గద్య— ఇది శ్రీమదుమామహేశ్వరకరుణాకటాక్షవీక్షాపాత్ర,
యేనుగ లచ్చయామాత్యపౌత్ర తిమ్మనామాత్యపుత్త్ర,
వివిధవిద్వజ్జనవిధేయ, లక్ష్మణకవినామధేయప్రణీ
తంబయిన రామేశ్వరమాహాత్మ్యంబను
మహాప్రబంధమునందుఁ
దృతీయాశ్వాసము.
రామేశ్వరమాహాత్మ్యము
చతుర్థాశ్వాసము
|
మల్లనమంత్రిమనః
కామితఫలదాయికల్పకద్రుమశుభకృ
న్నామగురుజానపల్లీ
ధామా మల్లేశలింగ ధరణిశతాంగా.
| 1
|
వ. |
అవధరింపుము శౌనకాదిమహర్షులకు సూతుం డి ట్లనియె.
| 2
|
క. |
అవనిసురులార యిప్పుడు
వివరించెద నేను మీకు విస్పష్టముగా
|
|
|
భవహర మగురామేశ
స్తవరాజం బిది వినుండు శ్రద్ధాయుక్తిన్.
| 3
|
క. |
శ్రీపతి రాముఁడు లింగ
స్థాపన మొనరించి యందు సర్వేశ్వరు గౌ
రీపతినిఁ బాపహరుఁ గరు
ణాపరు రామేశుఁ బొగడె భక్తి దలిర్పన్.
| 4
|
గీ. |
మఱియు సౌమిత్రియును లోకమాన్య జాన
కియును సుగ్రీవముఖు లైనకీశవరులుఁ
గమలజాదిసుపర్వు లగస్త్యముఖ్య
మునులు వేర్వేఱఁ బొగడి రి ట్లనుచు శివుని.
| 5
|
క. |
మ్రొక్కు మహాత్మున కజునకు
మ్రొక్కు మహామాయునకు నమోఘేచ్చునకున్
మ్రొక్కు త్రిశూలికి భవునకు
మ్రొక్కు మహేశునకుఁ బంచముఖునకు నీకున్.
| 7
|
క. |
హారిభుజంగమపరివృఢ
హారికి నిజకింకరార్తిహారికి హిమరు
గ్ధారికి సుమాయుధారికిఁ
జేరి బ్రణామములు నీకుఁ జేసెద విభవా.
| 8
|
సీ. |
అఖిలరూపునకు దేవాదిదేవునకు శా
శ్వతునకు సాక్షికి శంకరునకు
వేదాంతవేద్యున కాదిశూన్యునకు వి
జ్ఞానదాయకునకు శంభునకును
నందివాహనున కానందపూర్ణునకు వి
శ్వాధీశ్వరునకుఁ జరాకృతికిని
|
|
|
భక్తభయచ్ఛేదపరమకారణపాద
పద్మరేణునకు సద్బాంధవునకుఁ
|
|
గీ. |
భర్గునకు ఘోరపాతకభంజనునకుఁ
గాలకాలున కద్భుతశీలునకును
గాలునకు శర్వునకు నీలకంధరునకుఁ
రామనాథేశునకు నీకుఁ బ్రణుతి సేతు.
| 9
|
వ. |
అవిద్యానిహంతకుం బాపహరునకు, సంసారసంతాపశాంతిహే
తునకు మదీయబ్రహ్మహత్యానివాళికిం బార్వతీనాథునకుం గైలా
సనిలయునకు, గంగాధరునకు, విరూపాక్షునకు నిరాకృతరసా
పదునకుం బినాకపాణికి, మదనహరునకుం బునఃపునఃప్రణామం
బులు గావింతు.
| 10
|
సీ. |
రామనాథాయ పురచ్ఛిదేశం భవే
పరమేశ్వరాయ తుభ్యం నమోస్తు
పర్వతకన్యకాపతయే నమోస్తుతే
నాగేంద్రముఖగుహనందనాయ
రవిశశివహ్నినేత్రాయ కపర్థినే
దేవాయ సోమాయ తే నమోస్తు
కరుణార్ణవాయ మార్కండేయభవభిదే
విభవే నమస్తేకవిస్తుతాయ
|
|
గీ. |
సాక్షిణే నమ ఉగ్రాయ శంకరాయ
నీలకంఠాయ భీమాయ నిర్మలాయ
శూలినే సకలజ్ఞాయ సుద్ధిరాయ
మదనవీర్యహరాయ నమశ్శివాయ.
| 12
|
క. |
క్రతుపురుషాయ గణాద్యధి
పతయే వరదాయ దుర్లభాయ వనానాం
|
|
|
పతయే చ తస్కరాణాం
పతయే రుద్రాయ సాధు పతయేస్తు నమః.
| 13
|
గీ. |
కర్మవశమున నెక్క డెక్కడ జనింతు
నచట నచ్చట నాకు నీయంఘ్రికమల
భక్తి సిధించుగాత గోపతితురం
యిందురేఖోత్తమాంగ రామేశలింగ.
| 14
|
క. |
వేదాచారాభిరతియు
వేదాన్యవిరుద్ధమార్గవిముఖతయును సం
పాదింపుము నాకుఁ గృపా
మేదురవీక్షణముచేత మీనాంకహరా.
| 15
|
పంచచామరము. |
హరాసురాద్రిచాపపాపహారినామధేయశం
కరా కరాంచితత్రిశూలకాలకాలనీలకo
ధరాధరాశతాంగతారతారహారతారకా
మరాళహీరగౌరధీరమాన్య నీకు మ్రొక్కెదన్.
