Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/అనిస్‌ బేగం కిద్వాయ్

వికీసోర్స్ నుండి


పరాయి పాలకులను ప్రాలదోలేందుకు కుటుంబాలకు కుటుంబాలు పాటుపడిన వైనం స్వాతంత్య్రోద్యమం పట్ల భారతీయులలో నిబిఢీకృతమైఉన్న నిష్టకు-నిబద్ధతకు రుజువు. ఆ కుటుంబాలలో నెహ్రూ˙ కుటుంబం, తయ్యాబ్జీ కుటుంబం, పైజీ కుటుంబం, కిచ్లూ కుటుంబం, కిద్వాయ్‌ కుటుంబం లాంటి కొన్నికుటుంబాలను ప్రధానంగా పేర్కొనవచ్చు. ఆ కుటుంబాలు అద్వితీయ త్యాగాలతో స్వాతంత్య్రోద్యమం చరిత్రలో తమదంటూ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అటువంటి చరిత్ర కలిగిన కిద్వాయ్‌ కుటుంబ సభ్యురాలు అనిస్‌ బేగం కిద్వాయ్‌.

ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకిలోని షేక్‌ విలాయత్‌ అలీ ఇంట అనిస్‌ బేగం 1906లో జన్మించారు. తండ్రి విలాయత్‌ అలీ న్యాయవాది. ఆయన బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేకి. ఆంగ్లేయులకు అండగా నిలచిన అలీఘర్‌ మేధావులతో సరిపడని వ్యకి. హిందూ ముస్లింల ఐక్యతను ఆకాంక్షించే సమరయాధులు. భారత జాతీయ కాంగ్రెస్‌-ముసింలీగ్ ల మధ్య సయాధ్యను కోరుకున్న ప్రముఖులు. (Rafi Ahamed Kidwai, Dr.M.Hashim Kidwai, Govt. of India Publications, NewDelhi,1986, Page. 24-25) చిన్నతనం నుండి బేగం అనిస్‌ తండ్రితోపాటుగా రాజకీయ, సాహిత్య సభలు,

261 సమావేశాలకు హజరవుతూ తండ్రి నుండి బ్రిటీష్‌ వ్యతిరేకతను సంతరించుకున్నారు. ఆయన మౌలానా ముహమ్మద్‌ అలీ సంపాదకత్వంలోని కామ్రెడ్‌, రాజా గులాం హుస్సేన్‌

సంపాదకత్వంలోని న్యూ ఎరా పత్రికలలో ప్రత్యేక వ్యాసాలు రాశారు. తండ్రి నుండి

రాజకీయ, సాహిత్య పరిజ్ఞానాన్ని, దేశభక్తి భావనలను ఆమె చిన్నతనంలోనే పుణికి పుచ్చుకున్నారు.

ఆ కుటుంబం రాజకీయంగా ఎలా ఉన్నా విద్యవిషయంలో మాత్రం సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ మార్గదర్శకత్వంలో మగ పిల్లలందరికి ఆంగ్ల చదువులు చెప్పించి, ఆడపిల్లలను మాత్రం దూరంగా ఉంచింది. అనిస్‌ బేగం సోదరులకు విద్యగరిపేందుకు ట్యూటర్లను ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆమె కూడ సోదరులతో కలసి కూర్చోని ఉర్దూ, ఇంగ్లీషు భాషలను నేర్చుకున్నారు తప్ప ప్రత్యేకంగా ఆమె చదువుకోలేదు. ఆమె 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తండ్రి ఇనాయత్‌ అలీ కన్నుమూశారు. ఆ కారణంగా ఆమెకు చదువుకునే అవకాశాలు లేకుండా పోయాయి.

