రాజస్థాన కథావళి/హళ్డిగట్టు యుద్ఢము

వికీసోర్స్ నుండి

హళ్డిగట్టు యుద్ఢము

——:(0):——

అక్బరు చక్రవతి౯ చిత్తూరును నాశనము చేసి పోవునప్పుడు దేశమునం దంతట దారిద్రమును మనుష్యుల హృదయములయందు నిరుత్సాహమును నెలకొలిపి పోయెను. మీవారు యొక్క గొప్పతనమంతయుఁ గధావశేష మయ్యెసు. పుణ్యభూములు పుష్పవనములు కోటలు కొవెలలు సంపూర్ణముగ నాశనము నొందెరు. దేవతాచరిత్రములను రాజపుత్రవీరుల దిగ్విజయములను దెలుపుటకు దేవాలయ పుగోడలమీదను మేడలమీఁదను వ్రాయఁబడిన చిత్తరుపులు రూపుమాసెను. విన్నాణమును దెల్పు వింతసరకులను తీసికొనిపోపుటకు వీలైనంతవఱకు శక్తివంఛన లేక ముహమ్మదీయు లెత్తుకొని పోయిరి. దిగ్గజములను జెవుడు వఱుపఁజాలు రణ భేరులు మ్రోగెడు కాలము పోయినది. నగర రక్షణము చేయుమని ప్రార్థించి నగర దేవత కఖండ దీపారాధనము జరుగు మేలుదినములు గతించినవి. వేయేల? రాణా వారి మందిర ద్వారము లే యక్బరు కట్టింపఁదలఁచిన కొత్త పట్టణము నందలి మందిరము నిమిత్తము తీసికొని పోఁబడెను. దేశమునంతను దుడిచి వేయుచున్న యుద్ధతరంగ మంత తో నిలిచిపోయెను.

రతంభారుకోట వెనుక బహదూరుషా చేతఁజిక్కెనని చదువరు లెఱుఁగుదురు. తరువాత దాని నా మహమ్మదీయ ప్రభువు వద్ద నుంచి బూందీసంస్థాన ప్రభువగు హర యనునతఁడును జోహణవంశస్థుఁడగు మఱియొకఁడును మఱలఁ బట్టుకొనిరి. ఆకోట యీకాలమున బూందీప్రభువగు సూర్జునుఁ డనునతని యధీనమున నుండెను. అతఁడు మీవారురాణాకు లోఁబడి యరిగాఁ పై యాకోట నేలుచుండెను. ఈ సూర్జనుఁడు వెనుక చిత్తూరి ముట్టడిలో, 'బహుదూరుషాతో యుద్ధము చేసి మృతినొందిన యర్జునరాపు కుమారుఁడు. అక్బరుచక్ర వతి౯ యీ కోటను కొంత కాలము ముట్టడించి పట్టుకొనలేకపోయెను. దానికిఁ దోడుగ నతఁడు కార్యాంతరము లమీఁద మఱియొక చోటికి బోవలసివచ్చినందున నీ ముట్టని నాప దలంచు చుండెను. అంతలో నక్బరునకు నమ్మక బంట్లును రాజస్థానమునకు ద్రోహులు నగు నిరువురు రాజపుత్రులు మోసము చేసి యీకోటం, జక్రవతి౯ కప్పగించిరి. అంబరు దేశ ప్రభువగు భగవాను దాసుఁడును వాని యన్న కొడు కగు మానసింగు నను వారే యామహానుభావులు. ఈయిద్దఱు ద్రోహము చేయనిపక్షమున రంతంబరుకోట శత్రుదుగ్గమమై నిరపాయస్థితి నుండి యుండునుగదా!

