రసికజనమనోభిరామము/తృతీయాశ్వాసము
శ్రిరస్తు
ఓం నమః కామేశ్వర్యై
రసికజనమనోభిరామము
తృతీయాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము సురమౌని కబ్జగర్భుఁ, డవలికత దెల్పఁ బూని యి ట్లనుచుఁ బలికె | 2 |
సీ. | గుజ్జులమావిమ్రాఁకుల నంటిఁ బ్రాఁకిన, పరువంపుదాఁకపందిరుబదరులఁ | |
తే. | మెఱుఁగుచందురురానిగ్గుటరఁగుమీఁద, నీటుగా గోర వీణియ మీటుకొనుచు | 3 |
చ. | కని యెనలేనివేడ్క లెదఁ గ్రమ్మఁగ నమ్మగమిన్న మిన్నకా | 4 |
సీ. | సరససారంగాతిశయనిరూఢిఁ దనర్చెఁ, బొలఁతివాల్చూపులు పొలుపు మీఱి | |
తే. | యహహ యీచాన గానవిద్యావిధాన, మునఁ జెలఁగి రాగ మొనగూర్చు చొనరె దీనిఁ | 5 |
క. | అచలావల్లభుఁ గనుఁగొని, సచివగ్రామణి నితాంతసంతోషరస | 6 |
మ. | తలుకార్మేల్మిపసిండిబొమ్మకరణిన్, దట్టంపునెమ్మేనిచా | 7 |
చ. | ఉవిదవయోవిలాసవిభవోజ్జ్వలరూపకళాప్రచారముల్ | 8 |
ఉ. | కూరిమి మీఱ నవ్వికచకోమలతామరసాయతాక్షి నిన్ | 9 |
చ. | పలుకుల కేమి భూపకులపావన యీవనరాశివేష్టితా | 10 |
తే. | కంజముఖి నీమనోహాకారరేఖ, మంజుగతిఁ గన్గొనియెనేని మదనవి ఖ | 11 |
వ. | అనిన నాసచివగ్రామణికి నృపాలాగ్ర యి ట్లనియె. | 12 |
సీ. | అద్దిరా యీచిన్నిముద్దుక్రొన్ననఁబోఁడి, కలికినిద్దంపుఁగ్రొక్కారుమెఱుఁగు | |
తే. | తొడవు గా దిది వలరాచపడఁతిమిన్న, వలనుగా నిడ్డ శృంగారవనములోన | 13 |
ఉ. | అందనిమ్రానుపండులకు నాస వహించినరీతి దివ్యసం | 14 |
ఉ. | కన్నియ వన్నియ ల్బెరయఁ గ్రన్నన నన్ననవిల్తుకేళికిన్ | 15 |
ఆ. | అని వచించి యిర్వురును దమ కొకతూరి, చనిన నవ్విశాలజలజనయన | 16 |
ఆ. | చెలిమికాఁడ నీవు వల నొప్ప ముంగలఁ, జని కడంకతోన యనుఁగుఁజెలులఁ | 17 |
క. | తిన్ననిజిలిబిలిపలుకులఁ, గన్నియడెందంబు మిగులఁ గరఁగింపుచు నీ | 18 |
శా. | ఏచందంబున నింతిచెంత కఱ లే కీ వేగి దర్శించెదో | 19 |
తే. | అని యతని వీడుకొల్పి యజ్ఞనవిభుండు, గోర్కె దైవార నొకచోటఁ గూరుచుండె | 20 |
ఉ. | సామజరాజకుంభవిలసత్కుచకుంభభరానతాంగు లై | 21 |
వ. | అట్లు గూర్చుండంజేసి యున్న సమయంబున. | 22 |
సీ. | నీలంపుగాజుల నెఱిమించుపచ్చల, కీలుకడెంబుడాకేలు మెఱుఁగు | |
తే. | గలికి యారాచనెచ్చెలిఁ గని నయ మ్మె, నయ వసంతాగమారంభనవరసాల | 23 |
