భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం జాఫర్‌ అలీ ఖాన్‌

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జాతీయోద్యామకారులను ఉత్తరాలతో ఉత్తేజపరచిన

బేగం జాఫర్‌ అలీ ఖాన్‌

జాతీయోద్యమ చరిత్ర పుటలను కాస్త ఓపిగ్గా తెరిస్తే స్వాతంత్య్రోద్యమంలో భర్తలతో పాటుగా పలు త్యాగాలకు సిద్ధపడి, మాతృభూమి విముక్తికి పోరుబాటను ఎంచుకున్న తల్లులు ఎందారో మనల్ని పలకరిస్తారు . భర్త అడుగుజాడల్లో నడుసూ, జీవిత భాగస్వామికి సంపూర్ణ తోడ్పాటు అందచేయటం ఒకవంతైతే బ్రిటిష్‌ పాలకుల కుయుక్తుల వల్ల భర్తలు నిర్వహిస్తున్నకార్యక్రమాలకు అంతరాయం ఏర్పడిన సమయంలో, తామున్నామని రంగం మీదకు వచ్చి భర్త బాధ్యతల భారాన్ని స్వీకరించి సమర్ధవంతంగా మాత్రమేకాదు స్పూర్తిదాయకంగా నిర్వహించగలగటం గొప్ప విషయం. ఆ కోవకు చెందిన జాతి మహిళా రత్నాలలో ఒకరు బేగం జాఫర్‌ అలీఖాన్‌.

ప్రముఖ స్వాతంత్య్రసమరయాధులు మౌల్వీ జాఫర్‌ అలీఖాన్‌ సతీమణి బేగం జాఫర్‌ అలీఖాన్‌. భర్త జాఫర్‌ అలీఖాన్‌ పేరుతో ఆమె ప్రసిద్దిచెందారు. 1904లో జాఫర్‌ అలీఖాన్‌ తండ్రి మున్షీ సిరాజుద్దీన్‌ ప్రారంభించిన ఉర్దూ పత్రిక జమీందార్‌ సంపాదాకత్వాన్ని 1909లో చేపట్టిబ్ రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా దానిని బలమైన అస్త్రంగా తీర్చిదిద్దారు . బ్రిటిష్‌ వలసపాలకుల దాష్తీకాలను, దోపిడు విధానాలను విమర్శిస్తూ జమీందార్‌ పత్రిక ద్వారా ప్రజలలో బ్రిటిష్‌ వ్యతిరేకతను చాలా బలమైన ప్రచారంగావించారు. బ్రిటిష్‌ 79

ప్రబుత్వం అకృత్యాల మీద జాఫర్‌ అలీఖాన్‌ అక్షరాగ్యులను కురిపించారు. బ్రిటిష్‌ వ్యతిరేక పత్రిక జమీందార్‌ గొంతు నొక్కేయడానికి పలు విధాల ప్రయ త్నించిన ప్రభుత్వం చివరకు జమీందార్‌ పత్రికను, ఆ పత్రిక సంపాదాకులు మొఎల్వీ జాఫర్‌ అలీని శత్రువుగా పరిగణంచింది.

ఆ కారణంగా జాఫర్‌ అలీఖాన్‌ పలుసార్లు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఆయన నగర బహిష్కరణకు గురయ్యారు. లాఠీ దెబ్బలు రుచిచూశారు.బ్రిటిష్‌ అధికారులు ఎంత క్రూరంగా వ్యవహరించినా, మొఎల్వీ మాత్రం ప్రభుత్వానికి తలవంచలేదు. మార్గం మార్చుకోలేదు. జమీందార్‌ పత్రికను జాతీయోద్యామానికి ప్రాణంగా తీర్చి దిద్దారు. ప్రజలలో పోరాట స్పూర్తిని రగిలించారు. ఆనాటిపత్రికలలో జమీందార్‌ పత్రిక ఉతమశ్రేణి ఉర్దూ పత్రికగా ఖ్యాతిగాంచింది. ఆ కృషి ఫలితంగా జాతీయోద్యామ చరిత్రలో మౌల్వీ జాఫర్‌ అలీఖాన్‌కు ప్రత్యేకస్థానం లభించింది.

ఆంగ్లేయ ప్రభుత్వం ఆయన పట్ల కినుక వహించింది. ఆయనకు వ్యతిరేకంగా పోలీసు అధికారులు సృష్టిస్తున్నభయానక పరిస్థితులను అధిగమిస్తూ మౌల్వీజాఫర్‌ అలీఖాన్‌ మున్ముందుకు సాగారు. బేగం జాఫర్‌ అలీఖాన్‌ కూడ ఆ బాటలో నడిచారు. ప్రజల పక్షం వహించిన కలంవీరుడు జాఫర్‌ అలీఖాన్‌ జీవిత భాగస్వామి గా ఆమె అత్యవసర పరిస్థితులలో ప్రత్యేక పాత్ర నిర్వహించి చరిత్ర సృష్టించారు.

