రసికజనమనోభిరామము/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
ఓం నమః కామేశ్వర్యై
రసికజనమనోభిరామము
చతుర్థాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము వారిజాసనుండు నారదున కి ట్లని చెప్పం దొడంగె నట్లు ఋతుధ్వ | 2 |
తే. | వేల్పుకన్నెయు నద్ధరావిభు నుదగ్ర, మోహనాకారరేఖ సమ్మోద మొదవ | 3 |
సీ. | పగడంపుఁగోళ్ళహొంబట్టెమంచము దోమ, తెర జరతారుమేల్పరపు తగటు | |
తే. | వీణె వింజామరలు వట్టివేళ్లసురటి, తబుకు కపురంపుబరిణె గందంపుఁగుడక | 4 |
తే. | తొడవు లన్నియు నెడలించి యడలు మించి, యొడలు బడలంగ మది జాలి గడలుకొనఁగ | 5 |
తే. | కళవళింపుచు మే న్గడగడ వడంకఁ, బండ్లు గొఱుకుచు మూల్గుచుఁ బదరి నగుచు | |
| నోలిఁ బండుచు లేచుచు నులికిపడుచు, నుండె వలరాచబలుబూచి యొదవి యబల. | 6 |
వ. | మఱియును. | 7 |
సీ. | తలయూఁచు నెదలోనఁ దలఁకి గుప్పున లేచుఁ, జిలుకలఁ గొట్టు నెఁచ్చెలులఁ దిట్టుఁ | |
తే. | గలఁగుఁ బిమ్మటఁ గుడుచు బెగ్గిలు వడంకు, బెదరుఁ గన్నీరు నించు దూపిలుఁ గృశించుఁ | 8 |
క. | అటు లుండి కొంతవడి కా, కుటిలాలక యంతకంతకు న్మనమున మి | 9 |
ఉ. | అక్కట పాపజాతిచెలు లక్కటికం బొకయింత లేక తా | 10 |
ఉ. | ఎవ్వరి వేఁడుకొందు నిఁక నేగతి నివ్వెత వీడుకొందు నేఁ | 11 |
ఉ. | ఆద్దిర వానిచెల్వము జయంతునిఁ గంతుని నవ్వసంతునిం | 12 |
ఉ. | పున్నమచందురుం దెగడుఁ బూపనిగారపుముద్దుమోము వా | 13 |
ఉ. | పంటికొలందిఁ జక్కెరలపానక మూరెడుకావిమోవి పె | |
| జంటఁ బెనంగ లేనియలంజవ్వన మేటికి మవ్వ మేటికిన్. | 14 |
క. | అని యిటు లనివారిత మగు, మనసిజవేదనఁ గలంగు మహిలామణిఁ గ | 15 |
ఆ. | పొలఁతులార యిపుడు నెలఁతకు విరహార్తి, బలిత మయ్యెఁ జేయుపని యిఁ కెద్ది | 16 |
క. | నీహారకరముఖీ యిటు, లాహా మోహాతిరేక మలరారఁ గడున్ | 17 |
తే. | కన్నియవు గాని పోడవు గావు నీవు, కువలయాక్షిరొ సి గ్గెల్లఁ గొల్లఁ బెట్టి | 18 |
క. | బాలా వనమృగమదజం, బాలాతతమృదుకపోలభాలా మేలం | 19 |
చ. | తలఁపున నొక్కయన వసుధాతలనాథకుమారుఁ గోరి | 20 |
సీ. | పెంపార వలిజిలిబిలిపాటఁ బాడుచు, నింపుగా వీణ వాయింప వేమి | |
తే. | చిలుకబోదల మచ్చికఁ జేసి ముద్దు, చిలుక మురిపెంపుమాటలు చెప్ప వేమి | 21 |
ఉ. | చెంత మెలంగునూడిగపుఁజేడెల బి ట్టదలించె దేమి ము ' | 22 |
చ. | మదనసమానమూర్తి యని మానవనాథకుమారశేఖరున్ | |
| మ్మద మగున ట్లొనర్చెదము మాపలు కిమ్ముగ నాదరించి యో | 23 |
ఆ. | అనుచు నిటు లనుంగుననఁబోఁడు లాడిన, పలుకు లాలకించి కలికిమిన్న | 24 |
సీ. | చెలులార వినుఁడు కల్వలఱేని వలఱేని, నలువారఁ బలుమాఱు గెలువఁ జాలు | |
తే. | వెతలఁ బఱచుచునున్నాఁడు వేయుగతులఁ, దఱచు లిం కేల యీవేళఁ దాళఁ జాలఁ | 25 |
చ. | వినుఁ డొకమాట చెప్పెద నవీనకృపామతి నాదరించి యి | 26 |
