భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు/ముందుమాట

వికీసోర్స్ నుండి

ముందుమాట

కె. రామచంద్రామూర్తి

సంపాదకులు

ఆంధ్రజ్యోతి, దినపత్రిక

మతసామరస్యం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు తాత్విక ప్రాతిపదిక. భారతీయతను హిందూత్వంగా అపార్ధం చేసుకొని సంకుచిత దాృష్టితో నితర్వచనం చెప్పేవారున్నారు. ఈ నిర్వచనాన్ని ప్రశ్నించకుండ శిరసావహించి అల్పసంఖ్యాక వర్గాలు, అధిక సంఖ్యాకుల అభీష్టానికి అనుకూలంగా మసలుకోవాలని కోరేవారు హిందువులలో కొందరు ఉన్నారు. తాము నిజంగానే భారత జీవన ప్రధాన స్రవంతిలో భాగం కామనీ, కాబోమనే ఆత్మన్యూనతాభావనతో దూరం దూరంగా జరిగే అల్ప సంఖ్యాక వర్గాల వారూ ఉమన్నారు. ఈ ధోరణులన్నీ భారతీయతకు వ్యతిరేకమైనవి. భారత సమాజంలో హిందాువుల, ముస్లింలూ, క్రైస్తవులూ, సిక్కులూ, పార్శీలూ, తదితర సకల మతాలవారు సమాన హక్కులతో, సమాన స్వేచ్ఛతో జీవించాలి. అదే మన తాత్విక పునాది. అదే మన రాజ్యాంగ నిర్మాతల సంకల్పం. ముసింలు ఇక్కడివారు కారనీ, ఎక్కడి నుంచో వచ్చినారనీ, ఎక్కడికో వెళ్ళవలసినవారనీ, ఒకవేళ ఇక్కడ ఉండదలచుకుంటే మాత్రం హిందువుల ఇష్టాయిష్టాలను గౌరవించాలని భావించే హిందువులు కానీ, తమకు ఈ సమాజంలో స్థానంలేదని, తమను ప్రధాన స్రవంతిలో కలవనివ్వరనీ, ద్వీతీయ శ్రేణిపౌరులుగానే శాశ్వ్తతంగా మిగిలిపోవాలనీ తలపోసే మైనారిటీ వర్గాలవారు కానీ, చరిత్రను సవ్యంగా అర్దం చేసుకోవడంలో విఫలమైనవారని గుర్తించాలి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా తరతరాలుగా ఈ నేలను నమ్ముకొని ఇకక్కడ ట్టి ఇక్కడమట్టిలో క లి సి పోయేవారంతా భారతీయులేనన్న ప్రాథమిక అవగాహన సహజీవన సిద్ధాంతానికి స్పూర్తి. విభిన్న జాతుల, భాషల, సంస్కృతుల సమాహారమే భారత జాతి. ' భిన్నత్వంలోఏకత్వం ' మన ప్రత్యేకత. మనది బహుముఖీనమైన సమాజం. పూలతోటలో ఎన్ని రకాల, ఎన్ని రంగుల పూలు ఉంటాయో నవభారత బృందావనంలోనూ అన్ని రకాల, అన్ని రంగుల, అన్ని ధోరణుల మనుషులు ఉంటారు. మొగలు సామ్రాజ్య నిర్మాణం తర్వాత ముస్లింలు భారతదేశంలో స్థిరపడిపోయారు. ఇక్కడి జీవన స్రవంతిలో కలిసిపోయారు. గత ఏడు శతాబ్దాలుగా హిందువులతో కలిసి సుఖదుఖాలు పంచుకుంటున్నారు. ఉభయ మతాలవారిదీ ఇన్నేళ్ళాఒకే చరిత్రా, ఒకే భాషా, ఒకే సంస్కృతీ. హిందూ నాయకులలాగానే ముస్లిం నాయకులు కూడ ప్రజలలో ఆధునిక దాక్పథాన్ని ప్రోత్సహించడానికీ, జాతీయ భావాన్నీపాదుకొల్పడానికీ, లౌకిక తత్వాన్నిజీవన విధానంగా మలచడానికీ అహర్నిశం కృషిచేశారు.హిందువులు అధిక సంఖ్యాకులైనప్పటికీ వారికీ, ముస్లింలకూ, ఇతర అల్పసంఖ్యాక వర్గాలకూ మధ్య సౌభ్రాత్వం వెల్లివిరిసింది. శాంతియుత సహజీవనం ద్వారా సమిష్టి ప్రయోజనాలు సాధించుకోవడం ఎలాగో అన్ని మతాలవారూ నేర్చుకున్నారు. బ్రిీష్‌ పాలనను ఐక్యంగా ప్రతిఘటించారు. 