భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/జాహిదా ఖాతూన్‌ షేర్వానియా

వికీసోర్స్ నుండి

ప్రజలలో స్వాతంత్య్రేచ్ఛను రగిలించిన కవయిత్రి

జాహిదా ఖాతూన్‌ షేర్వానియా

(1894 - 1922)

మాతృదేశాన్ని పరదేశీయుల పాలన నుండి విముక్తం కావించేందుకు స్వాతంత్య్రేచ్ఛతో రగిలిపోతున్న అన్ని రంగాలకు చెందిన ప్రజలు విముక్తిపోరాటంలో తమదైన మార్గాలలో సాగారు. ఈ కృషిలో కవులు, కళాకారులు అద్వితీయ పాత్ర వహించారు.బ్రిటిషర్ల దుష్టపాలన మీద ద్వజమెత్తిన కలం యోధులు, దుర్మార్గపాలనను ఎండగడ్తూ, అందుకు వ్యతిరేకంగా పోరాడల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రజలను చెతన్యవంతుల్ని చేసూ, ఉద్యామకారులను ఉత్సాహపరు స్తూ అక్షరాయుధాలను సృస్టించారు. ఈ దిశగా సాగిన కృషిలో భాగం పంచుకున్న కవులు-కవయిత్రులలో జాహిదా ఖాతూన్‌ షేర్వానియా ఒకరు.

ఉత్తర ప్రదేశ్‌ రాష్రంలోని అలీఘర్‌ సమీప గ్రామమైన భిక్కంపూర్‌లో జాహిదా ఖాతూన్‌ షేర్వానియా 1894 డిసెంబరు 8న జన్మించారు. ఆమె తండ్రి నవాబ్‌ ముహమ్మద్‌ ముజ్‌మిలుల్లా ఖాన్‌ షేర్వాని. సంపన్నుడు మాత్రమే కాకుండ విద్యావేత్త కూడ అయిన ఆయన అలీఘ ర్‌ విశ్వవిద్యాలయం కులపతిగా బాధ్యతలు నిర్వహించారు. చిన్న తనంలోనే తల్లిని కోల్పోయిన జాహిదా ఖాతూన్‌ను అన్నీ తానై పెంచారు. జాహిాదా చదువు పట్ల 83 ఆయన అధిక శ్రద్ధ చూపారు. పలువురు ఉపాధ్యాయులను నియమించి ఇటు సంప్రదాయక విద్య అటు ఆధునిక ఆంగ్ల విద్యలో ఆమెకు ప్రవేశం కల్పించారు. మంచి గురువుల చలువ వలన ఉత్తమ జ్ఞానాన్ని సంతరించుకున్న ఆమె తనలో దాగి ఉన్న కవయిత్రిని చిన్న వయస్సులోనే ప్రజల ఎదుట సాక్షాత్కరింప చేశారు. స్వంత అభిప్రాయాలను నిర్భయంగా, సాహసోపేతంగా తన కవితల ద్వారా వ్యక్తం చేయటం ఆరంభించారు. నా కవితల వైపు యావత్తు ప్రపంచం కన్నార్పకుండ చూడాలి. ఆ స్థాయి కవయిత్రుల కోవలో నా కవితా ప్రస్థానం సాగాలి. నన్ను మించిన కవయిత్రి మరోకరు ఉండరాదు, అని పది సంవత్సరాల వయస్సులో జాహిదా ఖాతూన్‌ ప్రకటించారు. ఆ ఆకాంక్షమేర సాగించిన కృషి మూలంగా ఆనాటి కవయిత్రులలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు.

సమాజాన్ని చదవటం, పరిణామశీలాన్నిఅధ్యయనం చేయటం ద్వారా సమకాలీన పరిస్థితులన్నటి మీద స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పర్చుకొని, ఆనాటి అమ్మాయిల తీరు తెన్నులకు భిన్నంగా మార్పు కోసం జాహిదా ఖాతూన్‌ నడుంకట్టారు. పది సంవత్సరాల వయస్సులో పది దశాబ్దాల వయస్కురాలి పరిపక్వతను తన కవితలలో ప్రతి ఫలింప చేశారు . ఆమెక్రమంగా ఎదుగుతూ , సమాజంలోని సనాతన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా అక్షరాలను ఆయుధంగా మలచుకుని ఉద్యమించారు.

