రసికజనమనోభిరామము
ద్వితీయాశ్వాసము
|
మద్ధరణీధరక
న్యామానసపద్మభృంగ నయగుణసంగా
సామజదనుజవిభంగా
కోమలభసితావృతాంగ కుక్కుటలింగా.
| 1
|
తే. |
అవధరింపుము కమలజుఁ డమరమౌని, శేఖరున కిట్టు లని వేడ్కఁ జెప్పఁదొడఁగె
నవ్విధమన ఋతుధ్వజక్ష్మాధినాథుఁ, డురుబలోపేతుఁ డై వని నుండుటయును.
| 2
|
లయగ్రాహి. |
అంతట వసంత మసురాంతకతనూభవదురంతనిశితప్రసవకుంతహృతపాంథ
స్వాంతము శుకీపికశకుంతకలనిస్వననిరంతరసమాకులదిగంత మసకృన్ని
ష్క్రాంతమధుపానమదదంతురితషట్చరణసంతతి విసృత్వరలతాంతము వనాంతా
శ్రాంతరతికాంతరణతాంతలలనాజననితాంతసుఖదానిలనిశాంతము దనర్చెన్.
| 3
|
క. |
శుకపికశారీమధులి, ట్ప్రకరమహానినదనిబిడబధరీకృతస
ర్వకకుప్పతికర్ణం బై, యకలంకగతిన్ ధరిత్రి నామని యొప్పెన్.
| 4
|
తే. |
జీర్ణపర్ణంబు లూడ్చి కెంజిగురుటాకు, జొంపములతోడఁ దరువులు సొం పెసఁగె వ
సంతురాక దలఁచి వనికాంతమెఱుఁగుఁ, దొడవు లెడలించి మణిభూష లిడె ననంగ.
| 5
|
క. |
కుసుమితశాల్మలు లపు డిం, పెసఁగె న్విరహిణుల గెలువ నేగుచు నెలమిన్
బిసరుహశరుఁ డంపించిన, పసఁ బొసఁగెడుతమ్మికెంపుపనితేరు లనన్.
| 6
|
సీ. |
శుకరాజమాగధప్రకరముల్ గీర్తింపఁ, గలకంఠకంఠకాహళులు మొరయఁ
బరిఫుల్లకింశుకకరదీపికలు గ్రాల, సాంద్రపరాగరజమ్ము గ్రమ్మ
సహకారపల్లవాంచత్కేతువులు మీఱ, సమదరోలంబసైన్యములు గొలువఁ
గేతకీగర్భదళాతతాస్త్రము లొప్పఁ, బృథుమరున్నినదభేరికలు చెలఁగఁ
|
|
తే. |
బ్రసవచంపకరథకదంబములు మెఱయ, దర్పకునితోడఁ గూడి చైత్రప్రభుండు
విరహిణీపాంథసందోహవిజయమునకు, హాళి దైవార నపుడు వాహ్యాళి వెడలె.
| 7
|
మ. |
బలవద్దర్పకవీరకాహళరవప్రాయంబు లై మించి సొం
పలరం బాంథనితంబినీజనఘనస్వాంతంబు లెంతేనియుం
గలఁచె న్బాలరసాలపల్లవలవగ్రాసావలేపోల్లస
త్కలకంఠప్రమదానిరంతరకుహూకారంబు లప్పట్టునన్.
| 8
|
క. |
మహిళాపున్నాగంబు, ల్రహిఁ గుసుమకదంబలీలఁ గ్రాలఁగ నచ్చో
మహిళాపున్నాగంబు, ల్రహిఁ గుసుమకదంబలీలలం గ్రాలెఁ గడున్.
| 9
|
తే. |
పవనదుశ్శాసనుఁడు వనీపాండవేయ, లలనజీర్ణచ్ఛదాంశుకంబులు హరింపఁ
గలికిశుకసూక్తిఁ జీరఁ గిసలయహేమ, మయపటము లీఁడె యయ్యెడ మాధవుండు.
| 10
|
సీ. |
శుకముఖద్విజమండలికి మహాఫలదుఁ డై, తవిలి వేమఱు మరుత్తతి భజింపఁ
గ్రూరపలాశసంహార మొనర్చుచు, సరసను బర్ణలాంఛనము మెఱయ
నాశ్రితాళులు నితాంతామోదమునఁ గ్రాలఁ, జెలఁగి వనప్రియశ్రేణి పొగడ
ఘనతరు ల్సుమనోవికాసలీల నెసంగిఁ, గలితశుభశ్రీప్రకర్ష వెలయ
|
|
తే. |
సమధికతరాగవహనప్రశస్తి యలర, వనజసాయకగురువైభవంబు నెఱపి
భవ్యవనమాలికాసముద్భాసి యగుచు, మహిమఁ జెన్నొందె నవ్వేళ మాధవుండు.
| 11
|
క. |
వనరమకు న్మాధవునకుఁ, దనరఁగఁ బరిణయ మొనర్పఁ దఱి యనుజవరా
లునిచినముత్తెపుఁబ్రా లన, మొనసి వనిం గ్రొత్తమల్లెమొగ్గలు దనరెన్.
| 12
|
క. |
రాగము చిగురాకున కను, రాగము బొజుఁగులకు ఘనపరాగము వనికిన్
రాగము మధుకరములకు స, రాగము గృహులకును గల్గె రహి నవ్వేళన్.
| 13
|
సీ. |
శుకనాదములు ద్విజశ్రుతిఘోషములు గాఁగఁ
దేఁటీపాటలు పురంధ్రీగీతములు గాఁగఁ, గిసలముల్ తోరణవిసరములు గాఁగఁ
బలుకప్పురంపుఁదిప్పలు వితర్దులు గాఁగఁ, బుప్పొడు ల్వలిగందపొడులు గాఁగఁ
దెలిమొల్లమొగ్గచాల్పులు తలఁబ్రా ల్గాఁగ, విరిదీఁగెపొదలు పందిరులు గాఁగఁ
|
|
తే. |
బుష్పితపలాశనికురుంబములు నివాళి, పళ్ళెములు గాఁగ నిర్భరపవనచలిత
తరువంబులు భద్రవాద్యములు గాఁగ, వనవధూమణిఁ జైత్రుఁ డుద్వాహమయ్యె.
| 14
|
సీ. |
వ్యాకీర్ణమదచంచరీకశిరోజయుఁ, బ్రచలితమంజరీకుచభరయును
గళదనూనమరందఘర్మాంబులేశయు, లతికాభుజాశ్లేషలాలసయును
బ్రకటితసంరక్తపల్లవాధరయు వి, స్రస్తప్రసవపరిష్కారమణియుఁ
|
|
|
గీరశారీరుతకింకిణీరవయు నం, చితసరఘాస్వనసీత్కృతియును
|
|
తే. |
నవపలాశద్రుకోరకనఖపదయును, గంధమారుతనిశ్వాసగాఢతరయు
నగుచు వనలక్ష్మి చైత్రసమాగమమున నలఘుసంభోగలాంఛనంబులఁ జెలంగె.