బ్రిటిష్‌ ప్రబుత్వం మౌల్వీజాఫర్‌ అలీఖాన్‌ను 1920లో అరెస్టు చేసింది. ఆయనను అష్టదిగ్బంధనం చేయ డానికి అసత్య ఆరోపణలతో పకడ్బందీగా కేసును నమోదు చేసంది. ఈ వాతావరణాన్నిగమనించిన ప్రజలు, ఉద్యమకారులు వ్యధ చెందారు. మౌల్వీ జాఫర్‌ అలీ ఖాన్‌ గురించి, జమీందార్‌ పత్రిక భవిష్యత్తుగురించి ఆందోళన వ్యక్తం కాసాగింది. ఆ సమయంలో నేనున్నా..నేనున్నానంటూ బేగం జాఫర్‌ అలీఖాన్‌ రంగం మీదకు వచ్చారు. జమీందార్‌ పత్రిక ప్రచురణ బాధ్యతలను ఆమె స్వీకరించారు.

భారతావని నలుచెరు గులా ఉవ్వెత్తున ఎగసిపడు తున్న ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమకారులను, ప్రజలను, జమీందార్‌ పాఠకు లను ఉత్తేజపర్చుతూ, ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఎంతో చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ప్రకటన ప్రజలలో జాతీయ భావాలను ప్రజ్వరిల్లచేసి, ఎటువంటి త్యాగాలకైనా వారిని 80 సిద్ధపడేట్టుగా కార్యోన్ముఖులను చేసి, ఖిలాఫత్‌ ఉద్యమచరిత్రలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రకటనలో, నా భర్త మాట, రాత ద్వారా ఎటువంటి అపరాధం చేయలేదు... ఆయన కార్యక్రమాల గురించి, ఆయన లక్ష్య గురించి, ఆ లలక్ష్య సాధనా మార్గం గురించి నాకంటే బాగా ఎరిగిన వారుండరు.. నేరం చేయనివారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.... ఆయనకు నేనొక సలహా ఇచ్చాను.బ్రిటిష్‌ న్యాయస్థానం ఎటువంటి శిక్షనైనా విధించనివ్వండి, అది జైలు శిక్ష, బహిష్కరణ, జీవిత ఖైదు , ద్వీపాంతరవాసం, చివరకు ఉరిక్ష అయినా కానివ్వండి, తల వంచాల్సిన అవసరం లేదాన్నాను... భగవంతుని మార్గాన, మహమ్మద్‌ ప్రవక్త చూపిన బాటలో ఎంతి త్యాగానికైనా సిద్ధం కావాలి. పరీక్షకాలం చాలా కఠినంగా ఉంటుంది. భగవంతుడి కరు ణతో అన్నిఅవరోధాలు తొలిగి పోతాయి...భారతదశంలో సోదర-సోదరీమణులంతా ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమం కోసం ఉద్యమించి, ప్రభుత్వంఅనుసరిస్తున్న అణిచివేత విధానాలను వ్యతిరేకించాలి..ఖిలాఫత్‌ ఉద్యమం ప్రతి ఒక్కరి నుండి అత్యున్నత స్థాయి అర్పణను ఆశిస్తుంది. ఈ ధర్మపోరాటంలో ప్రతి ముస్లిం ధనమాన ప్రాణాలు అర్పించేందుకు సర్వదా సిద్ధ్దంగా ఉండాల్సిన సమయమిది. అంతా కలసి రండి. భగవంతుని అనుగ్రహంతో ఖిలాఫత్ ను కాపాడుకుందాం, అంటూ ఆమె పిలుపునిచ్చారు. ఈ పిలుపును 1920 సెప్టెంబరు 24నాిి జమీందార్‌ పత్రిక ప్రచురించింది.

బేగం జాఫర్‌ అలీఖాన్‌ వ్యక్తంచేసిన దేశభక్తి భావనలు, బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల వెల్లడించిన అభిప్రాయాలు, బ్రిటిష్‌ న్యాయస్థానం ఎదుట తలవంచవద్దని, అవసరమైతే జాతిజనుల లక్ష్య సాధన కోసం ప్రాణత్యాగానికి కూడ సిద్ధపడమని భర్తను కోరటం ద్వారా జాతీయోద్యమం-ఖిలాఫత్‌ పోరాటాల పట్ల ఆమెకున్న దాఢమైన అభిప్రాయం ప్రజలను ఉతేజితుల్ని చేసంది. ఈ ప్రకటనలోని వాక్యాలు ఖిలాఫత్‌ కార్యకర్తలకు, నేతలకు ప్రాణపదవునాయి.

