Jump to content

రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/ఆరవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఆరవ ప్రకరణము

1311 - 1323 వరకు

లింగ్సూగూరులో నుండునట్టి జిల్లా పోలీసు అధికారి మారిపోయి యుండెను. అతని కాలములో ఒక విచిత్రమైన అభియోగము ప్రారంభింపబడి యుండెను. లింగుసూగూరు జిల్లాలో చేరినట్టి గుర్గుంటా సంస్థానము ప్రాచీనమైనది. దాని పాలకులు బేండర్ (బోయ) జాతివారు. ఆ సంస్థాన మిప్పటి కిని మంచి స్థితిలోనున్నది. సంస్థానపు రాణీగారి యల్లుని కొక భార్యయు ఒక ఉపుడుగత్తెయు నుండిరి. ఉంపుడుగత్తె అత్యంత సుందరాంగి. దానిమూలముననే రాణీ గారి యల్లునికి చిక్కులలో బడెను. ఒక నాడోక తాగుబోతు సగము పూడిన బావిలోబడి చచ్చెను. పోలీసువారు వాని నొసటి పైనను, నెత్తి, పైనను, ఇతర భాగముల పైనను దెబ్బలు తగిలినది గాంచి నారు. సంస్థావపు ఇల్లటపల్లునికి సంతానము కలిగినప్పుడంతయు విచ్చిన్నమగుటచేత గ్రహణకాలము నాడొక మనుష్యుని నొసటి రక్తముతీసి దానితో మంత్రాక్షరములు వ్రాసి తాయెతులో వేసి పెట్టుకొనిన సంతానము నిలుచునని మాంత్రికు డొకడు బోధించి నందున ఈ బావిలోపడి చచ్చిన వానిని అతడు పట్టి తెప్పించి నెత్తిన పొడిచి రక్తము తీసుకున్నాడనియు, అందుచే వాడు చనిపోయినందున ఆత్మహత్య చేసికొనినట్లు కనబడవలె నని వానిని బావిలో పార వేసిర నియు నొక అభియోగము న్యాయస్థానములో ప్రప్రవేశ పెట్టిరి.


ఇట్లు ప్రవేశ పెట్టిన తర్వాత మేకట రామారెడ్డి గారు మొహతెమీముగా లింగుసుగూరుసకు వెళ్లిరి. అభియోగముయొక్క పూర్వాపరములను బలాబలములను శోధించి చూడగా వారికీ అభియోగ మంతయు అబద్ధముగానే యుండినట్లు నిశ్చయమయ్యెను. కాని ఈ అభిప్రాయమును వెల్లడించిన గుర్గుంటా దొర వద్దయే 20 - 30 వేలో జాడించు కొని పక్షవర్తియై అభియోగమను చెడగొట్టెనని నింద మోపక మానరని ఆలోచించికొని తన అభిప్రాయమును తనలోనే దాచుకొని తన శక్తికొలది దానిని నడపుటకు పూనుకొనెను.


ఘోరహత్యాభియోగమునకు గురియైన దొరగారిని పట్టుకొనుట మొదటిపని, డిప్టీ డైరెక్టరు గానుండిన జైనొద్దీన్ అనువారు 50 మంది రోహిలాలను, ఇతర జవానులను తుపా కులతో గూడ సిద్ధముచేసి దొరవారి కోటను ముట్టడి వేయుట కాజ్ఞాపించిరి. రెడ్డిగా రూరకుండిన ఆ చిన్న సిబ్బంది యంతయు

హతమై యుండెడిది. ఇట్టి సన్ని వేశములందే రెడ్డిగారి సమయస్ఫూర్తి పరిణతి పొందునట్టిది. ఇదియే వీరి జీవితములోని రహస్యము. గోటితో పోవు దాసిని గొడ్డలి పెట్టు వరకు ఎన్నడును రానిచ్చి యెరుగరు, రెడ్డి గారికిని డిఫ్టీ డైరెక్టరుగారికిని ఇట్లు సంభాషణము జరిగెను:

రెడ్డి " ఈ సిబ్బంది - ఈ అట్టహాసము ఇదంతయు ఎందు కొంకు?

