భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు/బెంగాల్‌ ఫకీర్లు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బ్రిటీషర్ల మీద తొలి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన బెబ్బులులు

బెంగాల్‌ ఫకీర్లు

1763-1800

ఇండియా మీద గ్రీకులు, శాక్యులు, యవనులు, కుషాణులు, హూణులు, తదితరులు దాడయాత్రలు చేసారు. ఈ గడ్డను జయించిన విజేతలలో అత్యధికులు,స్థానికులతో కలిసిపోయినా పలువురు తిరిగి తమ సfiదేశాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినవారు ఈ భూమిని సfiస్థలంగా భావించలేదాు. ఈ నేలను గెలుచుకునfl భూమిగానే భావించిన కారణంగా ఇక్కడి సంపద, సౌభాగ్యాన్ని అందినంత దోచుకుని పోయారు.

ఆ తరువాత మధ్యా యుగాలుగా పరిగణించబడుతున్న కాలంలో ముస్లిం పాలకులు ఈ నేల మీదఅడుగుపెట్టారు. పలు విజయాలు సాధించాక ఇక్కడే స్థిరపడ్డారు. ఈ నేలను తమ స్వంతగడ్డగా భావించారు. సుమారు వెయ్యి సంవత్సరాలు పాలన చేసిన పాలకుల అనేక వంశాలు ఈ మట్టిలోపుట్టి, ఈ మట్టిలో పెరిగి, ఈ మట్టిలో కలిసిపోయాయి.బ్రిీషర్ల ఖైదీగా, రంగూన్‌ జైలులో గడిపిన చివరి మొగల్‌ చక్రవర్తి బహుద్దాూర్‌ షా జఫర్‌,ఈ భావనను తన కవితలో వ్యక్తంచేసాడు. '... జఫర్‌ నీవెంత దురదాష్టవంతుడివిరా ! భారత సాfiతంత్య్రోద్యామం-ముస్లిం ప్రజాపోరాలు 15 నువ్వెంతగానో ప్రేమించిన మాతృభూమిలో నీ సమాధి కోసం కనీసం రెండు గజాల నేలైనా మిగలలేదు నీకు ...'. పూర్వీకులూన, తానూ పుట్టి పెరిగిన ఈ మట్టిలో కలసిపోవాలనుకున్న బలమైన కోరిక తీరే అవకాశం లేకపోవటంతో బహుద్దాూర్‌ షా జఫర్‌ ఈ మేరకు తనహృదయావేదానను వ్యక్తీకరించాడు. వర్తకం పేరిట ఈ నేల మీద కాలుప్టిెన బ్రిీటిషర్లు, స్థానిక ప్రభువులను క్రమక్రమంగా పరాజయం పాల్జేస్తూ, ఈ భూభాగాన్ని హస్తగతం చేసుకున్నారు. సుమారు రెండు వందల ఏండ్లు పాలన సాగించినప్పటికీ, ఈ నేలను తమ దేశంగా బ్రిీషర్లు ఏనాడు భావించలేదు. ఈ గడ్డను వలస కాలనీగా మాత్రమే పరిగణించారు. ఈ దేశంతమది కాదు కనుక, ఇక్కడ నుండి అందినంత తరలించుకుపోవటం ప్రారంభించారు.భూసంపదతోపాటు భూమి పుత్రుల స్ధభాగ్యాన్ని కూడ పలు మార్గాలద్వారా దోచుకున్నారు. భూమి ఆధారంగా ప్రారంభమైన ఈ దోపిడు అన్ని రంగాలకు అన్ని వర్గాలకు ప్రజల వరకు సాగింది. బ్రిీటిషర్లు రాకముందు మొగల్‌ రెవిన్యూ పద్ధతుల ప్రకారం భూమికి రైతు ఆసామి.రక్షణ కల్పిస్తున్నందున పంటలో భాగాన్ని రైతులు పాలకులకు సమర్పించేవారు. రాజభాగం చెల్లిస్తున్నంత కాలం రైతును భూమి నుండి తొలగించే హక్కు రాజుకూ ఉండేది కాదు. ఈవిషయాన్ని Mr. Narahari Kaviraj `తన Wahabi and Farazi Rebels of Bengal „గ్రంథంలో ఈ విధగా పేర్కొన్నారు.' ...remuneration of sovereignty or returns for the care of royalty i.e, the protection the king was to give to the life and security of the raiyat. So the king was supposed to posses no rights of property in land beyond a definite share of its produce....—.

దోపిడుకి అనువుగా రెవిన్యూ విధానాలు బ్రిీటిషర్లు ఈ రెవిన్యూ వ్యవస్థను తమ దోపిడుకి అనుకూలంగా మార్చుకున్నారు. పాలకులకు, రైతుకు మధ్యన రాజభాగం వసూలుచేసే వ్యక్తులను, శక్తులను రంగప్రవేశం చేయించారు. తమ చేతులకు మట్టి అంటకుండ రైతు కష్టాన్ని పట్టిచుకోకుండ అందినంత తరలించుకుని పోవాలన్న ధోరణితో మధ్యవర్తికి అవకాశాలు కల్పించారు. రాజభాగం వసూలు పద్ధతులను క్రమంగా మార్చుతూ, రైతుకు భూమి మీద గల హక్కులను హరించివేస్తూ, కోరినంత రెవిన్యూ సమకూర్చగల జమీందారులకు ఆ హక్కులను ధారాదాత్తం చేశారు. 1765లో బెంగాల్‌ ' దివానీ ' ఈస్ట్‌ ఇండియా కంపెనీ హస్తగతమైన తరువాత,ఈ పరిస్థితి మరింత ఉధాతమైంది. రైతు చెల్లించాల్సిన రెవిన్యూను కంపెనీ పాలకులు అనూహ్యంగా పెంచారు. ( "...It is now generally recognised that main thrust of the East India Company particularly after assumption of diwani in 1765 was to enhance the land revenue of the province..." - Regional Economy in Eastern India - II. by B. Choudary)

ఈ పరిస్థితులు గ్రామీణ ప్రాంతాలకు ప్రాణాంతకమయ్యాయి. రైతు జీవితం దుర్భరంగా మారింది. గ్రామీణ ఆర్ధికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే వాణిజ్య పద్ధతులను సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 16 ఈస్ట్‌ ఇండియా కంపెనీ అనుసరించటం ప్రారంభించింది. కులవృత్తులు, చేతివృత్తులు, వ్యవసాయకూలీల జీవనం తీవ్ర సంక్షోభానికి గురైంది. కంపెనీ అనుసరిస్తున్న ఎగుమతి - దిగుమతి విధానాలు దేశీయ వర్తక-వాణిజ్యాలకు గొడ్డలిపెట్టుగా తయారయ్యాయి. ఈ భ యంకర పరిస్థులకుతోడు గా వడ్డీవ్యాపారస్థులు అత్యధిక వడ్డీల తో ప్ర జ లను దోచుకోసాగారు. గ్రామీణ వ్యవస్థ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండ అందినంత రెవిన్యూ రాబట్టుకోవాలన్న ఏకైక దృష్టితో కంపెనీ అధికారులు క్రూరంగా వ్యవహరించసాగారు. అత్యధిక రెవిన్యూను వసూలుచేసి పెట్టే నూతన జమీందారులను నియమించి, ఆధిక రెవిన్యూ వసూళ్ళకు మరిన్ని అవకాశాలు, అధికారాలు కల్పించి ప్రజల మీదకు పురికొల్పారు. ఈ పరిస్థిలకు తోడుగా ఆనాడు ధార్మిక ప్రచారంగావిస్తూ దేశమంతా తిరుగుతూ గడిపే ఫకీర్లు-సన్యాసులకు పూర్వపు పాలకులు కల్పించిన ఉచిత భూమి సదుపాయాలను,ప్రచార సౌకర్యాలను కంపెనీ పాలకులు హరించివేయటం ప్రారంభించారు. స్వదేశీ ప్రభువులు సంక్రమింప చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవటంగానీ, లేదా ఆత్యధిక రెవిన్యూ కట్టమనిగానీ వేధించసాగారు. ఆనాటి పాలకుల భూరివిరాళాలతో, భూములద్వారా లభించే ఆదాయంతో ధార్మిక ప్రచారం చేసుకుంటూ, ఏర్పాటు చేసుకున్న ధార్మిక వ్యవస్థల మనుగడకు కంపెనీ చేపట్టిన మార్పులు నష్టదాయకమయ్యాయి. ఈ చర్యలు సన్యాసులు-ఫకీర్ల ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి.