| 15
|
సీ. |
పల్లవశ్రేణి కబ్రంపురాగ మెసంగె, హితఫలంబులు ద్విజప్రతతి కొదవె
సుమనోవికాస మచ్చుగ భూజనుల కబ్బెఁ, జాఁగెఁ బల్మఱు మరుత్సంభ్రమములు
చండాలులకుఁ బొల్పెసఁగె మధుపానాప్తి, యమితరసాలకాండములు మెఱసెఁ
బ్రసవధర్మక్రియాపరత నొప్పిరి గృహుల్, ప్రబలె నర్చులు చిత్రభానునందుఁ
|
|
తే. |
గుంభినీవల్లభులకు మిక్కుటపుదాన, గుణము వాటిల్లెఁ ద్రిభువనప్రణుతనిఖిల
జంతుసంతానహృదయరంజకమనోజ్ఞ, లీల నలరువసంతర్తువేళయందు.
| 16
|
క. |
అపు డానృపుఁ డటఁ దరలెన్, విపినవిహారానుమోదవిచలితమతి యై
పనఘృణివిసరవిరహిత, విపథంబున నర్మసఖుఁడు వెంబడిఁ జనఁగన్.
| 17
|
వ. |
అట్లు దరలి దరీకుహరాంతరవిహరమాణాకుంఠకంఠీరవభైరవారవాకర్ణనాతిప్రకంపి
తాఖలహరిదంతదంతిసంతానంబును నిర్భరనికుంజసంజవనాంగణార్గళమార్గనిర్గతజా
గ్రన్మహోగ్రవ్యాఘ్రకోటిధాటికపలాయితరురుకురంగప్రముఖనిఖిలక్షుద్రమృగకులా
కులంబును మదోద్దండవేదండమండలగండస్థలనిస్సరద్దానధారాపూరాభిషిక్తాశేషప్రదే
శంబును బరస్పరభీకరాఘాతప్రభిన్నావయవస్రవద్రుధిరధారాప్రవాహపరివ్యాప్తవ
రాహవాహయితవ్యూహంబును బటుపటీరకూటస్ఫుటకోటీరకుటీరంతర్లగ్నభుగ్నభు
జంగపుంగవోత్తుంగఫణాగ్రరంగరంగన్మణిగణప్రభాభాసమానంబును నిబిడజంఝాస
మీరప్రేరితధావద్దావపావకాభీలజ్వాలాజాలజాజ్వల్యమాననానానోకహచ్ఛటాచ్ఛ
టచ్ఛటనినాదమేదురంబును సరససరఘావిసరకాదనావసరశిథిలపృథులమధుకోశవి
నిర్గలన్మధురసాసారవర్షోత్కర్షంబును నవారితమారుతానారతపూరితభూరితరవేణుని
నాదాకీర్ణంబును నభ్యర్ణధరాధరాధిత్యకాసముజ్ఝితస్ఫురత్సరిఝ్ఝరీతరఙ్గనిర్ఘోషనితాం
తగర్జారవమనీషాముహుర్నటదుత్కంఠనీలకంఠానీకాస్తోకకేకారవాక్రాంతంబును
విశంకటమృగయావిహారవిలాససముల్లసద్భిల్లపల్లవోష్ఠీనిష్ఠురాలాపకోలాహలధ్వాన
బదరీకృతరోదోంతరాళంబును బహుతరక్రూరోరగమృగఖగసంఘాతసంకులంబును
బహుశిలాకంటకావృతంబును బహువిచిత్రాకరంబు నగునమ్మహారణ్యబు చొచ్చి
విచ్చలవిడి నచ్చటివినోదంబులు గనుంగొనుచు జని చని ముందట.
| 18
|
మ. |
కనియె న్భూపకులాఢ్యుఁ డగ్రగవియద్గంగాతరంగోద్ధత
ధ్వనిసంఘాతనితాంతసంవృతమహాప్రత్యర్ధిశంకాముహు
|
|
|
ర్జనితతక్రోధరణన్మృగాధిపకులస్థాయద్దరీభాగమున్
ఘనగంభీరసరిఝ్ఝరీతటకటన్నాగంబు శీతాగమున్.
| 19
|
క. |
కని యన్నగాగ్రభాగం, బున కేగి తదీయచిత్రములు గనుఁగొనుచున్
మునుకొని తిరుగుచు నుండెన్, జనవరకుంజరుఁడు నర్మసచివుఁడు దానున్.
| 20
|
క. |
దరులం బూఁజప్పరముల, దరులన్ శృంగారశీలఁ దనరెడుకాకో
దరుల న్విద్యాధరసుం, దరులం బొడగాంచి యతఁ డెదం గడు నలరెన్.
| 21
|
సీ. |
భిల్లయోషిత్పదహల్లకోల్లిఖితకుం, కుమరసాంకితమణీకుట్టిమంబు
కాకోదరీకుచకలశద్వయీలిప్త, హారిద్రముద్రితాబ్జాకరంబు
కిన్నరీజనరతిక్రీడాంతరస్రస్త, కుసుమోత్కరాకీర్ణకుంజగృహము
దివిషద్వధూప్రతిదినదోహదక్రియా, వికసితామ్రాదికోర్వీరుహంబు
|
|
తే. |
ఖచరవరవర్ణినీకరకమలనిభృత, సురమహీజాతజాతప్రసూనరచిత
తతసుగంధాన్వితోదగ్రతాలవృంత, గంధవాహకిశోర మాక్ష్మాధరంబు.
| 22
|
సీ. |
అమరసరిత్కాంచనాబ్జపరాగసం, ఛన్నమహారత్నసానువులును
గ్రీడాసమాసక్తకిన్నరీచరణలా, క్షారసాంకితఝరీసైకతములు
గంధద్విరదఘటాకటగళదానవా, ర్బిందుసంసిక్తదరీతలములు
శుకశారీకాకోకపికరాజహంసమ, యూరస్వనోల్లసదుపవనములు
|
|
తే. |
సిద్ధవిద్యాధరోరగస్త్రీకుచాగ్ర, లిప్తహారిద్రచూర్ణసంక్లిష్టభూరి
వనాంచత్ప్రకృష్ణసరోవరములు, గనుఁగొని చెలంగె నప్పు డజ్జనవరుండు.
| 23
|
సీ. |
శిఖరాగ్రవిస్ఫురజ్జీమూతదర్శన, ప్రమదనృత్యన్మత్త ర్హిణములు
నిర్మలకాసారనీరనీరజనాళ, కబళనోద్ధతహంసికాకులములు
పరిఫుల్లమల్లికాప్రసవరసాస్వాద, నాలోలరోలంబజాలకములు
మృదులామ్రనూతనచ్ఛదచర్వణోన్మాద, కూజతోద్యదనేకకోకిలములు
|
|
తే. |
సారసహకారమంజరీసౌరభములు, కుందబృందాచ్ఛమరరందబిందుసహిత
శీతలస్ఫీతమృదువాతపోతములును, హర్ష మొనగూర్చె నృపతి కయ్యద్రియందు.
