Jump to content

రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడవ ప్రకరణము


జీవితములోని మార్పు

విలియం వహబ్ చనిపోవుట మేకట రామారెడ్డికి తాత్కాలికముగా గొప్ప 'దెబ్బగానుండెను. అతని కప్పుడు 16. సంవత్సరములు నిండీ నిండని వయస్సు. ఇంకని చదువుకొనవలెనను కుతూహలము మెండుగా నుండెను. ఆశలన్నియు పటాపంచ లయ్యెను, వహబ్ మామ యగు రామన్న సామానులన్నియు సదురుచు వ్యనహారము లన్నియు సంస్కరించుచు వారము పది దినములు రాయచూరులో నుండెను. వేంకట రామా రెడ్డి గారిని కూడ గ్రామమునకు తీసికొని పోవలెనని చెప్పుచుండెను. గ్రామమునకు పోయిన వ్యవసాయ వృత్తియు, తండ్రిగారి పటేలు వృత్తి యు వీఱికి క్రమముగా అబ్బియుండును. కాని వీటికి గ్రామమునకు పోవుటకై యేమాత్రము ఇష్టము లేకుండెను.

వహబుగారుండిన భవన సమీపములో ఒక వృద్దుడైన మౌల్వీ యుండెను. ఈ బాలుడా ఫకీరువద్దకు పోయి

దుఃఖించుచు కూర్చును వాడు. ఫకీరదిచూచి దగ్గరకు పిలిచి దుఃఖంచుటకు కారణ మేమని విచారించెను. తనకు కలిగిన విపత్తును, రానున్న అనిష్టమగు విపత్తును, ఆ పెద్దమను ష్యునితో చెప్పుకొనెను. మౌలీ గారు ఓపికతో అంతయును విని “అల్లా సర్వ సంరక్షణకర్త, అతడే నీకును సహాయపడును పో" అని ఓదార్చినారు. ఇంత మాత్రపు సంగతి రెడ్డిగారికిని తెలియును. కాని ప్రకృతాచరణ మెట్లో అది మాత్రము మౌల్వీ గారు చెప్పక పోయిరి. మరల వరుసగా ఆ వారము దినములు మౌల్వీ యొద్దకు వెళ్లి కన్నీరు కార్చుచు కూర్చును చుండెను. మౌల్వీకి చాల కరుణకలిగెను. దీర్ఘముగా ఆలోచించి ఈతడన దృఢముగానిట్లు పలికెను - "ఎమిన్నీ పర్వాలేదు. నీ కంతయు శుభమే కలుగును పో!", అని గట్టిగా వూని పలికినను, అది ఓదార్పు నీయలేదు.

మరునాడు రాయచూరును వదలి గ్రామమునకు పోవుటకై బండ్లు కదలుటకు సిద్ధమయ్యెను. క్షణకాల మాలన్యమై యుండిన సాగియేపోయి యుండును. అట్టి సన్ని వేశములో దైవికముగా నొక సంఘటనము సంభవించెను.

విలియం వహబ్ గారి కత్యంత పరిచితుడైన వాడు నజర్ మహమ్మద్ ఖాన్' అనునతడు. అతకు సీనియర్ అమిన్ గా నుండిన వాడై వహబ్ చనిపోగా అతని స్థానములో రాయ చూరుజిల్లా పోలీసు అధికారిగా నియుక్తుడయ్యెను. అతడు ఆజాను బాహుడు. ఆరడుగుల యెత్తువాడు. స్ఫురద్రూపి. గాంభీర్యము కలవాడు. పఠానుజాతివాడు. విశ్వాసపాత్రుడైన మిత్రుడు. తన మిత్రుడు వహబ్ చనిపోయినందులకు చాల చింతించి అతని యింటిలో అతని బంధువుల పరామర్శింతమని వెళ్లెను. వెళ్లి చూడగా, బండ్లన్నియు ప్రయాణ సన్నాహములో నుండెను. వహాబు కాలములో ఆత నీయింటిలో బాలుడగు వేంకట రామా రెడ్డిని చూచిన వాడు కాన, అతనిని గురించి రామన్నతో నిట్లు సంభాషించెను.

