రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/ఐదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఐదవ ప్రకరణము


1300-1311 ఫసలీవరకు-జిల్లా అధికారి యగుట


జిల్లా పోలీసు ప్రధానాధి కారియగు లడ్ల గారు ఉపకారవేతీసము పై వెళ్లిపోయియుండిరి. వారి యనంతరము గాఫ్ అను వారు నియుక్తులైరి. అంతలోననే మధ్యపరగణాలలో రగ్గులనణచుటకై నియుక్తులై వట్టి హేంకిన్ అను వారు అప్పుడు నిజాం రాష్ట్రములో ప్రధానమంత్రిగా నుండినట్టి విఖారుల్ ఉమ్రాలను వారిచే పిలిపింపబడి జిల్లా పోలీసు సర్వాధికారిగా నియుక్తులైరి. హెంకిన్ గారు. ఆ పూర్వమగు వ్యక్తి. మెడోసు టెయిలర్ , సర్ థామస్ మంరో, కర్నల్ టాక్, వంటి వారి ఉత్త మకరగతికి చేరిన ఇంగ్లీషు వారు. వారుద్యోగము నందిన వెంటనే సర్వలోప భూయిష్టమైన పోలీసుశాఖను సంస్కరించు టకు మొదలు పెట్టిరి. వారనిన పోలీసులకందరికిని సింహస్వప్నము, వారి కాలమునకు మునుపును వారు వచ్చిన ఆది లోను రాష్ట్ర మందంతటను ఎటుచూచినను దొంగల గుంపులే. ఎటుబట్టినను దోపిడులే డాకాలే జరుగు చుండెను.

వేంకటరామా రెడ్డి యాద్గీరులో పొందిన కీర్తి వలన కల్వకుర్తిలో 1303 ఫసలి సంవత్సరాంతము వరకుండి ఆ తాలూకాలోని డాకాలను దొంగల గుంపులను అణచివే సిరి. ఇంతలో నాగర్కర్నూలులో ఇదే వ్యవస్థ యున్నదని రెడ్డి గారిని అచ్చటికి మార్చిరి. కాని అచ్చట రెండుమాసము లేయుండిరి. అచ్చటినుండి అదే మహబూబునగరు జిల్లా లోని కోయలకొండ తాలూకాకు వీరిని 1304 లో మార్చిరి. అక్కడకూడ మూడు మాసములుకూడ నుండక మునుపే మరల నాగర్కర్నూలు కునాల్గవదర్జా నుండి మూడవ దర్జా అనుపదవి పై పంపిరి. అచ్చట ఒక సంవత్సర కాల మున్న తర్వాత 1305 ఫసలీ 5 ఫక్వర్ది వాడు ఇప్పుడు నిజామాబాదు అనబడునట్టి ఇందూరు జిల్లాకు కోర్టు ఇన స్పెక్టరుగా పంపబడిరి. వీరు ఇందూరులో నుండు కాలములో బ్రిటిషిండియా సైన్యమునుండి డగ్లస్ అను సోల్జర్ తన పటాలములో పై అధికారిని కొట్టి పారిపోయి యెచ్చటనో దాగికొని యుండెను. అతనిని పట్టుకొనుట కై నిజాము రాష్ట్రములోని పోలీసు అధికారులకు ఆజ్ఞ అయి యుండెను. ఇట్లుండ ఇందూరు లోనొక ఇంగ్లీషు వానియొద్దకి కొక ఇంగ్లీషు వాడు పచ్చి పరిచయము కల్పించుకొని నివసించుచుండెను. అతడోక నాడుల్లాస మెక్కు వయె మిలటరీసాధన (Drill) ను చూపించినాడు. అనుమాన