ఆ. | అనిన బోటికత్తె లమ్మ నీ కిపు డింత, చింత యేల వట్టిఱంతు లేల | 27 |
తే. | అటులఁ జెలు లూరడించిన నాసఁ దవిలి, యన్నిలింపాంబుజాతదళాయతాక్షి | 28 |
సీ. | చెఱకుసింగిణివింటఁ గఱకుతుమ్మెదవారిఁ, దవిలించి విరిదొన ల్రవళిఁ బూని | |
తే. | నలరువిలుకాఁ డనెడిపేరి బలుసిపాయి, హాళిఁ బైకొని కో యని యార్చి పేర్చి | 29 |
క. | ఏసిన హా యని సోలి వి, లాసిని వడిఁ దెలిసి పెక్కులాగుల వెతలన్ | |
| వేసరి యేమియుఁ దోఁచక, గాసిలుచుం జెలిమివెలఁదుకల మొఱఁగి వెసన్. | 30 |
సీ. | పట్టెలఁ గే లూని పాన్పు మెల్లన డిగ్గి, గిలుకుపసిండిపావులు దొడుగక | |
తే. | జంటఁ బిలపిలఁ జనుశుకశారికామ, యూరకాదంబవితతుల నులికి పాఱఁ | 31 |
వ. | అట్లు తరలి చని వనిం బ్రవేశించి. | 32 |
సీ. | కమ్మపుప్పొడి ముండ్లకరణి నంఘ్రులు గాఁడ, నలరులు మరుతూపులట్ల తగులఁ | |
తే. | నడలి యెచ్చోటఁ గా లూన నలవి గాక, మరలి పూఁదేనెసోనలు గురియుచున్న | 33 |
తే. | ఏమి సేయుదుఁ గటకటా యించువిల్తుఁ, డేఁచ నిలు వెళ్లి వనిఁ జేరు టెల్ల నిపుడు | 34 |
సీ. | గడితంపుమొగిలిరే కడిదంబుఱొమ్మునఁ, గదియించి డుస్సిపో నదుముదాన | |
తే. | గాక యుండిన సితగరుత్కోకశౌక, కోకిలానీకమత్తమధూకచంచ | 35 |
చ. | అళులుఁ బికంబులు న్శుకము లంచలు శారికలు న్మయూరముల్ | 36 |
వ. | మఱియును. | 37 |
తే. | హరహరా యంచు రామరామా యటంచుఁ, జక్రధర యంచుఁ బలుమాఱు సంస్మరించు | |
| మకరకేతనపరభృతమందగంధ, వహులదాడికి మోడి యావన్నెలాఁడి. | 38 |
సీ. | ముద్దుగుమ్మకు శిలీముఖ మయ్యెఁ దుమ్మెద, యలికుంతలకి సోఁకు డయ్యె గాడ్పు | |
తే. | మంగభవఘోరసాయకాయాతయాత, నావికంపితహృదయరాజీవ యగుచు | 39 |
క. | అత్తఱిఁ బుత్తడిగీమున, బిత్తరిఁ గానక కరంబు బెగ్గిలి యనుఁగుం | 40 |
ఉ. | హా లలనాశిరోమణి గృహంబును వెల్వడి మన్మథానల | 41 |
క. | విని వనిత లహహ నిర్భయ, మున నేమరి యుండి మోసపోతిమి గదరే | 42 |
సీ. | ఈకప్పురపుఁదిప్ప యెక్కి యొక్కంతసే, పెలనాగ వల నొప్ప నిలిచియుండె | |
తే. | నీనిగారంపుద్రాక్షాలతానికాయ, కాయమానాంతరంబులకడ నొకింత | 43 |
సీ. | పాను పెక్కఁగ లేక బడలుచేడియ యెట్టు, లీకప్పురపుఁదిప్ప లెక్క నోపె | |
తే. | గేళికాగారములపొంతఁ గేళకుళులఁ, జొరవెఱచుజోటి యెట్టు లిచ్చోటిమేటి | 44 |
సీ. | ఎద వ్రయ్య లొదవంగ నీదుండగపుగండుఁ, గోయిలరాపిండు గూయుచుండ | |
| తలదిమ్ము ఘటియిల్లఁ దవిలి యీతాబోటు, మొకరితుమ్మెదరిమ్ము మొరయుచుండఁ | |
తే. | నొక్కతెయుఁ గోనఁ ద్రిమ్మరుచుండి నొండు, కొనుదొసంగులఁ బిమ్మటఁ గొనుచు మనలఁ | 45 |
సీ. | ఈబిసంబులు చూచి హేలావతీమణి, పాఁపకూటువ లంచు భ్రమసెనేమొ. | |
తే. | యహహ పసిబిడ్డ కిట్టిఘోరాల్తి యొదవె, నేమి సేయుద మే మంద మెటకుఁ బోద | 46 |
