రాజవాహనవిజయము/ప్రథమాశ్వాసము
శ్రీ
పరమాత్మనే నమః
ఇష్టదేవతాస్తవము
(కాకమానిమూర్తి ప్రణీతము)
| శ్రీయధరోపరిం గుచగిరిం గబరిం దరహాసవీటికా | 1 |
1. విష్ణుఁడు చంద్రసూర్యలోచనుఁడు గావున నాయన చూడ్కులు (చంద్రసూర్యాతపములు) లక్ష్మీదేవ్యధర కుచ కబరులయందు వరుసగా దరహాసవీటికాచ్ఛాయలుగను చందనకుంకుమపత్రరచనలుగను గుందచంపకములుగను శోభిల్లెననుట.
మ. | మెగమున్ మైసగమున్ సగౌరవగమున్ మేరూజ్జ్వలజూటప | 2 |
2. అనేకపాద్+అగము= వటవృక్షము, శివుడు దక్షిణామూర్తిలీలయందు వటవృక్షముక్రింద సనకాదిమహాఋషులకుఁ దత్త్వోపదేశము చేసెను. ఆశుగము = బాణము. గాలి త్రిపురసంహారకాలమందు శివునకు విష్ణుబాణమయ్యెను, మెగము = మెకము.
ఉ. | సుద్దుల కన్నెకన్నుగవ చొక్కపుఁజెక్కులు మోవి నొక్క మై | 3 |
3. శివుఁడు భైరవలీలయందు బ్రహ్మ యొక్క యైదవతలను ద్రుంచినందున బ్రహ్మ సరస్వతి మొగము ముద్దుబెట్టుకొనునప్పు డావెల్తిని బంచవక్త్రుఁడు (శివుఁడు) ఒకప్పుడు తన లలాటమునఁ బుట్టిన సంగతిని సరస్వతికి దెల్పి మాటుచున్నాఁడు. పంచవక్త్ర = అయిదుమోములు గలది. (విశేషము వాక్కులు గలది, చతురాస్యుడు = నాలుగుమోములు గలవాఁడు, చతురమైన వాక్కులు గలవాఁడు.)
సీ. | ఇందిరామదిరాక్షి క్రీడాపు నీలంపు | |
గీ. | భరితకౌస్తుభదినమణిపరిధి యనఁగఁ | 4 |
4. లక్ష్మికి విష్ణువక్షస్థలము నీలపుమేడగఁ జెప్పఁబడెను. పరిధి = సూర్యచంద్రులచుట్టు కట్టుగుడి. విష్ణువు వక్షస్థలమందుండు కౌస్తుభరత్నమనెడు సూర్యునకు వైజయంతికామాలిక పరివేషముగనుండెను. కుస్తుభము = సముద్రము. అందుఁ బుట్టినది కౌస్తుభము.
ఉ. | అచ్చికఁ జన్ను ద్రావుటకు నౌఁదల భూత్కృతిఁ జల్లుకొన్న పా | |
| పచ్చ నిజాసనంబు గనుపట్టిన మార్కొను దంతియంచుఁ గొ | 5 |
5. అచ్చికన్ = కొరంతతో, వినాయకునకు శిరస్సునఁ చంద్రశకలమున్నది. "బాలేందుశకలోత్తంసం వందేహం గణనాయ" కమ్మని యున్నందున నందలియమృకము నెత్తిపై జల్లుకొన్న పాలుగ జెప్పఁబడెను .
ఉ. | చోరు నలంక్రియావిహృతిసొంపు మయూరిని సౌకుమార్యమున్ | 6 |
6. చోరుఁ డలంకారములు సంగ్రహించుననియు, మయూరినియందు సౌకుమార్య మున్నదనియు, భారవికిఁ (సూర్యునకు) గాంతిసంపద గలదనియు, బాణమునకు గుణ సంబంధంబును బ్రయోగవైచిత్ర్యంబును గలదనియు, మురారి (విష్ణువు) ఈయనకు పద్ + అంబు= పాదమండలి నీటి స్వచ్ఛత గలదనియు, స్వభావోక్తి గ్రహించుటచే చోరకవికవిత యుపమాద్యలంకారభూయిష్టమనియు, మయూరకవికవిత సుకుమారము అనఁగా మృదుశబ్దభూయిష్టమనియు, భారవికవిత ప్రకాశంబు గలదనియు, బాణకవిత్వంబు ప్రయోగలక్షణ సమృద్ధిగలదనియు, మురారి కవిత మృదుపదభూయిష్టమనియు గ్రహింపవలయును. ప్రతిభ = బుద్ధివిశేషము.
సీ. | జలరాశిలంఘనోజ్వలజవంబున నెవ్వఁ | |
గీ. | నట్టిరఘురామసూచనాహర్షబాష్ప | 7 |
7. మరున్మనోహరత = దేవతల కింపయ్యెననియు తండ్రియగు వాయుదేవుఁడు సంతసించెననియు, అకలంకముగ = నిష్కలంకముగ ననియు, సుకరహితమైన లంకగలదిగఁ జేసెననియు, ఈయన గాత్రము పవనసంబంధము గానఁ బ్రాణానిలంబు నిల్పెనని భావము. రఘురామ...నాంతు = రాములవారు చేయు సన్నలవలననైన యానందబాష్పములయొక్క విడుచుటచేఁ దెంపు లేని గండాభిషేచనంబు అవధిగాగల నేత్రంబులలోని కాంతిచే నందమైన కనుగొలుకులుగలవానిని.
సీ. | జంభారి దంభోళి ఝళిపించి నిప్పుకల్ | |
| బరువు తానెఱిఁగిన శరముచుల్కఁగ జేసి | |
గీ. | పక్ష మెడలింప మెడఁద్రొక్కి పట్ట నంప | 8 |
8. గరుత్మంతుడు నిజాపరాధుల కపకృతిచేయక యుపకారమే చేసెను. అపరాధినైన నన్నుమాత్రము రక్షింపడా! ఇంద్రుడు ఱెక్క తేగవ్రేయవచ్చినను, గాద్రవేయులు మెడద్రొక్కుచుండినను, రుద్రుఁడు బాణముపాలు చేసినను ,తనవారికి (ఉరగులకు) దేవతలు అపకృతి చేయుచున్నను, వారికి వరుసగా నొక యీక నేరాల్చెననియు, గ్రింద బడవేయక కాద్రవేయులను మోచెననియు, రుద్రునకుఁ ద్రిపురవిజయ మిచ్చెననియు దేవతలను సుధ తిరుగఁ దీసికొనిపోనిచ్చెననియు, నభిప్రాయము.
సీ. | బలదూది నింపని పరుపుపెం పెవ్వాఁడు | |
గీ | భాష్య మెవ్వఁ డొనర్చె శబ్దంబుకొదువ | 9 |
9. కదలనివిరివిమోపు = భూమి, జవికె = తేలికపఱిచె. సుత్తెవాటుల వారు లెత్తనిసొమ్ము = సుత్తిదెబ్బచేఁ బీటెత్తనిసొమ్ము శేషాభరణ మనుట. శిఖి...విల్లు = మేరువు రామహతధనుఁడు, శివుఁడు పూర్వ మొకప్పుడు వాయువుచే మేరు వెగిరిపోకుండునట్లు శేషుఁడు, వలగొని కాపీడినట్లు పురాణగాథ గలదు. కాత్యాయనుఁడు = వరరుచి.