ఉ. | ఎచ్చటనుండి యెచ్చటికి నేగెద వెవ్వరివాఁడ విచ్చమై | 24 |
చ. | అన విని రాచదూత వినయమ్మున నమ్మధురాధరోష్ఠిఁ గ | 25 |
క. | పేరు మతిమంతుఁ డం డ్రీ, ధారుణిఁ గల్యాణపురము తరుణీమణి మా | 26 |
ఆ. | వచ్చి కొంతతడవు వనవిహారము సల్పి, యిన్నగాగ్రమున మహేశుఁ గొల్చి | 27 |
ఆ. | నిన్నుఁ జూచి వేడ్క నివ్వటిల్లఁగఁ కొన్ని, మాట లాడి చనఁగ మదిఁ దలంచి | 28 |
క. | ఆపృథ్వీవరకుంజరు, రూపవయఃప్రాభవములు రూఢిగ నీ విం | 29 |
శా. | ఓరాజీవదళేక్షణాజనమణీ యోవాక్సుధాధోరణీ | 30 |
మ. | తరుణాంభోజదళాయతాక్షి వినుమా తథ్యంబు నామాట కి | |
| బురుహూతప్రభవస్మరైలబిలతుక్పూరూరవస్సోములన్. | 31 |
ఉ. | ఇంచుకసేపులోన జగ మెల్ల వెలుంగఁగఁజేయుతేజుచేఁ | 32 |
ఉ. | చెప్పెడి దేమి యానృపతిశేఖరించక్కదనంబు కన్నులం | 33 |
క. | చనఁ బూని యొక్కపలు కే, ననఁ బూనిన నెచటఁ గోప మగుమో యని లో | 34 |
మ. | విమలాంగీతతుల న్శుభాకృతుల ము . న్వీక్షింపమో తత్ప్రకా | 35 |
క. | తలుకారుకుందనముతోఁ, దొలుకారుమెఱుంగుఁదీఁగెతోఁ దుల యగునీ | 36 |
తే. | వెలఁది నీరూపలావణ్యవిభ్రమముల, కమ్మహారాజుతోఁ జెల్మి యబ్బెనేని | 37 |
క. | బంధురతేజస్సరసిజ, బంధుఁడు గుణసింధుఁ డగుచుఁ బరఁగెడుభూభృ | 38 |
చ. | పలుకులు వేయు నేటి కిఁక భావభవప్రతిమానుఁ డైనయా | 39 |
సీ. | కనకంబునకుఁ దావి గలుగంగఁజేయక, పిల్లిగడ్డలకుఁ గల్పించినట్లు | |
తే. | గాక యుండక సత్కళాకౌశలమునఁ, గోరి యారాజుతో నిన్ను గూర్చె నేని | 40 |
తే. | అనుచు నతఁ డిట్లు వలికిన నాత్మలోన, జాన యొకకొంతనొత్తఁబా టూని ఱేనిఁ | 41 |
చ. | అవు నవు మంచిప్రోడవె బళా యళు కించుక లేక మానినీ | 42 |
క. | సురనారీమణు లెచ్చట, ధరణీజను లెచట నహహ తరతమభావం | 43 |
తే. | దూత వగుటను నోరికిఁ దోఁచినట్లు, దివిరి మోమోడ కాడెదు దిట్ట వగుచుఁ | 44 |
ఉ. | మాటికి నొక్కభూవరకుమారుని నీ నిపు డేమొ తద్దయున్ | 45 |
తే. | అనుచు నవ్వేల్పుఁగెందలిరాకుఁబోఁడి, పలుకుటయు నాతఁ డెదఁ గొంత గలఁగుచుండె | 46 |
సీ. | జిలుఁగుపైటాణికంచెల పిక్కటిలి వలి, కులుకుసిబ్బెపుగబ్బిగుబ్బ లుబ్బ | |
తే. | మంపుఁ దులకించుముత్తిగమానికముల, మొలకనిద్దాకడానిసొమ్ములమెఱుంగు | 47 |
తే. | కాంచి యాతనిమోహనాకారరేఖ, కద్భుతం బంది మే ల్మే లయారె యిట్టి | 48 |