సామాజిక రుగ్మతల నిర్మూలనకు, సామాజిక సంస్కరణకు పూనుకున్నారు. స్త్రీ స్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇచ్చారు. పురుషులతోపాటుగా స్త్రీలు కూడ స్వేచ్ఛగా తమ శక్తియుక్తుల మేరకు బాధ్యతలను నిర్వహిస్తూ, హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు.

ఆనాడు భారతీయ మహిళల పరిస్థితులను జాహిదా ఖాతూన్‌ తన కవితలలో ప్రతిఫలింప చేశారు. భారతీయ మహిళ గురించి రాద్దామని నా కోరిక. నా మనసంతా ఆందోళన. పదాల్నిఎక్కడ నుండి తేను? నా ఈ దుర్దశ పశ్ఛాత్తాపానికి గురి చేస్తుందే మోనన్నఆందోళనే ఎప్పుడూ. నా మాటలు పరాయి పదాలుగా అనిపిస్తూంటే, చెప్పనా? వద్దా? అను సందిగ్దం..?, అంటూ రాయడానికి పదాలు దొరకనంతగా మహిళల దుర్ధశ ఉందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. నిజం పలకటం నేరంగా మారిందని, తాను భారతీయురాల్నికావటం, ముస్లిం కావటం, నిజం పలకటం ద్వారా మరింత నేరస్తురాల్ని అయ్యానని ఆవేదనను వ్యక్తంచేస్తూ, నేరాలకు ప్రతిరూపాన్నినేను. నా నేరాల్నిఎన్నని 84 వర్ణించనూ. ముస్లింను, భారతీయురాల్ని, నిజం పలికేదాన్ని, అన్నారు. ఈ దిశగా ఆమె రాసిన అనేక కవితలు ఆనాటి ప్రముఖ ఉర్దూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. జాహిదా ఖాతూన్‌ స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. స్త్రీలు అక్షర జ్ఞానసంపన్నులు కావాలని కలలుగన్నారు. ఆ కలలను సాకారం చేసేందుకు స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని భావించారు. ఉత్తమ సమాజం విద్యావంతులైన తల్లుల ద్వారా రూపుదిద్ధుకుంటుందని దృఢంగా నమ్మారు. స్త్రీలు విద్యావంతులు కావటమే కాకుండ పురుషులతోపాటుగా కూడ రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉండాలని ఆకాంక్షించారు. మహిళలు రాజకీయ రంగంలో కూడ రాణించాలన్నారు. అక్షరజ్ఞానం, రాజకీయ చైతన్యం గల మహిళలు మాతృభూమి కోసం త్యాగాలను చేయ గల నాయకులను, జాతిజనులకు ఉత్తమ సేవలందించగల ప్ధరులను రూపొందించగలరని ప్రకటించారు. మహిళలను రాజకీయాలకు దూరంగా ఉంచిన జాతి, సమాజం వెనుకబాటుతనానికి గురవుతుందని ఆమె హెచ్చరించారు.