భయంకర క్షామం

1769-70లో బెంగాల్‌ తదితర ప్రాంతాలలో వచ్చిన భయంకర క్షామం జన జీవితాలను అతలాకుతలం చేసింది. ఆకలిదావులకు తాళలేక భారీ సంఖ్యలో ప్రజలు ఇతరప్రాంతాలకు వలస వెళ్ళారు. ఆస్తిపాస్తులను అమ్ముకోవటమేకాక మనుషులను విక్రయించటం కూడ జరిగింది. మనుషులే మనుషులను పీక్కుతినే దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి.మూడోవంతు ప్రజలు ప్రాణాలు విడిచారు. ఆ సమయంలో కూడ కంపెనీ అధికారులు,జమీందారులు రైతులకు రెవిన్యూ వసూళ్ళ విషయంలో ఏమాత్రం మినహాయింపులు ఇవ్వకపోగా మరింత దారుణంగా వ్యవహరించారు. ఆంగ్లేయ అధికారి W.W.Hunter తన గ్రంధం The Annals of Rural Bengal (1770-1771) లో, ఆనాటి భయంకర ప రి స్థితులను వివరించార ు . '...కరవు పరిస్థితిప్రజలను అన్ని రకాలుగా పట్టిపీడిస్తున్నసమయంలో 35 శాతం ప్రజలు, 50 శాతం రైతులు నాశనమైపోగా,కంపెనీ పాలకులు మాత్రం తగ్గించాల్సిన రెవిన్యూను, 5 శాతం కూడ తగ్గించకపోగా 10 శాతం పెంచటం జరిగింద...' ని ఆయన పేర్కొనడాన్ని బట్టి అంత భయానక పరిస్థితులలో కూడ బ్రిీటిషర్లు ఎంత రాక్షసంగా వ్యవహరించారో అర్థమౌతుంది. ఈపరిస్థితులను అవకాశంగా చేసుకుని మహాజనులు ( వడ్డు వ్యాపారులు) , జమీందారులు,అధికారులు బ్రిటిష్‌ వర్తకులు, రైతులను, ప్రజలను పీల్చి పిప్పి చేయసాగారు. ఆ పరిస్థితులు ఫకీర్ల - సన్యాసుల పోరాటాలకు ఊపిరి పోశాయి. పీడనకు వ్యతిరేకంగా ప్రజల అసంతృప్తి, అసహనం, ఆగ్రహం నుండి తిరుగుబాట్లు రగులుకున్నాయి. భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు 17 బ్రిీటిషర్లపై తొలి తిరుగుబాటుగా ఖ్యాతిగాంచిన ఈ ఉద్యమం 1761లో తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఈ పోరాటంలో హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు చేతులుకలిపి కంపెనీ పాలకులపై ద్వజమెత్తారు. సాంప్రదాయకమైన ఆయుధాలతో ప్రారంభమై ఆధునిక ఆయుధాలను సమకూర్చుకొని బ్రిీటిష్‌ తొత్తులైన జమీందారులు, అధికారులను సవాల్‌ చేశారు. ప్రజల మీద పీడన ఎక్కడైతే పెరిగిందో అక్కడల్లా ప్రత్యక్షమవుతూ ఫకీర్లు,సన్యాసులు ప్రజల మన్నన పొందసాగారు. ఈ తిరుగుబాట్లలో ప్రజలు అత్యధికంగా పాల్గొనటంతో ఈ తిరుగుబాట్లు కాస్తా ప్రజా పోరాటాలుగా మారిపోయాయి.

పోరాట వీరుడు జ్నూషా ఫకీర్‌ ఈ పోరాటంలో ఫకీర్లకు నాయకత్వం వహించిన మహాసేనాని మజ్నూ షా ఫకీర్‌. ఆయనను మంషా అని కూడ ప్రజలు పిలుచుకున్నారు. బెంగాల్‌ పరగణాలలోని కాన్పూరు సమీపానగల మాఖన్‌పూర్‌ గ్రామ నివాసి. బ్రిీటిషర్లను తొడగొట్టి సవాల్‌చేసి పలుమార్లు పరాజితులను చేసి కంపెనీ అధికారుల గుండెల్లో గుబులుపుట్టించిన మజ్నూషా, ధార్మిక వ్యవస్థాపరంగా చూస్తే ' మదారి ' సంప్రదాయానికి చెందిన ఫకీర్‌. మదారి తెగలో పీర్‌-మురీద్‌ సంబంధాలు ప్రధానం. ' పీర్‌' అంటే గురువు. మురీద్‌' అంటే శిష్యుడు. మురీద్‌ పీర్‌-మురీద్‌ల సంబంధం అంటే గురు- శిష్యుల సంబంధమన్నమాట. ఈ సంబంధం ధార్మికమైనది కనుక చాలా బలమైంది. గురువు ఆదేశిస్తే తమ ధాన మాన ప్రాణాలను అర్పించడనికి శిష్యులు సర్వదా సిద్ధంగా ఉన్నారు. ధార్మిక గురువులైన పీర్‌ పట్ల మురీదులు అత్యంత భక్తిభావం కలిగి ఉన్నారు. గురువుల మాట శిష్యులకు శిరోధార్యం. గురువుల స్థిర నివాస ప్రాంతాలు శిష్యులకు పరమ పుణ్యకే∆త్రాలు. ప్రతి సంవత్సరం నిర్దేశిత సమయానికి ప్రపంచంలో ఏ ప్రాంతాన ఉన్నప్పటికీ, ఎలాింటి పరిస్థితులో ఉన్నప్పిటికీ మురీద్‌లు తమ కుటుంబాలతో సహా ఈ క్షేత్రాలకు విచ్చేసి ఉత్సవాలలో భక్తిభావనతో పాల్గొందురు. గురువుల ఆశీస్సులు పొంది. పలు రోజుల పాటు గురువు సన్నిధిలో గడిపి తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోతారు. ఈ ఉత్సవాలు ధార్మిక విషయాల వరకే పరిమితమై సాగేవి. కంపెనీ పాలకుల దాష్టీకాలు పెచ్చు పెరిగిన తరువాత, ఈ క్షేత్రాలను కంపెనీ పాలకులపై తిరుగుబాట్లను రూపొందించే కేంద్రాలుగా ప్రజలు మార్చుకున్నారు. పోరాట వ్యూహాలను తయారు చేసుకునేందుకు, ఆయుధాల సమీకరణకు, పోరాట వీరులను ఎంపికచసుకునేందుకు, శికణ ఇచ్చేందుకు ఉపయాగించుకున్నారు. ఈ పరిసితులను పసికట్టిన కంపెనీ పాలకులు ఫకీర్ల మీద తగు చర్యలు తీసుకునేందుకు నిశ్చయించుకుని, అనువైన పరిస్థితుల కోసం ఎదురుచూడసాగారు.