| 16
|
గీ. |
పరమకారణ శంకర ఫాలనయన
గిరిసుతాకుచకుంకుమాంకితసువక్ష
విశ్వనాయక రామేశ విషమబుద్ధి
మాన్పి సన్మతి యొసఁగుము మదనమదన.
| 17
|
మత్తకోకిల. |
నీలలోహిత పార్వతీప్రియ నిమ్నగాధర ధూర్జటీ
ఫాలలోచన దాససంసృతిబంధమోచనసంసృతీ
శూలహస్తనిరస్తమాయవిశుద్ధరూపకృపానిధీ
బాలచంద్రకిరీట నీపదభక్తి నాకు నొసంగుమీ.
| 18
|
|
గతపాలకనిత్యవికాసనిధీ
నతి నీకు రచించెద నా కెపుడుం
బతిభక్తి యొసంగుము భవ్యమతీ.
| 20
|
గీ. |
దేవదేవ జగన్నాథ పీనపాల
రామనాథ కృపాధార రాజమకుట
తావకీవపదాంబుజద్వయమునందుఁ
బట్టుపడుగాత నిశ్చలభక్తి నాకు.
| 22
|
క. |
నానాప్రపంచసత్తా
భావము లెవ్వాని నిడిచి భాసిల్లవు త
ద్భానాత్ము రామనాథు ను
మానాయకుఁ గొల్తు నెపుడు మానసవీథిన్.
| 23
|
గీ. |
వెలుఁగు నెవ్వానివెలుఁగున విశ్వ మెల్ల
వెలుఁగ దిజ్జగ మెవ్వానివెలుఁగు లేక
అట్టిరామేశునకు భయహరున కమర
వంద్యునకు శంభునకు నీకు వందనంబు.
| 25
|
క. |
మానుగ నేపరమేశ్వరు
నానందము గనుటచే సమస్తానందం
బై నెగడు నమ్మహాత్ము స
దానందుని రామనాథు నాత్మ భజింతున్.
| 27
|
ఆ. |
దేశకాలభేదాదిగ భిన్న మేవస్తు
వద్వితీయ మగుచు నమరు నెద్ది
అట్టిభేదవిరహితాత్ము నీశ్వరు రామ
నాథు నభవు లోకనాథుఁ గొల్తు.
| 29
|
క. |
జలజాసనహరిరుద్రులు
వలనుగ నెవ్వానిమాయ నర్తింతురు ని
ర్మలరూపు నతని మాయా
విలసనవిరహితుని రామవిభునిఁ దలంతున్.
| 31
|
క. |
నానాజగదుద్గతికిఁ బ్ర
ధానము కారణ మటంచుఁ దగఁ జెప్పిరి యె
వ్వాని నెఱుంగక బుధులు ని
దానాత్ముని వానిఁ దలఁచెదన్ రామేశున్.
| 33
|
గీ. |
పొసఁగ నెవ్వానిమాయచేఁ బొడమె జాగ్ర
దాదివిశ్వప్రపంచ మత్యద్భుతముగ
నతని విజ్ఞానఘను జాగ్రదాదిరహితు
రామనాథుని సేవింతుఁ బ్రేమ మెసఁగ.
| 35
|
గీ. |
కారణాత్మకు నెవ్వనిఁ గానలేక
కడగి పరమాణువులు జగత్కారణ మని
తార్కికులు గలహింతు రాతని సుఖాత్ము
నాత్మరూపుని రామేశు నాశ్రయింతు.
| 37
|
గీ. |
పటుతరాజ్ఞానపాశనిబద్ధవరులఁ
బాశముక్తులఁ గావించుపరమగురుని
రామనాథుని శాంతు శరణ్యు శివుని
రక్షకునిఁ జేరి కొల్తు నిరంతరంబు.
| 39
|
ఉత్సాహము. |
ధ్వస్తపురనిశాచరున్ సుధాకరార్ధమౌళిస్వా
ద్యస్తవిశ్వు విశ్వనాథు నాగమాంతవేద్యు న
భ్యస్తయోగసుజనగమ్యు నాదిదేవు నీశ్వరుం
బ్రస్తుతింతు రామనాథుఁ బార్వతీమనోహరున్.
| 41
|
ఆ. |
పరమరేణు వాత్మపరమార్థ మనుచు నె
వ్వానిమోహశక్తివశముఁ జెంది
పల్కుదురు విరుద్ధభావు లప్పరమాత్ము
రామనాథు నమితధాము నెంతు.
| 43
|
భుజంగప్రయాతము. |
సమస్తాఘసంఘాతశాంత్యర్థ మంబా
సమేతున్ గణాధీశుఁ జంద్రార్ధమౌళిన్
రమానాథబాణున్ సురత్రాణదక్షున్
సమత్సేవధిన్ రామనాథు న్భజింతున్.
| 44
|
సీ. |
జన్మజరామృత్యుసలిలప్రపూర్ణంబు
సంతాపబడబాగ్నిసంకులంబు
దారపుత్రక్షేత్రధనవీచినికరంబు
దుష్టరోగవ్యాళదుస్సహంబు
కామాదిపరిసంధిగణఘోరమకరంబు
విషయస్పృహాఫేనవిలసనంబు
బహుళదారుణవిపత్పాఠీనవారంబు
మజ్జదజాండకుంభవ్రజంబు
|
|
గీ. |
భవదుదారపదాంభోజభక్తి సార
మనఁగఁ దగు భవజలరాశియందు మునుఁగు
|
|
|
చున్నన న్నుద్ధరింపు మత్యూర్జితాంగ
వృషభరాజతురంగ రామేశలింగ.