సీ. | ముసుఁగు వాయఁగఁ ద్రోచి కసరి దిగ్గన లేచి, యఱ్ఱెత్తి నలుగడ లరయుదాని | |
తే. | నుసురు లూడాడ విసవిస విసరి ముసరి, దొసఁగు లెసగించుసురుగాడ్పుతుటుముదాడి | 47 |
తే. | కాంచి దవ్వులనుండియే కడఁకఁ బఱచి, పొదవికొని యశ్రుజలపూరమున మెఱుఁగుఁ | 48 |
తే. | చెంగలువపూలు మేలుసంపెంగవిరులు, పడఁతి మిన్నకుఁ జుట్టి రా బడిసి వైచి | 49 |
ఉ. | కొమ్మరొ ముమ్మరంపువెత గ్రుందుచు ని ల్లెడఁబాసి యిమ్మెయిన్ | |
| మ మ్మఱ చేసి యొంటిగ వనంబున కేటికి వచ్చి తమ్మ నె | 50 |
క. | కన్నెల నెందఱినేనియుఁ, గన్నులఁ జూచితిమి గాని కటకట యిటులన్ | 51 |
సీ. | కుజనులఁ జేరి చొక్కుచు శీధుపానంబు, సేయుచండాలు లీచెనఁటితేఁటు | |
తే. | పూని నిరతంబు చెలరేగి పుణ్యతరుల, ఫలము లెల్లను బడఁద్రోయు పక్షపాతు | 52 |
తే. | ఆయెఁ గానిమ్ము మంచిది యబల యింకఁ, గొంక వలవదు నీమదికోర్కె లెల్లఁ | 53 |
తే. | అనుచు వనజాతలోచన నత్తెఱఁగున, నాడి సంగడిపూఁబోఁడు లంత నచటఁ | 54 |
తే. | క్రొమ్ముడులు దిద్ది కంచెలల్ గుదియఁ గట్టి, మొలల నవరత్నమయకాంచికలు బిగించి | 55 |
మ. | అళులం జోపుదుఁ బువ్వుఁదేనియల నెయ్యం బొప్పఁగాఁ గ్రోలుచున్ | 56 |
మ. | వలిగప్రంపుటనంటిబోదియలక్రేవ న్గుజ్జులేమావిమ్రా | 57 |
సీ. | మిహికాంశుముఖి యోర్తు సహకారభూజంబు, కలికి యొక్కతె తిలకద్రుమంబు | |
| శతపత్రపత్రలోచన యోర్తు వకులంబు, సుందరి యొక్కతె యశోకతరువు | |
తే. | సఖి యొకతె గోఁగు నొకయింతి చంపకంబు, నలరు లెత్తించి రెలమిఁ జే నంటి చూచి | 58 |
తే. | మఱియు వనియెల్లఁ గలయఁ ద్రిమ్మరి యుడుగక, మెదలుటక్కరిగండుఁదుమ్మెదలు వొలయఁ | 59 |
సీ. | పొన్నపువ్వులు గోసెఁ బూఁబోఁడి యొక్కతె, మొగలిరేకులు ద్రుంచె ముగుద యొకతె | |
తే. | హాళి దైవార దైవతాబ్జాస్య లెల్ల, రేసి తమనాభినఖదంతనాసికాంఘ్రి | 60 |
తే. | చెఱకువిల్లును గ్రొమ్మావిచిగురువాలు, నలరుఁదూపులుఁ బూని కోకిలశుకాలి | 61 |
తే. | కురులు జడ యల్లి మందారకుసుమ మునిచి, కప్పురపుబూది మైఁ బూసి గొప్పమల్లె | 62 |
వ. | వెండియుఁ దమలోన. | 63 |
రగడ. | వనిత వనితరు లలమి నేరుపు లన వల నగుననలు ద్రుంచుము | |
| పూని పూ నిలు వెల్ల ననచిన పొన్నపొన్నల నీడ నాడక | 64 |
తే. | అనుచు వనకేళి సలిపి లతాంగు లెల్లఁ, జాల నలరులు దలిరులు సంగ్రహించి | 65 |
సీ. | యక్షనాయకునిభాండాగారమునఁ బోలె, మకరకచ్ఛపవరమహిత మగుచు | |
తే. | భూరిదిఙ్మండలముఁబోలెఁ బుండరీక, కుముదసంసక్త మగుచు సంక్షుద్రలీలఁ | 66 |
సీ. | సమదరథాంగభాస్వరపయోధరయు స, మీచీనపాఠీనలోచనయును | |
తే. | గంబుకంఠియుఁ గలహంసగామినియును, రామకమిళిందమాలికారోమలతయు | 67 |
తే. | అమరనారీశిరోమణు లతితరప్రహర్షమానస లై యపు డక్కడింది | 68 |
చ. | గడితపుఁగావిపావడలు గట్టి కుచంబులబంటి నీటిలోఁ | 69 |
చ. | కరివరయాన యోర్తు లిసకాండము చిమ్మనగ్రోవి చేసి య | 70 |
