భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/సుల్తానా హయాత్‌ అన్సారి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మహిళా కార్యకర్తలచే ఆయుధం ధరింపచేసిన సమరశీలి

సుల్తానా హయాత్‌ అన్సారి

సుదీర్ఘంగా సాగిన భారతస్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను పరికిస్తే, వలస పాలకులకు వ్యతిరేకంగా ముత్తాత, తాత, తండ్రి, తనయులు ఉద్యమించిన కుటుంబాలు చాలా తక్కువగా దర్ నమిస్తాయి.స్వదేశాన్ని పరాయిపాలకుల నుండి విముకం చేయాలన్న సంకల్పం పూర్వీకుల నుండి వారసత్వంగా లభించటం, ఆ మేరకు మాతృభూమి సేవలో తరించటం లాంటి మహత్తర అవకాశం లభించిన కుటుంబానికి చెందిన తనయ బేగం సుల్తానా హయాత్‌.

సుల్తానా హయాత్‌ ముత్తాత ఖాజీ జియావుద్దీన్‌ ఢిల్లీ నగర ఖాజీగా బాధ్యతలు నిర్వహిసున్నారు. 1857లో ఆయన ఆ పదవికి రాజీనామా చేసి బ్రిటీషరకు వ్యతిరేకంగా తిరుగుబాటు యోధులకు సహకరించారు. ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామ సేనాని భక్త్‌ఖాన్‌ సలహా మీద ఆవధ్‌ సంస్థానానికి వెళ్ళడానికి మొగల్‌ పాదాుషా బహుద్దాూర్‌ షా జఫర్‌ నిరాకరించాక, భక్త్‌ ఖాన్‌ ఢిల్లీ నుండి తన బలగాలతో ఆవథ వైపుకు సాగారు. ఆ లోగా ఢీల్లీ పూర్తిగా ఆంగ్లేయుల వశమైంది. ఆ సమయంలో ఆంగ్లేయ సైనికుల కళ్ళుగప్పి ఆవథ్‌కు పయనమైన భక్త్‌ఖాన్‌, ఆయన బలగాలు ఢిల్లీ నుండి తప్పుకోడనికి ఖాజీ జియావుద్దీన్‌ సహయపడ్డారు. ఆ విషయం తెలుసుకున్న ఆంగ్లేయ అధికారి హడ్సన్‌ జియావుద్దీన్‌ మీద మండిపడుతూ ఆయన గృహం మీద దాడిచేశాడు. ఆస్థిపాస్తులను విధ్యంసం 201 చేశాడు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan : Page. 272)

ఆ జియావుద్దీన్‌ కుమారుడు ఖాజీ నజీముద్దీన్‌ కూడ జాతీయోద్యమకారుడు. బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్‌ మార్గదర్శకంలో ఉద్యమించారు. మీర్‌ నగరంలోగల తమ కుటుంబ భవంతిలో కొంత భాగాన్ని ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమ కార్యాలయాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత జాతీయ కాంగ్రెస్‌కు దాఖలు చేశారు. మీర్‌ నగర కాంగ్రెస్‌కు 27 సంవత్సరాల పాటు అధ్యక్షుకునిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.(Encyclopedia of Muslim Biography, Nagendra Kumar Singh APHPC, New Delhi, 2001, Page. 485)

