Jump to content

మణి మాలికలు/భారతీరాయన్న కాట్రగడ్డ

వికీసోర్స్ నుండి

భారతీరాయన్న కాట్రగడ్డ
                                   ఇంటి.నెం.1-1-1523,
                                   రాకాసి పేట్, బోధన్‌ మండలం,
                                  నిజామాబాద్‌ జిల్లా-503185
                                  వృత్తి: అధ్యాపకురాలు
                                  మొబైల్‌ నెం: 8500450540
                                 ఈ-మెయిల్‌: bharatikatragadda4@gmail.com
                                 వెబ్‌: bharatirayanna.blogspot.in

జ్ఞాపకాల పరిమళాలు...


1. నీ జ్ఞాపకాల జలపాతంలో..
నిరంతరం అభ్యంగన స్నానమే!

2. కాలం సైతం కన్నీరు కారుస్తుంది
నీవు గతమై నేను వర్తమానమైనందుకు

3. కడలికి ఎంత గుట్టో
నామీద నీకున్న ప్రేమలా!

4. మరణాన్ని సైతం ఆహ్వానిస్తున్నా
మరుజన్మలో నిన్ను కలవడానికి

5. ఆకాశానికే జాలేసింది కాబోలు నాఒంటరితనమ్మీద
అందుకే రోదిస్తుంది ఎడతెరపి లేకుండా!

42

6. నాప్రేమ అగరుబత్తీనే
నీవెంత కాల్చినా సువాసనలనే ఇస్తుంది

7. ఆకాశం అవనీ ఎప్పుడూ ఎదురెదురే
కానీ దూరమెంతో మన ఇద్దరిలా

8. కలకాలం కంటినిండుగా వుంటావనుకుంటే
కలలాజారిపోయావు నిద్రలేని నిశిరాత్రులనిచ్చి

9. నీజ్ఞాపకాలను అశ్రువులుగా రాలుస్తూ
అలసి పోతున్నాయి నాకళ్ళు

10. రావొద్దన్నా పదేపదే వస్తావు
జ్ఞాపకపు పరిమళమై పెనవేసుకుంటావు

11. భూమాతవంటూ తెగ పొగుడుతున్నావు
నువ్వేమి చేసినా భరించాలనా?

12. మరపు నివ్వమని వేదిస్తావే
నీ జ్ఞాపకాలతో నేను పరిమళిస్తుంటే

13. నాప్రేమ అక్షయపాత్రే
ఎంతైనా వస్తూనేవుంటుంది

14. మేఘాలకి బాగా అలవాటే
నాకన్నీటి కడలిని లాక్కోవడం

15. నీవు లేవని తెలిసిందేమో
రేయంతా నతనడక నడుస్తుంది

16.కన్నీరుకెందుకో ఇంత జాలి
    ఎడతెరిపి లేకుండా తనను కారుస్తున్న కంటిని చూసి

17.పేదరికాన్ని తరిమికొడదామంటే
    ధానవంతుల గుండెల్లో ఎందుకో ఆగుబులు?

18.నాలో ఉన్న ఏకాంతాన్ని పంచుకోవడానికి
    చివరకు నాకు నేనే మిగిలాను

19.నన్ను నేనే కాల్చుకుంటున్నా
    నీజ్ఞాపకాల అగ్గి రవ్వలతో

20.నీతోగడిపిన ప్రతిక్షణమూ
    నాకెప్పుడూ వర్తమానమే

21.వెతలన్నీ నాకిచ్చావు
    నవ్వులన్నీ నువ్వేరుకెళ్ళావు

22.నాకన్నీటి కావ్యం నిండ
    నీవిచ్చిన చేదు జ్ఞాపకాలే

23.మరపు మందిస్తావా ప్రియతమా
    నీవుచేసిన గాయానికి పూసుకుంటాను

24.సాగరానికి నాకళ్ళను ఏలుకొమ్మని
    నీవింత వింతగా మాయమయ్యావే?.