" ఎక్కడికీ సన్నిహ మంతయు
" మా గ్రామమునకు వెళ్లుచున్నాము.
“ వేంకట రామారెడ్డిని చూపి) ఈ బాలునిగూడ తీసుకొని
పోయెదరా?
" అవును
" తీసికొనిపోయి?

  • వ్యవసాయము చేయింతుము!

" చదివించరా! " వీలుకాదు
" సరే. మీ రితనిని నాయొద్ద నే విడిచి పెట్టి వెడలిపొండు... 4
"వీలు లేదు

“ నాకు అప్ప జెప్పనలసినదే మారు మా ట్లాడితిరా రాఖబర్దార్ !

" రామన్న పథాను మాటలకు అదరిపడినాడు. పైగా అతడు పోలీసు అధికారి. ఎక్కున మాట్లాడుటకు ధైర్యము మునుపే లేక పోయెను. పఠాను అతనికంతయు మరల నచ్చ చెప్పినాడు. తానాబాలుని వృద్ధికి తెత్తుననియు ప్రభుత్వము వారి యెద్దతన యావచ్చక్తిని వినియోగించి యుద్యోగ మిప్పింతు నసియు, చెప్పి బాలుని తన వెంట తీసుకొని పోయెను. రామన్న అటు! బాలుడు ఇటు! ఈ చిన్న ఘట్టమే వేంకట రామారెడ్డిగారి జీవితములో అత్యంత ప్రధాన మైనట్టిది.

విలియం వహబు గారికి ఒక తమ్ముడు పరకాల రెడ్డి ఆను సతడుండెను. అతను పక్కా పటేలు. దురుసు మనిషి. షికారు (వేట) అనిస చెవులు కోసువాడు. మంచి మాంసాహారి. తదనుగుణ్యమగు గుణములుగూడ అలవాటు చేసుకొని యుండెను. విద్యలో లోపములేదు. తెలుగు బాగుగావచ్చును ఉర్దూ కూడ బాగుగనే చదువుకొన్నవాడు. అన్నయగు వహబు గారికి తమ్ముని లక్షణములు నచ్చినవి కావు. మిత్రులతో అతని తెంపరి తనమును గురించి పలుమారు చెప్పువారు. తన కేమైన కీర్తి తెచ్చువాడు కలడా యనిన తన కుమారుడు కూడ కాదు. తన మేనల్లుడే అనియు మిత్రులతో చెప్పువాడు.

ఆ భావములను పలుమారులు విన్న వారిలో ఈ పఠాన్ నజర్ మహమ్మద్ ఖాను గారొకరు

తన అన్న చనిపోయిన వెంటనే అతని తమ్ముడను కాన నాకును కొంత హక్కు కలదనియు స్కర్కారీ ఉద్యోగ మిప్పించ వలసినదనియు పరకాల రెడ్డి తాలూక్టారు సిఫారసుతో వినతిపత్ర మర్పించుకొన్నాడు. అది యట్లుండ నజర్ మహమ్మద్ ఖాను యువకుడగు వేంకటరామా రెడ్డిని హైదరాబాదు నగరముసకు పిలుచుకొని తనకు తెలిసిన నవాబులను పోలీసు అధికారులను, సూబేదారులను, మున్నగు వారి నందరిని దర్శించుకొన్నాడు. అంతకు ముందే పరకాల రెడ్డి ప్రయత్నము చేయు చుండినందున సజర్ మహమ్మద్ ఖాన్ అతని లోపములను తెలిపి విలియం వహబ్ గారి కోరికలను అభిలాషలను అధికారులకు తెలిపి వేంకట రామ రెడ్డికే ఉద్యోగ మియ్యవలెనని గోరెను.