తే. | ఉవిద యొక్కతె వెతికిలనుండి నీటఁ, దేలుచో నొక్కరాయంచ తివిరి తమ్మి | 71 |
క. | నలినకుముదాదికము ల, త్తలునీమణు లెల్లఁ గోయుతఱి నొకచెలి చే | 72 |
ఉ. | చంపకగంధి యోర్తు మదషట్పదపంక్తులఁ దోలె నంచలన్ | 73 |
చ. | మెలఁతుక యోర్తు తమ్మివిరిమీఁదటితేఁటులఁ జోప నయ్యళుల్ | |
| దలఁగక చల్లె వేనలిని దాల్చిన గాటపుఁగ్రొత్తసంపెగల్. | 74 |
క. | అలివేణి యొకతె యొకతొ, య్యలిపై నోల యిడి పఱచి యంబుజషండం | 75 |
క. | అప్పులఁ బడి యొకచేడియ, తెప్పునఁ దేలంగ లేక తిరుగుడుపడుచోఁ | 76 |
తే. | ముగుద లుమ్మడి సరసిలో మునిఁగితేలు, నపుడు కచముల జాఱు నీ రనువు మీఱెఁ | 77 |
చ. | నెలఁతలు నీటిలోనఁ దమనీడలు గన్గొని చిల్వచెల్వ లం | 78 |
సీ. | కరిరాజయాన యొక్కతె గాసివెట్టఁ దా, మరసాక్షి హరిమధ్య మఱుగు దూఱెఁ | |
తే. | గమలకల్హారకువలయకుముదసమద, యాంచితామోదమేదురోద్యత్సరోవ | 79 |
క. | మునుఁగుచుఁ దేలుచు నీఁదుచు, ననువుగ నుదకంబుఁ జల్లులాడుచుఁ బరువుల్ | 80 |
ఆ. | అంతఁ గొలను వెడలి యింతులు దరిఁ జేరి, కుంతలంబు లార్చుకొని విభూష | 81 |
తే. | వలపుఁగప్రంపుటనఁటిమ్రాఁకులకెలఁకుల, జాలువాఱెడుచలువగొజ్జంగినీటి | 82 |
తే. | కొమరు దళుకొత్తఁ జెఱకుఁగంబములు నిలిపి, యలరు పందిరి వైచి కెందలిరుటాకుఁ | 83 |
క. | నును పగుమృగమదపంకం, బున దీనియ దిద్ది కప్రపుంబొడి మ్రుగ్గుల్ | 84 |
తే. | తద్బలంబుల వ్రాసి గంధప్రసూన, ధూపదీపప్రముఖషోడశోపచార | 85 |
క. | దండము నీ కిదె జగదు, ద్దండభుజాదండనిహితతతసుమనఃకో | 86 |
సీ. | ఎడప కెప్పుడుఁ గన్ను లెఱ్ఱఁజేయుబలంబు, గంటి సేయక యెద నంటుతూపు | |
తే. | గలిగి యలిగినపతుల శృంగారవతుల, రతులఁ బెనయించి హాళిమై నతుల గతులఁ | 87 |
క. | కొంకక యెపుడును నీపద, పంకరుహధ్యానరూఢిఁ బరఁగుదు మదనన్ | 88 |
క. | కమలభవభవముఖామర, సముదయ మళు కొందు నీనిశాతప్రసవా | 89 |
తే. | హాళిఁ జలపట్టి మృదుకుసుమాశుగముల, యతులదృఢమానసములు వ్రయ్యలుగఁ జేయు | 90 |
చ. | పనివడి యింత నీయెదురఁ బల్మఱుఁ దెల్పఁగ నేల బాల న | 91 |
తే. | అనుచు నతనుని బ్రార్థించుకొని మెఱుంగుఁ, బోఁడు లక్కన్నెఁ దోడ్కొనిపోయి నిజని | 92 |
క. | బంధూకప్రసవవిభా, బంధురుఁ డై యపుడు పద్మబంధుఁడు గ్రుంకెన్ | 93 |
సీ. | చరమాద్రిశిఖరసంచరదభ్రచరవధూ, శ్రేణి గట్టినతోఁపుఁజీర లనఁగ | |
ఆ. | దిమిరమత్తేభరాజ ముద్వృత్తి బయలు, వెడలుచో మేనఁ గనుపట్టు వితతగైరి | |
| కప్రభాచ్ఛట లనఁగ నఖండలీల, సంజకెంజాయ లలరె దిశాముఖముల. | 94 |
చ. | తఱి యనులోహకారకుఁ డుదగ్రతఁ బశ్చిమశైలశృంగమున్ | 95 |
తే. | రవళిఁ గువలయహితుఁ డగురాజు స్వారి, వచ్చునెడల విభావరీవనరుహాక్షి | 96 |
చ. | విరహుల గెల్వఁ గోరి ననవిల్తుఁడు బల్తుఱు తూని పుష్పలి | 97 |