తే. | చెలఁగి జగ మెల్ల మోహింపఁ జేయఁజాలు, నవవిలాసాప్తి నెసఁగుచున్నాఁడు చూడ | 49 |
ఉ. | కన్నులవింటిదంటయును గల్వలనెచ్చెలియు న్వసంతుఁడుం | 50 |
ఉ. | తుమ్మెదదిమ్ముఁ బొ మ్మనుచుఁ ద్రోచునిగారపుసోగపెన్నెరుల్ | 51 |
సీ. | మొలకనవ్వులవాఁడు తళుమనిద్దామేల్క, డానిడా ల్గఱఁచుమేజానువాఁడు | |
తే. | డంబు మీఱినబవిరిగడ్డంబువాఁడు, కంబునిభ మై తనర్చుకంఠంబువాఁడు | 52 |
క. | అని యగ్గించుచు నెదుటం, గనుపట్టువధూలలామఁ గనుఁగొని యెకిమీఁ | 53 |
క. | మవ్వములప్రోఁక యతనుని, క్రొవ్వాఁడిలకోరి పూఁతగొజ్జఁగివలపున్ | 54 |
ఉ. | వాలికమీల నేలనిడునాలుకనుంగవ మేలిజాలువా | |
| బేలుట గాదె యీకువలయేక్షణఁ గౌఁగిటఁ గూర్పఁ గల్గినన్. | 55 |
ఉ. | దీనిమెఱుంగుఁజెక్కులును దీనివెడందపిఱుందునందమున్ | 56 |
క. | ఈహాటకనిభవిగ్రహ, నీహాపరితృప్తి యొదవ నెనసినయెడలన్ | 57 |
ఉ. | అద్దిర దీనిచక్కఁదన మద్దివిజాంగనలందుఁ జెంద దీ | 58 |
ఉ. | ఉబ్బుచు మాటిమాటికి సముద్ధత మోహనిబద్ధబుద్ధి మై | 59 |
మ. | తలిరుంబోఁడులు లేరె రూపవతు లిద్ధాత్రీస్థలిన్ వారిని | 60 |
సీ. | పుండరీకాక్షి యీభువనైకసుందరి, యాత్రేయవదన యీయబ్జగంధి | |
తే. | యౌర యియ్యింతి పరమహంసాకృతిని బొ, సంగి యున్నది మది నరయంగ దీని | 61 |
సీ. | ముగుదచూపులు శిలీముఖముల నిరసించుఁ, కచపాళి ఘననీలరుచుల నెంచు | |
తే. | నలిశరాభ్రేంద్రమణిశశిజలజకిసల, యప్రవాళాబ్జరాకల్హారమౌక్తి | 62 |
సీ. | తరుణి వేనలి పయోధరములఁ దెగడుఁ బ, యోధరంబులు బల్ధరాధరముల | |
తే. | మించు నెమ్మేనిడాలు గఱంచుఁ బసిఁడి, నౌర యౌరగమహిలలసౌరు సౌర | 68 |
తే. | పస నెసంగెడుగజనిమ్మపండ్లు గిండ్లు, సిరులఁ జెన్నారుకుసుమమంజరులు గిరులు | 64 |
సీ. | అవిరళవజ్రప్రహారంబులకుఁ దద్ద, చలియించునుత్తాలశైలములును | |
తే. | సాటియే వజ్రహారతుషారనీర, కుంకుమసితాభ్రయుతము లై కుదురు మీఱి | 65 |
తే. | కమలభవలీలఁ గాంచె మొగంబు నడుము, హరివిలాసంబుఁ దాల్చె బిత్తరపుగుబ్బ | 66 |
సీ. | అలిశశికార్ముకతిలకుసుమోత్పల, కుందసౌగంధికకందుకములు | |
తే. | గూర్చి నలు వార నలువ యీక్రొమ్మెఱుంగుఁ, బోఁడిఁ బోడిమి నొనరింపఁ బోలు నట్లు | 67 |
క. | నదమా పొక్కిలి జాంబూ, నదమా మెయిచాయి కోకనదమా పద మా | 68 |