డిప్టి “ రాజాసాబ్ను పకడ్లేవ్ చేయుటకు.

రెడ్డి "అయితే యీ సిబ్బంది మరల బ్రతికి వచ్చునా?

డిప్టీ " ఎందకు రాదు?

రెడ్డి " దొరవారి గడిలో నాలు గెము వందల బేండర్(బోయ)

     సిబ్బంది కలదు. వారికిని తుపాకులున్నవి. వారును మంచిళూరులే. 

డిప్టి.« అయితే దొరను పట్టుటయెట్లు?

రెడ్డి “మీరందరు ఊరకుండుడు. నే నొక్కడనే పట్టుకొని వత్తును.

డిస్టీ “ఒక్కడ వే? మీకు మరల బ్రదికి రారుసుమా. ఇదేమి పిచ్చి ఆలోచన.

రెడ్డి “సర్కారు వారి సేవలో నాకు ప్రాణభయమేమియు లేదు. వేంకటరామా రెడ్డి గారు తమ వెంట ఒక నిరాయుధుడగు జవానును మాత్రమే తీసికొని కోటలో ప్రవేశించినారు, గడీలోనంతయు కోలాహలముగానుండెను. బోయలందరు తమ దొరను పట్టియియ్యమనియు, చంపుదుమనియు చత్తుమనియుబెదరించు చుండిరి. రెడ్డి గారు దొరగారి అత్త గారితో పరిస్థితులను విమర్శించి చెప్పినారు, సర్కారు వారు తలచన యెంతనష్ట మైసను దొరవారిని పట్టుకొని తీరుదురనియు. ప్రతిఘటించిన సంస్థానమునకే ముప్పువచ్చు ననియు, దొర వాటికి అవమానము జరుగకుండునట్లుగా తాను పూచీగా నుందువనియు, పరి పరివిధముల చెప్పి యొప్పించి దొర వారిని తన వెంబడి ఒక టాంగా బండిలో తీసికొని నాకానుచేరినారు. దొరవారు వచ్చి నదిచూచి డిప్టి గారాశ్చర్యపడినారు. కాని వెంటనే తనరోహిలా సీపాయీలను చుట్టును ముట్టడి వేయు ఆజ్ఞాపించినారు. రెడ్డి గారు తాను అన్నింటికి పూచీ పడినాసని చెప్పి సీపాయీలను వెడలిపొమ్మ నెను.


అభియోగ విచారణ న్యాయ స్థానములో ప్రారంభ మయ్యెను. దొరవారి పక్షమున డిసాంటన్ బ్యారిష్టరును, ఆహమ్మద్ షరీఫు వకీలును మరికొందరు పెద్ద పెద్దవకీళ్లు మొత్త ముపై ఆరుమంది — వాదించినారు. పోలీసు పక్షమున రెడ్డిగారు మాత్రమే వాదించినారు. కేసులో బలము లేకున్నను రెడ్డి గారు, అంతటి కొమ్ములు తిరిగిన పెద్ద పెద్ద న్యాయవాదుల నెదిరించి వాదించుటను జూచి ఆ కాలములో హైద్రాబాదులో ప్రచురింపబడు చుండిన “దక్కన్ పోస్టు"అను స్థానిక ఆంగ్ల పత్రికా విలేఖరి చాల ప్రశంసించుచు వ్రాసెను! కేసు బలహీన మగుటకు ముఖ్యకారణము దొర వారి యుంపుడు గత్తె యొక్క వాజ్మూలమై యుండెను. ఆపై తనను పూర్వపు సంస్థాన న్యాయస్థానపు నాజిమున్ను, పూర్వపు మొహతెమోమున్ను కాంక్షించిరనియు, ఆమెను పలుమారు మోగించి పిలిపించి దౌర్జన్య ప్రయత్నము చేయదలచిరనియు, విపులముగా వాల్మూలమిచ్చి యుండెను. ఎటైన నేమి? తుదకు కేసు కొట్టి వేయబడెను . గుర్గుట రాణీ గారి అల్లుడు వదలి పెట్టబడెను.