ముకలిగి అతనిని పరీక్షించగా ఏమియు సందీయలేదు. తుదకు అతని బూట్ల కొననుండు కాన్వసుబట్టపై అతని మిలటరీ పటాలము పేరుండెను. అతనిని వెంటనే పట్టుకొని సికింద్రా బాదుకు పంపిరి. అచ్చట (కోర్టుమార్షల్) సెన్యశాఖా విచారణలో రెడ్డి గారు సాక్ష్యమిచ్చుటకై పిలిపింపబడిరి. ఇగ్లీషు భటులను వరుసగా నిలబెట్టి నిందితుని గుర్తించుమనిరి. ఒక్కమారే చూచినందునను, తెల్లవారి మఖాలన్నియు ఏకాకారముగా గన్చడుచుండి నందున రెడ్డి గారు ఉక్కిరిబికిరియై వరుసగా అందరి ముఖాలను పారజూచుచు వెళ్లుచుండగా మనడగ్లసు గారే వారికి సహాయపరి. డగ్లసును సమీపించగా అతడు రెడ్డిగారిని చూచి సవ్వినారు. దొరికెరా దొంగ అని అతనిని పట్టి చూపించిరి. మొత్తము పై రెడ్డి గారికీ నిందితులిని పట్టియిచ్చి నందులకు ఇండియా ప్రభుత్వమునుండి 11 రూపాయల బహుమతి ప్రసాదింపబడెను.

వేంకటరామరెడ్డి గారు ఇందూకురులో నుండు కాలములో 1307 ఫ. లో గంగయ్య అను 4- 5 ఏండ్ల అనాథ బాలుని స్థితినిగురించి వినుట తటస్థించినది. ఆ బాలుని తల్లిదం డ్రులు చిన్నప్పుడే చనిపోయిరి. పోలీసు వారు వానిని జైలులో సాకు చుండిరి. అనాథ బాలునికి జైలు సరియగు స్తలము కాదనియు, కాసి అనాథాశ్రమము లేనందున ఏమిచేయవలె

నో అని అధికారు లాలోచించుచుండగా రెడ్డి గారు తామా బాలుని పెంచుందు మని వినతి పత్రమర్చించుకొని. “వేంకట రామారెడ్డి ఉత్తముడనియు (Gentleman) దయాగుణము కలవాడనియు, ప్రశంసించుచు అధికారులా బాలుని వారికిచ్చి వేసిరి. ఆ గంగయ్య ఇప్పటికి జీవించి యున్నాడు. సికింద్రాబాదులో ఒక చిన్న నౌకరి చేయుచు జీవించు చున్నాడు. అప్పు డప్పుడు తన సాకుడు తండ్రిని వచ్చి చూచి పోవుచ్పుడును.

ఇందూకులో రెండు సంవత్సంము లుద్యోగము చేసిన తర్వాత వీరిని 1307 ఫ లో యెల్గుదల్ జిల్లాకు పంపిరి. ఇప్పటి కరీంనగరు జిల్లానే అప్పుడు యెల్లందల్ జిల్లాయని వ్యవహరించు చుండిరి, కాని జిల్లా ప్రధానస్థలము అప్పుడును కరీంనగరులో నేయండెను. కరీంనగరులో తాలూక్దారు పదవి పై ఫరా ముర్ఖంగు తాలూక్దారుతర్వాత పిస్టంజి అను వారు జిల్లా తాలూక్దారుగా పనిచేయుచుండిరి. ఈ పిస్టంజీ గారి కూతురు అప్పటి మంత్రిగా ఉండిన విఖారుల్ ఉమరాగారి భార్య. ఎల్లందల్ జిల్లాలో మీకు నాలుగున్నర సంపతరములు కొంత కాలము కోర్టు ఇక్ స్పెక్టరుగాను, కొంత కాలము తాత్కాలిళ పోలీసు మొహ తెమోముగాను నుద్యోగము నెర వేర్చిరి.

వీరు ఎల్గందల్ జిల్లాలో నుండు కాలములో దొంగ తనాలు విశేషముగా జరుగుచుండెను. కాని దొంగలు