గీ. | సూత్రవార్తికభాష్యముల్ సొరిదిఁ జేసి | 10 |
10. శబ్దప్రయోగచాతుర్యమునకై పాణిని, కాత్యాయనాదులను స్తుతించుచున్నాడు.
ఉ. | శ్రీరఘురామకావ్యకృతి సిద్ధవిధిజ్ఞుఁ బరాశరాత్మజున్ | 11 |
.
చ. | ప్రబలమతి న్నుతింతుఁ బ్రతిభాశ్రుతిభాషితభారతీంద్రులం | 12 |
12. ప్రతిభాశ్రుతిభాషితభారతీంద్రులు = బుద్ధివిశేషమందును, వేదవాక్కులయందును, బ్రహ్మదేవులు, దర్శనము = శాస్త్రము. మూర్తికవియొక్క ప్రపితామహుఁడు రామనాముఁడు, పితామహుఁడు ప్రబోధనాముఁడు.
దుష్టకవి నిందనము
సీ. | తన వచోరచన లెంతయు నెఱింగింపఁడు | |
గీ. | పరవినీతప్రబంధముల్ భంగపఱుప | 13 |
13. కుకవికిని దొంగవానికిని అభేద్యము. ఎఱింగింపఁడు = శబ్దరచన తెలియకుండునట్లు చేయును, చోరుఁడు నిశ్శబ్దముగ నుండును. తమిని = కోరికతో, రంధ్రాన్వేషణము = లోపములు వెదుకుట, రాత్రియందు కంతలు వెదుకుట, శబ్దంబు = మాట, ధ్వని, కళానిధి = పండితుడు, చంద్రుడు, దర్శనము = శాస్త్రము, చూడ్కి, మొదలేరుపడ పాదంబులు ప్రయోగింపఁడు = పద్యపాదములు సరిగా నుంచఁబడవు, ముంగాళ్ళమీఁద నడచును. కులదీపకుల నసహ్యించుకొనును = దీపములు చూడ నిష్టపడఁడు. తెలివిలేనివారికడ నలంకారసత్కారమును బొందును. మెలకువ గనివారి యిండ్ల సొమ్ములు దోఁచును. రసము = గుణము (శృంగారాదులు), ప్రేమ, ప్రబంధములు = గ్రంథములు,కట్లు, ప్రాసము = పద్యపాదద్వితీయాక్షరము, ఈటె, పదార్థంబులు = పదములు, అర్ధములు, ద్రవ్యములు.
వ. | అని యిష్టదేవతావందనంబును, శిష్టకవిజనాభినందనంబును, దుష్టకవి నిందనంబును గావించి యొక్కకావ్యకథనంబునకు గ్రథనంబు సమకట్టియున్నసమయంబున. | 14 |
14. గ్రథనంబు = కూర్చుట.
సీ. | తన తనూరుచిపైనిఁ దగ నుల్లసిలు గుల్ల | |
| మును మ్రింగిన దవాగ్ని నన వచ్చెనా నురోం | |
గీ. | జల్లచూపుల కాంతామతల్లి నాదు | 15 |
15. గల్లకావి = నీరు కావి, అంశుకంబు = వస్త్రము, విష్ణువు కృష్ణావతారమునఁ గాఱుచిచ్చు మ్రింగెను. నన = చిగురు, యిట పత్రికాంత్యంబుల రెంటను వ్రాసిన శ్రీకారంబులు చెవులక్రించనున్న పూలవలె గుండలంబు లుండెను.
క. | ప్రత్యక్షంబై నాపైఁ | 16 |
16. ఆబ్ద, అప్రతి, అక్షమ, ఫణితిన్ = మేఘము యొక్క అసమానమును, సహింపరానిదియు నైన ధ్వనితో.
సీ. | గుణధన్యు గౌండిన్యగోత్రు నాపస్తంబ | |
| సరసవిద్వత్కవిసార్వభౌముని రామ | |
గీ. | మాంబికకుఁ బుత్త్రు సూర్యనారాయణద్వ | 17 |
17. కాకమాని గ్రామమున ప్రఖ్యాతుడగు మూర్తికవి వంశవర్ణనము.
గీ. | అనఘమణి కాకమాని రామాహ్వయుండు | 18 |
18. అనఘమణి = నిర్దోషులలో శ్రేష్ఠుడు.
క. | కృతిలో బ్రతిపద్యచమ | 19 |
19. కృతి = కవిత్వంబు నొనర్చుట, విద్వాంసుఁడు, అంకిత మిచ్చుట. భాషాకృతి = వాగ్దేవతాస్వరూపుఁడౌ, భారవి = కాంతికి సూర్యుఁడౌ
క. | అనినం బరమానందం | 20 |
20. అనిన ......శ్రీనిధానము = ఐశ్వర్యపుఁబాఁతు శ్రీకి వాసమైనవాడు వేంకటేశ్వరుఁడు.
క. | ప్రతిపద్యప్రతివాక్యో | 21 |
21. ప్రతిపద్యప్రతివాక్యోన్నతి = ప్రతిపద్యమునందును బ్రతివాక్యమునందును ఔన్నత్యముగలది = ఇది కావ్యవిశేషణము.
శా. | వ్యాళస్వాంతు లశాంతు లజ్ఞసతతైకాంతుల్ మహాచేటికా | 22 |
22. వ్యాళస్వాంతులు = వ్యాళము = వ్యాఘ్రము దానిమనస్సువంటి మనస్సుగలవారు = ఇందువలనఁ బైకి గోపువలె నుండి పులివలె హానిచేయువా రనుట. మఱియొకటి = వ్యాళమనఁగా సర్పము దానివలె గుటివర్తనగల వారనియుఁ జెప్పఁదగు, ఇది కాలక్ష్మాతలనేతలకు విశేషణము. క్ష్మాతలనేతలు = రాజులు - నేత్రశబ్దమునకు నేతృలు, నేతలు అనిరూపద్వయము - ఆజ్ఞులు = తెలియనివారు = (అపండితులు) వారితో సతతైకాంతులు = ఎడతెగని రహస్యాలోచన గలవారు మహా ... కులు. గొప్పలైనట్టియు, చేటికానీతములై యైశ్వర్యముల నపహరించునవియైన యుపద్రవములు గలవియు నైన క్రొత్తజాబులు గలవారు.
క. | అవనీశ పిశాచస్తుతిఁ | 23 |
23. అవనీశ... పిశాచములు - వ్యు. పిశితమును భక్షించునవి. ఇది పృషోదరాదులలోనికి. "నదైవం కేశవాత్పరం” - కేశవునికంటె నన్యంబగు దైవము లేదు. ఈ వచనము మును లొకప్పుడు వ్యాసునిఁగూర్చి ఒకచోట విష్ణువని మఱియొకచోట బ్రహ్మయని యింకొకచోట శక్తియని వేరొకచోట శివుఁడని, యిట్లు నానావిధముల వచింతువు గాన నీమాట నమ్మ వీలులేదనియు నీవు ప్రమాణముమీఁదఁ బలికినం గానీ యంతకు నమ్మఁజాలమని యనఁగా వ్యాసుఁ డప్పు డాలాగుననే ప్రమాణము చేసి చెప్పెదనని వారిం దోడుకొని కాశీవిశ్వేశ్వరస్వామివారి యెదుటికి వచ్చి రెండుభుజములు మీఁదికెత్తి పైన వ్రాసిన వచనమును సత్యమని వచించెను.
