Jump to content

రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

మొదటి ప్రకరణము

విషయ ప్రవేశము

ప్రపంచములోని మహాపురుషుల చరిత్రలు నానా విధములుగా నుండును. అవన్నియు పాఠకులకు కొన్ని గుణపాఠములు నేర్పునట్టివై యుండును. జీవిత చరిత్రలు వ్రాయు నాచారము పాశ్చాత్యులలోనే విశేషము. వారినుండియే యీ విషయమును భారతీయు లనుకరించుచున్నారు. జీవితచరిత్రలు వ్రాసి యుంచుట వలన ముందు సంతతివారికి తమ పూర్వుల లోని గొప్పవారి చరిత్రయు ఆ చరిత్రలోని ఆదర్శ విషయములును ఆ చరిత్రకు కారణభూతములైన మహాపురుషుల కాలములోని కొన్ని ముఖ్య ఘట్టములను:— ఇటువంటి అనేక విషయములు తెలిసికొనుట కవకాశ మేర్పడును.

ప్రపంచమందలి మహాపురుషు లనేక విధముల వారై యున్నారు. సేనానులును, రాజులును, రాజకీయ వేత్తలును, కవులును, మతకర్త లును, సంఘ సంస్కర్తలును. పరోపకారులును — మహాపురుషులు పలుతెరగులుగా నుందురు. వీరంద

రును తమ తమ శక్తి కొలది తమ తమ ప్రాంతములలో సమాజోన్నతికి పాటుపడిన వారే. కొందరికి ఆ బాల్యముగా తమ శక్తి సామర్ధ్యములను ప్రకటించుట కవకాశము లుండును. రాజుల సంతతి వారును, కోటీశ్వరుల పిల్లలును, ఉన్నత పదవు లందు నారి సన్నిహిత బంధువులును, తమశక్తి సామర్ధ్యములు ప్రకటించి లోక కల్యాణమున కుపకరించిన వారైన అదియు గొప్ప విషయమే. కాని అంతకన్న గొప్ప విషయ మేమన ఆదిలో సాధారణ స్థితి యందుఁడి స్వీయ గుణముల చేతను స్వయం కృషి చేతను గొప్ప స్థితికి వచ్చిన వారి చరిత్ర లింకను రమణీయముగా నుండును. నెపోలియన్ చక్రవర్తి, ఆబ్ర హాంలింక, గార్ ఫీల్డు,చాణక్యుడు, హైదరలీ, క్రాంవెల్ , వీరేశలింగం, సోక్రటీసు, శంక రాచార్యులు ఇట్టి వారందరును ఈ ద్వితీయవర్గములో చేరిన వారు.

అమెరికా దేశములో ఇద్దరి మహాపురుషుల చరిత్ర చాల రమ్యమైనట్టిది. ఆబ్రహాం లింకన్, జనరల్ గార్ ఫీల్డు అను వారిరువురును పూరి గుడి సెలలో పుట్టి పెరిగి తుదకు అమెరికా దేశము యొక్క రాజ్యా ధ్యక్షులు (President) అయిరి. వీరిద్దరిని గురించి గార్ఫీల్డు చరిత్ర కారుడు (From log-cabin to white House అ ను గ్ర 0 థ ములో) ఇట్లు వాసి యున్నారు: ఈ ఇద్దరును కట్టె గుడిసెలలో పుట్టినారు. ఇద్దరును బీదవారే. ఇద్దరికిని బాల్యదశలో విద్యా సౌకర్యములు కలుగకపోయెను. లింకను యొక్క ఎనిమిదవ యేటనే అతని తల్లి గతించెను. గార్ ఫీల్డుకు ( నెలలుకూడ నిండక మునుపే అతని తండ్రి గతించెను. ఈ యిరువుకును కష్టపడు స్వభావము కలవారనియు, సమయస్ఫూర్తి కలవారనియు, పట్టుదల, విశ్యాసపాత్రత, ధైర్యము, మిత జీవనము, విషయగ్రహణము, సమ యజ్ఞత, క్రమ నిర్ణయము, దాతృత్వము కలవారనియు, ప్రసిద్ది గన్న వారు (Both were well.known for their industry, tact, perseverance, Integrity, courage, economy, thoroughness, punctuality, decision, and ben. evolence ) ఈ వాక్యములను జదివిన వెంటనే నిజాం రాష్ట్ర జనులందరికిని రాజా వేంకటరామా రెడ్డి బహద్దరు ఓ. బి. ఇ గారు, తప్పక జ్ఞాపకము రాకమానరు. రాజా వేకటరామా రెడ్డిగారు పై యిరువురి మహాపురుషుల గుణములలో, ఇంచు మించు అన్ని గుణములను గలిగినట్టివారు. వారి వలెనే వీరును ( అంత బీద కుటుంబమువారు కాకపోయినను) సా ధారణ పటేండ్ల కుటుంబమువారు. వారివలెనే వీరును తమ బాల్య మునందే తల్లి దండ్రులను పోగొట్టు కొన్నట్టివారు. వీరు జన్మించిన మూడవ దినమునాడే వీరి తల్లి చనిపోయెను. వీరి ఐదవ సంవత్సరమునందే వీరి తండ్రి గతించెను. బాల్య

మందు సాధారణ విద్య నభ్యసించిరి. ఈనాడుండునట్టి విద్యా సౌకర్యములు 20 ఏండ్ల క్రిందట లేకుండెను. ఆ కాలములో మంచి విద్యావంతు లనిన అపురూపము మనుష్యులుగా పరిగణింప బడుచుండిరి. వీరి బాల్యములోనే వీరి సంరక్షణ కర్తయును, మేవమామయు నగువారు, అకాల మరణ మొందిరి. ఇక వీరికి సహాయపడు వారు అరుదైపోయిరి. అట్టివారు ఆదిలో నొక సాధారణమగు అమీన్ పదవి నుండి, క్రమముగా ఉన్నత పదవుల పొందుచు, హైదరాబాదు నగగ కొత్వాలు పదవిని పొందినారనిన, దానికి ముఖ్య కారణము లుండవలెను. అవి వారి గుణవిశేషములే. వీరి యుద్యోగ కాలములోని చరిత్ర నంతయు పరిశీలించి చూచిన, వీటి రెండు ముఖ్యగుణములు కనబడుచున్నవి. నిరంతర కృషి, శ్రద్ధ, న్యాయ దృష్టి, యివి వీరి ప్రథాన గుణములు.


ఉన్నతో ద్యోగములు పొందిన వారు హైదరాబాదు రాష్ట్రములో వందలకొలది, వేలకొలది కలరు. నగరకొత్యాలు పదవి నలంకరించిన కొత్వాళ్లేందరో వీరికన్న ముందు కాల ములలో పదవిని నిర్వహించి యుండిరి. కాని వారెవ్వరును ప్రజల స్మృతిపథము నందు లేరు. వీరు మాత్రము సర్వజనులచేతను, నిఖిల నిజాం రాష్ట్రము చేతను, నిఖిల ఆంధ్రుల చేతను, కొనియాడబడు చున్నారు. ముందు కాలమందును, అజరామరముగా, వీరు నిజాం రాష్ట్ర వాసులచేతను అందు ముఖ్యముగా ఆంధ్రుల చేతను కీర్తినీయులై యుందురనుటలో అతిశయోకి, లేదు. D