భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బీబీ అమతుస్సలాం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf

మత కలహాల మధ్యకు నడిచిన అహింసాయోధురాలు

బీబీ అమతుస్సలాం

(1907-1985)

స్వాతంత్య్రోద్యామ చరిత్రలో భాగంగా పరాయి పాలకుల బానిసత్వం నుండి గాంధేయ మార్గాన మాత్రమే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సాధ్యామని భావించి మహాత్ముని సాన్నిహిత్యంలో జీవితచరమాంకం వరకు గడపన మహతర చారిత్రక ఆవకాశం అతికొద్ది మందికి మాత్రమే దాక్కింది. అటువిం అద్భాుత అవకాశాన్ని సొంతం చేసుకున్నఅధృష్టవంతులలో ప్రముఖస్థానం ఆక్రమించారు బీబీ అమతుస్సలాం.

భారత జాతీయోద్యామం పట్ల అపార గౌరవాభిమానాలను ఆచరణలో వ్యక్తం చేసిన పాటియాలా రాజపుఠాణా పరివారంలో 1907లో బీబీ అమతుస్సలాం జన్మించారు. తల్లి పేరు అమతుర్రెహమాన్‌. తండ్రి కబ్దుల్‌ అబ్దుల్‌ హమీద్‌ పాటియాలా సంస్థానంలో ఆర్థిక మంత్రి. ఆయన 1920 ప్రాంతంలో కన్నుమూశారు. ఆరుగురు అన్నదామ్ములకు ఏకైక చెల్లెలిగా అమతుస్సలాం గారాబంగా పెరిగారు.

చిన్ననాటి నుండి స్వేచ్ఛావ స్వభావాన్ని వ్యక్తం చేసిన ఆమె సమకాలీన సమాజాన్ని ఆధ్యయనం చేసి పురాతన రీతి రివాజులను అహేతుక ఆచార, సంప్రదాయాలను వ్యతిరేకించారు. సామాజిక, రాజకీయ సమస్యల పట్ల మంచి అవగాహన కలిగి ఉన్నా, శారీరకంగా చాలా బలహీనం కావటంతో ఆమెకు ఆరోగ్యం అంతగా సహకరించేది కాదు. 185 అమతుస్సలాం 1930-1931 ప్రాంతంలో మహాత్ముని సేవాగ్రాం ఆశ్రమం వచ్చి చేరారు. పాియాలా సంస్థానంలోని సనాతన ముస్లిం కుటుంబంలోని ఏకైక పుత్రిక ఆశ్రమంలోకి ఎలా వచ్చారన్న విషయం ఆసక్తిదాయకం. ఈ క్రమాన్నిబాపూ కే సాత్‌ అను వ్యాసంలో ఆమె స్వయంగా వివరించారు. ఆ కథానం ఇలా సాగింది.

నా 13 సంవత్సరాలు వయస్సులో నేను ఖురాన్‌ మజీద్‌ను అనువాదంతో సహాపఠించాను. కొన్ని ధార్మిక గ్రంథాలను కూడ అధ్యాయనం చేశాను. మా కుటుంబంలో పర్దాను కఠినంగా అమలు చేసేవారు. స్వంత అన్నదమ్ముల ఎదుట కూడ సంచరించడానికి అనుమతి లభించేదికాదు. ఆ కారణంగా స్కూలుకు వెళ్ళే ప్రశ్నతలెత్తలేదు. నాన్న నన్ను అలీఘర్‌లోని బాలికల స్కూలుకు పంపాలనుకున్నారు. జాతి అభివృద్ధి నిమితం సామాజిక ఆంక్షలను ఉల్లంఘంచగల సాహసం ఆయనకుంది. ఆయన మరణంచటంతో దురదృష్టవశాత్తు ఆ ఆవకాశం నాకు లభించలేదు. ఆయన ఆకస్మికంగా మృత్యువాత పడ్డారు. ఆ కారణంగా నా చదువు ఉర్దూ రాయటం, చదవటం వరకు పరిమితమైంది.