సీ. | ఏదేవు కనుదోయి హిమధామసోదరీ | |
| ఏదేవు చేకత్తి ఋభురాజపౌత్రు భా | |
గీ. | సేవ కేదేవుఁ డొందె నర్చావతార | 24 |
24. ఏదేవు... విష్ణు నేత్రద్వయము ' చంద్రసూర్యులగుటచే లక్ష్మీకుటీరపుఁదలుపునకుఁ గుంచెకోలగఁ జెప్పఁబడె. లక్ష్మీకుటీరము ఇయ్యది విష్ణుదృష్టిప్రసరణముచే ముకుళించుచు వికసించుచు నుండు ననుట, కొందఱు మురారికవి మురారి దృష్టిప్రసరణచేఁ దన్నాభికమలము దృష్టిప్రసరణ సమకాలవ్యాప్తిం జేసి ముకుళన వికసన వ్యాపారాశ్రయంబగుటచేఁ దానికి గంబుసన్నిభత్వము సంపాదించెను. గాన తత్కుటీరకవాట మోరవాకిలిగ నుండుననియుఁ గుంచెకోలతో నిమిత్తము లేదనియు మఱి కొందఱు కుడికన్ను మూసి యెడమకంటను నెడమకన్ను మూసి కుడికంటను జూచుచుండుం గానం కుంచెకోల యనగత్యము కాదనియు చెప్పుచుండిరి. విష్ణువు విశ్వరూపుఁడు గాన విశ్వప్రత్యక్షప్రమాణము బట్టి భద్రసూర్యగతి కాలభేదముచేఁ బద్మము ముకుళించుటయు, వికసించుటయుఁ గలుగుచున్నది గావునఁ గుంచెకోల యనుట యవసరమనియే నా యభిప్రాయము. విష్ణుపదమున గంగ పుట్టినదనియు దానికి శివుఁడు మగండనియు నుండుగాథను బట్టి విష్ణుపదాబ్జము శిపునకు సాలంకృతకన్యాదాతగా నభివర్ణించినాడు. కూకుదము = సాలంకృతకన్యాదాత. ఇందిరాపుత్రిక = గంగ. ఇంద్రున కర్జునుఁడు పుత్రుఁడనియుంటచే నభిమన్యుఁడు పౌత్రుండు వానిభార్య యుత్తర; ఈమె గర్భిణిగనుండుతఱి యశ్వత్థామ ప్రయోగించిన పాండవనిర్మూలనాస్త్రము తద్గర్భస్థుఁడయిన శిశువును వేధించు చుండఁగా విష్ణువు కాపాడెను. అందుచే నాయన చేకత్తి చల్లచేతుల మంత్రసాని, విష్ణు నాభికమలంబున బ్రహ్మయు బ్రహ్మలలాటంబున రుద్రుండును పుట్టినందున నదిశివున కవ్వగారు. జేజేబువ్వక్రొవ్వెదగలయయ్య = చంద్రుఁడు జుట్టునగల దేవుఁడు (శివుఁడు)
ఉ. | ఈక్షితి మున్న సత్కవు లనేకులు హా కవితాలతాంగులన్ | 25 |
25. అధునాతన = ఇప్పటి.
ఉ. | చెప్పిన పద్యమెల్లఁ జెవిఁ జేర్చి విను న్విన డొంకు గల్గినం | 26 |
26. డొంకు = సంశయము. నెట్టిపోవు = తోసికొనిపోవు. తిమ్మప్ప - తిమ్మ, అప్ప = అందమయిన యయ్య.
చ. | పలికిన పల్కు లెల్లఁ బరిపాకము దప్పఁగ ఖండశర్కరల్ | 27 |
27. పరిపాకము = అంతట పక్వమగుట.
వ. | అట్టి చుట్టుకైదువ జగజెట్టికి విడిచిపట్టయిన పెట్టె | 28 |
28. చుట్టుకైదువ జగజెట్టి = చక్రాయుధంబుగల మహాశూరుఁడు. పెట్టెబెట్టు దిటగట్టు = శేషాద్రి, కట్టుమట్టు = కడుదృఢమయిన.
సీ. | శ్రీఖండ నగపటీరాఖండసౌరభ | |
గీ. | వ్యాస వాల్మీక శాండిల్య వాలఖిల్య | 29 |
29. శ్రీఖండ నగపటీరాఖండసౌరభవ్రజము = మలయాద్రియందలి చందనంబునకు బూర్ణమయిన పరిమళ సమూహము. నాసత్య ... జీవాతువు = దేవవైద్యులయొక్క సుఖప్రవర్తనచే యథార్థమయిన వైద్యమునకు జీవనౌషధము. రమ ... కుట్టాకము = మిక్కిలి మనోహరమయినట్టియు శచీకాంతాప్రియుఁడగు నింద్రుని వంటి అనగా నిండ్రునివలె నల్లనయిన మణులకు భేదకములు. ధూర్జటి....స్పర్ధి = శివుని స్ఫుటమగు జడలలోని జడలపంక్తియందున్న యేటితో స్పర్ధ చేయునది. ఉంకులు = ఉనుకులు (ఉనికిపట్లు)
ఉ. | సంకలితాంబుతామరససానుగభీరకుమారదారికా | 30 |
30. సంకలిత ... దండాన్వయము. ఒప్పిన యుదకమును బద్మములును గలదియు, చరియలయందలి లోతయిన చిన్నదొనలనుండి వెలువడి యాకసము నొరసెడు తేటయయిన ప్రవాహము గలదియుఁ, బాపమును బోగొట్టునదియు, నైన పుణ్యస్థలములను సేవించుటచే సంపన్ను రాండ్రఁగా జేయబడిన సత్యలోకస్త్రీసంఘముచేఁ గల్పింపబడిన చెట్లయందలి తూగుటుయ్యెలయొక్క గురుతులై యొప్పుచుండెడు కడుదాపులనున్న యేలకుతీగెలు కలది. ఇది వేంకటశైలమునకు విశేషణము.
సీ. | ఏచెట్టు చూచిన హితగంధచందనం | |
గీ. | భోగములకండ యలవేల్పు బువ్వ దండ | 31 |
31. ఏచెట్టు ... భోగములకండ = భోగములు కాస్పదము. అలవేల్పుబువ్వదండ = చంద్రునకు సమీపము. పతితులకు బొండ = పాపాత్ములకు సంకెల. పేదలపైఁడికుండ = బీదలకు బంగారుతో నింపిన కడవ. తమము రైయెండ = అజ్ఞానమనే చీకటికి వెన్నెల. ఇటఁ దమము శ్లిష్టరూపకము. విబుధామృతంపుటుండ = పండితుల కమృతఘుటిక, తిమ్మప్పఁడు = అందమయిన దేవుఁడు.
