Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/ఆబాది బానో బేగం

వికీసోర్స్ నుండి


జాతీయోద్యమంలో పురుషులతోపాటు మహిళలు కూడ అద్వితీయమైన భాగస్వామ్యాన్ని అందించారు.బ్రిటిషు ప్రభుత్వదాష్టీకాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగిన మహిళలు ఉద్యమకారులలో ఉత్తేజాన్ని కలిగించటమే కాకుండ, నిర్భయంగా ముందుకు సాగమని ప్రోత్సహించారు. ఆనాటి తొలితరం మహిళలలో శ్రీమతి ఆబాది బానో బేగం అగ్రగణ్యురాలు. ఆమె ఎంతో ఉత్సాహంతో ఉద్యమ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించటం వలన ఆమె నుండి ప్రేరణ పొందిన జాతీయోద్యమకారులు ఎంతో ప్రేమతో బీబీ అమ్మ అని ఆమెను పిలుచుకున్నారు.

ఆబాది బానో బేగం ఉత్తర ప్రదశ్‌ రాష్రం మొరాదాబాద్‌ జిల్లా అమ్రోహా గ్రామంలో 1852లో జన్మించారు. ఆమెకు రాంపూర్‌ సంస్థానానికి చెందిన అబ్దుల్‌ అలీ ఖాన్‌తో వివాహం జరిగింది. అత్తవారింట ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. ఉర్దూ, పర్షియన్‌ భాషల లిపి ఒక్కటే కావటం, ఆ లిపులు అరబ్బీ భాషకు దగ్గరగా ఉండటంతో చిన్ననాటనే ఖురాన్‌ గ్రంథాన్ని పఠించటం వలన లిపులను గుర్తించటం ఆమెకు సులువైంది. మంచి ధారణశక్తి గల ఆమె ఉర్దూ, ప పర్షియన్‌ భాష ల లిపు లను సు నాయాసంగా

91 గుర్తుపట్టగలగటంతో, తన మరిది కుమారుని ద్వారా రహస్యంగా ఉర్దూ పుస్తకాలలోని కథలను చదివి విన్పించుకుని, ఉర్దూ అక్షరాలను గుర్తుపడుతూ ఉర్దూ భాషతోపాటు పర్షియన్‌ భాషను కూడ నేర్చుకున్నారు. ఈ భాషలను చదవటం తప్ప రాయటం ఆమెకు కుదరక పోయినా, సృజనశీలి అయిన ఆమె కదలల్లటంలో మంచి నేర్పును సాధించారు. ( ' She had learned Quran as a child and thus knew the Arabic script in a rudimentary fashion. She taught herself to read Urdu by asking a nephew to read to her from a book of stories, committing it to memory, and reading them it herself,partly from memory and partly by sounding out the letters--since the script for Persian and Urdu is only slightly different from that of Arabic, She could read, therefore, and in addition was a great story teller, but never learned to write '. Secluded Scholars, Gail Minault, OUP, New Delhi, 1999, Page. 26)

ఆబాది బానో 27 సంవత్సరాల వయస్సులో భర్తను కోల్పోయారు. ఆనాటికి ఆమె ఐదుగురు మగపిల్లలు, ఓ ఆడపిల్లకు తల్లి. పునర్వివాహం చేసు కోవాల్సిందిగా బంధు మిత్రులు సలహా ఇచ్చారు. ఆ సలహాలను కాదాంటూ బిడ్డలను ప్రయోజకులుగాతీర్చిదిద్దేందుకు తన్నుతాను అంకితం చేసుకున్నారు. ఆమె తన పేరును ఎక్కడ ప్రస్తావించాల్సి వచ్చినా అబాది బానొ అబ్దుల్‌ అలీ బేగం అని భర్త పేరుతో కలిపి రాయటం భర్త పట్ల ఆమెకు గల ప్రేమానురాగాలకు చిహ్నం ఆ కారణంగా పునర్వివాహం గురించి తన వద్ద మరెవ్వరూ ప్రస్తావించరాదని బంధువులను వారించారు. బిడ్డల భవిష్యత్తు మీద దృష్టి సారించి, వారిని దేశభక్తులుగా, ధార్మిక నిష్టాగరిష్టులుగా, ప్రఖ్యాతి గాంచిన మేధావులుగా రూపొందించటంలో కృతకృత్యులయ్యారు.