పరదాల చాటున కుటుంబ జీవనం సాగించే మహిళలలో త్యాగమయ జాతీయ భావనలు ఈ విధంగా స్పష్టం కావటం ప్రజలను ఆశ్చర్యచకతుల్నిచేసింది. ఆమె పిలుపు ఖిలాఫత్‌ ఉద్యామానికి కొత్త బలాన్ని సమకూర్చి పెట్టింది. ఆమె త్యాగనిరతి, దాఢనిశ్చయం, ఖిలాఫత్‌ ఉద్యమం పట్ల ఆమె వ్యక్తంచేసిన నిబద్ధతను గమనించిన ఖిలాఫత్‌ నాయకులు

81 ఖిలాఫత్‌ కమిటీలో ఆమెకు ప్రత్యేక స్థానం కల్పించి గౌరవించారు.

ఆ తరువాత 1920 అక్టోబరు15న బేగం జాఫర్‌ అలీఖాన్‌ మరొక ప్రకటన జారీ చేసారు. ఈ ప్రకటన ద్వారా ఆమెలో నిబిడీకృ తమైన ధైర్య సాహసాలు చాలా స్పష్టంగా బహిర్గతమయ్యాయి. జమీందార్‌ లో ప్రచురితమైన ఆ ప్రకటనలో, పాలకులు ప్రజలకు వ్యతిరేకంగా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతూ నియంతల్లా వ్యవహరిస్తుంటే, జనసముదాయాలన్నీ ఏకమైనియంతృత్వశక్తుల మీద విరుచుకుపడాలి...వినాశన మార్గం నుండి మంచి మార్గం వైపుకు పాలకవర్గాలు మళ్ళేంతవరకు ఉద్యమాలు ఉధృతంగా సాగాలి. అంతిమంగా ప్రజలు విజయం సాధిస్తారు. ..మన మాతృభూమి భవిష్యత్తు దృష్ట్యా, మన గౌరవాన్నికాపాడేందుకు ఈ గడ్డమీది ప్రతి హిందూ-ముస్లిం ఈనాడు భుజం భుజం కలిపి పోరాడాల్సిన బాధ్యత ఉంది. సహాయనిరాకరణ ద్వారా దుష్టపాలకులను నిస్సహాయులనుచేయాలి. ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ సహాయ నిరాకరణ చేప్టినట్టయితే, ఈ దేశం సమస్యలు, ఖిలాఫత్‌ సమస్య పరిష్కారమైపోతాయి...స్వదేశీ ఉద్యమ ఫలితాలను గమనించండి. మనమంతా విదేశీ వసువుల బహిష్కరణను ఉద్యమంగా

కొనసాగిస్తే సత్పలితాలను పొందగలం...ఈ రోజు నుంచి నేను విదేశీ వస్తువులను, బట్టలను త్యజిస్తున్నాను. నా ప్రాణం పోయినా విదేశీయత నా దేహాన్ని ముట్టుకోనివ్వను. భారత దేశంలో తయారైన బట్టలను, వస్తువులను మాత్రమే వాడుతానని ప్రమాణం చేస్తున్నాను., అని ఆమె పేర్కొన్నారు.

ఈ మేరకు ఆమె చేసిన ఆ ప్రమాణానికి బేగం జీవితపర్యంతం కట్టుబడి ఉన్నారు. మౌల్వీ జాఫర్‌ అలీఖాన్‌ వెంట ఆమె నిరంతరం నీడలా ఉంటూ స్వాతంత్య్రోద్యమంలో బేగం జాఫర్‌ అలీఖాన్‌ తనదైన భాగస్వామ్యాన్ని అందించి కృతార్థ్ధులయ్యారు.

                           * * *

మీ లాంటి యువకుల్లో రక్తం చల్లబడిపోయింది. మీలో పౌరుషం చచ్చిపోయిందా? మీ రక్తం ప్రతీకార జ్వాలతో వేడెక్కుతుందా? లేదా? మన మోచేతి నీళ్ళు తాగే కుక్కలు మనపై పెత్తనం చలాయిస్తున్నారు. దానిని మనం మౌనం గా భరిస్తున్నాం. మన వీరత్వం, శౌర్య పరాక్రమాలు ఏమైపోయాయి? - బేగం అజీజున్‌

82