క. | చిత్తజుఁడు జగముపై దం, డెత్తుచు నని యిడ్డ మదపుటేనుఁ గనంగా | 98 |
ఉ. | కోకతతు ల్వియోగహతిఁ గూయఁ దొడంగె దివి న్సుధాంశుమే | 99 |
సీ. | గురులఘువర్ణవైఖరులు గణింపక, విశ్రమస్థలములు వెదుకఁ బోక | |
తే. | తమము నిండార ధూర్తవర్తనులఁ గూడి, తవిలి విహరించి రప్పు డుద్దామవృత్తిఁ | 100 |
చ. | ఎనయఁగ మచ్చు చల్లి భ్రమయించి కడున్ వివరంబు సించి లోఁ | 101 |
సీ. | అనిమిషేంద్రవధూటి హర్మ్యాగ్రవీథిపైఁ, గొఱలు మేలుపసిండికుండ యనఁగఁ | |
| రజనీజలజపాణి రహిఁ గేల నిడి యాడు, బలుదమ్మికెంపురాబంతి యనఁగ | |
తే. | విన్ను ద్రిమ్మరి ననఁబోండ్లు, వెన్నునజ్జఁ, బూజ సల్పిన కెందమ్మిపూ వనంగ | 102 |
క. | వినుపుడమిం జిగిరిచి జిగి, ననువారెడుగుజ్జుమావి యన శశిబింబం | 103 |
మ. | సరసం బై వసుగంధసంకలిత మై సన్మార్గసంవర్తి యై | 104 |
క. | మరుఁ డొకట నఖిలపథికాం, బురుహదళేక్షణల నేయఁ బూనినతెలిదా | 105 |
క. | తిమిరపిశాచం బాశా, రమణీమణి నాక్రమించి రాయిడిఁ బెట్టన్ | 106 |
సీ. | బహుళజీవంజీవపటలి దూపలు దీఱెఁ, గవ వీడి జక్కవల్ కడలఁబాఱె | |
తే. | గమలముకుళాంతరముల భృంగములు దూఱెఁ, దవిలి క్రీడించుభోగులతాప మాఱె | 107 |
తే. | అప్పు డమరాంగనలు మనోహరవిలాస, లీలఁ జెలరేగి మద్యంబు గ్రోలఁ గోరి | 108 |
ఆ. | కనకమయగలంతికల నాసవము ముంచి, యాసుకొనుచు సొలసి వీనుగవలు | 109 |
క. | అహహా యని సొలయుచుఁ గడు, హిహిహీ యని నవ్వుకొనుచు హేలాగతిమై | 110 |
తే. | సుధ యిఁ కేటికి నిపు డివ్వ సుధఁ దనర్చు | |
| మదిర దొరకెను మనభాగ్య మదిర యనుచు | 111 |
క. | ఆసవముచవి యెఱుంగక, యాసవభాగములు గోరి యడ లొంది రహా | 112 |
సీ. | మధుదైత్యమదనుఁ డిమ్మధువు గ్రోలక కదా, యతితరం బైనకార్శ్యంబు నొందె | |
తే. | గరటిముఖునకుఁ గడుఁబెద్దకడుపు యక్ష, నాథునకుఁ గుష్ఠరోగంబు నాటుకొనియెఁ | 113 |
వ. | అని మఱియుం దమలోన. | 114 |
తే. | చంద్రికలు గాయు పరిపూర్ణచంద్రుఁ జూచి, యోయి వెన్నెలదొర బావ యురక నన్నుఁ | 115 |
క. | తనమదిరాకలశంబులు, గొన నీ కేయోజ యనుచుఁ గొమ్మ యొకతె యా | 116 |
సీ. | కుమ్మరిసారెలాగున నేల దిర్దిరఁ, దిరిగె నంచును వ్రేలు ద్రిప్పె నొకతె | |
తే. | రిక్కచా ల్మింట నంటి యమ్మక్క దన్ను, వెక్కిరించె నటంచు నా మెక్కి మిగులఁ | 117 |
క. | అల్లదె జాబిలి దన కీ, క ల్లిడు మని మ్రొక్కి నన్నుఁ గన్గిలిపెడి నో | 118 |
చ. | వెడవిలుకాఁడ పోఁకముడి విప్పకు గుబ్బలు ముట్ట రాకు క్రొ | |
| మ్ముడి సడలింపఁ బోకు జిగిమోవియు నానకు మే లయారె రే | 119 |
తే. | అపుడు నాశ్యామసాంద్రచంద్రాతపంబు, హాళిఁ బొడగాంచి చాల విరాళిమించి | 120 |
క. | రాజీవలాంఛనుఁడ వగు, రాజువు నీ విట్లు క్రోధరససహితుఁడ వై | 121 |
సీ. | క్షీరవారాశికి గారాపుకొమరుండ, వాదిలక్ష్మికిఁ బ్రియసోదరుఁడవు | |