ఆనాటి ముస్లిం సమాజంలోని సామాజిక-ధార్మిక బంధనాలకు భిన్నత్వంగా మారుతున్న కాలానుగుణంగా బిడ్డలకు మంచి చదువు చెప్పించాలని ఆమె నిర్ణయించారు. పరు గులెత్తు తు న్న కాలాన్నిబట్టి మారనట్టయితే బ్రతుకు పోరాటంలో వెనుకబడి పోతామన్నభావనతో తన బిడ్డలకు సాంప్రదాయ-ధార్మిక విద్యతోపాటుగా ఆధునిక ఆంగ్ల విద్య గరిపారు. ఆనాటి ప్రసిద్ధ అలీఘర్‌ విద్యాలయంలో చదువు చెప్పించారు. స్వదేశంలో విద్యాభ్యాసం తరువాత ఉన్నత విద్యకోసం బిడ్డలను ఇంగ్లాండ్‌ పంపారు. ఈ విధంగా ఆమె ఉన్నత విద్యకోసం బిడ్డలను విదేశాలకు పంపిన రాంపూరు నగరంలోని తొలి మహిళయ్యారు. భారత జాతీయోద్యామ చరిత్రలో అలీ సోదారులు గా ప్రఖ్యాతి చెందిన మౌలానా షౌకత్‌ అలీ, మౌలానా ముహమ్మద్‌ అలీలు ఆమె బిడ్డలు.

92 ('..She sent her son first to Bareilly and then to Aligarh for studies, even though orthodox Muslims were deadly against English education in those days. She was perhaps, the first Muslim woman in the town who sent her boy for education in English.' - Encyclopaedia of Women Biography, Vol. one, Edited by Nagendra.K.Singh,APPHPC, New Delhi, 2001, Page.4)

ఆమె పెద్దగా చదాువుకోనప్పటికి చక్కని లౌకిక జ్ఞానం, సమాజం తీరు,తెన్నులను అవగాహన చేసుకోగల పరిజ్ఞానం, సమర్ధత కలిగియుండి కుటుంబం ఆస్థిపాస్తులను, వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించారు. బిడ్డల చదువుకు డబ్బు కావాల్సివస్తే, తన వ్యక్తిగత ఆభరణాలను రహస్యంగా కుదవ పెట్టి అవసరాన్ని అధిగమించారు తప్ప, ఆస్తిని విక్రయించ అంగీకరించలేదు.

ఆబాది బానో రాజకీయ జీవితం ప్రదమ ప్రపంచ యుద్ధసమయంలో ఆరంభమైంది. ఆ సమయంలో డాక్టర్‌ అనీబిసెంట్, గోపాల కృష్ణ గోఖలే ప్రారంభించిన హోంరూల్‌ ఉద్యమంలో ఆమె పాల్గొన్నారు.ఈ ఉద్యమం మరింతగా విస్తరించేందుకు హార్థిక, ఆర్థిక సహాయ సహకారాలను అందించటమే కాకుండ, తన కుటుంబం యావత్తు ఆ దిశగా సాగిన కార్యక్రమాలలో నిమగ్నమయ్యింది. ఉద్యమం పట్ల నిబద్ధత గల ఉద్యామకారిణిగా ఆమెకు చాలా స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. అభిప్రాయాలను కలిగి ఉండటం మాత్రమే కాదు, అవసరం వస్తే ఆ అభిప్రాయాలను ఎలుగెత్తి చాటాలి, అనుసరించాలని ఆమె ప్రకటించారు.