క. | రాజీవముఖికనుంగవ, రాజద్గతి నెప్పుడుం దిరస్కృతి సేయున్ | |
| రాజీవముల న్విచలిత, రాజీవములు బ్రఫుల్లరాజీవములన్. | 69 |
తే. | సరసలీలమహాఘన చయము నాత్మ, దర్శకశ్రేణియును గూడి తరళనయన | 70 |
మ. | గజయానం గుముదాక్షిఁ గేసరివలగ్న న్నీలనీకాశమ | 71 |
సీ. | చంద్రబింబస్ఫూర్తి జా నొప్పె నీనాతి, హాసాధరంబులు నాననంబుఁ | |
తే. | వజ్రపుష్పాతిశయలీల వఱలె నీవి, లాసినిరదాంగకంబులు నాసికయును | 72 |
క. | అని యితరేతరమోహము, లనివారితగతులఁ బెరుఁగు ననిమిషనారీ | 73 |
శా. | ఆవేళం జిగురాకుబాకుదొర ప్రత్యాలీఢపాదస్థుఁ డై | 74 |
తే. | లేమవీక్షణమాలాశిలీముఖములు, శంబరారాతిశితసుమసాయకములు | 75 |
క. | అత్తఱి బిత్తరిఁ గని భూభృత్తనయోత్తముఁడు దత్తరిలుచిత్తమునన్ | 76 |
క. | ఎవ్వరిదానవు నీపే, రె్వతె యేమిటికి వచ్చి తిచ్చెంగటికిన్ | 77 |
చ. | తొలకరిక్రొమ్మెఱంగుక్రియఁ దోఁపఁ దళుక్కని నీవు ముంగలన్ | 78 |
క. | అకటా మరుఁ డిపు డుల్లం, బకటావికటముగఁ జేసి యడ లూన్చెను నీ | 79 |
క. | వీటీపాటీరాగరు, హాటకతాటంకమణిమయాభరణంబుల్ | 80 |
క. | ఈరేడుజగములం దిఁక నేరీ నీరీతిగోతు లెన్నిక గనునొ | 81 |
క. | అలికీరపికమరాళా, వలికిం గరువలికి మరునివాలారుంబూ | 82 |
క. | కులుకుచు జిలిబిలిపలుకులు, చిలుకుచు వలిగుబ్బ లెదను జేర్పవె మరుపూ | 83 |
క. | కొమ్మా మదనునిపూవుం, గొమ్మా నెమ్మది యెలర్పఁ గొమ్మా కడుఁ దో | 84 |
వ. | అని యనేకప్రకారంబులం బ్రార్థించిన నమ్మించుఁబోఁడి యించుక దల వంచి మిన్న | 85 |
తే. | అవనినాయక సుశ్యామ యనెడుపేర, నలరు గంధర్వరాజకన్యాలలామ | 86 |
తే. | కన్నవారెల్ల నగఁ దముఁ గన్నవారి, మిన్న కెంతయుఁ బోనాడి యెన్నరాని | 87 |
తే. | అని పలికి కల్కిఁ దోడ్కొని యనుఁగుఁజెలులు, వెసఁ దదంతికలీలానివేశమునకుఁ | 88 |
చ. | నిలు నిలు పోకు బాల హరినీలనిభాలక జాల నీకు నే | 89 |
ఉ. | చక్కఁదనంబు జవ్వనము జాణతనంబును గల్గి ఠీవిఁ బెం | |
| గిక్కరవెట్టఁ జూచెదు చెలీ పదమా ముదమార నింక నా | 90 |
క. | బాలా వేలాగుల బతి, మాలిన విన కిగ్గయాళిమడఁతుల వెంటన్ | 91 |
సీ. | నీవు మాటలు నేర్పి నెమ్మితోఁ బ్రోచిన, చిల్క చిల్కగుఁజుమ్ము చిగురుఁబోఁడి | |