మాత్రము పట్టుబడ కుండిరి .ముఖ్యముగా ఈత చాపలల్లి బ్రతుకు చుండినట్టి వడ్డె వారు అనుజాతి వారు దొంగతనాలు ఎక్కువగా చేయుచుండి నట్లు అమమానించు చుండిరి. కాని వారినెన్ని మారులు పట్టుకొనిను పాపము వారివద్ద ఏమియు లభించకుండెడిది. కరీంనగరు గ్రామము యొక్క. యూరి వెలుపల ఈ వడ్డరుల గుంపొకటి యుండెను. వారు పగలంతయు చాపలల్లు కొనుచు రాత్రులందుమాత్రము మాయమగు చుండిరి. వారి నందరిని పట్టుకొని వారి బట్టలు, పెట్టెలు గుడిసెలు అన్నియు శోధించిరి. కాని యేమియు దొరక లేదు. వారుండు చుట్టు పట్టులలో అనుమాన ప్రదేశములన్నియు త్రవ్వికూడ పరీక్షించిరి. ఏమియు లాభము లేక పోయెను. ఇదేమి చిత్రమోయని తుదకు నిరాశతో వెళ్ళిపోవుచు రెడ్డి గారు స్వయముగా వారుపయోగించు బొంతలను సూక్ష్మము పట్టిపట్టి చూచి నారు. అదియు వ్యర్ధ ప్రయత్నమే అయ్యెను. తుదకు వారి ఈత చాపలను చేతితో ఎత్తి జూడించిచూచినారు. తన మొహర్ అందేమియు లేదని చెప్పెను కాని రెడ్డిగారికి చాపలు చాల బరువుగా నుండుట విచిత్రముగా కనబడెను. చాపలను అన్నిటిని తునియలుగా కోయించినారు. చాపల అంచులలో ఎంగారు, వెండి సొమ్ములు పొంకముగా జోడించి అల్లినట కనబడెను. సొమ్ములన్నియు జలజల రాలిపడెను. సుమారు
వేంకట రామారెడ్డిగారు (సుమారు 28 ఏండ్ల వయస్సులో)
వేంకట రామారెడ్డిగారు (రాజాబహద్దరు బిరుదమందినప్పుడు పుష్పమాలాలంకృతులైయుండుట)

2000 రూపాయీల సొమ్ములు దొరికెను. వారందరిని న్యాయస్థానములో శిక్షింప జేసిరి. ఇది అపూర్వ విషయము. హెంకిన్ గారు చాలసంతోషించి ప్రభుత్వము నుండి రెడ్డిగారికి 50 కూపాయల విలువచేయు గడియారమును బహుమతిగా నిప్పించి,

హెంకిన్ గారు జిల్లాలలో పోలీసు నాకాల విచారణకై బయలు దేరిన వార్త రెడ్డిగారికి తెలిసెను. హెంకిన్ గారిని తృప్తి పరచుట చాలకష్టమని రెడ్డిగారికి తెలియని విషయము కాదు.హేంకిను గారు మార్గములోని నాకాలను ఇతర పోలీసుకచ్చేరీ లను విచారించు కొనుచు మూడు మాసాలలో కరీంనగరు విచ్చేసిరి. పోలీసు కచ్చేరీ పరిక్ష తీసుకొన్ని. మొదలు పోలీసు ఏమియు లోపములేనట్లుగా నున్నది. తుపాకులు పరీక్షిం చిరి. వారి ఉడుపులను చూచిరి. అన్నియు చక్కగా పరిశుభ్రముగా చిలుమన్న మాట లేక చకచక మెరయుచుండెను. జవానులు దరిని వరుసగా నిలిపి, వారదినసాధనను (Drill) పరీక్షించిరి. ఏమియు లోపము లేదు. హెంకీన్ గారు దిగ్బ్రమచెంది. అంద రిని అందుముఖ్యముగా రెడ్డిగారిని ఎగదిగ చూచిరి. సరే ఇంకను విషయము కనుగొందమని రెడ్డిగారినే డ్రిల్లు చేయుమని ఆజ్ఞాపించిరి. వెంటనే రెడ్డిగారు తుపాకిని మెడపై వైచు


కొనిమామూలి జవానులతో కలిసి ఏపొరపాటును లేనట్లుగా తమసాధనను ప్రకటించినారు. అధికారికి మరింత ఆశ్చర్యము కలిగి జిల్లా పోలీసు అధి కారినిట్లు విచారించినారు:


“ నేను ఇదివరలో చూచిన తావులందెల్లడము అన్నియు లోప భూయిష్టములే. నేను విచారణ చేసిన స్థలము లుదంతటను ఏయే సంస్కారములు సూచించితినో అవన్నియు యిచ్చట సవ్యముగా నున్నవి. మరియు పోలీసు అధికారులకు డ్రిల్లు రాకుఁడుట గమనించి నాను. కాని యిచ్చట ఈ 'వేంకట రామా రెడ్డి డ్రిల్లు చాల బాగుగా చేసినాడు. ఇదంతయు చిత్రముగా నున్నది. తప్పు వెదకుద మన్న దొరకకున్నది”

జిల్లా పోలీసు అధికారి (మహీ తేమిం) మొగలాయి మనిషి. అతని పేరు మీర్ ఆవఖ్ ఆలీసాహెబ్ అతని 8ని హెంకీన్ గారికీని ఇట్లు సంభాషణ జరిగినది.