సీ. | తనపైడిగోపురం బనుదినసేవార్థి | |
| తన బలిపీఠ మార్ద్రదుకూలపతితాంధ | |
గీ. | గాన నేదేవళంబు వేంకటనగమున | 32 |
32. చంద్ర = కర్పూరము. సాంకవము = పునుఁగు.
క. | అప్పప్ప చూడవలదా | 33 |
33. అప్పప్ప = ఆశ్చర్యవాచకము. భృగుదివసము = శుక్రవారము
సీ. | జన్మజన్మార్జితచటులపంకంబు గో | |
| భూతాదిశంకానిరాతంకగహనంబు | |
గీ. | డమృతనిధిఁ జూపఁ డేయంజనాగవిభుఁడు | 34 |
34. తిరుమలకొండకుఁ బర్యాయములు, వృషభాచలము, గరుడాచలము, శేషాచలము, వేంకటాచలము, అంజనాచలము. ఈయైదిఁటికి నైదుశక్తులు గలవు. అవేవన, వృషభమునకుఁ బంకంబు గోరాడుట, గరుడునకుఁ ద్రుంచుట, శేషునకు వాతాదిరోగంబుల హరించుట, వేంకటునకు భూతప్రేతాదిభయనివారకత్వము, అంజనమునకు నిధులు గనుపఱచుట. పంకంబు = దోషంబులనెడు బురద శ్లిష్టరూపకము, వాతము = గాలియను వాతరోగము, శ్లిష్టరూపకము. అమృతనిధి = మోక్షమనెడు నిక్షేపము, భద్రమూర్తి = మంగళస్వరూపుడు. వృషభరూపుడు = త్రిపురసంహారకాలంబున భూరథంబు దించుకొని పోవుచుండ వృషభమయి మోచెననియుంగలదు. అమృతహారి = గగుడస్వరూపబోధకము. భవ్యకీర్తి = అసాధ్యవాతాదిరోగహరణజన్యమయిన యశస్సు కలవాడని. చక్రి = శుచినామధేయుఁడు. ఇది భూతాదిశంకాగహనచ్ఛేదన దహససూచక విశేషణము. జడమరీచి = ఇది అంజనాభివ్యంజకము.
సీ. | అఱుగునో యనక కట్టానియెంట్లడియెఁగాఁ | |
| కానుక సొమ్ములోఁ గలఁ డన్నిఁట శిఖలో | |
గీ. | యనుచు నగి మ్రొక్కుదురు వేంకటాధినాథు | 35 |
35. కట్టాణియొంట్లు = మౌక్తికవిశేషములతో గట్టినచౌకట్లు. చేరె....జియ్య = ఆదిభిక్షువు (శివుఁడు) పార్వతి హిమవత్పుత్త్రిగాన నాతండు రత్నపుగనియని యెఱుంగునది. తోమనిపళ్లేలదొర = అగ్నిహోత్రుఁడు. అనగా సృక్సృవాజ్యశరావములు (అగ్నికార్యపరికరములు) అవిదారు మృద్వికారంబులగుటచేఁ దోమఁబడవు. ఆగ్నిహుతుఁడు గాన సువర్ణశాట్యుత్పాదకుడని భావము. వీని లతాంగి = స్వాహాదేవి, ఇందయనును = పుచ్చుకొమ్మనును, వడ్డికాసులుగొనువాఁడు = కుబేరుఁడు. ధనపతిగనుక ఋణప్రదాతయై వడ్డి తీసుకొనునని భావము కుబేరు భార్య చిత్రరేఖ. కానుకసొమ్ము లోఁగలఁడు = కానుకలుగా వచ్చు పదార్ధములు లోపల కలిగియున్నాడు. అవి బహిఃప్రకాశములు గాక యుండెను. అన్నిట మ్రొక్కులయ్య యబల = సూర్యుభార్యయగు ఛాయాదేవిసిగయం దామోదద్రవ్య ముంచుచుండెనని భావము. పుష్పములకు సూర్యు డధిదేవతయని తెలియవలెను, చక్రికుధరోత్తమము = శేషాచలము.
సీ. | ప్రజలఁగాననివాని పాయసంబను సుద్ది | |
| పాపవా చెవిఁటికి బట్టిన సంకను | |
గీ. | యనుచుఁ జను వేంకటాచలాధ్యక్షు జలరు | 36 |
36. ఈ పద్యమంచు నాల్గుపాదములలో లోకోక్తులు చెప్పఁబడ్డవి. ఏవిషయమును బట్టియనగా వేంకటేశ్వరుఁడు గుడ్డివాండ్రకుఁ గనులు, బిడ్డలు లేనిస్త్రీలకు బిడ్డలను, కుంటివానికిఁ బరువెత్తుశక్తి, బధిరునకు వినుశక్తి కల్గఁచేయుననుట. ఇంతియేకాదు ఎవ్వ రేకోరికలు గోరి ముడుపులు గట్టినను వారికార్యసిద్ధులు చేయుచున్నాఁడని తెలియవలయు.
సీ. | ఎటువంటిదో చూడ మెట మంచిగందంబు | |
గీ. | శేషగిరిఁ జేరి యారామసీమఁ గోరి | 37 |
37. ఎటువంటిదో, తలఁపుకెంపు = చింతామణి, వినువాఁక = ఆకాశప్రవాహము. ఆసేతుకాశి = సేతువు మొదలుకొని కాశిపర్యంతము. తైర్థికులు = తీర్థయాత్ర చేయువారు.
సీ. | కొడుకు మన్మథుఁ డాఁడుఁబడుచు భాగీరథి | |
గీ. | నన్నవెచ్చంబు ముక్కంటి కెన్న నరిది | 38 |
38. కొడుకు మన్మథుఁడు = ఈ పద్యమునందు వెంకటేశ్వరుని పుత్తకళత్రమిత్రాదిసమృద్ధి వివరింపఁబడుచున్నది. శారద = సరస్వతి = శరదృతువు నందుఁబూజింపఁబడునది. పేరెద = విశాలవక్షము. అచ్చ = స్వచ్ఛమైన, అన్నవెచ్చము = భిక్షాప్రదానము. (మాధుకరము) ఈరేడు = చతుర్దశ.(ఇఱుఏడు) పదునాలుగు
షష్ఠ్యంతములు
క. | ఏవం విధ గుణనిధికిన్ | 39 |
39. ఏవంనిధ... ధావన్నిధికిన్. ధావన్నిధనాశ = పోవుచున్నమరణాశగలవారుసు. అనఁగా ప్రాణాశగలవారును. ధామధామ = తేజోనిధియగు సూర్యునకు, దవీయః = దూరస్థులును. అనఁగా యుద్ధభీరువులకు సూర్యుఁడు దూరమైయుండుననుట శ్లో॥ ద్వావిమౌపురుషౌలోకే సూర్యమండలభేదినౌ। పరివ్రాడ్యోగయుక్తశ్చ రణేచాభిముఖోహత॥ యనియున్నది. దేవానాంప్రియ=మూర్ఖులును (అయిన) దానవ = రాక్షసులకు. అనాది = క్రొత్తయగు. అప్రమోదపాధోనిధికిన్ = దుఃఖవార్ధియైనవానికిన్.