తే. | దైవబల మేరికి నొకింత దప్పెనేని, ప్రాణబంధువు లైనను బగతు లగుదు | 92 |
క. | అనుమాన ముడిగి వినుమా, నను మారునిబారిఁ ద్రోచి ననఁబోఁడి వేసం | 93 |
సీ. | వలఱేఁడు వాఁడిపూములికిమొత్తము లేయఁ, జలివెలుం గుడుకువెన్నెలలు గాయ | |
తే. | గమ్మకపురంపుపెనుదుమారమ్ము రేచి, పొరిఁబొరిఁ బిసాళినాళితెమ్మెరలు డాయ | 94 |
తే. | చాన ననుఁ జూడు గడితంపునాన వీడు, కేరి మాటాడు కుసుమాస్త్రకేళిఁ గూడు | 95 |
క. | అనుమాటలు విని మానిని, యనుమానింపుచు నటున్న నపు డానృపుఁడున్ | 96 |
ఉ. | మోహసమగ్రతం బ్రియుఁడు ముద్దియయుం గవగూడి కోరి యు | 97 |
ఉ. | కామదురాపతాపహతిఁ గ్రాఁగుచుఁ జక్కనికోడెకాఁ డెదన్ | |
| వేమఱుఁ బ్రేమ ముల్లసిల వేఁడుకొనంగ ననంగసంగరో | 98 |
క. | మీరామామణి కడిఁదియొ, యారముతో మమ్ముబోంట్ల కాస కొలుపుచున్ | 99 |
తే. | తలిరుఁబోఁడికి గాదిలిచెలులు మీర, లిందఱును గల్గుటకుఁ జేతి కందినట్టి | 100 |
క. | శుకవాణికి నాపై నిం, చుక కూరిమి గలిగియున్న చొప్పరయక యూ | 101 |
తే. | అద నెఱిఁగి యిందు నీయిందువదనపొందు, నాకు సమకూర్చితేని యనేకమణివి | 102 |
క. | అని పలుకునెడలఁ జెలు లె, ల్ల ని దేమిటిజోలి సరి బళా పదపదరే | 103 |
వ. | అచట నొక్కచొక్కటంపుఱిక్కరారాచట్టుపయిం జతికిలం బడి నెమ్మొగంబున | 104 |
ఉ. | అక్కట మిక్కు.టంపుగొన బారఁ దళుక్కని తొల్మెఱుంగున | 105 |
చ. | ఎటువలెఁ దాళువాఁడ నిపు డెవ్వరి నేమని దూరువాఁడ న | 106 |
సీ. | పొలఁతుకజిలిబిలిసొలపుఁబాటలకును, మగువనిద్దపుముద్దుమాటలకును | |
తే. | వలసి సొలసితి నది నన్నుఁ గలసి మెలసి, బలసి కోర్కెలు దీర్పక తులువకలువ | 107 |
సీ. | బలితంపుగండుఁగోయిలలకూఁకలకును, దలిరువాల్తులువబల్దాఁకులకును | |
తే. | జాలఁ దూలెద నిఁకఁ దాళఁజాలఁ జాల, మేల మేలుర నమ్ముద్దుబాల లీల | 108 |
వ. | అని యనేకప్రకారంబులం దగిలి వగలం బొగులుచున్నయారాచమిన్నం గనుంగొ | 109 |
క. | ఓ ఱేఁడ నీవు పలుమఱుఁ, గాఱడవులవెంట నన్యకామినికొఱకై | 110 |
క. | పలుదెఱఁగులఁ బెఱచెలికై, వలకాఁకలఁ గ్రాఁగి నేఁగవలవదు నీకున్ | 111 |
చ. | పటుమతిఁ జిత్తగింపుము నృపాల విరోధివరూధినీధవ | 112 |
క. | వేలాగుల నన్యవధూ, లోలుఁడ వై నాన యుడిగి లోఁగెదు ధరణీ | 113 |
