భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు/పరిచయ వాక్యం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పరిచయ వాక్యం

- కత్తి పద్మారావు

ప్రముఖకవి, రచయిత

పొన్నూరు, గుంటూరు జిల్లా.

ఇది చరిత్ర రచన కాదు...చరిత్ర నిర్మాణం

భారతదేశ చరిత్రలో ప్రధాన వాహికలు రెండు. ఒకరి మనువాద చరిత్ర, మరొకి జాతీయవాద చరిత్ర. మనువాదులు ఈ భూమిపై నివసించే ప్రజలను వర్ణ, మత దాక్పథాలతో చూసి రాస్తారు. జాతీయవాదులు ఈ భూమిపై పుట్టిన వారందార్ని సమతుల్యంగా భావించి రాస్తారు. మొదటిది అమానవవాద చరిత్ర అయితే, రెండవది మానవవాదా చరిత్ర. చరిత్ర రచన సత్యనిష్టతో కూడుకున్నది. సామాజిక సాంస్కృతిక ఆర్థిక, తాత్త్విక అంశాల పట్ల శాస్త్రీయ అవగాహన లేనిదే చరిత్ర రచన సాధ్యా కాదు. సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌గారు జాతీయవాద చరిత్రకారులు. ముస్లింలు ఈ నేల బిడ్డలని, జాతి వారసులని, ఈ సంస్కృతి పునాదులు వారి సాహస చర్యలతో నిర్మితమైనవని, ఈ నేల వారి శ్రమశక్తి ద్వారా ఈనిందని, ఈ దేశ కళలు వారి మహోన్నత ఔదార్యంతో వికసించాయని, ఈ రాజ్యవ్యవస్థ వారి కనుసన్నల్లో పరిప్లవించిందని, ఈ నేల పోరాటాలలోని రక్త స్రవంతులు వారి దేహం నుండి స్రవించినవని, సారగా ఈ మట్టి నుండిపుట్టిన వారు, ఈ మయట్టి కోసం త్యాగపూరితంగా జీవితాలను ధారపోసారని ఆయన సప్రమాణంగా, సాధికారికంగా ఓ యోధునిగా నిరూపిస్తూ వెళతారు. జీవితాన్ని, సామాజిక చరిత్రను సమన్యయించే క్రమంలో నశీర్‌ గారు నేటివిటీ ఆయువు పోస్తారు. భారతీయ ముస్లింలు వందకు వందపాళ్ళు ఈ దేశవాసులేనన్నది ఆయన సిద్ధాంతం. భారతదేశంలోని ప్రతి పోరాటం వారి రుధిర తర్పణలేక జరగలేదని ఆయన వాదం. భారతీయుడంటే ఎవరు ? దేశానికి, దేశ రక్షణకు, దేశ భవితవ్యానికి అసువులు అర్పించేందుకు ఎవరు వెనుకాడరో వారే అని చెప్పేటప్పుడు, 1770 ప్రాంతంలో బ్రిీటిష్‌ తుపాకి గుండ్లకు ఒకేసారి ప్రాణాలర్పించిన 150 మంది బెంగాల్‌ ముస్లిం ఫకీర్ల ఉదాంతాన్ని మన ముందుంచి, ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన దేశభక్తులో అని అడుగుతున్నారు. It os true.It is relevant . ఈ భారతదేశాన్ని ఆత్మీయం చేసుకున్న వారిలో ముస్లింలు మొదటి స్థానంలోకి వస్తారు. ఈ రెండవ ప్రశ్న నశీర్‌ ప్రతిభకు గీటురాయి. రచయిత గుండెల్లో దాగివున్న అగ్గి మంటకు ఇదొక ఉదాహరణ మాత్రమే. భారతదేశ చరిత్ర ఎంతో తవ్వాల్సింది, ఎంతో పూడ్చాల్సివుందన్న మాట నిజం. రచయిత ఈ పనిని సమర్థవంతంగా చేశారు కాబట్టే ఆయన ఆధునిక భారత చరిత్రకారుడిగా మన ముందుకు వచ్చారు. He is a thoughtful person from all angles. ఈయన రచనలో హృదాయానికి హృదయానికి మధ్య ఒక బీట్ ఉంది. హృదయ సంఘర్షణను ఆయన ఆవాహన చేస్తారు. చరిత్ర చెబుతూ చెబుతూనే తాత్వికుడిగా మారతారు. మెదడుకు హృదయానికి అనుసంథానం కూర్చుతారు. చరిత్రలోని మూల భూతాంశాలన్నీతానే అనుభూతం చేసుకుని పాత్రద్వారా పలవరిస్తారు. చరిత్రలోని కాలమానాలను దాటి జీవన వ్యవస్థల్ని దృశ్యీకరింప చేసి మనిషికి మనిషికి, మనిషికి వ్యవస్థకి మధ్య దాగిన సున్నితాంశాలను ఆయన రికార్డు చేస్తారు.