ఆమె తమ సన్నిహిత బంధువు షఫీ అహమ్మద్‌ కిద్వాయ్‌ను వివాహం చేసుకున్నారు. షఫీ అహమ్మద్‌ ప్రముఖ జాతీయోద్యమకారుడు రఫి అహమ్మద్‌ కిద్వాయ్‌ తమ్ముడు. అన్నతోపాటుగా షఫీ అహమ్మద్‌ కూడ బ్రిటిషు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారు. సహాయనిరాకరణ ఉద్యమం సందర్బంగా తాను చేస్తున్న ప్రబుత్వఉద్యోగానికి రాజీనామా చేసి రఫి అహమ్మద్‌ కిద్వాయ్‌తో కలసి ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన ముస్లింలీగ్ రాజకీయాలకు వ్యతిరేకి. హిందూ- ముస్లింల ఐక్యతకోసం నిరంతరం కృషి చేసిన ప్రముఖులు. (Rafi Ahamed Kidwai : Page. 34-35)

చిన్ననాటనే తండ్రి నుండి జాతీయ భావాలను సంతరించుకున్నఅనిస్‌ బేగంకు బ్రిటిషు వ్యతిరేక భావాలు గల భర్త లభించటం, అటుపుట్టింటివారు, ఇటు అత్తింటివారు వారు కూడ జాతీయోద్యమకారులు కావటంతో ఎంతో ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహంతో ఉద్యమకార్యక్రమాలలో ఆమె మరింతగా నిమగ్నమయ్యారు. బావ, భర్త ఖిలాఫత-సహాయనిరాకరణ ఉద్యమాలలో అగ్రగాములుగా నిలచి పోరుబాట సాగటంతో అనిస్‌ బేగంకు పోలీసుల బెడద తప్పలేదు. కుటుంబంలోని ఆర్జనాపరులు ఉన్నతా ఉద్యోగాలను వదలుకుని ఉద్యమబాట పట్టడంతో ఆర్థిక ఇబ్బందులు కూడ అనిస్‌ బేగంను చుట్టునుట్టాయి. ఆనాడు రాజకీయంగా దృఢమైన అభిప్రాయాలు గల అనిస్‌ను అటు పోలీసులుగాని ఇటు ఆర్థిక ఇబ్బందులుగాని ఏమీ చేయలేకపోయాయి. ఆమె

262 చివరికంటగా స్వరాజ్యం సాధించేందుకు ముందుకు సాగారు. ఆ కుటుంబం ఆకాంక్షాంచిన స్వరాజ్యం సిద్ధించింది. ఆశించ ని విధం గా భారత దేశ విభజన జరిగింది. ఆ సందర్బంగా కిద్వాయ్‌ కుటుంబం వ్యాకులతకు లోనైంది. ఆ బాధ నుండి తేరుకొనే లోపుగా అనిస్‌ మీదా పెను ఉప్పెన విరుచుక పడింది. ఆమె భర్త షషీ అహమ్మద్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఆది నుండి

అనీస్‌ కిద్వాయ్‌ హ్ందూ-ముస్లింల ఐ క్యతను కోరుకుంటూ మతోన్మాదాన్ని అన్ని విధాల ఎదుర్కొన్న షఫీ అహమ్మద్‌ను మతోన్మాద జ్యాలలు బలితీసుకున్నాయి. ఆ సమయంలో ఆయన ముస్సోరి మున్సిపల్‌ బోర్డులో కార్యనిర్వాహక ఆధికారిగా బాధ్య తలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలోని హిందూ-ముస్లింల మధ్యన సామరస్యం కోసం నిరంతరం తపనపడ్డారు. ఆ దిశగా మహాత్మాగాంధీ మారదర్శకత్వంలో ఎంతో కృషి సల్పారు. అటు వంటి హిందూ-ముస్లిం ఐక్యతాభిలాషిని విభజన నేపధ్యంలో వెల్లువెత్తిన మతోన్మాదం పొట్టనపెట్టుకుంది.

ఆ సంఘటనతో అనిస్‌ బేగం చలించిపోయారు. ఏ మతోన్మాద రాక్షసి నుండి ప్రజలను కాపాడలని ఆ దంపతులు నిరంతరం పనిచేశారో ఆ ఉన్మాదానికి ఆమె భర్త బలయ్యారు. ఆ పరిస్థితి ఆమెలో సరికొత్త ఆలోచనలకు కారణమైంది. ఈ మతోన్మాద భూతం ఎంతమందిని బలితీసుకుంటుదోనని ఆమె తపించిపోయారు. ఆ విధంగా సన్నిహితులను కోల్పోయిన కుటుంబాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఆమెను నిలువనివ్వలేదు . ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న మహాత్మా గాంధీ వద్దకు వెళ్ళారు.