క. | కొద లేనివగలఁ బొగలుచుఁ, గొదకొని వనిఁ దిరుగ నేల గొబ్బున నిపు డో | 114 |
వ. | అని యనునయింపుచు నర్మసఖుం డతనిం గ్రమ్మఱఁ దోడ్కొని వచ్చుచున్నయెడ | 115 |
సీ. | పద్మరేఖావృతాంబరచరప్రమదాంఘ్రి, పద్మలాక్షాంకితప్రాంగణములు | |
తే. | క్రతుభుగంభోజలోచనాకృతమనోజ, పూజనాయత్తఫలగంధపుష్పధూప | 116 |
సీ. | ఈకెళాకుళిచెంత రాకేందుబింబాస్య, తివిరి యంచకు నడ ల్దిద్దుచుండె | |
తే. | నీనిశాకాంతకాంతమణీనిశాంత, కాంతనవరత్నమయవేదికాంతరమునఁ | 117 |
సీ. | సక్రియక్రొందళుకుపిసాళిచూపులకోపు, ముగుదనిద్దపుముద్దుమోముగోము | |
తే. | దలఁచుకొన్న జగం బెల్లఁ దన్మయముగఁ, గనఁబడుచునున్న దింక నక్కలికిమిన్న | 118 |
క. | ఏలా హేలాలీలల, నోలిం గ్రీడించునద్దివౌకఃకులరా | 119 |
క. | నిర్భరపుణ్యఫలప్రా, దుర్భవు లగుసుజనులకును దొరకుం గా కా | 120 |
వ. | అని తలంచుచుండి మఱియు సంగడికాని కి ట్లనియె. | 121 |
క. | చెలికాఁడ యెట్టినోములు, సలిపెనొ యిగ్గోఁగుమ్రాను జలజేక్షణ నున్ | 122 |
చ. | చెలిమి దలిర్ప నానవకుశేశయపత్రవిశాలనేత్ర ను | 123 |
చ. | వలఁతితనం బెలర్ప నలవారిజపత్రవిశాలలోచనా | 124 |
క. | విధుబింబానన పుక్కిటి, మధు విడి యిప్పొగడమ్రాను మన్నించెఁ జెలీ | 125 |
క. | మహిలామణిపాణిసరో, రుహసంస్పర్శం జెలంగి క్రొన్నన లెత్తెన్ | 126 |
క. | వలనుగ నమ్ముద్దుం బై, దలి వలి నిట్టూర్పుకమ్మతావులచే వా | 127 |
తే. | చేడియలమిన్నమృదుపదతాడనంబు, గాంచి యంచితసుమనోవికాసలీల | 128 |
క. | పాటలగంధిచొకారపుఁ, బాటల నీప్రేంఖణంబు బహుతరసుమనః | 129 |
తే. | కన్నియలమిన్న చిన్నారిక్రొన్నగవుల, వన్నియలు మీఱ నిప్పొన్నగున్న నలరఁ | 130 |
క. | చెలిమోము కళలసంపఁగి, నల రొందం జేసె నది వయస్యా ననుఁ దాఁ | 131 |
వ. | అనుచు వెండియు. | 132 |
క. | అమ్మానిసిఱేఁడు వనిం, ద్రిమ్మరుచో నొక్కపువ్వుదీవియనా జుం | 133 |
చ. | అమరనితంబినీసురుచిరాననసారససారసౌరభ | 134 |
క. | అలికులతిలకమ నినుఁ గ, న్నులఁ జూచినయంతలోనె నూల్కొను ప్రేమం | 135 |
మ. | క్రతుభుక్కంజముఖీవియోగభరవిక్లాంతుండ నై యివ్వనిన్ | 136 |
ఉ. | అక్కట మిక్కుటంపువిరహానలవేదన కోర్వలేక ని | 137 |
తే. | అక్కటా నీకుఁ గల్గిన ఱెక్క లిపుడు, నాకుఁ గల్గిన మింట నందముగఁ బఱచి | 138 |
