Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/జమాలున్నీసా బాజి

వికీసోర్స్ నుండి

తెలంగాణ పోరులో కమ్యూనిస్టు యోధురాలు

జమాలున్నీసా బాజి

జాతీయోద్యమంలో ప్రవేశించి తద్వారా బ్రిటిషర్ల బంధనాల నుండి విముక్తి కోసం పోరాటం మాత్రమే కాకుండ విముక్తి పోరాటాల స్పూర్తితో సమతా-మమతల వ్యవస్థలను స్థాపించి జాతి జనులకు ఉత్తమోత్తమ వ్యవస్థను అందించాలన్న లక్ష్యయంతో ముందుకు సాగిన మహిళలు ఎందరో. ఆ క్రమంలో ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనం కోరుతూ సాగిన ఉద్యమంలో పాల్గొనటమే కాకుండ ఆతరువాత సాగిన తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ప్రజల పక్షం వహించి పోరుబాటన నడిచిన మహిళా ఉద్యమకారులలో జమాలున్నీసా బాజి ఒకరు.

జమాలున్నీసా 1915 ప్రాంతంలో హైదరాబాదు సంస్థానంలో జన్మించారు. ఆమె తల్లి హైదారాబాదుకు చెందినవారు కాగా తండ్రిది ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం. ఆయన నైజాం సంస్థానంలో న్యాయాధికారిగా పనిచేశారు. కుటుంబంలోని పెద్ధలు ఆచార సంప్రదాయాల పట్ల అనురక్తులైనప్పటికి తల్లితండ్రులు మాత్రం ఉదార స్వభావులు. తల్లి తండ్రులు చిన్ననాటి నుండే తమ పిల్లలకు తగినంత స్వేచ్ఛ కల్పించారు. ప్రధానంగా తండ్రి నుంచి లభించిన స్వేచ్ఛ ఫలితంగా చిన్నతనంలోనే జమాలున్నీసాకు స్వ్వతంత్ర భావనల తోపాటుగా జాతీయ భావనలు అలవడ్డాయి.

237 పదమూడు సంవత్సరాల వయస్సులోనే ఆమె ' నిగార్‌ ' పత్రికను చదవటం ఆరంభించారు. లక్నొకు చెందిన నియాజ్‌ ఫతేపూరి సంపాదకత్వంలో నిగార్‌ పత్రిక వచ్చేది. ఆ పత్రిక, ఛందసత్వానికి, మతమౌడ్యానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండ స్వాతంత్య్రం, సామ్రాజ్యవాద వ్యతిరేక లక్ష్యాన్ని ముందుకు తీసుక పోవడానికి కృషిచేసింది. అందువల్ల యీ పత్రిక అత్యంత ప్రమాదకరమైనదని నైజాం ప్రబుత్వం భావించి హైదరాబాదు సంస్థానంలోకి దాని ప్రవేశాన్ని నిషేధించింది. (హెదరా బాఫదు సంస్థానంలో రాజకీయ చైతన్యం, విద్యార్థి-యువజనుల పాత్ర (1938-1956), ఎస్‌.ఎం.జవాద్‌ రజ్వీ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌, విజయవాడ, 1985, పేజి.25).

నిషేదిత నిగార్‌ పత్రిక ప్రబావం వలన మతపరమైన ఛాందసాలకు వ్యతిరేకంగా, బ్రిటిషర్ల మిత్రుడిగా మారిన నైజాం సంస్థానాధీశుడ్ని నిరశిస్తూ జమాలున్నీసా ఉద్యమించారు. ఆమె అభిప్రాయాల స్థిరత్వానికి కుటుంబ వాతావరణం కూడ తొడ్పడింది. మత సంబంధమైన కొన్ని ఆచార సంప్రదాయాల విషయంలో కూడ సమకాలీన సమాజం అభిప్రాయాలకు భిన్నంగా ప్రవర్తించటం వలన జమాలున్నీసా స్వజనుల నుండి చాలా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. మతద్రోహులని పిలిచేవాళ్ళని జమాలున్నీసా స్వయంగా చెప్పుకున్నారు. ఈ మేరకు స్వతంత్ర భావాలతో ఉద్యమిస్తున్న ఆ కుటుంబ సభ్యుల పదతు లు సరికాదంటూ బందువులు ఎంతగా చెప్పినా ఆ కుటుంబ సభ్యులు తమదైన మార్గంలో ముందుకు సాగారు. తొలిదశలోబ్రిటిషర్లకు వ్యతిరేకంగా జాతీయోద్యమం పట్ల మొగ్గు చూపిన జమాలున్నీసా చివరివరకు ఆ పోరుబాటన నడవటమే కాకుండ కమ్యూనిస్టుగా తన పోరాట పరిధిని మరింతగా విస్త్రృత పర్చుకున్నారు.

