భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/అంజాదీ బేగం

వికీసోర్స్ నుండి

మహత్ముడిచే సాహస మహిళగా కీర్తించబడిన

ఆంజాదీ బేగం

భారత స్వాతంత్య్రోద్యామ చరిత్రలో ప్రజలు కుటుంబాలకు కుటుంబాలుగా ఉద్యమించిన సంఘటనలు దర్శనమి స్తాయి. ఆ కుటుంబాలలోని పురుషులు సహజంగా బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యామిస్తుండగా, మహిళలు వారికి సహకరించటం సర్వసాధారణం. అలా కాకుండ ఓ కుటుంబంలోని స్త్రీ, పురుషులంతా ఉమ్మడిగా పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరుబాట ఎంచుకుని ఉద్యామించటం అరుదు. ఈ విధంగా ఉద్యమించి బ్రిటిష్‌ పోలీసు రికార్డులలో ' ప్రమాదాకర కుటుంబం ' అని నమోదు పొందిన అలీ సోదరుల కుటుంబ సభ్యులలో ఒకరు శ్రీమతి అంజాది బేగం.

అంజాదీ బేగం రాంపూరు సంస్థానానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన ఆడపడుచు. పుట్టినింట మంచి పుస్తక భాండగారం ఉండటంతో ధార్మిక గ్రంథాలనువిస్త్రుతంగా అధ్యాయనం చేసిన ఆమె అంతితో సరిపెట్టుకోక అందుబాటులో ఉన్నసామాజిక, ఆర్థిక, రాజకీయ గ్రంథాలను పఠిస్తూ ధార్మిక పరిజ్ఞానం తోపాటుగా లౌకిక పరిజ్ఞానాన్ని సంతరించుకున్నారు.జాతీయోద్యామంలో బీబి అమ్మగా ప్రసిద్ధిచెందిన శ్రీమతి ఆబాదీ బానో బేగం కుమారుడు మౌలానా ముహమ్మద్‌ అలీని ఆమె వివాహం చేసుకున్నారు. ఆయన విద్యార్థి

139

దశ నుండి బ్రిటిషు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటూ విముకక్తిపోరాట నాయకునిగా గుర్తించబడ్డారు . ఆ కుటుంబంలోకి ప్రవేశించిన అంజాది బేగం అతి త్వరలో ఆ కుటుంబం అనుసరిస్తున్న ధార్మిక, రాజకీయ మార్గంలో పయనించటం ఆరంభించారు. ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యామం ద్వారా ఆమె మహాత్మా గాంధీ మార్గాన బ్రిటిష్‌ వ్యతిరేకతపోరాటంలో ప్రవేశించారు.

అలీఘర్‌లో చదువు పూర్తయ్యాక లండన్‌ చదువులు పూర్తిచేసుకుని ఇండియా తిరిగి వచ్చిన ముహమ్మద్‌ అలీ రాంపూరు, బరోడా సంస్థానంలో ఉన్నత ఉద్యోగాలుచేసి, స్వాచ్ఛకు ప్రతిబంధకంగా నిలచిన ఆ ఉద్యోగాలను విడిచి చివరకు జర్నలిస్టుగాకామ్రేడ్‌ అను ఉర్దూ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక ద్వారా ప్రజలలో జాతీయభావాలను ప్రోదిచేస్తూ, హిందు-ముస్లింల ఐక్యతను ప్రబోధిస్తూ, బ్రిటిష్‌ వ్యతిరేకతను ప్రజలలో పురికొల్పసాగారు. ఆ సందర్బంగా అంజాది బేగం భర్త అభిప్రాయాలకు మద్దతు తెలుపుతూ పూర్తి సహకారం అందిస్తూ ఆయనను ప్రోత్సహించారు.

