భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/మాసుమా బేగం

వికీసోర్స్ నుండి

భారత దేశంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర సృష్టించిన

మాసుమా బేగం

(1902-1990)


జాతీయోద్యమంలో భాగస్వాములవటంతో పాటు స్వతంత్ర భారత ప్రభుత్వంలో కూడ బాధ్యతలు నిర్వహించగల అవకాశాలు దక్కించుకొన్న స్వాతంత్య్రసమరయోధులు కొద్దిమంది మాత్రమే . ఆ అరుదైన అవకాశంతో పాటుగా పదవులు పొందిన పదిమందిలో ప్రథమంగా నిలచి చరిత్ర సృష్టించుకున్న భాగ్యాన్ని దక్కించుకున్న వారు అతికొద్దిమంది. ఆ ఆతికొద్దిమంది అదృష్టవంతుల్లో ఒకరు మాసుమా బేగం. ఆంధ్రప్రదేశ్‌ తొలి మంత్రి వర్గంలో తొలి మహిళా మంత్రి, తొలి ముస్లిం మంత్రి, మొత్తం భారత దేశంలోనే మంత్రిపదవిని నిర్వహించిన తొలి ముస్లిం మహిళ మాసుమా బేగం 1902లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదారాబాద్‌లో జన్మించారు. తల్లి పేరు తయ్యిబా బేగం(Tayyiba Begum). తల్లి మంచి విద్యావంతురాలు. అమె భారత దేశంలోనే తొలి ముస్లిం పట్టభధ్రురాలు. తండ్రి పేరు ఖదీవ్‌ జంగ్‌.(Khedv Jung) తాత సయ్యద్‌ హుస్సేన్‌ బిల్‌గ్రామి(Syyid Husain Bilgrami). ఆచార, సంప్రదాయ కుటుంబంలో పుట్టిన మాసుమా బేగం, ఆమె చెళ్ళెల్లు హైదారాబాద్‌ లోని మహబూబియా బాలికల పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఆమె

265

తండ్రి వైద్యశాఖలో ఉప డైరక్టరుగా పనిచేశారు. ఆమె సోదరుడు అలీ యావర్‌ జంగ్‌ హైదారాబాదులో విద్యామంత్రిగా వుండి, తరువాత ఈజిప్టు, యగోస్లోవియాలలో భారత రాయబారి పదవి నిర్వహించారు. ఆమె వంశంలోని అకిల్‌ జంగ్‌ పి.డబ్యూ.డి మంత్రి గానూ, ఆమె దగ్గరి బంధువు మోహ్దీన్‌ యార్‌జంగ్‌ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె సన్నిహిత బంధువులంతా ఉన్నత విద్యావంతులుగాని ఉన్నత పదవులు నిర్వహించినవారు గాని కావటంతో పరిపాలనా దక్షత ఆమెకు ఉగ్గుపాలతో పెట్టినట్లయ్యింది.

1922లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదివిన సమీప బంధువు హుసైన్‌ అలీ ఖాన్‌ను మాసుమా బేగం వివాహం చేసుకున్నారు. ఆతరువాతి కాలంలో ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం అధిపతిగా పనిచేశారు. ఆయన డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు లాంటి ప్రముఖులకు గురువుగా గణనకెక్కారు. అంతి విద్వత్తు స్వతంత్ర, ఉదార భావాలు గల వ్యక్తి భర్తగా లభించటంతో చిన్నతనం నుండి సమాజ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిన మాసుమా బేగం ఆ బాటలో ఇనుమడించిన ఉత్సాహంతో సాగగలిగారు.

తల్లితండ్రులు విద్యావంతులు కావటం, భర్తకూడ మంచి పండితుడు కావటంతో మాసుమా బేగం విద్యావ్యాప్తి పట్ల దాృష్టిసారించారు. మహిళల్లో చైతన్యాన్ని చదుా వు ద్యారా సాధించవచ్చని, సమస్యల పరిష్కారానికి విద్యా ఇతోధికంగా తొడ్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు . సమాజసేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా లభించిన అనుభవం మేరకు అన్ని సామాజిక రుగ్మతలకు నిరక్షరాస్యత ప్రధాన కారణమని భావించిన ఆమె ఆ రంగాన్ని ఎంచుకున్నారు.

1921లో విద్యావ్యాప్తి ప్రధాన లక్ష్యంగా గల అంజుమన్‌కు అధ్యాక్ష్యులు గా ఆమె ఎన్నికయ్యారు. భర్త అనుమతి, ప్రోత్సాహంతో విద్యావ్యాప్తి కోసం మాత్రమే కాకుండ సంఘసేవా కార్యక్రమాలలో, సామాజిక రుగ్మతల నివారణకు చురుకుగా పాల్గొన్నారు. పలు విద్యా, సాంఫిుకసేవా సంస్థల ఏర్పాటుకు కృషిచేయటమేకాకుండ ఆయా సంస్థలలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. ప్రధానంగా మహిళా సంఘాల కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. 1927లో అఖిల భారత మహిళా సంస్థకు హైదారాబాద్‌లో శాఖను ఏర్పాటు 266 చేశారు. ఆ శాఖకు ప్రధాన కార్యదర్శిగానూ, అధ్యక్షురాలిగాను ఆమె బాధ్యతలు నిర్వహించారు. ఆ సందర్భంగా మహిళలచే అఖిల భారత మహిళా సంస్థ శాఖలను ప్రారంభింపచేసి ఆ సంస్థ కార్యకలాపాలను పర్య వేక్షించారు. ఈ మేరకు ఆమె నిర్వహించిన సేవలకు గుర్తింపుగా ఆమెకు అఖిల భారత మహిళా సంస్థ ఉపాద్యక్ష పదవి లభించింది. ఆ హోదాలో ఆమె పలు ప్రాంతాలను విస్త్రుతంగా పర్యటించారు.