క. | "శరణాగతరక్షామణి" | 40 |
40. శరణా... సంతాపునకున్ = దండాన్వయము. శరణాగతరక్షామణి యనెడు బిరుదుగలిగిన కడియము గల తమ్మివంటి యెడమకాలిగోళ్లవరుస యనెడు వెన్నెలవెల్లువను స్మరించుటచే బాగుగాఁ గొట్టఁబడిన సాధుజనుల సంతాపముగలవానికి.
క. | అంగామితశృంగారత | 41 |
41. అంగ...పతికిన్ = అంగ = అవయవములయొక్క, అమిత = మితము లేని, శృంగారతరంగ = కైసేతల పరంపరల యొక్క, అంచిత = ఒప్పిదముచే, విజిత = జయింపఁబడ్డ, కోటిరతిపతికిన్ = అనేకమన్మథులు గలవానికి. అలమే. ..విహృతికిన్. అలమేల్మంగా = అలమేలుమంగా దేవి యొక్క, ఆళి = తుమ్మెదలయు, కళింగావళి = కూకటిమూగ యనెడు నల్లపిట్టల వరుసలయు, భంగ = అపాయమునకు, ఆకర = స్థానమైన అనఁగా వానిని గెల్చునట్టి సైల్యముగలది యని. ఇది అలమేలుమంగ జడకు విశేషణము. వేణి = జడయందు. లోల = ఆసక్తమైన పాణివిహృతికిన్ = హస్తప్రచారము గలవానికి.
క. | ధీమద్భవాబ్ధితరణికి | 42 |
42. ధీమ... తరణి = తెప్ప, ధామతలత్తరణికి = శుభము లిచ్చువానికి, పవనగ్రామగ్రాసగ్రావగ్రామగ్రామణికి = 6 పదములకు వరుసగా, వాయుసమూహమే గ్రాసముగా గలవాఁడు (శేషుఁడు) తత్సంజ్ఞికమైన పర్వతమందలి గ్రామమునకు అధికారికి.
క. | జటిధూర్జటిభరణవిశం | 43 |
43. జటి... గతికిన్, జటిధూర్జటీ = యోగీశ్వరులను, భరణ = రక్షించుటయందు, విశంకటమతికి = సమీపమగు బుద్ధిగలవానికి, తృటి...గతికిన్. తృటిత = ఖండించినట్టియు, చటుల = తీవ్రము లైనట్టి. కరటీశ్వరసంకటగతికిన్ = గజేంద్రుని బాధావస్థలుగలవానికిన్. అనఁగా మకరిని జంపి కరిని రక్షించెననుట. దళి...తికిన్. = దళిత = ఛేదింపఁబడ్డ, దైత్యకంకట = రాక్షసుల కవచములయొక్క, తతికిన్ = సమూహము- గలవానికి.
వ. | అంకితంబుగా నాయొనర్పం బూనిన రాజవాహనవిజయంబను ప్రబంధంబునఁ గథానిబంధనం బెట్టి దనిన. | 44 |
44. అంకితంబుగా = స్పష్టార్థము.
కథాప్రారంభము
క. | మగధావని మృగధారిని | 45 |
45. మగ ...మగధావని = మగధదేశమందు. మృగధారిని = చంద్రుని. నగన్ = నవ్వునట్లు, నగ రనన్ = రాజమందిర మనునట్లుగా, అగారగత = గృహమును బొందిన
క. | అన్నగరము రిపుసింధూ | 46 |
46. అన్నగరము రిపుసింధూత్పన్నగరము = శత్రువులకు హాలాహలము అనఁగా జయింపరాని దనుట. పన్నతాగ్రపన్నగరము = పత్ = పాదమునకు, తన విధేయుఁడగు, అగ్రపన్నగ = శేషునియొక్క, రము = శోభ గలది. సంపన్నగరము = సంపదలకు నాశ్రయము. వెడలె....గరము = వెడవెన్నుని = మాయావిష్ణునియొక్క, అన్ను = భార్యయగు లక్ష్మియొక్క, అగరము = ఆగారమును అనగా పద్మమును, అనిశంబు = ఎల్ల ప్పుడు నుండునది, రాత్రులు లేనిది అని భావము అనగా రత్నప్రభలచే నని తెలియవలయు.
క. | పుటభేదనవిప్రులు వా | 47 |
47. పుట...క్రిందుపరుచుట = ఓడించుట, అడుగునఁ బడునట్లు చేయుట అని అర్థాంతరము. జటచిక్కు = వేదపఠనావృత్తియందలి సంశయము. జడలయందలి చిక్కు అని అర్ధాంతరము.
సీ. | చదువుచో నలుదెస ల్వెదకని స్రష్టలు | |
గీ. | లనఁగ జతురాస్యత నహీనతనుగళాని | 48 |
48. ఇఱుమూల = రెండుకోణములతో లేక రెండువైపుల (ప్రాక్పశ్చిమభాగముల) థీన్ = బుద్ధిచే, ఉగ్రగతి = శివుడు అధిష్టించుట (త్రిపురహరణ కాలమందని) అజడులు = జడభావము లేనివారు (జడము = జలము ఇట లడల కభేదము) గండము = కొండపైనుండి భూకంపాదులచే దొర్లిన పెద్దరాతిగుండు. అపాయమని అర్థాంతరము. స్రష్టాదుల యందుండు స్వభావధర్మములైన నలుదెసలు చూచుట మొదలయినవానిచే వారియందు లోప మారోపింపబడుచున్నది. న్యూనాభేదరూపకాలంకారము. -చతురాస్యత = చతురవాగ్మిత్వము, చతుర్ముఖత్వము, అహీనత = అధికత్వము, శేషత్వము, కళానిధిత్వము, విద్యాయత్వము, కళలకు స్థాన మగుట. విష్ణుపదసక్తి = విష్ణుచరణసంయోగము, ఆకాశసంబంధము (బృహస్పతిపక్షమందు), స్థిత = ధైర్యము, చలింపమి (భూపక్షము), ఊర్మికోన్మనఃస్థితి = ఉంగరంబులు అనగా పవిత్రంబులయందు కోరిక యుండుట. తరంగంబులచే గర్వించి యుండుట, భీమాగ్రజన్మభోగము = శివబ్రాహ్మణత్వము, భీమునికి అన్న యగుట, ధీరత = విద్యత్వము, ధైర్యము.
క. | రాజులయి వచ్చు నృపుల ప | 49 |
49. రా... రాజులు = పంక్తులు, పరాజులు = గొప్పయుద్ధము, వారాజులు = వరుణులు, అపరాజులు = రెండవదశరథులు, నయరాజులు = నీతిచే ప్రకాశించువారు.
క. | కెంగేల శైలమెత్తి ర | 50 |
50. సంగడంబు = సంక్తోలా. ఇది తరగతి రీతిగ నుండు గరడీ అనుభవవిశేషము. ధరాధిపతపనుల్ = రాజశ్రేష్టులు.
క. | కలనికి నర్హుఁడె రఘుకుల | 51 |
51. స్పష్టార్ధము.
క. | విశ్వమణిసంగ్రహణ శౌ | 52 |
52. శౌరి శ్వశురులు= విష్ణుని మామలు అనగా సాగరులు.
