మాటా మన్నన/3. సంభాషణ అంటే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సంభాషణ అంటే:

Conversation is a mutual meeting of minds says one writer, not a monologue but a reciprocial exchange of ideas, conversation is a give and take process.

సంభాషణోద్దేశము - అభిప్రాయ వినిమయము :

(exchange of thoughts)

ఆనందానుభవమే సంభాషణోద్దేశముగాదు. ఒకరి అభిప్రాయాలను మరియొకరు తెలిసికోవటమే సంభాషణ. మాట్లాడుతున్న వారినుండి ఏదో కొంత గ్రహించి జ్ఞానాన్ని అభివృద్ధి గాంచాలి. ఆ మాట్లాడే వారిని నిర్నిరోధంగా మాట్లాడ నివ్వాలి. లేకపోతే వా రభిప్రాయాలు, అభిరుచులు, అనుభవాలు మన కెట్లా తెలుస్తాయి?

ఇతరులకు అవకాశమివ్వకుండా ఒక్కరే మాట్లాడటము వాగుడు క్రింద లెక్క. అందులో అభిప్రాయ పరివర్తన కవకాశం లేదు. అభివృద్ధికి ఆధారంలేదు. అతడెంత గొప్పవాడైనా ఒక్కరే మాట్లాడటం, ఇతరులను నోరు మెదపనివ్వకుండా వినిపించటమనేది మంచిపద్దతికాదు. ఆ మాట్లాడేవ్యక్తి “నాకు ఇందులో మంచి అనుభవమున్నది. నేను చెపుతాను విను" అనటం సంభాషణా పద్దతికాదు. ఇద్దరు కలసి మాట్లాడ దే సంభాషణ, అదే సజీవ సంభాషణ.

ఇతరులతో సంభాషించేటప్పుడు, మన అభిప్రాయాలను పరులపై రుద్ద ప్రయత్నించటం మంచిదికాదు. మంచి సంభాషణ కర్తగా మనవలెనంటే, ఇతరుల అభిప్రాయాలను సానుభూతితో వింటానికి, వాటి మంచి చెడ్డలను ఆలోచించటానికి సంసిద్ధపడాలి. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం .

ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవాలంటే చక్కగా వినటం నేర్చుకోవాలి. ఎంతమందిఉన్నా సరే అందరూ చెప్పేది ఆలకించాలి.

నలుగురుకూ తెలిసినదానిని ఒక మనిషి చెపుతూ ఉంటే అది పూర్తిగాక పూర్వమే తాను చెప్పాలని పెర పెర లాడుతారు కొందరు. అది తప్పు తనవంతు వచ్చేవరకు జాగ్రత్తగ వింటూ అప్పుడు మాట్లాడటం మంచిది. ఇట్లా పదిమంది కలసి ఒక విషయం మాట్లాడటంవల్ల భిన్న దృక్పధాలు తెలుస్తవి.

ఈ విధంగా కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావుగారు ప్రతిరోజూ సాయంకాలం అక్కడకు వచ్చే వారితో సంభాషణ చేస్తూ ఉండేవారు. వారంతా చర్చిస్తూ ఉండేవారు.

ఒకనాడు గాంధిమహాత్ముడు ఇర్వినుప్రభువు పిలుపు నందుకొని వెళ్లాలా ? అక్కర్లేదా ? అనే చర్చ సాగుతున్నది. కొంద రటూ, కొంద రిటూ మాట్లాడారు. చివరకు నార్ల వెంకటేశ్వరరావుగారు వచ్చేసరికి, 'చిన్నవాడైనా మన వెంకటేశ్వరరావు అభిప్రాయం తెలుసుకోతగింది' అన్నారు కృష్ణారావుగారు. అంతట నార్ల వారు 'అయినను పోయి రావలయు హస్తినకున్' అన్నారు కదండి తిరుపతి కవులు అన్నారు. మంచిమాట చెప్పారని ఆ వారపు కృష్ణాపత్రిక సంపాదకీయం ఆశీర్షికతోనే వ్రాశారు.

ఇట్లా సంభాషణలు జరఫి ఒకరి అభిప్రాయాలను ఒకరు మన్నించుకొనే పద్ధతిద్వారా ఎందరినో పెంచారు, తాము పెరిగారు కృష్ణారావు గారు,

సజీవ సంభాషణ అంటే అది.

సాధ్యమైనంతవరకు తన అభిప్రాయాన్ని సంగ్రహంగా చెప్పి ఇతరుల అభిప్రాయాలకు అవకాశమివ్వాలి.