స్వతంత్ర ఆలోచనలు, ఉదార స్వభావం గల కుటుంబంలో జన్మించి, ఆ వాతావరణంలో ఎదిగిన జమాలున్నీసా వివాహం సంకుచిత ఆలోచనలు గల కుటుంబంలో జరిగింది. ఆ కారణంగా అత్తవారింటి వాతావరణంతో అలవాటు పడేందుకు తొలిదశలో ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఆమె వివరిస్తూ మా అత్తవారిల్లు చాలా వెనుకబడ్డ కుటుంబం. మొదట్లోచాలా బాధవేసేది. కష్టంగా అనిపించేది. నేను కొంత సరిపుచ్చుకోవాల్సి వచ్చేది...నన్ను ఒక సంవత్సరం దాకా మా వాళ్ళు మా అమ్మ

238 ఇంటికి పోనివ్వలేదు. మా నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్ళుతుండేవాడు. నా భర్త అన్న, అతని భార్య చాలా సంకుచిత స్వభావం కలవారు. ఎవర్నీబయటకు వెళ్ళనిచ్చేవారు కారు. మూడు సంవత్సరాలు నేను ఒక కుటుంబ స్త్రీగానే ఉన్నాను- కుట్టుపని నేర్చుకున్నాను. ఇంట్లో కట్టేసినట్టుండేది కాని నాకున్న కొన్ని అభిప్రాయాలను మాత్రం నేను దాచలేదు . పుస్తకాలు చదివేదాన్ని కాని ఎదో సర్దుకు పోయేదాన్ని-కుటుంబ జీవితంలో. తర్వాత మేం వేరే ఇల్లు ఉస్మాన్‌పురా కట్టెల మండి దగ్గర తీసుకున్నాం. నా కొడుకప్పుడు మూడేళ్ళవాడు. సెలవుల్లో మా నాన్నదగ్గరకు వెళ్ళుతుండేదాన్ని. అది మా అత్తగారింట్లో ఇష్టం ఉండేది కాదు. అటువంటి ప్రతికూల వాతావరణంలో కూడ ఆమె తన చిన్ననాటి స్వతంత్ర భావనలను వదులుకోలేదు . ఆ తరు వాతి కాలంలో అత్తవారింటి వాతావరణంలో కొంత మార్పు వచ్చింది. ఆ మార్పులతో తాత్కాలికంగా తెరపడిన కార్యకలాపాలను మరింత ఉత్సాహంతో జమాలున్నీసా ఆరంభించారు.

చిన్నతనంలోనే జాతీయోద్యమం పట్ల ఆకర్షితురాలైన జమాలున్నీసా స్వదేశీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ విషయాన్నిఆమె స్వయంగా ప్రస్తావిస్తూ, స్వదేశీ ఉద్యమం కూడ మమ్మల్ని ప్రబావితం చేసింది. నేను స్వదేశీ బట్టలనే కట్టుకునేది. (మనకు తెలియని మన చరిత్ర ó పేజి.173) అని అన్నారు. ఆ సమయంలో జమాలున్నీసా కుటుంబం మీద స్వాతంత్య్రసమరయోధుడు, ప్రసిద్ధ కవి మౌలానా హస్రత్‌ మోహని ప్రభావం ఉంది. ఆమె కుటుంబానికి ఆయన దగ్గర బందువు.హైదారాబాదు వచ్చి మల్లేపల్లి మసీదు వద్ద ఆయన కొన్ని సంవత్సరాలు ఉన్నారని, ఆయనకు తమ కుటుంబంతో సన్నిహిత బంధుత్వం సంబంధాలున్నాయని జమాలున్నీసా చెప్పుకున్నారు. మౌలానా మోహాని చాలా చురుకైన స్వదేశీ ఉద్యమకారుడు. జాతీయోద్యమంలో ఆయన బ్రిటిషరకు వ్యతిరేకంగా పోరాడుతూ పలుమార్లు జెళ్ళ పాలయ్యారు. ఆయనను సహచరులు ' ఫైర్‌ బ్రాండ్‌ ' గా పరిగణించేవారు. అటువంటి యోధునితో ఏర్పడిన పరిచయం జమాలున్నీసా కుటుంబ సభ్యులను జాతీయోద్యమం, స్వదేశీ ఉద్యమం, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యామాల దిశగా నడిపించాయి.

ఆ కారణంగా జమాలున్నీసా జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయినప్పటికి చేయాల్సినంతగా చేయలేదని ఆమె చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, మొదట్నించి జాతీయోద్యమంలో వుండేవాళ్ళం. మేమేం చేయడం లేదని

239 ఎప్పుడూ అన్పించేది. మేము అజంతాలో వున్నప్పుడు ముహమ్మద్‌ అలీ, ఆయన భార్య అక్కడికొచ్చారని తెలిసింది. మేము, అఖ్తర్‌ (సోదరుడు) మా పెద్ద నాన్న మా పాకెట్ మనీ -15, 20 రూపాయలు జమచేసి బేగం ముహమ్మద్‌ అలీకి ఇచ్చాం, అని చెప్పుకున్నారు. (మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రతాంగపోరాటంలో స్రీలు-ఒక సజీవ చరిత్ర), స్త్రీ శక్తి సంఘటన, హైదారాబాద్‌, 1986, పేజి.175).

ఆనాడు నిజాం సంస్థానంలో జాతీయోద్యమ భావాలు వ్యక్తం చేయటం కాదు కనీసం మనస్సులో ఉండటం కూడ పెద్ద అపరాధంగా భావిసున్న భయానక వాతావరణం. స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉండటమే చాలా పెద్ద నేరం. ఆ వాతావరణంలో జమాలున్నీసా స్వతంత్ర భావనలు కలిగి ఉండటమే కాకుండ స్వదేశీ ఉద్యమంలో ఆచరణాత్మకంగా పాల్గొనటం జాతీయోద్యామానికి ఆర్థికంగా తోడ్పటం చాలా ప్రమాదాకరమైన ప్రయత్నం అటువంటి సాహసాన్ని జమాలున్నీసా ప్రదర్శించారు. జాతీయోద్యమ నిధికి చిన్న వయస్సులోనే తన పాకెట్ మనీని అందచేసి జాతీయోద్యమంలో భాగస్వాములు కావటం విశేషం.

