Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/హాజఁరా ఆపా

వికీసోర్స్ నుండి

జాతీయోద్యమకారుల, శ్రమజీవుల అక్కయ్య

హాజఁరా ఆపా

(1910-)

భారత జాతీయోద్యమంలో భాగస్వాములైన పలువురు మహిళలు ఒకవైపున బ్రిటిషర్ల నుండి మాతృదేశాన్ని విముక్తం చేయటం కోసం పోరాడుతూనే, స్వతంత్ర భారతంలో శ్రమజీవుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆ దిశగా అవిరళ కృషి సాగించారు. ఈ మేరకు అటు పరాయిపాలకులతో, ఇటు స్వదేశంలోని కార్మిక-కర్షక జనావళి సంక్షేమం కోసం అసమానతలకు వ్యతిరేకంగా అహర్నిశలు పోరాటాలు సాగించి ఉభయ పాత్రలను సమర్ధవంతంగా పోషించిన మహిళా ప్రముఖులలో అగ్రగణ్యులు శ్రీమతి హాజౌరా బేగం.

జాతీయోద్యమకారులు, శ్రమజీవులచే ఎంతో ఆప్యాయంగా హాజౌరా ఆపా (హజరా అక్కయ్య) అని పిలిపించుకున్న హాజౌరా 1910 డిసెంబరు 22వ తేదిన ఉతర ప్రదశ్‌ రాష్ట్రం షహరనపూర్‌లోని సంపన్న కుటుంబంలో జన్మించారు. ఈ ప్రాంతం అప్పుడు రాంపూరు సంస్థానంలో ఉండేది. ఆమె తండ్రి ముంతాజుల్లా ఖాన్‌ డిప్యూటి కలక్టరు. నవాబు వంశస్థురాలు కావటంతో ఆమె క్వీన్‌ మేరీస్‌ కళాశాల లాంటి ప్రసిద్ధిగాంచిన విద్యాసంస్థలలో చదువుకున్నారు. చిన్నప్పటినుండి ఆమె ఆటపాటలతో పాటుగా చదువులో అగ్రగామి. కళాశాలలో ఆమె చాలా చురుకైన విద్యార్థినిగా అధ్యాపకుల

195 మనన్న పొందారు. (మేరే జీవన్‌ కీ కుచ్‌ యాదేౌ (హిందీ), డాక్టర్‌ జడ్‌.ఎం. అహ్మద్‌, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ, లక్నో, 1997, పేజీ.132) బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యోధుల గురించి చిన్ననాటనే హజౌరా బేగం విన్నారు. పోలీసు అధికారి అయిన తండ్రితోపాటుగా ఆమె మీర్‌ నగరంలో ఉన్నారు. ఆ సమయంలో మీర్‌ కుట్రకేసుకు సంబంధించిన విప్లవకారులను నిర్భంధాంలోకి తీసుకుని ఆమె నివాసం ఉంటున్న బంగ్లా ప్రాంతంలో ఉంచటం జరిగేది. ఆ వాతావరణాన్ని గమనించిన ఆమెకు ఆ విప్లవకారులు ఎవరన్న విషయం మీదా ఆసక్తి పెరిగి తండ్రిని అడిగారు. ఆయన సమాధానం చెప్పకున్నా వార్త్తాపత్రికల ద్వారా వారంతా బ్రిటీషు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న యోధులని తెలుసుకున్నారు. ఈ మేరకు తొలిసారిగా బ్రిటీషు ప్రభు త్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న యోధుల పరోక్ష పరిచయం ఆమెకు లభించింది.

ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా అబ్దుల్‌ జమీల్‌ ఖాన్‌తో హాజౌరా వివాహం జరిగింది. ఆ వివాహ బంధం ఎంతోకాలం నిలువలేదు. భర్త అబ్దుల్‌ జమీల్‌ ఖాన్‌ ఉన్నత స్థాయి పోలీసు అధికారి కావటంతో జాతీయ, స్వతంత్రభావాలు గల హాజౌరాకు అతనితో కుదరలేదు. అప్పికి ఆ దంపతులకు సమీఖాన్‌ అను కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగినా కూడ ఆ పోలీసు భర్తతో ఆమెకు పొసగకపోవటంతో తండ్రికి విషయం తెలిపి 1932లో భర్త నుండి విడాకులు తీసుకున్నారు.

