యెంకి పాటలు/తబ్బిబ్బు
స్వరూపం
తబ్బిబ్బు
రవల వెలుగుల గంగ రమ్మందిరా_
యెంకి
శివమెత్తి తానాలు చేసిందిరా!
సిరులతో ముత్యాల
సరుల చెల్లాటతో
సిరిసిరీ మువ్వలా
చిందులాగంతులూ
రవల వెలుగుల గంగ రమ్మందిరా_
యెంకి
శివమెత్తి తానాలు చేసిందిరా!
సికలోన సికకలిపి
మొకము మొకమూ కలిపి,
వెలుగు దేవతకు చ
క్కిలిగింత లెట్టింది!
రవల వెలుగుల గంగ రమ్మందిరా_
యెంకి
శివమెత్తి తానాలు చేసిందిరా!
నీలలో మునిగింది
తేలింది వెలుగుతో_
మబ్బు సెందురుడల్లె
మనిసిలో మనసల్లె!
రవల వెలుగుల గంగ రమ్మందిరా_
యెంకి
శివమెత్తి తానాలు చేసిందిరా!
కాళిదేవుని యెదుట
గరవాన నిలిసింది_
తల తడుముకొని తానె
తబ్బిబ్బులైనాడు!
రవల వెలుగుల గంగ రమ్మందిరా_
యెంకి
శివమెత్తి తానాలు చేసిందిరా!
*