సీ. | అవనిఁ బరోపకారార్థ మిదం శరీ, ర మని యార్యజనము లెపుడుఁ | |
తే. | కాక యుండిన నామాఱు గాఁ దదంఘ్రి, వనజయుగ్మంబుపై వ్రాలి వినతు లొసఁగి | 139 |
వ. | అని యెడయనియెడరుల బడలి యడలుచున్నయొడయని మెల్లనే యూరార్చి స | 140 |
సీ. | పగడంపుఁగంబము ల్పచ్చరాబోదెలు, గొనబారుమొకమాలు గోడబారు | |
తే. | గలిగి యభినవశృంగారగౌరవమునఁ, జాల నలరారు డేరాహజారమునను | 141 |
క. | ఉసు రసు రంచుం బొడలుచుఁ, గసరుచుఁ క్రొవ్వేఁడియూర్పుగాడ్సులు నిగుడన్ | 142 |
వ. | మఱియు నద్ధరావరపుంగవుడు నిజాంతరంగం బయ్యంగనామణి జగన్మోహనాంగ | |
| వడంకుచుఁ గొంకుచు బెగడి దైవంబుఁ దెగడి నిగనిగ జిగిదళు కొత్తుక్రొత్తనెత్తమ్మి | |
| గబ్బిగుబ్బలపయిం బరిపరిగతుల నర్తింప మంజుమంజీరకంకణకింకిణీవిరావంబులును | 143 |
ఆ. | పరవశాత్ముఁ డై ప్రపంచంబు మఱచి జ, గంబు దన్మయంబు గాఁగఁ దలఁచి | 144 |
క. | మతిమంతుఁ డట్టిగాటపు, వెతలం బడి పొరలునవనివిభుఁ గన్గొని హా | 145 |
క. | పురములు విడి పాఱవె కుల, తరుణులు వెత పడరె బుధులు తప్పెన్నరె నీ | 146 |
మ. | అకటా భూపకులాగ్రగణ్య నయవిద్యాభ్యాసపారీణతా | 147 |
మ. | కరు లశ్వంబులు నందలంబులు శతాంగంబు ల్మణీభూషణాం | |
| బరవీటీమృగనాభివందనధనప్రాసాదదాసాదులుం | 148 |
క. | ధరణిం గలజను లందఱు, దిరముగఁ దమయాజ్ఞ మెలఁగ దృఢతర సామ్రా | 149 |
క. | వసుధాధిప మృగయాద్యూ, తసతీముఖ్యంబు లగుచుఁ దనరెడుసఫ్త | 150 |
క. | భళిభళి విను మీ వెదలోఁ, దలఁచినఁ బదివేలు ముద్దుతలిరుంబోఁడుల్ | 151 |
క. | మదిరాక్షులవలలం బడి, మొదలం బెక్కండ్రు బన్నములఁ జెంది రహా | 152 |
వ. | అనిన నతని కానృపతి యి ట్లనియె. | 153 |
మ. | పురము ల్వోయినఁ బోవనీ బంధులు తప్పు ల్వట్టినం బట్టనీ | 154 |
సీ. | కలకంఠిసిద్దంపుగబ్బిగుబ్బల సౌరు, తరుణిలేఁజెక్కుటద్దములతీరు | |
తే. | డెందమున నాట మిగులఁగడిందివలపు, గందళించుచు నున్ననమ్మందయాన | 155 |
క. | వారువము లందలంబులు, వారణరమణీమణీనివసనవసనభూ | 156 |
ఉ. | సంగడికాఁడ చేడియలు చాలఁ గలా రని నీకు నిప్పు డీ | 157 |
చ. | సచివకులేంద్ర యవ్వికచసారసపత్రవిశాలనేత్రపొం | |
| దచిరగతి న్ఘటించి నను నర్మిలిఁ బ్రోవుము కాకయున్న నీ | 158 |
