భారత అర్థశాస్త్రము/అర్థశాస్త్ర ప్రశంస
Jump to navigation
Jump to search
అర్థశాస్త్ర ప్రశంస
మ. అనుభావ్యస్ఫుర దర్థయుక్తము, మహా హంకార వైరిప్రదా
రణ విద్యావిభవంబు, మూడమతశాస్త్రధ్వంస సంచారభీ
షణ, మింద్యాజన సంతతాభ్యుదయ విజ్ఞాన ప్రచంద్రోదయం
బనివార్య ప్రతిభావిలాస, మతిసేవ్యం బార్యసంఘంబులన్.
శా. సద్వంద్యంబు, సమస్త రాజ్యవినుత స్ఫారప్రభావంబు, వి
ద్వద్వర్యోద్భవ, ముద్దురస్ధితి కళాప్రావీణ్యతాఖండ సం
పద్వేదం, బనిరోధ్య భారతహిత ప్రారంభ మీ శాస్త్ర; మీ
రుద్వేగాత్ములరై పరింప జనితోద్యోగోగ్రులం జేయదే.