తే. | విట్టినీ వయ్యయో నయ మింత లేక, సారెసారెకు నజ్ఞులచందమునను | 122 |
క. | శ్యామావధూప్రియుండవు, శ్యామలపక్షంబు నీకు సైఁప దటంచున్ | 123 |
సీ. | కువలయప్రియుఁ డని కొనియాడుటకుఁ జాలఁ, జక్రాహితత్వంబు సలుపకున్న | |
తే. | రాజశబ్దంబు నీకు స్వార్థముగఁ జెల్లుఁ, గాక యూరకె లోకాపకారి వగుచు | 124 |
క. | వీచి తమిం జక్రావళి, నేఁచెదు తెరువరులు సతులు నిల నడ లొందన్ | 125 |
చ. | గురువరవర్ణినీమణిని గూడినద్రోహి వటం చెఱింగియున్ | 126 |
సీ. | బడబానలంబుతో జడధిలోన మెలంగి, కాలకూటంబుతోఁ బైలు వెడలి | |
| రాహుదంష్ట్రాంకురోగ్రవిషాగ్నిఁ బెనఁకొని, ప్రతిమాసమును జండభానుఁ బొదివి | |
తే. | నట్టినీ వెవ్వరికి నైన నహహ మహిని, జల్లనై యుందు వను టెల్లఁ గల్ల గాదె | 127 |
సీ. | అర్జునాశుగలీల నలరుట కబ్జచ, క్రములఁ జేఁబట్టుట గాంచినావొ | |
తే. | కువలయోద్ధారకాభిఖ్యఁ గొఱలుటకును, గరుణ మీఱ వియోగులఁ గాచినావొ | 128 |
క. | హరునితల మట్టితిని గురు, తరుణిం బట్టితివి నీకు దైవము గురుఁడుం | 129 |
తే. | జనులు శ్రీతోడఁ బుట్టితివనుచు నిన్ను, నెన్నుదురు గాని యామర్మ మెఱుఁగ లేరు | 130 |
సీ. | చెలియలియింటిబల్సిరి యెల్ల హరియించి, తండ్రికి భంగంబు తగులుపఱచి | |
తే. | కుజనులను బెంపు సేయుచుఁ గొఱఁత లేక, తమిని విహరించు దుష్టవర్తనుఁడ వీవు | 131 |
తే. | గురునిసతిఁ గొని రమయింటిసిరి హరించి, చెలఁగి విషబిందుబృందముల్ చిలుకుచుండు | 132 |
తే. | సతుల నేఁచకు నీసౌరు సన్నముగను, గదిసి నినుఁ బట్టికొని పెద్దగాము మ్రింగ | 133 |
తే. | అనుచు సురనారి సరసీరుహారి దూఱి, కేరి తనుఁజేరి పూవులకోరు లేయు | 134 |
క. | వలఱేఁడ కడిఁదిసిరి గల, బలుదొరకొమరుఁడ నటంచు భామామణులం | |
| గలఁచకు నీపని యీశుఁడు, చలపట్టి యొకింతలోనె చక్కంజేయున్. | 135 |
సీ. | అచలకార్ముకము నారాయణాస్త్రంబును, బగడతాలుపునారి పుడమితేరు | |
తే. | జగమగండవు నీ విట్లు తగవు మాలి, భీరువులమీఁదఁ దొడరు టేపెద్దతనము | 136 |
క. | జగములకుఁ దల్లి దండ్రియు, నగుసిరికి న్హరికిఁ బుట్టినట్టిదొరవు నీ | 137 |
సీ. | వసుమతీజనుల సువర్ణకలాపము, ల్హరియించుతులువ నీవరసచివుఁడు | |
తే. | జాతివైరస్యగతుఁడు నీసంగడీఁడు, భళి మహాఘోరదురితాన్వితులరు మీరు | 138 |
తే. | అకట భవదంబ లాగృహంబుసిరి హ, రించుతెక్కలి శశి నాదరింపఁ బోకు | 139 |
సీ. | విషయలిప్తంబు లై వెలయునారాచంబు, లూరక మొఱయుచు నుండునారి | |
తే. | డొరుల కేరికిఁ గనఁబడకుండురూపు, దనరఁ బాంథులచిత్తవిత్తములు దోఁచు | 140 |
సీ. | హరికి బుత్రకుఁడ వై యవతరించుటయును, శివునిచేఁ బన్నంబు జెందుటయును | |
| వజితపరాశ్రాంతవాహుఁడ వగుటను, భయదాతనూద్వృత్తిఁ బరఁగుటయును | |
తే. | దలఁచి చూచిన నీకును ధర్మరాజు, నకును భేదం బిఁ కెద్ది యెన్నఁడు వియోగి | 141 |