డాక్టర్‌ అనీబిసెంట్ మార్గంలో హోంరూల్‌ ఉద్యమంలో పాల్గొని జైళ్ళ పాలవుతున్న ఉద్యమకారుల పరిస్థితుల దృష్ట్యా వారి కుటుంబాలు ఆకలితో అలమించకుండ ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తెరిగి ఆ దిశగా ఆబాది బానో ఎంతో కృషి సల్పారు. అలీ సోదారులు జైళ్ళ పాలయ్యి, ఆస్తులను అమ్ముకుని, కుటుంబం గడవటమే కష్టంగా మారి, పలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడ ఆమె, ఆమె కుటుంబీకులు ఉద్యామకారుల కుటుంబాలను ఆదుకునేందుకు, ఉద్యామకార్యక్రమాల నిర్వహణకు హోం రూల్‌ ఫండ్‌ సమకూర్చి పంపారు.ఆ ఉద్యామాన్ని నీరుకార్చేందుకు హోం రూల్‌ పతాకాన్ని పోలీసులు ద్వంసం చేసిన సందర్భంగా ఆమె నిశితంగా విమర్శించారు. ఈ సందర్భంగా, వైధవ్యం అనుభవిస్తున్న నేను తెల్ల వస్త్రాలు ధరించటం కాకుండ, పలు రంగులు గల హోంరూల్‌

93

పతాకాన్ని ధరిస్తాను, ఇదేదో ప్రదర్శనకు కాదు, నా ఆశయాలు,అభిప్రాయాలను వ్యక్తం చేయటంలో ఏమాత్రం సిగ్గుపడాల్సింది లేదనడానికి మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఒక్క పతాకాన్ని పోలీసులు ధ్వంసం చేస్తే ఏమౌతుంది. వందల వేల పతాకాలు ప్రతి ఉద్యమకారుడి ఇంట రెపరెపలాడుతాయి అని ఆమె బ్రిటిషు పోలీసులకు సవాల్‌ విసిరారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilvonka Yogdan , Dr.Abida Samiuddin, IOS, New Delhi,1997, Page. 55-59) ప్రథమ ప్రపంచ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉద్యమకారులను అణిచి వేసేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం తెచ్చిన ఇండియన్‌ డిఫెన్స్‌ రెగ్యులేషన్స్‌ స్వాతంత్య్ర సమర యోధుల పాలిట ప్రాణాంతకమై నాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం పోకడలను నిరససు న్నమౌలానా ముహమ్మద్‌ అలీ బ్రిటిష్‌ పాలకుల మీద చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను పురస్కరించుకుని అలీ సోదరులను చిందన్‌వాడ గ్రామంలో నిర్బంధించి, ఆ ఊరు దాటి వెళ్ళరాదని ప్రబుత్వం ఆంక్షలు విధించింది. ఆ సందర్బంగా ఆమె కూడ స్వచ్చందంగా అలీ సోదరులతో కలసి చిందాన్‌వాడ వెళ్లారు. ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూనే తన దేశం కోసం, జాతి జనుల కోసం నిర్భందాలను భరించాల్సిరావటం నిజంగా భగవంతుడిచ్చిన వరంగా ఆమె భావించారు. ఈ సందర్బంగా మాతృదేశం, జాతి జనుల కోసం కషనష్టాలను భరించేందుకు భగవంతుడి ఎంపిక (తన బిడ్డలను ఎంపిక చేయడం) నిజంగా గర్వించదగిన విషయం అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు.

అలీ సోదారులు నిర్భంధంలో ఉండగా బ్రిటిషు ప్రభుత్వం అలీ సోదరుల వద్దకు లొంగుబాటు ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదాన ప్రకారంగా అలీ సోదరు లు ప్రబుత్వానికి బేషరతు లొంగిపోవాలి, భవిష్యతులో రాజకీయాలలో పాల్గొనరాదు. ఆ ప్రతిపాదన తెచ్చిన పోలీసు ఉన్నతాధికారి లొంగుబాటు పత్రంలోని అంశాలను అలీ సోదరులకు తెలుపుతున్నప్పుడు పక్కగదిలో కూర్చోని ఆమె విషయం తెలుసుకున్నారు.ప్రభుత్వం ప్రతిపాదానలు విన్నాక పర్దా ధరించి అలీ సోదరులు, ప్రభుత్వాధికారులు కూర్చోని ఉన్న గదిలోకి విసవిసా వచ్చారు. గదిలోకి వచ్చి రాగానే, పోలీసు ఉన్నతాధికారితో నేరుగా మాట్లాడుతూ నా బిడ్డలు స్వేచ్చను కోల్పోయేందుకు ఇష్టపడరు. ప్రబుత్వప్రతిపాదనలను అంగీకరిస్తే మా వెతలన్నీ తీరుతాయి. ఆ వెతల నుండి విముక్తి కోసం, మా ధార్మిక విలువలకు, మా దేశ ప్రయోజనాలకు విరుధంగా నా బిడ్డలు ప్రభుత్వ ప్రతిపాదానలను