నా పెదన్న ముహమ్మద్‌ అబ్దుర్రషద్‌ ఖాన్‌ జాతిజనుల సేవచేయాలన్నఆలోచనలను నాలో కలించారు. బ్రిీష్‌ ప్రబుత్యానికి వ్యతిరేకంగా 1920లో సాగిన ఖిలాఫత-సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. నా వివాహం త్వరిత గతిన చేయాలనుకుంటున్న మా ఆమ్మకు చిన్న వయస్సులో నా వివాహం చేయటం మంచిది కాదని ఆయన నచ్చచెప్పారు. ఒకవేళ నీవు నామాట వినకుండ చెల్లెలి వివాహం చేయదలచుకుంటే తాను ఆ వివాహానికి రానన్నారు. ఆ హెచ్చరికతో చిన్నన్నయ్యల ప్రమేయం లేకుండ పోయింది. అప్పటికి నా వివాహప్రయత్నాలు ఆగిపోయాయి.

చిన్నటిప్ప నుండి విలాసవంతంగా గడపటం, విలువైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు ధరించటం అంటే అయిష్టత ఉండేది. నా ఎదుట ఒక లక్ష్తంగాని, నా ఇష్టాయిష్టాలను అమ్మతో, అన్నయ్యలతో వ్యక్తంచేయగల సాహసం గాని లేదు. ఏకైక కుమార్తె కోసం అమ్మ ఎల్లప్పుడూ మంచి మంచి దుస్తులు, ఆభరణాలు తయారు చేయించేది. అవి నాకు నచ్చేవి కావు. చిన్ననాటి నుండి నా ఆరోగ్యం అంతగా మంచిది కాదు. సబర్మతీ ఆశ్రమం వెళ్ళేముందాు నేను టి.బి వ్యాధికి గురయ్యాను. ఈ మధ్యలో మళ్ళీ అమ్మ నా పెండ్లి గురించి పెద్దన్నయ్య మీదా ఒత్తిడి తీసుకురా సాగింది.

186 భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు


భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf
బొంబాయిలోని మా కుటుంబ వైద్యులు

డాకర్‌ బలమౌర్యను ఆయన సంప్రదించారు. నిరంతరం జ్వరంతో భాథాపడుతూ అమె వివాహం చేసుకోవటం ప్రమాదకరమని, మూడేండ్లు జ్వరం రానట్టయితే వివాహం చేయ వచ్చని ఆయన ఆన్నారు . ఆ ఆవకాశాన్ని నేను దొరకపు చ్చుకుని ఆరోగ్యం చెడగొట్టు కోసాగాను. ఆ దుష్పలితాలను ఈనాికి కూడ నేను అనుభవిస్తున్నాను.

ఇరవై సంవత్సరాల వయస్సులో నా ఆరోగ్యం కొంత కుదుట టపడటంతో అన్నయ్యలు నా పెళ్ళి ప్రయత్నాలను మళ్ళీ ప్రారంభించారు. నా ఇష్టాయిష్టాలు ఎవ్వరికీ పట్టలేదు. ఆ అనివార్య పరిస్థితులలో మీకు ఎక్కడ మంచిది అన్పిస్తే అక్కడ నా వివాహం చేయండి. అయితే నా భర్త రెండవ పెండ్లి చేసుకోడానికి నా పూర్తి అనుమతి ఉంటుందని నా అభిమతాన్ని నేను ప్రకటించాను. నా అభిప్రాయంతో అన్నయ్యలకు ఏకీభావన ఉన్నా, తండ్రి మరణానంతరం ఆరుగురు అన్నదమ్ములు ఉండి కూడ చెల్లెలు వివాహం చేయలేదని సమాజం ఎత్తిపొడుస్తుందని భయం కూడ ఉంది.