| 46
|
మ. |
జననవ్యాఘ్రము పాపసింహ మతిదుష్టవ్యాధిచోరంబు నా
శనసర్పాకుల మింద్రియాద్ధనగ మీర్ష్యాపర్ణముల్ బాల్యయౌ
వనకూపంబులభీతికంటకము దుర్వారోగ్రసంసారకా
ననముం జొచ్చితి ధర్మమార్గము జగన్నాథా కృపం జూపవే.
| 48
|
శా. |
పాపం బెల్లెడఁ గూర్చి ఖేదము జనింపన్ యోనులం బుట్టి కుం
భీపాకాదిదురంతదుర్గతుల నొప్పిం జెంది యాపిమ్మటం
బాపోత్కృష్టనికృష్టయోనితతులం బల్మారు జన్మించి ని
త్యాపన్నత్వమునం గృశించితిమి దేవా మమ్ము రక్షింపవే.
| 50
|
గీ. |
ఘోరగంభీరసంసారకూపగతుల
జడుల వివశుల దీనుల చపలమతుల
కడుననాథుల మమ్ము నీవు కరుణఁ జూచి
కావవే యీశ రామేశ గగనకేశ.
| 51
|
స్రగ్విణీమిళితభుజంగప్రయాతము
|
హరా! భక్తమందార యాపన్నరక్షా
పరా ముక్తసంగాకృపా ముగ్ధచర్మాం
బరా శుక్తిముక్తాప్రభాశోభితాంగా
పరా వ్యక్తచినాత్రభావాపురీశా.
| 52
|
క. |
రక్షింపుము కరుణార్ణవ
రక్షింపుము దీనపాల రాజకిరిటీ
రక్షింపుము భువనేశ్వర
రక్షింపుము మమ్ము దేవ రామేశ శివా.
| 53
|
గీ. |
కవిజనస్తుత యేణాంకకలితచూడ
యీశ లక్ష్మీశసఖ హరిదీశవంద్య
సదయకలిహరిహరలబ్ధసర్వకామ
సకలభవప్రణవాత్మక శరణు శరణు.
| 55
|
గీ. |
ఏమహాత్మునిశక్తిభ క్తిష్టధాత్రి
విశ్వమాత యుమాదేవి వేదమూర్తి
యతని జగదేశనాయకు నమితితేజు
శంకరుని రామనాథుని సంస్మరింతు.
| 57
|
క. |
సూనులు గజముఖగుహు లె
వ్వానికి వృషభేశ్వరుండు వాహన మతనిన్
శ్రీనిధి రామేశ్వరు న
జ్ఞాననివృత్తికి భజింతు జగదేకగురున్.
| 59
|
క. |
పూని మృకండునిసుతుఁ డె
వ్వానిం బూజించి వైభవమునఁ గృతాంతా
ధీనుఁడు గాఁ డద్దేవు స
దానందునిఁ దలఁతు మృత్యుహరు రామేశున్.
| 61
|
క. |
లాక్షారుణదేహునకుం
జక్షుశ్శ్రుతికుండలునకు సర్వేశునకున్
రక్షకునకు రామేశున
కక్షరునకుఁ బ్రణుతి సేతు నచలితభక్తిన్.
| 63
|
గీ. |
రామనాథ మహాదేవ సోమచూడ
దక్షయజ్ఞవినాశన ధర్మరూప
|
|
|
నీకు నంజలిఁ గావింతు నిష్ఠతోడఁ
గరుణఁ జూడుము భువనేశ కలుషనాశ.
| 65
|
క. |
శూలికి గుణశాలికి ఫణి
మాలికి శశిమౌళికి న్సమంచితభసితో
ద్ధూళితునకుఁ బాలితది
క్పాలకులకు రామనాథభవునకు జేజే.
| 67
|
మాలిని. |
హరిహయముఖదిక్పాలావళీభర్మమౌళి
స్ఫురదురుమణితేజఃపుంజనీరాజితాంఘ్రిన్
తరుణశిశిరభానూత్తంసు దిగ్వాసు నీశున్
నిరతము మది నుంతు న్నిష్ఠతో రామనాథు.
| 69
|
క. |
హరునకు హరిరూపునకుం
బరమాత్మకు వ్యాఘ్రచర్మపటునకు రామే
శ్వరునకు నీకుఁ బ్రణామం
బురుకృపతో నా కభీష్ట మొసఁగుము రుద్రా.
| 71
|
వ. |
చింతాతీతాత్మునకు న
హంతాసాక్షికినిఁ బ్రత్యగద్వయున కుమా
కాంతునకు వందనంబులు
భ్రాంతినివృత్తికి నొనర్తు రామేశునకున్.
| 73
|
కందమిళితమణిగణనికరవృత్తము.
|
జలరుహభవనుతచరణకమల ని
ర్మలగుణమణిగణ మదనమదిహరా
వలయితవిషధర వరగిరినిలయా
నెలకొని కొలిచెద నిను మది నభవా.
| 74
|
లయగ్రాహి. |
కేశవ చతుర్ముఖ సురేశనుతపాద భవపాశహరవిష్ణుపద కేశరవినక్ష
త్రేశశిఖిలోచన గిరీశ కుసుమాయుధవినాశ మునిమానసనివేశ జననాది
క్లేశభయకాననహుతాశన జటీధరజితాశవలయీకృతబిలేశ యవతీరా
మేశ శరదిందుఘనకాశనిభదేహ పలలాశమదభంజననిరీశ నిను గొల్తున్.
| 75
|
ఆ. |
సుకృతి యోగిలభ్యునకు మహామాత్రార్థ
రూపునకు సదాగృపావరునకు
ద్వైతహీనునకు గుణాతీతునకు రామ
నాథదేవునకు నొనర్తు నతులు.