జాతీయోద్యమంలో పాల్గొన్న జమాలున్నీసా బాజి ఆ తరువాత సంతరించుకున్న కమ్యూనిస్టు భావాల కారణంగా క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు . ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు. కాని ఆ ఉద్యమం పట్ల, ఉద్యమకారుల పట్ల సానుభూతి ఉండేదని, అమె స్వయంగా చెప్పుకున్నారు. అనాడు బాజి కుటుంబం గాంధీ కంటే సుబాష్‌ చంబ్రోసు అభిప్రాయాలతో ఏకీభవించారు. ఈ విషయాన్నికూడ అమె స్పష్టంచేస్తూ గాంధీ కంటె నెహ్రూ˙నే ఇష్టపడేవాళ్ళం. సుభాస్‌ బోస్‌ కాంగ్రెస్‌ నుంచి తీసేసినపుడు మాకు చాలా కోపం, బాధ కలిగింది అన్నారు. (మనకు తెలియని మన చరిత్ర పేజి.175).

జమాలున్నీసాకు చిన్నతనంలో సరైన పాఠశాలలో విద్య లభించలేదు. అయినా ఆ తరువాతి కాలంలో స్వయంగా శ్రమించి ఉర్దూ, ఆంగ్ల భాషలను అమె నేర్చుకున్నారు. ఆ విధంగా సంపాదించుకున్న బాషా పరిజ్ఞానంతో చెల్లెలు రజియా బేగంతో కలసి సాహిత్య సమావేశాలకు హజరయ్యారు. ఆ క్రమంలో హైదారాబాదు నగరంలోని మలక్‌పేట లోగల తమ గృహాన్ని సాహిత్యకారుల కూడలిగా మార్చారు. ఆమె ' బజ్మె ఎహబాబ్‌ '

240

పేరుతో సాహితీ మిత్రుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో వారి ఇంట సాహితీ సమావేశాలు, చర్చలు, గోష్టులు జరిపారు. ఆ సమావేశాలలో పలువురు యువ రచయితలు-కవులు పాల్గొనేవారు. ఆ సత్సంగంలో సాహిత్య చర్చలకు మాత్రమే పరిమితం కాకుండ ప్రజల సమస్యల గురించి, జాతీయోద్యమం గురించి, సామ్యవాద భావాల గురించి, కమ్యూనిస్టు పార్టీ గురించి, అహేతుకు ఆచారసంప్రదాయాల మీద విశ్త్రుతంగా చర్చలు సాగేవి. ఆ చర్చలలో జమాలున్నీసా తన సోదరి రజియా మాత్రమే కాకుండ ఆమె అన్నదమ్ములు కూడ భాగస్వామ్యలయ్యేవారు.

ఆ కార్యక్రమాలలో భాగంగా ఏర్పడిన భావాల మూలంగా పరాయి పాలకుల పెత్తనం నుండి మాత్రమే కాకుండ మతమౌఢ్యం, ఛాందసం భావాల నుండి కూడ ప్రజలు విముక్తి కావాలని ఆమె ఆశించారు. ఇస్లాం మతం ప్రబోధించిన మౌలిక ధార్మిక సూత్రాలకు వ్యతిరేకంగా వివిధ ఆహేతుక కర్మకాండలు స్వమతస్థులలోని ఆచార సంప్రదాయాలలో చోటు చేసుకున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అటువంటి ఆహేతుక సంప్రదాయాలను ఆమె నిరాకరించారు. ఆ వివాదాస్పద విషయాల మీద చర్చలు జరిపారు. ముహమ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజు పండుగను (మిలాద్‌- యే-నబి) పురస్కరించుకుని చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సందర్భంగా ఇస్లాం మతం యొక్క నిజమెన సారాంశం వివరిసూ, కొంత మంది ముస్లింలు అనుసరిస్తున్న అహేతుక


241 కర్మకాండల గురించి చర్చించి, హేతుబద్దం కాని అనాచార సంప్రదాయాలను తిరస్కరించాల్సిందిగా ప్రజలను కోరారు. ఆ కాలంలో అమలులో ఉన్న పర్దా పద్దతిని తిరస్కరించారు. ఆ తిరస్కారం స్వజనుల ఆగ్రహానికి కారణమైనప్పికి జమాలున్నీసా లెక్కచేయలేదు. ఆగ్రహించిన సన్నిహితులకు విషయాన్ని తర్కబద్దంగా వివరించి నచ్చ చెప్ప ప్రయత్నించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల నైతిక మద్దతు వలన తన అభిప్రాయాల మీద జమాలున్నీసా బాజి చివరివరకు సుదాఢంగా నిలిచారు.