ఖిలాఫత్‌ -సహయనిరాకరణ ఉద్యమంలో పాల్గొనటం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ ఉద్యామ వ్యాప్తికి అత్తగారు బీబీఅమ్మ, భర్త మౌలానా ముహమ్మద్‌ అలీతో కలసి పలు పర్యటనలు చేశారు. ఆ సందార్బంగాప్రజల మనస్సులను ప్రబావితం చేయగల సంకిప్త ప్రసంగాలతో కార్యకరలను కార్యోన్ముఖులను చేశారు. ప్రముఖులను కలసి, ప్రజలను సమీకరించి ఉద్యామ స్వరూపం, ఉద్యామలక్ష్యం, ఉద్యామ విధివిధానాలను వివరిస్తూ ప్రసంగించటంలో ఆమె మంచి ప్రతిభచూపారు. సంక్షిప్త ప్రసంగాలు చేస్తూ మంచి వక్తగా ఆమె ఖ్యాతిగాంచారు. ఈ విధంగా అంజాది బేగం ప్రసంగాలు ప్రజలను ఉతేజితులను గావించడవుే కాక గాంధీజీ ప్రశంసలు కూడ అందుకున్నాయి. 1921 నవంబరు 29 నాటి యంఘ్‌ ఇండియా పత్రికలో సాహస మహిళ అను శీర్షికన ప్రచురించిన వ్యాసంలో గాంధీజీ ఆమె ప్రసంగాలను ప్రస్తావిస్తూ ఆమెమొదట ముస్లిం మహిళలను ఉదేశించి ప్రసంగించటం ప్రారంభించారు. ఆమె ప్రసంగం ఆమె భర్త మౌలానా ముహమ్మద్‌ అలీ ప్రసంగానికి ఏమాత్రం తీసిపోదని పూర్తి విశ్వాసంతో చెబుతున్నాను. ఆమెది చిన్నపాటి ప్రసంగం అయినా నేరుగా ప్రజల హృదయాలను తాకి అధిక ప్రభావాన్ని చూపుతుంది. అత్యంత తక్కువ మాటలతో అత్యధిక భావాన్ని

140

అందించగల ఈ కళను తన భర్తకు ఆమె నేర్పగలదా లేదా అను విషయం గురించి నేనేమీ చెప్పలేను అని రాశారు.

ఈ ఉద్యమంలో భాగంగా మహాత్ముడు నిర్దేశించిన సత్యాగ్రహ ఆందోళనను విజయవంతం చేయడనికి ఆమె శక్తివంచన లేకుండ పనిచేశారు. ఖిలాఫత్‌ కమిటీ-కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయం మేరకు విదేశీవస్తువుల బహిష్క రణ, మధ్యాపాన నిషేధాం,బ్రిటీష్‌ సైన్యంలో ఉద్యోగాలను, ప్రభుత్వపదవులను, ప్రభుత్వ కళాశాల లను త్యజించటం తదితర కార్యకలాపాల అమలు దిశగా ప్రజలను ప్రేరేపించేందాుకు ఆమె నడుంకట్టారు.ప్రజలను ప్రధానంగా మహిళలను సత్యాగ్రహాందోళన దిశగా ఆకర్షించేందు కు అత్తగారు ఆబాది బానో బేగంతో, భర్త మౌలానా ముహమ్మద్‌ అలీతో కలిసి పలుచోట్ల పర్యటించారు.


ఖిలాఫత్‌:- సహాయ నిరాకరణ ఉద్యమానికి అవసరమగు నిదులను సమకూర్చి పెట్టడంలో అంజాది బేగం మంచి నేర్పరి. ఆర్థిక ఆవశ్యకత వివరిస్తూ ప్రజల నుండి నిధాులు సేకరించి ఉద్యామానికి ఆర్థిక జవసత్వా అందించటంలో ఆమె తనశక్తిసామర్థ్యాలను చూపారు. ఖిలాఫత్‌ ఫండ్‌ నిమిత్తం ఆబాది బానొతోకలసి లక్షలా ది రూపాయాల నిధులను సమకూర్చారు. గాంధీజీని ప్రజలకు పరిచయం చేయటం, ఆయన సాగించిన పర్యటనల వ్యయభారాన్ని భరించటంలో ఖిలాఫత్‌ కార్యకర్తలు, మౌలానా ముహమ్మద్‌ అలీ కుటుంబానికి చెందిన మహిళలు సమకూర్చిన నిధాుల పాత్రను విస్మరించలము. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Ë Yogdaan (Hindi), Dr. Abida Samiuddin, IOS, New Delhi ,1997 Page. 143-144.)


