మీఁగడ తఱకలు/సాతవాహనులు

వికీసోర్స్ నుండి

1

సాతవాహనులు

సాతవాహను లంధ్రులు గా రని వాదించువారు గొందఱు గలరు. సాతవాహన రాజులలోఁ బ్రఖ్యాతి గన్నవారు, కుంతల దేశమందలి ప్రతిష్ఠాన పట్టణము రాజధానిగాఁ గుంతల సౌరాష్ట్ర మహారాష్ట్రాది దేశములనే పాలించినట్లు శాసనములందు గానవచ్చుటయు నంధ్రదేశమును పాలించినట్లు గానరాకుండుటయు వారి వాదమునకుఁ బ్రబలసాధనము. పురాణములందు వా రంధ్రులుగాఁ బేర్కొనఁబడిరి. ఇది పై వాదమునకుఁ బ్రబల బాధకమే యయినను వారు దీనిని బుక్కిటి పురాణపు మాటగాఁ ద్రోసివేయఁజూతురు. ప్రాచీన సాతవాహను లంధ్రదేశమును బరిపాలించి రనుట కాధారములు లేవా? విచారింతము.

నాసిక, కార్లి మొదలగు చోట్ల గుహలలోఁగల సాతవాహన శాసనములలో వాసిష్ఠీ పుత్రపులుమావిశాసనములు ముఖ్యమయినవి. వానిని బట్టియే పయి వాదమును, పి.టి.శ్రీనివాయ్యంగారు, సూక్తంకరుఁడు, సుబ్రహ్మణ్యయ్యరు ప్రభృతులు, నెలకొల్పిరి[1]. అందు వారి వాదమున కాధారమయిన పట్టిది. -"రాజరాజ్ఞో గోతమీ పుతస, హిమవత మేరు మందర పవత సమసారస, అసిక, అసక, ముళక, సురర, కుకురా పరంత అనుపవిదభ అకరావతి రాజస, విఝ, చవత, పారిచాత, సహ్య, కణ్హగిరి, మచ, సిరిటన, మలయ మహింద, సెటగిరి, చకోరపవత పతిస," దీని సంస్కృతచ్చాయ. - రాజరాజస్య గౌతమీపుత్రస్య హిమవన్మేరు మందరపర్వతసమసారస్య, అసిక, అశ్వక, ముళక, సురాష్ట్ర, కుకురాపరాం  తానూప విదర్భాక రావంతి రాజస్య, వింధ్య ఋక్షవత పారియాత్ర సహ్య కృష్ణగిరి మఞ్చ శ్రీస్థాన మలయ మహేన్ద్ర శ్వేతగిరి చకోర పర్వత పతేః[2]. భాండారకర పండితుcడు, బూలరు పండితుcడు, భగవాన్‌లాల్, ఇంద్రాజీ పండితుండు మొదలగువారు పలుమార్లు పయి శాసనమును బరిశోధించి ప్రకటించిరట! ఇందులో బేర్కొనఁబడిన దేశములను బర్వతములను, వారు గుర్తించిరి. కాని యూయెల్లరకుcగూడ, ముళక దేశమేదో తెలియరాలేదట! ఒకరు ముళక మును 'ముండ్లక మునుగా సంస్కరింపవలె ననిరట! ఇంకొకరు సంస్కరింపకుండనే, ముళకు' లే 'ముండకు' లగుదు రనుట కాధారములఁ జూపిరట! ఈ తలపోఁతలలో మునిఁగి యాముళకదేశ మేదో వారు గుర్తింపcజాలక పోయిరి.

