యెంకి పాటలు/యెంకితో తిరపతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యెంకితో తిరపతి

యెంకీ, నాతోటి రాయే!
మన
యెంకటేశరుణ్ణి యెల్లీ సూసొద్దాము !

ఆవుల్ని దూడల్ని
అత్తోరి కాడుంచి,
మూటా ముల్లీ గట్టి,
ముసిలోళ్ళతో సెప్పి,
యెంకీ, నాతోటీ రాయే......

ఆ సామి మీ దేటొ
వూసూ లాడూకొంట,
కొండ మెట్లన్నీ నీ
కొంగట్టు కెక్కాలి,
యెంకీ, నాతోటి రాయే......

'రేతిరి పగటేల
రెప్పెయ్య కెంకీని
సల్లంగ సూడ' మని
సామితో జెప్పాలి,
యెంకీ నాతోటి రాయే......