సూర్జనునిఁ గలిసి మాటలాడిన పక్షమునఁ జక్రవతి౯కి జాల లాభము గలుగు నని నమ్మి మానసింగు దర్శనము చేసి మాటలాడ వలయు నని యున్నది గనుక కొంతకాలము వఱకు యుద్ధము మానవలసిన దని సూర్జనునకు వత౯ మాన మంపెను. సూర్జనుఁ డందుకు సమ్మతించినందున మానసింగు తాను చక్రవతి౯ రాయబారి నని పేరు పెట్టుకొని కొంత పరి వారముతోఁ గోటలోనికి బోయి యాతని చేత సబహుమానముగ గౌరవింపఁబడెను. మానసింగును సూర్జనుఁడు నొండోరులతో సంభాషింపుచుండ హఠాత్తుగ సూర్జనుని మేనమామ కూర్చున్న చోటునుండి లేచి రాజా మానసింగు యొక్క వెనుక నిలిచియున్న చోపుదారు వంకఁ జూడఁదొడంగెను. అటు కొంతసేపు చూచి యతఁడు సోపుదారు చేతిలో నుండి వెండికఱ్ఱను వినయమునఁ దీసికొని సూర్జనుఁడు సాధారణముగాఁ గూర్చుండుస్థలమున నాచోపుదారుంగూర్చుం డఁబెట్టెను. అపు డందఱు తెల్లబోయి చూడఁ దొడఁగిరి. నిగనిగ లాచునట్టి యాకాటుక కన్నులును మేని చామనచాయను ముక్కు, మీఁద నెడమ పక్క నున్న పుట్టుమచ్చను జూచి యతఁడు తప్పక యక్బరుచక్రవతి౯యని మున్ను వాని నెఱింగిన వారు కొందఱు నిశ్చయించిరి కాని గ్రహించిన వారు సందేహించి చెప్పక యూరకొనిరి. గ్రహింపనివారు వెలవెల బారి చూచుచుండిరి. ఇంటికి వచ్చిన యతిథికి హాని చేయుట రాజపుత్యధర్మ విరుద్ధము, హాని చేయక యుండవలయునన్న దుర్భేద్యమై పోతుటీఁగ 'కైనఁ జోర రాక సింహగుహ యని చెప్పఁదగిన యాకోటలోనికిఁ దనకుఁ దానై చక్రవతి౯ వచ్చి లోటుపాటుల నెల్ల గ్రహించెగదా ! చక్రవతి౯ మాట యటుండ తమ కంత మహాద్రోహము జేసినమానసింగు నేమి చేయవలయు నని యక్కడ నున్న రాజపుత్రుల కందఱకు సందేహములు దోఁ చెను.