ఈ తలపోఁతలలోఁగూడఁగొంత వింత విషయ మున్నది. అది కడపటం దెలుపదును పయిశాసనమునఁ బేర్కొనఁబడిన ముళకదేశము నేఁడు ములికినాఁ డనఁబడు దేశమే యని నేను నిశ్చయించుచున్నాం డను. నేఁటి యంధ్రదేశము ప్రాచీనకాలమున వేంగీదేశముగాను ముళక దేశముగాను బేర్వెలసి యుండెను. కడప, కరూలు, బళ్లారి, నైజామురాజ్యములోC గొంత, యూనాఁడు ములకనాడుగా నుండెను. ములకనాటికి శ్రీగిరి నడిబొడ్డు. రాజ్యములు, రాజధానులు మాఱుటలో ఈ నాళ్ల ప్రాముఖ్యమును, బరిమాణమును మాఱినవి. ఈ విషయమును బ్రబలముగా నిరూపించుట కిక్కడ చోటు చాలదు. పల్నాడు శ్రీనాథునినాఁడు గూడ ములికినా డనువ్యవహారము నందుచుండెననుట కాధారముగలదు. క్రీడాభిరామమందలి యీ క్రింది పద్యముఁ జదువందగును.

ఉ|| చిత్తముగూర్చి మాచెరలచెన్నుఁడు శ్రీగిరిలింగముం గృపా
     యత్తతఁ జూడ ముల్కివిషయంబున కా మహిమంబు చెల్లెఁ గా
     కుత్తరలోన మింట జల ముట్టిన మాత్రన నాపఱాలలో
     విత్తిన యావనాళ మభివృద్ధి ఫలించుట యెట్లు చెప్పుఁడా!

ముళక దేశము సాతవాహనుల యేల్బడిలో నుండుటచేతనే వారు శ్రీస్థాన' మునకును బతులయిరి. శ్రీస్థాన మనంగా శ్రీశైలమే. పర్వతములపేళ్ల వరుసలో నున్నది గాన యది శ్రీశైలమేయగును. అయినను గొందఱు సందేహించుచున్నారంట! ఏకప్రమాద మనేకప్రమాదములకుఁ గారణ మగుట నిక్కడం జూడఁదగును. ముళక దేశమును గుర్తింపక పోవుటచేతనే వారు శ్రీస్థాన మనంగా శ్రీశైలమగు నని నిశ్చయింపఁ జాలక సందేహింపవలసినవారయిరి. అగును. ప్రత్యంతదేశమున కేలికలు గాక యాపర్వతమునకుమాత్రము వా రెట్లు పతులు గాంగల్లుదురు? పర్వతముమీఁది కాకాశయానమున రాకపోకలు జరపుచు ప్రభుత్వమును నెఱపుకొనుచుండినట్లు తలఁపవలెనా? ఈ యసంగతియే శ్రీస్థానము శ్రీశైలము గాకపోవచ్చు ననునపోహమును బుట్టించినది. మటియు నాసికగుహలోనే కల వాసిష్ఠీపుత్ర పులుమావి శాసనాంతరమున ధనకట' భిక్షులకు దానము చేసినట్టు కలదు. ఈ ధనకటమును ధనకటక (ధరణికోట) మని తలంచుటకుఁ గూడఁగొందఱు సందేహించిరంట! ఇది మూఁడవ ప్రమాదము. ధనకటకమున ననేక సహస్రసంఖ్యాకు లగుబౌద్ధభిక్షకు లుండి రని హ్యూన్త్సాంగు వ్రాఁతలు తెలుపుచున్నవి. అంత ప్రసిద్ధమయిన మన ధనకటమునుగూర్చికూడ సందేహించుటకుఁ గారణము వా రంధ్రదేశమును బాలించి రన్నవిషయమును గుర్తింపక పోవుటే యగును.