లింగుసుగూరనుండి రెడ్డిగారు , 1 ఆ బాన్ 1312 ఫ. నాడు. గుల్బర్గాకు , (మొహ తెహెం) జిల్లా పోలీసు అధికారిగా మార్చబడిరి. హెంకిన్ గారి సహాయాధికారిగా పనిచేయు చున్న గాఫ్ గారు వేంకట రామా రెడ్డి గారి ప్రాముఖ్యతను గుర్తించి గుల్బర్గా పెద్ద జిల్లా యగుటచేత అచటికి వారిని పంపుటచాల యవసరమని కోరినందున వీరిని హెకిన్ గారు మార్చి వేసిరి. గుల్బర్గాలో వీరు పోలీసు అధికారిగా నుండిన కాలములో అనగా ఫసలీ 1312 వ సంవత్సరములో నిజాం రాష్ట్రములో ప్రధమ పర్యాయము ప్లేగురోగము ప్రవేశిం

చెను. ఆరోగము యొక్క దాడి మొదటి పర్యాయముదగుటచే జనులు భీతాత్ములైరి. సరియైన చికిత్సలు లేనందున అనేకులు చనిపోయిరి. అట్టి పరిస్థితులలో వేంకట రామా రెడ్డి గారు ప్లేగు వలన నిబ్బంది పడు వారిని విచారించుట తన పనికాదని తూష్ణీ భావము వహించిన వారుకారు. అట్టి లక్షణము వారిలో ఎన్నడుకు లేదు. తనకు సంబంధము లేని దైనను ఒక కార్యమ, ప్రజాహిత మైనట్టిదనియు, మానవాభ్యుదయ ముసకు అవసరమైనట్టి దనియు వారికి తోచిన. మీరందరి కన్న ముందుగానే జోక్యము కలిగించుకొనెడి వారు. ఈ ప్లేగు నలన బాధపడు జనులకు తమ యావచ్చక్తిని వినియోగించి సాయపడినారు. వీరి యీ సత్కార్యము కు ప్రభుత్వము వారు మెచ్చికొని 20 రూపాయల ఏలువగల పతక మును పసదనముగా ప్రసాదించిరి.

గ్బుర్గాలో నుద్యోగము చేయుచుండు కాలములోనే రెడ్డిగారి (మోహ తెమోం) జిల్లా పోలీసు అధి కారపదవి ఇది వరలో తాత్కా లికము గా (మున్ఛకంగా) నుండు నట్టిది 20 షహరేవర్ 1313 ఫసలీ నాడు స్టీముగా ముస్తఖల్ - పర్మనెంటు) చేయబడి నెలకు 200 రూపాయల జీతమును - రూపాయలు గుర్రము వ్యయమునకును అంగీకరింప బడెను.

గుల్బర్గానుండి రెడ్డి గారిని 1324 ఫసలీలో నిజామాబాదుకు మార్చి పంపిరి. (ఇదివరకు ఇందూరు అని వ్యవహ రింపబడుచుండిన జిల్లాయే రెడ్డిగారు రెడవమాఱు వెళ్లువరకు నిజామాబాదు అనునూతన నామకరణము బొందియుండెను.) హెంకిన్ గారి నిరుపమానమగు శ్రద్ధ చేత జిల్లాలలోని ఆల్లకల్లోల ములు తగ్గి యుండెను. మరియు వేంకటరామారెడ్డిగారి చాక చక్యము వలన నిజామాబాదులో పరిస్థితులు శాంత ముగాముగానుండెను. నిజామాబాదులో మూడున్నర సంవత్సరములుండిన తర్వాత వీరిని ఔరంగాబాదు జిల్లాకు 1317 ఫసలీలో 300 రూపాయల వరకు జీతము హెచ్చించి పంపిరి.