నూటయాభై మంది ఫకీర్ల బలిదానం ప్రతి ఏడదిలాగే 1771లో కూడ ఫకీర్లు బెంగాల్‌ ప్రాంతంలో జరిగిన ఉత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కంపెనీ బలగాల మీద తిరుగుబాట్లు చేస్తూ, రెవిన్యూ వసూళ్ళకు ఆటంకాలు కలిగిస్తున్న ఫకీర్ల మీద కసి తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్న కంపెనీ పాలకులకు ఈ ఉత్సవం మంచి అవకాశం కల్పించింది. ఫకీర్లు ఆయుధాలు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 18 సమకూర్చుకుంటున్నారన్ననెపంతో కంపెనీ బలగాలు దాడి జరిపి, ఉత్సవంలో కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 150మంది ఫకీర్లు మరణించారు. ఈ సంఘటన రగిల్చిన ఆగ్రహజ్వాలల నుండి పుట్టుకొచ్చారు, ఫకీర్ల మహాసేనాని మజ్నూషా ఫకీర్‌. అప్పికే బ్రిీషర్ల చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నఫకీర్లు ప్రతీకారేచ్ఛతో మహాసంగ్రామానికి ఆయుధాలు చేత పట్టారు. ప్రజలను, పూర్వపు జమీందారులను కూడగట్టటం ఆరంభించారు. స్వదేశీ పాలకులకు లేఖలు రాసారు. మతంతో, మత దృక్పధంతో ప్రమేయం లేకుండ స్వదేశీ పాలకుల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. '...గత సంవత్సరం నిష్కారణంగా 150 ఫకీర్లను బలి తీసుకున్నారు...',... అంటూ ఆ నాటిభయానక సంఘటనను భవాని మహారాణికి వివరిస్తూ, 1772 లో రాసిన లేఖలో మజ్నూషా ఆమె సహాయ సహకారాలు కోరారు. సన్యాసులు-ఫకీర్ల పోరాటం 1761లో ఆవిర్భవించినప్పిటికీ, ఆ నాటి గ్రామీణ ప్రజల రైతుల ఇతర వర్గాల ప్రజల జీవన స్ధితిగతులను పాలకులు విషమయం చేసిన తీరు, భయంకర క్షామంలో కూడ అధికారులు కర్కశంగా వ్యవహరించిన తీరుతెన్నులు, ఫకీర్లను బలి తీసుకున్న కిరాతక సంఘటనలు అటు ఫకీర్లను, ఇటు సన్యాసులను, పలు వర్గాల ప్రజలను, పూర్వపు జమీందారులను ఏకం చేసాయి. మాతృదేశం నుండి ఫిరంగీలను తరిమివేయటం ద్వారా మాత్రమే తమ ఇక్కట్లు తొలగుతాయని, సమస్యలు పరిష్కారం కాగలవని ప్రజలు భావించారు.

జమీరుద్దీన్‌ దాఫేదార్‌ రచన ఫకీర్ల నేత మజ్నూ షాను పోరాట దిశగా నడిపించిన వాతావరణాన్ని బీర్‌భూం (BIRBHUM) కు చెందిన ప్రముఖ బెంగాలీ కవి జమీరుద్దీన్‌ దపేదార్‌ (JAMIRUDDIN DEFEDAR), 1887 సంవత్సరంలో రాసిన Manju Shaher Hakikat అను పద్యకావ్యంలో వివరించారు. ఈ పద్యాకావ్యం ప్రకారం, ఒకసారి మజ్నూ షా ఫకీర్‌ తన గురువు దర్వేష్‌ హమీద్‌ వద్దకు వెళ్ళగా, ఆనాటి భయంకర పరిస్థితులను దర్వేష్‌ ఈ విధంగా వివరించారు. '....లక్షలాది ప్రజానీకం కరువు వలన మరణిస్తున్నారు. వాళ్ళ జీవితాలను కాపాడు. కంపెనీ ఏజంట్లు, అధికార్లు అధిక రెవిన్యూ కోసం రైతులను, చేతివృత్తులవారిని, ప్రజలను హింసిస్తున్నారు. ప్రజలు గ్రామాలు వదలి వెళ్ళిపోతున్నారు...' ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజల స్థితిగతులను స్వయంగా తెలుసుకునేందుకు గురువు ఆదేశాల మేరకు మజ్నూషా పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజల కష్తసుఖాలను ఇక్కట్లను గమనించారు. ఫిరంగీలు, ఫిరంగీల తాబేదారులైన జమీందారుల క్రూరత్వం వడ్డీ వ్యాపారుల దోపిడీ చక్రబంధంలో విలవిలలాడుతున్న అభాగ్యులను, ఆదుకునే నాధుడు లేక అల్లాడుతున్నప్రజలను చూసారు. ఈ పర్యటనలో నజ్నూషా మాతృదేశాన్నిఫిరంగీల నుండి విముక్తం చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించి ప్రకటించారు. కంపెనీ పాలకుల చర్వలను సహించలేని ప్రజ లు ఆయనవెంట నడి చేందుకు సిసద్దమయ్యారు. ఈ శిష్యబృందంతో కలసి నమజ్నూషా గురువు వద్దకు వచ్చారు. ప్రజల దుర్భర పరిస్థితులను భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు 19 వివరించారు. ప్రజల వెతలను విన్నదర్మేష్‌ తీవ్రంగా వ్యధచెందారు. ఫిరంగీల మీద ఆగ్ర హం వ్యక్తంచే సారు . చివర కు, '...నాగా స సన్యాసులతో కలసి ఆయధా లు చేపట్టండి. ఆహార పదార్ధాలను, పంటలను దాచిపెట్టిన గిడ్డంగుల మీద దాడులు జరపండి. ఆకలితో ఆలమిస్తున్న ప్రజలకు పంచండి. ఫిరంగీలను తరిమివేయండి అంతకంటే మరో ప్రత్యాయమ్నాయం లేదు. ఆయధాలు చేప ట్టండి . ముందుకు సాగండి...' అంటూ మజ్నూ షాను కోరారు.

                   ఫిరంగీలను తరిమికొట్టమని గురువు ఆదేశం

గురువు ఆదేశాలందుకున్న మజ్నూషా తన పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు, రైతులు, కులవృత్తుల, చేతివృత్తుల కళాకారులు, ఆయనకు తోడుగా నిలిచేందుకుముందుకు వచ్చారు. మజ్నూ షా తనదంటూ ఒక ప్రత్యేక దళాన్ని నిర్మించుకున్నారు. గురువు ద్వారా ప్రేరణ పొందిన మజ్నూషా, పోరాటానికి నాయకత్వం వహించి విదేశీయులైన ఫిరంగీలను తరిమివేయానికి కదాలి రమ్మని స్వదేశీ పాలకులను అభ్యర్ధించారు. మత ధర్మాలకు అతీతంగా ప్రజల పోరాలకు నాయకత్వం వహించమని కోరటం ద్వారా మజ్నూషా ఆనాటి రాజధర్మాన్ని గౌరవించారు. మాతృదేశం నుండి ఫరంగీలను తరిమివేయాలని, బాధాసర్పద్రష్టులైన ప్రజలను కంపెనీ పాలకుల దోపిడు, దాష్టీకాల నుండి విముక్తం చేయాలన్న లక్ష్యసాధన కోసం, ఆ పోరాట వీరులు మతాలకు అతీతంగా సమైక్య పోరాటం సాగించారు.

ఈ పోరాటంలో ఫకీర్లకు నాగా స న్యాసుల స్నేహహస్తం లభించింది. ఫకీర్లు-సన్యాసులు కలిసి ఫిరంగీల మీద దాడులు చేసి అనేక విజయాలు సాధించారు.ఒకచోట సన్యాసులకు ఫకీర్లు నాయకత్వం వహిసే మరోచోట ఫకీర్లకు సన్యాసులు నాయకత్వం వహించి ఈస్ట్‌ ఇండియా కంపెనీ బలగాలను మట్టి కరిపించి చరిత్రను సృష్టించారు. ప్రముఖ చరిత్రకారుడు Dr. Santimoy Roy చే, '... Against this ruthless invador (British) first flag of revolt was unfurled by Majnu Shah, the leader of a band of fakirs... గా కీర్తించబడిన మజ్నూ షా బ్రిీటిషర్ల మీద తిరుగుబాటు పతాకాన్నితొలిసారిగా బెంగాల్‌ గడ్డ మీదా నుండి ఎగురవేసారు.