94



అంగీకరించరు. ఒక వేళ అంగీకరిస్తే నిస్సందేహంగా అటువిం బిడ్డల గొంతును నేనే స్వయంగా పిసికి చంపేస్తాను. ఈ మహత్తర కర్తవ్య నిర్వహణకు భగవంతుడు ఈ వృధురాలి హస్తాలకు అంత శక్తిని తప్పక ఇస్తాడు అని ఆమె గర్జించారు. ఆమె అంతటితో ఆగలేదు. ' ఈ విషయాలను మా సమాధానంగా, మీ ప్రతిపాదానలకు మా తిరస్కారంగా ప్రబు త్వానికి తెలియచేయండి' అని ఆబాది బానో పోలీసు ఉన్నతాధికారులను కోరారు. మాతృభూమి సేవ చేసు కునేందుకు భగవంతుడు ప్రసాదించిన మహతర భాగ్యాన్ని ఎటువంటి అవాంతరాలు ఎదురైనా మరెన్ని కష్టనష్టాలు కలసివచ్చి పడినా వదలుకునేది లేదని ఆమె నిర్ద్వందంగా ప్రకటించారు. (Bharath Ke Swatantra Samgram me MusŒ lim Mahilavonka Yogdan, Page. 61-63)

1917లో ఆబాది బానో మొట్టమొదటిసారిగా గాంధీజీని కలిసారు. ఆ తరువాత అలీ సోదారులకు గాంధీజీకి మధ్యన ప్రగాఢ స్నేహబంధం ఏర్పడింది. అలీ సోదారులతో పాటుగా తనను కూడ ఆమె కన్నబిడ్డలా చూసుకున్నారని గాంధీజీ తన యంగ్ ఇండియా పత్రికలో, మిత్రులకు రాసిన లేఖలలో స్వయంగా పేర్కొని ఆమె పట్ల గౌరవభావాన్ని ప్రకటించారు. అంతేకాదు అలీ సోదరు లతో కలసి ఆమెకు తాము ముగ్గురు కుమారులమని గాంధీజీ అన్నారు. ఆమె అభిప్రాయాలకు ఆయన అత్యంత ప్రాముఖ్యత నిచ్చారు.

95 జాతీయ కాంగ్రెస్‌ కలకత్తా నగరంలో జరిపిన సమావేశాలకు బీబీ అమ్మ హాజరయ్యారు. ఈ సమావేశంలో, స్వేచ్ఛా-స్వాతంత్య్రాలకోసం హిందూ-ముస్లింలు కలసి మెలసి పోరాడలని పిలుపునిస్తూ, ఐక్యత ద్వారా మాత్రమే భారతీయులు స్వేచ్ఛ పొందగలరని ఉద్ఘాటించారు. జీవన ప్రయాణంలో భగవంతునికి తప్ప మరెవ్వరికీ తలవంచేది లేదాన్నారు. భారత ప్రభుత్వ కార్యదర్శిని కలిసే ప్రతినిధి బృందంలో చేరాల్సిందిగా ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఆ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరిస్తూ పరాయి పాలకుల వద్దకు నేను బిచ్చగత్తెగా రాలేనని అన్నారు. 1917డిసెంబరులో కలకత్తా నగరంలో జరిగిన అఖిల భారత ముస్లిం లీగ్ మహాసభలకు హాజరైన ఆమె, హిందూ-ముస్లింల ఐక్యతావశ్యకతను వివరిస్తూ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ప్రజలు మత విద్వేషాలను విడనాడి ఇస్లాం ప్రబోధించిన, మహమ్మద్‌ ప్రవక్త చూపిన శాంతి-సామరస్య మార్గాన ప్రయాణించాలని ముస్లింలను కోరారు.