ఆనాడు దేశమంతా విభజన వాతావరణంతో ప్రజ్వరిల్లుతుంది. కుటుంబాలకు కుటుంబాలు అటు,ఇటు వెడుతున్నాయి. అమాయకులు రాక్షస ఉన్మాదానికి బలవుతున్నారు. ఈ పరిస్థితుల చేదు అనుభవాలను ప్రధానంగా మహిళలు, పిల్లలు వృద్ధులు ఎదుర్కొంటున్నారు. ఉన్మాదుల రక్తదాహానికి, భయానక చేష్టలకు మహిళలు బలవుతున్నారు. కూడు,గూడు లేక అల్లాడిపోతున్నారు. ఆ పరిణామాల నేపధ్యంలో

263 అనిస్‌ బేగం ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా శరణార్థులుగా మారిన హిందూ-శిక్కు భాధిత మహిళలలకు, పిల్లలకు రక్షణ కల్పించి ఆశ్రయమిచ్చి ఆదుకునేందుకు కృషిచేయాల్సిందిగా మహాత్మాగాంధీ ఆదేశించారు. ఆయన ఆదేశాలను శిరోధార్యంగా భావించి సుభద్రా జోషి, మృదులా శారాబాయిలతో కలసి అనిస్‌ బేగం రంగంలోకి దిగారు.

విభజన సృష్టించిన సంక్షోభం వలన విలవిల్లాడుతున్న వేలాది మహిళలను చేరదీశారు. ఆ బాధిత మహిళలకు ధైర్యం చెప్పి శరణార్థుల శిబిరంలో ఆశ్రయం కల్పించారు. తల్లి తండ్రులను కొల్పోయిన యువతులు, భర్తలను పోగొట్టుకున్న మహిళలు, కిడ్నాప్‌, అత్యాచారాలకు బలైన ఆడపడుచుల సమాచారాన్ని సేకరించటం వారి కోసం అన్వేషణ సాగించటం, దొరికిన వారిని వారివారి బంధువుల వద్దకు చేర్చటం, లేనివారిని శరణార్థి శిబిరాలకు పంపించే కార్యక్రమాలలో అనిస్‌ బేగం అవిశ్రాంతగా శ్రమించారు.

ఈ కార్యక్రమాలలో భాగంగా ఆమె లక్నోలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అవసరార్థులను, అభాగ్యులను చేర్చుకుని వారి వారి స్థానాలకు వారు భద్రంగా చేరేంత వరకు వారికి ఆశ్రయం,రక్షణ కల్పించారు. మతోన్మాద రాక్షసి బారిన పడి భయవిహ్వలులైన మహిళలకు ధైర్యం చెబుతూ వారిలో ఆత్మస్థై ర్యం పెంపొందించేందుకు కృషి సల్పారు. శరణార్ధుల పట్ల చూపుతున్న ప్రేమాభిమానాల వలన బాధితులకు ఆమె అనిస్‌ ఆపా (అనిస్‌ అక్కయ్య) అయ్యారు.

ఈ మేరకు ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా అమెను రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజ్యసభ సభ్యురాలుగా 1957 నుండి 1968 వరకు బాధ్యతలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం కోసం పలు సూచనలు చేశారు. ఆ దిశగా సంఘాలు, సంస్థలకు క్రియాశీలక సహకారమందించారు.

భారత విభజన అనుభవాలను Azadi Ki Chaon Mein పేరుతో అక్షరబద్దాం చేశారు. మతోన్మాదం సాగించిన రాక్షసత్వాన్ని వివరిస్తూ ఎతిజితిళీ పేరుతో మరో గ్రంథాన్ని జులీ అరిదీదిలి ఈలిదినీదీలి అను మరో పుస్తకాన్ని కూడ ఆమె రాశారు. ఆమె రాసిన వ్యాసాలు 1976లో శ్రీబిచిజీలి చనీతిరీనీ స్త్రతిచిజీలి శీర్షికతో ప్రచురితమయ్యాయి. ఆమె సాహిత్య కృషికి ప్రతిఫలంగా సాహిత్య ఆకాడమీ ఆవార్డు కూడ లభించింది.

ఈ మేరకు రాజకీయం, సాహిత్యం,సేవా రంగాలలో అపూర్వసేవలందించి మాతృభూమి రుణం తీర్చుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమించిన అనిస్‌ బేగం కిద్వాయ్‌ 1982 లై 16న కన్నుమూశారు.

264