ఈ విషయాన్ని మరింత విస్తారంగా చెబుతూ, గొప్ప వ్యక్తుల తల్లులందరూ ఓ ప్రత్యేక మనస్తత్వం కలిగిన మహిళలని మనకు చరిత్ర తెలుపుతుంది. విజేతల తల్లులు ధైర్య వంతులు, సంస్కర్తల అమ్మలు ఆలోచనాపరులు, మహాత్ముల తల్లులు మహనీయులుగా మనకు దర్శనమిస్తారు . వ్యకిగతంగా ఒక పురుషుడి నైతికత స్త్రీ ద్వారా రూపుదిద్దుకోవడమో లేక భ్రష్టు పట్టడమో జరుగుతుంది. ఓ జాతి నైతిక విలువలు, సామాజిక ఔన్నత్యం ఆ జాతికి చెందిన తల్లుల మానసిక స్థితితుల మీద ఆధారపడివుంటాయి. రాజకీయ ఔన్నత్యాన్ని గుత్తకు తీసుకున్నామని చెప్పుకునే జాతులను మనం పరిశీలిస్తే ఆ జాతులలోని మహిళలు రాజకీయంగా ఎంత పరిపక్వత కలిగి ఉండేవాళ్ళో, వాళ్ళల్లో మాతృభూమి పట్ల ప్రేమ ఎంత పొంగి పొర్లేదో మనకు అర్థమøతుంది. పురుషుల అస్తిత్వం తల్లి రూపంలోనూ, ప్రజా సంక్షేమానికి చెందిన ప్రతిశాఖలో బాధ్యతగల పౌరుని రూపంలో జాతికి, దేశానికి భగవంతుడు ప్రసాదించిన ఉత్తమ వరంలా రుజువయ్యింది, అని జాహిదా ఖాతూన్‌ షేర్వానియా అన్నారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdan : Page.182)

విద్యారంగంలో ముస్లిం మహిళల స్థాయి అధమంగా ఉన్న విషయం మీద ఆవేదన వ్యక్తం చేసిన జాహిదా ఖాతూన్‌ ఎంతో బాధపడ్డారు. ఆ స్థితి పట్ల బాధను 85 వ్యక్తం చేయటంతో ఆమె ఊరుకోలేదు. ఈ స్థితికి గల కారణాలను కూడ ఆమె చాలా వివరంగా విశ్లేషించారు. ఈ దుస్థితికి కొందరు ముస్లిం మత పెద్దలు కారణమని ఆమె ఆగ్రహించారు. ఈ విషయం గురించి రాస్తూ, ముస్లిం మత పెద్దల తప్పు వొకటే. తమ స్త్రీలను చదువు సంధ్యల్లేని వాళ్ళుగా వుంచారు. లేకుంటే చదివించినా రాజకీయ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా వుంచారు. జాతి తల్లులలో రాజకీయ పరిజ్ఞానం లేనందున జాతి జనులలో కూడ రాజకీయాల పట్ల సరైన అవగాహనకు ఆస్కారం లేకుండ పోయింది. అందుచేత అవమానకరమైన, దయనీయమైన ఆహారంతో కడుపు నింపుకుని ఉన్నట్టయితే మీ ఆ చేష్టలకు ముగింపు పలికి భవిష్యత్తు గురించి జాగ్రత్త వహించండి. మీ చర్యల వలన కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకోడనికి మార్గం వొక్కటే. అది మీ స్రీలను విద్యావంతుల్ని చేయడం. విజ్ఞానార్జన ద్వారా సరైన రాజకీయ దృక్పథం, మంచి అవగాహన వారిలో కలుగచేయడం. ఆ ఆవకాశాలను వారికి కల్పించటం.' అని జాహిదా ఖాతూన్‌ షేర్వానియా సలహా ఇచ్చారు.(ibid.Page182)

ఆనాటిసామాజిక పరిస్థితులలో ఓ కులీన కుటుంబం నుండి విచ్చేసిన మహిళ కవిత్వం చెప్పటం మాత్రమే కాకుండ స్త్రీవిద్య కోసం, రాజకీయరంగంలో స్త్రీల ప్రవేశం కోసం పోరాడటం, ఆ రంగాలలో మహిళల వెనుకబాటుతనానికి ముస్లిం పెద్దలను బాధ్యుల్నిచేయటం, ఆ పెద్దల చర్య లను తప్పుపటడం, ఆ తప్పులను దిద్దుకోవాల్సిందిగా పెద్దలకు సలహా ఇవ్వటం నిజంగా సాహసం.