మా పెద్దన్నflయ్య అబ్దుర్రషీద్‌ ఖాన్‌ 1922లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షు లయ్యారు. ఆయన ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆరు మాసాలు జైలుశిక్షకు గురయ్యారు. నేను బుర్ఖాధరించి అంబాలాలోని వీధుల్లో తిరిగి ఖద్దరు ప్రచారం చేయసాగాను. పలు సమావేశాలు, సభలకు హజరు కాసాగాను. బేగం ముహమ్మద్‌ అలీ జోహర్‌, ఆయన తల్లి బీబీ అమ్మల పర్యటనలు తరచుగా పంజాబులో జరిగేవి. ఆ పర్యటనల ప్రభావం నామీద ఉండేది. ప్రజాసేవ చేయాలన్న ఉత్సాహం పెరగసాగింది. మా అన్న ఆరు మాసాలు జైలులో ఉన్నప్పుడు మా పిల్లల శరీరాల మీద ఖద్దారే ఖద్దరు కన్పించింది. అమ్మ చాలా సున్నితం. అందువలన ఆమె ఖద్దరు ధరిస్తే ఆమె నాజూకు శరీరం

187 గాయాలమయమయ్యేది. ఖిలాఫత్‌ ఉద్యమం సందర్భంగా హిందూ-ముస్లింలలో వ్యక్తమైన ఏకతా భావనను మరువలేను. బాపూ 21 రోజులపాటు నిర్వహించిన వ్రతం నా హృదయం మీద గాఢమైన ప్రభావం వేసింది.

నా ఎదుట భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తాయి. వివాహం చేసుకోదలచుకో లేదు, అయితే జీవితానికి ఏదో లక్ష్యం ఉండాలి. బాపూ నిర్వహిస్తున్న పలు ఆందోళనా కార్యక్రమాల గురించి వార్తా పత్రికల ద్వారా తెలుసుకుంటున్నాను. దండి యాత్రలో పాల్గొనాలని ఆసక్తి కలిగింది. స్వయంగా స్వేచ్ఛను కోల్పోయినదానను. ఆందోళనా కార్యక్రమాలలో పాల్గొనటం ఎలా సాధ్యం?...బ్రిటిషు వారి బానిసత్వంలో న్యాయవాద వృత్తి చేయకూడదాని అన్నయ్య అబ్దుర్రషీద్‌ నిర్ణయించుకున్నారు. ఆయన స్నేహితుడు ఆయనను ఇండోరు మహారాజు కార్యదర్శిగా ఇండోరు తీసుకెళ్ళారు.

ఆ క్రమంలో అమతుస్సలాం దేశసేవలో గడపాలని నిశ్చయించుకున్నారు. ఇండోరు వెళ్ళ క ముందు జాతీయోద్యామకారుడైన అబ్దుర్రషీద్‌ జాతీయోద్యమం విశేషాలను అమతుస్సలాంకు వివరించేవారు. జాతీయ భావాలను ఉద్భోదించే గ్రంథాలను ఆయన ఇంటికి తెచ్చేవారు. ఆ గ్రంథాలను, వార్తాపత్రికలను చదువుతూ జాతీయోద్యమం పట్ల ఆమె ఆసక్తి పెంచుకున్నారు. గాంధీజీ గురించి, అలీ సోదరుల తల్లి ఆబాది బానో బేగం, ముహమ్మద్‌ అలీ భార్య అంజాది బానో బేగం సేవల గురించి పత్రికలద్వారా తెలుసుకున్నారు.

మహాత్ముని అహింసా సిద్థాతం, ఆయన వ్యక్తిత్వం పట్ల అమతుస్సలాం బాగా ఆకర్షితులయ్యారు. ఆయన రాసిన ఆత్మకథను కూడ ఎంతో ఆసక్తిగా చదివారు. ఆ పుస్తకం ఆమెలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆమెకు నూతన మార్గం గోచరించింది. ఆ ప్రబావంతో మహాత్ముని బాటలో పయ నించాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఆ సమయంలో మహాత్ముడు సబర్మతీ ఆశ్రమంలో ఉన్నారు. అమె కూడ సబర్మతి ఆశ్రమంలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆమె అనారోగ్యం అందుకు అడ్డుగా నిలచింది. ఆ కారణంగా, ఆశ్రమ జీవితంలోని కఠిన నియమనిబంధనల మూలంగా ఆమెకు ఆశ్రమ ప్రవేశం సులభంగా లభించలేదు.