సీ. | శిరమున నిద్దంపుఁజిన్నిక్రొన్నెల గాదు, పొలుపారు గేదంగిపువ్వు గాని | |
తే. | రహి నురమ్మున భుజగహారములు గావు, మల్లికాసూనపుష్పదామములు గాని | 142 |
వ. | అని మఱియుం గోపావేశంబున. | 143 |
సీ. | నెఱి మించి నీవిల్లు విఱిగి ధూళి నడంగ, మలయక నీరూపు మాసిపోను | |
తే. | నకట దర్పక ఘోరదర్పాతిరేక, మెనయఁ బని పూని విరహిణీజనవధంబు | 144 |
తే. | అని మనోభవు నాడి యయ్యలరుఁబోఁడి, వేఁడి మీఱఁగఁ బయిపయి వీచుచున్న | 145 |
క. | ఇల మరుదాఖ్యుఁడవు మహా, బలుఁడవు క్రూరుఁడవు నీకుఁ బౌరుష మే చలం | 146 |
తే. | విషధరము నిన్నుఁ గబళించి విడువ దానిఁ, జెనఁకి సాధింప నేమియుఁ జేతఁ గాక | 147 |
సీ. | మున్ను మహాబిలంబున సముద్భవ మొంది, శైలాగ్రమున నుండి బైలు వెడలి | |
తే. | చెలఁగి విహరించుగబ్బిబెబ్బులివి నీవు, దాడి మెఱయంగ భీరులఁ దఱము టరుదె | 148 |
ఉ. | మానక మానినీమణుల మాటికి నేఁచెదు నాలిగాడ్ప వై | 149 |
వ. | అని యనిలుఁ బలికి. | 150 |
సీ. | ఇలమీఁద నిల్వక యెగసి పోయెద వేమె, కీరమా నిన్ను సంకెలల వేయ | |
తే. | ఘనులఁ గన నోడి కడలకుఁ జనియె దేమె, యంచ నిను శ్వేతరుగ్భార మలమికొన న | 151 |
క. | ఆళీజను లపు డింతికి, హాళిని శిశిరోపచార మలరించి రొగిన్ | 152 |
సీ. | శైలస్తని యొకర్తు చందనగంధంబు, రంభోరు వొకతె కప్రపురజంబు | |
తే. | కలితశృంగారసరసి యొక్కతె మృణాళ, నాళశైవాలవల్లరిజాబకములు | 153 |
సీ. | బంగరుగిండ్లపైఁ బటిక పూసినరీతి, గబ్బిగుబ్బల మంచిగంద మలఁది | |
తే. | మేటితుమ్మెదగముల కామెతలు పెట్టు, కరణిఁ గురులను బుప్పొడి గలయఁ జల్లి | 154 |
తే. | మంచిగందంబు బూది యై మహిని రాలె, నింకె బన్నీరు చూత్కార మెసఁగ మేన | 155 |
క. | అపు డందు మదనమోహిని, చపలేక్షణ కేలువట్టి సరభసముగ నా | 156 |
సీ. | పూర్ణచంద్రోదయంబునఁ బోవ దింతయు, నెడప కంతంతకు హెచ్చుఁ గాని | |
తే. | నీలకంఠరసంబున వ్రీలి చనక, లోఁగఁ జేయు నహా యింక లోకనాథ | 157 |
వ. | అదియునుం గాక. | 158 |
సీ. | పొడ గానరాక పైఁబడుమనోభూతంబు, నుగ్రమంత్రంబుల నుడుపవలయు | |
తే. | గాక యుండిన నీతనుగ్లాని మాని, మానినీమణి యెట్లు సమ్మదము నొందు | 159 |
తే. | అట్లు మఱిమఱి శైత్యకృత్యము లొనర్ప, నంతకంతకు నగ్గలం బై మనోభ | 160 |
సీ. | వడగాడ్పులకుఁ దోడు కడుఁ జండ్రనిప్పులు, పైని బోయకురమ్మ పడఁతులార | |
తే. | కటకటా నేఁడె పగదీర నిటుల నేఁచఁ, జెల్లునె యటంచుఁ బల్మఱుఁ దల్లడిల్లు | 161 |
తే. | పులుల భూతంబులను బెద్ద చిలువగములఁ, దెచ్చి దరి నిల్పి బెదరింపఁ జొచ్చినా రి | |
| దేమి చెలులార యంచు బి ట్టెన్నుచుండు, శిఖిపికమృణాళములఁ జూచి చిగురుఁబోఁడి. | 162 |
వ. | అని మఱియును. | 163 |
సీ. | కనకాభిషేకంబు గావించి గద్దఱి, తేఁటికూటువులఁ బ్రార్థించరమ్మ | |