ఈ మేరకు తాను నమ్మిన విషయాన్నిస్పష్టంగానూ, ధైర్యంగానూ ప్రకంచటంలో ఆమె ఏనాడు వెనుకాడలేదు. ముస్లిం మహిళలు ధరిస్తున్న పర్దా విధానం సరైనది కాదంటూ, డాక్టర్లు అంటున్నారు బంధనాల నుండి బయట పడండి - గాలిని ప్రవేశింపనివ్వండని. సంకుచిత స్వభావులు అంటున్నారు. ససేమిరా వద్దు చావనివ్వండని, అని ఓ కవితలో అన్నారు. జాహిదా ఖాతూన్‌ పర్దా పద్దతికి పూర్తిగా వ్యతిరేకం కాకున్నా అనారోగ్య హేతువైన రీతిలో పర్దాను ధరించడాన్ని మాత్రం వ్యతిరేకించారు.(ibid.Page.180)

విద్యాభ్యాసం పట్ల అధిక మక్కువ చూపిన ఆమె జ్ఞానార్జనకు విద్యాభ్యాసం మాత్రమే మార్గమని భావించినందున అందుకు వ్యతిరేకాంశాలతో ఏమాత్రం ఏకీబవించ లేదు. సహాయ నిరాకరణ ఉద్యామంలో భాగంగా ప్రభుత్వం గ్రాంటులతో నడుస్తున్న

86 విద్యాలయాలను విడిచి విద్యార్థులు బయటకు రావాలని మహాత్మా గాంధీ పిలుపు నిచ్చినప్పుడు ఆ నిర్ణయం ఆమెకు నచ్చలేదు. విద్యాభ్యాసం చేయాల్సిన విద్యార్థ్ధులు విద్యాలయాలు బహిష్కరిస్తే వారి చదువు ఎలా సాగుతుందని ఆమె ప్రశ్నించారు. ఈ విషయ గురించి మ్లాడు తూ, సహాయ నిరాకరణోద్యామం ఆచరణలోని కొన్ని అంశాల్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఉద్యమంలో భాగంగా చదువులు మానేయడం నాకిష్టం లేదు, అని బాహటంగా కళాశాలల బహిష్కరణకు ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారు. చిత్తశుద్ది కరువైన స్వార్థపూరిత రాజకీయాలు, ఆ మార్గాన నడిచే రాజకీయ నాయకుల చర్య ల పట్ల కూడ ఆమె ఆగ్రహం వ్యకం చేశారు. మన రాజకీయ నాయకులు జనాన్నితమ గుప్ప్లో ఉంచుకునే మంత్రంగా, పేరు ప్రతిష్టల్ని పొందే చిట్కాగా, వెండి బంగారాన్ని సమకూర్చి పెట్టగల ఊటబావిలా భావించి రాజకీయాల్ని స్వీకరిస్తున్నారు. ఆ కారణంగా విశ్వమానవాళి హృదాయాల నుండి మన స్థానం దిగజారిపోతుంది, అంటూ స్వార్ధపరు లైన రాజకీయ నాయకుల వ్యవహార సరళి మీద ఆమె అక్షరాయుధంతో విరుచుకు పడ్డారు. ఆనాడు ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు ఈనాటి రాజకీయాలకు కూడ వర్తించటం ఆమెలోని దార్శనికతకు అద్దం పడుతుంది. స్వేచ్ఛా,స్వాతంత్య్రాల కోసం సాగుతున్నజాతీయోద్యా మంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు. ఉద్యమించమని మహిళలను స్వయంగా కోరారు. ప్రజలకు స్వతంత్ర జీవన అవకాశాలను కల్పించేందాుకు స్వాతంత్య్రసమరంలో కలసికట్టుగా పాల్గొనాలని జాహిదా ఖాతూన్‌ ఉద్బోధించారు. మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఉమ్మడిగా ముందుకు సాగాలని సూచించారు. హిందూ-ముస్లింల ఐక్యత అత్యంత అవశ్యం అన్నారు. ఆయా జనసముదాయాల మధ్య న అపార్థాలను దూరం చేసి సద్భావన, సదావగాహన ఏర్పచేందుకు జాహిదా ఖాతూన్‌ నిరంతరం శ్రమించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా జరిగిన ప్రతి ఉద్యమం,సంఘటన మీదా జాహిదా ఖాతూన్‌ షేర్వానియా కవితలు రాశారు. అభిప్రాయాలను వ్యకం చేశారు.