జాతీయోద్యమ కార్యక్రమాలలో తనదైన పాత్ర నిర్వహిస్తూ వచ్చిన జమాలున్నీసా క్రమక్రమంగా కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. కమ్యూనిజం ప్రబావానికి ఆమె ఒక్కతే లోనుకాలేదు. ఆమె సోదరులు అన్వర్, జఫర్‌, సోదరి రజియా బేగం కూడ ప్రభావితులయ్యారు. కమ్యూనిజం సాహిత్యాన్ని పఠిస్తూ సిద్ధాంత పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రజలలో కలసి పనిచేయటం ఆరంభించారు. అన్ని రంగాలలో సమానత్వం సాధించటం, సమసమాజ స్థాపన అను మహత్తర లక్ష్యాలను సాధించేందుకు కమ్యూనిజం ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మిన జమాలున్నీసా బాజి కుటుంబ సభ్యులు ఆ దిశగా ఎంతో నిబద్దతతో ముందుకు సాగారు. ఆ లక్ష్యసాధనకు తమ ప్రాణాలు బలిపెట్టడానికి కూడ ఆమె అన్నదామ్ములు జఫర్‌, అన్వర్లు సిద్దమయ్యారు. ఆ సోదరులకు మద్దతుగా జమాలున్నీసా బాజి అమె చెల్లెలు రజియా బేగం, ఇతర కుటుంబ సభ్యులు కూడ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల ప్రచారానికి తోడ్పడ్డారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ మీద పలు ఆంక్షలు, నిషేధాలు ఆమలులో ఉన్నప్పటికి పోలీసుల, గూఢచారుల కంటపడకుండా తమ ఇంటిని రహాస్య కేంద్రంగా చేసు కుని జమాలున్నీసా ఎంతో ధైర్యంతో పార్టీ కార్యకలాపాలను నిర్వహించారు.

జమాలున్నీసా కుటుంబం వామపక్షబావాల వైపు గా సాగించిన ప్రస్తానం గురించి స్వయంగా ఆమె ఈ విధంగా వెల్లడించారు. ఆ కథనం ప్రకారం, మొదట్నించీ మేము వామ పక్షానికి దగ్గరగా వుండేవాళ్ళం. 1941లో అభ్యుదయ రచయితల సంఘం అని ఒకి వుండేది. మఖ్దూం, నజర్‌ హైదారాబాద్‌ ఎప్పుడూ వస్తూండేవారు. మేం నలుగురు అక్క చెల్లెళ్ళం. ఈ మీటింగులకి బహిరంగంగా వెళ్ళేవాళ్ళం. అమ్మకూడ వచ్చేది. కొంతమంది చిల్‌మన్ల (చాటుకోసం చేసిన ఏర్పాటు) వెనుక కూర్చునేవాళ్ళు....సజ్దాద్‌ జహీర్‌, ఓంకార్‌, పర్షాద్‌ లాంటివాళ్ళు చాలా మంది అండగ్రౌండ్‌లో వున్నప్పుడు మా

242


యింట్లో వుండే వాళ్ళు.1947 తర్వాత లక్నోలో హిందీ కాన్పరెన్స్‌-మౌలానా ఎసియాటిక్‌ కాన్పరెన్స్‌- వెళ్ళాం. అక్కడ ఎర్రజెండాలు ఎగరేశాం. చాలా మంది అరెస్టయ్యారు.

ఆ క్రమంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ప్రమీలా తాయిని జమాలున్నీసా కలుసుకున్నారు.1946లో ఆమె కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.1946 నవంబరులో పార్టీ మీద నిషేధం విధించబడింది. కమ్యూనిస్టు పార్టీ మీద విధినిషేధాల కారణంగా, నిజాం ప్రబుత్వం చర్య ల మూలంగా చాలా రహస్యంగా ఆమె కార్యకలాపాలను నిర్వహించాల్సి వచ్చేది. నాయకులకు, పార్టీ కార్యకరలకు ఆశ్రయంకల్పించటం, ఆహారం అందించటం, నాయకుల మధ్య సమాచారం చేరవేయటం, ఆయుధాలను సరఫరా చేయటం, ఆయుధాలను దాచిపెట్టటం లాంటి బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించారు. ఈ విషయంలో అమె కుటుంబ సభ్యులు కూడ ఎంతో సాహసంతో కార్యక్రమాలలో ప్రముఖ పాత్రవహించారు. ఆ విషయాలను కూడ అమె ఈ క్రింది విధంగా వెల్లడించారు.

నేను బయటకు వెళ్ళలేకపోయేదాన్ని కాదుకాని అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు వచ్చి ఉండిపోయేవారు. భర్తతో వాళ్ళు నా అన్న స్నేహితులని చెప్పేదాన్ని. మా కుటుంబం వాళ్ళనంతా చూసి క్రమంగా ఆయనకొక నమ్మకం కుదిరింది. నా అన్న తమ్ముళ్ళంతా కాలేజీలు వదలి ఉద్యమంలో చేరి చాలా బాధలుపడ్డారు. అయుధాలిక్కడే దాచేవారు. అన్వర్ , జఫర్‌, నా అన్న వరస హఫీజ్‌ వీళ్ళంతా కలసి పనిచేసేవారు. వాళ్ళంతా అరెస్టయ్యారు. అన్వర్ చాలా సీరియస్‌ జబ్బుతో బాధపడుతుండేవాడు. ఖమర్‌, మజర్‌ అండర్‌ గ్రౌండ్‌లో ఉండి అరెస్టయ్యారు. అన్వర్ అతగారిల్లు ఎక్కడో దూరంగా హబ్సీగూడ రామాంతపూర్‌లో వుండేది. మఖ్దూం, ఓంకార్‌ అక్కడే ఉండేవాళ్ళ. మఖ్దూం, జఫర్‌, షఫీఖ్‌, బెవ్‌జద్‌తోపాటు అరెస్టయ్యాడు....జఫర్‌ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఊళ్ళకి వెళ్ళి, అక్కడి పరిస్థితులను చూసి నిరాశతో తిరిగి వచ్చాడు. జఫర్‌ రివాల్వర్లను దాచిపెడితే, అఖ్తర్‌ వాిని ఒక పెటెలో పెట్టి పోలీసులు వచ్చిప్పుడు వాటిపెన కూర్చుంది. ఆమె మురాద్‌ నగర్‌ వెళుతూ రివాల్వర్‌ నాకిచ్చింది. నేను దాన్ని ఇక్కడే దాచాను.