ఔరంగా బాదునకు వెళ్లిన కొన్ని దినములలోనే అచ్చట కొన్ని పరిస్థితు లేర్పడెను, గుల్బర్గాలో బ్రిటిషిండియా నుండి కొత్త గా ప్లేగు ప్రవేశించి నట్లుగానే, ఔరంగాబాదు లోనికి బ్రిటిషిండియా నుండి రాజకీయ వాతావరణము ప్రవేశించెను. ఔరంగా బాదు బొంబాయి రాజధాని యొక్క సరిహద్దుజిల్లా, బొంబాయిలో లోకమాన్య బాలగంగాధర తిలకు గారిని బ్రిటిషు ప్రభుత్వమువారు రాజద్రోహపు నేరములో శిక్షించి జెయిలులో వేసియుండిరి. మహారాష్ట్రు లుద్రిక్తులై యుండిరి! అదేసమయములో ఇంకొక దిక్కు బెగాలు రాష్ట్రములో రాష్ట్ర విభజనపై బెంగాలీలు విజృంభించి " వందేమాతరం "


అను జాతీయ గీతమును ప్రచారము చేయుచు హింసామార్గములను దొక్కుచుండి?. ఆ వందేమాతర గీతముకూడ ఔరంగాబాదులో ప్రచారము గావింపబడెను. ఈ ఆందోళన మంతయు బ్రిటిషిండియాలో హిందువుల చేతనే కావింపబకు చుండెను, ఔరంగా బాదులోను హిందూ యువకులు కొంతవరకు కల్లో ములు గావించిరి. అట్టి సందర్భములో వేంకట రామా రెడ్డి గారి యొక్క అవసరము ఆజిల్లాలో అత్యంతముగా కనబడెను. ఔరంగాబాదు సూబేదారుగా నుండిన నవాబ్ బర్ జోర్ జంగ్ బహాదర్ గారు హెలికిన్ గారికి వేంకట రామారెడ్డి గారి విషయమునను, ఔరంగా బాదు పరిస్థితుల విషయమువను ఈప్రకా రముగా జాబు వాసిరి

. "ఔరంగాబాదు నగరములో పాఠశాలలందలి విద్యార్థులు తిలకుగారు
  శిక్షను పొందిన విషయమున బళ్ళను వదలి వెళ్లి పోయినారు.
  వందేమాతరం యొక్క ప్రకటనలను ఊరిలో అతికించినారు. ... ...
  వేంకట రామారెడ్డిగారు హిందువులైనను ఈ గడబిడలను ఈ జిల్లాలో
  వ్యాపింపకుండు నట్లుగా ఏర్బాటుచేసి నారనిన వారి ఋజవర్తనము
  వారి ప్రభుభక్తియు వెల్లడియగు చున్నవి. ... ఇట్టి గడబిడలు ముందు
  ముందు కూడ ఈ జిల్లాలో సంభవింపవని నాకు పూర్తి గానమ్మకము
  గలదు. ఎందుకనగా -----:


   1. వేంకట రామా రెడ్డిగారు హిందువులు.

   2. ఈ జిల్లాలో ఇట్టి గడబిడలు వృద్ధియైన జనులు తనను గురించి
       నాన విధములుగా వదంతులు కల్పింతురని వారికి తెలిపెను. ..........

   3. హిందువు లితనిని తమ వానినిగా భావింతురు.ముసల్మాను
      అధికారికన్న హిందూ అధికారికి హిందువుల భావములు గుర్తు
      పడుటకు ఎక్కువ అవకాశములున్నవి.

   4.. వేకట రామారెడ్డి సత్యవర్తనుడు, విశ్వాసపాత్రుడును అగు అధికారి..

'

మొత్తము పై ఔరంగా బాదులో “రాజద్రోహ" ఉద్యమ ప్రచారము వృద్ధి కాలేదు. వేకట రామా రెడ్డిగారు 1314 ఫసలీలో వరంగల్ జిల్లాకు మార్చబడిరి. వరంగల్ జిల్లాలో ఒక సంవత్సరము రెండు మాసములవరకు ఉద్యోగము చేసిన తర్వాత అచ్చటినుండి అత్రాఫుబల్టా జిల్లాకు ౧ తీరు 1319 ఫసలీనాడు పంపబడిరి.


