Jump to content

యెంకి పాటలు/సుక్క

వికీసోర్స్ నుండి

సుక్క

సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ!
బారెడైనా కొండ పైకి సాగిందేమొ!
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ!......
తాను నిలిపిన గడువు దాటిపోనేలేదు_
కాలు సేతులు పక్క కంటుకొని పోనాయి!
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ!......
సుక్కతోనే కొండ లెక్కొత్తు నన్నాడు_
మబ్బొ, మనిసో, కొండ మలుపు పరకాయించి!
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ!......
వొకటొకటిగా మెట్లు వొదిగి దిగిరావాలి_
తోటయెలపల గలగలేటొ యిననీవమ్మ!
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ!......
నా సొగసు నన్నైన సూసుకోనీడమ్మ_
ఆవు మెళ్లో మువ్వలట్టె మోగినవేటె!
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ!......
*