జిన్నా ఇంటిర్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లజెండాల ప్రదర్శనలిమ్మని పిలుపునిచ్చాడు. అందరూ దాన్ని పాటించారు. కాని మేము పాటించలేదు. మా అన్నలు ఎర్రజెండా ఎగురవేశారు. చుట్టుపక్కల వాళ్లంతా ఇష్టపడలేదు. రాజ్‌ బహుదూర్‌ గౌడ్‌, జవార్‌ (జవ్వాద్‌ రజ్వీ) హస్పిటల్‌ నుంచి తప్పించుకుని ఇక్కడికే మొదలు వచ్చారు. 1947 ప్రారంభంలో ఎక్కడ చూసినా పోలీసులుందేది. రిక్షాకు పర్దాకట్టించి వాళ్ళనిక్కడి

243 నుంచి వేరొకచోటుకి తీసుకెళ్ళాం. రాజ్‌ మమ్మల్నిఅండర్‌ గ్రౌండ్‌ వెళ్ళిపొమ్మన్నాడు. అఖ్తర్‌ మధ్యలో ఒకసారిపెరోల్‌ మీద వచ్చి వెళ్ళిపోయాడు.

1948లో నా భర్త చనిపోయాడు. నేను తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాను. పార్టీ కోరకు డబ్బువసూలు చేయటం మొదలుపెట్టాను. తాయి (ప్రమీలా తాయి) యశోధాబెన్‌, బ్రిజ్‌రాణి అంతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ మీద నిషేధం వచ్చిన తర్వాత అంతా ఇక్కడికి రావడం ప్రారంభించారు. అభ్యుదయ రచయితల సమావేశాలు కూడ జరిగేవి.

కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు ఎక్కువైపోయాయి. ఆర్‌.యన్‌(రావి నారాయణ రెడ్డి) బొంబాయి వెళ్ళాడు. తర్వాత అఖ్తర్‌, గోపాలన్‌( ఎ.కే.గోపాలన్‌), జ్యోతిబసు, ముజఫర్‌ అహమ్మద్‌తో ఏర్పడిన డెలిగేషన్‌ ఒకటి వచ్చి-1951లో సాయుధ పోరాటం కొనసాగించాలా విరమించాలా అనే విషయం చర్చించడానికి వచ్చారు. మా ఇంటి ముందున్న యింట్లో వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేశాము. మా నాన్న సహాయం చేశాడు. చాలా రాత్రి వరకు మీటింగులు, చర్చలు జరిగేవి. అని ఆనాటి విషయాలను జమాలున్నీసా వివరించారు.

ఈ విధంగా పోరాట కార్యక్రమాలలో పాల్గొన్న జమాలున్నీసా బాజి కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని విరమించుకున్న తరువాత కూడ పార్టీపరంగా ప్రజలలో పనిచేయటం ఆరంభించారు. ప్రధానంగా మహిళలలో ఆమె ఎక్కువగా పని ప్రారంభించారు. ఆ విశేషాలను ప్రస్తావిస్తూ, పోరాటం విరమించుకున్న తర్వాత, మహిళా సంఘాలు ప్రారంభించాం. కామ్రెడ్‌ ఘనీ అసిఫ్‌నగర్‌లో అతని భార్యతో ఒక మహిళా సంఘం పెట్టాడు. పర్దావేసుకునే స్త్రీలు ఒక సెంటర్‌ నుంచి ఇంకో సెంటర్‌ వెళ్ళేవారుకారు. ఆఘాపురాలో ఒక రాత్రి బడి, మాస్క్‌ దగ్గర ఇంకో సెంటర్‌ పెట్టారు. కథలు, గోర్కీ రచనలు చదివేవాళ్ళం. చాలా రోజులు అలా చేశాం. కొంతమంది అమ్మాయిలు పార్టీ సభ్యురాళ్ళయ్యారు. ఎన్నికల్లో పనిచేశారు. నాతో కలసి గుంటూరు, విజయవాడకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా పెళ్ళిల్లు చేసుకుని, ఏమీ చేయటం లేదని ఆమె పేర్కొన్నారు.

కమ్యూనిస్టు పార్టీకార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న పలువురు పార్టీ కార్యక్రమాల నుండి క్రమంగా దూరమైనప్పటికి జమాలున్నీసా మాత్రం తన ప్రజాచైతన్య కార్యక్రమాలలో కొనసాగారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మగ్దూం మొహిద్దీన్‌ మార్గదార్శకత్వంలో ఆమె తన కార్యకలాపాలను సాగించారు. ఆ వివరాలను ఆమె ఈ

244 విధాంగా పేర్కొన్నారు.