ఈ విషయాన్ని కూడ ఆమె వివరించారు. ఆ వివరణ ప్రకారంగా, నేను సబర్మతీ ఆశ్రమం వెళ్ళదలిచానని అన్నయ్యలతో చెప్పాను. ఓ నవ్వునవ్వి వారు ఊరకున్నారు.

188 నా ఇబ్బంది ఏమిటంటే నాకెవ్వరూ తెలియదు. బాపూతో కూడ ఎప్పడూ కలవలేదు. తరచుగా మీరాబెన్‌ పేరు మాత్రం చదివాను. ఆమెకు లేఖ రాశాను. చాలా కాలం ఎదురు చూశాక, మీరు ఇక్కడకు రావటంలో

ఉద్దేశ్యం ఏమిటి అని ప్రశ్నిస్తూ , మా ఇంటి విషయాలు అడుగుతూ ఆశ్రమ నిర్వహకులు నారాయణ దాస్‌ గాంధీ నుండి ఉత్తరం వచ్చింది. ఇంటిలో ఎవ్వరూ బాధపడరు కదా అంటూ నా ఆరోగ్యంగురించిన మెడికల్ సర్టిఫిక్‌ట్ ను ఆయన అడిగారు. అబద్ధాలుచెప్పిఫ్యామిలీ డాక్తరు నుండి తప్పుడు సర్టిఫిక్‌ట్ సంపాదించి ఆశ్రమంలో చేరటం ఆనాడు అమతుస్సలాంకు అంత కష్టం కాదు. అయినా ఆమె నిజాలు నిర్భయంగా తెలిపి ఆశ్రమంలో చేరాలనుకున్నారు. ఆపాటి కి ఆమెను ప్టిపీడిస్తున్న టి.బి. తగ్గిపోయింది. ఆ విషయం పేర్కొంటూ సర్టిఫికేటు ఇవ్వాల్సిందిగా ఆమె తమ కుటుంబ డాక్టర్‌ను ఆభ్యర్థించి సర్టిఫికెట్ సంపాదించారు. ఆ సర్టిఫికేటులో నాలుగు ఏండ్ల నుండి ఆమె నా వద్ద టి.బి. వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం ఆ వ్యాధి నయమైంది. అయితే ఆమె దేహం ఆశ్రమ నియమనిబంధనలకు తట్టుకోలేదు అని డాక్టర్‌ రాశారు. ఆ సర్టిఫికేటుతో తన అభ్యర్థ్ధన పత్రాన్ని ఆమె సబర్మతీ ఆశ్రమం పంపారు. ఆ అభ్యర్ధన పత్రంతోపాటుగా మీతోపాటుగా నేను కూడ దేశ సేవ చేయాలను కుంటున్నాను. శారీరక బలం లేని కారణంగా నాకు అనుమతి లభించటంలేదు. ఈ విషయ మై మీరు దయ ఉంచాలి అని గాంధీజీని వేడు కుంటూ అమతుస్సలాం ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆ తరువాత కూడ చాలా కాలంవరకు ఆశ్రమం నుండి జవాబు రాలేదు. 189 ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తూ క్షణమొక యుగంగా ఆమె గడపసాగారు. చివరకు సమాధానం వచ్చింది. ఆ లేఖలో మిమ్మల్ని ఆశ్రమంలో చేర్చుకోలేము. ఆశ్రమ జీవితం చూడలనుకుంటే మాత్రం మీరు అతిధులుగా ఇక్కడకు రావచ్చును అని పేర్కొన్నారు. అతిథిగా అనుమతించటమే చాలనుకుస్న్న ఆమె సబర్మతి వెళ్ళేందుకు సోదరులను డబ్బు అడగకుండ బలవంతంగా అమ్మ ధరింపచేస్తుస్న్న ఆభరణాలను విక్రయించి, వచ్చిన డబ్బును ప్రయాణఖర్చులకు ఉపయాగించుకుని ఆశ్రమం చేరారు. ఈ విధగా గాంధీజీ సన్నిహిత వరంలో స్థానం పొంది, స్వాతంత్రోద్యామ చరిత్రలో ప్రత్యే కతను సంతరించుకున్న గాంధేయవాది అమతుస్సలాం ఆటంకాలన్నీ అధిగమించి తన 25 సంవత్సరాల వయస్సులో సబర్మతీ ఆశ్రమనివాసి అయ్యారు.