ఈ రచయిత కొందారికి సంఘటనల సముఛ్ఛయకర్తగా కన్పిస్తారు. మరి కొందార్ని వెన్ను మీద పిడికిలితో గుద్ది మరీ నడిపిస్తారు. ఈయన రచనలోని ఆత్మ Self Respect. ఈయన చూసే చూపులో కొత్తదారి ఉంది. ఒక న్యూనతాభావాన్ని జయించేందుకు ఈయన కలం పట్టారు. ' జన్మభూమి ' ఈయన కార్యక్షేత్రం. ' మాతృభూమి ' ఈయన నినాదాం. ముస్లింలు జాతీయవాదులే కాదు, భరతభూమిని తరతరాలుగా అమ్ముకుంటున్న శక్తులపై పోరాడుతున్న సామాజిక శక్తులని నిరూపిస్తున్నారు. ఆయన కలానికి ఉన్న మరో పదును authenticity. ఏది చెప్పినా, ప్రమాణబద్ధంగా, చరిత్ర నికషోపలంగా చెబుతారు.

ఆయన రచనా శైలి పరిపక్వమైనది. తెలుగు నుడికారం లోని సొబగు, పలుగుబడిలోని విన్నాణం ఆయన రచనలకు ప్రవాహశీలతను, ప్రజ్వలన శక్తిని తెచ్చింది. The most irridict Writer. జ్ఞానపూర్వకమైన ఆయన కథనంలో స్వాతంత్ర్యసమరయోధులు శిల్పాకృతి దాల్చి మన గుండెల మీద నడుస్తారు. గుర్రాలు, ఏనుగులు, కత్తులు, కటార్లు, తుపాకులు, ఫిరంగులకు ఎదురు నిలబడి జాతీయతను ప్రకటిస్తారు. ఆయుధం పట్టుకున్న వాడు ఫకీరా ? సన్యాసియా ? అన్నది కాదు. ఆయన చూపు మాత్రం దేశం కోసం పోరాడుతున్నాడా ? లేదా ? అనే. Brilliant insight నశీర్‌లో కన్పిస్తుంది. గెరిల్లా పోరాటం జరిగినప్పుడు ఆయనే కందకాలు తీస్తూ, ఆయుధాలు కూర్చుతూ, సమాచారం అందిస్తూ శత్రు నిర్భేద్యమైన కోటల మీదా దాడి చేస్తున్నాడా ? అన్పిస్తుంది. Its not just writing. It's deep involvement. నశీర్‌ గారిని నేను పూర్తిగా చదవలేక పోయాను. ఈ భారత స్వాతంత్య్రోద్యామం : ముస్లిం ప్రజాపోరాలు ఎల్లడలా నన్ను ఒక యోధుడిగా మార్చివేసింది. నేను చాలాసార్లు ఊపిర్లు పీల్చాను. పిడికిళ్ళు బిగించాను. దాస్య విముక్తి పోరాట వీరుల్లో మనల్ని తాదాత్మం చేయగలిగిన ఒక గొప్ప రచనా క్రమం, శిల్ప నైపుణ్యం ఇందులో మనకు కన్పిస్తుంది. ఈ పుస్తకంలోని ఫకీర్‌ యోధుల మహాసేనాని మజ్నూ షా ఫకీర్‌ అయినా, ఫిరంగీయుల మీదా తిరగబడ్డ వహాబి పులి మీర్‌ నిస్సార్‌ అలీ అయినా, ఫరాజి ఉద్యామ నేత దూదు మియా కాని, శతాబ్దానికి పైగా వలసపాలకుల మీద పోరాడిన మలబారు మోప్లాల ప్రతినిధి మౌల్వీ అలీ ముస్సలియార్‌ గాని, అహింసాయుధంతో బ్రిటీషర్లను తరిమికొట్టిన పఠాన్‌ యోధుడు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ కాని మనల్ని ఆవహిస్తారు. ఆ పోరాటాలలోని యోధులంతా, తరతరాలుగా మన మెదళ్ళకు పట్టిన తుప్పును వారి కత్తి పిడులతో వదలగొట్టి మనల్ని గుఱ్ఱపుస్వారి చేయిస్తారు. ఆత్మీయత కోసం, వ్యక్తిత్వం కోసం, జాతీయత కోసం, మాతృత్వం కోసం, మాతృభూమి కోసం మనల్ని యుద్ద సన్నద్ధులను చేస్తారు. ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యవాదుల మీదా పోరాడిన త్యాగాల నుండి పుట్టిన మనం ఈనాటి సాంప్రదాయ సామ్రాజ్యవాదాం మీద పోరాడేందుకు నైతికశక్తి నిస్తారు. We are not just soldiers, we are warriors and liberators also.