అతాఫుబల్దజిల్లా అనుసది 'హైదరాబాదు (బల్దా) సగరముచుట్టును (అత్రాఫ్) నుండు గ్రామాలతో కూడిన జిల్లా, పూర్వమందు ప్రభుత్వ కోశమునుండి నిజాం ప్రభువులు తమ సొంత వ్యయములకై ఎల్లప్పటికిని మితిలేని ద్రవ్యమును తీసి కొనుచుండుటలో ఇబ్బందులు కలుచుంగుడెను. ఈ లోపమును నంస్కరించుటకై గదే నిజాం ప్రభువు వారు తమ సొంత వ్యయమునకై అట్రాఫుబల్గా జిల్లా యను దానిని కల్పించి ప్రత్యేకించి యుంచిరి. ఈ జిల్లా ప్రభువు గారి యొక్క సొంత వ్యయమున కేర్చడినందున దీనిని ఫార్సీలో " సర్సెలాస్ " అనియు వ్యవహరింతురు. సర్ఫెఖాసు నుండి ప్రతి సంవత్సరము పన్నుల రూపమున సునూరు అర్ధకోటి రూపాయీలు పసూ లగును. ఈ మొత్తము గాక ప్రభువుగారికి (దీవానీ) రాష్ట్రప్రభుత్వ కోశము నుండి ఏటేట 5 లక్షల రూపాయీలు సమర్పించుకొను ఏర్పాటు కూడగలదు. ఈ సర్ఫేఖాసు మండలములో వ్యవస్థనంతయు మ. ఘ. వ. నిజాం ప్రభువు గారె స్వయముగా విచారించుకొందురు. అట్లుండినను పోలీసు శాఖను మాత్రము ఖాల్సా అనగా నేరుగా ప్రభుత్వము చేత పాలింప బము రాజ్యంగముయొక్క అధీనములో నిచ్చియున్నారు. అత్రాపుబల్టా జిల్లాలో మంచి సమర్ధత కల జిల్లా పోలీసు అధి కారియొక్క యవసరము చాల కలదని హెంకిన్ గారితో ఆలోచించగా వారు వేంకట రామారెడ్డిగారు తప్ప మరెవ్వ రును సరియైన వారు లేరని వారి సచ్చటికి 425 రూపాయీల జీతము పై పంపిరి. అత్రాఫుబర్గా జిల్లాలో రెండేండ్లు కూడ పనిచేయక మునుపే వీరు వనపర్తిలో ఉద్యొగము చేయవలసి వచ్చెను. వీరి సమకాలికులును, సమవయస్కులును. సహాధ్యాయులును, బాల్యమిత్రులును, బంధువులును అయిన వనపర్తి రాజుగారగు శ్రీ (ద్వితీయ) రాజా రామేశ్వర రావు బహద్దరుగారు ప్రభుత్వము వారితో ఉత్తరప్రత్యుత్త రములు జరిపి వేంకట రామా రెడ్డి గారిని తమ సంస్థానమునకు రప్పించిస సంస్థాన కార్యదర్శి (Secretary ) గా నియమించిరి. నెలకు 900 రూపాయీల జీతము నిచ్చుచుండిరి.1321 ఫసలీ వీరాయుద్యోగ ముందు ప్రవేశించి రెండు సంవత్సరముల కాలము వరకు నిర్వహించు చుండిరి