ఆయుధబలం, అంగబలం గల శతృవుపై పోరాటం, సామాన్య విషయం కాదని గ్రహించిన మజ్మూషా ప్రజల అండదండలతో బలమైన ప్రజా పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో పిటిష్టమైన పోరాట వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేసారు. ఫకీర్ల ప్రాబల్యం గల ప్రాంతాలతో ప్రారంభించి, ఇతర ప్రదేశాల బాధితులను సమైక్య పర్చేందుకు ప్రయత్నించారు. పలు ప్రాంతాలలో కంపెనీ పాలకుల ఛాయలు కూడ కనిపించకుండ చేసి, ఆయా గ్రామాల ప్రజల జీవనానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండ గ్రామ కమిటీలు ఏర్పాటుచేసి గ్రామ పాలన సజావుగా సాగేట్లు చర్యలు తీసుకున్నారు. మజ్నూ షా ఫకీర్లకు తిరుగులేని నాయకుడైనప్పటికీ, పోరుబాట చాలా ప్రమాదాకరం కనుక సమష్టిగా ఆలోచించించటం, పథకాలను రూపొందించటం, రూపొందించిన పథకాలను సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 20 ఖచ్ఛితంగా అమలు పర్చేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించారు. ఆర్థిక వనరుల సేకరణ, పోరాట దాళాల సమీకరణ, గూఢచర్య దళం ఏర్పాటు, ఆహారం, ఆయుధాల సమీకరణ - సరఫరా,ప్రజల సమస్యల పరిష్కారం తదితర వ్యవహారాల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి.

గెరిల్లా పోరాటం

ఫకీర్లు, సన్యాసుల పోరాటాలు ప్రధానంగా గెరిల్లా పద్ధతిలో సాగాయి. శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గటం. శత్రువు ఆదమరచి ఉన్నప్పుడు దాడులు చేసే పద్ధతులను అనుసరించారు. శత్రువుతో ముఖాముఖి ఎదుర్కోక తప్పనప్పుడు ప్రాణాలకు తెగించి పోరు సల్పటం ఫకీర్ల పోరాట విధానాలు. 1761 డిసెంబరులో బరద్వాన్‌కు చెందిన పాత జమీందారుతో కలిసి కంపెనీ సాయుధ దాళాల మీద తొలిసారిగా తిరగబడి తమ సుదీర్గ పోరుకు ఫకీర్లు శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి ఫకీర్ల-సన్యాసుల పోరాటం సాగిన నాలుగు దాశాబ్దాల కాలంలో ప్రతి సంవత్సరం కంపెనీ పాలకులు ఒకటి, రెండు ప్రధాన పోరాటాలను ఎదుదుర్కొనక తప్పని పరిస్థితులను ఫకీర్లు కల్పించారు. ప్రతి ప్రధాన పోరాటంలో కనీసం 500 మంది ఫకీర్లు పాల్గొనటం విశేషం. ఫకీర్ల సేనాని మజ్నూషా పిలుపునిస్తే, అతి తక్కువ సమయంలో 50 వేల మంది తరలి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని కంపెనీ అధికారులే తమ నివేదికలో రాసుకున్నారు. జమీందారులు, మహాజనులు, కంపెనీ పాలకులు, అధికారుల మీద ఫకీర్లు దాదులు సాగించారు . జమీందారులకు ముందు తెలియజేసి దాడులు చే సనన సంఘటనలున్నాయి. అకృత్యాలకు స్వస్తి పలకమని, బలవంతపు రెవిన్యూలను ఆపమనికంపెనీ పాలకులను, జమీందారులను హెచ్చరించి, ఆ తరువాత దాడులను జరిపేవారు.ఈ విషయం కంపెనీ పాలకులకు తెలిసి బలగాలతో తరలి వచ్చేలోగా ప్రజా గూఢచారి దళం నుండి సమాచారం అందుకుని ఫకీర్లు నిరాటంకంగా దాడులు నిర్వహించి, క్షేమంగా వెళ్ళిపోయేవారు. ఫకీర్లు దాడిచేస్తారని భయం ఉన్నజమీందార్లు కంపెనీ సహాయం కోరుతూ లేఖలు రాసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జమీందారుల వినతి మేరకు కంపెనీ పాలకులు '..దాడులు మానమని, లేకుంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని..' మజ్నూ షాకు హెచ్చరికలు చేసినా ఏ మాత్రం ఖాతరు చేయకుండ నిర్దేశించిన సమయానికి గమ్యం చేరుకుని, కంపెనీ సాయుధ దాళాలను నిలువరించి, పనిని పూర్తి చేసుకుని చడు చప్పుడూ లేకుండ పోరాట దాళాలు నిష్క్రమించేవి. కంపెనీ సాయుధ దాళాల కదలికలు అతి వేగంగా మజ్నూ షాకు ఎలా అందున్నాయో అర్ధంకాక అధికారులు అయోమయంలో పడేవారు. ఫకీర్ల గురించి తప్పుడు సమాచారం అందించి కంపెనీ దాళాలను మార్గం మళ్ళించి, గమ్యం చేరుకోనివ్వకుండ చేసి బలగాలను ప్రజలు చికాకు పర్చేవారు.మజ్నూ షా గూఢచారులు ఎవ్వరో కాదు ఆయా గ్రామాల ప్రజలు. పసిపిల్లలు కూడ గూఢచారులుగా సహకరించారు. ఫకీర్లకు సహకరించే గ్రామీణులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటంటం ద్వారా గూఢచారి వ్యవస్థను మజ్నూషా పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు. మజ్నూషా దళాలు వందల భారత సాfiతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాలు 21 సంఖ్యలో ఫలానా చోటున సమావేశం అయ్యారని, బహుశా ఫలానా ప్రాంతం మీద దాడులు జరుపగలరని స్ధానిక అధికారుల నుండి ఖచ్చితమైన సమాచారం అందిన తరువాత కూడ కంపెనీ సాయుధ దాళాలుమజ్నూషా దాళాలను చేరుకోలేకపోయేవి.పటిష్టమైన వ్యూహంతో ఆంగ్లేయ అధి కారులు సాయధ బలగాలతో ఫకీర్లసమావేశస్థలిని చేరుకునేప్పటికీ, అప్పటికే ఫకీర్లు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయేవారు. సంఖ్యాబలం ఎంతఉన్నాక్షణంలో గమ్యం చేరుకోవటం, మరుక్షణాన లక్ష్యాన్ని సాధించుకుని నిష్క్రమించటం ఫకీర్లకుకొట్టిన పిండిగా మారింది. గుర్రాలు, ఒంటెల మీద సంచరించే దాళాలతో పాటుగా కాల్బలం కూడ ఆంగ్లేయ బలగాలకు అందనంత దూరం వెళ్ళిపోవటం ఎలా జరిగేదో అర్ధంకాక, కంపెనీ పాలకులకు ఏ విధంగా సంజాయిషీ ఇచ్చుకోవాలో తెలియక అధికారులు సతమతమయ్యెవారు. ప్రతి ప్రధాన పోరాటంలో 500 మంది వరకుఫకీర్లను సమీకరించటం, పకడ్బందీగా పధకం రచన జరగటం, వ్యూహాత్మకంగా శతృవు మీదా దాడి చేయటం, క్రమశిక్షణతో ఆ పథకాన్ని అమలు జరపటం గమనిస్తే, ఫకీర్‌ యోధుల యుద్ధ కళాచాతుర్యం, సాహసం, జ్నూ షా లాింటి నాయకుల సామర్థ్యం అర్ధమవుతుంది. ఫకీర్లు ప్రధానంగా కంపెనీ కచ్చేరీలు, కంపెనీ కర్మాగారాలు, కంపెనీ తొత్తుల ప్రాసాదాలు, కోటల మీద దాడులు జరిపారు. ప్రజల నుండి బలవంతంగా వసూలు చేసిన రెవిన్యూను మూటగట్టీ కంపెనీకి చేరవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం అందాగానే ఆ ప్రాంతం మీద దాడి జరిగేది. ఆ ప్రాంతంలో ప్రజలు, రైతులనుండి వసూలు చేసిన రెవిన్యూ మొత్తాలను స్వాధీనం చేసుకుని ప్రజల అవసరాలుతీర్చిసమస్య పరిష్కరించి ఫకీర్లు మటుమాయం అయ్యేవారు. ఈ సంఘటనలలో చంపటం,గాయపర్చటం లాింటివి జరిగేవి కావు. శతృవు నుండి ప్రతిఘటన ఎదురైతే మాత్రం దయాదాక్షిణ్యాలు చూపేవారు కారు. ఈ హింసకు స్వపర భేదాలు వుండేవి కావు. మతంఆసరాతో తప్పించుకోచూసిన కంపెనీకి చెందిన ముస్లిం అధికారులను ఫకీర్లు విడిచి పెట్టకుండ ప్రజలకు శతృవా? కాదా? అనే ప్రాతిపదికన సంహరించిన శిక్షించిన సంఘటనలు ఉన్నాయి. అధికారుల వ్యవహారసరళి ఒక్కటే తమ చర్యలకు ప్రాతిపదిక తప్ప, మతం, కులం, ప్రాంతం ఫకీర్లు-సన్యాసుల ఉద్యమంలో జోక్యం చేసుకోడానికి వీలులేకుండ చర్యలు తీసుకోవడం విశేషం. అధిక వడ్డుని గుంజుతున్న వడ్డీవ్యాపారస్తుల పట్ల మజ్నూ షా నిర్దాకి∆ణ్యంగా వ్యవహరించారు. ప్రజల నుండి, గూఢచారి దళం నుండి సమాచారం అందగానే దాడులను నిర్వహించడం, లభించిన నగదును స్వాధీనం చేసుకోవటం, ఋణ పత్రాలను,రైతుల భూముల తనఖాపత్రాలను, భూస్వాధీన పత్రాలను తగులబెట్టేసి, భవిష్యత్తులో ఎవ్వరూ కూడ ఎటువంతి బకాయిలను మహాజనులకు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించి, మహాజనులు కూడ ఎటువంటి వసూళ్ళ చేయరాదాని శాసించి ఫకీర్ల దళాలు అదాశ్యమయ్యేవి. కంపెనీ రెవిన్యూ వసూళ్లను అనేక రెట్లు పెంచి నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తున్నందున తగినంత సొమ్ము వుందని తెలియగానే మజ్నూ షా ఆ ప్రాంతపు కచ్చేరి మీద దాడి చేసి సొమ్మును స్వాధీనం చేసుకొని, రెవిన్యూ రికార్డులను తగులబెట్టి ప్రజలను సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 22 కంపెనీకి రెవిన్యూ చెల్లించ వద్దని విజ్ఞప్తి చేసి వెళ్ళిపోయేవారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వసూచేసిన రెవిన్యూ, ఫకీర్ల పాలుకాకుండ కాపాడుకునేందుకు తమ అధికారులను,గుమస్తాలను, జమీందారులను కచ్చేరీల నుండి పారిపొమ్మని కూడ పాలకులు సలహాలిచ్చిన సంఘటలను బట్టీ, కచ్చేరీల మీద ఫకీర్ల దాడి ఎంత బలంగా ఉండేదో ఊహించవచ్చు.కంపెనీ నియమించిన జమీందారులు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నందున ప్రతీకార చర్యగా ఫకీర్లు జమీందారుల పట్ల ఏ మాత్రం కనికరం చూపేవారు కారు. చివరకు భారీ బలగాలతో భద్రతను ఏర్పాటుచేసిన కంపెనీ కర్మాగారాల మీదకూడ ధైర్యసాహసాలతో మజ్నూ షా దాళాలు దాడులు జరిపి విజయం సాధించి చరిత్ర సృష్టించాయి.