తే. | అనుడు నెయ్యుఁడు వెఱఁ గంది యకట యితని, కగ్గలం బయ్యె విరహార్తి యంతకంత | 159 |
వ. | అతనిం దోడ్కొని చని వనిం బ్రవేశించిన నమ్మహీమహేంద్రుండు. | 160 |
సీ. | పొలఁతిపాలిం డ్లంచుఁ బొన్నకాయలు వట్టి, హా యివి పొన్నకాయలె యటంచు | |
తే. | వనితవాతెఱ యని పరువంపుదొండ, పండు వట్టి యహా యిది పరువు గూరి | 161 |
తే. | అపుడు చెలికాఁడు నృపతి కయ్యతివమీఁది, తలఁ పొకించుక మఱలింపఁ దలఁచికొనియు | 162 |
క. | అవె చూతలతలు నునుఁగెం, జివురులతోఁ దేజరిలెదు క్షితివర కంటే | 163 |
క. | వసుధాధీశ శిరీష, ప్రసవము లవె చూడు సిరులఁ బరఁగెడు నౌ నౌ | 164 |
ఉ. | మారెడుపండ్లు చూడు మవె మానవనాథకులావతంస సొం | 165 |
క. | జననాథ మొల్లమొగ్గలు, గనుఁగొను మవె మదికి ముదము గదియించుచు సొం | 166 |
క. | రంభాస్తంభము లవె సం, రంభం బలరారఁ జూడు రాజోత్తమ య | 167 |
చ. | కనుఁగొను కేతకీకుసుమగర్భదళంబు లుదగ్రవైఖరిన్ | |
| దనరుచు నున్నవల్లవె శతక్రతుసన్నిభ మే లయారె య | 168 |
తే. | ప్రభుజనోత్తమ చూడు జపాప్రసూన, మదె మనోహరలీలచే నలరుచున్న | 169 |
క. | ఎకిమీఁడ చూడు మిదె చం, పకముకులము లెదకుఁ జాలఁ బ్రమద మిడెడు న | 170 |
క. | పున్నాగమ కనుఁగొను మదె, పున్నాగము ననిచి సిరులఁ బొలుపారెడు నౌ | 171 |
తే. | అని వచించుచు వార లవ్వనిఁ జరించు చున్నచోఁ గీరశారీమయూరపికమ | 172 |
వ. | వెండియు నతని కి ట్లనియె. | 173 |
సీ. | కొఱవిదయ్యమ్ములతెఱఁగునఁ జిగురాకు, గుబురులయం దున్నకోకిలములు | |
తే. | మఱియుఁ గపురంపుకమ్మదుమార మెలయ, వీఁకఁ బైకొనుచిఱుగాడ్పుసోఁకుడులును | 174 |
తే. | కుసుమబాణున కెప్పుడు కువలయనవ, మాలికాశోకకమలరసాలములను | 175 |
తే. | మరునిపూఁదూపు లిందాఁకఁ గెరలి వెలికిఁ, గానరాకుండ నెదలోనఁ గాఁడుఁ గాని | 176 |
వ. | అట్లు సోలినధరావరామరాధీశ్వరుం గ్రమంబున శిశిరోపచారంబుల సేదఁ దీర్చి | |
| నర్మసఖుండు యథాస్థానంబునఁ జేర్చె నని నారదునకు శారదామనోహరుం డెఱిం | 177 |
చ. | పరమకృపానివేశమృదుభాషణ భోగికులేంద్రభూషణా | 178 |
క. | స్వర్గాపవర్గఫలదని, సర్గా దుర్గాధినాథ సంభృతసుమనో | 179 |
సుగంధివృత్తము. | తారకాశతారకాశతారకాశరాట్పయ | 180 |
గద్యము. | ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రాజ్య | |