| 24
|
ఉ. |
క్రొన్నవతీవపందిరుల గొజ్జగినీటివెడందవాగులన్
వెన్నెలరాచరాచలువవిప్పుటరుంగులఁ గప్పురంపుబల్
దిన్నియల న్హొయ ల్మెఱయఁ ద్రిమ్మఱునచ్చరపువ్వుఁబోండ్లు రా
మిన్నకుఁ దద్ద వేడుకలు విూఱఁగఁ జేరిరి యన్నగంబునన్.
| 25
|
సీ. |
అశ్రాంతసుమనస్సమాజపూజితపాదుఁ, డవిరళకాళీసమన్వితుండు
|
|
|
రంగదత్తుంగభుజంగమకటకుఁ డ, ద్భుతచంద్రరేఖావిభూషణుండు
సదమలభృంగీశసంగీతనిరతుండు, శుకముఖద్విజగణసూక్తిహితుఁడు
నిరుపమానంతధనీశిరోభాగుండు, లాలితవృషరాజలాంఛనుండు
|
|
తే. |
సురుచిరాగమవాహుఁ డక్షుద్రమూర్తి, యఖిలశుభఫలదాయకుఁ డగ్గిరీశుఁ
డతులితామోద మొనగూర్చె నపుడు మిగుల, నద్ధరిత్రీశవంశచూడాగ్రమణికి.
| 26
|
సీ. |
గోత్రవర్గములోన గురుతరుం డగుబల్లి, దుండు వంశోద్ధారకుండు గాఁడె
బహుళగైరికసమభ్యంచితుం డగుప్రోడ, సతతకల్యాణభాజనము గాఁడె
యఖిలభూజనులఁ బాయక ప్రోచుధన్యాత్ముఁ, డురుఫలంబులు విప్రవరుల కీఁడె
తతవాహినీపరివృతుఁ డగునచలుండు, పరదళోన్మూలనప్రౌఢిఁ గనఁడె
|
|
తే. |
యౌర మేలిధరాధీశుఁ డసదృశప్ర, భావశోభితుఁ డై యెన్ఁబడియె నంచుఁ
బర్వతేంద్రుని నతితరప్రతిభ మెఱయఁ, బ్రస్తుతి యొనర్చునృపకులప్రవరుఁ డపుడు.
| 27
|
శా. |
తోరం బొప్ప నటించె నప్పుడు యత్కూలంకషోత్ఫుల్లక
ల్హారాంభోరుహహల్లకోత్పలసుగంధాశ్లిష్ట మాద్యన్మరు
ద్వారంబుల్ కుసుమాస్త్రసంగరనితాంతక్లిన్నవిద్యాధరీ
హారిస్థూలకుచాగ్రఘర్మజలలేశాంకూర మింకింపుచున్.
| 28
|
వ. |
అట్లు భువనాద్భుతకరాదఙ్రలీలావైభవంబులకుం బ ట్టైనయగ్గట్టుపై నారాచపట్టి నె
ట్టుకొని విహరించుచుండి యందు నొక్కచోట.
| 29
|
క. |
కనుఁగొనియె నెలమి దివిష, ద్వనితాకుచకుంభమిళితవరకస్తూరీ
ఘనసారచందనాగురు, ఘనసౌరభసంగ నభ్రగంగ న్మ్రోలన్.
| 30
|
క. |
కనుఁగొని హర్షాద్భుతములు, మనమున బెనఁగొనఁగ నాక్షమావరుఁడు గడున్
వినయంబున నాస్రోత, స్విని నిట్టు లటంచు వినతి సేయఁ దొడంగెన్.
| 31
|
సీ. |
జయజయ హరిపదజలజసంబంధిని, జయజయ గిరితనూజాసపత్ని
జయజయ కైలాసశైలవిహారిణి, జయజయ ఘోరదుష్కలుషదమని
జయజయ కైవల్యసౌఖ్యప్రదాయిని, జయజయ భవసాధ్యసంప్రశమని
జయజయ దేవతాసదనప్రచారిణి, జయజయ శంకరప్రియవధూటి
|
|
తే. |
జయ మహాదేవి భగవతి జయ సమస్త, భువనజనయిత్రి జయ నిశాధవపటీర
శరశరద్ఘనఘనసారసదృశగాత్రి, సకలకల్యాణసంధాత్రి జహ్నుపుత్త్రి.
| 32
|
మ. |
మదనారాతిజటాటవీతటనటన్మల్లీగుళుచ్ఛాకృతీ
త్రిదశాధీశపురానిశాధివసతీ దేవీ జగత్పావనీ
|
|
|
హృదయాహ్లాదకరీ నమజ్జనమనోభీష్టార్థసంధాయినీ
మది నెల్లప్పుడు సంస్మరింతు నిను నేమం బొప్ప మంచాకినీ.
| 33
|
మ. |
అవని న్మానవుఁ డెవ్వఁడేని భవదీయాలోలకల్లోలవా
ర్ణవసంసిక్తనిజప్రతీకుఁ డగు నాప్రాజ్ఞుం డమర్త్యేంద్రపూ
ర్ధవళాక్షీకరకంకణక్వణనమిశ్రప్రోల్లసచ్చామరో
ద్భవనిస్తంద్రమరుత్కిశోరములచేతం జొక్కుఁ బో జాహ్నవీ.
| 34
|
సీ. |
బ్రహ్మహత్యాదిదుర్భరమహాఘవిభంగ, ఘనతరతరళరంగత్తరంగ
విపులసైకతభాగవిలసితచక్రాంగ, హరజటాజూటకూటాగ్రరంగ
కనకారవిందసంగతచలన్మదభృంగ, సూరిజనస్తుతసుప్రసంగ
యమరీకుచాలిప్తహారిద్రసంసంగ, సతతసమాశ్రితశైలశృంగ
|
|
తే. |
యతిదయాపాంగ పుణ్యమయాంతరంగ, ప్రచురగంభీరనీరాంతరప్రమగ్న
మత్తమాతంగ నీకు నమస్కరింతు, దివ్యశోభాప్రదీప్తాంగ దివిజగంగ.
| 35
|
తే. |
పరుస మించుక సోఁకి యబ్రముగ నినుము, పసిఁడి యగునట్లు తావకప్రవిమలాంబు
కణ మొకించుక సోఁకిన ఖలజనుండు, మిగులఁ బరిశుద్ధుఁ డగుఁ గదా గగనతటిని.
| 36
|
చ. |
తమి నొకనాఁడు మానవుఁడు దవ్వులఁ దావకవీచికానినా
దము చెవిఁ గీలుకొల్పిన నతండు వినండు గదా సురాపగా
శమనలులాయకంఠపరిసర్పితభూరితరోగ్రఘంటికా
సముదయలోకభీకరవిశంకటసాంద్రఘణంఘణధ్వనుల్.