శత్రువుల పట్ల మాత్రమే కాఠిన్యం

స్త్రీలు, వృద్ధులు, పిల్లలపట్ల ఎంతో గౌరవంగా ఫకీర్లు ప్రవర్తించేవారని కంపెనీ అధికారులు రాసుకున్న డైరీల ద్వారా తెలుస్తుంది. దాడుల సందర్భంగా కంపెనీ అధికారులు,నూతన జమీందారులు, గుమస్తాలు, కంపెనీ సిబ్బంది అడ్డుపడి, సాయుధంగా ప్రతిఘటించితే తప్ప మజ్నూషా దాళాలు ఆయుధాలకు పని కల్పించేవి కావు. ఈ దాడులలో సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది, కష్టనష్టాలు కలుగకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు సాయుధ దాళాలకు తగిన హెచ్చరికలను జారీచేయటమేకాక, ఆదేశాల ఉల్లంఘన జరిగితే ఎంతటి సన్నిహితుడికైనా శిక్ష తప్పేదికాదు. ప్రజల నుండి విరాళాలు ఆశించవద్దని ఆయన హెచ్చరించారు. ధానికి సంపన్నవర్గాల నుండి మాత్రమే విరాళాలు సేకరించాలని,ప్రజలను ఎటువంటి వత్తిడికి గురిచేయరాదని ఆదేశాలను జారీచేసి బాధిత వర్గాలకు నష్టం కలగకుండ తగిన జాగ్రత్తలు తీసుకొని అవి ఖచ్చితంగా అమలు జరిగేలా చూసారు. ఫకీర్లు - సన్యాసులను దోపిడు దొంగలుగా, కంపెనీ పాలకులు ముద్రవేసారు. ఆంగ్లేయుల రికార్డులన్నిటిలో దుండగీలుగానే అటు ఫకీర్లుగానీ, ఇటు సన్యాసులుగానీ కన్పిస్తారు. అయితే ప్రజలు మాత్రం కంపెనీ పాలకుల పీడన నుండి తమను రక్షించడానికి వచ్చిన ఆపద్బాంధావులుగా ఫకీర్లను-సన్యాసులను ఆదరించారు, ఆదుకున్నారు. కదనరంగానికి వెంట నడిచారు. ఫకీర్లు వందల మైళ్ళు విస్తరించిన ప్రాంతంలో 40 సంవత్సరాలపాటు తమ ఇష్టారాజ్యం సాగించారంటే ఆ ప్రాంతపు ప్రజల చురుకైన భాగస్వామ్యం లేకుంటే సాధ్యమయ్యేదికాదు. ఫకీర్లు సామాన్య పేద వర్గాలను ఇక్కట్లు పెట్టినట్టు, ప్రజల నుండి కనీస ఆరోపణలు రాకపోవటం, ఆంగ్లేయుల రికార్డులలోనైనా నమోదుకాక పోవటం విశేషం. పేదలను పీడించే కంపెనీ తొత్తులైన ధానిక సంపన్న వర్గాల పట్ల ఫకీర్లు-సన్యాసులు కఠినంగా వ్యవహరించారు. ఆనాడు స్వదేశీ వర్తక-వాణిజ్యాన్ని నాశనం చేస్తున్న కంపెనీ వర్తకులు, వారి తొత్తులైన వర్తక-వాణిజ్య వర్గాల మీద దాడులు జరుపుతున్న సన్యాసుల నాయకులు శ్రీ భవాని పాథక్‌తో ఫకీర్లు సత్సంబంధాలను సాగించారు. సన్యాసులతో కలసి ఫకీర్ల దళాలు, పలు దాడులలో పాల్గొన్నాయి. మతంతో ప్రమేయం లేకుండ సాగిన ఈ పోరాటాలలో సన్యాసుల దాళానికి ఫకీర్లు నాయకత్వం భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు 23 వహించిన సంఘటనలున్నయి. సన్యాసుల దాళానికి స్వయంగా మజ్నూ షా నాయకత్వం వహించిన సందర్భాలున్నాయి. కంపెనీ బలగాలపై జరిగిన అనేక భారీ దాడులలో ఫకీర్లు,సన్యాసులు కలిసి పాల్గొన్నారని, అధికారుల నివేదికలు బహిర్గతం చేస్తున్నాయి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను సవాల్‌ చేస్తూ సాగిన తిరుగుబాటులలో కంపెనీ సాయుధ దాళాల ఉన్నతాధికారులు జనరల్‌ మెకంజీ, లెఫ్టినెంట్ టైలర్‌, లెఫ్టినెంట్ బ్రివాన్స్‌,కమాండర్‌ కెనిత్‌, కెప్టన్‌ రాటన్‌, మేజర్‌ బుచ్చన్‌, రాబర్ట్‌సన్‌ తదితరులను, పలువురు ప్రాంతీయ కలక్టర్లను మజ్నూ షా పరాజితులను చేసారు. 1769లో జరిగిన పోరాటంలో కమాండర్‌ కెనిత్‌ హతమయ్యాడు. కంపెనీ సాయుధ దాళాలు పలాయనం చిత్తగించటం సర్వసాధారణమైంది. చివరకు కంపెనీ పాలకులే తమ బలగాలను పారిపోయి ప్రాణాలు దక్కించుకోమని కోరిన విచిత్ర సంఘటనలూ ఉన్నాయి. కంపెనీ రెవిన్యూ వసూళ్ళకు భారీ నష్టం కలిగించటమేకాక, సాయుధ బలగాలకు తీరని ప్రాణనష్టం కలిగించిన మజ్నూ షాను బంధించడానికి ఎంతగా ప్రయత్నించినా కంపెనీ పాలకులు విజయం సాధించలేకపోయారు. ప్రజలకు ఎన్ని ఆశలు చూపినా,హింసలు పెట్టినా, జమీందారులు ఎంతగా ప్రయత్నాలు చేసినా ఒక కట్టడితో సాగిన ఫకీర్లను గాని, వారికి కవచంలా నిలబడిన గ్రామీణ ప్రజలను గాని చీల్చటం కంపెనీ పాలకులకు సాధ్యం కాలేదు. ఆయుధబలం, అంగబలం కలిగిన ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఆనాడు ఫకీర్లు-సన్యాసులు పెను సవాలుగా మారి ముప్పతిప్పలు ట్టి చరిత్ర సృష్టించటం అపూర్వమైన విషయం. ప్రజల ప్రధాన భాగస్వామ్యంతో పటిష్టమైన నిర్మాణ ఎత్తుగడలను అవలంబించడం వలన ఫకీర్లు కంపెనీ పాలకులను సవాల్‌ చేయగలిగారని బ్రిీటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్ కూడ అంగీకరించాడు.