ప్రపంచ ముస్లిములు ధార్మికంగా గౌరవించే ఖలీఫా పదవిని బ్రిటిష్‌ ప్రభుత్వం రద్దు చేయటంతో రగిలిన ఆగ్రహజ్వాలల ఫలితంగా ఇండియాలో రూపుదిద్దుకున్న ఖిలాఫత్‌ ఉద్యమం లో ఆబాది బానో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ సందర్బంగా అరెస్టులను, అవరోధాలను ఆమె లెక్కచేయలేదు. ఆమె కుటుంబ సభ్యులంతా ఖిలాఫత్‌ ఉద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు.అనర్గళ ప్రసంగాలతో, నిస్వార్ధం, నిబద్ధతతో కూడిన త్యాగమయ జీవిత విధానంతో, లక్ష్య సాధన పట్ల పరిపూర్ణ అంకిత భావంతో వ్యవహరిసూ, ప్రజలను ఆకట్టుకుని జాతీయోద్యమ దిశగా ఎందరినో కార్యోన్ముఖులను చేశారు. మాతృదేశం కోసం మరణంచటం కూడ అప్పుడప్పుడు అవసరం. అయితే మరణంచటం కంటే లక్ష్యసాధన కోసం జీవించటం చాలా అవసరం అంటూ ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రజలను అశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె స్త్రీ విద్యకు, హిందూ- ముస్లిముల ఐక్యతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రసంగాలు చేశారు. ఖిలాఫత్‌ ఉద్యామంతోపాటుగా, గాంధీజీ రూపకల్పన చేసిన సహాయనిరాకరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఈ సందర్బంగా ఆమె ఖిలాఫత్‌ సమస్య కోసం మీ జీవితాలను త్యాగం చేయండి అంటూ నినదించారు. ఈ నినాదం ఆనాడు ప్రతి ఉద్యామకారుడ్నిఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమదిశగా పురికొల్పింది.('Sacrifice your life on the issue of Khilafath ' - Enclopaedia of Women Biography, Volume 96 |, Edited by Nagendra.K. Singh, APHPC, New Delhi, 2001, Page. 4) ఖిలాఫత్-సహాయనిరాకరణ ఉద్యమం సమయంలో ఆమె వృధ్యాప్యం వలన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమె శరీరం ప్రయాణాలకు ఏమాత్రం సహకరించటం లేదు. ఆ పరిస్థితు లలో కూడ అబాది బానో ప్రజలలోకి వచ్చారు. స్వచ్చందంగా సహయ నిరాకరణ ఉద్యమ బాధ్యతలను చేపట్టారు. ఈ ఉద్యమాల నిర్వహణకు అవసరమైన నిధులను ప్రముఖులు, ప్రజల నుండి సమకూర్చటంలో అద్భుతమైన పాత్రను నిర్వహించారు. ఖిలాఫత్‌ నిధుల సేకరణకు కోడలు అంజాది బేగంను వెంటపెట్టుకుని విస్త్రుతంగా పర్యటించారు. ఆ నిధులను మహాత్మాగాంధీ జరిపిన దేశ పర్య టనకు, ఉద్యమ కార్యక్రమాల నిర్వహణకు అందచేశారు. ఈ సందర్భంగా ఆమె వందలాది సభలు, సమావేశాలలో పాల్గొని ప్రసంగించారు. ఆంగ్ల పత్రికలలో వచ్చే ఉద్యమ సమాచారాన్ని, ప్రభుత్వం తీరుతెన్నులను కూడ ఆమె సహచరుల నుండి గ్రహిస్తూ, ప్రజల మీద పాలకవర్గాల కిరాతక చర్యలు పెరిగే కొద్దీ, నిప్పులు చెరిగే ఉపన్యాసాలతో ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఆబాది బానో రాజకీయ రంగాన మాత్రమే కాకుండ సామాజిక రంగంలో కూడ తనదైన భాగస్వామ్యాన్నిఅందించారు.1921లో జరిగిన అఖిల భారత మహిళల సమావేశానికి అధ్యాక్షత వహించి, మహిళా కార్యకర్తలకు మార్గదార్శకత్వం వహించారు. స్వదేశీ ఉద్యమాన్ని పటిపటిష్టపర్చటంలో, మతసామరస్యం కాపాడటంలో మహిళలు ప్రదాన పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కస్తూరిబా గాంధీ, బేగం హసరత్ మోహాని, సరోజిని నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. బ్రిటిష్‌ నియంతృత్వం నుండి విముక్తి సాధించాలంటే హిందూ-ముస్లింల ఐక్యత అనివార్యమని నమ్మిన ఆమె చివరిశ్వాస వరకు ఆ దిశగా కృషి సల్పారు. ఐక్యంగా ఉండమని మనకు పలు అనుభవాలు నేర్పుతున్నాయి, ఈ దేశంలోని హిందూ- ముస్లిం- శిక్కు- ఈశాయి ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించనట్లయితే మన లక్ష్యం ఏనాటికి సిద్దించజాలదు అని ఆమె ప్రజలను హెచ్చరించారు.