25.కన్నుల్లో అన్నీ బంగారుకలలే
    కనురెప్పపై నీవు ఉన్నందుకేమో

మణిమాణిక్యాలు: భారతెరాయన్న కాట్రగడ్డ

26.నెలరాజు కొంటె పనులకి
    మబ్బుల బుగ్గలు సిగ్గిల్లాయి!

27. విచ్చుకుంది వెన్నెలమొగ్గ
    అందమైన పున్నమిలోన

28. నాకు ఏకాంతమా!
    అనుక్షణం నీజ్ఞాపకాలతో నన్ను పెనవేసుకుపోతుంటే?

29. రాత్రంతా విరిసిన నీస్మృతుల్లో
    నిద్ర సైతం నివ్వెరపోయింది.

30. కాలానికో ఉత్తరం రాస్తున్నా
    హరించిన నా నాథుణ్ణి నాకు తిరిగి ఇచ్చేయమని!

31. నాశ్వాసలో ఎక్కడిదీ సంగీతం
    రహస్యంగా నీవొచ్చి చేరినందుకేమో

32.నీజ్ఞాపకాల వర్షంలో
    నిత్యం తడుస్తున్నా

33.మువ్వలు మూగబోయాయి
    నీసవ్వడులు లేక

34.నా కన్నీటిసాగరం నిండ
    నీ జ్ఞాపకాల అలలే!

35.సంక్రాంతికి మాఇల్లు ముస్తాబయ్యింది
    వెన్నెల కిరణంలా నీవొస్తున్నావని
మణిమాలికలు: భారతీరాయన్న కాట్రగడ్డ

36. కారుమబ్బులన్నీ తేలిపోయాయి.
    నీ వలపు వీక్షణం సోకగానే

37.సాగరకెరటాలు రావొద్దాన్నా ఆగవు.
    నీగురించి వచ్చే నాఆలోచనల్లా

38.నాకు షరామామూలేగా
    నీలో నన్ను నేను వెతుక్కోవడం

39.ఎంతని తడవ ను?
    నిత్యం నీ జ్ఞాపకాల జడులలో

40.నీకే...మౌనంగానే వెళ్ళిపోయావు
    నేనే...వెళ్లలేక శిలనయ్యాను

41.నీజ్ఞాపకాల పుటలు..ఎంత చదివినా
    సశేషమనే వస్తుంది ముగింపనేది లేక

42.నామనసు వాలిన ప్రతీ చోటా
    నే వెతికేది నీ కోసమే

43.కాలంతోపాటు నేనూ పరుగెడుతున్నా
    త్వరగా నిన్ను చేరుకోవాలని

44.గరళాన్ని నాకలవాటు చేసి
    గగనంలోకి చిరంజీవిలా వెళ్ళావు

45.ఆదమరచి నిద్ర పోతున్నా
    కవ్వించే నీకలల తీరంలో

46.బాల్యం బందీ అవుతోంది
    కేజీలకొద్దీ బరువున్న పుస్తకాలసంచీలో

47.నీమనస్సుకి రెక్కలున్నాయి కాబోలు
    అస్తమానూ నాముంగిట్లోనే వాలుతుంది

48.కళ్ళకెందుకయ్యా కన్నీళ్ళనిచ్చావు.
    దుఃఖమైనా ఆనందమైనా మేమే వస్తామంటున్నాయే

49.గతం చేసిన గాయానికి
    భవిత లేని శిలనయ్యాను

50.నీ జ్ఞాపకాల గాయాలే
    నా కవితలకి సిరాచుక్కలయ్యాయి

51.గాయాలెన్నైనా చేయగలవు
    పారేది నా రక్తకన్నీరే కదా

52.నా మనసు భ్రమరమే!
    నిరంతరం నీ ప్రేమ పుప్పొడి కోసం పరుగెడుతుంది

53.కాలానికి కూడ దుఃఖమే
    నీవులేని నన్ను చూసి

54.నీ జ్ఞాపకాల వీధుల్లో విహరిస్తున్నా!
    మనసుని పునీతం చేసు కుంటూ

55.నీవు దూరమయ్యావన్న భ్రాంతిలోనే వున్నా
    కనుల వెంబడి కన్నీరు వస్తున్నాకూడా

భారతీరాయన్న కాట్రగడ్డ