అప్పటికి వేంకటరామారెడ్డి వయస్సు 17 సంవత్సరములు. ఇంకను బాలునివలెనే యుండెను. ఇప్పటి రూపమునకును అప్పటి రూపమునకును పూర్తిగా వ్యత్యాస ముండెను. బక్క పలుచని మనిషి. పోలీసు ఉద్యోగికి శరీర సౌష్టవము, మంచిఎత్తు, మంచితూకము, నాటికిని, నేటికిని అవసరము ఎత్తులో కూడ పొట్టివాడుగా నుండెను. తనను చూచిన అధికారు లుద్యోగ మియ్య రేమో అనిపించెను. పఠాను దానికి తగిన యుక్తిపన్ని నాడు. దూదితో కట్టిన బొంత అంగీలు తొడిగించినాడు. ఎత్తైన బూట్లు (అందులోను అడుగున యెత్తు పెట్టించి, తొడిగించినాడు. ఈ వేషముతో తన వెంట అధికారుల వద్దకు తీసుకొని పోవుచు వచ్చినాడు. అట్లుండినను సుబేదారు రెడ్డిగారిని చూచి "ఇంకనుచిన్న వాడు ఇప్పుడేమి తొందర మరి ఒకటి రెండేండ్లు చదువుకొననిమ్మ. నెలకు 10 రూపాయలు సర్కారునుండి యిప్పింతును, ". అని సెలవిచ్చెను. పఠాను కదంతయు తృప్తిని కలిగించ లేదు. ఇప్పుడే నౌకరీ యిప్పించుమని పట్టుబట్టెను. తుదకు సూబేదారను కూలుడయ్యెను. జిల్లా పోలీసు నాజిం (డైరక్టరు) అగు లగ్లోయను ఇంగ్లీషు అధికారి వద్దకు తర్వాత పోవలసి వచ్చెను. లడ్లోగారు యువకుని చూచి మందముగా కనబడులకై వేసి కొనిన దుస్తులను చూచియు తృప్తి చెందక మనిషిని పట్టిచూచినాడు. అంతయు మెత్త మెత్తగా చేతికి తగిలెను. “ఇ దేమిటి” అని విచారించగా " చలి పెట్టుటచేత మెత్తని బట్టల తొడిగినాను. " అని రెడ్డి గారు జవాబు చెప్పవలసి వచ్చెను. పఠాను పట్టుదల గలవాడు. అతని ప్రయత్నముల ఫలితముగా రెడ్డి గారిని అమీను పదవి పై ఉద్యోగిగా నేర్పాటు చేయుటకు లడ్లో గారును సుబేదారుగారును అంగీకరించిరి. మరియు హసన్ బిన్ అబ్దుల్లా (ఉరఫ్) ఇమాద్నవాజుజంగు అను అకౌంటెంటు జనరల్ అధికారియు వీటికి చాల సహాయము చేసిరి. ఆజ్ఞలు లభించుటకు కొంత కాలము పట్టునని చెప్పిరి. సరేయని నజర్ మహమ్మద్ ఖాను వేంకటరామా రెడ్డిగారిని సగరములోనే వదలి తనయుద్యోగముపై రాయచూరునకు వెళ్ళిపోయెను.

హైదాబాదు నగరములో రెడ్డిగారు జాంబాగు సమీపములో నుండునట్టి జార్జి రఘునాథ రెడ్డి గారి బంగ్లాలో నివాసము చేయుచుండిరి. ఈ రఘునాథ రెడ్డిగారు 'రెడ్డిగారి బంధు వులు. వారు నగరములో మంచిపలుకుబడి కలవారు. గొప్ప విద్యావంతులు (థియాసఫీ) దివ్యజ్ఞాన సంఘములో చేరినట్టివారు. సిద్దిరీసాలలో చాలకాలము కమాండింగ్ అధికారిగా నుండిరి. చాల సౌమ్య స్వభావము కలవాడు. రెడ్డి గారికి ప్రతిదినమును ఉద్యోగము యొక్క పైరవీలో కాలము గడుచు చుండెను.