| 77
|
ఆ. |
పరమయోగిహృదయపదముల నాత్మభా
వమున వెలుఁగుచున్నవాని శివుని
విభు ననన్యభాసవేద్యు నీశ్వరు రామ
నాథుఁ గొల్చెదము బ్రణామకలన.
| 79
|
గీ. |
ఆదిదేవ మహాదేవ యనఘ విశ్వ
నాథ యవ్యయ శివ రామనాథ దేవ
యంబికానాథ వృషభాంక హర క్షమింపు
మస్మదపరాధసాహస మమరవంద్య.
| 81
|
క. |
దారాపత్యక్షేత్రా
గారద్రవిణములయెడ నఖండితకరుణా
ధార యహంకారము మమ
కారము లేకుండ నాకుఁ గరుణింపఁగదే.
| 82
|
చ. |
ధనములు రత్నసంతతులు ధాన్యములు న్సుతమిత్రవర్గముల్
వనితలు గోగణంబులును వస్త్రచయంబును క్షేత్రగేహముల్
|
|
|
గనుఁగొన మోక్షహేతువులు గా వటు గాన విరక్తిఁ గోరెదన్
ఘనకృప నా కొసంగుము జగచ్చుభదాయక రామనాయకా.
| 84
|
వ. |
విశ్వామిత్రుం డి ట్లనియె.
| 85
|
చ. |
మదిఁ జొర విన్నశాస్త్రమతమర్మములుం జదువంగబడ్డఁబ్రా
జదువులు నిష్ఫలంబు లగు సత్యము మర్త్యున కెల్లెడ న్బవ
త్పదజలజాతనిశ్చలితభక్తిమహత్వము లేనివానికిన్
సదమలబోధరూప శివ శర్వ మహేశ్వర రాఘవేశ్వరా.
| 86
|
శా. |
ఆనందాత్మక రామనాథ భవదీయాంగ్రిద్వయీనందన
ధ్యానాసక్తులు గాని మానవులకుం దథ్యంబుగా నేరికిన్
దానంబుల్ మఖముల్ తపోనియమముల్ ధర్మంబులు న్నిష్ఠలు
న్నానాతీర్ధనిమజ్జనప్రముఖపుణ్యంబు ల్కడు న్వ్యర్థముల్.
| 88
|
ఉ. |
పాపము లాచరించియును బాయక మర్త్యుఁడు రామనాథ ని'
న్నోపికఁ జేరి భక్తిభర ముల్లసిలం బ్రణమిల్లెనేని త
త్పాపసమూహ మంబురుహబాంధవబంధురదీప్తిపుంజని
ర్వాపితఘోరసంతమసరాశిగతిన్ లయ మొందు గొబ్బునన్·
| 90
|
క. |
రామేశ నిన్నుఁ జూచి ప్ర
ణామముఁ గావించి కొలుచునరుఁ డురుబాధా
ధామ మగుమాతృగర్భగు/
హామధ్యము మగుడఁ జొరక నమృతము జెందున్.
| 92
|
గీ. |
జనుఁడు నినుఁ జేరి మ్రొక్కుడుఁ దనదుబంధు
వర్గముల నెవ్వఁడు దలంచు వారి దురిత
విరహితులఁ జేయు ననఁగ నన్నరుఁడు ధన్యుఁ
డగుట చిత్రమె రామేశ యభ్రకేశ.
| 93
|
మాలిని. |
ఇది పరమరహస్యం బెప్పుడుం దావకాంచ
త్పదకమలసపర్యాతత్పరుం డైనవానిం
జెదరనిదృఢభక్తిం జేరి సేవించువారుం
బొదలుదురు కృతార్థీభూతు లై రామనాథా.
| 95
|
గీ. |
ఎఱుఁగఁదగు నిన్ను నిర్మలహృదయు లైన
వివిధవేదాంతవాక్యార్థవిదులచేత
శ్రాంతి దేరంగ సర్వశాస్త్రములు విడిచి
కొల్వవలె నిన్ను రామేశ కుధరచాప.
| 96
|
రథోద్ధతావృత్తము. |
దీనపాల భవదీయసత్పద
ధ్యానసంహృతసమస్తపాపుఁ డై
మానవుం డజు నుమాయుతు న్స్వయం
భానుఁ జెందు మునిభాదితు న్నినున్.
| 98
|
చ. |
వ్రతములు నోచనేల యుపావాసము లుండఁగనేల శాస్త్రప
ద్ధతు లెఱుఁగంగనేల నిరతంబును గంగ మునుంగనేల స
త్క్రతువులు సేయనేల ఫణిరాజవిభూషణ రామానాథశా
శ్వతునకు బోధకారణభవత్పదసేవకు లైనవారికిన్.
| 99
|
గీ. |
రమ్యభోగాపవర్గవరప్రదంబు
రౌరవాదినరకనివారకంబు
తారకం బిట్టి నీపదద్వంద్వభజన
మేల విడ వాఁడు రసికుఁ డహీనభూష.
| 100
|
గీ. |
విశ్వనాయక మత్ప్రాణవిలయవేళ
గౌరితోఁ గూడ నీవు శీఘ్రముగ వచ్చి
|
|
|
నన్నుఁ జేర్చుము సచ్చిదానందమయవి
రాజితనిజాంఘ్రికమలంబు రామనాథ.
| 102
|
గీ. |
దుఃఖకల్లోలమాలికాదుస్తరోగ్ర
పారరహితభవాంబుధి బడినమాకుఁ
దావకపదాంబురుహభక్తితరణి దక్క
నన్యగతి లేదు రామేశ హరనిరీష.