క. | శ్రీవరనిలయులు వసువిస | 53 |
53. శ్రీవరనిలయులు = లక్ష్మిచే గొప్పయిన గృహంబులు గలవారు. వసువిసరావితబాడబులు = ధనసమృద్ధిచే పోషింపబడ్డ బ్రాహ్మణులు గలవారు. కావేరీవల్లభులు = సాగరులు. వేరు + ఏవారు సాటిగారు = స్పష్టము. రత్నగాంభీర్యంబులచే అని తెలియవలయును..
సీ. | దినకరాత్మజ కల్గు దీర్చెఁగా కబలుండు | |
| రెండవదుంత లే కుండెఁగా కినసూతి | |
గీ. | నాఁడు నేడును దమ కీఁడు లేఁడటంచు | 54 |
54. జెలుగు = జలోఛ్వాసంబు. వేరువిత్తుగ = మూలంబు నాటునటుల, దుంత = మహేషము, ఇనసూతి = కాలుడు, అప్పతి = వరుణుడు, గొడ్డలు = ప్రౌఢోక్తులు, బిఱుసుమాటలు, ఒడ్డు = సామ్యంబు. జెడ్డదుగమోముదొర = బ్రహ్మయొక్క, టెంకి = ఉనికిపట్టయిన, బొడ్డుదమ్మి = నాభికమలము గల, దొడ్డవేలుపు = విష్ణుదేవునియొక్క, అడుగీనుబిడ్డలు = పాదజులు = శూద్రులు.
క. | మాన్యబహువ్రీహియనం | 55 |
55. మాన్యబహువ్రీహి = మన్నింపఁదగ్గది బహువ్రీహిసమాసము గలది. ఇది శూద్రచయవిశేషణము. అన్యపదార్థప్రధాన మయ్యుండదు = ఇతరుల ద్రవ్యంబు ముఖ్యంబుగా గలది అయ్యుండదు. బహువ్రీహిసమాసము గలది కాదనుట. ఇది శూద్రచయవిశేషణము. విరోధాభాసాలంకారము.
క. | ఏరికి నెగ్గులు తేకూ | 56 |
56. ఏరికి = నాఁగటికి, ముసలి = వృద్ధుడు, బలరాములు ఏఱు = శిరస్సున గంగ.
సీ. | ఎత్తుమాయని పూవుటెత్తింత యెత్తించి | |
గీ. | యొక్కఁ డిడుచోట నలుగురు రొక్క మిడిన | 57 |
57. ఎత్తుమా= పైకి పెట్టుమా, పూవుటెత్తు = పూదండ, పల్లొత్తు = దంతక్షతము, అడిగిన పైఁడి = అడిగి రొక్కము, ముడిపువ్వులు = వికంపని పువ్వులు.
శా. | కప్పుం గొప్పులచొప్పు గొప్పమెఱుఁగుం గందోయిడా ల్తేనియల్ | |
| చిప్పిల్ కప్రఁపుఁదావి మోవి యపరంజింబెక్కు లేఁజెక్కు బా | 58 |
58. ఆప్పా = ప్రశంశనార్థకము, రూపాజీవికారత్నములు = ఉత్తమవేశ్యలు.
సీ. | ఔరార! మధురాధరారుణ్యమే చాలు | 59 |
59. అరుణ్యము = ఎరుపు, పల్లవశ్రేణి = చిగుళ్ళ సమూహము. విటసమూహమని అర్థాంతరము. ఔరా = మజ్ఝారే మొదలైనవి ప్రశంసనార్థకములు. మైచక్యము = నలుపు, భుజంగశ్రీలు - కృష్ణసర్పశోభలు. విటుల భాగ్యములని అర్ధాంతరము. విటపాళి = వృక్షములపంక్తియని అర్ధాంతరము. హారిభావము = ఒప్పిదము. కామనశ్రీఫలాక్రమణ = సొగసైన మారేడుపండ్లను, అలుముట. (కాముకుల యైశ్వర్యలాభము నలుముట), ఏటిబోటిగములలోన = ఎటువంటి స్త్రీలలోను, నూటి = నిదానము. వాటివాటికి = అప్పటికప్పటికి, వేశవాటికా = వేశ్యలవీథి, ఝూట = సమూహము.
ఉ. | రౌతు మనం బెఱింగి జలరాశి చివుక్కున దాటి హుంక్రియా | 60 |
60. వాగె కుఱుసన్న = కళ్లెమువలని చిన్నిసన్న. ఘటింపదు = పదయదు, సాటి = సమానాశ్వములు. చుట్టుగద్ద = చుట్టుపట్ల కలవు. ఆతలఁ బెట్టునో = కడగా నిల్పునేమో. శిక్షణవేళను = గతివిద్యావేళనైనను. ఎఱుఁగంబడు= తెలియంబడును.
సీ. | చరణవిన్యాసబంధురశిరోభారదృ | |
గీ. | జటులబృంహితబధిరితాశాగజముల | 61 |
61. చరణ...దృక్కర్ణుఁడు = శేషుడు. ఏనుగుల పదవిన్యాసముచే భూమి దించుకొని పోవుచున్నందున శేషునికి శిరోభారము వచ్చి కంటికిఁ గలిక మడుగుచుండెనని భావము. ఈచరణమందుఁ బదవిన్యాసము ప్రశంసింపఁబడె. ఏనుఁగుచెవులవలనివాయువుచే వృక్షములు విరిగిపడిపోవుచున్నందున నింద్రుడు గాలిని నేరగానిగా నాటంకపఱచుచున్నాడు. దంతఘట్టనలచే మేరువునుండి పడుచున్న ధూళీసమూహమువల్లఁ కలుషములైన గంగోదకములను జటలువడియగట్టుచున్నాడు. ఉడుప = నక్షత్రపతి, తెప్ప, గజకర్ణములు, దంతఘట్టనలు, కరశీకరములు వర్ణింపబడె. ఈయేనుఁగుల ఘీంకారమునకు దిగ్గజములకుఁ జెవుడు పట్టెను. శిరోభారము గలశేషుడు చెవిటియేనుఁగుల సహాయమునకై వానికిఁ బెద్దమొఱ్ఱె లేల పెట్టవలె మేము లేమా యంచుఁ బట్టణగజములు తమదేహముపై భూమిని వహించుచున్నవి అనగాఁ బరాగము పైవేసికొనుచున్న వనుట.
సీ. | ధర కుంకుమాంకకంధర దాల్చికొన్న క | |
గీ. | దేవపురలక్ష్మి కురువిందకోవక్రిందఁ | |
| సూటిగల దెంపు కోటాని శుద్ధసలిల | 62 |
62. కట్టాణి = మౌక్తికవిశేషము, కుత్తుకంటు = స్త్రీలు మెడ మధరించు సుమంగళ్యలంకారవిశేషము. దైవపద్యా = ఆకాశము, చక్రి = శేషుఁడు, శేషునకును వాయువునకును గల్గిన బలతారతమ్యవివాదలో వాయువు మేరుపర్వతము నెగరఁగొట్టుటకుఁ చేయుప్రయత్నము నెరవేరకుండుటకు శేషుఁడు మేరువును జుట్టనేసెనని గాథ గలదు. ఇక్కడ బంగరుకోట మేరువుగను నగర్త శేషుఁడుగను జెప్పంబడెను. సూర్యసంపుటమను పెద్దయోఘ ప్రాకారమును స్పృశింపగా పట్టమనెడు యోధు కట్టిన కాసికోక యనునట్లు. సూటిగల = గుర్తుగలిగిన, కోటాని = కోటనానుకొని, పరిఘ = అగడ్త.