బళ్లారిజిల్లా మాయక్టోనిలోను, హిరహడగళ్లిలోను దొరకిన పల్లవ (శివస్కందవర్మ) శాసనములలో సాతవాహనిహార మని సాతాహనిరట్ట' మని (సాతవాహనహారము, సాతవాహనరాష్ట్రము) పేళ్లున్నవి. ఆపేళ్లా శాసనములు దొరికిన స్థలమునకుఁజెందినవేయని యందఱు నంగీకరింతురు అందొక గ్రామము పేరు 'చిల్లరేక కోడుంక, నేఁడు తెల్లుదేశమున 'చిల్లరిగె యింటిపేరు గల బ్రాహ్మణు లున్నారు. వారు మాధ్వులు. బళ్లారిజిల్లాలో చిల్లరిగెయను గ్రామము గలదేమో! పయి శాసనములోని చిల్లరేక చిల్లరిగె కావచ్చు నని నా తలంపు. బళ్లారిమండలము సాతవాహన రాష్ట్రమయి యుండంగా సాతవాహను లంధ్రు లగుట సంగతమేకాదా? కాని యీ శాసనములు క్రీ. తర్వాత మూCడవశతాబ్దిలోనివిగాన, అప్పటికి సాతవాహను లాయల్పదేశముఁ బాలించుచున్నట్లు తలఁపవలె నందురట! ఇది యెంతయు నసంగతము. శివస్కందవర్మ దానముచేయునప్ప డాదేశము శివస్కందవర్మపాలితమే యగునుగాని సాతవాహనపాలితము గాదు. శివస్కందవర్మ యూదేశమునకుఁ బారంపర్యముగా వాడుకలో నున్న పేరిని (సాతవాహన రాష్టమని) పేర్కొన్నాండు గాని యానామ మానాఁడే పుట్టినదికాదు. ఆనాఁటి కనేకదేశములు సాతవాహనరాజ పాలితములుగా నుండినను సాతవాహనరాష్ట్రమని విశిష్టనామ ముండుట, బళ్లారి ప్రాంత దేశమున కా సాతవాహనుల ప్రాచీన ప్రధానపాలితదేశత్వమును నిరూపించుచుండుట లేదా? ఈ శాసనములఁబట్టి సాతవాహనులు తొలుత, ముళకదేశమునో, యందలి యేకదేశమగు బళ్లారిప్రాంతమునో పాలించినట్లును, దానికే సాతవాహనరాష్ట్ర మని, సాతవాహనహార మని పేరయినట్లును దలCపవలసియుండును. అట్లు దలCపకుండుట నాల్గవప్రమాదము. తొలుత వారు వేంగీదేశమును బాలించుచున్న యంధ్రరాజు లగునిక్ష్వాకురాజులకు భృత్యు లయియుందురు. ఈ కారణముచేతనే కొన్ని పురాణములలో సాతవాహను లంధ్రభృత్యు లని పేర్కొనఁబడి యుందురు. క్రమశః ప్రబలులై కర్ణాటదేశమెల్లనేలియుందురు. ఈ కర్ణి రాజులపేరనే కర్ణినాండు' అని దేశనామ మేర్పడి, మార్పులుచెంది కన్నడ, కర్ణాట రూపములఁ జెందియుండవచ్చును. మైసూరు తల్కొండ స్టేటులో స్థానకుండూర శివాలయ శిలాశాసనమున "సాతకర్ణి పూజించిన యాలయములోc దాను పూజచేయుచు" న్నట్టు అర్చకుఁడు వ్రాసికొన్నాడు. ఇట్లు వారు క్రమముగాC బ్రాబల్యముఁజెంది, కుంతల ఘూర్జర మహారాష్ట్రాది దేశములను జయించి, క్రొత్తగా జయించినదేశముల పరిపాలనపౌకర్యమునకై గోదావరీతీరమునం గుంతలదేశమునం బ్రతిష్టానము కల్పించుకొని యుందురు. అట్లు ప్రతిష్టానముఁ బడయుటచేతనే యా రాజధానికిఁ బ్రతిష్టాన మని పేరయ్యెను. జాతక కథలు, పద్మ, కూర్మ, లింగ, భవిష్య పురాణములు, రామాయణోత్తరకాండము, కథాసరిత్సాగరము, మహాభారతము, విక్రమోర్వశీయము, ప్రతిష్టానమును ప్రశంసించుచున్నవి. ప్రతిష్టాననామము సాతవాహనరాజకల్పిత మని నానమ్మకము. ప్రతిష్టానమనురాజధానీనామమే యంధ్రభృత్యులుగా నున్న వా రంధ్రులగుటను, అది క్రొత్తగా నెలకొల్పCబడిన రాజధానియగుటను సూచించుచున్నది. ప్రతిష్టానమున నుండఁగా వీరు శకరాజులచేఁ గొంత తాఁకిడిం బడిరి. కొంత యుత్తరరాజ్యమును గోల్పోయిరి. అప్పడు ధనకటకమునుగూడ వీ రుపరాజధానిగాఁ జేసికొనిరి. ఇక్ష్వాకు లప్పటికి దుర్బలులయి యుందురు, అనేకాధ్వరకర్తలును, వైదిక మతాభిమానులును నయ్య సాతవాహను, లిక్ష్వాకులవలె వారిమతమైన బౌద్ధమతమును బరిరక్షించిరి. బౌద్దులకు దానములఁ జేసిరి. వారి స్తూపములఁ గాపాడిరి. పెంపొందించిరి. కృష్ణాగోదావరీనదులనడిమిదేశమెల్లఁదుదకు వారి యేల్బడి క్రిందనే యుండెను. హాలసాతవాహనుండు సంధానించిన సాతవాహనసప్తశతిలోఁ దెలుంగుదేశమునకుఁ జెల్లఁదగిన వర్ణనలు పెక్కులు గలవు.