| 104
|
క. |
ఆమయశార్దూలభయో
ద్దామభవాట విని వెతలఁ దగిలినమాకున్
రామేశ్వరలింగ ముని
స్తోమార్చిత మంచిత్రోవఁ జూపుము కరుణన్.
| 106
|
గీ. |
రామనాథేశ యింద్రియారాతు లధిక
దర్పమున నేచుచున్నారు తాళలేము
వారి నణఁగించి జయ మొందవలయుఁ గానఁ
గరుణ దీపింప బాసట గమ్ము నీవు.
| 108
|
గీ. |
నీమహత్వ మచింత్యంబు నీలకంఠ
యల్పమతులము మేము మహానుభావ
యెట్లు నుతి సేయఁగలము ని న్నిందు చూడ
ప్రణుతిఁ గావించెదము నీకు రామనాథ.
| 110
|
క. |
కట్టువడి వివిధయోనులఁ
బుట్టుచు గిట్టుచును వెతలఁ బొందితి మహహా
|
|
|
పుట్టువు చావును మాన్పుము
మట్టుగ రామేశలింగ మధితానంగా.
| 112
|
చతుర్విధకందము.
|
శ్రీరామనాథ సరసవి
హారా కరుణాసముద్ర యాశ్రితవరదా
గౌరీశ సౌమ్యవదన పు
రారీవార శరణు శరణు హరినుతచరణా.
| l13
|
క. |
శతధృతిసారథికి శివా
పతికి నసంగునకు వృషభపతికేతునకున్
శితికంధరునకు నీకును
నతు లొనరించెదము రామనాథ మహేశా.
| 115
|
క. |
గణబృందపూజితాంఘ్రికి
గణనాథున కమర నిమ్నగాధరునకు ని
ర్గుణునకు రామేశ్వరునకుఁ
బ్రణామ మిదె నీకు మమ్ముఁ బాలింపు శివా.
| 117
|
గీ. |
జ్ఞప్తిమాత్రైకనిష్ఠు లౌ సంయములకుఁ
బునరుదయశూన్య మగునట్టి భూయ మిచ్చు
వానికి నిహంబునకు నీకు వందనంబు
ప్రేమమున మమ్ము రక్షింపు రామనాథ.
| 119
|
గీ. |
తత్త్వముల కెల్ల నుత్తమతత్త్వ మగుచు
వస్తుతత్త్వస్వరూపుఁ డౌ వానిసాధ।
నాంతరాపేక్ష లేక స్వయంప్రకాశుఁ
డైనరామేశుఁ గొల్చెద ననుదినంబు.
| 120
|
గీ. |
స్వాతిరిక్తవిహీను నాద్యంతరహితు
విశ్వసత్తాప్రదాయకు విగతమోహు
సేనకాజ్ఞానభేదను దేవు నభవు
స్వామి నర్చించెదము భక్తి రామనాథు.
| 121
|
విద్యున్మాలావృత్తము. |
శ్రీరామేశా చిన్మాత్రాత్మా
ధీరోపాశ్యా ధీమధ్యస్థా
గౌరీనాథా కంఠేకాలా
శ్రీరమ్యాంగా జేజే నీకున్.
| 122
|
సీ. |
సచ్చిదానందు నిశ్చలు నద్వితీయు న
నంగుని బ్రహ్మాత్ము సంగశూన్యు
నవికారు నాదిమధ్యాంతవర్జితుఁ బరి
శుద్ధు సనాతను బుద్ధు నంత
రిక్షాదిజగదేకసాక్షి ననంతుఁ బ
రామృతరూపు స్వయంప్రకాశు
నప్రమేయు నచింత్యు ననఘు నావిర్భావ
సంకోచరహితు విజ్ఞానకరుని
|
|
గీ. |
నిత్యు నిర్లేపు నిష్కళు నిరుపమాను
విగతకర్ము భూమానందు విభు మహాత్ము
దేవు రామేశు నెపుడుఁ జింతించెదము స
మస్తపాపక్షితికి మానసాబ్జసీమ.
| 124
|
స్రగ్ధర. |
శ్రీరామేశున్ రమేశార్చితచరణుఁ గృపాసింధు బశ్యల్లలాటున్
గౌరీవక్షోజలిప్తాగరుసురభితవక్షస్థలున్ వ్యోమకేశున్
|
|
|
రారాజజ్జహ్నుకన్యాప్రవిమలకుసుమస్రఙ్మనోహారిమౌళిన్
క్షీరస్వచ్చాంగు నర్చించెదము హృదయరాజీవమధ్యోపవిష్టున్.
| 125
|
కందగర్భితగీతము.
|
ధరణిరథ శైలకార్ముక పరమపురుష
నాగభూష పర్వతశరణా సురవద
సదయహృదయ మృగధర నిశ్చలగుణగణ
శశధరసుకిరీటా వృషస్వామితురగ.
| 126
|
మ. |
మునిహృత్పదవిహారహారశరదంభోదస్ఫురత్కాయకా
యనదైలేయవిఫాలఫాలశిఖినేస్తాక్షేషుకోదండదం
డనభీవర్జితభృత్యభృత్యధికరూఢస్వాంతరాజీవజీ
వనదాంచద్గళభానభాసముదయవ్యాప్తాఖిలాశాంతకా.
| 127
|
సీ. |
రామేశమేశనిరంతరపూజిత
జితపురాసురసురార్చితసుచరణ
రణభయంకరకరప్రవిలసత్సారంగ
రంగద్గవేంద్రతురంగరాజ
రాజశేఖరఖరారాతిదోషవిదార
దారసంత్యక్తశరీరభాగ
భాగమనీరుద్ధబహుసూర్యసూర్యబ్జ
దినకరకరణికృత్తికృతవసన
|
|
గీ. |
సనకముఖమునిరంజనజనవరహిత
హితసతాచారచారణస్తుతవిహార
హారదహిపాలపాలనాయత్తచిత్త
చిత్తభవభూతివిలసితసితనిజాంగ.