బాల్కన్‌ యుద్ధం, ప్రథమ ప్రపంచ యుధం, జలియన్‌వాలా బాగ్, కాన్పూరు మసీదు కేసు తదితర దుస్సంఘటనల మీద ఆమె తనవైన కవితలతో ప్రతిస్పందించారు. ఈ మేరకు తమ కవితలతో బ్రిీటిషు ప్రభుత్వచర్యల మీద విమర్శనాస్త్రాలు సంధించిన కవయిత్రిగా ప్రజల మనస్సులలో మాత్రమేకాకుండ స్వాతంత్య్రోద్యమం సాహిత్య చరిత్రలో 87 ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రజల మీద బ్రిీటిష్‌ ప్రభుత్వం సాగించిన ప్రతి జులుం మీద ఆమె తన కవితలతో దాడులు చేశారు. ప్రభుత్వచర్యలను నిర్భయంగా నిరసించారు. ప్రభుత్వ చర్యల మీద విమర్శలు చేస్తున్న కవులు రాసిన కవితలను, ఆ రచనలను ప్రచురిస్తున్న పత్రికల మీద ప్రబుత్వం దాడులు చేసినప్పుడు, ఆయా పత్రికలకు, పత్రికా సంపాదకు లకు ఆమె అండగా నిలిచారు. జాతీయ భావాలను ప్రచారం చేస్తున్న పత్రికల మనుగడ కోసం అవసరమగు ఆర్థికతను అందించడనికి ఎంతో శ్రమించారు. ప్రభుత్వ ఆగ్రహానికి గురైన పత్రికల ఆస్థిపాస్తులను అధికారులు జప్తు చేసి, పత్రికల సంపాదాకులను వీధుల్లో పడేసినప్పుడు వారికి తగిన విధంగా స్యయంగా సహయ,సహకారాలు అందించి పత్రికా సేfiచ్ఛ పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. కవయిత్రిగా, సంస్కరణవాదిగా జాహీదా ఖాతూన్‌ ప్రముఖ కవి పండితుల, పాఠకుల ఆశీస్సులతో పాటుగా, ప్రజల అపార ప్రేమాభిమానాలను అందాుకున్నారు. పేరు ప్రతిష్టల కోసం ఆమె ఎన్నడూ ప్రాకులాడలేదు. ఆమె ఎన్నడూ తన పేరును ప్రకించలేదు. జాహిదా , నుజహత్‌ ' అను కలం పేర్లతో ఆమె కవిత్వం సాగింది. (Encyclopadia of Women Biography, Ed. by Nagendra.K.Singh, APHPC,New Delhi, 2001,Page.484) మహిళల స్వేచ్చా,స్వాతంత్య్రాల కోసం మాత్రమే కాకుండ వలసపాలకుల దుష్టపాలన నుండి ప్రజల విముక్తిని ఆకాంక్షించిన ప్రముఖ కవయిత్రిగా వస్వాతంత్య్రోద్యమ చరిత్రలో ప్రత్యే క స్థానం ఏర్పర్చుకున్నారు. ప్రముఖ జాతీయోద్యామకారుల సంపాదాకత్వంలో నడుస్తున్న, జమీందార్‌, అల్‌ హిలాల్‌, కామ్రేడ్‌ లాిం పత్రికలతో పాటుగా ఆనాటి ఇతర ప్రముఖ పత్రికలలో ఆమె కవిత్వంచోటు చేసుకుంది.