ఆశ్రమపు కఠిన నియమనిబంధాలను పాటిస్తూ, అంకితభావం, నిబద్ధత, సేవాతత్పరతతో, చక్క ని క్రమశిక్షణతో ఆశ్రమవాసులలో ఒకరిగా ఆమె ఇమిడిపోయారు. ఆ క్రమంలో ఆమె శ్రీమతి కసూర్బాకు, మహాత్మాగాంధీకి కన్నబిడ్డ సమానమయ్యారు. ఆ దంపతులకు కస్న్నకూతురుగా సేవలందించారు. ఆశ్రమంలో అతిధిగా ఆహ్వానించబడిన ఆమె చివరకు ఆశ్రమ సేవికయ్యారు. ఒక ప్రసిద్ధ ముస్లిం రాజపుఠానా జాగీర్దార్‌ కుటుంబానికి చెందిన అమ్మాయి ఆశ్రమంలో చేరి అవివాహితగా జాతీయోద్యమానికి తనను తాను సమర్పించుకోవటం ఆనాడు ఊహించని సంఘటన.

అమతుస్సలాం అన్ని కష్టాలను-నష్టానలను, ఆనారోగ్యం కారణంగా ఏర్పడిన శారీరక బలహీనతలను దృఢ సంకల్పంతో అధిగమించి మహాత్ముని ప్రశంసలకు పాత్రురా లయ్యారు. మహాత్ముని ప్రియమైన పుత్రిక గా ఖ్యాతిగాంచారు. 1922లో గాంధీజీ సబర్మతీ ఆశ్రమం మూసివేశారు. ఆ సమయంలో మహాత్ముని అనుమతితో అనారోగ్యాన్ని ఏమాత్రం లెక్కచేయక ఆశ్రమంలోని ఇతర మహిళలతో ఆమె కూడ జైలు కెళ్ళారు. ఆమె జైలు నుండి విడుదల కాగానే సేవాగ్రాం వచ్చి బాపూజీకి వ్యకిగత సహా కురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ పాత్రలో ఆమె గాంధీజీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అన్ని సందర్భాలలో, అన్ని పర్యటనలలో ఆయన వెంట ఉన్నారు.

బాపూజీ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వెళ్ళిన సందర్భంగా అమతుస్సలాం తన జీవితంలోని అతి ప్రధాన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా, స్వరాజ్య సాధనతోపాటుగా హిందూ -ముస్లిల ఐక్యత, హరిజనుల సంక్షేమం తన జీవిత లక్ష్యమని ప్రకించారు. ఈ విషయం తెలుసుకుస్న్న బాపూజీ ఆమెకు లేఖ రాస్తూ నీవు సేవా 190 కార్యక్రమాల నిర్వ్హణకు తొందర పడవద్దు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని సూచించారు. ఆ సూచన ఆమె నిర్ణయాన్ని ప్రభావితం చేయలేకపోయింది. ఆమె నిర్దేశించుకున్న దిశగా ముందుకు సాగిపోయారు. అనారోగ్యం కూడ లెక్కచేయక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న ఆమె కృషిని గమనించిన గాంధీజీ తన సన్నిహితులకు, మిత్రులకు రాసిన ఉత్తరాలలో అమతుస్సలాంను ప్రశంసావాక్యాలతో ముంచెత్తారు .