ఆ నజీముద్దీన్‌ బాటలో ఆయన కుమారుడు ఖాజీ బషీరుద్దీన్‌ నడిచారు. ఆయన కూడ జాతీయోద్యామ్యంలో పాల్గొన్నారు. ఆ ఖాజీ బషీరు ద్దీన్‌ కుమార్తె సుల్తానా హయాత్‌. ఈ విధంగా ముత్తాత ప్రథామ స్వాతంత్య్రసంగ్రామ యోధుడు కావటం, తాత, తండ్రి జాతీయ కాంగ్రెస్‌ ప్రముఖులు కావటంతో స్వేచ్ఛా-స్వాతంత్య్ర భావనలు సుల్తానాకుచిన్ననాటనే పరిచయమయ్యాయి. తాత ఖాజీ నజీముద్దీన్‌ సుదీర్ఘకాలం భారత జాతీయ కాంగ్రెస్‌ మీర్‌ నగర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించటం వలన ఆయన ఇంటికి పండిత మోతీలాల్‌ నెహ్రూ, మౌలానా ముహమ్మద్‌ అలీ, మౌలానా షౌకత్‌ అలీ, కమలాదేవి చోపాధ్యాయ, మౌలానా అబుల్‌ కలాం అజాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ˙, మౌలానా అతావుల్లా బొఖారి, డాక్తరు సైఫుద్దీన్‌ కిచూ,మౌలానా హఫజు ర్రెహమాన్‌ లాంటి ప్రముఖుల రాకపోకలు ఉండేవి. ఆ కారణంగా తాత దగ్గర ఉంటూ, ఆయనకు, ఆయన అతిథులకు సపర్యలు చేస్తూ గపిన సుల్తానా హయాత్‌కు చిన్ననాటనే ప్రముఖ నాయకుల పరిచయం కలిగింది.

ఆ పరిచయాలు, ఆ ప్రత్యేక రాజకీయ వాతావరణం సుల్తానా హయాత్‌లో సమరశీల భావాలకు అంకురార్పణ చేశాయి. ఆమె ఇంటిని తరుచుగా పోలీసులు వచ్చిసోదాలు నిర్వహించటంతో ఆమెకు పోలీసుల భయం లేకపోగా, బ్రిటిషు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బాగా పెరిగింది. చిన్నతనంలోనే ఆమె తాత ఖాజీ నజీముద్దీన్‌తో కలసి కాంగ్రెస్‌ సభలలో పాల్గొంటూ వచ్చారు. ఆ సభలలో తన సుమధుర కంఠంతో జాతీయభావాలతో నిండిన, దేశభక్తియుత కవితలు విన్పిస్తూ సభికులచే శభాష్‌ 202 అన్పించుకున్నారు. ఆమె తాత గారి ప్రత్యేక శిక్షణలో చిన్న చిన్న ప్రసంగాలు చేయటం కూడ అలవాటు చేసుకున్నారు. ఆనాడు మీర్‌లోని జుమా మసీదులో ఆమె అధ్బుత ప్రసంగం చేసి బడాబడా నేతలను అబ్బురపర్చారు.

చిన్ననాటనే నాయకత్వం లక్షణాలను ప్రదర్శించి తన ఈడు పిల్లలతో కలసి ప్రత్యక దళాన్ని ఏర్పాటు చేసు కుని సబలు, సమావేశాలు జరుగునప్పుడు ఆ కార్యక్రమాలకు విచ్చేసిన నేతలకు, సభికులకు సేవలందించటం ఆమె అలవాటు. ఈ క్రమంలో ఆమె జాతీయ కాంగ్రెస్‌ స్వచ్చంద సేవికల దళాలకు నాయకత్వం వహించారు. ఆమె విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు పాఠశాలలో ప్రత్యేకంగా ఫిజికల్‌ ట్రైనింగ్‌ పొంది ఉన్నందున ఆ స్వచ్ఛంద సేవికల దళాల ఫిజికల్‌ ఫిట్‌నెస్ కోసం ప్రత్యేక శిక్షణ తరగతులను కూడ ఆమె నిర్వహించారు. యవతులకు లాఠీ తిప్పటం నేర్పారు. ఈ మేరకు మీరట్‌ నగరంలోని పలు సంఘాలు సంస్థలు, జాతీయ కాంగ్రెస్‌ నాయకులు, మహిళా నేతలు ఆమె సేవలను ఉపయోగించుకున్నారు.