1857 నాటి ప్రథమ వస్వాతంత్య్ర సమరంలో హిందాువులు, ముస్లింలు కలసి వీరోచితంగా పోరాడరు. విభజించి పాలించే సిద్ధాంతాన్ని అమలుపరచిన బ్రిీష్‌ పాలకులు బుద్థిపూర్వకంగా హిందువులూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి, వాటిని పెంచి పోషించి, దేశ విభజనకు దారితీశారు. ఈ దుర్మార్గమైన క్రీడలో బ్రిీష్‌ పాలకులకు తోడుగా బ్రిీ టిష్‌ చరిత్రకారులు,అధికారులు నిలిచారు. మొగలు సామ్రాజ్యం పతనమయ్యే వరకూ, ప్రథమ స్వాతంత్య్రసమరం విఫలమయ్యేవరకూ, బ్రిీష్‌ వారి విచ్ఛిన్న రాజకీయాలు సాగలేదు. బ్రిీష్‌వారి కుట్ర ఫలితంగా కొందరు ముస్లింలు తాము భిన్నమైనవారమనే ధోరణిలో ఆలోచించడం ప్రారంభించారు. భారత జీవన ప్రధాన స్రవంతి నుంచి క్రమంగా దూరం కాసాగారు. మత భావనలకు ప్రాధాన్యం పెరిగింది. హిందువులలో మూఢాచారాలు తొలగించడానికీ, ఆధునిక దృష్టిని ప్రోత్సహించడానికీ రామమోహనరాయ్‌, స్వామీ వివేకానంద,దయానంద సరస్వతి వంటి సంస్కర్తలు కృషి చేసినట్టే ముస్లింలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడనికీ సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌ వంటివారు ఉద్యామాలు నడిపారు. బద్ద్రుద్దీన్‌ త్యాబ్జీవటి సంస్కర్తలు ఈ ఉద్యామాన్ని జయప్రదం చేసేందుకు శ్రమించారు. మహమ్మదాలీ జిన్నా ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని కోరినప్పటికీ అనేకమంది ముస్లిం నాయకులు గాంధీనే తమ నాయకుడిగా పరిగణించి స్వాతంత్య్ర సమరంలో త్యాగాలు చేశారు. విభజనను వ్యతిరేకించారు. అయినప్పటికీ దేశ విభజన జరిగింది. విభజన తర్వాత తమ వాయవ్యసరిహద్దాు ప్రాంతం పాకిస్థాన్‌లో భాగంగా ఉండడం ఇష్టంలేని సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌, గాంధీతో మ్లాడుతూ ' మమ్మల్నితోడేళ్ళ పాలు చేశారు ' అంటూ బాధనువ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌ ఏర్పడిన తర్వాత కూడ కోట్లాది ముస్లింలు భారతదేశంలో ఉండిపోయారు. పాకిస్థాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువమంది ముస్లింలు ఉన్నారు.ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్న దేశం భారత్‌.దేశవ్యాప్తంగా వారు గ్రామాలలో, పట్టణాలలో సమాజంలో భాగమై పాలలో నీళ్ళలాగాకలిసిపోయి జీవిస్తున్నారు. స్వార్థ్ధపరులైన కొందరు రాజకీయవాదులూ, వ్యాపారులూ హిందువులలో, ముస్లింలలో మతావేశాన్ని రగిలించి తమ స్వార్థ, సంకుచిత ప్రయోజనాలు నెరవేర్చుకునే క్రమంలో మతకలహాలూ, మారణహోమాలు జరిగాయి, జరుగుతున్నాయి. కానీ సాధారణ హిందువులూ, సాధాణ ముస్లింలూ శాంతియత స హ జీవనం కోరుకుంటున్నారు. పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటిప్రాథామిక సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా కృషి చేయాలని ఆశిస్తున్నారు. అందరూ కలసి ప్రగతిపథంలో