1944 ప్రాంతంలో ముహమ్మద్‌ అలీ జిన్నాను గాంధీజీ QAID-I-AZAM అని సంబోధించడంలో ఆమె ప్రధాన పాత్ర వహించారు. ఈ విషయాన్ని మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తన ఇండియా విన్స్‌ ఫ్రీడంలో పేర్కొన్నారు. ముహమ్మద్‌ అలీ జిన్నా ఇంటర్యూను కోరుతూ మహాత్ముడు జిన్నాకు లేఖ రాస్తున్న సందర్భంగా, QAID-IAZAM అని జిన్నాను సంబోధించాల్సిందిగా అమతుస్సలాం గాంధీజీని సలహా ఇచ్చారు. ఆ విధమ్గా ఉర్దూ పత్రికలు సంబోధిస్తున్నాయని అమె ఆయనకు తెలిపారు. ఆ సలహా పరిణామాలను ఆలోచించకుండ జిన్నాను మహాత్ముడు QAID-I-AZAM అని తన లేఖలో సంబోధించటంతో జిన్నా వ్యక్తిగత ప్రతిష్ట అనూహ్యంగా పెరిగింది. అది భారత రాజకీయాలలో పెనుమార్పుకు కారణమయ్యిందని ంఓఊలానా పేర్కొన్నారు.(India Wins Freedom, Maulana Abul Kalam Azad, Orient Longman, Hyderabad, 1995, Page. 96-97) ఈ విధగా అమతుస్సలాం భారతదశ చరిత్రలోని ఓ కీలక సమయంలో తనదెన పాత్రను పోషించి చరిత్రమలుపుకు కారణమయ్యారు.

మహాత్ముని బాటన జాతీయోద్యమంలో నడిచిన బీబీ అమతుస్సలాం హిందూ, ముస్లిం ఐక్యతా చిహ్నమయ్యారు. మతకలహాలను నివారించేందుకు ఆమె నిరంతరం కృషి సల్పారు. మత ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ఆమె ఎంతో సాహసంగా వెళ్ళి ఆ కల్లోలిత ప్రాంతాల ప్రజలను ఆదుకున్న ఘటనలు ఉన్నాయి. వాయువ్య సరిహద్దులు, సింధ్‌, నౌఖాళి ప్రాంతాలలో మతకలహాలు విజృంభించినప్పుడు మత సామరస్యం ప్రబోధించేందుకు తన ప్రత్యేక దూతగా గాంధీజీ ఆమెను పంపారు.

వాయవ్య సరిహద్దులలో భయంకర మతఘర్షణలు ఉదృతంగా సాగుతున్నప్పుడు ఆ ప్రాంతాలకు ఆనేక కష్టనష్టాలకోర్చి ఆమె వెళ్ళారు. దట్టమైన అడవుల గుండ గుర్రం మీదా స్వారి చేస్తూ మతకలహాల బారిన పడిన ప్రాంతాలకు వెళ్ళి అన్ని వర్గాల ప్రజానీకంతో కలసి పోయి హిందూ ముస్లింల ఐక్యతను సాధించటంలో ఆమె చూపిన తెగువ నేర్పు ప్రతి ఒక్కరి ప్రశంసలందుకుంది. 191 సింధ్‌ ప్రాంతంలో మత ఘర్షణలు జరుగుతుండగా అమతుస్సలారను అక్కడకు పంపుతూ ఆయన సన్నిహితులు ఆనంద్‌ హింగోరికి 1940 నవంబరు 6న గాంధీజీ లేఖ రాశారు. ఆ లేఖలో, సింధ్‌లో జరుగుతున్న భయానక ఘర్షణలను ఆపేందుకు ఆమె ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వస్తుంది...ఆమె చాలా ధైర్యస్థురాలు, హింసాకాండను అడ్డుకునేందుకు ఆమె తన ప్రాణాలను సైతం పణంగా పెట్టగలదు అని ఆ ప్రాంతంలోని తన ఇతర పరిచయస్తులకు రాసిన ఒక లేఖలో గాంధీజీ పేర్కొన్నారు.

ఈ మేరకు మత ఘర్షణలలో భాగంగా హింస ప్రజ్వరిల్లినప్పుడల్లా,వాటిని నిరోధించేందుకు ప్రజలలో స్నేహభావాన్ని పెంపొందించి శాంతి,సామరస్యాలు కాపాడేందుకు ఆమె చేసిన కృషిని సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ గపూర్‌ ఖాన్‌ 1943లో రాసిన ఉత్తరంలో ఎంతగానో కొనియాడరు.