ఆ కాలములోని ఒక చిన్న వినోద విషయము రెడ్డి గారి జీవితములో పేర్కొనదగిన దైయున్నది. వీరు నగరములో నుండు కాలములోనే మొహరం వచ్చినది. రాత్రి వేడుకలు చూచుటకై తానును మరిముగ్గురు స్నేహితులును బయలు దేరినారు. కాని ఈ సంగతి రఘునాథ రెడ్డికి తెలుపకయే వెళ్లవలెనని వారి సంకల్పము. అందుకై వారొక యుక్తి పన్నినారు. తమతమ పడకలమీద దిండ్లను నిలువుగా పెట్టినారు. వాటి పై

దుప్పటి కప్పినారు. తిన్నగా బయటికి జారుకున్నారు. అర్ధ రాత్రివేళ రఘునాథ రెడ్డి గారు యువకులు పడుకున్న గది చూచి నారు. వారేయని భ్రమించి తృప్తి పడినారు. ఇచ్చట రెడ్డిగారుసు మిత్రులును వేడుకలు చూచి తిరిగివచ్చుచు ఉస్మాన్ గంజి పోలీసు ఠానావద్ద యేదో అల్లరి జరుగుచుండగా చూచుటకై నిలిచినారు. ఠానా పోలీసు వారు అందరితో పాటు వీరిని గూడ పట్టుకొన్నారు. "మాకేమియు ఈ తగవులతో సంబంధము లేదు” అని యెంత చెప్పినను పోలీసు వారు వినక ఠానాలో వేసి యుంచినారు. తెల్లవారు జామున ఆ నాకా యెదుట నుండునట్టి అబ్దుల్లా రిసాలా మిలిటిరీ అధికారి వీని చూచినారు. విషయమంతయు విచారించినారు. అదృష్టవశమున రఘునాథ రెడ్డి గారి కామిలిటరీ అధికారి పరిచితుడు. అందుచేత తన జవాను లను చీవాట్లు పెట్టి ఈ యువకుల ఇంటికి పంపి వేసినారు. వేంకట రామారెడ్డిగారా నాటి యాసన్నివేశము నిప్పటికి మరచిపోలేదు. తాను కొత్యాలుపదవి నందిన తర్వాత ఉస్మానుగంజి నాకా మీదుగా వెళ్లినప్పుడంతయు తన చిన్ననాటి కథ జ్ఞాపకము వచ్చుచుండునని చెప్పెడివారు.


ఇట్లు కొంత కాలము గడిచినత ర్వాత వేంకట రామా రెడ్డి గారికి ఉద్యోగ నియామక మయ్యెను. 26 పర్వర్ది 1296 ఫసలీనాడు వారు అమీను పదవిలో నియుక్తులైరి. మొదట - నాల్గవ దర్జాపోలీసు అమీన్ గా నెలకు 20 రూపాయీల జీత ముపై ఏర్పాటు చేయబడిరి. గుర్రము వ్యయమునకని నెలకు 20 రూపాయలు అనుమతించిరి. ఉద్యోగములో అనుభవము లేని వారని అధికారు లెరిగిన వారగుటచేత లింగుసూగూరు జిల్లా పోలీసు అధికారి ఆధీనములో ముద్గల్ ఠానా అమీనుగా 'నియుక్తులైరి. ఇంతేకాదు, వీరి చేతి క్రింద పనిచేయునట్టి మొహ రిర్ గారే ముద్గల్ నాకా వ్యవహారము లన్నింటికిని జిమ్మే దారులుగా నిర్ణయింపబడిరి.