. వేంకట రామారెడ్డి కారు అతాఫుబల్గాజిల్లా పోలీసు మొహ తెమీముగా నుండిన కాలములో పూర్వపు నిజాము గారైన నవ్వాబ్ మీర్ మహబూబు ఆలీఖాన్ బహద్దకు గారు రాజ్యము చేయుచుండిరి. వారి స్వంత వ్యయము కై ప్రత్యేకింపబడిన ఆత్రాఫు బల్లా జిల్లా కే రెడ్డిగారు పోలీసు అధి కారిగా నుండిరి, గత నిజాముగారగు సవాబు మీర్ మహ బూబు అలీఖాన్ బహద్దరుగారు మొగల్ చక్రవర్తుల మర్యాదలను అనుసరించిన తుది ప్రభుపు అనవచ్చును. వారి నిజమైన జీవిత చరిత్రను మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహ ద్దరు వంటివాడు వ్రాయవలసి యుండెను. గత నిజముగారిని గురించి రాష్ట్రమంతటను, సామంత ప్రభువులును, ప్రజలను కొల్లలుగా కథలు చెప్పుకొను చుందురు. అంద నేకములు చాల వినోదకరములుగా నుండును. వారెన్నియో మాసముల కొకమారు జనులకు దర్శనమిచ్చు చుండిరినియు, వారు బయటికి వెళ్లినప్పుడు వేలకొలది ధనమును వీధులలో చల్లుచు పోవుచుండి రనియు, మహా దాతలనియు, వారిదర్బారు మొగలు చక్రవర్తుల దర్బారువలె సర్వ మర్యాదలతో కూడి యండినట్టి దనియు వారికి సర్వ మతములందు సహనదృష్టి యుండెననియు, ప్రజ లందరు వారిని పూజ్య భావముతో ప్రేమించుచుండి రనియు జనులు నేటికిని విరివిగా చెప్పుకొను చుందరు. గత నిజామ గారి సర్ఫేఖాసులో రెడ్డిగారు పోలీసు ప్రధానోద్యోగులుగా నుండినను వారి సమక్షములో పోవుటకు గాని, వారితో మాట్లాడుటకుగాని వారి కవ'కాశము కలుగ లేదు. అయినను వారి కాలములో రెడ్డి గారికి సంబంధించిన యొక ముఖ్యమగు ఘట్టము పేర్కొనదగినదై యున్నది. గత నిజాముగారు హైదరాబాదు నగరమునకు ఇంచుమించు అరు మైళ్ళ దూరమున నుండి నట్టి పహాడెపరీఫ్ అను స్థలమందు నివాసము చేయుచుండిరి. నగరమునుండి ప్రతి దినము సాయంకాలము వారి నౌకరులలో ఒక గుంపు అచ్చటికి వెళ్ళి అచ్చట


పనిచేయు నౌకరులను నగరము లోని ప్రభువు గారి దేవిడీకి పంపు చుందురు. ఇట్లు సేవకులు మారుకాలములో ఒక నాటి సాయంకాలమందు చెన్న రాయనిగుట్ట సమీపమందు మహేశ్వరము పటాలములో చేరినట్టి ఆరబ్బులు కొందరు సేవకు రాండ్రతో సరసాలాడుచు వారిని బెదరించిరి. ఈ అరబ్బులు చెన్న రాయని గుట్టచుట్టుపట్టు ప్రాంతాలలో ఇప్పపూత దొంగలించి సారాయిభట్టీలు పెట్టి దొంగతనము చేయుచుండిరి. వీరి దౌర్జన్యము లధిక మయ్యెను. తుదకు ప్రభువుగారి నౌకరుల పైననే తమ దర్చము చూపునంతటి ధైర్యము వీరికి కలిగెను. ఈ సంగతి ప్రభువుగారికి తెలియగా రెడ్డి గారికిని జిల్లాల పోలీసు కచ్చేరీలోని డిప్యుటీ ఇన స్పెక్టరు జనరల్ గా నుండి నట్టి మనోహర్ లాల్ పూరీ గారికిని ఆ దుర్మార్గులను పట్టుకో నుటకై ఆజ్ఞ యిచ్చిరి. వేంకట రామా రెడ్డి గారును, మనోహర్ లాల్ పూరీగారును చెన్న రాయని గుట్టవద్దకిపోయి అరబ్బులను పిలిచి విచారణసాగించి నిందితులను పట్టుకొన జూచిరి. అంతట సుమారు 300 అరబ్బులు కత్తులు, తుపాకులు బాకులు, ధరించి వీరిరువురిని ముట్టడించి భయంకర కోలాహలముచేసిరి. అరబ్బులు చెల రేగిన అసాధ్యలై పోదురు మరియు అట్టి స్థితిలో వారు వెనుక ముందుచూడక హత్య కూడ చేయుటకు వెనుదీయరు. మనోహర్లాలు పూరీ గారి