| 37
|
క. |
యోగిజనానందకరీ, యాగమసంస్తుతలసత్సదాంబుజయుగళీ
భోగాపవర్గదాయిని, భాగీరథి నేఁడు ననుఁ గృపం గనుఁగొనవే.
| 38
|
క. |
ధాతృపితృచరణతలసం, భూతా భువనప్రపూత బుధనుతసుగుణ
వ్రాతా విరజాసలిలో, పేతా నను ధన్యుఁ జేయవే గుహమాతా.
| 39
|
వ. |
అని యనేకప్రకారంబులం బ్రార్థించి తదంభఃపూరంబునఁ గృతావగాహుం డై సం
ధ్యాద్యనుష్ఠానక్రియాకలాపంబు నిర్వర్తించి తదంతికప్రదేశంబున విహరింపుచుండి
పురోభాగంబున నొక్కచోట.
| 40
|
తే. |
కనకమణిమయసోపానగర్భగేహ, కుట్టిమాకరమంటపకుడ్యగోపు
రేందుమణిపీఠికాసమన్వితమహేశ, భవన మొక్కటి గాంచె సంభ్రమ మెలర్ప.
| 41
|
తే. |
కాంచి యద్దేవలము ప్రవేశించి యందు, విమలతేజస్సమగ్రత వెలుఁగుచున్న
దివ్యలింగంబుఁ బొడగాంచి నవ్యభక్తి, యమరఁ గరపంకజాతయుగ్మము మొగిడ్చి.
| 42
|
సీ. |
కాలకాలాయ దిక్పాలపాలస్థక, స్తూరికాంకితపదాంభోరుహాయ
దేవదేవాయ రాజీవజన్మోగ్రదు, ర్గర్వనిర్వాపణకారణాయ
మారమారాయ సంసారవార్థినిమగ్న, సేవకోత్తారణనావికాయ
వామవామయ సౌదామనీదామస, మానమానితిజటామండలాయ
|
|
తే. |
శూలినే భూతకృపాశాలినే సు, శీలినే శశ్వదఘతూలకీలినే క
పాలినే విశ్వలోకైకపాలినే న, మో నమ యటంచుఁ గేల్మోడ్చి మ్రొక్కి మఱియు.
| 43
|
సీ. |
కరవీరమల్లికాకమలోత్పలములచే, రమణీయబిల్వదళములచేతఁ
గౌశికసామ్రణికాధూపములచేత, ఘనసారచందనాగరులచేత
సహకారకదళికాంచత్ఫలంబులచేత, నవ్యరసాలదండములచేత
మహనీయశర్కరామధురసంబులచేతఁ, బ్రచురహిమాంబుపూరములచేత
|
|
తే. |
భవ్యగంగావినిర్మలాంభస్సమేత, నారికేళోదకములచేఁ జారువీటి
కా సద్వస్తువితతిచే నాత్మఁ దద్ద, వేడుకలు మౌఱఁ బూజఁ గావించి యంత.
| 44
|
క. |
వికటాగ్రసంస్థితుం డై, ముకుళితకరకమలుఁ డగుచు మొగి నతఁడు మదిం
బ్రకట మగుభక్తిఁ గందా, ష్టకమున నద్దేవు నిట్లు సంస్తుతి చేసెన్.
| 45
|
కందాష్టకము
క. |
శ్రీమత్కలధౌతాచల, ధామ సుధాధామతిగ ధామసమీర
వ్యోమాంబుయజ్వపావక, భూమహితాకార నన్నుఁ బోషింపు శివా.
| 46
|
క. |
శైలసుతాలోల హృతా, భీలకృతాంతావలేప పృథుకరుణాసం
శీలా తతహేలా ధృత, శూలా వ్రతమూల నీకు జోహారు శివా.
| 47
|
క. |
యతిగణ్యామితపుణ్యా, న్వితఫణ్యాభరణ సతతనిలయీకృతప
ర్వతశృంగా ధృతగంగా, తతశృంగారాంగ నన్ను దయఁ జూడు శివా.
| 48
|
క. |
నారదదరపారదశర, శారదశరదభ్రకరితుషారాభ్రఝురీ
తారాహీతహీరామృత, ధారాసితదేహ నీకు దండంబు శివా.
| 49
|
క. |
కాలానలకీలావిల, హాలాహలభయవిచలితహరిదీశమహా
కోలాహలవేళాచల, లీలావిలసనుని నిన్ను లెక్కింతు శివా.
| 50
|
క. |
హాటకవర ఘోటకపుర, నాటకధరణీమణీభనవ్యాంబరగో
కోటీధనపేటీఘన, చేటీజన మబ్బు నిన్ను సేవింప శివా.
| 51
|
క. |
భీమా పరభీమా పుర, భామావరకంఠసూత్రభంగ సమంచ
ద్భామాశ్రితవామా హృత,కామా కృతకామ మాకు గతి నీవె శివా.
| 52
|
క. |
సురదానవవరమానవ, వరమానవమందహాసవదనాబ్జ మరు
|
|
|
ద్గిరిచాపా హరిరోపా, పరితాపాహరణ నిన్నె ప్రణుతింతు శివా.
| 53
|
కందమణిగణనికరవృత్తము
|
జయజయ పురహర జయ గిరిశయనా, జయ తలవినిభృతసదమలహరిణా
నయగుణవిలసిత నయశుభచయదా, జయ మునివరనుతచరణసరసిజా.
| 55
|
సగర్భస్రగ్విణీభుజంగప్రయాతద్రుతవిలంబితవృత్తసీసము
సీ. |
నిగమాశ్వభూసురానీకసంపూజ్యశుం, భత్ప్రభావా వృషపతితురంగ
సురుచికద్యోసరిజ్జూట ఖద్యోతసా, హస్రభాసా సమస్తాఘహరణ
జగతీశ మాసరస్పత్యుఘామాన్యచం, చత్కృపా నతజనశరణ్య
మానితహాసరమ్యాననాబ్జా లస, న్మంగళాత్మా నిశానాథమకుట
|
|
తే. |
హర సరీసృపహార భయాపహార, పురనిషూదన భూరివిభూతిదాన
హరిహయప్రణతాచ్ఛపదాంబుజాత, శరణు శంకర శాశ్వత సాధుపాల.
| 56
|
సగర్భమత్తేభకందసీసము
సీ. |
సమదవేదండనిశాచరోన్మథనభీ, మప్రౌఢదోర్విక్రమా కృపాబ్ధి
ప్రముదితానేకసుపర్వ నిర్మలగుణాం, భోధీ జగత్కారణా ధరేశ
లసదురోభాగనిలంబితోరగపతీ, సామప్రియా శంకరా మహాత్మ
ప్రపదరుగ్భూషితపాకజిన్మకుటశుం, భద్రత్నదివ్యప్రభా కపర్ది
|
|
తే. |
శివ నిఖిలలోకపాలన భవవిదళన, శరధితూణ భయహర విజయ ప్రవిమల
హృదయ శశిధర త్రిభువనహితసుచరిత, శమితపురదితిజవరా ప్రశస్తకీర్తి.