వేంకటరామా రెడ్డిగారు తమ ప్రథమోద్యోగమును నిర్వహించుటక లింగుసూగూరు జిల్లాలో చేరినట్టి ముదగల్లు ఠానాకు వెళ్ళిరి. పోలీసు ఉద్యోగములో కాని మరే ఉద్యోగములో కాని చేయునట్టి విధులును కార్యములును యేమియు తెలియని వారు. అయితే ఒక అనుకూలముండెను. అన్నిటికిని తానుగాక తన చేతి క్రింది మొహరిరే ఉత్తరవాదిగా నిర్ణయిం పబడియుండెను. మొదటి కొన్ని మాసములందు మొహరిర్ అంతయు నిర్వహించుకొని తెచ్చిన సర్కారీ కాగితములపై ఎచ్చట సంతకము పెట్టుమసిన అచ్చట వీరు సంతకము చేయు చుండిరి.

ఇట్లుండ ముదగల్లు తహసీల్దారుగా “మౌల్వీ షాబా ఖీసాబ్", అసువారు తహసీల్దారుగా వచ్చిరి. వారు స్వర్గీయు లైన విలియంవహబ్ గారికి పరమమిత్రులు. అందుచేత వారి మేనల్లునిపై మాల్వీకి అవ్యాజ ప్రేమక లిగెను. వారు వృద్ధులు. రెడ్డిగారు 17 - 18 సంవత్సరముల యువకులు. ఆ పెద్ద మనిషి రెడ్డి గారిని దినమును వద్దకుకు పిలిపించుకొని వారికొక విధముగా స్వయం గురువులగుచు వచ్చిరి. తాను కచ్చేరీ వ్యవహారములు సాగించునప్పుడు ఈ అమీను గారిని తన వద్దనే కూర్చున బెట్టుకొనుచు ఆనుభవము కలిగించు చుండిరి. మరియు మొహరిర్ సంతకమునకై తెచ్చిన కాగితములలో సాధారణ మైనవి పోగా ముఖ్యమైన మిసళ్లను తమవద్దనే ఉంచుకొని అమీను గారికి చదివి విషయను బోధించి వాటి పై ఏవిధముగా వ్రాయవ లెనో చెప్పి వాయించు చుండెడివారు. అంతేకాక ఉర్దూ ఫార్సీలో ఇంకను ప్రవీణత కలుగుటకై పాఠములు బోధించు వారు. ఉర్దూలో మంచి మంచి కవుల కవితల చదివించు వారు తుదకు వీరిచేతను కవిత్వము వ్రాయించినారు. వేంకట రామారెడ్డి గారుకూడ ఒక కాలములో కవులైయుండిరన్న మాట యెవ్వరును ఎరుగరు. వారికవిత లేమైన లభ్యమైన అవియెట్లుండునో యేమో! తమకవితాభివృద్ధికై ఉర్దూ వాజ్మయములోని ప్రసిద్ధకవుల గ్రంథాల ననేకముగా రెడ్డిగారు తెప్పించుకొనిరి. ఆ గ్రంథాలు ఈ 50 ఏండ్ల అనంతరము ఇప్పటికిని వారివద్ద నున్నవి. వీరిని ప్రోత్సహించటకై ఆవృద్ధు వీరికవితలను విని ఆనంద ప్రకటనము చేయుచుండెడివారు. ఇట్లు ఉద్యోగ ప్రాథమిక దశ కొంత కాలము జరుగుచువచ్చెను.

వేంకటరామా రెడ్డి గారికి వివాహము బాల్యమందే (అనగా వారు 6-07 సంవత్సరాల వయస్సువారుగా నుండి నప్పుడు జరిగి యుండెను. వారి భార్య పేరు రంగమ్మ. వారును రాయణి పేట గ్రామమువారే. విలియం వహబ్ గారి జ్ఞాతివర్గము లోని వారు. వివాహకాల మప్పుడు వరునికి ఒక వెండి మొల తాటిని, రెండుమూడువందల రూపాయీలను వరదక్షిణగా నిచ్చుట కొప్పుకొని యుండిరట. వెండి మొలత్రాడు మాత్రము యియ్యక నేపోయిరి!!