రాజపుత్రు లిట్లు కళవళ మందుచుండ నక్చరు నదరు బెదరు లేక నిర్భయముగఁ గూర్చుండి కొంతసేపటికి గంభీరమగుస్వరముతో 'సూర్జనా ! ఇప్పుడు కత౯వ్యమే' మని యడిగెను. సూర్జునుఁడు తెల్లఁబోయి యప్పలుకుల కేయుత్తర మిచ్చుటకుఁ దోఁచకయుండ మాన సింగు ధైర్యము తెచ్చుకొని కత౯వ్య మేమున్నది? రంతంబారుకోట దేవరవారికి సమర్పించి సూర్జనుఁడు మీవాఁడై గౌరవ మందుటయే'యని పలికెను. చేయున దేమియు లేక కోట యక్చరున కప్పగించి తొలఁగెను. ఈ విధముగ బంధుద్రోహము చేత రంతంబరుకోట మొగ లాయీలపా లైనదని రాజస్థాన చరిత్ర కారులు వ్రాసిరి. అట్టి యవస్థలో నెంతటి మానవంతుఁ డైన నట్లే చేయవలసి యుండును గదా? రాజస్థానమునందలి సంస్థానములు తమలో తమ కైకమత్యము లేక దేనిమేలు నదియే చూచుకొనుచు బనిచేయుటయేగాని యావద్దేశము యొక్క మేలును జూడక పోవుటచే స్వనామమును గ్రమక్రమముగఁ దెచ్చుకొనఁజొచ్చెను. దేశమునందు గల శూర శిఖామణుల నెల్ల రావించి దేశాభిమానము గలిగించి యుద్ధములు చేయింపఁ గల సమర్థుఁడు రాణా సంగుఁడు గతించుటయు సూర్యవంశపు రాజుల గద్దె యెక్కుట కనర్హుఁడగు నుదయసింగు రాజగుటయు నాశనమునకు ముఖ్య కారణములు. అక్బరు చూపిన సాహసమును మనోధైర్యమును 'రతంబరు' కోటలో నున్న వారి కత్యద్భుత మును గలిగించెను. విశేషించి యతఁడు ధీరోదాత్తుఁడగు పగతుడనియు నీచశత్రువుఁడు కాఁడనియు వారికి దోచెను. మఱియు నతఁడు రాజపుత్రస్త్రీని వివాహము జేసికొని యామేను తన మతములో గలియు మని బలవంత పెట్టక యామె యిచ్చవచ్చిన దేవతల నారాధిం చుకొనవచ్చు నని సెలవిచ్చుటం జేసి యాచకవతి౯ మహోదారుఁడని యా రాజపుత్రులు గ్రహించిరి. బూందీసంస్థాన ప్రభువు లదివఱకు మీవారు నిమిత్తము పోరి చాల నష్టపడిరి, అందుచే నక్బరు వారియభిమానమునకు లోపముగలుగకుండునట్లు సంధిఁ జేయఁదలంప 'సూర్జ నుఁడు' సంతోషముతో నంగీకరించెను. ఆసంధి నిబంధన లివి. సూర్జనరావు తన యేఁబది రెండు జిల్లాల నెప్పటియట్లు పాలించుకొనవచ్చును. అవసర మగునపుడు ఢిల్లీ పాదుషా కుఁ గొంత సేన నతఁడు పంపవలెను. బూందీ రాజులు మొగలాయిలకు నెప్పుడు తలపన్ను నీయనక్కఱ లేదు. చక్రవతి౯ బూందీ ప్రభువులను సింధునది దాఁటి యావలకు యుద్ధములకుఁ బంపఁగూడదు. బూందీ రాజకన్యను 'మొగలాయీలు పెండ్లియాడఁ దలంపఁకూడదు. బూందీ వారి భేరీలు ఢిల్లీ కోటగోడల నడుమ వాయింపవచ్చును. ఆ రాజులు ఢిల్లీ చక్రవతి౯ దర్చారు బ్రవేశించునపుడు తమ యాయుధముల నెల్ల ధరించి యుండవచ్చును. చక్రవతి౯కి దక్కిన రాజులం బలె నేల సాగిలంబడి మృక్కనక్కఱ లేదు. షరతు లింత యనుకూలముగ నున్నపుడు సూర్జునుఁడు వాని కంగీకరించుట యొక వింత కాదు. కాని యతఁడు సమ్మతించిన మాత్రమున పోరణఁగ లేదు. ఏలయన తొల్లి బహదూరుషా యాకోటం బట్టుకొన్నపుడు వానివద్దనుండి 'శాంతహారుఁ' డనునొక రాజ పుత్రవీరుఁడు దానిని వదలించి సూర్జనరావున కప్పగించి మివారు రాణాలకు లోబడి దాని నేలుకోమ్మని చెప్పెను. అందుచే నతఁ డిప్పుడు జరిగిన స్వామిద్రోహమును సహింపక సూర్జనుఁడు చేసికొన్న సంధి కొడంబడక చక్రవతి౯ నెదిరింప నిశ్చయించుకొనెను. కాని యతనివద్దనున్న సైన్య మతిస్వల్ప ముగ నుండెను. అయిన నేమి ! చేఁ జేతుల కోటను పగతుని కప్పగించి సుఖంచుటకంటే నిష్కళంక చరితులై దేశమునిమిత్తము గౌరవముగ బ్రాణముల విడుటచుట యే యుత్తమమని యతఁడు నిశ్చయించుకొనెను. అట్లు కృతనిశ్చయుఁ డై హరవంశజుఁడగు రాజపుత్రుఁ డెవ్వఁడు ప్రాణములు కంఠమునం దుండఁగా రంతంభారు కోటవిడిచి పోవఁగూడదని యొట్టు పెట్టి యది యొక స్తంభముమీఁద వ్రాయించి యనంతరము రక్తాంబర ధారుఁడై 'దేశాచార ప్రకారము తాంబూలము వేసి తన పరిజనులతోఁ గూడి చక్రవతి౯ నేనల నెదిర్చి ప్రాణములువిడిచెను. అది మొదలు నేఁటివఱకు హగవంశజుఁడగు రసపుత్రుఁ డాకోటదరిం బోవునపుడు సిగ్గునం దలవంచుకొని పోవుచుండును.