జాతీయోద్యమ కార్యక్రమాలలో మహిళలు అధికంగా పాల్గొనాలని ఆబాది బానో ఉద్భోదించారు. స్వయంగా ఉద్యమంలో పాల్గొనలేక పోయినా ఉద్యమిస్తున్న భర, పిల్లలను ప్రోత్సహించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. జాతీయోద్యమకారులంతా తనను అమ్మా

97 అని పిలుస్తున్నందున, తనను తల్లిగా పరిగణించి గౌరవిస్తున్నందున తన బిడ్డల ఎదుట తాను పర్దా ధరించాల్సిన అవసరం లేదాంటూ పర్దారహితంగా బహిరంగ సభలలో ఆమె ప్రసంగించారు.

అనారోగ్యం ఆటంకాలు కల్పిసున్నా లెక్క చేయ కుండా విముక్తి పోరాటంలో చురుకైన పాత్ర నిర్వహించిన అబాది బానో 1922 సెప్టెంబరులో పంజాబు పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఓ సభలో మ్లాడుతూ భారతదేశపు కుక్కలు, పిల్లులు కూడ బానిసత్వపు సంకెళ్ళలో బందీలుగా ఉండరాదాన్నది నా అభిమతం, అని ఆమె గర్జించారు. ప్రతి ఒక్కరూ ఖద్దరును ధారించాలని, ఖద్దరు ధారణను ప్రోత్సహించాలని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఆమె ఉద్భోదించారు. అనారోగ్యం వలన గొంతు పెగలకున్నా ఎంతో శ్రమతో ఆమె చేసిన ప్రసంగాలు పంజాబ్‌ ప్రజలను ఉత్తేజితుల్నిచేశాయి.

ఈ రకంగా ఆమె దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పరాయి పాలకుల దుష్టచర్య లను వ్యతిరేకిస్తూ, ప్రజలను ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమాలలో ప్రవేశించాల్సిందిగా ఉద్భోదించారు. ఆమె నిబద్దత, నిరాడంబరత, స్వచ్ఛమైన వ్యక్తిత్వం ప్రజలను కట్టిపడేయసాగాయి. ఆ కారణంగా ఆబాది బానో బేగంను ప్రమాదాకర విద్రోహి గా బ్రిటిష్‌ ప్రభుత్వం నివేదికలు పేర్కొన్నాయి. అబాది బానో బేగం కుటుంబసభ్యులందర్ని ప్రభుత్వ వ్యతిరేకులుగా ప్రభుత్వాధినేతలు పరిగణంచారు. ఈ పరిసితిని బ్టి ఆమె ఏ స్థాయిలో బ్రిటిషు ప్రభుత్వం మీద పోరాటం సాగించారో తెలుస్తుంది.

ఈ విధంగా చివరిశ్వాస వరకు స్వేచ్ఛాయుతమైన స్వతంత్ర భారతాన్నికాంక్షిస్తూ, మహాత్ముని మార్గంలో పోరుబాటన నడిచిన శ్రీమతి ఆబాది బానో అబ్దుల్‌ అలీ బేగం 1924 నవంబరు 13న ఢిల్లీలో అలీ సోదరులు, మహాత్మా గాంధీ తదితర ప్రముఖుల సమక్షంలో ప్రశాంతంగా కన్నుమూశారు.

ఆ రోజున యావత్తు భారత దేశం కన్నీటి సముద్రమైంది.

                          * * *

నా భర్త సహచరులంతా జైళ్ళకు వెళ్ళారు. నా భర్త మాత్రం ఇంత వరకు స్వేచ్ఛగా ఉండటం పట్ల మాకు బాధగా ఉంది. - బేగం ఖుర్షీద్‌ ఖాfiజా 98