| 57
|
క. |
అని యనివారితభక్తిం, బ్రణుతించి మహేశుకరుణ వడసి కడున్ గొ
బ్బునఁ బ్రాసాదము వెలువడి, జనవరుఁడు తదంతికమునఁ జనియెడునెడలన్.
| 58
|
తే. |
సరసవైఖరిశ్రుతిపుటోత్సవము మీఱ, నాలకింపంగఁబడియె నత్యద్భుతముగ
సకలచేతనహృదయరంజకమనోజ్ఞ, మధురసంగీతరావంబు మలసి యెదుట.
| 59
|
క. |
ఆరవము విని నృప్రాగ్రణి, గారవపుంజెలిమికానిఁ గనుఁగొని యహహా
చేరువ నొకమృదుసంగీ, తారవము వినంగ నయ్యె నల్లదె వింటే.
| 60
|
ఉ. |
కిన్నరకన్యలో సురమృగీదృశలో గరుడాంబుజాక్షులో
పన్నగకాంతలో ఖతరభామలొ సిద్ధవధబటులో సుఖా
భ్యున్నతిఁ బాడఁ జొచ్చి రటఁ బోయి దిటంబుగ వారిచందముల్
సన్నకసన్న నారసి వెస న్మరలం జనుదెమ్ము నెచ్చెలీ.
| 61
|
క. |
వేమఱు మది కింపుగ గజ, గామిను లామనిగఁ బాడుగానము వినుచున్
సోమరితనమునఁ దడయక, సేమంబున మరలి యిపుడె చెచ్చెర రమ్మా.
| 62
|
ఉ. |
నావుడుఁ జెల్మికాఁడు నృపనందను వీడ్కొని వేడ్క నేగి శో
భావహలీలఁ గ్రాలునొకయబ్బురపుంబువుఁదోఁటఁ జొచ్చి య
త్తావునఁ బ్రోవు గూడి వితతంబుగఁ గ్రీడ యెనర్చుదివ్యరా
జీవముఖీలలామములఁ జిత్రగతిఁ బొడగాంచి వెండియున్.
| 63
|
మ. |
తరుమూలంబులపొంతఁ బొంచి సచినోత్తంసంబు వీక్షించె భా
స్వరకార్తస్వరవిగ్రహ న్సమదచంచచ్చంచరీకాలకన్
శరదిందుప్రతిమానచంద్రవదనం జక్రస్తని న్విస్ఫుర
త్సరసీజాతదళాయతాక్షి నొకకాంతాలోకచూడామణిన్.
| 64
|
తే. |
అట్లు వీక్షించి దానిసమగ్రభువన, మోహనాకారరేఖ కామోద మంది
యహహ యియ్యిందువదన యయ్యసమశరుని, భూరిసామ్రాజ్యలక్ష్మి గాఁబోలు భళిర.
| 65
|
చ. |
కులుకుమిటారిగుబ్బలును గొప్పపిఱుందును గావిమోవియుం
దెలినిడువాలుఁగన్నులును నిద్దపుముద్దుమొగంబు తళ్కుఁజె
క్కులు జిలుఁగుంగవు న్వెడఁద, క్రొమ్ముడియుం గలయీచొకారపుం
గలికియలంతిజవ్వనము కన్నులపండువ యయ్యె నియ్యెడన్.
| 66
|
క. |
చూడమె ముజ్జగములఁ గల, చేడియతలమానికములఁ జె న్నలరెడునీ
వ్రీడావతీకదంబక, చూడామణివంటిదానిఁ జూడ మొకందున్.
| 67
|
సీ. |
చందమామకు లోనఁ గం దొనర్చినతప్పు, పసిఁడికి దావిఁ గూర్పనికొఱంత
దొండపంటికిఁ దీపి నిండఁ జేయనిరట్టు, తొగలఁ బెన్మడుగునఁ ద్రోచువాదు
జక్కవపులుఁగుల జత విప్పునాడిక, మించుటద్దముల మాయించుకీడు
కరితుండములకు వక్రత యిడ్డ నేరమి, చివురులు గార్కొనఁ జేయురవ్వ
|
|
తే. |
మలుపుకొనఁ జాలు నద్దిరా జలజభవుఁడు, పూని యిమ్ముద్దుతలిరాకుఁబోఁడివదన
నురదాంశుక’లోచనస్తనకపోల, సక్థిపదయుగ్మకము సొం పెసఁగ నొనర్చి.
| 68
|
సీ. |
పలుకులు నేర్చిన తళుకుఁబుత్తబొమ్మ, జగతికి డిగ్గిన చంద్రరేఖ
నిలుకడఁ గాంచిన'తొలుకరిక్రొమ్మించు; తావి చేకుఱిననెత్తమ్మికెంపు
నెన్నడు పొదవినకన్నెమామిడిగున్న, తను వూని మెలఁగుకెందమ్మికొలను
|
|
|
నగవుఁజూ పలవడ్డ సొగసుఁగ్రొన్న నచెండు, చేష్ట లబ్బి మెలంగుచిత్రరేఖ
|
|
తే. |
గావలయు నియ్యబల దీనిగాఢకాంతి, రూపలావణ్యశుభవైఖరులు గరంబు
నమ్మహారాజునకుఁ దెల్పి యతిరయంబ, తోడుకొని వత్తు నని వేడ్కతోడ మరలె.
| 69
|
తే. |
మరలి చనుదెంచి యమ్మహీవరుని గాంచి, యంచితాలాపముల నిట్టులంచుఁ బలికె
భూతలాధీశ నీయాజ్ఞఁ బూని యిందుఁ, దరలి యొకయబ్బురపుఁద్రోవ నరిగి యవల.
| 70
|
సీ. |
పటికంపుదోనులఁ బరఁగుగొజ్జంగపూ, నీటిబల్జక్కర ల్దాఁటి దాఁటి
గుప్పుగుప్పునఁ దావు లుప్పతిల్లఁగఁ ద్రోవ, నెలయుకప్రపుఁదిప్ప లెక్కి యెక్కి
గాటంపునెఱపూఁతకమ్మసంపఁగిచెట్ల, నీడల నంతంత నిలిచి నిలిచి
యల్లబిల్లిగఁ బ్రాఁకి యెల్లతావుల బెల్లు, మీఱునేలకిపొద ల్దూఱి తూఱి
|
|
తే. |
తెమ్మ గ్రమ్మఁగఁ గడు నెడతెగక కురియు, నరిది విరిదేనెసోనలఁ బొరసి పొరసి
యొఱపులకు నెల్ల నిక్క యై వఱలునొక్క, మేటిచెలువంపువలిపువ్వుఁదోఁటఁ గంటి.