అనంతగ మక్బరు చిత్తూరుం దోఁచుకొని యాద్రోఁపుడుధన ఢిల్లీ ప్రవేశించెను. అతఁడు మహమ్మదీయుఁ - డైనను హిందువులలోఁ బరాక్రమవంతుఁడగుశత్రువుఁ డుండినపక్షమున వాని నతఁడు తగునట్లు గౌరవించుచు వచ్చెను. ఈచిత్తూరు దండయాత్ర ముగిసినది మొదలు, అక్బరు చక్రవతి౯ రాజపుత్రులకు గొప్ప యుద్యోగము లీయ నారంభించెను. అతని ప్రధానమంత్రులలోఁ గొందఱు సేనాధిపతులలో గొందఱు రాజపుత్రు లుండిరి. చక్రవతి౯ మీవారు విడిచిపోయినపిదప నుదయసింగు తానదివఱకు దాఁగియున్న యడవులలోనుండియుఁ గొండ లలోనుండియు వెలువడి వచ్చి తనగౌరవ హీనమయినజీవితమును నిచ్చటచ్చట కొంత కాలము గడపి వసియించుటకుఁ బట్టణమైన లేక పోవుటచే యొక నగరమును నిర్మింపఁ దలంచి ముందుగా నొక సరస్సు గల్పించి యాసరోవర తీరమున నుదయపుర మను పేర రాజధానింగట్టి యందుఁ బ్రవేశించె. ఆసరోవర మిప్పటికి నుదయసాగర మను పేరల బరగు చున్నది. అది 'యేమిదోసమో కాని మీవారు రాజధానిలో శూర శిఖామణులనేకులుండగ వారిలో నెవరి పేరంబరగక పౌరుషహీనుఁడగునోక యపాత్రుని పేర నేఁటికిఁ బఱగుచున్నది. ఉదయ సింగు మహారాజునకు నిరువదియైదుగురు కుమారులు గలరు. బహుపుత్రులకు జనకుఁడై యుండుటఁ దప్ప యుదయసింగునివద్ద లోకులు సంతసింపదగిన యోగ్యత మఱి యేదియు లేదు. అతని ప్రియపుత్రుఁడు జగ్మల్ అను నతఁడు. తన యనంతరమున వానినే రాజుఁ జేయుట కతఁడు నిశ్చ యించుకొని సింహాసనమునకు న్యాయముగ రాదగిన వాడును ప్రథమ భార్యకుమారుఁ డగు ప్రతాపుని రాజ్యహీనుం జేసెను. కొడుకుల యెడల నుదయసింగు మిక్కిలి కఠినుండని చెప్పవచ్చును. వేఱోక మారు సూక్తుఁడను మఱియొక కుమారుని జంపింపఁ దలంప బంధువు లండఱు బతిమాలి యాపి యాకుఱ్ఱవాని దేశమునుండి యవ్వల కంపిరి.