ఖిలాఫత్‌:- నిధుల సేకరణ విషయంలోమౌలానా ఇంటిమహిళలు తీసుకున్న ప్రత్యేక శ్రదను ఆంగేయాధికారి మాల్కం హేలి ఆనాటి లెజిసేవ్‌ అసెంబ్లీలో ప్రస్తావించి మౌలానా ముహమ్మద్‌ అలీ ప్రభుత్వ వ్యతిరేకత గురించి వివరిస్తూ, ఈయన ఇంటిమహిళలు కూడ చందాలు సేకరిస్తారు. విద్రోహానికి పాల్పడతారు అని ప్రకిటీంచాడు. చేసిన ఈ ప్రకటన ద్వారా ఆనాడు అంజాది బేగం,ఆబాది బానో బేగంలు నిధులు సమకూర్చటంలో చూపిన సమరత, ఆ నిధుల ప్రాధాన్యత వెల్లడవుతుంది. ఈ అంశాన్ని మరింతగా నిర్ధారిస్తూ ఆ దిశగా అంజాది బేగం సాగించినకృషిని మహాత్మా గాంధీ యంగ్‌ ఇండియా లో ప్రత్యేకంగా ఉటంకించారు.అంజాది బేగం సదా మౌలానా వెంట ఉంటూ, ఖిలాపత్‌-సహాయ నిరాకరణ

141

ఉద్యమంలో, భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలన్నిటిలో పాల్గొన్నారు. 1921లో అహమ్మదాబాద్‌ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ఆమె ఉత్తర ప్రదశ్‌ ప్రతినిధిగా హజరయ్యారు. ఖిలాఫత్- సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మహాత్ముడు, మౌలానా సోదరులు కలసి సాగించిన దేశవ్యాప్త పర్యటనల సందర్భంగా ఆ బృందంలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల ప్రచారం విషయంలో శ్రద్ధ చూపటమే కాకుండా, ఆర్థిక వ్యవహారాలను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఈ విషయాన్నిమౌలానా ప్రస్తావిస్తూ, ఆమె ఆ విషయాలలో నాకంటే సమర్ధురాలు...అనాటి మహిళలతో బేరిజు వేసినట్టయితే ఆమె ఖచ్చితంగా క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహించటంలో దిట్టగా పరిగణించవచ్చు అన్నారు.

జైలు నుండి తిరుగు ప్రయాణానికి టిక్కెటు తీసుకుని వచ్చాను అంటూ జైలు శిక్షలు తమ జీవితంలో భాగమని భావించిన మౌలానా ముహ్మద్‌ అలీ ఎక్కువ కాలం జైళ్ళల్లో గడపటం వలన పలు సందర్భాలలో ఆయన బాధ్యతలను అంజాదీ బేగం స్వీకరించారు. అటు కుటుంబపరమైన విషయాలు గాని, ఇటు ఉద్యమపరమైన కార్యక్రమాలను గాని ఆమె ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. ఖిలాపత్‌ ఉద్యమం సందార్భంగా అత్యధిక సమయం మౌలానా ఇంటిబయట ఉంటున్నందున కుమార్తెల వివాహ కార్యక్రమాలు కూడ ఆమె స్వయంగా చూసుకున్నారు. వివాహం సమయానికి కేవలం అతిథిగా మాత్రమే హజరయ్యి మౌలానా తిరిగి వెళ్ళివలసిన పర్థితులలో కూడ కార్యదక్షతతో ఆమె అన్ని వ్యవహారాలను నిర్వహించారు. ఈ విషయాన్ని మౌలానా ప్రస్తావిసూ, I was too busy to attend anything. So my wife looked after everything as best as she could and I just came in as a wedding guest, అనిపేర్కొన్నారు. (Understanding The Muslim Mind, Rajmohan Gandhi, Penguin Books, New Delhi, 1987, Page. 99).