| 71
|
సీ. |
రామనామస్తుతిఁ గ్రాలి ఫలాహార, వృత్తిఁ జరించుశుకేంద్రములును
నీలకంఠాకృతి నెఱపుచు నానంద, తాండవం బాడుచంద్రకిచయంబు
నమృతాశయంబునఁ గమలజాన్వేషణే, చ్ఛం జెలంగుపరమహంసవ్రజంబు
వనములఁ బడి మాధవప్రసాదముఁ గోరు, కృష్ణవేషద్విజబృందములును
|
|
తే. |
సతతవివిధాగమాంతవాసనలవలన, నాద మెఱిఁగి నిరంతరామోదలీల
నలరుసిద్ధాళులును గల్గి యవ్వనంబు, గనుఁగొనఁగ నబ్ర మొదవించుఁ గద నృపాల.
| 72
|
క. |
ఆలీలావనమున ఘన, హేలామార్గమునఁ జెలఁగి యిమ్ముగ సుమనః
కేలీరతి నలరారెడు, బాలారత్నములఁ గంటి భావజరూపా.
| 73
|
ఉ. |
ఆమహిళాలలామములయందు రహిం బొడగంటి దివ్యశో
భామృదుతాసుగంధపరిభాసితరూపవిలాసలీలలన్
వేమఱు గోము మీఱి యరవిందశరాసనుచే వెలుంగుక్రొ
మ్మామిడిపండువంటియొకమత్తమతంగజరాజగామినిన్.
| 74
|
ఉ. |
ఆయెలనాగసోయగ మయారె గణింప నొకించుకైన న
త్తోయజసూతిసృష్టిఁ గలతోయరుహాననలందుఁ జెంద ద
క్కాయజుఁ డబ్బురంబుగ జగంబులు గెల్వఁగ నేర్చి యిడ్డనున్
జాయకటారి గావలయుఁ జామ నిఁ కేమని యెంతు భూవరా.
| 75
|
సీ. |
కలికి బంగరుబొమ్మ గాఁబోలుఁ గాకున్న, బరులనెమ్మది కాస పఱుపఁగలదె
కల్కి తొల్కరిమించు గాఁబోలుఁ గాకున్న, నెఱయఁ దళుక్కని మెఱయఁగలదె
కన్నె గేదఁగిపూవు గాఁబోలుఁ గాకున్న, జిలిబిలివలపులు చిలుకఁగలదె
కడిఁదివెన్నెలనిగ్గు గాఁబోలుఁ గాకున్నఁ, గువలయామోదంబు గూర్పఁగలదె
|
|
తే. |
మేలినెత్తమ్మికొలను గాఁబోలుఁ గాక, యున్న శృంగారరసయుక్తి నొనరఁగలదె
యహహ మనుజేశ మదనమాయాకిరాత, ముక్తలీలాకురంగి యమ్మోహనాంగి.
| 76
|
సీ. |
కలికిబిత్తరివాలుతళ్కుఁజూపులసౌరు, హరిణీవిలాసంబు పరిభవించుఁ
బడఁతియబ్బురపుఁబెందొడలనిగారింపు, రంభాపటుత్వంబురవళి గెల్చుఁ
గొమ్మనిద్దపుముద్దునెమ్మొగంబుహొరంగు, చంద్రరేఖాస్ఫూర్తిఁ జౌక సేయుఁ
జాననాడెంపునున్మేనిచొకాటంబు, హేమాతిశయలీల నెగ్గు లెన్ను
|
|
తే. |
సారసామోదసారశృంగారగిరమ, చిత్రరేఖాశుభాకృతిఁ జిన్నపుచ్చు
భళిర యాలేమ దేవతాభామ యేమొ, కాక యయ్యంద మిఁక నెందుఁ గలదు భువిని.
| 77
|
సీ. |
కలకంఠిజఘనంబు కాంచికాస్థానంబు, మధురామృతస్థలి మగువమోవి
యన్నులమిన్నపదాగ్రంబు కూర్మంబు, పడఁతుకజిల్గునెన్నడుము మాయ
నీలజీమూతంబు నెలఁతధమ్మిల్లంబు, రాకేందుముఖరోమరాజి కాశి
నలినలోచననిమ్ననాభి కేదారంబు, భామచన్దోయి శ్రీపర్వతంబు
|
|
తే. |
గాఁగ నృపచంద్ర సుక్షేత్రగరిమ నెపుడుఁ, జెలఁగుచున్నది దాని భజింపఁగలుగు
పరమపురుషున కత్యంతభాసమాన, నిరుపమానందసంసిద్ధి దొరకకున్నె.
| 78
|
సీ. |
అతివచెక్కులు గొప్పు నబ్దంబుల హసించుఁ, బదములు గళము నబ్జముల మించుఁ
బొలఁతినాభియుఁ గుచంబులుఁ ఒక్రముల గేరు, గమనంబు నారు నాగముల మీఱు
సతిమొగంబును నవ్వుఁ జంద్రస్ఫురణ నేలుఁ, దనురపచు ల్వలపు కాంచనముఁ బోలు
నువిదచూపుఁ బిఱుందుఁ గువలయంబు జయించు, రదనముల్ గౌను హీరముల నెంచు
|
|
తే. |
నధిప యయ్యన్నుమిన్న సోయగముఁ గన్న, ననిలసలిలచ్ఛదాహారు లగుచు వనులఁ
దద్దఁ గృశియించుజడదారిపెద్దలైన, దాలి మంతయుఁ దూలి విరాలిఁ గొనరె.
| 79
|
ఉ. |
చేరిక నెంత రాజుచెవిచెంగట వ్రేలుచు నున్ననీలముల్
కోరిక నచ్చకోరదృశ క్రొవ్వెదసామ్యముఁ జెంద నేర్చునే
యూరక సారెకు న్మొఱయుచుండుమధువ్రతకోటు లెంత ఝం
కారము చూపిన న్ద్విరదగామిని వేనలిఁ బోల నేర్చునే.
| 81
|
క. |
ఘన మొకతఱి నొక్కొకది, క్కున వృష్టి యొనర్చుఁ గాని కోమలి తుఱుమన్
ఘనము ఘన మగుచు నెల్లెడఁ, గొనకొని శృంగారరసము గురియు నృపాలా.
| 82
|
తే. |
ఉవిద నెమ్మోముదమ్మికి నోడి స్రుక్కి, తద్విరోధంబు సాధింపఁ దలఁచెఁ గాక
జనులకెల్లను గడుఁ జల్లఁందనముఁ జూపు, తొగలఱేఁ డబ్జముల కేల పగతుఁ డయ్యె.
| 83
|
క. |
అంగన కన్బొమకవతో, సింగిణు లెదిరించి గెలుపు చేకుఱ కవనిన్
వంగి శర మూని కడు నా, ర్తిం గొఱలుచు నుండెఁ జుమ్ము నృపకులతిలకా.
| 84
|
క. |
అచ్చాననాసతోడను, ఱిచ్చపడక మొనసి తుదిని ఱే కత్తి వడిన్
విచ్చెం జంపకముకుళము, చెచ్చెర మఱి నువ్వుఁబువ్వు స్నేహం బూసెన్.
