భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/నఫీస్‌ ఆయేషా బేగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనం కోరిన

నఫీస్‌ ఆయేషా బేగం

భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజానీకం పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పాలక పక్షాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన వారికి పలురకాల శిక్షలు ప్రతిఫలంగా లభించాయి. వారి వివరాలు అందుబాటులో ఉంటున్నాయి. పరోక్షంగా జాతీయోద్యమానికి సహాయ సహకారాలు అందించి పోలీసుల చిట్టాలకు ఎక్కకుండ ఉండిపోయిన తెలుగు ఆడపడుచులు ఎందరో ఉన్నారు. ఆ తల్లుల త్యాగాలు ఎంత శ్లాఘనీయమైనవైనా అవి అక్షరరూపం ధరించకపోవటంతో ప్రజలకు అందుబాటులో లేకుండ పోయాయి.

ప్రత్యక్ష పోరులో శిక్షలకు గురైనవారి వివరాలు పోలీసుల రికార్డులలో నిక్షిప్తమై ఉన్నందున కొంతలో కొంత సమాచారం లభ్యం అవుతుంది. ఈ మేరకు పోలీసు రికార్డుల ఆధారంగా తయారైన గ్రంథాలలో స్థానం పొందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మహిళా యోధురాలు శ్రీమతి నఫీన్‌ ఆయేషా బేగం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌కు చెందిన జనాబ్‌ హమీద్‌ ఆలీఖాన్‌ కుమార్తె ఆయేషా బేగం. తండ్రి జాతీయ భావాలతో ప్రభావితురాలైన ఆయేషా బేగం హైదారాబాద్‌ కేంద్రంగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. స్వతంత్ర భారత దేశం

235 అవతరించాక ఇండియన్‌ యూనియన్‌లో చేరడనికి నిరాకరించిన నైజాం సంస్థానాధీశుల పట్ల నఫీస్‌ ఆయేషా బేగం నిరసన వ్యక్తంచేశారు. నైజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని, నైజాం సంస్థానంలోని వాసులంతా భారతదేశ పౌరులుగా పరిగణంచ బడలని ఆమె ఆకాంక్షించారు.

ఈ ఆకాంక్షకు భిన్నంగా నిజాం సంస్థానాధీశులు, ఆయన మద్దతుదారులు వ్యవహరించటంతో ప్రజలు నిరసన వ్యకంచేశారు. ఈ నిరసనలు ప్రదర్సనలుగా మారాయి. ఈ వ్యతిరేక ప్రదర్శనల పట్ల ఆగ్రహించిన నిజాం ప్రభుత్వం ప్రదర్శనకారులను నిర్బంధించింది. అరెస్టుల పర్వం సాగించింది.

ఈ అరెస్టులలో భాగంగా ఆయేషా బేగం కూడ జైలు పాలయ్యారు. ఆమెను 1948, 16న అరెస్టు చేశారు. హైదారాబాద్‌ సెంట్రల్‌ జైలులో నిర్బంధించారు. ఆ అరెస్టులు ఆమెను అధైర్యపర్చలేదు. జైలు నుండి విడుదల తరువాత కూడ ఆమె లక్ష్యం సాధన పట్ల నిబద్ధాతతో సాగారు. చివరకు ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానం విలీనమైంది.

ఆ యోధురాలి పూర్తి వివరాలు తెలియలేదు. ఆంధ్రాప్రదేశ్‌ ప్రభుత్వం ఆద్వర్యంలో డాక్టర్‌ సరోజిని రెగాని సంపాదకత్వంలో రూపొందించిన Who's who of Freedom Struggle in Andhra Pradesh? సంపుటాలలో స్థానం పొందగలిగిన ఏకైక ముస్లిం మహిళ ఆయేషా బేగం కావటం విశేషం. ఆ గ్రంథంలో ఆమె అరెస్టుకు సంబంధించిన వివరాలను, కొద్దిపాి వ్యక్తిగత విశేషాలను పేర్కొనటంతో ఆ మాత్రమైనా ఆమె గురించి తెలుసుకునే అవకాశం కల్గింది.

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

పాలకులు ప్రజలకు వ్యతిరేకంగా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతూ నియంతల్లా వ్యవహరిస్తుంటే,జనసముదాయాలన్నీ ఏకమై నియంతృత్వశక్తుల మీదా విరుచుకు పడాలి...వినాశన మార్గం నుండి మంచి మార్గం వైపుకు పాలకవర్గాలు మళ్ళేంత వరకు ఉద్యమాలు ఉధృతంగా సాగాలి. అంతిమంగా ప్రజలు విజయం సాధిస్తారు. ..మన మాతృభూమి భవిష్యత్తు దృష్ట్యా, మన గౌరవాన్ని కాపాడేందుకు ఈ గడ్డమీది ప్రతి హిందూ-ముస్లిం ఈనాడు భుజం భుజం కలిపి పోరాడల్సిన బాధ్యత ఉంది.

-బేగం జాఫర్‌ అలీ ఖాన్‌

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

236