కప్పుడే యముడు ప్రత్యక్ష మైనట్లు తోచెను. పూర్తిగా ప్రాణములపై ఆశవదలుకొనినారు. రెడ్డిగారు మాత్రము అణుమాత్రముకూడ జంక లేదు. అరబ్బులతో నిట్లు కోపోద్రిక్తులై గర్జించినారు. " మేము బేరీవారి నౌకరులము కాము మేము నిజాం ప్రభువుగారి ఆజ్ఞాబద్దులము. ప్రభు సేవలో చనిపోవుటకు మాకేమియు చింతలేదు. మా కేయపకారమైనను మీయందరి తలలను త్వరలో యెగిరిపోవుననియు, మీరు తప్పించు కొనజాలరనియు గుర్తించుడు. మీరు తెలివి తెచ్చుకొని నిందితులను మాకు పట్టియిండు లేదా. మీరందరును నిందితులే అగుదురు". ఈ ప్రకారముగా ఒక చిన్న ఉపన్యాసమే ఝాడించినారు. అరబ్బులు తత్తరపాటుతో తమ యపచారమునకై ప్రాధేయపడిరి. వారి నాయకులు పాదాక్రాంతులై నిందితులను పట్టియిచ్చిరి. మనోహర్లాల్ పూరీగారికి యెగిరి పోవుచుండిన ప్రాణములు స్వస్థానము చేరుకున్నవి. వేంకట రామారెడ్డి గారికి వేలకొలది ధన్యవాదము లర్పించుకొన్నారు. ఆ కృతజ్ఞతను మరువనివారై తాము రచించిన “ఇన్సిదాదె సురాగ్ రసా నీజు రాయం" అను గ్రంథముయొక్క వ్యాఖ్యానములో ఆనాటి ఘట్టమును గురించి యిట్లు వ్రాసియున్నారు:

" క్రీ. శ1912 లో అత్రాపుబల్గా మొహ తేమిం గారుసు
   (అనగా వేంకట రామారెడ్డిగారు); నేనున్ను . అనగా

మనోహర్ లాల్ పూరీగారును) ఒక నిందితుని పట్టుకొనుటకై
  గృహశోధన చేయుటకై మైసరమునకు వెళ్ళితిమి. నిందితుడు దొరకక
  పోయెను. కాని వాని యింటి శోధన మొదలు పెట్టితిమి ఆసమయములో
  (మైసరము పల్లములోని) సీపాయీలు ఏదోవిధముగా మాకు యిబ్బందులు
  కల్పింప మొదలిడిరి. మా పని పూర్తి కాకముందే మాకు నిందితుని
  జాడలు తెలిపిన వాడు మావద్దకు వచ్చెను. వానిని సిపాయీలు చుట్టి
  వేసి తిరుగుబాటునకు సంసిద్ధు లైరి, ఆసమయమున మొహతెమోంగారు
  సిపాయీల ఆఫీసర్లను పిలిచిరి. మరియు జాడలు తెలిపిన వాని చుట్టును
  పోలీసు వారిని నిలబెట్టిరి. సీపాయీలకు బుద్ది చెప్పుటకు మొదలు పెట్టిరి.
  ఒక అర్దగంట సేపీ ప్రకారము వారిని సమధాన పెట్టి వానిని రక్షించుకొని
  బయటకు తీసికొని వచ్చిరి. వేంకట రామా రెడ్డిగారు ఆనాడు ధైర్యముతో,
  ఆలోచనతో గండము తప్పించిరి. ఆనాడు యెన్ని యోప్రాణములు
  నాశనమై యుండెడివి...

.

. వేంకట రామా రెడ్డి గారు జిల్లా మొహతీమీంగా నుండిన కాలమం దే జర్మనీ యువ రాజుగారు హైదరాబాదు నగరమునకు వచ్చిరి. వారు వేటకై వెళ్లినప్పుడు రెడ్డిగారు వారి వెంటనుండి ఏర్పాటులలో సాయపడినారు.