ఆమె ధార్మికంగా నిష్టాగరిష్టురాలైనప్పికి విభిన్న మతస్థులు కలసిమెలసి జీవిస్తున్న వాతావరణంలో సర్దుబాట్లు అవసరమని భావించారు. ఉద్యమాలను, పోరాటాలను మతం ఆసరాతో, మతం పేరుతో రూపొందించడాన్ని వ్యతిరేకించారు. హిందూ-ముస్లింల ఐక్యతకు ఈ చర్యలు విఘాతం కల్గించగలవని అభిప్రాయపడ్డారు. ముస్లింలకు ప్రత్యేక సంఘాలు, రాజకీయ పార్టీల ఏర్పాటును నిరసించారు.

1933-34 ప్రాంతంలో ఢిల్లీలోని అరబిక్‌ కళాశాలలో ముస్లిం మహిళల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరికి ఆహ్వానాలు వెళ్ళాయి. ఆ ఆహ్వానాల మేరకు ప్రముఖ మహిళా నేతలు సమావేశాలకు విచ్చేసారు. ఆ సమావేశాలలో మీరట్ ప్రతినిధులుగా సోదరి జెహరా బేగంతో కలసి బేగం సుల్తానా హయాత్‌ పాల్గొన్నారు. ఆ సమావేశంలో ప్రకటించిన ఉద్దేశ్యానికి భిన్నంగా ముస్లిం విద్యార్థినుల కోసం ముసిం విద్యార్థినుల సమాఖ్య ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ఆ ప్రయత్నాలు సుల్తానా సోదారీమణులకు నచ్చలేదు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సుల్తానా హయాత్‌, ఆమె చెల్లెలు బేగం జొహరా బేగం తీవ్రంగా ప్రతిఘిటించారు. ఆ తీర్మానం తగదంటూ ఆమె వాదన ప్రవేశపెట్టారు. ఆ ప్రతిఘటన, ఆమె సాగించిన సంవాదం సమావేశంలో సుదీర్ఘ చర్చకు

203 కారణమయ్యాయి. ముస్లింలీగ్‌ నేతల మారదర్శ కత్వంలో సాగిన ఆ సమావేశంలో సుల్తానా హయాత్‌ వాదనలు వీగిపోయాయి. ముస్లిం అయిఉంటే ముస్లింలీగ్‌లోకి చేరు అంటూ సమావేశంలో ఒత్తిడి వచ్చినా జాతీయోద్యమకారుల వారసులైన ఆ సోదరీమణులు ఆ ఒత్తిడులకు తలవొగ్గలేదు.

1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమంలో నాటికి యువతిగా రూపాంతరం చెందిన బేగం సుల్తానా హయాత్‌ ఉద్యమంలో పాల్గొనటం ఆరంభించారు. ఆనాడు ముస్లిం మహిళలేంటి మహిళలందరి మీద ఆంక్షలు ఉండేవి. మహిళలు పరోక్షంగా సహాయ సహకారాలు అందిచటం వరకు కార్యకలాపాలు పరిమితం. ఆ కారణంగా ఆమె పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ కార్యక్రమాలలో నిమగ్నం కాలేకపోయారు. అందువల్ల ఆమె కూడ ప్రత్యక్షంగా కార్యక్రమాలలో పాల్గొనకుండ పరోక్షంగా ఉద్యామకారులకు సహాయపడటం కోసం తనదైన కార్యకలాపాలను రూపొందించుకున్నారు.

జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు ప్రదర్శనలు, పికెటింగ్‌లు, ఊరేగింపులు, శాసనోల్లంఘన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసుల దాష్టీకాలకు గురైన ఉద్యామకారులకు సేవలందించడనికి సుల్తానా హయాత్‌ అత్యధిక ఆసక్తి చూపారు. ఈ మేరకు యువతులతో ఒక సేవాదళాన్ని స్థాపించారు. ఈ దళం ఒకవైపు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే, మరొక వైపు బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని చికాకు పర్చే చర్యలను ఎంతో సాహసోపేతంగా సాగించింది. బ్రిటీష్‌ పోలీసుల మీద సదా కన్నేసివుంచి, అధికారుల రాకపోకల గురించి ఎప్పికప్పుడు తెలుసుకుంటూ ఆ సమాచారాన్ని ఉద్యమకారులకు తెలపటమేకాక ఉద్యమ కొరియర్లగా కూడ ఆమె పర్యవేక్షణలో దళ సభ్యులు పనిచేశారు.