స్వేచ్ఛ, స్వాతంత్య్రేచ్ఛ, ప్రగతిశీల భావాలు, సంస్కరణల కోసం సాగిస్తున్న పోరాటం, ఛాందస భావాల మీద ప్రకటించిన యుద్ధ్దం, స్వార్థ రాజకీయాల మీద ఆమె సంధించిన విమర్శనాస్త్రాల తీవ్రతను గమనించిన ప్రముఖ ఉర్దూ కవి అక్బర్‌ అల్హాబాది ఆమె కవితల గొప్పదనం గురించి మ్లాడుతూ, ఒక వేళ ఈ కవితలను ఓ మహిళ రచిస్తున్నట్టయితే, ఇక కవిత్వం మీద పురుషులు తమ ఆధిపత్యం వదులుకోవాల్సిందే, అని వ్యాఖ్యానించటం ధైర్యశాలిగా, ఉత్తమ కవయిత్రిగా ఆమె స్థాయిని, స్థానాన్నివెల్లడి చేస్తుంది. ఆమె రాసిన కవితలలో కొన్నిAina+Haram, 88 Firdus-i-Takhiyyul పేర్లతో సంకలనాలుగా ఆమె మరణాంతరం ప్రచు రితమయ్యాయి. (Who's who of Indian Writers, Sahithya Akademi, New Delhi, 1961) జాహిదా ఖాతూన్‌ కవయిత్రిగా కవితలతో ఉద్యామకారులను ఉత్తేజపర్చటం, మార్గదర్శకం చేయటం మాత్రమే కాకుండ స్వయంగా ఉద్యమ కార్యక్రమాలలో కూడ పాల్గొన్నారు. బెంగాల్‌ విభజన, స్వదేశీ ఆందోళన, సహాయ నిరాకరణ ఉద్యమాలలో భాగస్వామ్యాన్ని అందించారు. స్వదేశీ ఉద్యమంలో చురుకన పాత్ర నిర్వహించారు. ఖద్ధరు ధరించమని ఇతరులను కోరటం మాత్రమే కాకుండ, స్వజనుల వ్యతిరేకతను ఖాతరు చేయకుండ తాను స్వయంగా ఖద్దరును ఎంతగానో ఇష్టపడ్డాడరు. ఈ విషయమై ఆమె మ్లాడుతూ, స్వదేశీ ఉద్యమం అంటే నాకు చచ్చేంత ప్రేమ. ఇవాళే కాదు. తొలినాి నుంచి కూడ. ఇక ప్రస్తుత సంఘటన వల్ల విదేశీ వస్తువుల పట్ల భరించలేని వ్యతిరేకత ఏర్పడింది. అసహ్యం పుట్టింది. ఇక ముందు ఎన్నడూ విదేశీ వస్త్రాన్ని కొనరాదని నిర్ణయించుకున్నాను, అని ప్రకటించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్నివ్యక్తం చేయటం మాత్రమే కాకుండ ఖద్దరు ధారణ నిమిత్తం తనకు తానుగా ఆమె ఖద్ధరు వస్త్రాలను కోనుగోలు చేశారు. ఆ దుస్తులను జీవితాంతం ధరించాలని ఎంతో ముచ్చటపడ్డాడరు . దురదౄష్టం ఏమిటంటే ఆమె స్వయంగా కొనుగోలు చేసిన ఖద్దరు వస్త్రాలు ఆమె ధరించలేకపోయారు. ఆ ఖద్దరు దుస్తులు ఆమె మృతదహాన్ని మాత్రమే అలంకరించాయి. ఖద్ధరు వస్త్రాలు ధరించాలన్న నిర్ణయంతీసుకున్న 11 రోజులు వ్యవధిలో 1922 ఫిబ్రవరి 4న ఆకస్మికంగా తన 29 సంవత్సరాల వయస్సులో అవివాహితగా ఆమె కన్నుమూశారు.

ఆ సమయంలో ఆమె కొనుగోలు చేసిన ఖద్దరు వస్త్రాలను ఆమె సోదరుడు దావూద్‌ అహమ్మద్‌ ఖాన్‌ ఆమె భౌతికాయం మీద పరచి ఆమె అభిమతాన్ని ఆవిధంగా గౌరవిస్తూ జాహిదా ఖాతూన్‌ షేర్వానియా కోర్కెను నెరవేర్చారు.

భారతదేశపు కుక్కలు, పిల్లులు కూడ బ్రిీటిషర్ల బానిసత్వపు సంకెళ్ళలో బందీలుగా ఉండ రాదన్నది నా అభిమతం. - ఆబాది బానో బేగం 89