| 128
|
వ. |
దేవా! నీవు నిత్యముక్తుండవు నవిప్రియుండవు నద్వితీయుండ
వయ్యును నిజమాయాసమావేశంబున నవ్యాకృతాత్ముండ వయితివి
యిట్టి నీవలన శబ్దగుణకం బగునాకాశంబు పుట్టె నాకాశంబు
|
|
|
వలన శబ్దస్పర్శగుణకం బగువాయువు జనించె, వాయువువలన
శబ్దస్పర్శరూపగుణకం బగునగ్ని వొడమె, నగ్నివలన శబ్దస్పర్శ
రూపరసగుణకం బగుజలం బుదయించె, జలంబువలన శబ్దస్పర్శ
రూపరసబంధగుణకం బగుపృథివీభూతంబు జనించె నిట్టి పంచ
సూక్ష్మభూతంబుల సత్వగుణసమష్టిభావంబున మనోబుద్ధిచిత్తహం
కారాత్మకం బగునతఃకరణంబు సృజింపంబడియె సత్త్వగుణవ్య
ష్టిభావంబున శ్రోత్రత్యఙ్నయనజిహ్వాఘ్రాణంబు లన శబ్దస్పర్శ
రూపరసగంధగ్రాహకంబు లగుపంచజ్ఞానేంద్రియంబు లుద్భవించె.
రజోగుణసమష్టిభావంబులం బ్రాణోనవ్యావోదానసమానంబు
లనఁ బంచప్రాణంబులు జనించె రజోగుణవ్యష్టిభావంబున
వాక్పాణిపాదపాయూపస్థంబు లన వచనాదానగమన
విసర్గానందవిషయకంబు లగుపంచకర్మేంద్రియంబులు సంభ
వించె నిట్టి జ్ఞానకర్మేంద్రియదశకంబును, బ్రాణపంచకం
బును, మనోబుద్ధిద్వయంబును, సప్తదశకం బగులింగశరీ
రం బయ్యె. సూక్ష్మభూతంబు లైదునుం బంచీకృతంబు లై
స్థూలంబు లనం బరగె నీస్తూలభూతపంచకంబువలన జతుర్దశలో
కసహితంబును, సమస్తద్వీపసమన్వితంబును, మేరుమందరహిమప
దాదిపర్వతసంయుక్తంబును, దేవదానవనరపశుపక్షిమృ
గాదిజంతుసమేతంబును, బహువిధస్థావరసంకులంబును, విచి
త్రంబును నగు బ్రహ్మాండంబు సంభవించె. రజోగుణంబున బ్రహ్మ వై
సృజియింతువు సత్త్వగుణంబున విష్ణుండ వై పాలింతువు త
మోగుణంబున రుద్రుండ వై హరింతువు. నీవ జాగ్రత్స్వప్నసుషు
ప్త్యవస్థాత్రయంబును, స్థూలసూక్ష్మకారణదేహాభిమానంబు వహిం
చి విశ్వతైజసప్రాజ్ఞానామంబులు ధరించి క్రీడింతువు. పారా
వారంబునం దరంగంబులచందంబున, గగనంబున మేఘంబులతె
రంగునఁ బతంగబింబంబునం బ్రభలకరణి ననేకనామరూపచరా
|
|
|
చరభూతంబులు నీయందు జన్మించి వెండియు నీయంద యేకీభా
వంబుఁ జెందు అణువుకంటె నణుతరుండవు మహత్తుకన్న మహ
త్తరుండవు. దూరంబు నడచు నపాదుండవు సర్వంబు గ్రహించు న
పాణివి. శబ్దంబు విను నకర్ణుండవు. రూపంబుఁ జూచు నచక్షుండవు.
సర్వతః పాణిపాదుండవు సర్వతోక్షిశిరోముఖండవు సర్వత
శ్శ్రుతిమంతుఁడవు. సర్వంబు నావరించి యున్నవాఁడవు. నిత్యుం
డవు. సత్యుండవు నిష్కళుండవు. నిరంజనుండవు. నిర్లిప్తుండ
వు నిర్వికారుండవు నిర్వాణనిధివి నిస్తరంగబోధసముద్రుండ
వు. సచ్చిదానందఘనుండవు అమలుండ వజుండ వనఘుండవు.
సర్వభూతావయస్థితుండవు. గతివి. భర్తవు ప్రభుండవు సా
క్షిని నివాసంబవు. కర్తవు. ఘనుండవు. ఉన్నతుండవు. శరణం
బవు సుహృత్తవు నిర్హేతుకబంధుండవు దయాపరుండవు.
భూతభావనుండవు. సర్వవ్యాపివి సర్వాఢ్యుండవు సర్వభూ
తాంతరాత్మవు. కేవలుండవు నిర్గుణుండవు. షడ్గుణైశ్వర్యసంప
న్నుండవు. సనాతనుండవు. యోగిధ్యేయుండవు ద్వితీయవస్తు
శూన్యుండవు. ప్రత్యగాత్మవు. శ్రోతవ్యుండవు, ద్రష్టవ్యుం
డవు, మంతవ్యుండవు, విధిధ్యాసితివ్యుండవు. ప్రణవగమ్యుం
డవు. నీతత్వంబు బ్రహ్లాదు లెఱుంగరు. సూర్యచంద్రాగ్నిప్ర
కాశకంబు నీతేజంబు. సమస్తప్రపంచంబు నీస్థూలశరీరంబు.