సూక్తుఁడు పుట్టగానే వానిజాతకమును వ్రాయు మని తండ్రి జ్యోతిష్కులం బిలుపింప వారు మీన మేషములు లెక్క పెట్టి గ్రహచారములఁ జూచి నోరు చప్పళించి “ఈబాలుఁడు స్వదేశమునకు శత్రుం డగుటయేగాక స్వకులమునుఁగూడ నిర్మూలముఁ జేయు" నని చెప్పిరి. అప్పలుకులు విని తండ్రి భయపడి యది మోదలు వానిని గడుజాగరూకతతోఁ జూచుచుండెను. సూక్తుఁ డై దేండ్ల ప్రాయము గల బాలుఁడై నప్పు డొకనాఁడు తండ్రి వద్ద నాఁడుకొనుచుండగా లోహ కారుఁ డొకఁడు పదునైనఁగత్తిని దెచ్చి రాణా కిచ్చెను. అది వాడి గలదో లేదో చూచుట కుదయసింగు దానితో దూదిబుంగ నఱికి యది పదునైనదే యని సంతసించి యక్కడ పెట్టెను. వెంటనే సూక్తుఁ డాఖడ్గమునుఁ బట్టుకొని "కత్తులు మనుష్యులను నఱకుటకు గాని దూది నఱకుటకుఁగా” వని పలుకుచు నొక్క యేటున నెముక గనఁబడనట్లు తన చేయి నఱకుకొనెను. ఆ చేతినుండి క్రొన్నెత్తురు జోటజొటగారి నేలఁబఱచిన రత్నకంబళమును దడిపి చూపఱకన్నులకు వెరపు గొలుపుచున్నను 'బాలుఁడుమాత్రము బెదరక నొప్పి యని యేడ్వక యెప్పటియట్ల నిశ్చలుఁడై నిలిచెను. కడుపిఱికియగు నుదయ సింగు కుమారుని మహాసాహసమునుఁ జూచి సహింపలేక యాయీడు బాలునియందంత వైపరీత్యము గనఁబడుట దేశమున కరిష్ట మని భావించి తక్షణమే యా బాలుని వధియింపుఁ డని తలారుల కప్పగించెను. తలవరు లాకుఱ్ఱని వధియిచుటకుఁ గొనిపోవుచుండ మార్గ మధ్యమున చందావతుకులస్థుఁ డగు రాజపుత్రుం డగపడి యావద్వ్రత్తాంతము వినీ తెలివి యుట్టిపడుచున్న యాబాలుని మొగముఁ జూచి విడువలేక కనికరము పెంపున వానిం జంపనీయక వెంటఁ బెట్టుకొని రాణావద్దకు వచ్చి బాలుని బ్రతికింపు మని ప్రార్థించి "నాకు సంతా నము లేదు. నేను వీనిం బెంచుకొనియెద. వీడు నాకులదీపకుఁడై యుండుఁగాక !" యని పలుక దగ్గర చుట్టమును మిక్కిలి ప్రబలుఁడు నగు చందావతువంశస్థునిమాట 'కెదురాడ లేక యుదయసింగు తల యూచి యూరకొనియె. చందావతుఁడును బాలుని తన రాజధాని యగు సాలుంమ్రానగరమునకు గొంపోయి నేల నడవనీయక కడు గారాబమునం బెనుచుచుండె.

చిత్తూరు విడిచివచ్చిన నాలుగు సంవత్సరముల కుదయసింగు శరీరస్థితి చెడినందునఁ దన మరణ మాసన్న మగుచున్న దని యెఱిఁగి లోకాంతరప్రయాణమునకు వలయు ప్రయత్నము చేయసాగెను; అది వసంతకాల మగుటచే మీవారు సంస్థానమునఁ గల సామంత రాజు లందఱు రాణాతోఁ గలిసి యడవిపంది వేఁటకుఁ బోవునట్టి సమయము. ఈ వేఁటకుఁ బోవునప్పుడు రాణా సామంత ప్రభువుల కాకుపచ్చని బట్టలు కొన్ని బహుమానముగ నిచ్చి వారిని వెంటఁ బెట్టుకొని వేఁట సలుపు వాడుక గలదు. ఆవాడుకంబట్టి ప్రభువులందఱు నుదయ సింగు మంచము చుట్టుఁ జేరిరి. ఉదయసింగు చావక మునుపు నోటమాట యున్నపుడె తనయనంతరమున జగ్మల్ రాణా కావలయునని చెప్పెను. అతనిమనసులో నేమున్నదో కాని యపుడైన జ్యేష్ఠపుత్రుఁడగు ప్రతాపునిమాట యెత్తనే లేదు. అనంతరము కొన్ని నాళ్ళ కుదయసింగు మృతినొందెను. ఆదేశాచారప్రకారము పీనుఁగును పురోహితుని యింట బాఱ వైచి దహనాదికర్మములు జరుపు మని చెప్పి రాజబంధువులు కుమారుని పట్టాభిషేకము నిమిత్తము మందిరము నలంక రింపఁ జోచ్చిరి.

