భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/ఇస్మత్ ఆరా బేగం
విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమకారిణి
ఇస్మత్ ఆరా బేగం
మాతృభూమి విముక్తి పోరాటం పట్ల నిబద్ధత, కార్యచరణలో నిజాయితి గల నేతల చర్యలు ఆనాడు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. ఆ ప్రభావంలో పడ్డ ప్రజలు తమ సర్వస్వం త్యాగం చేయడానికి, ఉద్యామబాట నడిచేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. ఆ విధంగా ఉద్యామకారులను ఉత్తేజితులను చేస్తూ ఉద్యమించిన యువతులలో ఒకరు ఇస్మత్ ఆరా బేగం.
ఆమె ప్రముఖ జాతీయోద్యమ నాయకులు, లక్నోలోని ప్రసిద్థ వైధ్యులు హకీం అబ్దుల్ మేనకోడలు. ఖిలాఫత్ ఉద్యమం సందర్బంగా అలీ సోదరులు విరాళాల కోసం లక్నో వచ్చారు. ఖిలాఫత్ ఉద్యమం కోసం విరాళాలు అందించమని ఆ నేతలు కోరగా ప్రజలు బాగా స్పందించారు. అక్కడిక్కడే మహిళలు తమవంటి మీదున్న ఆభరణాలను వారికి అందచేశారు. ఆ దృశ్యం హకీం అబ్దుల్‌ను కదలించి వేసింది.
ఆయన బిరబిరా ఇంటికి వచ్చారు. ఇస్మత్ ఆరాను పిలిచి విషయం చెప్పారు. ఆ వివరాలు తెలుసుకున్న ఆమె తమ ఇంటిలోని మహిళలందర్ని సమావేశపర్చి ఖిలాఫత్- సహాయ నిరాకరణ ఉద్యామ కార్యాచరణ తమ ఇంటి నుండి ఆరంభించాలన్నారు. అలీ సోదారుల తల్లి బీబి అమ్మతో కలసి, మాతృదేశ సేవలో పునీతం కావల్సిన అవసరాన్ని ఉత్తేజపూరితంగా వివరించారు.
ఆ ప్రసంగంతో ఉతేజితులైన ఇస్మత్ అరా కుటుంబీకులు సర్వం త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె ముందుగా తన పెండ్లినాటి ఖరీదైన ఆభరణాలన్నింటిని తెచ్చి గుట్టగా పోసి బీబీ అమ్మకు విరాళంగా అందజేశారు. ఆ తరువాత పుట్టింటి వారు సారెగా పంపిన అతి ఖరీదెన విదేశీ వస్త్రాలన్నింటిని తెచ్చి పోగేసి స్వయంగా తగు లబెట్టారు . ఆమెను కుటుంబీకులంతా అనుసరించారు. వారితో ఇరుగుపొరుగు జత కలవటంతో ఆ ఇంట విదేశీ వస్త్రాల దహనం జరిగింది. ఆ చర్యతో విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమకారిణిగా ఇస్మత్ ఆరా బేగం లక్మోలో అందరికి ఆదర్శంగా నిలిచారు. 90