సాగిపోవాలని అభిలషిస్తున్నారు. మతోన్మాదాులు అన్ని మతాలలోనూ ఉన్నారు. వారు శక్తివంచనలేకుండ విషబీజాలు నాటుతూనే ఉన్నారు. నరమేధానికి కత్తులు నూరుతూనే ఉన్నారు. భారత్‌లో కాంగ్రెస్‌ పార్టీ, ఇతర లౌకిక పార్టీల వైఫల్యం కారణంగా హిందూత్వ శక్తులు విజృంభించాయి. శ్రీ లాల్‌ కృష్ణ అద్వానీ సోమనాథ్‌ నుంచీ అయోధ్యకు రథయాత్ర సాగించడం దేశవ్యాప్తంగా హిందువులలో మతాభిమానం, ముస్లింలలో అభద్రాతాభావం పెరగడనికి దారితీసింది. 1992లో బాబ్రీ మసీదు విద్వంసంతో మెజారిీటి మతస్థులు మైనార్టిల మనోభావాలను సృప్టించుకునే రోజులు పోయాయనే అభిప్రాయం ముస్లింలలోప్రబలింది. ఆ తర్వాత కూడ మతావేశాన్నిఎన్నికలలో ప్రచారాంశం చేయడంతో హిందూత్వవాదుల వేదిక అయిన భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం విశేషంగా పెరిగింది. కాంగ్రెస్‌ను ద్వేషించే కొందరు నాయకుల సారధ్యంలోని కొన్నిలౌకిక పార్టీలు సహకరించడంతో బి.జె.పి కేంద్రాంలో అధికారంలోకి వచ్చింది. రాజ్యాధికారం దక్కగానే హిందూత్వ శక్తులుమరింత శక్తిమంతమైనాయి. ఆ విధంగా దేశంలోని రెండు ప్రధానమైన మతాలకు చెందిన ప్రజలలో మతావేశం హద్దుమీరింది. అయితే అది మతావేశంతో అశాంతిగా ఉన్న కొన్నివర్గాలకే పరిమితం. మతాభిమానం మతోన్మాదాంగా మారితే ప్రమాదమనే అవగాహన భారత ముస్లింలలో ఉన్నది. ' హేతువే సేతువుగా మనగలిగే ఆధునిక సమాజంలో ప్రతి మతంలోని ప్రతి సిద్ధాంతం హేతు పరీక్షకు నిలబడి విశ్వజనీనమైన న్యాయానికి అనుగుణంగా ఉన్నప్పుడే విశ్వవ్యాప్తమైన ఆమోదం పొందగలుగుతుంది ' అని మహాత్మాగాంధీ చెప్పిన సూక్తి అన్నిమతాలకూ వర్తిస్తుంది. ప్రాణులకూ, స్త్రీలకూ, పిల్లలకూ రక్షణ కల్పించడం ఇస్లామ్‌పరమోద్దేశం. ఇందుకు భిన్నంగా ఇస్లాంకు ఏమి ఆపాదించినా అది కల్పితమేనన్న స్సృహభారత ముస్లింలలో ఉంది. అలీ సోదరులు, హసన్‌ అహ్మద్‌ మదాని, అష్పాఖుల్లాఖాన్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌, జాకీర్‌హు˙స్సేన్‌ వంటిఅనేకమంది సాfiతంత్య్ర సమరయోధుల నిరంతర కృషి ఫలితంగా భారత ముస్లింలలోవాస్తవిక దాష్టి, సహజీవనాభిలాష హృదాయంగతమైనాయి. హిందువులలో కూడ అత్యధికులు,లౌకికవాదాన్నీ, సహజీవన సిద్ధాంతాన్నీ విశ్వసిస్తున్నవారే. అందుకే మతవాదులు తాత్కాలికంగా ఆధిక్యం సంపాదించినా వారి ఆటలు ఎక్కువ కాలం సాగడంలేదు. ఈ శక్తుల ఆట కట్టింటించి దేశంలోని అన్ని మతాల వారూ సమిష్టిగా అభ్యుదయ పథంలో సాగిపోవాలంటే ఒకరి గురించి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి. ఒకరిపట్ల ఒకరికి సహిష్ణుతా, ఆదారాభిమానాలూ ఉండాలి.