తే. | కాకయుండినఁ గొద లేనిఢాక మెఱయ, మూఁకలుగఁ గూడి దొసఁగుల ముంచుచుండు | 164 |
వ. | అని యిత్తెఱంగున మదనవేదనాభరాక్రాంత యై చింతిలునింతిం గనుంగొని కలంగి | 165 |
క. | కొమ నాము మీఱఁ బైకొని, సుమనారాచంబు లేసి స్రుక్కింపకు క్రూ | 166 |
క. | పంచముఖమధ్య యని బా, ధించెదు హరిమధ్య యీసతీమణి మదనా | 167 |
క. | పంచప్రాణంబులు నీ, వంచు న్మది నమ్మి యున్న యన్నులమిన్నన్ | 168 |
క. | మాతరుణీమణి నొకపెను, భూతమ వై సోఁకి యార్తిఁ బొదవించె దహా | 169 |
ఆ. | తల్లి పాఱవైచి తరల నన్యులపంఛ, బ్రతికి కూఁతవట్టి కొతుక కీవు | 170 |
క. | పసినిసు వగుమామగువల్, విసికింపకు మనుచు నెంత వేఁడినఁ బైపై | 171 |
ఆ. | పరులపంచఁ జేరి బ్రతికి పలాశవృ, త్తి మ్మెలంగుకోకిలమ్మునకుఁ బొ | 172 |
సీ. | బింబోష్ఠి యని నీవు పెనఁగ రాకు శుశంబ, సాంకవగంధి యీపంకజాక్షి | |
| పల్లవాంఘ్రి యటంచు బాధింపకు పికంబ, రామాంగి యీబిసప్రచయబాహ | |
తే. | యహిపరోమాళి యంచు డాయకుము నెమ్మి, కార్ముకభ్రూలతిక యీచొకారపుఁజెలి | 173 |
వ. | అబ్బోటికత్తియ లత్తఱి నబ్బిత్తరిం జూచి యిట్టు లనిరి. | 174 |
సీ. | మలయునెమ్మేను పెన్మంట నుక్కఱిపోయె, విలు పలుతునియ లై యిలను బడియెఁ | |
తే. | నింతి యిం కెక్కడిమరుం డొకింత యైన, నళుకు పూనక వానిపైఁ దలఁపు మాని | 175 |
వ. | అనిన నక్కుమారీమణి వారిం గని యి ట్లనియె. | 176 |
తే. | ప్రాణసఖులార నే నెంతపాపజాతి, రాతిగుండియదాననో రాతిరెల్లఁ | 177 |
ఉ. | కంతుదురాపతాపహతి గ్రాఁగుచు నజ్జగవన్నెకాఁడు న | 178 |
తే. | అకట నా చెల్మికై యతఁ డాసతోడఁ, జేరి వలరాచపనికి న న్గోరి వేఁడు | 179 |
తే. | కన్ను లలరార నవ్వన్నెకానిముద్దు, నెమ్మొగం బింక నెన్నఁడేనియు నొకపుడు | 180 |
క. | అక్కరుణానిధికౌఁగిటఁ, దక్కఁ బెనంగొననివలఁతితన మేల కడున్ | 181 |
వ. | అని మఱియు సైరింపరానిదుఃఖావేశంబున. | 182 |
తే. | వ్రీడవతి యేడ్చె నెలుఁగెత్తి వెక్కివెక్కి, యశ్రుపూరంబు కుచగిరు లంటి పాఱఁ | 183 |
తే. | అప్పు డబ్బాల నెదఁ జేర్చి యనుఁగుఁజెలులు, చీరచెఱఁగున వెడఁదకన్నీరు దుడిచి | 184 |
ఉ. | అమ్మకచెల్ల యిట్టు లెడరారఁగ నేమిటి కేడ్చెదమ్మ చొ | 185 |
తే. | సుదతి నిక్కంబు వినుము నీసోయగంబు, కన్ను లారంగఁ బొడగని చన్నకతన | 186 |
క. | వచ్చిన నతనికి నీకుం, జెచ్చెర సంగతి ఘటిల్లుఁ జెలు వలరఁగ ఱే | 187 |
వ. | అని యబ్బాలికాచూళికాలలామంబు నారీజనకదంబంబు మందమందమధురాలాపం | 188 |
మ. | కలుషాంభోధినిషంగ ఘోరతరసంగ్రామాంగణాభంగ భూ | 189 |
తోటకము. | పురదైత్యవిదారణ పుణ్యగుణా, శరదబ్జనిభాకృతి సాధుమతీ | 190 |
తరల. | సమరభీషణ సత్యభాషణ సర్పరాజవిభూషణా | 191 |
గద్యము. | ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రా | |