1952లో మఖ్దూం విడుదలయిన తర్వాత నన్ను స్త్రీలతో పనిచేయమన్నాడు. మేమెట్లా చేయగలుగుతాం ? తాయి (ప్రమీలా తాయి) ఇంకా విడుదల కాలేదు. ఆహార ధాన్యాల ధారల సమస్య బాగా పనికొచ్చింది. ముస్లింలలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువైపోయింది. ఈ సంఘాలు వారిని ఆకర్షించలేదు. ఇంకా కొంత ఆకర్షనీయమైనవి కావాల్సి వచ్చింది. ఓంకార్‌ స్త్రీల ప్రజాస్వామ్య సంఘం పెట్టడానికి తోడ్పడ్డాడు. దాని నియమావళి తయారు చేశాడు. నలభై మంది స్త్రీలు కుట్టుపని, చేతిపని నేర్చుకునేవారు. మేము రాయటం, చదవటం నేర్పించేవాళ్ళం. పత్రికలు పుస్తకాలు కొనేవాళ్ళం. చదవటం, చర్చలు పెట్టడం చేసేవాళ్ళం. డబ్బు సరిపోయేది కాదు. కోఆపరిేటివ్‌ ఇనస్పెక్టరు కోఆపరిేటివ్‌ పెట్టమని సలహా యిచ్చాడు. చాలా మంది కాలేజీ టీచర్లు షేర్‌ హోల్డర్స్‌గా చేరారు. ఆడవాళ్ళకు జీవనాధారం చూపించటం, ఏదైనా పనిగానీ ఒక స్కిల్‌గాని నేర్పించటం ఆ కోపరిేటివ్‌ ఆశయం. చాలా మంది పరిక్షలిచ్చి పాసయ్యారు కూడ. ఇప్పుడు కూడ ఆ పని జరుగుతుంది కాని, తక్కువ శక్తితో, ఇద్దారు టీచర్లున్నారు. తెలుగు, ఉర్దూ ఎనిమిదవ తరగతి దాకా నేర్పుతారు. టెక్నికల్‌ ఏడ్యుకేషన్‌ బోర్డు కూడ దీన్ని గుర్తించింది. మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ బ్రాంచ్‌లు కూడ ఉన్నాయి.

గతంలో పర్దాలాంటి సమస్యల గురించి చర్చించేవాళ్ళం. చాలా మంది రజియా సజ్దార్‌ జహీర్‌, ఇస్మత్‌ చోగ్తాయి లాంటి వాళ్ళు వచ్చి మ్లాడేది. ఆరోజుల్లో స్త్రీలు చదువుకున్న వాళ్ళు రాకపోయినప్పుికి ప్రశ్నలడిగి ఎన్నో నేర్చుకునేవారు. ఇప్పుడెవరికీ ఆ కుతూహలం లేదు. పార్టీ గురించిగాని, రాజకీయ సమస్యల గురించి కానీ తెలియదు. బహుశ గల్ప్‌దేశాల నుంచి వచ్చే డబ్బు కారణం కావచ్చు. కొంత వరకు పార్టీకి ఆసక్తి లేదు. ఏమి పట్టించు కోదు. మహిళా ప్రజాస్వామిక సంఘం ఏమైనా కాన్పెరెన్స్‌ కెళ్ళాల్సి వచ్చినప్పుడే పనికొస్తుంది.

ఆ విధంగా స్థానికంగా మహిళలలో పనిచేస్తూ జాతీయస్థాయి కార్యక్రమాలలో కూడ ఆమె చురుకుగా పాల్గొన్నారు. స్వయంగా ఇతర ప్రాంతాలలో జరుగుతున్న సభలు, సమావేశాలకు హజరయ్యారు. ఆనాడు జమాలున్నీసా, ఆమె సహచరులు ఎదుర్కొన్న ఇబ్బందులు అమె మాటల్లో ఇలా ఉన్నాయి.

1952-53లో ఢిల్లీ కాన్పెరెన్స్‌లో మేము అఖిలభారత మహిళా కాన్పెరెన్స్‌ (జు|ఇ్పు) నుంచి వేరుపడ్డం. 54లో కలకత్తా సమావేశంలో మహిళా ప్రజాస్వామిక

245 సమాఖ్య నిర్ణయించబడి, ఒక నియమావళి తయారు చేశారు. రేణు చక్రవర్తి, హజ్రబేగం (హజౌరా బేగం) పాల్గొన్నారు. అఖిల భారత మహిళా కాన్పరెన్స్‌..కలకత్తా, ఢిల్లీ సమావేశాలకి వెళ్ళాను. ఇక్కడ పని చేసున్న బద్రున్నిసాను తీసుకళ్ళాను. ఆమెకు రెండేళ్ళ పాప వుండేది. ఆమె కాన్పరెన్స్‌లో పాల్గొన్నట్టు పేపర్లో వస్తే ఆమె అత్తవారి వాళ్ళు అభ్యంతరం పెట్టారు. తర్వాత ఆమె భర్త విడాకులిచ్చాడు. ఆమె చాలా భయపడిపోయి ఇక్కడేవుండేది. ఆమెనోక ముసలతనికిచ్చి పెళ్ళి చేయాలని చూశారు. ఆమెకది ఇష్టం లేక ఒప్పుకోలేదు. ఇక్కడేటీచరు పనిచేస్తూ, ఎంతో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చాలా మంది స్త్రీలు కోఆపరిేవ్‌ సెంటరుకి నేర్చుకోవాటానికి వస్తారు. కాని చాలా కొద్దిమంది పని చేయడానికి వస్తారు. వాళ్ళకు పని అంతగా అవసరం లేదు. వాళ్ళవాళ్ళెవరో ఒకరు బయట పనిచేస్తుాంరు కాబ్టి. మా బంధాువోక అమ్మాయిక్లాసులు తీసుకోడనికి ప్రయత్నించింది. కాని ఎక్కువమంది రాలేదు. నాకేవిధంగాపనిసాగించాలో తెలియటం లేదు. మతోన్మాదము కూడ కొంత కారణమైయుంటుంది. ఇదివరకు పర్దాను వ్యతిరేకించడానికి ప్ర త్నించారు. ఇప్పుడట్లాకాదు. ఇదివరకు ముస్లిం స్త్రీలు ఊరేగింపుల్లో వచ్చేవారు. నేనే ఎన్నో సార్లు ఎలక్షన్‌ మీటింగులకి, కాంపేన్లకి (ప్రచారం) తీసుకెళ్ళాను. హిందూ స్త్రీలు కూడ అంతగాపట్టించుకోవటం లేదు.