గోదావరీనది సముద్రముతో సంగమించునంతదాంకం గల దేశములో సాతవాహనవంశముతో సమానమయిన వంశము వే టొకటి లేదని యొక గాథలోఁగలదు. బ్రహ్మశ్రీమా, రామకృష్ణకవిగారు సంపాదించిన లీలావతీకథలో హాలునకు సప్తగోదావరతీరమున భీమేశ్వరమునఁ బెండ్లి జరిగినట్లు కలదు. అమరావతీస్తూపమున గౌతమీపుత్రశాతకర్ణి శాసన మున్నది. కృష్ణాముఖద్వారమున యజ్ఞశ్రీశాతకర్ణి పదునెన్మిదవపాలన వత్సరమున వేయింపCబడిన బౌద్ధదాత శాసనము దొరకినది. అంధ్రవల్లభుఁ డని, యంధ్రనాయకుఁడని, అంధ్రవిష్ణువని, శ్రీవల్లభుడని, సిరికాకొలినాథుం డని వర్ణితుం డగుశ్రీకాకుళాంధ్రనాయకస్వామి యంధ్రులగుసాతవాహనులలో నొక్కని పేర వెలసిన దైవమై యుండవచ్చునని నాతలంపు. సిరికకొలను అని యాగ్రామనామపుఁ దొలిరూపము. కొలనే వైష్ణవమువచ్చి దివ్యస్థలమై కొళ మయినది. అక్కడ గొప్ప చెఱువుండినట్లు స్థలమాహాత్యమునను గలదు. సిరిక పదము 'శ్రీముఖ పదమునకు తెలుఁగు వికృతి కాదగును. మడియు, వాసిష్ఠీపుత్రపులుమావి నాసికశాసనమున సాతవాహనులు బ్రాహ్మణు లని ప్రస్తుతులయిరి. శ్రీకాకుళ స్థలమాహాత్యమునంగూడ, నా యంధ్రనాయకస్వామి నాగదేవభట్టారకు నింటఁబుట్టిన బ్రాహ్మణుఁ డని కలదు. అక్కడ నాస్వామి బ్రాహ్మణకన్యను వివాహమాడెనంట! ఈ కథ శ్రీముఖ శాతకర్ణిది కాందగును. అంధ్రరాజులు తెలివాహనదీతీరమున నుండినట్లు బౌద్ధ జాతక కథలలోc గలదంట! లీలావతీకథ, హాలునినాటికి గోదావరి సప్తశాఖలు గల దని తెలుపుచున్నది. జాతకకథలలోఁ బేర్కొనం బడిన తెలివాహానది గోదావరీ సప్తశాఖలలో నొక్కటియగు తుల్యభాగ యగు నేమో యని నాయూహము.