నౌఖాళి మత కలహాలలో అక్కడ జరుగుతున్న హత్యాకాండను, హింసాత్మక వాతావరణాన్ని నివారించేందుకు మహాత్ముని ఆదేశాల మేరకు ఆమె వెళ్ళారు. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నించి చివరి అస్త్రంగా ఆమె సత్యాగ్రహ దీక్షను చేప్టారు. గాంధేయవాదిగా ఆమె చేప్టిన సత్యాగ్రహదీక్ష 20 రోజులపాటు సాగింది. ఆమెలో ఉన్న చిత్తశుద్ది, హిందూ-ముస్లింల మధ్యన ఆమె కోరుకుంటున్న ఐక్యత పట్ల ఉన్న నిబద్ధతను ఆర్థంచేసుకున్న ఇరువర్గాలు మతసామరస్య వాతావరణం ఏర్పడేందుకు దోహదపడ్డాయి. ఆ తరువాత గాంధీజీ ఆక్కడకు వెళ్ళి ఆయన స్వయంగా అందించిన పళ్ళ రసం సేవించి అమతుస్సలాం సత్యాగ్రహ దీక్షను విరమించారు. ఈ విధామైన సాహసోపేత కార్యక్రమాలతో గాంధీజీ నిజమైన వారసురాలుగా ఆమె ఖ్యాతిని దాచుకున్నారు.

స్వేచ్ఛా భారతం కోసం కలలుగన్న జాతీయోద్యమకారులు తాము కన్నకలలను భగ్నం చేస్తూ ఇండియా ముక్కలయ్యింది. ఆ విభజన కూడ మతం పేరిట సాగటంతో అమతుస్సలాం చలించి పోయారు. ఆ విఘాతం నుంచి బయట పడేలోపుగా గాంధీజీ హత్యకు గురయారయ్యారు. కన్నబిడ్డలా ఆదారించిన మార్గనిర్థేశం చేసి, అనారోగ్యపీడిత శరీరానికి మానసిక స్థైరాన్ని కలుగచేసే ఉపదేశం ఇచ్చిన మహాత్ముడు ఆకస్మికంగా అంతర్థానమయ్యేసరికి ఆమె తట్టుకోలేక పోయారు. ఆ ఆవేదన నుండి త్వరిత గతిన బయటపడి గాంధీజీ చూపిన బాటలో ప్రజల సేవకు ఆమె పూర్తిగా పునరంకితం అయ్యారు. 192

విభజన సమయంలో ఎదురైన
భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf

భయానక పరిస్థితుల బాధితులను ఆదుకునేందుకు ఆమె బాగా శ్రమించారు. నిస్సహాయ మహిళల సమస్యను అమతుస్సలాం ప్రదానంగా స్వీకరించారు. మృద్రులా సారాబాయి, సుభద్రా జోషి ల తో క ల సి అటు పాకిస్థాన్‌ ఇటు ఇండియా నుండి వేరుపడిన మహిళలను తమవారున్న ప్రాంతాలకు సురక్షితంగా చేర్చటం కోసం అమితంగా శ్రమించారు. ఈ పని మీద ఆమె పలుమార్లు పాకిస్థాన్‌ కూడ వెళ్ళారు.

ఆ తరువాత పంజాబ్‌లోని రాజపూర్‌ గ్రామంలో తనను కన్న కూతురులా చూసుకున్న కస్తూర్బా గాంధీ పేరిట కసూర్బా మందిరం అను ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆశ్రమంలో మహిళలకు చేతి వృతులను నేర్పటం, అకర జ్ఞానం అందించటం తదితర కార్యక్రమాలను చేపట్టారు. నిస్సహాయులైన మహిళలు తమ కాళ్ళమీద తాము నిలబడగలిగే ఆర్థిక బలాన్ని చేకూర్చేందుకు పలు పథకాలను రూపొందించి అమలు చేశారు.ఈ ఆశ్రమానికి సంబంధించి పలు శాఖలను ఆమె ఏర్పాటు చేశారు. అంటరానితనం మీద యుద్ధం ప్రకిటించారు. దళిత జనులలో అక్షరజ్యోతులను వెలింగించేందుకు ప్రయత్నించారు. ఆశ్రమంలో కార్యకలాపాలను ఆమె తన పర్యవేక్షణలో నిర్వహిస్తూ అటు దళితుల, ఇటు మహిళల సేవలకు అంకితమయ్యారు.