విస్తరించిన పోరాటం ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, పాలకుల తాబేదార్లు, మహాజనుల దుష్కృత్యాలు,మజ్నూ షా లాింటి సమర్థులైన నేతల సారధ్యంలో సాగుతున్నరాజీలేని పోరాటం, ఫకీర్ల-సన్యాసుల ఐకమత్యం ఫలితంగా బెంగాల్‌, బీహార్‌, అస్సాం, ప్రస్తుత భూాటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ తదితర ప్రాంతాలకు వ్యాపించింది. ప్రధానంగా మేమ్‌ సింగ్; ధక్కా, రంగాపూర్‌, బొగ్రా, రాజాషాహి, బీనాజ్‌ పూర్‌, మాల్దా, కోచ్‌ బీహార్‌, ముషీరాబాద్‌.బరద్వాన్‌, బీరంపూర్‌ లాింటి ప్రధాన జిల్లాల్లో ఫకీర్లు సమాంతర ప్రభుత్వాలను నడిపారు.ఈ ప్రాంతాలలో నూతన జమీందార్ల స్థానంలో ఫకీర్లు ప్రజల నుండి స్వచ్ఛందాంగా విరాళాలు సేకరించారు. కంపెనీ సాయుధబలగాల నుండి, వడ్డీ వ్యాపారుల నుండి, కంపెనీ అధికారుల నుండి ప్రజలకు రక్షణ కల్పించారు. ఫకీర్లకు లభిస్తున్న ఆదరణ, పెరుగుతున్న ప్రజాబలం, కంపెనీ అధికారుల పరాజయాల పరంపర వలన కంపెనీచే నియమితులైన జమీందారులు,బ్రతికి ఉంటే బలుసాకు తిని బ్రతకవచ్చని, జమీందారీలను వదులుకుని వలస వెళ్ళాల్సిన పరిస్థితులను ఫకీర్లు-సన్యాసుల ఉద్యమం కల్పించింది. సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

24

ఫకీర్ల రాజధాని మస్తాన్‌ ఘర్‌ నాలుగు దాశాబ్దాల పాటు విరామమెరుగక సాగిన ఫకీర్ల పోరాటానికి మస్తాన్‌ ఘర్‌ ప్రాంతం కేంద్ర స్థానమై దేదీప్యమానంగా వెలిగింది. మస్తాన్‌ పీర్‌ గౌరవార్థం ఏర్పాటు చేసిన మస్తాన్‌ దార్గా, మురీదులైన ఫకీర్లకు పుణ్యక్షేత్రంగా మారింది. అందువలన ఈ ప్రాంతాన్ని మజ్నూషా ఫకీర్ల రాజధానిగాతీర్చదిద్దారు. ఫకీర్లకు మస్తాన్‌ ఘర్‌ పెట్టని కోటగా తయారైంది. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతానికి అసంఖ్యాకంగా ఫకీర్లు వచ్చేవారు.సంవత్సరమంతా నిర్వహించవలసిన కార్యక్రమాలు, సమకూర్చుకోవాల్సిన ఆయుధాలు,పోరాట వీరులకు శిక్షణ తదితర కార్యక్రమాలను ఇక్కడే రూపొందించుకొనడం జరిగేది. 1776 ప్రాంతంలో మజ్నూ షా ఫకీర్‌ ఇక్కడ బలిష్టమైన కోటను నిర్మించారు.

ఈ ప్రాంతంనుంచే కంపెనీ పాలకులను పరాజితులను చేయడానికి తమతో చేతులు కలపాల్సిందిగా నాబోర్‌ మహారాణి భవానికి ఆయన లేఖ రాసారు. అయితే స్వదేశీ పాలకుల నుండి ఎటువంటి అనుకూల స్పందన లభించలేదు. ( "...He even sent an urgent appeal to Rani-Bhabani of Natore to make common cause to drive away the firings. But it evoked no response..." Freedom Movement and Indian Muslims, - Dr. Santimoy Ray ). ప్రతికూల పరిస్థితులున్నా, స్వదేశీపాలకుల నుండి ఎటువంటి చేయూత లభించకున్నామజ్నూ షా చివరి వరకూ ఫిరంగీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు.

చరిత్ర సృష్టించిన పోరు ఫకీర్ల ఉద్యామం 1776 నవంబరు మాసంలో మరొక చరిత్ర సృష్టించింది. బొగ్రా వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మజ్నూ షా అనుచరులను లెఫ్టినెంటు రాబర్ట్‌సన్‌ నాయకత్వంలో కంపెనీ సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. ఆకస్మికంగా శత్రువు వచ్చి పడటంతో విజయమో-వీరస్వర్గమోనంటూ ఫిరంగీల సాయుధ బలగాలను ఫకీర్లు ఎదాుర్కొన్నారు. వీరవిహారం చేస్తున్న ఫకీర్ల ప్రతాపం ముందు రాబర్ట్‌సన్‌ దాళాలు నిలువలేక పోయాయి. ఫకీర్లు పోరుకు సిద్దంగా లేనందున పోరాటం చేస్తూనే వెనక్కి తగ్గి అటవీ ప్రాంతంలోకి క్రమక్రమంగా నిష్క్రమించారు. ఆధునిక ఆయుధాలను కలిగియున్నకంపెనీ బలగాలకు అతి చేరువగా వుండి కూడ కత్తులు, కటాలులాింటి సంప్రదాయక ఆయుధాలతో శత్రువును దరిచేరనీకుండ నిరోధించడంలో ఫకీర్లు విజయం సాధించిన సంఘటన కంపెనీ పాలకులలో కలవరం కలిగించింది. ఈ సంఘటనలో మజ్నూ షా శత్రువును నిరోధిస్తూ, కంపెనీ బలగాలను హతమార్చుతూ తప్పించుకున్నారని లెఫ్టినెంటు రాబర్ట్‌సన్‌, ఫ్రాన్సిస్‌ గ్లాడ్విన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ చారిత్రక సంఘటనలో వందలాది కంపెనీ సాయుధులు హతమయ్యారని లెఫ్టినెంటు రాబర్ట్‌ సన్‌ బొగ్రా కలక్టర్‌కు 1776 నవంబరు 14న రాసిన లేఖలో వివరించాడని శ్రీ శాంతిమోహన్ రాయ్‌ను తన ' ఫ్రీడం మూవ్‌మెంట్ అండ్‌ ఇండియన్‌ ముస్లిమ్స్‌' అను గ్రంధంలో వివరించారు. ఈ సంఘటనతో కంపెనీ సాయుధ బలగాలు ఖంగుతినగా,ఫకీర్లు మాత్రం ద్విగుణీకృత ఉత్సాహంతో కంపెనీ బలగాల మీద విరుచుకుపడ్డారు. 25