స్వాతంత్య్ర పోరాటంలో హిందాువులూ, ముస్లింలూ, సిక్కులూ, పార్శీలూ, ఇతరులూ నిర్వహించిన పాత్రను అందారూ అధ్యయనం చేయాలి. అప్పుడే పరస్పర ఆవగాహన పెరుగుతుంది. సమైక్య గీతాలాపన అపస్వరం లేకుండ హృద్యంగా సాగుతుంది. ముఖ్యంగా ముస్లిం యోధుల దేశభక్తినీ, ధీరోదాత్తతనూ ముస్లింలు తెలుసుకుంటే ఆత్మన్యూనతాభావం, అభద్రాతాభావం పోయి ఆత్మవిశ్వాసం, భద్రాతాభావం పెరుగుతాయి. ఈ చరిత్రను హిందువులు అధ్యయనం చేస్తే బ్రిీటిష్‌ చరిత్రకారులు చేసిన మోసం ఏమో తెలిసిపోతుంది. మతోన్మాదుల ప్రబోధాలలోని వైమనస్యం వెల్లడవుతుంది. విశ్వాసరాహిత్యం తొలగిపోతుంది. లౌకికభావాలు బలపడినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం అవుతుంది. ఈ జాతి భవిష్యత్తు యావత్తూ ప్రజాస్వావ్యవస్థ మనుగడపైనే ఆధారపడి ఉంది. ఈ మేరకు అటువంటి నిర్మాణాత్మక కార్యక్రమానికి దోహదా చేసే రచన, మిత్రుడు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ' భారత సాfiతంత్య్రోద్యమం : ముస్లిం ప్రజాపోరాటాలు ' అను ఈ చారిత్రక గ్రంథాలో ముస్లిం జనసముదాయాలు ప్రధాన భాగస్వామ్యం వహించిన ఐదు పోరాటాల గురించి వివరించారు. 1760 ప్రాంతంలో ఆరంభమైన బెంగాల్‌ ఫకీర్ల తిరుగుబాటు నుంచిస్వాతంత్య్రం సిద్ధించేంత వరకూ దేశ విమోచనోద్యమంలో ముస్లింలు సాగించిన పలు ప్రజా పోరాటాలను కళ్ళకు కట్టినట్టు రచించిన రచయిత అభినందనీయుడు.బ్రిీటిషర్ల ఆధిపత్యాన్ని తొలిసారిగా వ్యతిరేకించిన ముస్లిం ఫకీర్ల గురించి, ఆ ఫకీర్లు హిందూసన్యాసులతో కలిసి ఐక్యంగా పరపాలకుల మీద తిరగబడిన తీరు గురించి, బ్రిీటిష్‌ పాలకులను ఎదిరించి పోరాడిన మహాబీ వీరుల గురించీ, పాలక వర్గాలకు వ్యతిరేకంగా దోపిడు శక్తుల మీదా కత్తిపట్టిన ఫరాజీ యోధాుల గురించీ, బ్రిీటిషర్ల దోపిడి, జమీందార్ల దాష్టీకాలను ఎదిరించి నిలవటమే కాక, జాతీయోద్యమంలో భాగస్వాములై త్యాగాలకు, ఆత్మార్పణలకు సిద్ధపడిన మలబారు మోప్లా వీరుల గురించి మనకు దొరకని అరుదైన సమాచారాన్ని నశీర్‌ గ్రంథరూపంలో అందించారు. ' సరిహద్దు గాంధీ' గా విఖ్యాతుడైన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ నాయకత్వంలోని ఖుదా-యే-ఖిద్మాత్‌గార్‌ అహింసోద్యామాన్నీ, ఆ త్యాగమూర్తుల అపూర్వబలిదానాలను స్పూర్తిదాయకంగా వివరించారు. ఈ పుస్తకమే కాదు, భారత స్వాతంత్య్ర స మరంలో ముస్లింజనస ముదాయాలు నిర్వహించిన పాత్ర ను వివరిస్తూ , ఆయోధానుయోధుల జీవిత చరిత్రలను రేఖామాత్రంగా పేర్కొంటూ, ఆయన పలు వ్యాసాలు రాసారు. ప్రామాణిక చరిత్ర గ్రంథాలు ప్రచురించారు. నవభారత నిర్మాణంలో ముస్లింల పాత్రను విభిన్నదాష్టికోణాల నుంచి ప్రజలకు తెలిపే రచనలు చేశారు, చేస్తున్నారు. స్వయంగా సమర్థుడైన పత్రికా రచయిత, న్యాయవాది కనుక సులభగ్రాహ్యమైన శైలిలో సత్యనిష్టతో రచన చేయగలగటం నశీర్‌ అహమ్మద్‌ ప్రత్యేకత. ఈ కారణంగా ఆయన రచనలకు విశ్వసనీయత పెరిగింది. మిత్రుడు నశీర్‌ మరిన్నిపరిశోధానాత్మక రచనల ద్వారా సామాన్య జనబాహుళ్యానికి అందుబాటులో లేని అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావాలని ఆకాంకిస్తున్నాను.