| 85
|
క. |
అప్పొలఁతికన్నులందము, తప్పక కన్గొనుచు నుండి తగ బేడిసమీ
లెప్పుడు నత్తెఱఁ గలవడ, ఱెప్పలు మోడుపక యుండె ఱేపు న్మాపున్.
| 86
|
తే. |
మీలు మే లోర్వ లే కెంత మిట్టిపడిన, నేణము ల్త్రాణమై నెంత యెగిరిపడినఁ
దూపు లేపార నిల నెంత తూలిపడినఁ, జెలువనిడువాలుచూపుల గెలువఁగలవె.
| 87
|
క. |
మఱి మఱియుఁ దోమి తోమియు, మెఱుఁ గిడక వెలుంగ కుండు మృదుదర్పణముల్
తెఱవనునుఁచెక్కుఁగవ కె, త్తెఱఁగున నెన వచ్చు వసుమతీవరచంద్రా.
| 88
|
క. |
తామరసనేత్రవీనులతో మొనసి జయింపలేక త్రొక్కటమున నెం
తే మలకలఁ బడి స్రుక్కుచు, నేమఱు శష్కులులు గ్రాఁగి వేఁగుచునండున్.
| 89
|
సీ. |
ననఁబోఁడియధరంబునకు సాటి గా కేమొ, బంధుజీవకము నిగ్గరధ మయ్యెఁ
దెఱవమెఱుంగువాతెఱ కుద్ది గా కేమొ, కురువిందమణి త్రాసగుణము పూనెఁ
బొలఁతిరదచ్ఛదంబున కెన గా కేమొ, కఱు కూని చిగురాకు కారు పాఱె
శుకవాణిముద్దుమోవికి జోక గా కేమొ, సడలి బింబఫలంబు చప్పఁబడియె
|
|
తే. |
నంబుజేక్షణచక్కెరకెంబెదవికి, నీడు గా కేమొ విద్రుమం బెల్ల ప్రొద్దు
మ్రానుపడి యుండె నయ్యారె మాట లేటి, కన్ను దలమిన్నసోయగం బెన్న నరిది.
| 90
|
క. |
చిగురాకుఁబోఁడినునుఁగ్రొం, జిగిబిగిపలుచాల్పు దొడరి సేమంబున గె
ల్పు కొనం జాలక యెపుడును, మగరా ల్జగడాలు పూని మట్టం గ్రాలెన్.
| 91
|
తే. |
లేమగళమున కుద్దిగా లేక యోడి, సుడివడుచు లోన బిగి చెడి యడుగు వట్టి
దగము దరమూని మొద సేయ దాని కిపు డు, దర మనెడుపేరు విడువక తవిలియుండె.
| 92
|
తే. |
రతిమనోభవకేలి కారామసీమఁ, బొదలునవచూతలతలు గాఁబోలు దాని
బాహులత లట్లు గా కున్న బాణిపల్ల, వములు రాజిల నేర్చునే వానితుదల.
| 93
|
సీ. |
పట్టినప్పుడె కంది పస దప్పి కడుమెత్తఁ, బా టూనుక్రొన్ననబంతు లెనయె
|
|
|
పట్ట నబ్బక రెచ్చి పాఱి జో డెడవాసి, కలఁగెడుకొదమజక్కవలు తులయె
పట్టి నొక్కిన శిలాప్రాయంబు లై నును, గోరు నాటక యుండుకొండ లీడె
పట్టి రాచినయంత బలువన్నియల గరం, గెడు మేటిజాళువాగిండ్లు సరియె
|
|
తే. |
పట్టఁ బట్టఁగఁ దిరుగుడు పడుచు నుండు, మేలిరతనంపుపలుబొంగరాలు దొరయె
యహహ ధరణీశ యత్తలిరాకుఁబోఁడి, కులుకుసిబ్బెంపువలిగబ్బిగుబ్బకవకు.
| 94
|
క. |
నీలాహి యనుచుఁ దుమ్మెద, చా లనుచు న్నల్లచీమ చా లనుచు జనుల్
తోలుదురు గాని చెలిరో, మాళి ప్రజ న్గెలుచుమరునియసిధార సుమీ.
| 95
|
తే. |
చంపకామోదవళుల జయింపఁ బూని, యేటితరగలు పెల్లున నెగసి తద్దఁ
బెరిగి విఱుగుచు నుండె నిద్ధరణిలోన, నరయ జడభావులతెఱంగు లట్ల కావె.
| 96
|
క. |
సుడివడి కలఁగుచు స్రుక్కెడు, మడుఁగులు చెలి నాభి పోల్ప మాదిరి యగునే
యడవుల బొబ్బలు వెట్టుచు, నడలెడుహరు లింతికౌనునాకృతిఁ గనునే.
| 97
|
క. |
తరుణీమణిజఘనమునకు, దొర గాక తృణంబు వూని తుద లేక వసుం
ధర యొడితొడుగులఁ బడి మహి, దరములు చుట్టుపడి తావు దరలక యుండెన్.
| 98
|
తే. |
పొలఁతియూరుద్వయంబుతోఁ బోరి మున్ను, గెల్పు గొన లేక పొర యూని దళము లెలయఁ
గాచి యుండియు గెలఁ జేవ గలుగకుంట, నంటులకు నెల్లఁ దలవంపు లయ్యెఁ జుమ్మి.
| 99
|
క. |
లలనామణిపిఱుఁదులతోఁ, దుల యగుభ్రమ నుఱుక దిరుగఁ దొడఁగె రథాంగం
బులు మఱియుఁ గుప్ప వడుచుం, బులినంబులు మెత్తఁబాటుఁ బూనెం జుమ్మీ.
| 100
|
తే. |
కలమగర్భంబులో మహోత్పలదళాక్షి, పిక్కలకు నోడి తద్దయుఁ బీఁకెపాఱి
వెన్ను చూపి తృణం బూని యెన్నరాని, నానఁ దలవంచుచుండె ననారతంబు.
| 101
|
తే. |
పొలఁతిమీఁగాళ్లతో నెనఁ బోలలేని, మోస మొదవిన వంతులు మునిఁగి మునిఁగి
మాటిమాటికి మేటితాఁబేటిదాఁటు, గుట్టు చెడి పొట్టలోఁ దలఁ గ్రుక్కుకొనియె.
| 102
|
చ. |
రమణిపదద్వయంబుసరి రా నెదఁ గోరి యనేకకల్పముల్
కమలము కంఠగాత్రగత గాఁగ జలంబుల నర్కువేఁడి యం
దమితవిభాసుగంధమృదుతామలతల్ కమలాకరత్వముం
గమలభవాస్పదత్వమును గాంచి తదంఘ్రులఁ బోల దింతయున్.
| 103
|
తే. |
జలరుహేక్షణపదనఖంబులను బోలఁ, జాల కెంతయు రిక్కచా ల్బేలపడియెఁ
గరనఖములకుఁ గేతకీగర్భదళము, లోడి కంటకభావంబు వీడ కుండె.