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు

పోరుబాటలో అపశృతులు

1761లో ప్రారంభమైన ఫకీర్ల-సన్యాసుల పోరాటం, కాలం గడిచే కొద్ది ఉధాతమై పలు విజయాలు సాధించింది. అణచివేత, దోపిడు, పెత్తందారీతనానికి వ్యతిరేకంగా ప్రత్యేక పరిస్థితులలో ఉనికిలోకి వచ్చిన ఉద్యమం, కాలగమనంలో పలు కారణాల వలన బలహీనపడింది. ప్రధానంగా ఫకీర్లకు ఆధునిక ఆయుధాలు తగినంతగా లేకపోవడం, పోరాట వీఎఉలకు అవసర మైనంత శిక్షణ కర వుకావటం, ప్రజలలో అసంతృప్తిని నివారించడానికి కంపెనీ పాలకులు చర్యలు తీసుకోవటం, క్షామం తరువాత ప్రకృతి సిద్ధమైన అనుకూల వాతావరణం ఏర్పడటంతో, ప్రతికూల పరిస్థితులను ఫకీర్ల పోరాటం ఎదుర్కోవాల్సి వచ్చింది.

కంపెనీ అధికారుల దుష్ట పాలనకు వ్యతిరేకంగా తిరగబడటం మాత్రమే ఫకీర్లు చేసారు తప్ప పాలనాపరమైన వ్యవస్థను పటిష్టంగా రూపొందించాలని సంకల్పించలేదు. ఆనాటి స్వ దేశీ పాలకులను గౌరవిస్తూ , పాలనాధి కారాన్నిచేపట్టి ప్రజలకు చేయూతనివ్వాల్సిందిగా కోరారు గాని, తామే పాలనా వ్యవస్థను చేపట్టే ఆలోచనలు చేయలేదు.ఫకీర్ల ధార్మిక దృష్టి కూడా అందుకు అనుమతించక పోవటం వలన, కంపెనీ పాలకులమీద సాధించిన ఘన విజయాలను వ్యవస్థాగతం చేసుకోలేదు. ఆయా ప్రాంతాలలో ప్రజల అవసరాలను బట్టిపోరాడటం, ఎక్కడికక్కడ విజయాలు సాధించి, ప్రజలను పీడన నుండి విముక్తి గావించి తృప్తిపడి సరిపెట్టుకున్నారు తప్ప, రాజ్యం రాజ్యాధికారం అను ఆలోచన చేయలేదు.

ఈ పరిణామాలకు తోడుగా కంపెనీ పాలకుల వద్దనున్న ఫిరంగుల్లాంటి ఆధునిక ఆయుధాలు, సమాచార వ్యవస్థ, సుశిక్షితులైన సాయుధ బలగాలతో సుదీర్గ… పోరాటం చేయటం ఫకీర్లకు కష్టసాధ్యమైంది. ప్రతికూల పరిస్థితులలో కూడా సాధించిన విజయాలు సంపాదించి పెట్టిన గౌరవం, ప్రజలలో పెరిగిన పలుకుబడి, సంపాదించుకున్న సంపద, అంతర్గత విభేదాలు, కంపెనీ పాలకుల కుట్రలు అన్నీ కలిపి ఫకీర్ల ఉద్యమానికి విషమ పరిస్థితులను సృష్టించాయి. సమర్ధుడైన మజ్నూషా ప్రతికూల పరిస్థితులన్నిటినీ చాకచక్యంగా పరిష్కరించుకుంటూ, ప్రతి ప్రతికూలతనూ అనుకూలంగా మార్చుకుంటూ అప్రతిహతంగా ముందుకు సాగారు. ప్రధానంగా పీర్‌-మురీద్‌ల మధ్యనున్న బలమైన ధార్మిక సంబంధం మూలంగా ఫకీర్లలో సుస్థాపితమైన ఐక్యతను శతృవు తక్షణమే గండికొట్టలేకపోయాడు. ఆ తరువాత కాలం గడిచేకొద్ది సహజంగా ఉద్యమం బలహీనపడసాగింది.

చివరి పోరాటం

1786 డిసెంబర్‌ 29వ తేదీన మజ్నూషా తన అనుచరులతో బగూరా జిల్లా ముంగ్రా గ్రామంలో విడిది చేసిన లెఫ్టినెంట్ బ్రివాన్స్‌ బలగాలను ఆకస్మికంగా చుట్టుముట్టారు. బలహీనపడుతున్న ఫకీర్ల ఉద్యమానికి జవసత్తాలు అందించాలని మజ్నూ షా భావించారు. కంపెనీ బలగాల మీద సాహసోపేతంగా దాడి జరిపి, అనుచరులలో నూతన ఉత్తేజం కల్పించాలని, అనుచరుల మధ్యన ఏర్పడిన వివాదాలకు స్వస్తి చెప్పాలని సాహస దాడి

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

26


జరిపారు. ఆ సమయంలో, గతంలో అనేకసార్లు తమ కళ్ళ ఎదుటనే తప్పించుకుపోయిన మజ్నూషాను ఎలాగైనా బంధించాలనే పట్టుదలతో కంపెనీ పాలకులు, భారీ బలగాలతో ముంగ్రాలో మజ్నూ షా కోసం ఎదురుచూస్తున్నాయి.

ఆ వాతావరణంలో జరిగిన సాహస దాడి భీకరంగా సాగింది. పలువురు గాయపడ్డరు. మజ్నూ షా అతి లాఘవంతో కత్తి తిప్పుతూ, శత్రువును దరిచేరనివ్వకుండ జాగ్రత్తపడుతూ రణభూమిలో వీర విహారం చేస్తూ, అరివీర భయంకరంగా పోరాడారు. అ దాడిలో మజ్నూషాను తుపాకీ గుండు తాకి తీవ్ర గాయమైంది. రక్తం ఓడుతున్నాలెక్క చేయక అత్యంత వేగంతో తన గుర్రం మీద దూసుకపోతున్న మజ్నూ షా కంపెనీ బలగాలు ఎదురుపడిప్పటికీ, ఆయనను చుట్టుముట్టి నా బంధించలేకపోయాయి. గతంలో చిక్కినట్టే చిక్కి అతి లాఘవంగా, అత్యంత వేగంతో గుర్రపు స్వారీ చేస్తూ తప్పించుకుని పోయిన మజ్నూ షా ఈసారి కూడా తమ కళ్ళ ఎదుటనే మటుమాయమయ్యారు. ఆయన ఆవిధంగా తప్పించుకుని పోవటం సహించలేని ఆంగ్లేయ అధికారి లెఫ్టినెంట్ బ్రివాన్స్‌ గాయపడిన మజ్నూ షాను వెంటాడాడు. అనుచరుల రక్షణ వలయం, ప్రజల సహాయంతో మజ్నూ షా ఆంగ్లేయులకు టోకరా ఇచ్చి చివరకు తప్పించుకున్నారు.