మె:హ. “సర్కార్ మింతుసని మాటయిచ్చిన అంతయు మనవి చేసుకొందును.

హెం. “సరే. చెప్పుము. విందునుకాని :

మొహ. "తాము దౌరాకు బయలు దేరిన సంగతివిని ఈ కోర్టు ఇనస్పెక్టర్ పర్యటనములో ఏ యే విషయములను సంస్కరించు చుంటిరో అవన్నియు

తెలిసికొని అదే ప్రకారమిచ్చట సిద్ధము చేయించి నాడు.

హెం. అయితే ఇతనికాసంగతులన్నియు నెట్లు తెలిసెను.

మొహ. ఇద్దరు జవానులను సాధారణ వేషములతో పంపి మీ వద్దినుండి వార్త లెప్పటికప్పుడె తెప్పించుకొనుచు వచ్చెను.

హె “అయితే స్వయముగా డ్రిల్లు బాగా చేయుట యెప్పుడు నేర్చుకొనెను.

'మొహి. “ఈ మూడు నెలలనుండియు దినమును అదే పనిగా కష్టించి సాధారణజవానులలో కలిసి నేర్చుకున్నాడు.హెంకిన్ ముసిముసి నవ్వునవ్వి "ఇతడు చాలా “చా లాక్ ?గా ఉన్నాడు" అనిపలికి ఆనాడే రాష్ట్రములోని అన్ని నాకాలకును "ఎల్లందిల్ పోలీసులాగా అధికారియగు వేంకట రామా రెడ్డి ఆదర్శముగా తీసుకొని అందరుకు పనిచేయవలెను.".


అనిఅత్యంత ప్రశంసనీయముగా ఆజ్ఞలువ్రాసి పంపుచు, వేంకట రామా రెడ్డిగారికి ఒక ప్రతిపంపినారు. రెడ్డిగారు ఆప్రశంననుచూచి మురిసిపోయినారు. ఆ ప్రశంసా పత్రముతోకూడ ఇంకొక చిన్న హుకుముండెను. అందిట్లుండెను. " వేంకటరా మారెడ్డి ఈ మూడుమాసములలో వరంగల్ సదర్ అదా లత్ న్యాయస్థానమందు రెండు మారులు హాజరీ అయ్యలే

a


దని తెలిసినది. అందుచేత పదిరూపాయీలు అపరాధము (జుర్మానా) విధింపబడుచున్నది." ఆనందము మాయమయ్యెను. తన పై అధికారితో తనశ్రమ కంతకును దొరికిన యీ పదిరూపాయల అపరాధమును గురించి మొర పెట్టు కొనెను. ఆ మొగలాయి మొహ తెమీం గారును అశ్చర్య పడి హెంకిన్ గారిని అతిదీనముగా ప్రార్ధించిరి. తుదకు హెంకిన్ నిట్లనిరి. “ఇతడు అతి చతురుడు. నేను పొగిడి రాష్ట్ర మంతటను ప్రఖ్యాతి కలిగించి నానని ఉబ్బిపోయి చెడి పోవచ్చును. అందుకై మందు గర్వి కాకుండ వృద్ధికి రావలెనని ప్రీతితో ఇట్లు బెదరించినాను. "