1921 సెప్టెంబరులో మౌలానా ముహమ్మద్‌ అలీ గాంధీజీ పరివారంతో కలసి కలకత్తా నుండి మద్రాసు వెడుతున్నారు. ఆ పరివారంలో అంజాది బేగం కూడ ఉన్నారు. విశాఖపట్నం రైల్వేష్టేషన్ వద్ద మøలానా ముహమ్మద్‌ అలీ ఆరెస్టయ్యారు. అ సందర్బంగా ఆమె చూపిన ధైర్య సాహసాలు జాతీయోద్యమ నేతల, ప్రజల ప్రశంసకు పాత్రమయ్యాయి.

142 విశాఖపట్నం రైల్వే పోలీసు స్టేషన్‌లో నిర్బంధంలో ఉన్న భర్తను కలసి ' తన గురించి, కుటుంబం గురించి చింతించాల్సిన అవసరం లేదని ఆయనకు ఆమె ధైర్యం చెప్పారు. మౌలానా అరెస్టు సందర్బంగా గాంధీజీ ఆమెతో మాట్లాడు తూ మౌలానా అరెస్టు సమయంలో భయం కలుగలేదా? అని ప్రశ్నించగా ఆయన తన దేశంకోసం జాతి కోసం జైలుకెళ్ళారు, అని ఆమె ప్రతిస్పందించారని యంగ్ ఇండియాలో గాంధీజీ రాశారు. ఈ సంఘటనలు అంజాది బేగంలోని మొక్కవోని దీక్ష, అసమాన ధైర్య సాహసాలకు రుజువులుగా నిలుస్తాయనటంలో సందేహం లేదు.

1928లో పండిట్ మోతిలాల్‌ నెహ్రూ˙ అధ్యక్షతన రూపొందిన నెహ్రూ కమిటీ రిపోర్టును మౌలానా ముహమ్మద్‌ అలీ అంగీకరించలేదు. ఈ నివేదిక ఢిల్లీ ప్రతిపాదానలకు వ్యతిరేకమంటూ ఆయన విమర్శించారు. ఆ క్రమంలో 1928లో మౌలానా భారత జాతీయ కాంగ్రెస్‌కు మానసికంగా దూరమయ్యారు. ఆయనకు మహాత్మాగాంధీతో కూడ సంబంధాలు సన్నగిల్లాయి. 1930నాటి బొంబాయి సభలో మౌలానా మాట్లాడుతూ మహాత్మా గాంధీ హిందూ మహాసభ మతచాందసుల ప్రబావానికి లోనయ్యారని అభియాగం చేశారు. ఆ సమయంలో వాయువ్య సరిహద్ధు ప్రాంతంలోని కోహ్‌ట్ లో జరిగిన మతకలహాల విషయం మీద గాంధీజీకి మౌలానాకు అభిప్రాయబేధాలు వచ్చాయి. ఆ మతకలహాలకు కారణం ఎవరన్న విషయం మీద ఆ నేతలిరువురికి ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ తరువాత క్రమక్రమంగా అలీ సోదరులకు, గాంధీజీకి మధ్య ఎడం బాగా పెరిగింది.