ఆ తరువాత తండ్రి ప్రోత్సాహంతో1933లో తన బిడ్డతో సహా విద్యాభ్యాసం కోసం హాజౌరా లండన్‌ వెళ్ళారు. లండన్‌లోని మాంటిస్సోరి కళాశాలలో విద్యాభ్యాసం సాగించారు. ఇంగ్లాండులో జాతీయ భావాలు, సామ్యవాదా భావాలు గల సజ్దాద్‌ జహీర్‌, జెనుల్లాబిదీన్‌ లాంటి యువకుల బృందంతో ఆమెకు పరిచయం కలిగింది. ఆ పరిచయం ద్వారా కమ్యూనిస్టు సాహిత్యాన్ని అధ్యాయనం చేసిన ఆమె సామ్యవాద సిద్దాంతం పట్ల అభిమానం, బ్రిటీషు సామ్రాజ్యవాద శక్తుల పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు.

మాతృదేశం నుండి బ్రిటీష్‌ సామ్రాజ్యవాద శక్తులను వెళ్ళ గొట్టెందుకు శ్రమించాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సభలు, సమావేశాలు, చర్చలలో పాల్గొని బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం, యుద్ధకాంక్షకు వ్యతిరేకంగా మాట్లాడి, ప్రసంగాలు చేసిన హాజౌరాకు బ్రిటీషు వ్యతిరేక ఉద్యామకారులలో ప్రత్యేక గుర్తింపు

196

భర్త, కూతురుతో హాజౌరా

లభించింది. లండన్‌లో ఓసారి జరిగిన మేడే సందర్భంగా ఆమె ఎర్రజెండా చేతపట్టి ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, ఊరేగింపు అగ్రభాగాన నిలబడి సహచరులను సహితం ఆశ్చర్యచకితులను చేశారు.

ఇటలీలో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. అంతేకాకుండ బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, యుద్ధాన్నివ్యతిరేకిస్తూ బ్రెజిల్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఆమె భారతీయ ప్రతినిధిగా భాగస్వామ్యులయ్యారు. ఆ క్రమంలో 1935లో భారతీయ విద్యార్థి బృందంలో సభ్యురాలిగా హాజౌరా బేగం సోవియట్ రష్యాకు వెళ్ళారు. ఈ విధంగా రష్యా సందర్శించిన మొట్టమొదటి భారతీయ ముస్లిం మహిళగా బేగం హాజౌరా ఖ్యాతి గడంచారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan : Page. 281)

లండనలోని మాంటిస్సోరీ కళాశాలలో డిప్లొమా పూర్తయ్యాక హాజౌరా ఇండియా తిరిగి వచ్చారు. ఇండియా రాగానే 1935లో లక్నోలోని కరామత్‌ హుస్సేన్‌ బాలికల

197 కళశాలలో అధ్యాపకు రాలిగా బాధ్య తలు స్వీకరించారు. ఆ కళాశాలలో ఒక వైపు న ఉద్యోగం చేస్తూమరొకవైపు న పి.సి. జోషి తదితర ప్రముఖ ఉద్యమకారులతో కలసి కమ్యూనిస్టు పార్టీ రహస్య కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. 1935లో ప్రముఖ కవి సజ్దాద్‌ జహీర్‌తో కలసి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు, ప్రథమ సమావేశం నిర్వహణలో పాల్గొని ఆమె ఆ సంఘ వ్యవస్థాపక సభ్యురాలయ్యారు.

1935లో ప్రముఖ విద్యావేత్త, కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్‌ జైనుల్లాద్దీన్‌ అహమ్మద్‌ను హాజౌరా వివాహమాడారు. డాక్టర్‌ జడ్‌.ఎ. అహమ్మద్‌గా ప్రసిద్ధుడైన ఆయనను ఆమె తొలుత లండన్ లో కలుసుకున్నారు. డాక్టర్‌ అహమ్మద్‌ ఇండియా వచ్చాక ఆయన కూడ కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ఆమెకు సన్నిహితులయ్యారు. ఆ వివాహం 1935 మే 20న సయ్యద్‌ సజ్దాద్‌ జహీర్‌ తండ్రి లక్నో హైకోర్టు ప్రధాన న్యాయాధికారి సయ్యద్‌ వజీర్‌ హస్‌ గృహంలో జరిగింది. ఆనాటి నుండి భార్యభర్తలు అటు స్వరాజ్య సాధన, ఇటు శ్రమజీవుల సంక్షేమం కోసం ఉద్యమించారు.