మహా సేనాని అస్తమయం

కంపెనీ సైనికాధికారి లెఫ్టినెంట్ బ్రివాన్స్‌ కళ్ళుగప్పి, తాను పుట్టి పెరిగిన మాఖన్‌పూర్‌కు మజ్నూ షా సురక్షితంగా చేరుకున్నారు. బలమైన గాయాలు కావటంలో ఆయన పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అనుచరులు ఆందోళన చెందారు. అనుచరులు, సహచరులు మజ్నూ షాను కాపాడుకునేందుకు శతవిధాల ప్రయతిత్నించారు. చికిత్స నిమిత్తం మజ్నూ షాను మరొక ప్రాంతానికి తరలించటం సాధ్యం కాలేదు. గాయాల నుండి అత్యధిక రక్తం స్రవించటం వలన మజ్నూ షా కదలలేనంతగా బలహీనమైపోయారు. కంపెనీ బలగాలను, బ్రిీటీష్‌ సైన్యాధికారులను గడగడలాడించిన మహానాయకుడు మృత్యువుతో పోరాటం ప్రారంభించారు. సుదీర్గ… పోరాట చరిత్రలో శత్రువు వలయం నుండి చాకచక్యంగా పలుమార్లు తప్పించుకున్న మజ్నూ షాకు ఈసారి మృత్యువునుండి తప్పించుకునే అవకాశం లేకపోయింది. శత్రువుతో పోరాడుతూ మృత్యుముఖం చేరినా క్షేమంగా తిరిగి రాగలిగిన వీరుడు మజ్నూ షాను ఈసారి మృత్యువు వడిసి పట్టుకుంది. ఈ విధంగా బాధాసర్పద్రష్టులైన ప్రజల ముద్దుబిడ్డడు, బ్రిీటీషర్ల మీద తొలి తిరుగుబాటు జెండాను ఎగురవేసిన మజ్నూ షా, చివరకు తన పూర్వీకుల గడ్డ, మాఖన్‌పూర్‌లో అస్తమించారు.

అన్నకు తగ్గ తమ్ముడు మూసా షా

అసమాన పోరాట యోధుడు మజ్నూషా ఫకీర్‌ కన్నుఇమూయగానే ఫకీర్ల ఉద్యమం అంతరించిపోయిందని సంతసించిన కంపెనీ పాలకులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. అలుపెరుగక ఫిరంగీల మీద పోరు సల్పిన మజ్నూ షా స్పూర్తిని ఆయన సోదరుడు మూసా షా కొనసాగించారు. మజ్నూ షా శిష్యుడు కూడా అయినటువంటి మూసా షా పోరాట బాధ్యతలను స్వీకరించారు. అన్నకు ఏ మాత్రం తీసిపోకుండా ఫిరంగీలను ముప్పుతిప్పలు పెట్టారు. కంపెనీ పాలకులతో గెరిల్లా పోరాట పద్ధతులతో పోరు సల్పటమేకాక,

భారత స్వాతంత్య్రోద్యామం-ముస్లిం ప్రజాపోరాలు

27 తమ బలగాల రాకను ముందుగా శత్రువుకు తెలిపి దాడులు జరిపిన సంఘటనలకు మూసా షా పేర్గాంచారు. ఆనాడు ఆయన సాగించిన పోరాల తీరు ఆ తరువాత కాలంలో అల్లూరి సీతారామరాజు సాగించిన మన్యం పోరును గుర్తుకు తెస్తుంది.

1787 ప్రాంతంలో ముసిద్ధా పరగణాకు చెందిన జమీందారు ప్రాసాదం మీద దాడికి మూసా షా సిద్ధం కాసాగారు. ఆ విషయం తెలిసిన జమీందారు ఆ సమాచారాన్ని ముషీరాబాద్‌ కలెక్టర్‌కు తెలిపాడు. మూసా షా ఏ క్షణాన్నైనా దాడిచేయవచ్చని సాయుధ దాళాలను పంపి రక్షించవలసిందిగా కోరాడు. ఆ విషయం వేగుల ద్వారా మూసా షాకు తెలిసింది. జమీందారు చర్యపట్ల ఆగ్రహిస్తూ ఆయన ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో '... నా మీద ముషీరాబాద్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసావు. అయితే ఏమి లాభం. నేను నీ నుండి కోరిన నగదును తప్పక తీసుకుపోతాను. ధనం సిద్దం చెయ్యి....', అని పేర్కొంటూ సమాచారం పంపి నిర్దేశిత సమయాన జమీందారు భవంతిని చేరుకున్నారు. ప్రకటించిన రెవిన్యూ సొమ్మును రాబట్టుకుని నిష్క్రమించిన మూసా షా కంపెనీ పాలకులకు సవాల్‌ విసిరారు.

ఆనాడు సామాన్య ప్రజానీకంతోపాటుగా పలువురు జమీందారులు కూడా మూసా షాకు చేయూతనిచ్చారు. ముఖ్యంగా ప్రజలు అనుక్షణం అప్రమత్తులై మూసా నేతృత్వంలోని యోధులను కాపాడుకున్నారు. 1788 న్‌ 22న ఆకస్మికంగా శత్రువు దాడిచేయగా మూసా షాను, ఆయన సహచరులను ప్రజలు ఎంత చాకచక్యంగా కాపాడింది దినాజ్‌పూర్‌ కలెక్టర్‌ రాసిన లేఖ ద్వారా బహిర్గతం అవుతుంది. మూసా షా నాయకత్వంలోని పోరాట వీరులకు పాత జమీందారులు తోడ్పాటునిచ్చారు. ప్రజల మద్ధతుతో ఏర్పాటు చేసుకున్న వేగుల ద్వారా కంపెనీ బలగాల కదలికలను పసికట్టి క్షణాలలో మటుమాయమై, ఆకస్మాత్తుగా దాడి చేసి కంపెనీ అధికారులను మట్టికరిపించటంలో మూసా షా తన అన్నను అక్షరాల అనుసరించారు. స్వదేశీ రాజులు, రాణులతో మూసా షా చేతులు కలిపారు. ఆయన సన్యాసుల నేతలు భవాని పాథక్‌, దేవీ చౌదరాయణ్‌లతో కలిసి పలు పోరాటాలలో పాలుపంచుకున్నారు. మజ్నూషా సన్యాసుల దళానికి నాయకత్వం వహించిన విధాంగానే మూసా షా కూడ 1786 ఫిబ్రవరి 17న 200 మంది సన్యాసుల దళానికి నాయకత్వం వహించారని కెప్టన్‌ అలెగ్జాండర్‌, రంగాపూర్‌ కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

మూసా షా తన బలగాలకు ఆధునిక శిక్షణ కల్పించారు. కంపెనీ సేవలోనున్న స్వదేశీయులలో వ్యతిరేకతను రెచ్చగొట్టి స్వపక్షంలోకి ఆకర్షించారు. ఈ బలగాలన్నిటికీ కంపెనీ బలగాల తరహాలో దుస్తులు, ఆయుధాలు ఏర్పాటు చేసారు. గూఢచారి దళాన్ని మరింత పటిష్టం చేసారు. గెరిల్లా పోరాటంలో ఆరితేరిన మూసా షా శత్రువును ఊపిరి పీల్చుకోనివ్వకుండా దాడులు చేసి చికాకు పర్చారు. భారీఎత్తున బలగాలు ఉన్నప్పటికీ కంపెనీ పాలకులకు మూసా షా తిరుగుబాట్లను నిలువరించలేకపోవటం విశేషం.

ఆనాడు పోరాట వీరులకు ఆపద సమయంలో తలదాచుకోడానికి నేపాల్‌ పర్వత ప్రాంతాలు బాగా ఉపయోగపడేవి. ఈ పరిస్థితిని గమనించిన కంపెనీ అధికారి వారెన్‌ హేస్టింగ్స్ నేపాల్‌ పర్వత సానువుల మీద దృష్టి సారించాడు. ఒక వైపు ఫకీర్లు-సన్యాసులకు నిలువ నీడలేకుండా చేయటమే కాకుండా, కంపెనీ సరుకుల ఎగుమతులు-దిగుమతులు పెంచటం కోసమంటూ నేపాల్‌ రాజుతో స్నేహం చేసాడు. ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. </noinclude> </noinclude> </noinclude> </noinclude>