ఈ సందర్భంగా ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితుల నుండి బయట పడేందుకు యువతులు ఆయుధాలను ధరించాలని, ఆత్మరక్షణ కోసం పోరాట పద్దతులను యువతులకు నేర్పాలని బేగం సుల్తానా నిర్ణయించారు. ఆ మేరకు తాత ఖాజీ నజీముద్దీన్‌ సహకారంతో సేవాదళ సభ్యులందరి కోసం ప్రత్యేకంగా ఆయుధాలను తయారు చేయించి, వాటిని ప్రయాగించడంలో కూడ శిక్షణ ఇప్పించారు. అనివార్య పరిస్థితులలో ఆత్మాహుతి చేసుకోడానికి కూడ సభ్యులు సన్నద్ధంగా ఉండేట్టుగా మానసికంగా వారిని తయారు చేశారు. అయితే ఆ తరువాతి కాలంలో ఆత్మహత్య నిర్ణయం తప్పుడు నిర్ణయమని ఆమె

204 అంగీకరించారు.

1942 ప్రాంతంలో బేగం సుల్తానా మహాత్ముని సేవాగ్రాంలో కొంతకాలం ఉన్నారు. తాత ఖాజీ నజీముద్దీన్‌తో కలసి ఆమె గాంధీజీ మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాల నిర్వహణలో పాల్గొన్నారు. సేవాగ్రాంలో ఉన్నప్పుడు ఆమె గాంధీజీకి మరింత సన్నిహితమయ్యారు. ఆమె గాంధీజీ పుస్తకాలు, ఉత్తరాలను ఉర్దూ భాషలో తర్జుమా చేస్తూ ఆయనకు సహాయపడ్డారు. ఆమె సమర్థత, సంకల్పబలం గమనించిన గాంధీజీ ఆమెను బాగా ప్రోత్సహించారు.

స్వదేశీ ఉద్యమంలో భాగంగా సాగిన విదేశీ వస్తువుల, మద్యపాన విక్రయశాలల వద్దా జరిగిన పికెటింగ్‌ కార్యక్రమాలలో సుల్తానా హయాత్‌ చురుకుగా పాల్గొన్నారు. మహాత్ముని ప్రభావం ఎంతగా ఉన్నా, స్వతంత్ర భావాలు గల ఆమె కొన్ని విషయాలలో ఆయనతో ఏకీభవించలేక వాదనకు దిగి చివరకు గాంధీజీ చేతనే శభాష్‌ అన్పించుకున్న సందర్భాలు కూడ ఉన్నాయి.

ఆనాడు కరాచిలో జరగనున్న జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల సందర్భంగా వ్యకిగత సత్యాగ్రహాన్ని ఓ నియమంలా కాకుండ ఓ నీతిలా అనుసరించాలన్న ప్రతిపాదన గురించి పత్రికల్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చ నేపద్యంలో సుల్తానా హయాత్‌ గాంధీజీకి

లేఖ రాశారు. ఆ లేఖలో కాంగ్రెస్‌ ప్రతిపాదనను ఆయన దృష్టికి తెస్తూ, వ్యక్తిగత సత్యాగ్రహం నియమం కాకుండ నీతి అని భావించినట్టయితే అది గాంధేయ మార్గానికి విరుద్దం కాదా? అని గాంధీజీని ఆమె ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా 1942 జనవరి 27న సుల్తానా హయాత్‌కు గాంధీజీ స్వయంగా లేఖ రాస్తూ ఈ విషయం మీదా నీ అభిప్రాయం సరైనది అని పేర్కొన్నారు.