సంస్కృత, దేశి, భాషాకృతులలోఁ బెక్కింట నంధ్రస్త్రీలకుచసాభాగ్య మసాధారణమైనదిగా వర్ణితమయ్యెను. ఆవర్ణన మన్వర్ధమయిన దని యమరావతీ సూపశిల్పములు ప్రతిపాదించుచున్నవి. ఆస్తూపనిర్మాణ కాలమున కంధ్రస్త్రీలకుఁగుచాచ్చాదనములేకుండుటనుగూడనమరావత్యాది సూపరూపములు నిరూపించుచున్నవి. అవికలులేని యంధ్ర స్త్రీలు ప్రతిష్టానమున కేంగినపిదప నతినిగూఢకుచ లగుఘూర్జర మాహారాష్ట్ర స్త్రీల సంగతిచేఁ గ్రోత్తనాగరకత ఒలసి, అవికలను పైంటలను నుంచుకొన సాగిరి, పైcటపదము ప్రతిష్టానపదభవమే. ప్రతిష్టానముననుండి యలవడినది గాన కుచాచ్చాదనమునకు నానగరముపేరే తద్జ్జపకముగాc బేరయ్యెను. అవికలకుఁగూడఁ బైఠిణీఱవిక లనియే పేరు. పైఠిణీపదము గూడC బ్రతిష్టానపదభవమే. సంస్కృతమున కంచుక మను పదమున్నను, నది స్త్రీపురుషసామాన్యమయిన ‘అంగరకా"కు పేరుగా నున్నది. సాతవాహనసప్తశతిలో నది ఘూర్జరాంగనలు వేసికొను మేలిముసుంగు ముఖమునకుఁగూడ నుండును) పర్యాయముగాఁ గలదు. అంధ్ర, ద్రవిడ, కర్ణాట, మళయాళస్త్రీ లానాడు ఱవికలు లేనివారే! ప్రతిష్టానసంగతిచే నంధ్ర కర్ణాటాంగనలు పైcటలను అవికలను దాల్చిరిగాని యదిలేని ద్రవిడ మళయాళస్త్రీలు, నేఁటికిని వానిని దాల్పనివారుగానే యున్నారు. పురుషులువోలె స్త్రీలును, (నేఁడును మళయాళమున నున్నట్లు) కొన్ని సమయములందు ఉత్తరీయమును దాల్చుటేకాని, అవికలం దాల్చుట యాకాలమున దక్షిణభారతదేశమున లేదు. ప్రతిష్టానసంబంధము సాతవాహనుల తర్వాత నంధ్రదేశమునకు లేదు. సాతవాహనులతర్వాతం బ్రతిష్టాననగరము పాడుపడి పల్లెటూ రయినది. పైఠిణీ రవికలును పైCటలును బ్రతిష్ణానము రాజధానిగా నొప్పచున్నప్పడే వెలయుట సంగతము. నాఁటి ప్రతిష్టానము, కృష్ణా గోదావరీ నదీసాగరసంగము దాఁకఁ గల యంధ్రదేశముతోఁ బ్రబలసంబంధము గల దనుటను పైంట పైఠిణీఱవిక పదములు నిరూపించుచున్నవి. శాసనములం దేనాఁడు సాతవాహనులు రాజ్యమేలినట్టుగా గలదో యానాండే యంధ్రదేశము (ముళక) నేలినట్లును గలదు. వారాంధ్రులని పురాణములు చెప్పచున్నవి. నేఁటి యాంధ్రదేశమునకే తక్క నితర దేశములకు వేనికిని నంధ్రనామ మేనాఁడును గానరాదు. సాతవాహను లంధ్రదేశముతో పాటుగా నితరదేశములను గూడ జయించి పాలించుట వారియంధ్రతకు రంజకము కాందగునుగాని భంజకము గాంగూడదు. తొలుదొలుతటి వారిరాజ్యము ముళ్లకదేశములోని "సాతాహని రట్ట" మగును. సాతవాహనుల యంధ్రత యిన్నివిధములC బ్రవ్యక్తమగుచుండంగా, వా రంధ్రులుగా రనియు నంధ్రదేశమును బాలింపలేదనియుఁ జేయు వాదములకు విలువ నిలువఁ గలదా? విష్ణుపురాణమున వర్ణితులగుముండకులే ముళకు లగుదు రని ఇంద్రాజిపండితులు వ్రాసిరంట! ఇది సంగతముగావచ్చును. ఇక్ష్వాకులను గూర్చి నేను వ్రాసిన వ్యాసమున[3] ఆంధ్రులకు ముండియు లని ధర్మామృత గ్రంథకథలోC బేరున్నట్లు తెలిపితిని. ముండక ముండియు శబ్దము లేకార్థవాచకములు గా వచ్చును. ధర్మామృతకథలోC బేర్కొనఁబడిన ముండియులే విష్ణుపురాణాదులలోఁ బేర్కొనంబడిన ముండకులు గాం దగుదురు.