నీనిశ్వాశంబులు వేదంబులు నీవు భూమియం దావేశించి భూ
తంబులు దాల్తువు. వైశ్వానరుండ వై ప్రాణంబ దేహం బాశ్ర
యించి ప్రాణాపానవాయుసమేతుండ వై చతుర్విధాన్నపచనంబు
సేతువు. రసాత్మకుండ వై సోమరూపంబున నోషధులం బోషిం
తువు. సూర్యుడు జగంబులు వెలింగింపుచు ప్రజోత్పాదనా
ర్థంబు వర్షింతువు. స్మృతిజ్ఞానాపోహనంబులు నీవలనం బొడము.
నీవ సకలోపనిషద్వేద్యుండవు. వేదాంతకర్తవు. వేదవేత్తవు. నీ
|
|
|
వక్షరాక్షరపురుషులకన్న నుత్తమపురుషుండవు అమాయుండవు
మాయివి సగుణుండ నగుణుండవు జీవుండ వీశ్వరుండపు కార
ణాత్మకుండవు కార్యరూపుండవు సులభుండవు. అసులభుం
డవు. దూరస్థుండవు. నికటవర్తివి ధ్యేయుండవు ధ్యాతవు. స్త
వ్యుండవు స్తోతవు ఆవాఙ్మానసగోచరుండవు వేదాంతప్రతిస్థి
తంబును, ప్రకృతిలీనంబును నగుపరంబుకన్న బరుండవు మ
హేశ్వరుండవు. నీయాజ్ఞవలన నాదిత్యుం డుదయించు పవనుం
డు సంచరించు నింద్రాగ్నులు ప్రవర్తింతురు మృత్యువు బరుగులి
డు. నీయాజ్ఞదక్క తృణంబును జలింపదు. నీవు సర్వనియామ
కుండవు. నీమాయాప్రభావం బచింత్యం బనిర్వాచ్యంబు. దురత్య
యంబు. నీయందుఁ బ్రసన్నులగువారు నీమాయం గడుతురు. సర్వ
క్రతుభోక్తవు, సర్వకర్మఫలప్రదాతవు నగు నిన్ను యథార్థంబుగా
నెఱుంగజాలక యన్యదేవోపాస్తి గావించునకృతాత్ము లగువార
లపరిమితస్వర్గాదిభోగంబు లనుభవించి పునర్జననఖేదంబు నొందు
దు రిది యెఱింగి భవద్భక్తులు ఫలాకాంక్షులు గాక కర్తుత్వాభిమా
నంబు విడిచి యజ్ఞదానతపఃకర్మంబు లాచరించి భవదారాధనంబు
చేసి ముక్తి జెందుదురు. మహాత్ములు కొందఱు పూర్వజన్మకృతసుకృ
తపరిపాకంబువలన నిర్మలాంతఃకరణులై యాచార్యు నుపాసించి
శ్రద్ధాళు లై యింద్రియముల నిరోధించి తాత్పర్యంబునం బొదలుచు
మహావైరాగ్యంబు శోభిల్ల వివిక్తస్థలంబున సుఖాసీను లై సమాకా
యశిరోగ్రీవు లై నాసాగ్రంబు విలోకింపుచు విరసంబు విశుద్ధంబు
నగు హృత్పుండరీకంబున నచింత్యావ్యక్తవిశదామృతాదిమధ్యాం
తరహితవిశోకప్రశాంతశివస్వరూపుండ వైననిన్ను దీర్ఘకాల్పనే
రంతర్యంబులం జింతించి మహానందహ్రాదనిమగ్నతం జెంది
కృతార్థు లగుదురు. ధ్యానంబుల గొందఱు, జ్ఞానంబునం గొం
దఱు, కర్మయోగంబునం గొందఱు, సంకీర్తనస్మరణవద
|
|
|
నపూజనదాస్యంబులం గొందఱు, ని న్నారాధించి నిత్యా
భియుక్తు లై సిద్ధి పడయుదురు. సమలోష్ఠాశ్మకాంచనులు, శత్రుమి
త్రసములు. నిందాస్తుతితుల్యులు, సంగవివర్జితులు, నిశ్చలచిత్తులు
హర్షామర్షభయోద్వేగముక్తులు, యదృచ్ఛాలాభసంతుష్టులు, ని
ర్మత్సరులును నగుభక్తులు నీకుం బ్రియతము లై వెలుంగుదురు. ఫల
జలపుష్పపత్త్రమాత్రసమర్పణంబునం దృప్తుండ వై దాసులం గృ
తార్థులఁ గావించు పరమకృపాసాదరుండవు నీవే యింద్రు
డవు, చంద్రుండవు, బ్రహ్మవు, హరివి, శివుండవు, కాలుండ
వగ్నివి, విరాట్టువు, స్వరాట్టువు, అక్షరుండవు, మరుదశ్వవసు
రుద్రాదిత్యప్రజాపతిధనదవరుణాదిమూర్తివి, నీవ భూతభవ్యత్ప్ర
భుండవు, నీవ పరమగతివి, నీవు సర్వంబు నెఱుంగుదువు, ని న్నె
వ్వ రెఱుంగరు. జపాకుసుమాదిసంయోగంబున శుద్ధస్ఫటికంబు
నానాత్వంబు భజించుతెరంగునం బ్రకృతిసాంగత్యంబునం జేసి
బహుబ్రకారంబులం గానంబడుదువు గాని నీ వొక్కరుండవు నీ
యంద సర్వంబు జనించె. నీయంద నిలిచె. నీయంద లీనం బగు. నీవ
సర్వబ్రహ్మంబవు గగనగతుం డగుతపనుండు పెక్కుజలఘటం