ఆ ప్రతికూల వాతావరణంలో కూడ జమాలున్నీసా కమ్యూనిస్టు కార్యకర్తగా ఎంతో నిబద్దతతో కొనసాగారు. పార్టీనాయకులు ఎక్కడకు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళి బాధ్యా తలను నిర్వహించారు. తెలంగాణా ప్రాంతానికి మాత్రవు ఆమె పరిమితం కాకుండ పలు ప్రాంతాలలో పర్యించారు. ఆ సమయంలో ప్రజలు ప్రధానంగా మహిళలు వారి పట్ల ఏవిధంగా స్పందిచారో ఆమె వివరించారు. ఆమెకు తెలుగు పూర్తిగా రాదు. ఆ కారణంగా తెలుగు మాట్లాడె ప్రజలతో పూర్తిగా మమేకం కాలేకపోయారు. ఆ విషయాన్ని ఆమె ఇలా చెప్పారు. తెలుగు తెలిసి ఉంటే ఇంకా పని చేయడనికి తోడ్పడేది. చాలా మంది బాగా ఉత్సాహంగా ఉండే అమ్మాయిలుండేవారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు జ్ఞాపకం రావటం లేదు. మమ్మలెక్కడకి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఎక్కడికి ఎలా వెళ్ళడం అనికూడ అడక్కపోయేవాళ్ళం. ఆర్‌.వి (రావి నారాయణరెడ్డి) వెళ్ళమనేవాడు. మేం వెళ్ళిపోయేవాళం. ఒకసారి ఆర్‌.యన్‌.తో మిర్యాలగూడ వెళ్ళాం...బోన్‌గిర్‌, హుజూర్‌నగర్‌ ఎలక్షన్‌ ప్రాపగాండకు వెళ్ళాం. ఒక ముసలమ్మ నన్ను తీసుకెళ్ళి భోజనం పెట్టింది.

246 కామ్రేడ్లని ఎప్పుడూ బాగా చూసుకునేవారు ప్రజలు.

జమాలున్నీసా కుటుంబం యావత్తు అటు కమ్యూనిస్టులు కావటంగాని లేదా కమ్యూనిస్టు సానుభూతిపరుగా మెలగటం వలన, ఆ క్రమంలో కుటుంబ సభ్యులు ప్రదర్శించిన నిబద్దత మూలంగా కమ్యూనిస్టుపార్టీలో ప్రముఖులుగా వెలుగొందుతున్న వ్యక్తులతో సత్సంబంధాలు కుదిరాయి. ఆ కారణంగా ఆమె చెల్లెలు, తమ్ముళ్లకు ఖైఫీి అజ్మీ లాంటి ప్రముఖ కవుల కుటుంబం నుండి సంబంధాలు వచ్చాయి. ఆ విషయాన్ని కూడ జమాలున్నీసా ఈ విధంగా వివరించారు.

ఖైఫి అజ్మీ నా చిన్న ఆడబిడ్డను పెళ్ళిచేసుకున్నాడు. జకియా(నా చిన్న చెల్లెలు)ను విశ్వామిత్ర ఆదిల్‌కిచ్చి పెళ్ళిచేస్తే బాగుంటుందని ఆయన ఆన్నాడు. ఆదిల్‌ పార్టీ సభ్యుడవడమే ముఖ్యకారణం. అంటే పార్టీసభ్యులంటే ఆరోజుల్లో మంచి అభిప్రాయ ముండేది. వ్యకిగత సామర్యముగాని, క్లాసు కల్చరల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ గురించిగాని ఆలోచించే వాళ్ళం కాదు. బతుల్‌ ఇంకోక ఉదాహరణ. ఆమె పార్టీసమావేశాల కొచ్చేది. పాటలు పాడేది, కవిత్వం చదివేది. ఆమె ఒక నవాబు కూతురు. పార్టీలోకి వచ్చింది. ఆమె తండ్రికి ఇంకోక స్త్రీతో సంబంధముండేది. తన తల్లి చనిపోయిందనే కసితో బతుల్‌ పార్టీలో చేరింది. అటువంటప్పుడు ఎన్నాళ్ళుంటుంది పార్టీలో ? కొంతవరకు కమిట్‌మెంట్, ఆసక్తి ఉండి రావటం వేరు -ఆమెకొక పదకొండు సంవత్సరాల కొడుకు కూడ ఉండేవాడు. ఆ దశలో పార్టీలోకి చాలా మంది స్రీలు, పురుషులు వచ్చారు. పార్టీ వాళ్ళకు సెద్ధాంతికంగా సరియైున శిక్షణ కూడ ఇవ్వలేదు. మానసికంగా బతుల్‌ షియా అవటం వల్ల బాధను ఓర్చుకోగల్గాలి అనే భావంతోనూ, తన మానపసిక సమస్యలతోనూ పార్టీలోకి వచ్చింది. వాటిని దాటలేకపోయిదామె. తర్వాత ఆమె భర్తను వొదిలేసింది. పార్టీ మళ్ళీ కలపడానికి ప్రయత్నించింది. కాని చేయలేకపోయింది. పార్టీ ఆమెను సపోర్టు చేసింది. జహీర్‌ ఇంకో ఉదాహరణ. చాలా క్లిష్ట పరిస్థితులలో ఆమె కుటుంబాన్ని వదలి, పార్టీలో కొచ్చింది. మోయిస్‌ను పెళ్ళిచేసుకుంది. ఇద్దరూ పార్టీలో చాలా ఆక్టివ్‌గా ఉండేవాళ్ళు, ఆమె చివరిదాకా. మూడేళ్ళ క్రితం ఆమె కాన్సర్‌తో చనిపోయింది. అతను మెదక్‌ పార్టీ యూనిట్‌కి సెక్రటరీ.