హేంకిన్ గారు వెళ్ళిపోయిన కొంత కాలమునకు తాలూక్దారుగారగు పెస్తోజీగారు జిల్లా పర్యటనముచేయ చుండ అతని యింటిలో అయిదారు వేల విలువగల సొత్తులు దొంగతనము య్యెనని వార్త వచ్చెను. వేంకట రామారెడ్డి గారును తాలూ కారుగారి వెంట దౌరాలో నుండిరి. వెంటనే వారిని తత్పరి శోధనార్థమైపంపిరి. తాలూక్దారునికి ఆరు వేలు పోయినందున ఆంతగా విచారముకలుగ లేదు. కాని ఆ వస్తువులతో పాటు కొన్ని ముఖ్యమైన రాజకీయ సంబంధమగు సొంత కాగితములు ఉత్తరప్రత్యుత్త రములును ఉండెను. అనెక్కడ బయటపడునో తన కేమి ప్రమాదము కలుగునోయని తహతహపడెను రెడ్డి గారు కరీంనగరు వచ్చిరి. తాలూకాకు ఇంటి తాళము భద్రముగా యున్నది. తలుపులన్నియు అట్లే మూతపడి యున్నవి. ఇంటి వెనుక భాగములో ఒక తలుపు మాత్రము తెరువబడినది. కాని తలుపు పగులగొట్టబడ లేదు. ఎందును రం ధ్రములు లేవు. “లోపలి చిలుకు ఎట్లు వదలిపోయెను." అని వీరాందోళన పడుచుండిరి. వీరి కుమారులగు రంగా రెడ్డి గారును లక్ష్మారెడ్డిగారును చిన్న బాలురు. వారుతము తండ్రి గారిఆందోళనమును చూచి అమాయిక ముగా సిట్లనిరి. " దిడ్డి తలు పును బయటి నుండి తిన్నగా చరిచుచు వచ్చిన లోపలి చిలుకు జారిపడను. బేగంగారి వద్దకు వారి సంబంధికుడు అదే విధముగా ఆతలుపును తెరచి మమ్ము అప్పుడప్పుడు తీసికొని పోవుచుండెను. ఈ మాటలవలన రెండు సంగతులు తెలియ వచ్చెను తలుపు తెరచు మార్గమేకాక, తలుపు తెరిచిన వాడు తాలూక్లారి గారి సంబంధీకుడే అని విశదమయ్యెను. ఇంటిలోపల ప్రవేశించి చూడగా మెట్లవద్ద మట్టినేల పై కాలిజాషలు కనిపించెను. అందొక కాలి వ్రేలు మడతపడినదిగా కనుపించెను. అనుమానింపబడిన వానికి ఒక కాలి వ్రేలు మడతపడినదిగా నుండెను. వానిని కొన్ని దినముల క్రిందటనే తాలూక్గారు పంపి వేసియుండెను. అతడెచ్చట నుండినది విచారిం పతుదకు అతనిని ఓరంగలులో పట్టుకొని నేరము నొప్పించి అతడెత్తుకొని పోయిన ధనమును, సొమ్ములను దొరకించు కొనినారు. అతడు రాజకీయ సంబంధమగు కాగితములు పనికి రావని కరీంనగరు కను మానకొండూరునకును మధ్యననుండు నదిలో పూడ్చి పెట్టి యుండెను. కాగితములన్నియు తాలుగ్గారున కియ్యబడెను. అతని యానందమునకు మేరయే లేదు. రెడ్డి గారిని గాఢముగా కౌగలించుకొని, ప్రత్యు కృతిగా ప్రభుత్వముద్వారా 125 రూపాయీల విలువకల రిపీటర్ గడియారమును బహుమతిగా నిచ్చెను. ఆగడియారమిప్పటికిని రెడ్డి గారివద్ద మంచి స్థితిలోనున్నది.


రెడ్డిగారు ఎల్లందల్ జిల్లాలోనుండు కాలములోనే వారిని తాత్కాలిక జిల్లా పోలీసు అధికారిగా 7 ఫర్వర్ది 1311 ఫసలీలో నియమించిరి. ఈ 8 ఏండ్ల లో రెంరెం దెందు ఉద్యో గముచేసిరో ఆయా స్థలములం దంతటను జిల్లా అధికారులు వీరిని చాల మెచ్చుకొని యుడిరి, 1308 ఫసలీలో ఇందూరుజిల్లా తాలూగ్దారు హేంకిన్ గారి కిట్లువ్రాసిరి:

"వేంకట రామా రెడ్డిగారు న్యాయశాస్త్రము తెలిసిన
వారు. మంచి అనుభవము సంపాదించినారు. వీరు నిజమైన
నిరంతర కృషి చేసి తమ కప్పగింపబడిన అభియో
గములలో విశేషముగా జయముందినారు. వీరిని
ఇప్పుడే మార్చవలదు. మార్చిన ఆ భి యోగము

లస్నియు చెడిపోవును. వీరు చేతిక్రింది
పోలీసుల అజ్ఞానమును, చెడు నడతలను
తొలగించినారు. ఇట్టి గణములతో నొప్పిన
అధికారి ఈ జిల్లానుండి వెళ్ళి పోవుచున్నాడనిన
ఈ జిల్లా యొక్క దురదృష్టమే యన వలెను.

"


అంతకు రెండు సంవత్సరములకు పూర్వమే 1306 ఫ, లో, ఇందూరు జిల్లా పోలీసు నాజింగారు రెడ్డి గారిని గురించి యిట్లు వ్రాసిరి"

"కోర్టు ఇనస్పెక్టరుగారికి ( రెడ్డి గారికి) తనపనిలో
అత్యం తాసక్తి కలదు. శ్రద్ధతో , దినమంతయు
ఉపవాసముండి న్యాయస్థానమందే పనులు
నెరవేర్చుచుండును. ఇతని శ్రమను చూచిన
మాకు జాలి కలుగుచున్నది. ఇతని
యెడ మాకు చాల గౌరవము హెచ్చినది.
అదే సంవత్సరమం కొక సందర్భములో
రెడ్డి గారిని గుంచి పై అధికారి యిట్లు వ్రాసెను;

“ వేంకట రామా రెడ్డి తప్ప ఇక ఈ జిల్లాలో
నమ్మక మైన (పోలీసు) వారు కనిపించరని
జాయింట్ మేజిస్ట్రీటుగారు హేంకీన్ గారితో
చెప్పగా వారాశ్చర్యపడిరి !

రెడ్డిగారు ఇందూరులోను ఎల్గందల్ లోను అందరిని మెప్పించి కీర్తిని ప్రతిష్ఠించి కొనియుండు కాలములో వారిని 9 ఖుర్గాదు 1311 ఫసలీలో లింగసూగూరులో నొక గొప్ప హత్య జరిగినందున ఆ హత్యాభి యోగమును చూచుకొనుటకై తాత్కాలిక జిల్లా మొహతమీము పదవిపై మార్పు చేసిరి.

వారు లింగనూగూరునకు వెళ్లిన కొన్ని మాసాలలోనే అనగా అదే 1311.ఫ సంవత్సరములో హెంకిన్ గారు ఎల్గందల్ జిల్లా పోలీసు అధి కారిగారిని తీవ్రము గా నిరసించుచు ఈ క్రింది విధమగు జాబును వ్రాసిరి:

“ వేంకట రామా రెడ్డి ఈ జిల్లా నుండి వెళ్ళిపోయి
నప్పటి నుండియు నేను చూచినంత వరకు జిల్లా పనుల
న్నింటి లోను, (anthropomody) వేలి ముద్రల శాస్త్ర శాఖా
విషయమునను చెడుగు దలకు వచ్చినది. తమకు
తాలూకాలలో ఉంచ వలసిన వేలిముద్రల రిజస్టర్లనగా
ఏవియో ఇంత మాత్రము కూడ తెలియదు. ఇంతవరకు
మీకచ్చేరీలోని ఉత్తమకార్య మంతయు వేంకటగానూ
రెడ్డివలననే జరిగినది అనిమాయభిప్రాయమై యుండెను.
అదిప్పుడు నిశ్చయమయ్యెను. ఆ మాట తమతో గూడ
అనియుంటిని. వేంకటరామా రెడ్డి వెళ్ళిపోయి నప్పటి
నుండియు మా కుడిచేయి విరిగిపోయి నట్లున్నది".


హేంకి గారు సాధారణముగా క్రింది అధి కారులను మెచ్చుకొనువారు కారు. ఇట్లు వారు మెచ్చుకొమట చేత రెడ్డి గారియొక్క గొప్పతనము మరింత ప్రకాశ మానమయ్యెను.