ఉదయసింగు జగ్మల్లును రాజ్యార్హుఁడుగ జేసినప్పుడు సోనిగుఱ్ఱ సంస్థాన ప్రభు వోక్కఁ డుండెను. ఉదయసింగుని పట్టపు దేవి యాతనికిఁ జెల్లె లగుటం జేసి యా ప్రభువు ప్రతాపునికి 'మేనమామ. అందుచే దన మేనల్లుఁడు సింహాసనబ్రష్తుఁడుగఁ జేయబడుటకు సహింపనోపక యావీరుఁడు దాపుననున్న చందావతువంశస్థుఁ జూచి మీరు దగ్గఱనుండియే యిట్టి యక్రమము జరుగుచుండ నుపేక్షింతురా యని యడిగెను. చందావతుఁ డాపలుకులు విని మఱియొక మాటమీఁద బెట్టి యిట్లనియె. “చావునకు సిద్ధముగనున్న యతఁడు పాలిమ్మని యడుగుచుండఁగ మనము వద్దన నేల ? మృతినొందుచున్న వానిమాట కడ్డము చెప్ప నేల? వానికోరిక యాలాగే చేయుదమని తరువాత మన యిష్టము వచ్చినట్లు చేసికొనగూడదా' యని యామాటల యభిప్రాయము అట్లు పలికి తన పలుకుల యర్థము విస్పష్టమగునట్లు ప్రభువుకు వెండియు నిట్లనియె. "అయ్యా? నేను నీ మేనల్లుని పక్షమువాఁడ నే తప్పక నేను ప్రతాపునకే సహాయము చేయుదును."

ఇట్లు వాగ్దానములు జరిగినను జగ్మలునకు పట్టాభి షేకము చేయుటకే ప్రయత్నములు జరుగుచుండెను. సామంత రాజులందఱు నుదయసింగు కోరిక చొప్పున జగ్మల్లును రాణాగాఁ జేయుటకు వచ్చి కూర్చుండిరి. ప్రతాపుఁడు సోదరుని రాజ్యమునం దుండుట తనకు సేమము కాదని తలంచి యే దేశాంతరములకైనఁ బోవనిశ్చయించి గుఱ్ఱములకు జీను వేసి పయనముగమ్మని సేవకుల కాజ్ఞాపించెను. జగ్మ ల్లు పట్టాభిషేక మహోత్సవమునకై లేచి గద్దె యెక్కఁబోయెను.పట్టాభి షేకమప్పుడు చందాపతుకులవృద్ధు రాణాకు నడుమునకుం గత్తి కట్టవలసిన యాచారము గలదు. ఆయాచారము నడపుటకు జగ్మల్లున కొక్క పక్క చందావతువంశస్థుఁడును రెండవ ప్రక్క వాని చేయిపట్టుకొని తారువంశస్థుఁ డగు వేరొక వీరుఁడు నుండిరి. అపుడు చందావతుఁడు గద్దెయెక్కఁబోవుచున్న జగ్మల్లుయొక్క హస్తముఁ బట్టుకోని "దేవా మీరు పొరఁబడుచున్నారు. ఈ పీఠము మీ రెక్క వలసినదిగాదు. ఇది మాసోదరుఁ డగు ప్రతాపుఁ డధిష్టింపవలసినది.” అని నిర్భయముగఁ జెప్పెను. జగ్మల్లు వానిపలుకులు సరకు సేయక యతనిచేయి విదల్చుకొని యాగడము చేయఁ దలంచెను; కాని చందావతుఁడు వానిని సందిట నిఱికించి యొకచోట:గూలవై చి ప్రతాపునిం దోడి తెచ్చి గద్దెయెక్కించి వాని మొలకుఁ గత్తికట్టి సాగిలంబడి ముమ్మాఱు వాని చరణములకు మొక్కి మీవారు రాణా ప్రతాపసింగేయని మేఘగంభీర భాషణములతో నొక్కి చెప్పి చప్పట్లు కొట్టెను.

