యెంకి పాటలు/రావొద్దె

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రావొద్దె!

రావొద్దె నాపక్క రావద్దె యెంకీ!
ఆపొద్దె మనపొత్తు లయిపోయెనెంకీ!
నీ మీద పాణాలు నిలుపు కొంటా వొచ్చి,
అద్ద రేతిర్లోనె అడివంత తిరిగానె !!

రావొద్దె నా పక్క రావొద్దె యెంకీ !
ఆపొద్దె మనపొత్తు లయిపోయెనెంకీ!
గట్టెక్కి సూశాను ! పుట్టెక్కి సూశానె !
కల్ల కపటము లేని పిల్ల వను కున్నానె !!!

రావొద్దె నా పక్క రావొద్దె యెంకీ !
ఆపొద్దె మనపొత్తు లయిపోయెనెంకీ!
యేడ నువ్వుండావొ యేళ్ళన్ని యీదానె !!!
యేటి సేస్తుండావొ యీశ్శరు ణ్ణడిగానె !!!

రావొద్దె నాపక్క రావొద్దె యెంకీ!
ఆపొద్దె మనపొత్తు లయిపోయెనెంకీ!