అసుంటాబోయి నోట్లో వేసుకున్నదట

2243 పిల్లికి యెలుక సాక్షి

2244 పిత్రార్జితం అంతా కరారావుడి చుట్టటం అయింది

2245 పిల్లిని చంక బెట్టుకొని పెండ్లికి వెళ్ళినట్లు

2246 పిల్లిని చంపిన పాపం నీది బెల్లం తిన్న పాపం నాది

2247 పిల్లి బ్రహ్మహత్య

2248 పిల్లి బ్రాహ్మణుడు, పీట ముత్తైదు

2249 పిల్లి శాపాలకు ఉట్లు తెగునా

2250 పీటకు పిఱ్ఱకూ వైరం

2251 పిరికిఅంటూ రానేగూడదుగాని వచ్చిందంటే పిచ్చికుక్క కరచినట్లే

2252 పిల్చేవారుంటే బిగిసేవారు శానామంది

పీ

2253 పీతాంబరం ఎరువిచ్చినమ్మ పీటవెంబడి పెట్టుకు తిరుగ వలసినది

2254 పీనుగకు చేసిన జాతర

2255 పీనుగుకు ఎక్కదో గద్దలక్కడ

పు

2256 పుంగనూరు సంస్థానం

2257 పుంజం పెట్టినది బట్ట లంచం పెట్టినది మాట

2258 పుంటిశూరలో పుడక రుచి మాంసములో బొక్కరుచి