అంతకుమున్న రాజ్యభ్రష్టుఁడై దేశములపాలై పోవలసిన యవస్థలోనుండి యాకస్మికముగ మండలాధిపతియై సింహాసన మెక్కఁగలిగినందులకు గర్వించి విజృంభింపక ప్రతాపుఁడు నిశ్చలమనస్కుఁడై శాంతముతో నుండెను. పట్టాభిషేక మహోత్సవము ముగిసినతోడనే ప్రతాపుఁడు సామంత ప్రభువులం బిలిచి యది వసంత కాలమనియు నడవిపందిని 'వేఁటాడి గౌరికి సమర్పించి ముందుసంవత్సరము తన యదృష్ట మెట్లుండునో తెలిసికొనవలయుననియుఁ జెప్పి గుఱ్ఱమెక్కి వారిం దోడ్కొని వేటకుఁ బయలు వెడలెను. రాజస్థానమునందంతట గౌరి యిప్పటికి ననేక నామములతోఁ బూజింపఁబడుచున్నది. ఇట్లు వెడలి వా రడవిపందిని జంపి దానిని దేవి కర్పించి యామెను సంతుష్టిపఱచి మఱుచటియేడు తమకు జయకరముగ నుండునని తెలిసికొని సంతసించిరి. అది మొదలు రాణాప్రతాపసింగు పలుమా ఱీవిధముగఁ బలుకుచు వచ్చె. "రాణా సంగునకు నాకును నడుమ మాతండ్రి యుదయసింగు లేకుండ నేనే సంగునికుమారుఁడ నైనపక్షమున గొడ్డు మాంసము తినుతురక వాఁడు వచ్చి యీ దేశమున నడుగు పెట్టఁగలఁడా. రాజపుత్రులను లోఁబఱచుకొనగలఁడా.”

మీవారు రాజ్యమునకు స్వాతంత్రయము దేవలయునని ప్రతాపునకు గోరిక యున్నది; కాని యది నెఱవేఱుట యసాధ్యము. ఏలయనఁ బ్రతాపసింగునకు ఢిల్లీ చక్రవతి౯ సైన్యములెకాక స్వబంధు జనములలో గూడ శత్రువు లుండిరి. మార్వారు, బూందీ, బికనీరు, అంబరు మొదలగు సంస్థానముల యధిపతులు చక్రవతి౯కి దాసులై యుండిరి. అందు బూందీ సంస్థానప్రభువుదక్కఁ దక్కినవారు దాసు లగుటతోఁ దనివి నోందక తమ యాడుపడుచులఁ దురక కిచ్చి పెండ్లి గూడ చేసిరి. వారిమాట యేల ? ప్రతాపుని సోదరులలో నొకఁ డగు సూగ్రుఁ డనువాఁడు తన యన్నను విడిచి యక్బరు చక్రవతి౯ శరణంబు సోచ్చి యాతని చేత నేలుటకు గ్రామంబులం బడసి మా న్యుఁడై యుండె. అతఁడును బిడ్డలును సూగ్రవతు లను పేరఁ జక్రవతి౯ కొఁలువు లో బ్రతిష్ఠితులై యుండిరి . మీవారు దేశము నిరంతర యుద్ధములచేత ధనశూన్య మగుటయేగాక మాయుధ శూన్యమై వీర శూన్యమై యడవియటు లుండె. అయవస్థలో మహావీరుఁ డగు ప్రతాపుఁ డొక్కఁడు చక్రవతి౯తో బగ సాధించెనుగాని మఱి యొకఁ డైనపక్షమున సందుదొరికినదే చాలునని చప్పుచప్పునఁ చక్రవతి౯తో సంధి చేసికొని యాతని మన్ననలనుం బాత్రుండై సుఖముగ నుండి యుండును.

మివారు దేశములోఁ బుట్టిన రాచవాఁడు ఢిల్లీ చక్ర వతి౯కి లొంగి సలాము చేయఁగూడ దనియు వానిని తాము గెలువ లేకపోయినను తఱిమి దోఁచుకొని బెదరగొట్టి సిలుగులం బెట్టవచ్చు ననియు వీలుదప్పివచ్చినప్పుడు గౌరవముగ రణముఖంబునఁ జచ్చి వీరస్వర్గము జూఱగోనవచ్చు ననియు నందుచే సంధి చేసికొనగూడ దనియు వాని