1935 ప్రాంతంలో బేగం హాజౌరా, డాటర్‌ జైనుల్లాబిద్దీన్‌లు భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు. రహస్యంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆ దంపతులు పోలీసు అధికారుల దృష్టిలో పడ్డారు. ఆ కారణంగా ఉద్యోగాలకు రాజీనామా ఇచ్చి పూర్తికాలపు ఉద్యమకారులయ్యారు.డాక్టర్‌ భరద్వాజ్‌ నాయకత్వంలో సజ్దాద్‌ జహీర్‌, డాక్టర్‌ అష్రాఫ్‌, డాక్టర్‌ జడ్‌.ఎ. అహమ్మద్‌ లతో కలసి పోలీసుల కళ్ళుగప్ప నిషేధిత కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలతోపాటుగా భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలను కూడ ఆమె సమర్థ్ధవంతంగా నిర్వహించారు.

కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం తొలిగాక పార్టీకి సామాన్య మహిళా కార్యకరలు ఉండటమే అరుదైన ఆ రోజులలో బేగం హాజౌరా పార్టీ నాయకురాలిగా బాధ్యతలు చేప్టి నిర్భయంగా నిర్వహించటం విశేషం. ఉత్తరప్రదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ సమావేశం నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన ఆమె ఆ తరువాత అలహాబాద్‌ కమిటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

1936లో పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులయ్యాక అఖిల భాతర జాతీయ కాంగ్రెస్‌ను వ్యవస్థాపరంగా బలోపేతం చేయదలచుకున్నారు. ఆ పథకంలో భాగంగా జాతీయ కాంగ్రెస్‌కు పలు అనుబంధ సంస్థలను ఆయన

198 రూపొందించారు. అ సందార్భంగా హాజౌరాకు జనచైతన్య కార్యక్రమాల నిర్వహణా బాధ్యాతలను ఆయన అప్పగించారు. ఆమె భర్త డాక్టర్‌ అహమ్మద్‌కు ఆర్థిక విభాగం బాధ్యాతలను కాేయించారు. బేగం హాజౌరా ఈ అవకాశాన్ని వినియోగించుకుని, అవిశ్రాంతంగా పలు ప్రాంతాలు పర్యించి, తన ప్రసంగాలతో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చెతన్య పర్చారు. ప్రదానంగా మహిళలను ఉద్యమింప చేయటంలో ఆమె సాధించిన ప్రగతి ఎందారికో ఆదార్శప్రాయమైంది.

ఆనాడు జరిగిన పలు ఎన్నికలలో పాల్గొని, భారత జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపుకు హజౌరా బేగం కారణమయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో పాల్గొని తన అభిప్రాయాలను నిష్కర్షగా వ్యక్తం చేసి నాయకుల, ప్రజల ప్రశంసలను అందుకున్నారు. ఆమె కొంతకాలం కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ సభ్యురాలిగా బాధ్యతలను నిర్వహించారు. ఆనాడు వామపక్ష భావాలు గల భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులుగా హాజౌరా దంపతులు గుర్తించబడ్డరు.1937 మే లో ఆంధ్రాప్రదేశ్‌లోని కొత్తపట్నంలో జరిగిన రాజకీయ శిక్షణా శిబిరంలో అధ్యాపకురాలిగా పాల్గొన్న బేగం హాజౌరా రాష్ట్ర ప్రజలకు కూడ సుపరిచితురాలు.(ప్రముఖ స్వాతంత్య్ర సమరయాధులు పరకాల ప్టాభి రామారావు (విజయవాడ) గారి నుండి సమాచారం)