క. | ఆ వెలికడలి న్నగు పరి | 63 |
63. వెలికడలి = పాలసముద్రము, అగునె = శక్యమా.
క. | ఆపట్టణమున కీశ్వరుఁ | 64 |
64. ప్రతా...నుఁడై= ప్రజాపాతిశయముచే గొట్టబడని కోపమునకు ననతు లైన రాజులయొక్క విస్తారమగు ధైర్యశౌర్యపుటమును భేదించినవాడై పాటిలునని యస్వయము.
శా. | ధాటీఘోటఖురాగ్రనిర్దళితగోత్రాధూళికాగంధచూ | |
| ర్ణాటోపాళిపరిస్ఫురత్ప్రదితసర్వాశావధూటీకుచా | 65 |
65. దండాన్వయము. దండయాత్రయందు గుఱ్ఱాలడెక్కెలకొనలచేఁ పిండిగఁగొట్టఁబడిన భూపరాగమనెడు బుక్కాపొడియొక్క యతిశయముయొక్క వరుసలచేఁ బ్రకాశించునట్టియు, ప్రసిద్ధములగు సకలదిశలనెడు స్త్రీలకును (వారి) కుచంబుల పంక్తులకును (వరుఁగ) తెల్లచీరగను, నెర్రనిపైబట్టగను, జేయఁబడిన కీర్తిప్రతాపముల ప్రచారములయొక్క ప్రకాశమునకు నిరోధులైన చంద్రసూర్యులు గలవాఁడు.
గీ. | అబ్జదానత శుద్ధపక్షాప్తి విమల | 66 |
66. అబ్జదానత = చంద్రుని దాతృత్వమువంటి దాతృత్వము గలవాఁడనుట. పద్మములను ద్రుంచుట = ఈయర్ధమందు భావార్ధక తల్ ప్రత్యయము వ్యర్థమగుఁగాన నీపక్షమందును బహువ్రీహినే గ్రహింపదగు. శుద్ధపక్షాప్తి = నిర్దోషకక్ష్యాలంబనము, స్వచ్ఛమగు ఱెక్కలు గలుగుట, విమలమానసస్థితి = నిర్మలమనస్సు గలిగియుండుట - మానససరస్సున నుండుట. కీర్తి = యశస్సు, బురద = ఆత్మ, భూభరణము = తనదేశము భరించుట, బ్రహ్మను మోయుట. రాజహంస ప్రభావము = రాజ శ్రేష్ఠుని మహిమ, రాజహంసము = చంచు చరణము లెఱ్ఱగను దక్కినశరీరము తెల్లగను నుండు హంస.
క. | రసికాంబుజహంసుఁడు సా | 67 |
67. వతంసుండు = అవతంసము = ఇట్లు వలగ్నము, అవలగ్నంబు మొ-
వ. | ఇవ్విధంబున సౌగంధికబాంధవకులీనసింధురంబు, | 68 |
68. సౌగంధికబాంధవ = చంద్రుఁడు. జీమూతము = మేఘము.
సీ. | శూలిసంధ్యానాట్యకేళి మున్నూడఁ ద | |
గీ. | లీలమైఁ బాడ నటనకానీలలోహి | |
| నుండునో నాఁగఁ దూరుపుకొండదండ | 69 |
69. పదాంగదము = అందె, ఇనుఁడు = సూర్యుడు. శివుఁడు ప్రదోషతాండవవేళ కాలు జాడించుచో నూడిపడ్డయందె యనునట్లు సూర్యుఁడు గ్రుంకెననుట. తేఁటి సుడివలె నమరించిన కాసె (నడుముదట్టి) యనునట్లు సంజెయొప్పె. శబ్దజతి గొనగొల్పుటకై శివజటపటలిని ఘూర్ణిల్లెడు గంగనుండి పైకి లేచిన జలబిందువులనురీతిఁ జుక్కలు వెలిసెను. శివుఁడు గొంతున నుంచుకొనలేక యమిసిన హాలాహల మనునట్లు చీకటి వ్యాపించెను. ప్రదోషతాండవవేళ శివుడు నిజైశ్వర్యమున రాణించునప్పుడు చంద్రుఁడు తనమండలమం దుండుటకో యనునట్టు తూర్పుకొండపై నొప్పెను.
క. | ఆ రాత్రి సముజ్వల మ | 70 |
70. మణ్యారాత్రికలు = రత్నహారతులు. తదీయకలకంఠి = రాజహంసునిభార్య.
సీ. | లిబ్బుల జవరాలియబ్బ వల్లునిఁ జేసి | |
గీ. | కడలి బొడమిన నిగ్గు చొక్కంపుగెంపు | 71 |
71. లిబ్బులజవరాలియబ్బ = సాగరుడు, వానిజామాతగాఁ జేసిన పాదపద్మముగలవాఁడు. నెలదాల్సు, నేవళంబులు = శివుని యాభరణంబులు, సర్పంబులు, వేల్పుబోనము= అమృతము, వారువము = గుఱ్ఱము అనగా గరుత్మంతుడు పూర్వము స్వర్గమునుండి యమృతము తెచ్చి వాసుక్యాదుల కిచ్చి తనతల్లిని దాస్యమునుండి తప్పించెను. గొంతి మూఁడవపట్టి కోడలు = ఉత్తర. కొండకూటువ పగవాఁడు = ఇంద్రుడు.
సీ. | వలకంటి యెండకై వనధిజాతకులై జ | |
గీ. | రొమ్ముపై మచ్చయరియుఁ జిందమ్ము గదయు | 72 |
72. ఈ పద్యమున శ్రీవత్సము, చక్రశంఖములు, గద, స్వర్ణచేలము ఇవి వరుసగ వర్ణింపబడెను. వలకంటి యెండ = సూర్యతాపము, హొయలఱిగె = ఒయారపుగొడుగు. మస్తపంబోదరు లనఁగా రాహుకేతువులు (వీరిని) గ్రస్త = గ్రసించిన, కత్తృర్థక కర్తృప్రత్యయము. తాపవారకులగునట్టివారు, మనోహరులై ప్రకాశించునట్టియు, చంద్రసూర్యులు, చక్రశంఖములు తమోగ్రహములను మ్రింగునట్టి, తాపకరము గానట్టి, సర్వదా ప్రకాశించునట్టి సూర్యచంద్రు లనుట. పుష్పవంతులు = సూర్యచంద్రులు, గద తామరతూడుగ నభివర్ణింపబడెను. అందెపైఁ జెక్కిన రాజహంసకు నిచ్చు తూఁటిని బోలి గద యుండె ననుట. పసిఁడిచేలచెరగు, చందన... ...భోగము = శ్రీగంధవృక్షము నడుమును జుట్టిన సర్పముయొక్క శాఖాపంక్తిభాగభాక్కగు బహురత్నయుక్తఫణమువలె నుండెను.