ఓసారి ఉర్దూ భాష ముస్లింల భాష అని గాంధీజీ అన్నట్టుగా పత్రికలలో వచ్చింది. అది చూసిన సుల్తానా హయాత్‌ గాంధీజీతో విభేదిస్తూ, ఉర్దూ ముస్లింల భాష ఏమాత్రం కాదు, ఇది భారతీయులందిరి భాష కాగా మీరలా ఎందుకన్నారని ప్రశ్నించారు. ఆ ప్రశ్న కు సమాధానంగా నేను అలా అనలేదు. ఏంచేద్దాం ? పత్రికలలో చాలా విషయాలు తప్పులు రాస్తున్నారు అని ఆయన సుల్తానాకు సమాధానం చెప్పాల్సి వచ్చింది.

1946లో ఆమెకు లక్నో నివాసి, పండితుల కుటుంబం నుండి వచ్చిన హయాతుల్లా అన్సారీతో వివాహం జరిగింది. ఆయన ఉన్నత విద్యావంతుడు, గొప్ప 205 సాహితివేత్త, రచయిత, జర్నలిస్టు. అన్నిటి కంటే జాతీయోద్యమ నాయకులలో ప్రముఖులు. భర్త సహచర్యంలో ఒకవైపున జాతీయోద్యమంలో పాల్గొంటూ అప్పటికే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అమె జర్నలిజంలో శిక్షణ పొందారు. భార్యభర్తలు జాతీయవాదులు కావటంతో జాతీయోద్యమంలో చురుకైన పాత్రను నిర్వహించారు.

బేగం సుల్తానా హయాత్‌ అన్సారి ముస్లిం లీగ్‌ వేర్పాటువాదన్ని నిరసించారు. లీగ్‌నాయకుల వాదనలను పూర్వపక్షం చేస్తూ ప్రసంగాలు చేశారు. పత్రికలలో ప్రకటనల ద్వారా విభజన ప్రమాదాన్ని ప్రజలకు తెలిపారు. చివరకు స్వదేశానికి ' స్వరాజ్యం ' సిద్ధించినా, దేశం రెండుగా చీలిపోయినందున ఆ దుఃఖభారంలో మునిగిన సుల్తానా దంపతులు క్రియాశీల రాజకీయాల నుండి నిష్క్రమించారు.

ఆ విధంగా రాజకీయాలకు దూరమైన ఆ దంపతులు, హిందూ-ముస్లింల ఐక్యతకు కృషి ప్రారంభించారు. మత వైషమ్యాలను రెచ్చగొట్టే శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఉర్దూ భాషా పరిరక్షణోద్యమానికి ఎంతగానో చేయూతనిచ్చారు.ఈ లక్ష్యసాధన కోసం అంజుమన్‌ తారఖ్ఖీ-యే-ఉర్దూ Anjuman Taraqqi-e-Urdu)అను సంస్థను స్థాపించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. ఉర్దూ భాషను రక్షించాలని, ఆ భాషను అభివృద్థిపర్చాలని డిమాండ్‌ చేస్తూ, 20 లక్షల సంతకాలతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మహజరు సమర్పించారు.

మహిళలలో చెతన్యజ్యోతులు వెలిగించేందుకు సుల్తానా హయాత్‌ పలు మహిళా సంఘాలను, సంస్థలను స్థాపించారు. ఆ సంస్థలు ప్రస్తుతం శాఖోపశాఖలుగా విస్తరించి మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. మత సామరస్యానికి పాటుపడుతూ, మత మౌఢ్యానికి, అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడుతూ, మహిళా సంఘాలకు, ప్రజా సంఘాలకు మార్గదర్శకత్వం వహిస్తూ సుల్తానా హాయాత్‌ అన్సారి అశేష ప్రజానీకం ప్రేమాభిమానాలకు పాత్రులయ్యారు.

స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్‌ స్వీకరిస్తే అది నా మాతృదేశ భక్తికి నేను ఖరీదు కట్టినట్లు కాగలదు. అందువలన పెన్షన్‌ నాకొద్దు. - సఫియా అబ్దుల్‌ వాజిద్‌. 206