1930లో ప్రదమ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఎంపిక చేసిన ప్రతినిధిగా మౌలానా లండన్‌ వెళ్ళారు. ఆయన వెంట అంజాది బేగం కూడ వెళ్ళారు. ఆ సమయానికి మౌలానా ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అంజాది బేగంను తన వెంట తీసుకళ్ళేందుకు నిధులు లేని దుస్థితి ఆ కుంటుంబాన్ని ఆవరించింది. ఖిలాపత్- సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా లక్షలాది రూపాయల నిధులను ఉద్యమం కోసం సేకరించి పెట్టిన కుటుంబానికి ప్రయాణ ఖర్చులకు డబ్బులేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఎదురయ్యింది. జాతీయ కాంగ్రెస్‌కు దూరం కావటం, నెహ్రూ˙ నివేదికను వ్యతిరేకించటం, మహాత్మా గాంధీతో విభేదించటం వలన ఆయన క్రమంగా జాతీయ కాంగ్రెస్‌ నాయకుల నిరాదరణకు గురయ్యారు. ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులతో

143 సతమతమవుతున్న అంజాది బేగం లండన్‌ ప్రయాణం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.మౌలానా లండన్‌ చేరు కున్నాక రౌండ్‌ టేబుల్‌ సమావేశాల కోసం అవిశ్రాంతంగాశ్రమించిన కారణంగా అంతంత మాత్రం గా ఉన్న ఆయన ఆరోగ్యం మరింత కీణంచింది. చికిత్సకు నిధులు కరువు కాగా,ఆల్వార్‌ మహారాజా పంపిన వైధ్యులు ఆయనకు వైద్యంప్రారంభించారు. ఆయన శరీరం అనుకూలంగా స్పందించలేదు. అత్యధిక సమయంవిశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు నిర్దేశించినా మౌలానా మాత్రం అధ్యయనం,ప్రముఖులతో చర్చలు జరపటం, లేఖలు రాయటం మానకుండా ప్రతిక్షణం స్వరాజ్యంగురించి, హిందూ-ముస్లింల ఐక్యత గురించి, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల గురించిఆలోచనలు సాగించారు. ఆ సమరయోధుని సేవలో అంజాది బేగం ఆవిశ్రాంతంగాగడపారు. ఆ స్థితిలో ఆర్థిక పరిసితులు అనుకూలించక ఆమె ఎంతో క్షోభకు గురయ్యారు. ఆ దుస్థితి, అనుభవిసున్న కటిక పేదరికం గురించి అంజాది బేగం తన కుమార్తె జోహరాకు లేఖలు రాస్తూ ఎంతో వ్యక్తంచేశారు.

ప్రతికూల వాతావరణంలో అంజాది బేగం ఎంతగా శ్రమించినా ఫలితం దక్క లేదు.చివరకు మరణశయ్య నుండి, "...To live for a great cause, and live upto it is perhaps harder than to die for it" అని తన మనోగతాన్ని వ్యక్తంచేస్తూ,1931 జనవరి 4న మౌలానా ముహమ్మద్‌ అలీ అంతిమశ్వాస విడిచారు.

మౌలానా అంత్యక్రియలు పూరయ్యాక అంజాది బేగం స్వదేశానికి తిరిగి వచ్చారు.రాజకీయంగా ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులతో వచ్చిన అభిప్రాయభేదాల కారణంగా ఆమె కూడ చిన్నచూపుకు గురయ్యారు. ఆ తరువాత కాలంలో ఆమె క్రమంగా అఖిల భారత ముస్లిం లీగ్ కు సన్నిహితులయ్యారు. ఆ వేదిక నుండి కూడ ఆమె పరాయిపాలకుల వ్యతిరేక పోరాటంలో భాగస్వాములయ్యారు.

ఈ విధంగా జీవిత చరమాంకం వరకు బ్రిటిషు వ్యతిరేక పోరులో పాల్గొన్న సాహస మహిళగా అంజాదీ బేగం నిర్వహించిన మహత్తర పాత్ర నిర్లక్ష్యానికి గురై చరిత్ర పుటలలో వెనక్కి నెట్టి వేయబడిన శ్రీమతి అంజాదీ బేగం చివరకు అతిసాదాసీదా జీవితం గడుపుతూ కన్నుమూశారు.

144