సంపన్న జమీందారీ కుటుంబం నుండి తన భాగంగా లభించిన అతి విలువైన ఆస్థిపాస్థులను కస్తూర్బా ఆశ్రమ కార్యకలాపాల నిర్వహణకు వినియోగిస్తూ హరి జనోద్దరణకు, నిస్సహాయ మహిళలకు చేయూతనివ్వటం కోసం ఎన్నో కార్యక్రమాలను, వ్యవస్థలను అమతుస్సలాం రూపొందించారు. శిశు సంక్షేమ కార్యాలయాలు, పాఠశాలలు,


193 నర్సరీలు, ఖాదీ కార్ఖానాలు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులలో శిక్షణ ఇచ్చే శిక్షణాలయాలను స్థాపించారు. ఈ కార్యక్రమాల వలన వేలాది అవసరార్థులకు పని లభించింది. ఎంతో మంది మంచి శిక్షణ పొంది ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవటం స్వయంగా గమనించిన ఆమె తన తలితండ్రుల ద్వారా లభించిన ఆస్తిపాస్తులు ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపుతున్నందుకు ఎంతో సంతోషించారు.

జాతి సమైక్యత, సమగ్రతలను పటిష్ట పర్చేందుకు, హిందూ ముస్లింల మధ్యన ఐక్యతా భావనలను ప్రచారం గావించేందుకు, సస్నేహపూరిత వాతావరణం పటిష్టం చేయాలని సంకల్పించిన ఆమె హిందూస్థాన్‌ అను ఉర్దూ పత్రికను నడిపారు. ఈ పత్రిక ద్వారా గాంధేయ సిద్ధాంతం మహాత్ముని ఉపదేశాల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారకార్యక్రమంలో భాగంగా ఆమె పలు రాష్ట్రాలలో పర్యటించటం మాత్రమే కాకుండ జపాన్‌ లాంటి దేశాలకు కూడ వెళ్ళివచ్చారు. ఈ సందార్భంగా మాతృభాష ఉర్దూ కాకుండ పంజాబీ, ఒరియా, బెంగాలి, తెలుగు, తమిళం, ఆంగ్లం, జపానీస్‌ భాషలను ఆమె నేర్చుకున్నారు.

1961లో తొలిసారిగా భారత దేశం వచ్చిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ వెంట ఉండి ఆయనకు సేవలందాచేశారు. ఆయనతోపాటు దేశవ్యాప్త పర్యటనలో పాల్గొన్నారు. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు దత్త కుమారుడు సునీల్‌ కుమార్‌ సహాయంతో మన వీర జవానులకు సేవలందించారు. హెలికాప్టర్‌ ద్వారా నేఫా తదితర ప్రాంతాలు పర్యటించి ఆహారం, దుస్తులు, మందులు అందచేశారు. 1965 నాటి పాకిస్థాన్‌ యుద్ధం సందార్భంలో కూడ ఆనారోగ్యాన్ని కూడ లెక్కచేయక లద్దాఖ్‌ ప్రాంతంలో ఉన్న మన సైనిక యోధులకు ఆహారం, దుస్తులు తదితర సదుపాయాలను కలుగజేశారు.

ఈ మేరకు ఒకవైపున నిరంతరం అనారోగ్యంతో పోరాటం సాగిస్తూ మరోవైపున బ్రిటిషు పాలకులతో పోరులో ముందుకు సాగుతూ, ఆ తరువాత సామాజిక సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తూ జీవిత చరమాంకం వరకు గాంధేయ మార్గంలో సమరశీల జీవితాన్ని గడిపిన బీబీ అమతుస్సలాం 1985 అక్టోబర్‌ 29న కన్నుమూశారు.

194