సంఘ సేవాకార్యక్రమాల నిర్వహణలో అవిశ్రాంతగా శ్రమిస్తూ కూడ ఆమె ఆనాటి రాజకీయల మీద దృష్టిసారించారు. జాతీయ సేవాభావాలు గల ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపారు. జాతీయోద్యమంలో భాగంగా ఉనికిలోకి వచ్చిన పలు సంస్థల్లో కార్యక్రమాలలో ఆమె సభ్యురాలిగా పాల్గొన్నారు. ఈ మేరకు అటు సమాజ సేవా కార్యక్రమాల ద్వారా, ఇటు రాజకీయ కార్యక్రమాల వైెపు మొగ్గు చూపిన కారణంగా అటు ప్రజల ఇటు రాజకీయ ప్రముఖుల మన్నన పొందారు.

ఆ కారణంగా స్వతంత్ర భారతదేశం అవతరించాక 1952 లో తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాసుమా బేగంను కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆమె షాలిబండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగారు. ప్రముఖ కవి, కమ్యూనిస్టు పార్టీనాయకుడు, కార్మికనేత మగూం మోహిద్దీన్‌ ఆమె ప్రత్యర్ధి. ఆయన పీపుల్స్‌ డెమాక్రటిక్ ఫ్రంట్‌ అభ్యర్థిగా పోటిచేశారు. ఆ ఎన్నికలలో ఏడు వందల 74 ఓట్ల ఆధిక్యతతో మాసుమా బేగం విజయం సాధించారు.

ఆ తరువాత 1957లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఆమె పోటిచేసి గెలిచారు.ఈ సారి ఫత్తర్‌ఘట్టి అసెంబ్లీ నుండి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు అకర్‌ హుస్సేన్‌ ను 513 ఓట్ల ఆధిక్య తతో పరాజితుల్ని చేశారు. ఈ ఎన్నికల సందర్బంగా ఆమె నిర్వహించిన ప్రచారం తీరు కూడ ప్రజలను బాగా ఆకట్టుకుంది. ప్రచారంలో ప్రత్యరుల కంటే ఆమె ముందుండటం విశేషం. ప్రతిరోజు వేకువ జామున ప్రచారానికి బయలు దేరి ప్రత్యర్థులు ప్రచారానికి జనంలోకి వచ్చేలోగా ఆమె తన ప్రచారాన్ని ముగించటం విశేషం.(Secluded Scholors, Gail Minault,OUP, New Delhi, 1999, Page.272-273). ముస్లిం మహిళ అయిఉండి కూడ ప్రచార కార్యక్రమంలో ప్రత్యరుల కంటే ముందుండడం ఆమె రాజకీయదక్షతకు నిదర్శనం.

ఈ విజయాల ద్వారా ఆమెకు ఎనలేని కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టిన పదవులు లభించాయి. 1957లో Congress Legislative Party Deputy Leader గా నియమితులయ్యారు. ఆ సంవత్సరంలోనే Member-in-Charage-International Relations గా ఎంపికయ్యారు. ఆ పదవిలో ఆమె తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. (The Legend Makers Some Eminent Muslim Women of India, Gouri Srivastava, Concept Publishing Company, New Delhi, 2003, Page. 91)

ఆ తరువాత ప్రముఖ కాంగ్రెస్‌ నేత దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో సాంఫిుక సంక్షేమం, ముస్లిం ఎండోమెంట్స్ శాఖా మంత్రి పదవి ఆమెకు లభించింది.ఈ పదవిలో 1960 నుండి 1962 వరకు కొనసాగి, ఆంధ్రప్రదేశ్‌ తొలి మంత్రి వర్గంలో తొలి మహిళా మంత్రిగా, తొలి ముస్లిం మంత్రిగా, మొత్తం భారత దేశంలోనే మంత్రిపదవిని నిర్వహించిన తొలి ముస్లిం మహిళగా మాసుమా బేగం చరిత్ర సృష్టించారు.

1962లో ఫతర్త్‌ఘట్టి నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా స్వతంత్ర అభ్యర్థి సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ మీదా పోటిచేసి ఆమె పరాజితులయ్యారు. అప్పి నుండి ఆమె సమాజసేవాకార్యక్రమాలకు పరిమితమయ్యారు. ప్రభుత్వ పరంగా వివిధ మహిళా, శిశు సంక్షేమ సంస్థలు, విద్యావాప్తి సంఘాలలో పలు బాధ్యాతలు చేపట్టారు. హైదారాబాద్‌లోని అంజుమన్‌-యే-ఖవాతీన్‌, లేడు హైదారీ క్లబ్‌ ప్రధాన సభ్యురాలుగా, రెడ్‌క్రాస్‌ సంస్థ కార్యనిర్వాహక సమితి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

మంచి వక్త, కార్యదక్షురాలుగా ఖ్యాతిగాంచిన మాసుమా బేగం అఖిల భారత మహిళా సంస్థ నేతగా 1957లో కొలంబో, అఖిల భారత మహిళా సంస్థ ప్రతినిధి మండలి డిప్యూటీ నాయకురాలిగా 1959లో రష్యా, ఐక్యరాజ్యసమితి సమావేశాలకు జెనివా వెళ్ళి వచ్చారు. ఆ తరువాత యుగస్లోవియా, ఇండోనేషియాలలో పర్యిటించారు. ఈ మేరకు అటు రాజకీయ రంగాన, ఇటు సేవారంగాన మాత్రమే కాకుండ సాహిత్య రంగాన కూడ అగ్రగామి అన్పించుకున్న మాసుమా బేగం 1990లో కన్నుమూశారు.