చిన్ననాటి నుండి ఎటువింటి లింగ వివక్షతను అంగీకరించని మనస్తత్వంగల హాజౌరా ఆ వివక్షతలకు వ్యతిరేకంగా పోరాలు చేయడానికి వెనుకాడలేదు. 1938 ప్రాంతంలో ఆమె కుమార్తె సలీమా గర్భంలో ఉన్నప్పుడు ప్రసవం నిమిత్తం అలహాబాద్‌ లోని ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఆంగ్లేయులకు మేలు రకం సౌక్ర్యాలు, భారతీయులకు నాసిరకం ఏర్పాట్లు జరుగుతున్న తీరును చూసి గర్భవతైయుండి కూడ ఆ వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రసవం నిర్వహిస్తున్న డాక్టరకు సహకరించేందుకు నర్సింగ్‌ విభాగంలో మహిళలు కాకుండ పురుషులు మాత్రమే ఉండటం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆసుపత్రిలో మహిళా నర్సులను నియమించాలని హాజౌరా డిమాండ్‌ చేశారు. నర్సింగ్‌ విభాగంలో మహిళల ఏర్పాటు జరిగేంత వరకు ఆమె విజయవంతంగా ఆందోళన చేశారు. ఆ ఆందోళనకు మహిళల నుండి మంచి మద్దతు లభించింది. ప్రజాందోళన తీవ్రతరం కావటంతో ఆ విషయంలో పండిత జవహర్‌ లాల్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. (మేరే జీవన్‌ కీ కుచ్‌ యాదేౌ (హిందీ) ó పేజీ.166-168) 199 1940 ప్రాంతంలో హాజౌరా బేగం, డకర్‌ అహమ్మద్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నుండి బయటకు వచ్చేశారు. అప్పినుండి ఆ ఇరువురు కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నమయ్యారు.అసంఘిత కార్మికులను సంఘితం చేసి కార్మిక సంఘాలను స్థాపించటంలో ప్రధాన భూమిక నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె అలహాబాదులో రైల్వే కూలీల సంఘం స్థాపించారు. అంతవరకు ఎవ్వరూ కూడ రైల్వేకూలీల సమస్యలు ప్టించుకున్న వారులేరు. అసలు రైల్వేకూలీల సంఘం ఏర్పాటు చేసినవారు లేకపోవటంతో రైల్వే కూలీల సంఘం నిర్మాతగా ఆమె రైల్వేకూలీల గౌరవాభిమానాలను అందుకున్నారు. ఆ కారణంగా రైల్వేకూలీలు ఆమెను తమ ప్రవకగా ప్రకించుకున్నారు. ఈ కార్యక్రమాలలో ఆమెకు అలహాబాద్‌కు చెందిన షా అబ్దుల్‌ ఫ్ధజ్‌ సహకరించారు. (మేర జీవన్‌ కీ కుచ్‌ యాదేౌ (హిందీ) ó పేజీ.200) ఈ సందార్బ ంగా ఆమె మీదా దాడులు జరిగాయి. ఆమెను చంపుతామని బెదిరింపులు వచ్చాయి. బేగం హాజౌరా అ బెదిరింపులకు భయపడలేదు. ఆ ప్రమాదకర పరిసితులలో అలహాబాద్‌లోని రైల్వేకూలీలు అండగా నిలచి ఆమెను రక్షించుకున్నారు.

బేగం హాజౌరా మహిళా కార్మికుల సంకే∆మం పట్ల ప్రత్యేక శ్రద్ధా చూపారు. మహిళలలో చైతన్యం కోసం సభలు-సమావేశాలు నిర్వహించారు. మతోన్మాదం వలన కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపర్చేందుకు విశేషంగా కృషి చేశారు. మత సామరస్యం ప్రబోధించారు. హిందూ- ముస్లింల ఐక్యత కోసం పనిచేశారు. నూతన కార్మిక సంఘాల ఏర్పాటు, ఆ కార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారు. వృద్ధాప్యాన్ని కూడ లెక్క చేయక బేగం హాజౌరా సమాజసేవలో పాల్గొన్నారు.

ప్రజా జీవనరంగాలన్నిిని స్పృశించి, తనదైన సేవలను అందించిన శ్రీమతి హాజౌరా బేగం గౌరవార్థ 1960లో సోవియ్‌ట్ యూనియన్‌లో జరిగిన కామ్రేడ్‌ లెనిన్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆమెకు సుప్రీం సోవియ్‌ట్ జూబ్లీ అవార్డు ప్రకటించారు. పండు వయస్సులో కూడ బేగం హాజౌరా దంపతులు కష్టజీవుల సంక్షేమం కోసం ఆవిశ్రాంతంగా కృషిసాగించారు.

200