ఇప్పుడు పార్టీలో సరియైున ప్రోగ్రాం గాని, పనిగాని లేదు. పైగా ఆత్మవిమర్శన చేస్తూవుంటాము. నేను అమ్మాయిలనీ, అబ్బాయిలనీ పిలచి మీటింగులు పెట్టాను.

247 మహేంద్ర కూడ వచ్చాడు. ఎలక్షన్ల తర్వాత ఎవరూపట్టించు కోలేదు. యువకుల్ని చైతన్యవంతుల్ని చేసి కార్యకర్తలుగా తయారుచేయడనికి ఎటువంటి గట్టి ప్రోగాం లేదు. చిన్నవాళ్ళను తేవాలి. మేమింకా ఎన్నాళ్ళు చేస్తాము ? 25,30 సంవత్సరాలు చేశాము. పార్లమెంటరీ బై ఎన్నికలప్పుడు రాజ్‌ (రాజ్‌ బహుదుర్‌ గౌడ్‌) కి చెప్పాను- ఎక్కువగా వోటు వచ్చింది ఆసిఫ్‌ నగర్‌ నుంచి-2200 దాకా, దాంట్లో 25-30 దాకా మా కుటుంబందే. రాజ్‌ అభ్యర్థి కాబ్టి మేమే తప్పనిసరిగా పనిచేయాలనుకున్నాం.

చివరి వరకు కమ్యూనిసుగా కొనసాగిన ఆమె ఆనాటి త్యాగాలను, ఈ వివరాలను తెలిపేనాటికి కమ్యూనిస్టు పార్టీపరిస్థితి, పార్టీనాయకులు వారి కుటుంబాల తీరుతెన్నులను తన కుటుంబ సభ్యు త్యాగాలతో పోల్చుతూ తన బాధను ఈ క్రింది విధంగా వ్యకంచేశారు.

ఇక, ఇప్పుడు పార్టీ లీడర్ల పిల్లల్ని చూస్తే...వాళ్ళు పార్టీకై ఏమి చేయరు. కొంత మంది మాస్కో వెళ్ళి వచ్చారు. అయితే పార్టీకేంచేశారు? నా అన్నదమ్ములా- జఫర్‌ ఆక్సిడెంటులో చనిపోయాడు. ఆన్వర్‌ చాలా కష్టాలు పడ్డాడు. జాల్నాజైలులో వున్నాడు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని తర్వాత చనిపోయాడు. ఆయన కూతురు ఎం.ఎస్‌. సి చేస్తున్నది. భార్య తర్వాత చదువుకుని ఉద్యోగం చేసింది...ఆ రోజుల్లో 500 మంది స్త్రీలను పోగుచేయగలిగేదాన్ని. ఇప్పుడు 50 మందిరారు అంటూ అమె నిరాశను వ్యక్తం చేశారు. ఈ విధంగా జాతీయోద్యమం, నిజాం వ్యతిరేకపోరాటం, తెలంగాణా రైతాంగ పోరాలలో చురుకుగా పాల్గొన్న జమాలున్నీసా చివరి వరకు ప్రజలకోసం పనిచేస్తూ గడపారు.

(ఈ వ్యాసం ప్రదానంగా 1986లో స్త్రీ శక్తి సంఘటన (హెదారాబాద్‌) ప్రచు రించిన ' మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగపోరాటంలో స్త్రీలు-ఒక సజీవ చరిత్ర) ' గ్రంథంలోని జమాలున్నీసా బాజి, ఆమె సోదరి రజియా బేగం తమ ఇంటర్యూలో వెలిబుచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించటం జరిగింది. ఆ గ్రంథం సంపాదకులు, ప్రచురణకర్తలకు నా ధన్యవాదాలు. - రచయిత.)

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

ఐక్యంగా ఉండమని మనకు పలు అనుభావాలు నేర్పుతున్నాయి,ఈ దేశంలోని హిందూ -ముస్లిం- శిక్కు- ఈశాయి ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించనట్లయితే మన లక్ష్యం ఏనాటికి సిద్దించజాలదు. - ఆబాది బానో బేగం ♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

248