శా. | ఛాయల్ చేరిన జాళువామొసలివాచౌకట్లు లేజెక్కులన్ | 73 |
73. ఛాయల్ .....ట్లు, ఛాయల్ దేరిన = వన్నెమించిన, జాళువా = బంగారుతోఁ జేయఁబడిన, మొసలివా = మకరముఖాకృతి గల, చౌకట్లు = కుండలములు, సాయంకాల, దినేంద్ర, మండలము = అస్తమయసూర్యమండలముసు, గాంగేయకౌశేయము =సువర్ణాంబరము, కాయతోయదము = దేహ మనెడు మేఘము, రేవతీదాయాదుండు = బలరామునకు బాలివాఁడు, రాజరాజముఖి = రాజకాంత.
క. | సంతానార్థిని యువతికి | 74 |
74. సంతానార్థిని = సంతానమును కాంక్షించు, అసురజిష్ణుండు = రాక్షసులను జయించినవాడు.
గీ. | అంత మాగధవైతాళికాతతిమంజు | 75 |
76. మాగధ...... రవంబుల, మాగధ = భట్టువాండ్రయు, వైతాళిక = మేల్కొలుపులవాండ్రయు అతిమనోహరములయిన స్వరములచే, తదాస్యకళ = రాజు భార్య యొక్క ముఖకళ, మునుజరెనాన్ = ముందుగనే జారెనో యనునటుల. నెల = చంద్రుడు.
విష్ణువరమహిమచే రాజపత్నీముఖకళ హెచ్చునని తలంచి చంపుడు దిగజారెనో యనునటుల నస్తమించెను.
గీ.. | చుక్కరాయల్లు దొరకేళి మక్కువలన | 76 |
76, చుక్కరాయల్లు......మక్కువలన = మోహములచేతనే, ఉచుక్కునా = నిరసింపఁగా.
సీ. | శ్రమ పరస్పరపరిరంభజృంభణసంభ్ర | |
..
-
గీ. | సంభవించెఁ గచాకచీసంగరంబు | 77 |
77. శ్రమపరిశ్రమ... సంభ్రరమమున = అలయికతో కూడిన యన్యోన్యాలింగనాతిశయమువలని సంతోషముచే. సంకేత... ప్తిన్ = సంకేతస్థానములనుండి నిశాప్రతిబంధకాభావస్థలముయొక్క ప్రాప్తిచే ప్రతిష్ఠితజనంబు = మర్యాదవంతులు, తపనోదయమిషన్ = సూర్యోదయపునెపముచే. అలపనోద్ధతులన్ = చురుకయిన మాటలతో. కచాకచీసంగరంబు = జుట్ల జుట్లు పట్టుకొని చేయుపోరు. ఒకచోటునకే తటస్థించి వెలుపలికి వెడలింపఁబడ్డ విటులు పోట్లాడుచుండిరనుట. దండహతులు = కఱ్ఱదెబ్బలు.
ఉ. | చల్లనితావి నెల్లెడలఁ జల్లఁగఁ దెమ్మెర లెల్లఁ బెల్లుగా | 78 |
78. హల్లకములు = ఎఱ్ఱగలువలు. సుమభల్లరణారిథులు = రత్యపేక్షకులు.
క. | హరిదశ్వయాత్ర కమరే | 79 |
79. హరిదశ్వయాత్రకు = సూర్యునియాత్రకు. అమరే...క్తిన్ = ఐరావతకుంభస్థలిమీఁద అసమయభటాగ్రేసరుఁడు = కాలమనెడు భటశ్రేష్ఠుఁడు. కెంపుడాలు = ఎఱ్ఱని జెండా, అరుణఁపుడాలు = ఎఱ్ఱకాంతి.
క. | తమ్ములదొర కైరవజా | 80 |
80. చెఱ =నిర్బంధము. చక్రసంయుతమ్ములకొఱ = చక్రవాకదంపతులయక్కఱ, భూతమ్ములతొర = పిశాచములకు వేగిరింపు. సూర్యోదయము పిశాచములకు నిర్బంధమనుట. ఆగమకుంతమ్ములయొఱ = వేదములనెడు బల్లెములకు గూడు. త్రయీమూర్తి యగుటచేతనని గ్రహించునది. కిరణధనుఁడు = సూర్యుఁడు (కిరణములే ధనముగాఁ గలవాఁడు).
క. | అంతకయె మున్ను కాంతయు | 81 |
81. అంతకయె = స్పష్టార్ధము.
సీ. | అత్యాదరమున నాదిత్యావని రుహంబు | |
| కల్యాత్తగాత్ర నహల్యాంబురుహనేత్ర | |
గీ. | యల యశోదాకిశోరకం బాసుభద్ర | 82 |
82. సత్యభామకు కల్పవృక్షము తెచ్చియిచ్చినవాఁడు, ద్రౌపదికి నవమానము తప్పించినవాఁడు. (వస్త్రాపహరణమందు) అఱన్ = హరింపన్, పరిక్షిత్తును గాపాడినవాఁడు. కల్యాతగాత్ర = దోషగ్రస్తశరీరము మమ్మరే = ఆశ్చర్యార్థకము. తుందిలానందకందళికందము = బలిసిన సంతోషపుమొక్కకు దుంప.
శా. | అబ్జాతప్రభవాదివంద్యహృదయాధ్యాహా లసాధ్యేతరా | 83 |
83. హృదయాధ్యాహాలసాధ్యేతరా = మనస్సుచే నధ్యాహరించుట కసాధ్యుఁడా, మానసాగోచరుఁ డనుట, కుట్టాకార = వామనస్వరూపుఁడా, మహత్వ ... శంస... మహిమ యొక్క, బలక్రమముచే వ్యర్ధపరచఁబడనివియు, నధికమైనట్టియు, గజేంద్రుని స్తుతిగలవాఁడా. అనఁగా గజేంద్రునిఁ గాపాడె ననుట. (కకుబ్జాగ్రద్గజస్యాపతంయంపుమాన్ - కాకుబ్జాగ్రద్గజః - తస్యశంపాయస్యతి విగ్రహః) కులా......గ్రణీ = కుబ్జయను పేరుగల మఱుఁగుజ్జుదానియొక్క నేత్రముల కంకురించు వీటరాయుఁడా, అనఁగా త్రివక్రను అవక్రను జేసి దాని యిష్టము తీర్చెననుట.
క. | నందకధర యభినందిత | 84 |
84. నందకధర = స్పష్టము.
ఉత్సాహము. | మందరాగనిత్యధృత్యమందరాగ దానపౌ | 85 |
గద్య
ఇది శ్రీమద్రామభద్రభజనముద్ర కవిపట్టభద్ర కాద్రవే
యాధిపవరసమాగతసరససారస్వతలహరీపరిపాక
కాకమానిమూర్తిప్రబోధబుధకవిసార్వభౌమ
పౌత్ర రామలింగభట్టపుత్ర కౌండిన్యగోత్ర
భాగధేయ మూర్తినామధేయప్రణీ
తంబైన రాజవాహనవిజయం
బను మహా ప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.