| 104
|
తే. |
బాలతనుకాంతితో సాటి పోలఁ గోరి, పృథ్వి ననలప్రవేశంబు పెక్కుమాఱ్లు
చేసి యెఱపులఁబడెఁ గాని వీస మైనఁ, బోలఁగాఁ జాలదయ్యె జాంబూనదంబు.
| 105
|
సీ. |
వ్యాళము ల్దల వంచి, నేలఁ జాగిలఁబడెఁ, బూని నీలపురాలు పూరిఁ గఱచె
నద్రులు పాదంబులాడక పడియుండె, వాలెంబు నేనుఁగుల్ గేలు మోడ్చె
బెదరి చూచుచు లేళ్లు చెదరి పాఱఁ దొడంగె, నీరజంబులు లోతునీటఁ బడియెఁ
గోయిలమూఁకలు గొదకొని చె ట్టెక్కె, సింగముల్ గుహల నడంగి డాఁగె
|
|
తే. |
నవనినాయక నిఖిలలోకాద్భుతాభి, నవవిలాసవిభాసమున్నతిఁ దనర్చు
కలికిరోమాళికచకుచగమననయన, ముఖవచోమధ్యములతోడ మొనసి యోడి.
| 106
|
మ. |
పలుగు ల్వేయు నిఁకేల భూరమణ యాబంగారు ల్బొమ్మ యా
వలికప్రంపుటనంటిక్రొమ్మొలక యావాల్గంటి యాశ్యామ యా
యలివేణీజనచూళికాభరణ మయ్యంభోజపత్రాక్షి యా
తలిరుంబ్రాయపుఁగల్కిరాచిలుక యాతన్వంగి నీకే తగున్.
| 107
|
క. |
అని సంగడికాఁ డెఱిఁగిం, చిన విని యత్యంతముదితచిత్తుం డగుచున్
జనవరుఁ డటఁ దరలి రయం, బునఁ జనియె వధూటిఁ జూచుబులు పెదఁ బొదలన్.
| 108
|
క. |
చని చని వని వనితం బెనఁ, కొన మోహం బంతకంతకు న్మనమున నూ
ల్కొన నజ్జనపతి సఖునిం, గనులొని యి ట్లనియె నర్మగర్భము గాఁగన్.
| 109
|
చ. |
కనుఁగొను సంగడీఁడ వనకన్యకుఁ గాలభుజంగుఁ డిడ్డనూ
తననఖరేఖలో యనఁగఁ దద్దయు మోదుగమొగ్గ లొప్పెడిన్
జనవర నీవు నవ్వికచసారసలోచనగుబ్బదోయిపై
దనగునఖాంకురాంకములు దద్దయు నించెదు కూర్మి మీఱఁగన్.
| 110
|
తే. |
అలరుగుత్తులపై వ్రాలి యదె మరంద, మానుచున్నది మగతేఁటి యనఁగ చూడు
సామి యాలేమకుచగుళుచ్ఛములమీఁద, వ్రాలి కెమ్మోవితేనియ గ్రోలె దీవు.
| 111
|
క. |
చెలికాఁడ గండుఁగోయిల, నలిఁ గెందలిరాకు గం ట్లొనర్చెడుఁ గంటే
భళిభళి యచ్చెలివాతెఱఁ, బలుగం ట్లొనరించె దీవుఁ బ్రమదమున నృపా.
| 112
|
క. |
పున్నాగముతోఁ బెనఁకొను, చున్నది లతకూన చూడు మోహో సఖుఁడా
పున్నాగమ నీతో న, చ్చిన్నెలక్రొందీఁగఁబోఁడి చెలిమి బెనంగున్.
| 113
|
చ. |
పలుమఱు గీరదంపతులు భావభవప్రధనక్రియారతిన్
మెలఁగుచు మింటిదాఁకఁ బొదమిద్దియఁ గేరెడుఁ జూడు నెచ్చెలీ
భళిభళి రాజచంద్ర యల పంకజపత్రవిశాలలోచనం
|
|
|
గలసి సువర్ణగేహమునఁ గామసుఖోన్నతిఁ గేరె దీ విఁకన్.
| 114
|
క. |
కప్పురపుబూది పైపై, గప్పుచు నున్నది యనంటిఁ గనుఁగొనుము సఖా
యప్పొలఁతి సురతవేళలఁ, గప్పును నీమేన వలపుఁ గప్పుర మధిపా.
| 115
|
క. |
కలరవ మల్లదె యింపుగఁ, బలుకుచు నున్నయది చూడు ప్రాణసఖా నిన్
గలసి రతికేళివేళల, గళరవ మొనరించు నట్లు కలికి నృపాలా.
| 116
|
క. |
పలుమఱుఁ బూఁదేనెలు మెయిఁ, జిలికెడు నిదె చూడు పొగడ చెలికాఁడ మహీ
తలనాథ నీపయిన్ హిమ, జలపూరం బిట్లు లలన చల్లెడుఁ జుమ్మీ.
| 117
|
క. |
లికుచము లివె చూడుము కే, లికి సొం పొనరింపఁ జాఁగె లీలాసఖుఁడా
యెకీమీఁడ యల్ల జవరా, లికుచంబులు నిట్టు లలరులే నీచేతన్.
| 118
|
తే. |
హరిణి నల్లదె కాంచు మొయ్యన వయస్య, పట్ట నబ్బక వడి లేచి పఱచుచున్న
దహహ ధరణీశ యమ్మనోహరవిలాస, హరిణి నీ కబ్రముగఁ జేతి కబ్బుఁ జుమ్మ.
| 119
|
తే. |
అనుచు నర్మోక్తు లాడుచు నవనిజాని, వనపదవినోదములు గనుంగొనుచు నుండె
ననిన విని దేవముని నల్వ నవలికతయుఁ, దెలుపవే యని తవిలి ప్రార్థించుటయును.
| 120
|
మ. |
దళితారాతినిశాట భాసురవియ్యద్గంగాజటాజూట మం
జులరాజార్ధకిరీట ఘోరసమరక్షోణీనిరాఘాట ని
స్తులవేదత్రయ ఘోట పాణితమహాదోషాటవీఝాట ని
ర్మలధౌతాచలకూట దుష్టపలభుగ్భ్రామ్యత్పురోఘాటనా.
| 121
|
క. |
డిండీరపుండరీకా, ఖండలశుండాలచంద్ర ఖండపయశ్శ్రీ
ఖండాఖండయశోవృత, కుండలిమండలవిభూష కుక్కుటవేషా.
| 122
|
మాలిని. |
కథితశుభచరిత్రా గ్రావకన్యాకళత్రా
మథితవిమతగోత్రా మౌనిసంస్తోత్రపాత్రా
ప్రథనదితిజజైత్రా భక్తచిత్తాబ్జమిత్రా
పృథులధవళగాత్రా భీకరోగ్రాగ్నినేత్రా.
| 123
|
గద్యము. |
ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రా
జ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచిగంగానామాత్యపు
త్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవిసార్వభౌమప్రణీతం బ
యిన రసికజనమనోభిరామం బనుశృంగారరసప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.
|
|