నశీర్‌ మన భుజాలపై రెండు చేతులు వేసి ఊపుతున్నట్టు అన్పిస్తుంది. మన రైతులను పీడించిన, మన కుల, చేతి వృత్తిదారులను హరించిన, మన భూములను ఆక్రమించిన, మన స్త్రీలను అవమానపర్చిన బ్రిీటిష్‌ సామ్రాజ్యవాదాుల మీద ఆనాడు మన ముస్లిం పోరాటయోధుల సాగించిన పోరాటాల ఉదంతాలను కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ, ఈనాటి సంప్రదాయ భావజాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజాసామ్య లౌకిక ధ్రుక్పథంతో మనం పోరాడల్సిన బాధ్యత లేదా? అంటూ మర్మంగా ప్రశ్నిస్తారు. నాటి చరిత్ర జ్ఞాపకాలతో నేటి సమాజాన్నినడుపుతూ ఆయన నడుస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే Alex Haily రాసిన ROOTS కు ఉన్న శక్తి ఈయన భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం ప్రజాపోరాలకు ఉంది. ఈ పుస్తకానికే కాదు, ఆయన భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల భాగస్వామ్యాన్ని దాశ్యీకరిస్తూ మనకందించిన ప్రతి పుస్తకంలో అ శక్తి నర్మగర్భమైంది.ఆయన ఆవేదన, ఆయన సంఘర్షణ ఆయా పుస్తకాలలోంచి, మనల్ని పలకరించే పాత్రల్లోంచి మనకు విన్పిస్తారు. ఆయన నిజజీవితంలోకి వస్తే, ఆయన పుట్టిన నాిటి నుండే సంఘర్షితుడు. ఆయన అధ్యయనం, ఆయన రచన, దాశ్యీకరణ, సమాజాన్నిఫోటో తీయడం దగ్గర నుండి ఎక్స్‌రేతీసి స్కానింగ్ చేసే దాకా ఎదిగింది. ఆయన ప్రతి అక్షరం వెనుక ఒక ఫీలింగ్ ఉంది.ఆవేదన ఉంది. ఈ సమాజాన్ని పునర్మించే క్రమంలోనే చెబుతారాయన. నేను ఆయనను చరిత్ర రచయితగా చూడలేకపోతున్నాను. ఈ సమాజానిfl పునర్మించే యోధుడు కావాలి.మహత్మా ఫూలే, సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌, డాక్టర్‌ అంబేద్కర్‌, పెరియార్‌, వీరందరూ చరిత్ర రచయితలే కాదు, చరిత్రను పునర్మించిన వారు కూడ. మతం వ్యక్తిని నిర్మిస్తుంది, చరిత్ర జాతిని నిర్మిస్తుంది. మతం పేరుతో జాతిని అణిచివేస్తున్నారు. ఆందుకాయన ఎన్ని రాత్రులు నిద్రాపోలేదో ! ఎన్ని వేదనలు ఆయనగుండెలను తొలిచాయో ! మన కళ్ళ ముందే ఎన్ని కట్టడాలు కూలిపోతున్నాయి ! ఎంత చరిత్ర భగ్నమౌతోంది ! Now it is irrelevant అంటారాయన. To built and to rebuilt అంటారు. ' నేను రచయితనే కాదు. యుద్ధ యోధుడ్ని కూడ. నా జాతి పట్ల,నాదేశం పట్ల, నా ప్రజల పట్ల నేను ప్రేమికుడ్ని, గాఢ ప్రేమికుడ్ని. ఆ ప్రజానీకం విముక్తికోసం నేను కలం యోధుడ్నిఅవుతున్నాను ' అని నినందిస్తున్నారు. ఆయన కలం రాల్చిన ఇంకు చుక్కలకు, భారతదేశాన్ని పరాయి పాలకుల కబంధ హస్తాల నుండి మాతృదేశాన్నివిముక్తం చేయడానికి పోరుబాట నడిచి, ఆగ్నియుగానికి బాటలు వేసిన మజ్ను షా ఫకీర్‌,మీర్‌ నిస్సార్‌ అలీ, దూదు మియా, మొఎల్వి అలీ ముస్సలియార్‌ తదితరులు రాల్చిన రక్తపుచుక్కలకు ఏమాత్రం తేడ లేదు. అందరిదీ స్వేఛ్ఛా-స్వాతంత్య్రాల కోసం సాగిన విముక్తిపోరాటమే. ' ఈ దేశానిfl తాకట్టు పెట్టే శక్తుల పైనా పూర్వీకుల్లా పోరాడుతాను. ఆకనివిక్షన్‌ నాకుంది ' అంటారాయన. నిజం చెప్పమంటారా ? ఈ పుస్తకం చదాువుతున్నంత సేపు నేనొక స్వాతంత్య్రసమర యోధాుడిలా స్వారీ చేశాను. నేనొక జ్ఞాన జ్యోతిగా వెలుగొందాను. నేనొక చరిత్రనిర్మాతగా ముందుకు కదులుతున్నాను. మీరూ నాతో నడుస్తారా ? రండి. మన మాతృభూమిని ర క్షికుందాం. మరో స్వాతత్ర్య పోరానికి కేకవేస్తూన్న సయద్ నశీర్‌ అహమద్‌తోపాటుగా...నేను....మీరు.....మనం.