పురాణములలోని కలియుగ రాజవంశానుచరితములనుగూర్చి పర్జీటర్ పండితులు వ్రాసిన గ్రంథము మిక్కిలి విలువగలదే. కాని దక్షిణహిందూదేశపు వ్రాంత ప్రతులలోని పాఠములకును, వారు ప్రకటించిన పాఠములకును భేదములు పెక్కులున్నవి. వానినెల్ల మరలC బరిశోధించి, దక్షిణ హిందూదేశపోలిఖి గ్రంథపాఠ భేదములను వేఱుగా నేను వెల్లడింపఁ జూచుచున్నాండను. పంుని బేర్కొనఁబడిన సాధనములు సాతవాహనులయాంధ్రత నాక్షేపింపరాకుండ నిలుపంగలవని నానమ్మకము. హాలునిచరిత్రమే యునcదగిన లీలావతీకథలో సిద్ధనాగార్జునుఁడు హాలునిమంత్రి యని కలదు[4]. సిద్ధనాగార్జునుఁ డంధ్రుడగుట నాతనిపేర వెలసియున్న శ్రీశైలపాదమగు సిద్ధనాగార్జునుని కొండయు, నక్కడి సూపములును నిరూపించుచున్నవి. అతని నేలిన రాజుగూడ నంధ్రుం డగుట సంగతముగాదా? మటియు సాతవాహనుల యంధ్రతకు సాధకములయిన విషయములు సాతవాహన సప్తశతిలోఁ జాలంగలవు, వానిని వేటొకచోట వెల్లడింతును.

  • * *
  1. 1. మ, సోమశేఖర శర్మగారి 'ఆంధ్ర మహాసామ్రాజ్యము' అను వ్యాసము. భారతి సంచికలఁ జూడుcడు. పైవారి వాదములస్వరూప మెల్ల నందు వారు పరామర్శించిరి.
  2. 1. శ్రీభావరాజువెంకటకృష్ణరావు పంతులుగారు, జయంతి 2వ సంచికలో నంధ్రాక్షరములలో సంస్కృతచ్ఛాయాంధ్ర వివరణసహితముగా నీశాసనముఁ బ్రకటించిరి. ఈ పూన్కి మిక్కిలి శాఘ్యము. కడముట్ట నిర్వహింతురు గాకని కోరుచున్నాను. ఇప్పడు ప్రకటించిన శాసనముల సంస్కృతచ్ఛాయలోఁ ప్రబలమయిన ప్రమాదము లున్నవి. "అపరాజిత విజయపతాక సతుజన దుపధసనీయ పరివరస" అను దానికి "అపరాజిత విజయ పతాకస్య శత్రుజన దుష్పధ నియమనస్య పురవరస్య" అని ఛాయ వ్రాయంబడినది. "అపరాజిత విజయవితాక శత్రుజన దుప్రృధర్షణీయ పురవరస్య" అని యుండవలెను. ఇట్టి వింకను గలవు.
  3. 1 ప్రభవపుష్య భారతీసంచిక చూచునది.
  4. 2 రామకృష్ణకవిగారి పుష్పాంజలి. భారతి చూచునది.