బులం బెక్కుమూర్తులు వహించి చూడంబడు వడువున నీ వొక్క
రుండ వయ్యు నభోవాతాగ్నిసలిలపృధ్వీదేవనరతిర్యగాదినానో
పాధుల ననేకప్రకారంబులం గనుంగొనంబడుదువు. నీవే సర్వ
క్షేత్రంబుల క్షేత్రజ్ఞసంజ్ఞ పూని వసింతువు నీవ షడ్వింశతముం
డ వై ప్రకృతివిలక్షణుండ వై ప్రకాశిందువు ప్రాణాయామ
పరాయణు లగుయోగులకు లభ్యుండ వై నాదబిందుకళా
తీతుండ వయి రాజిల్లుదువు. రజ్జువునందు సర్పంబును,
శుక్తియందు రజితంబును, మరుమరీచికయందు జలంబును,
మిథ్యాభూతం బై తోఁచుపగిది నీయందు విశ్వంబు భ్రాంతి
కల్పితం బయి తోఁచుట సత్యంబు గాదు. నేతి వేతీతి వాక్యంబుల
|
|
|
నిఖిలోపాధినిషేధం బొనరించి సర్వాధిష్టానంబ వగునిన్ను తత్వ
మప్యాదిమహావాక్యార్ధవేత్తలు సోహంభావనాపరు లయి యె
ఱుంగుదురు. గురువేదాంతవిశ్వాసంబులు లేనివానికి నీతత్వంబు
తెలియ నలవి గాదు సర్వప్రకాశకుం డగుసూర్యుని విగతచక్షుండు
దర్శింప నేరనివిధంబున నవిద్యామోహితుండు సర్వవ్యాపకుండ
వయిన ని న్నెఱుంగనేరక పుట్టుచుం జచ్చుచు నుండు క్షణమాత్రం
బయిన నీవు తా నని తలంచు సుకృతికృతకృత్యుం డగు కృష్ణపిం
గళుండవు విరూపాక్షుండవు ఊర్థ్వరేతసుండవు నీలకంఠుం
డవు ఉమాసహాయుండవు పరమేశ్వరుండవు నయి లోకసంర
క్షణంబుకొఱకు విశుద్ధోర్జితిదివ్యమంగళవిగ్రహంబు ధరించి కై
లాసశిఖరంబున విహరింతువు నీవ వటవిటపిమూలభాగంబున
వీరాసనస్థుండ వయి యువనేషధరుండ వయి పరమగురుండ వయి
వృద్ధు లగుశిష్యులకు నిస్సంశయంబుగా బ్రహ్మతత్వంబు మౌనమ
ద్ర నుపదేశింతువు హరిహిరణ్యగర్భాదిదేవతలుచేతం బూజలు గొ
నుచు వారియభీష్టంబులు కృప సేతువు. భక్తులకు భక్తుండ వయి వి
నోదింతువు. దిగంబరుండ వయ్యు సరైశ్వర్యశాలివి ఉగ్రుండ
వయ్యుఁ బ్రశాంతుఁడవు, అర్థనారీశ్వరుండ వయ్యు నిస్సంగుండ
వు, విషధరుండ వయ్యు నమృతప్రదుండవు. ఆద్వితీయండ వయ్య
ననేకమూర్తివి, అత్యద్భుతప్రభావుండవు, నీతత్వంబు నీవె యెఱుం
గుదువు. నీగుణకథనంబు సేయ మే మెంతవారము. జడమతులము,
అజ్ఞులము, విషయాసక్తులము, చపలస్వభావులము. దుస్తరం బగు
సంసారసాగరంబున మునుంగుచుం దేలుచు దరి గానక బహుక్లే
శంబు లనుభవింపుచున్నారము. మమ్ము రక్షింపుము. ప్రసన్నుండ
వగుము. మాదుఃఖంబు నివారింపుము. మమ్ముం జేబట్టుము. నీ దాసు
లం గావించి కటాక్షింపుము. మా మొఱ లాసకింపుము మావిన్నపం
బుఁ జిత్తగింపుము మాకోర్కెలు ఫలింపంజేయుము మాయపరా
|
|
|
ధంబు సహింపుము. నీకు నమస్కారంబు. నీకు నంజలి, నీకు శరణా
ర్థి, నీకు వరివస్య, నీకుఁ బ్రపత్తి, నీకు సమారాధనంబు, నీకు నీరా
జనంబు.
| 129
|
వ. |
అని సూతుండు చెప్పిన విని శౌనకాదిమహర్షులు తదనంతరకథా
విధం బెట్టిదని యడిగిన.
| 130
|
క. |
పశ్యల్లలాటదురితా
వశ్యాయ సహస్రకిరణవర్షాకాలా
భ్రశ్యామలకందరదృ
గ్దృశ్యపరిజ్ఞానవేద్య దివ్యాకారా.
| 131
|
భుజంగప్రయాతము. |
ఫణిస్వాైమిమంజీరభాస్వత్పదాబ్జా
కణక్షోణినిర్ధూలరాత్రించరౌఘా
గణేశాదిశైవాగ్రగణ్యాభివంద్యా
గుణీభూతదృక్కర్ణగోత్రేంద్రచాపా.
| 132
|
గద్య — ఇది శ్రీమదుమామహేశ్వరకరుణాకటాక్షవీక్షాపాత్ర
యేనుగ లచ్చయామాత్యపౌత్ర తిమ్మయామాత్యపుత్త్ర
వివిధవిద్వజ్జనవిధేయ లక్ష్మణకవినామధేయప్రణీ
తం బయిన రామేశ్వరమాహాత్మ్యంబను
మహాప్రబంధంబునందుఁ
జతుర్థాశ్వాసము.